నానో మెడిసిన్ లోగో ఆవిష్కరణ
కరీంనగర్ హెల్త్ : నగరంలోని పాజిటివ్ హోమియోపతిని ప్రారంభించి రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం నానో మెడిసిన్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు ప్రజలు హోమియో వైద్యంపై ఆకర్షితులవుతున్నారన్నారు.
హోమియో వైద్యంతో రోగాలు పూర్తిగా నయమవుతాయన్నారు. నానో మెడిసిన్ తో వ్యాధి నిర్ధారణ చేస్తున్నారని, వ్యాధి నిర్ధారణైతే తక్కువ ఖర్చుతో రోగం పూర్తిగా నయమవుతుందన్నారు. డాక్టర్ డెవిడ్ మాట్లాడుతూ నానో మాత్రలతో వ్యాధి మూలాలతో నిర్ధరించబడుతుందని తెలిపారు. పాజిటీవ్ హోమియోపతిలో డయాబెటిక్, సొరియాసిస్, కీళ్లనొప్పులు, హెపటైటిస్ బీ, గ్యాస్ట్రిక్, ఆస్తమా వంటి ధీర్ఘకాలిక వ్యాధులను నయం చేయవచ్చని తెలిపారు. సిబ్బంది పి.జోయల్ ప్రసన్నకుమార్, మానస, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు