
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంంలో మాజీ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలోనే కృష్ణా బేసిన్ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయంలో తమతో చర్చకు సిద్దమా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ తప్పు ఉంటే క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘గవర్నర్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగాయి. బలహీనవర్గాలకు చెందిన మహిళ గవర్నర్‌గా ఉంటే.. ఆమెను సూటిపోటి మాటలతో అవహేళన చేశారు. భారత రాజ్యాంగం స్పూర్తితో వ్యవస్థలు ఏర్పడ్డాయి. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గత ప్రభుత్వం ప్రజాస్వామ విలువలను పాటించలేదు. అజ్ఞానమే గొప్ప విజ్ఞానం అనుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగం గాంధీభవన్‌లో కార్యకర్త ప్రసంగంలా ఉందని కొందరు అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. గవర్నర్‌ను గౌరవించే బాధ్యత మాది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశాం.. వాటినే గవర్నర్ ప్రస్తావించారు. మాట్లాడాలనుకున్నదే మాట్లాడతాం. ఎవరు అడ్డుకున్నా వెళ్లిపోతాం అన్నట్టుగా ఉంది బీఆర్‌ఎస్ సభ్యుల తీరు ఉందన్నారు.
రైతుల ఆత్మహత్యలకు అప్పులే కారణం. అవమానాలు భరించలేకనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రుణాల నుంచి రైతులను విముక్తి చేయాలని నిర్ణయించాం. వాస్తవాల మీద ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. రైతులు ఆత్మగౌరవంతో బతకాలన్నదే మా విధానం. గతంలో ఎన్నికప్పుడే రైతుబంధు అన్నదాత అకౌంట్లలో పడేది. మార్చి 31 నాటికి రైతులందరికీ రైతుభరోసా అందిస్తామన్నారు.
గతంలో ఎక్కడ పంట పండినా కాళేశ్వరం వల్లే అని చెప్పుకున్నారు. కాళేశ్వరం కూలిన తర్వాత 260 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం. గత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేసింది. గతంలో కేసీఆర్ వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని అన్నారు. కానీ, మేము అధికారంలోకి వచ్చాక రైతులను వరి పండిచాలని కోరాం.

కేసీఆర్ హయాంలోనే కృష్ణా బేసిన్ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. కృష్ణా నీటి విషయంలో కేసీఆర్ సంతకం చేసి తెలంగాణకు మరణశాసనం రాశారు. మా తప్పు ఉందని నిరూపిస్తే సభ సాక్షిగా కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్ నేతలకు క్షమాపణ చెబుతాను. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడే కృష్ణా జలాలపై చర్చ పెడతాం. లెక్కలతో సహా నిరూపిస్తాను.. చర్చకు సిద్దమా? అని సవాల్ చేశారు.
గల్లీ నుంచి ఢిల్లీ వరకు నీటి కోసం పోరాటం చేస్తున్నాం. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే కేసీఆర్ సభకు రాకుండా మొహం చాటేశారు. కమీషన్ల కోసమే జూరాల నుంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా తీసుకుంటామన్నది నిజం కాదా?. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్న పెంచితే తెలంగాణ ఎడారి అవుతుందని పీజేఆర్ అడ్డుకున్నారు. గతంలో ఎక్కడ పంట పండినా కాళేశ్వరం వల్లే అని చెప్పుకున్నారు. కాళేశ్వరం కూలిన తర్వాత 260 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం. గత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేసింది. గతంలో కేసీఆర్ వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని అన్నారు. కానీ, మేము అధికారంలోకి వచ్చాక రైతులను వరి పండిచాలని కోరాం.
కవిత ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు.. సంతోష్‌కు రాజ్యసభ ఇవ్వలేదా?. మీ ఇంట్లో అందరికీ ఉద్యోగ అవకాశాలిచ్చారు.. పదేళ్లు ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు?. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు తక్కువ, పెట్టిన పరీక్షలు ఎక్కువ. పరీక్ష పేపర్లను పల్లీ బఠానీల్లా అమ్మేశారు. గత ప్రభుత్వంలో పరీక్షా పత్రాలను జిరాక్స్ సెంటర్‌లలో అమ్మేసింది. టీఎస్‌పీఎస్సీ ప్రతిష్టను దిగజారిస్తే మేం ప్రక్షాళన చేశాం. ఒక్క ఏడాదిలోనే 57,924 ఉద్యోగాలు ఇచ్చాం. 19 శాతం నిరుద్యోగాన్ని తగ్గించిన ఘనత మాది. విద్యాశాఖను మేం ప్రక్షాళన చేశాం. 20 ఏళ్లు ప్రమోషన్, 10 ఏళ్లు ట్రాన్స్‌ఫర్ లేని వారికి శుభవార్త అందించాం. చిన్న వివాదం కూడా లేకుండా 36వేల మంది టీచర్లను బదిలీ చేశాం. గ్రూప్-2,3,4 పరీక్షల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేశాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment