పీసీఓడీ సమస్య సంతానలేమికి కారణం కావచ్చు
ఆడవాళ్ళలో, అదీ ఇవాళ్టి రోజుల్లో, హార్మోన్ల అసమతుల్యత అనే సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇందువల్ల ముఖ్యంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల అసమతుల్యత వల్ల అండాశయంలో నీటితిత్తులు ఏర్పడుతున్నాయి. దీనినే పీసీఓడీ (PCOD) లేదా పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటారు.
ఇది ఒక్కొక్కసారి జన్యువులలో ఏదైనా తేడా వచ్చినప్పుడు కూడా రావచ్చు లేదా ఏదైనా మానసిక ఒత్తిడి లేదా ఆందోళనల వలన హార్మోన్ల మీద దాని ప్రభావం చూపి ిపీసీఓడీ సమస్య తలెత్తవచ్చు.
కారణాలు: 1) వారసత్వంగా వస్తున్న 2) జన్యుపరమైన విభేదాలు 3) మానసికంగా ఉండే ఒత్తిడి, ఆందోళనలు. ఇటువంటివన్నీ చిన్న హార్మోన్ల అసమతుల్యతతో మొదలై నెలసరులు సక్రమంగా రాక, భవిష్యత్తులో ఇటువంటి నీటితిత్తులు ఏర్పడి సంతానలేమి సమస్య రావచ్చు, అంతే కాకుండా సంతానం కలిగిన, పుట్టబోయే పిల్లలలో జన్యుపరంగా వచ్చే వ్యాధులు కూడా రావచ్చు.
లక్షణాలు నెలసరుల సమస్యలు
నెలసరులు అనేవి మొదటగా ప్రతినెల వచ్చేవి కాస్త ఆలస్యంగా రావటం అంటే 26-30 రోజుల మధ్యలో రావలసినవి 33-40 రోజులకు రావటం ఆ తర్వాత నెల విడిచి నెల రావటం ఉంటుంది. ఒకవేళ నెలసరి వచ్చినా రక్తస్రావం చాలా తక్కువగా ఉంటుంది. కాని నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
సంతానలేమి
ఈ పీసీఓడీ సమస్య వల్ల అండం విడుదల అనేది సరిగ్గా ఉండదు.
ఇంకా అండం విడుదల కాకుండా కూడా నెలసరులు వస్తాయి.
దీనిని ‘ఎన్‌ఒవ్యులేటరీ సైకిల్స్’ అంటారు. అండం విడుదల అవకపోతే సంతానం కలగదు.
మగవాళ్ళల్లో ఉండే ఎండ్రోజన్ హార్మోన్లు
మగవాళ్ళలో ఉండే ఎండ్రోజన్ హార్మోన్లు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయ్యి మొటిమలు, అవాంఛిత రోమాలు, నెలసరులు తరచుగా వస్తూండటం జరుగుతుంది.
బరువు అతిగా పెరగటం
దీనివలన కొలస్ట్రాల్ స్థాయిలు శరీరంలో పెరిగి మధుమేహం లేదా చక్కెర వ్యాధి వస్తుంది.
ఒక్కొక్కసారి ఈ పీసీఓడీ సమస్యకు సరైనరీతిలో చికిత్స తీసుకోకపోతే, హైపో థైరాయిడిజమ్ సమస్యకు కూడా దారితీస్తుంది.
పాజిటివ్ హోమియోపతిలో పీసీఓడీ సమస్యకు సరైన పరిష్కారం ఉంటుంది. ఈ సమస్య అనేది ఎక్కడ నుంచి ప్రారంభమైందో అంటే మూలకారణాన్ని ఎనలైజ్ చేసుకొని, నీటితిత్తుల సైజ్‌ని బట్టి చికిత్సను ప్రారంభించి, ‘జెనిటిక్ కాన్‌స్టిట్యూషనల్ సిమిలిమమ్’ అనే పద్ధతి ద్వారా మందులు ఇస్తారు. దీనివలన మొదటగా నెలసరులు సక్రమంగా వచ్చి, అండం విడుదల మొదలై సంతానం కలుగుతుంది.
హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ,
వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక - తమిళనాడు.
అపాయింట్‌మెంట్ కొరకు 9246199922