తెలంగాణ అసెంబ్లీ ముందుకు ఐదు కీలక బిల్లులు.. | Telangana Assembly Session On March 17th Live Updates | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్‌ అప్‌డేట్స్‌

Published Mon, Mar 17 2025 11:17 AM | Last Updated on Mon, Mar 17 2025 12:43 PM

Telangana Assembly Session On March 17th Live Updates

Telangana Assembly Session Updates..

తెలంగాణ వచ్చాక వర్సిటీలకు పేర్లు మార్చుకున్నాం: సీఎం రేవంత్‌

  • శాసనసభలో సీఎం రేవంత్‌ కామెంట్స్‌..
  • కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్‌ జయశంకర్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, పీవీ నరసింహారావు పేర్లు పెట్టుకున్నాం
  • తెలుగు వర్సిటీ పేరును మారుస్తున్నాం
  • పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదు
  • ఏపీలో కూడా ఇదే పేరుతో యూనివర్సిటీ ఉంది.
  • అందుకే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుకున్నాం.
  • తెలుగు వర్సిటీ ఆయన పేరు పెట్టాలని గత శాసనసభలోనే నిర్ణయించాం.
  • రాజకీయాలు కలుషితం అయ్యాయో.. ఆలోచనలు కలుషితం అయ్యాయో తెలియదు.
  • బల్కంపేట నేచర్‌ క్యూర్‌ ఆసుపత్రికి రోశయ్య పేరు పెడతాం.
  • తెలంగాణ వచ్చాక ఆర్టీసీ పేరును కూడా మార్చుకున్నాం. 
     

ఐదు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం

  • బిల్లులను ప్రవేశపెట్టేముందుకు స్పీకర్‌ అనుమతి కోరిన మంత్రి శ్రీధర్‌బాబు
  • అసెంబ్లీ ముందుకు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లు
  • ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనర్సింహ
  • బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం  

👉తెలంగాణ శాసన సభలో ముగిసిన ప్రశ్నోతాలు.

👉మొదలైన జీరో అవర్..

👉అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి.

శాసనసభ నుంచి ఎంఐఎం వాకౌట్..

  • శాసనసభ నడపడంలో ప్రభుత్వం విఫలమైంది
  • శాసనసభ గాంధీ భవన్ కాదు.
  • తెలంగాణ శాసనసభలో అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం.
  • ప్రశ్నోత్తరాల సమయం గంట మాత్రమే తీసుకోవడం ఏంటని  ప్రశ్నించిన అక్బరుద్దీన్.
  • ప్రశ్నోత్తరాల సమయంలో మిగిలిన ప్రశ్నలపై సమాధానం చెప్పకుండా ఎలా జీరో అవర్‌ ప్రారంభిస్తారు?
  • నిన్న రాత్రి 10 గంటలకు ఎజెండా మాకు అందింది.. మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి?.
  • శాసనసభలో కొత్త సాంప్రదాయం ఏంటి?
  • తమ ప్రశ్నను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని, మంత్రి ఎందుకు ప్రశ్న చదవడం లేదని ఆగ్రహం.
  • సభ జరిగే తీరుపై అసహనం వ్యక్తం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ.
  • మేము అడిగిన ప్రశ్నను సమాధానం ఇవ్వడం లేదు.
  • శాసనసభ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా నడవడం లేదు.
  • శాసనసభలో నిబంధనలు పాటించడం లేదు.
  • నిబంధనల ప్రకారం శాసనసభ నడవడం లేదని వాకౌట్ చేసిన ఎంఐఎం

20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం: భట్టి

  • 2030 నాటికి 20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం
  • సౌర, పవన, గ్రీన్‌ హైడ్రోజన్‌పై ప్రభుత్వం ఫోకస్‌
  • పునరుత్పాదక ఇంధన వనరుల పెంపునకు క్లీన్‌ ఎనర్జీ పాలసీ
  • 2030 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం
  • పెద్ద ఎత్తున పెట్టుబడులను ప్రోత్సహించడానికి పాలసీ తెచ్చాం
  • రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోతుంది
  • ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో సౌరఫలకాలు ఏర్పాటు చేస్తున్నాం

కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్‌..

  • బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కామెంట్స్‌..
  • ఏం తెచ్చారు ఏం ఇచ్చారు అని ప్రభుత్వం నన్ను ప్రశ్నిస్తుంది..
  • నాకు కాంగ్రెస్ ఏం ఇచ్చింది?
  • గత ఏడాది బడ్జెట్ నుంచి కేవలం 90 లక్షలు మాత్రమే ఇచ్చింది.
  • కొడంగల్‌కు 1000 కోట్లు తీసుకుపోయారు.
  • శాసన సభకే అవమానం.
  • శాసనసభలో బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మూడు సమానమే.

అసెంబ్లీలో కేటీఆర్‌ చిట్‌చాట్‌.. రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు

  • సీఎం రేవంత్‌ టార్గెట్‌గా కేటీఆర్‌ కామెంట్స్‌..
  • తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైంది
  • రేవంత్ రెడ్డి అప్రూవర్‌గా మారి.. తన పాలన అట్టర్ ప్లాప్ అని తానే చెప్పాడు
  • 71వేల కోట్లు రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నాడు
  • 2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే.‌. తెలంగాణ వెనక్కి పోతుందన్న సమైఖ్యాంధ్రనేతల మాటలు నిజం అయ్యేవి
  • పిచ్చి పనులకు చేస్తున్నాడు కాబట్టే.. సీఎంను ప్రజలు తిడుతున్నారు.. దానికి ఎవరు ఏం చేస్తారు?
  • నిండు సభలో బట్టలు విప్పి కొడాతమని రేవంత్ బజారు భాష మాట్లాడారు
  • మెదటి ఏడాదిలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదు
  • కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఒప్పుకున్నాడు
  • సంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేదు
  • రాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చితే.. తెలంగాణ పెరుగుతుందా?
  • కేంద్రంతో సఖ్యతగా  ఉండి.. నిధులు సాధిస్తానని ఎంత తెచ్చాడు
  • కేసీఆర్‌పై కోపంతో.. రైతులను గోస పెడుతున్నాడు
  • గాసిప్స్ బంద్ చేసి.. రేవంత్ రెడ్డి గవర్నరెన్స్ పై దృష్టి పెట్టాలి 
  • కుటుంబాలు మాకు లేవా?. పిల్లలు మాకు లేరా? రేవంత్‌కే ఉన్నారా?
  • నాకు అడ్డమైన వారితో‌ లింకులు పెట్టిన నాడు.. మా కుటుంబాలు బాధ పడలేదా?
  • ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్‌లో దాటిన రేఖలు బయట పెట్టాలా?
     

మంత్రి సీతక్క వర్సెస్‌ గంగుల.. 

👉విద్యార్థుల డైట్‌ ఛార్జీలు పెంచాం: మంత్రి సీతక్క

  • గత ప్రభుత్వంతో పోలిస్తే విద్యార్థుల డైట్‌ ఛార్జీలు పెంచాం
  • 8-10 తరగతి విద్యార్థులకు నెలకు రూ.1540 డైట్‌ ఛార్జీలు చెల్లిస్తున్నాం
  • ఇంటర్‌ నుంచి పీజీ విద్యార్థులకు నెలకు రూ.2,100 డైట్‌ ఛార్జీలు చెల్లిస్తున్నాం
  • విద్యార్థుల డైట్‌ ఛార్జీలకు రూ.499.51 కోట్లు ఖర్చు చేశాం: మంత్రి సీతక్క
  • విద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయొద్దు.
  • విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే.. బీఆర్‌ఎస్‌ ఓర్వలేక పోతుంది.
  • నేను గంగుల కమలాకర్ లెక్క చదువుకోలేకపోవచ్చు.
  • నేను సమాజాన్ని చదివాను.
  • గవర్నమెంట్ స్కూళ్లలో చదివినం. గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాం..
  • సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే నైజం మాది
  • మా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల విదేశీ విద్య కోసం 167 కోట్లు చెల్లించాము
  • పిల్లలను సరిగా పర్యవేక్షించని సిబ్బంది అధికారులపై చర్యలు ఉంటాయి
  • విద్యార్థులకు స్కాలర్‌షిపులు ఈ ప్రభుత్వం ఇవ్వకుంటే బాగుండు అని బీఆర్ఎస్ భావిస్తోంది
  • మేము స్కాలర్‌షిప్లు ఇవ్వకపోతే రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ చూస్తోంది
  • కానీ మేము బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వము..
  • విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్లు, విదేశీ విద్యానిధి పూర్తిగా చెల్లిస్తున్నాము


👉విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలి: గంగుల కమలాకర్‌

  • విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలి
  • 2016లో కేసీఆర్‌ హయాంలో విదేశీ విద్యా పథకం అమలు చేశారు
  • గతంలో ఏటా 300 మంది విద్యార్థులను పథకం కింద ఎంపిక చేశారు
  • ప్రస్తుత ప్రభుత్వం బీసీలు, మైనార్టీలు, ఎస్టీలకు పథకం కింద ఇచ్చింది గుండు సున్నా
  • జనవరిలో కేవలం 105 మంది ఎస్సీలను పథకం కింద ఎంపిక చేశారు
  • గతంలో 1,050 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విదేశాలకు పంపారు
  • గతంలో రూ.439 కోట్లతో 2,751 మంది మైనార్టీలకు విదేశీ విద్య అందించారు. 
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement