Skin diseases
-
అలాంటి పెర్ఫ్యూమ్స్ కొంటున్నారా..?
చవకైన పెర్ఫ్యూమ్స్ / సెంట్స్ వల్ల అలర్జీలు కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయనీ, వీటివల్ల కొన్ని రకాల అలర్జీలు, కాంటాక్ట్ డర్మటైటిస్, ఎగ్జిమా అనే చర్మ వ్యాధులు, మైగ్రేన్ వంటి తలనొప్పులు పెరుగుతున్నాయని ఇంగ్లాండ్‌లోని క్యాంటర్బరీ కెంట్ ఛాసర్ హాస్పిటల్‌కు చెందిన చర్మవైద్య నిపుణులు డాక్టర్ సుసానా బ్యారన్ హెచ్చరిస్తున్నారు. వాసనల వల్ల అలర్జీలతో పాటు అవి చర్మానికి తగలడం వల్ల కూడా అనేక రకాల చర్మవ్యాధులూ వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. కొంతకాలం కిందట యూరోపియన్ యూనియన్ సైంటిఫిక్ కమిటీ ఒక సర్వే చేసి, తక్షణం అలర్జీకి కారణమయ్యే అలర్జెన్ల జాబితాను రూపొందించే కార్యక్రమానికి పూనుకుంటుంది. ఈ క్రమంలో రకరకాల సబ్బులు, షాంపూలు, సెంట్లు సైతం అలర్జీలకు కారణమవుతున్నట్లు ఆ సర్వేలో తేలింది.చవక రకం సెంట్ల వాసనలతో మైగ్రేన్ వంటి తలనొప్పుల కేసులూ విపరీతంగా పెరుగుతున్నాయంటూ యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ విన్సెంట్ మార్టిన్ అనే న్యూరాలజిస్ట్ సైతం పేర్కొంటున్నారు. వాటితో చాలా అప్రమత్తంగా ఉండాలంటూ డెర్మటాలజిస్టులు, న్యూరాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్స్ జాగ్రత్తలు చెబుతున్నారు. (చదవండి: పాదాల వాపుకి గుండె జబ్బులకు సంబంధం ఏమిటీ..?) -
Health Tips: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఏం జరుగుతుందంటే!
Vitamin C Deficiency Symptoms: మన ఆరోగ్యానికి విటమిన్ ‘సి’ తగిన మోతాదులో అందడం చాలా ముఖ్యం. ఎముకల అభివృద్ధికి, రక్త నాళాల పనితీరుకు, గాయాలు త్వరగా నయం కావడానికి... విటమిన్ సి అత్యవసరం. ఇది లోపిస్తే అనేక వ్యాధులు శరీరంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. 1. స్కర్వీ విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఇది. ఆహారం ద్వారా తగినంత సి విటమిన్ అందనప్పుడు స్కర్వీ లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, గాయాల నుంచి రక్తం కారడం, అలసటగా అనిపించడం, దద్దుర్లు రావడం, నీరసంగా అనిపించడం వంటివన్నీ స్కర్వీ వ్యాధి లక్షణాలు. మొదట్లో అలసటగా అనిపించడం, ఆకలి లేకపోవడం, ప్రతి దానికి చిరాకు పడడం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2. హైపర్ థైరాయిడిజం థైరాయిడ్ గ్రంధి అధికంగా హార్మోన్లను స్రవించడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ సి అవసరం. లేకుంటే బరువు హఠాత్తుగా తగ్గడం, గుండె కొట్టుకోవడంతో తేడా, విపరీతమైన ఆకలి, భయం, వణుకు, మహిళల్లో రుతుక్రమంలో మార్పులు వంటి లక్షణాలు కలుగుతాయి. 3. రక్తహీనత శరీరం ఇనుమును శోషించుకోవడానికి విటమిన్ సి సాయపడుతుంది. తగిన స్థాయిలో ఈ విటమిన్ అందకపోతే ఐరన్ శోషణ తగ్గి రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. దీని వల్ల బరువు తగ్గడం, ముఖం పాలిపోయినట్టు అవడం, శ్వాస ఆడకపోవడం వంటి ఆరోగ్య లక్షణాలు కనిపిస్తాయి. 4. చర్మ సమస్యలు విటమిన్ సిలో యాంటీఆక్సడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. చర్మానికి బిగుతును, సాగే గుణాన్ని ఇచ్చే కొల్లాజెన్ ఉత్పత్తిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల చర్మంపై దద్దుర్లు, మచ్చలు, రక్తస్రావం వంటివి కలుగుతాయి. Vitamin C Rich Foods: ఏం తినాలి? ►విటమిన్ సి లోపం తలెత్తకుండా ఉండాలంటే రోజు వారీ ఆహారంలో కొన్ని రకాల పదార్థాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ►నారింజలు, నిమ్మ రసాలు తాగుతూ ఉండాలి. ►బంగాళాదుంపలు, స్ట్రాబెర్రీలు, బ్రకోలి, క్యాప్సికమ్, బొప్పాయి, జామ, కివీలు, పైనాపిల్, టమోటాలు, పచ్చిబఠాణీలను మీ ఆహార మెనూలో చేర్చుకోవాలి. ►విటమిన్ సి టాబ్లెట్లను వైద్యుల సలహా మేరకే ఉపయోగించాలి. చదవండి👉🏾Fruits For Arthritis Pain: కీళ్ల నొప్పులా.. ఈ పండ్లు తిన్నారంటే చదవండి👉🏾Hair Fall Control Tips: జుట్టు రాలకుండా ఉండాలంటే..? -
శరీరంపై మచ్చలు పోవాలంటే ఇలా చేయండి..
శరీరంపై మచ్చలు ఏర్పడటం చాలా సాధారణమైన సమస్యే అయినా... చూడ్డానికి ఇవి చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. వీటినే శోభిమచ్చలు అంటుంటారు. కొద్దిమందిలో ఇవి తెల్లమచ్చల్లా, మరికొందరిలో కాస్తంత నల్లమచ్చలా కూడా కనిపిస్తుంటాయి. చాలామందిలో ఇవి ఎందుకు వస్తాయో ఇదమిత్థంగా తెలియకపోయినా... కొందరిలో ఫంగల్ ఇన్ఫెక్షన్గా ఇది కనిపిస్తుంది. వైద్యపరిభాషలో దీన్ని ‘టీనియా వెర్సికలర్’ అంటారు. ఇది పెద్ద వయసు వారిలోను, మధ్య వయస్సు వారిలోను ఎక్కువగా కనిపిస్తుంటుంది. స్త్రీ, పురుష భేధం లేకుండా వచ్చి ఇబ్బందిపెట్టే ఈ సమస్య ఎందుకొస్తుంది, అధిగమించడం ఎలాగో తెలుసుకుందాం. ఈ సమస్య ఉన్నవారిలో చర్మం సహజరంగును కోల్పోతుంది. ముదురు ఎరుపువర్ణంలో, లేత గోధుమవర్ణంలో, తెలుపు వర్ణంలో ఈ మచ్చలు వస్తుంటాయి. వీపు, భుజాలు, చేతులు, ఛాతీ, మెడ ప్రాంతాలలో కనిపిస్తాయి. చిన్నపిల్లలలో ఇలాంటి శోభి లక్షణాలు ముఖం మీద కనిపిస్తాయి. కొన్నిసందర్భాల్లో ఈ మచ్చలకు చుట్టూ ఓ అంచులాంటిది ఏర్పడుతుంది. ఈ మచ్చలున్న చోట ఒక్కోసారి విపరీతమైన దురద ఉండవచ్చు. అయితే శోభిమచ్చలు అంటువ్యాధి కాదు. వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు దాని ప్రభావం ఈ మచ్చల మీద ఎక్కువగా ఉంటుంది. ఈ మచ్చల తీరూ, తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. చదవండి: Health Tips: ప్రతి రోజూ గంజి తాగారో.. కారణాలు స్పష్టమైన కారణాలు తెలియకపోయినా... చర్మం లోపల ఉండే మెలసీజియా ఫర్ఫర్ అనే ఫంగస్ వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. ఈ ఫంగస్ చర్మం మీద ఉండే నూనెలను, మృతకణాలను ఆహారంగా తీసుకుంటుంది. దాదాపు మనందరి చర్మంలోనూ ఈ ఫంగస్ ఉన్నప్పటికీ కొంతమందిని మాత్రమే ఇబ్బందులకు గురి చేస్తుంది. చదవండి: Health Tips: ముల్లంగి రసం తాగుతున్నారా.. అయితే.. ఎవరిలో ఎక్కువ...! ►పౌష్టికాహార లోపం ఉన్నవారిలో ►వ్యాధినిరోధకతశక్తి బాగా తక్కువగా ఉన్నవారిలో ►స్టెరాయిడ్ మందులు తీసుకునేవారిలో ►గర్భవతులలో ►హార్మోన్ల అసమతౌల్యత ఉన్నవారిలో... ►బాగా ఎక్కువగా చెమటలు పట్టడం, అధికవేడి కారణంగా; (ఇలాంటివారిలో ఈ మచ్చలున్నచోట దురదలూ రావచ్చు). ►జిడ్డు చర్మం ఉన్న వారిలో ►తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ►కొందరిలో ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ►తామరగా/ఇతర సమస్యలుగా పొరబడటం సాధారణం... కొందరు శోభిని చూసి తామర (రింగ్వార్మ్) గా భ్రమపడుతుంటారు. తామర వ్యాధి సోకిన భాగంలో మచ్చకు చుట్టూ అంచులు స్పష్టంగా కనపడతాయి. అలాగే దురద కూడా ఉంటుంది. వీటినే కొందరు విటిలిగో, పిటీరియాసిస్ ఆల్బా, సోరియాసిస్‌గా కూడా భ్రమపడుతుంటారు. అందువల్ల డెర్మటాలజిస్టులు కెఓహెచ్ పరీక్ష ద్వారా ఇది ఏ రకమైన చర్మవ్యాధి అనే విషయాన్ని నిర్ధారణ చేసి, తగిన చికిత్స సూచిస్తారు. నివారణ / జాగ్రత్తలు ►ఇది తేలిగ్గా నివారతమయ్యే సమస్య. ►చర్మాన్ని నిరంతరం శుభ్రంగా ఉంచుకోవాలి. ►మచ్చలు తొందరగా తగ్గిపోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, వ్యాయామం చేయడం వంటి చిన్నచిన్న చిట్కాలు పాటించడం వల్ల ఈ మచ్చలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ►చర్మం బాగా జిడ్డుగా ఉన్నప్పుడు... ఎప్పటికప్పుడు చర్మాన్ని శుభ్రం చేసుకుంటూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. అయితే మరీ పొడిగానూ ఉంచకూడదు. ►రీరం మీద నూనెగానీ, లేదా నూనెకు సంబంధించిన జిడ్డు పదార్థాలను కాని పూయకూడదు. ►బాగా బిగుతుగానూ, గాలిచొరకుండా ఉండే దుస్తులు ధరించకూడదు. ►ఇది మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా ఉండటానికి ఎక్కువ చెమట పట్టకుండా చూసుకుంటూ,S కెటొకోనటోల్ ఉండే పౌడర్‌ను కొన్ని నెలలు వాడటం మంచిది. చికిత్స ఈ సమస్య ఉన్నవారిందరకీ ఒకేలాంటి చికిత్స ఉండదు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చర్మవ్యాధి నిపుణులు చికిత్స సూచిస్తారు. వారి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు, వ్యాధి సోకిన వ్యక్తి తాలూకు మెడికల్ హిస్టరీ... వంటి వాటిని ఆధారం చేసుకుని చికిత్స ఉంటుంది. ఫంగస్ చర్మపు పైపొర మీద ఉంటుంది కనుక, చర్మానికి పై పూతగా వాడే మందులు బాగా పనిచేస్తాయి. లూలిఫిన్ వంటి యాంటీ ఫంగల్ క్రీమ్‌ను ఉపయోగించవచ్చు. దీనిని సుమారు పదిరోజుల పాటు రోజుకి ఒకసారి మచ్చలున్న చోట అప్లై చేయవలసి ఉంటుంది. అలాగే క్లోట్రిమాజోల్, కెటొకెనజోల్ వంటి క్రీమ్స్‌ను రెండు వారాలపాటు రోజుకి రెండుసార్లు చొప్పున వాడవచ్చు. ఒకవేళ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంటే, నోటితో తీసుకునే మందులను డెర్మటాలజిస్టు సలహా, సూచనల మేరకు తీసుకోవలసి ఉంటుంది. -
కోవిడ్ నుంచి కోలుకునే దశలో చర్మ వ్యాధులు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారినపడితే శరీరం బలహీనమవుతుంది. ఒంట్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. ఇతర వైరస్లు సులువుగా దాడి చేస్తాయి. కరోనా సోకిన తర్వాత కోలుకుంటున్న దశలో బాధితులకు చర్మ వ్యాధులు సోకుతున్నట్లు వైద్యులు చెప్పారు. జుట్టు అధికంగా రాలుతుందని, ప్రధానంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని, గోళ్ల వ్యాధులు తలెత్తుతున్నాయని తెలిపారు. కరోనా బాధితుల్లో హెర్పిస్ అనే చర్మవ్యాధి తిరగబెడుతోందని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌కు చెందిన డెర్మటాలజిస్టు డాక్టర్ డి.ఎం.మహాజన్ చెప్పారు. హెర్పిస్ సోకితే నోటిపూత, చర్మంపై బొబ్బలు కనిపిస్తాయి. కోవిడ నుంచి కోలుకున్న తర్వాత కొందరు చర్మ సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నారని అన్నారు. చర్మ సమస్యలను మ్యుకోర్మైకోసిస్గా (బ్లాక్ ఫంగస్) భావిస్తున్నారని తెలిపారు. ఇవి రెండూ వేర్వేరు అని, అవగాహన పెంచుకోవాలని సూచించారు. కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లు, ఇతర ఔషధాలు మితిమీరి తీసుకోవడం వల్ల బాధితుల్లో క్యాండిడా ఫంగస్ సోకుతోందని వెల్లడించారు. దీనివల్ల జననేంద్రియాలపై తెల్ల మచ్చలు కనిపిస్తాయన్నారు. -
కణుతులకు ఇంటి వైద్యం!
కొద్ది నెలలుగా పశువులకు అక్కడక్కడా లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్.ఎస్.డి.) సోకుతూ రైతులను బెంబేలెత్తిస్తోంది. ఇది క్యాప్రిపాక్స్ అనే వైరస్ కారణంగా సోకుతోంది. దోమలు, పిడుదులు, ఇతర కీటకాల ద్వారా బలహీనంగా ఉన్న పవువులకు సోకుతుంది. కలుషిత దాణా, నీరుతో పాటు.. సరిగ్గా శుభ్రం చేయిన పరికరాలతో భారీ స్థాయిలో వాక్సిన్లు వేయడం, కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కూడా ఈ అంటు వ్యాధి ప్రబలుతోందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) పేర్కొంది. పశువు వంటిపైన అనేక భాగాల్లో బొబ్బలు, కణుతుల మాదిరిగా రావటం దీని ప్రధాన లక్షణం. కుంకుడు గింజ నుంచి చిన్న నిమ్మకాయ అంతటి కణుతులు వస్తాయి. వైరస్ సోకిన 4 నుంచి 14 రోజుల్లో జ్వరం, దురదలు, ముక్కులు, కళ్ల నుంచి స్రావాలు కారటం కనిపిస్తాయి. కనుగుడ్లు ఎర్రబడటం, కాంతిని చూడలేకపోవటంతో పశువు నీరసిస్తుంది. తగిన చికిత్స అందకపోతే కణుతులు పగిలి పశువును బాధిస్తాయి. మందలలో 10–20 శాతం పశువులకు ఇది సోకుతున్నట్లు గుర్తించారు. అయితే, ఈ వైరస్ బారిన పడిన పశువుల్లో తగిన చికిత్స లభించని పక్షంలో 2 నుంచి 4 శాతం చనిపోయే ప్రమాదం ఉందంటున్నారు. పశువుల నుంచి ఈ వైరస్ మనుషులకు సోకదని నిపుణులు చెబుతున్నారు. ఇది పాడి పశువులకు ఈ వైరస్ సోకితే పాల దిగుబడి తగ్గిపోతుంది. అయితే, దూడలకు ఎక్కువగా సోకుతుంది. సాధారణంగా పశువైద్యులు ఈ వ్యాధి వచ్చిన పశువులకు ఇంజక్షన్లు, యాంటిబయోటిక్స్‌తో చికిత్స చేస్తున్నారు. అయితే, కేవలం ఇంటి వైద్యంతోనే ఈ వైరస్ వ్యాధిని 4–5 రోజుల్లో సంపూర్ణంగా నయం చేయవచ్చని, పశు మరణాల సంఖ్యను కూడా బాగా తగ్గించవచ్చని పశు వైద్య నిపుణులు డాక్టర్ మల్లంపల్లి సాయి బుచ్చారావు(99122 92229) తెలిపారు. ఔషధ మొక్కల ఆకులతో చేసిన కషాయం, పైపూత లేపనంతో లంపీ స్కిన్ డిసీజ్‌ను పారదోలవచ్చని ఘంటాపథంగా చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన గోసేవకుడు రవికి చెందిన గిర్ ఆవుకు ఈ వైరస్ సోకి వంటిపైన కణుతులు వచ్చాయి. డా. సాయి బుచ్చారావు సూచన మేరకు.. ఔషధ మొక్కలతో తయారు చేసిన ద్రావణం ఆవుకు తాగించి, ఔషధ మొక్కల ఆకులు నూరి ఆవు శరీరానికి పూయటంతో నాలుగైదు రోజుల్లో ఈ జబ్బు నుంచి ఆవు పూర్తిగా కోలుకుందని రవి (90007 00020) తెలిపారు. ఈ ఫలితం చూసి తొలుత ఇంజక్షన్ చేసిన వైద్యులు ఆశ్చర్యపోయారని అన్నారు. తనతోపాటు ఇతర రైతులు కూడా ఈ చికిత్సతో మంచి ఫలితాలు సాధించారన్నారు. కషాయం తయారు చేసే విధానం 100 గ్రాములు వేప ఆకులు, 100 గ్రాములు తులసి ఆకులు, 100 గ్రాములు పసుపు, 50 గ్రాములు మిరియాలను అర లీటరు (500 ఎం.ఎల్.) నీటిలో వేసి మరిగించాలి. రెండు పొంగులు వస్తే చాలు. ఇలా తయారు చేసిన 200 గ్రాముల కషాయాన్ని పశువుకు తాగించాలి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 3 నుంచి 5 రోజులు తాగించాలి. పైపూత మందు తయారు చేసే విధానం కలబంద ఆకుల గుజ్జు, పసుపు, గోరింటాకులను కలిపి ముద్దగా నూరాలి. ఆ ముద్దను పశువు వంటికి లేపనంగా పట్టించాలి. శరీరం అంతా రాస్తే మంచిది. ఒకవేళ వీలుకాకపోతే కణుతులు తేలిన ప్రాంతాల్లో రాసినా పర్వాలేదు. ఈ లేపనం పూయక ముందు 2 శాతం (వంద లీటర్ల నీటికి 2 కిలోల ఉప్పు) ఉప్పు ద్రావణంతో పశువును శుభ్రంగా కడగాలి. ఖర్చు లేకుండా రైతులు ఈ చికిత్స ద్వారా లంపీ స్కిన్ డిసీజ్ బారి నుంచి పశువులను కాపాడుకోవచ్చు. -
పర్ఫ్యూమ్స్తో జాగ్రత్త!
ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా బాగా చవగ్గా లభ్యమయ్యే సెంట్లు, ఇతర సుగంధ ద్రవ్యాలు మార్కెట్లోకి విరివిగా వస్తున్నాయి. ఈ చీప్ పర్ఫ్యూమ్స్ కారణంగా కొన్ని వ్యాధులు, సెంట్ల కారణంగా వచ్చే అలర్జీలు పెరిగాయంటున్నారు అధ్యయనవేత్తలు. పర్ఫ్యూమ్స్తో అనర్థాలివే... సెంట్స్ కారణంగా అనేక రకాల అలర్జీలు, కాంటాక్ట్ డర్మటైటిస్, ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధులు పెరుగుతున్నాయి. అంతేకాదు... అలా సెంట్ వాసన సోకిన వెంటనే కొందరిలో మైగ్రేన్ సమస్య మొదలవుతుంది. ఇటీవల ఈ కారణంగా వచ్చే తలనొప్పులు పెరుగుతున్నాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. సెంట్స్ చర్మానికి తగలడంతో పాటు, వాటి వాసన వ్యాప్తిచెందడం వల్ల అనేక రకాల చర్మవ్యాధులు వస్తున్నాయని ఇంగ్లాండ్‌లోని క్యాంటర్బరీ కెంట్ ఛాసర్ హాస్పిటల్‌కు చెందిన చర్మవైద్య నిపుణులు డాక్టర్ సుసానా బ్యారన్ పేర్కొన్నారు. ఇలా ఉపయోగించామో లేదు... వెంటనే అలా అలర్జీకి కారణమయ్యే అలర్జెన్ల తాలూకు జాబితాను రూపొందించేందుకు యూరోపియన్ యూనియన్ సైంటిఫిక్ కమిటీ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో ఘాటైన సువాసనలు వెదజల్లే అనేక సుగంధ ద్రవ్యాలు చోటు చేసుకున్నాయి. మంచి వాసనలను వెదజల్లే వస్తువులు ఉదాహరణకు... కొన్ని ఘాటైన వాసనలు వెదజల్లే సబ్బులు, షాపూలు సైతం అలర్జీలకు కారణమవుతున్నట్లు తేలింది. కొందరు వ్యక్తులు తమ ప్రైవేట్ పార్ట్ వద్ద సుగంధద్రవ్యాలను ఉపయోగిస్తుంటారు.వారి చర్మ ఆరోగ్యం గురించి డర్మటాలజిస్టు నిపుణులు చెప్పే మాటలిలా ఉన్నాయి. ‘కొందరు తమ అండర్ గార్మెంట్స్ వద్ద టాల్కం పౌడర్ వంటివి జల్లుకుంటారు. అలా మన ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఘాటైన వాసనలు వెదజల్లే సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం కంటే... ప్రతిరోజూ శుభ్రంగా స్నానం చేయడం, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికిన ఫ్రెష్ అండర్ గార్మెంట్స్ తొడుక్కోవడమే ఆరోగ్యకరం’ అన్నది డర్మటాలజిస్టుల సలహా. -
రుచికి గొప్పాయి
బొప్పాయి న్యూస్‌లో ఉంది. డెంగీ జ్వరానికి దాని ఆకుల రసం విరుగుడనే ప్రచారం ఉంది. కాని వైద్యుల సలహా లేకుండా అలాంటి చిట్కాలు పాటించకూడదనే హెచ్చరిక కూడా ఉంది. బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు. అయితే కూరకు కూడా అది చాలా గొప్పాయిదని తెలుసుకోవాలి. పనీర్, పెరుగుపచ్చడి, మసాలా కూర.. ఇవన్నీ రొటీన్‌గా ఉండే మీ మెనూను మార్చేస్తాయి. కొత్తగా ఉందని అనిపిస్తాయి. గొప్పగా చెప్పండి.. ఇవాళ మీ ఇంట బొప్పాయి అని. బొప్పాయి హల్వా కావలసినవి: దోరగా పండిన బొప్పాయి తురుము – 4 కప్పులు; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; పంచదార – 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; బాదం పొడి లేదా పాల పొడి లేదా కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►బొప్పాయి పండును శుభ్రంగా కడిగి ముక్కలు చేసి గింజలు వేరు చేసి, తురమాలి ►బాణలిలో నెయ్యి వేసి కరిగాక బొప్పాయి తురుము వేసి సన్నని మంట మీద సుమారు పావుగంట సేపు దోరగా వేయించాలి ►బాగా ఉడికిన తరవాత పంచదార వేసి బాగా కలిపి సుమారు పావు గంట సేపు ఉడికించాలి ►బాదం పప్పుల పొడి జత చే సి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి ►జీడి పప్పు పలుకులు జత చేసి రెండు నిమిషాల పాటు కలిపి దింపేయాలి ►కొద్దిగా వేడిగా లేదా చల్లగా తింటే రుచిగా ఉంటుంది. బొప్పాయి మసాలా కూర కావలసినవి: బొప్పాయి ముక్కలు – 2 కప్పులు; పచ్చి బఠాణీ – ఒక టేబుల్ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4; కరివేపాకు – 2 రెమ్మలు; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; పల్లీలు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 4; జీలకర్ర – ఒక టీ స్పూను; నువ్వులు – ఒక టేబుల్ స్పూను; ఎండు కొబ్బరి పొడి – ఒక టేబుల్ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; ఆవాలు – ఒక టీ స్పూను. తయారీ: ►ఒక గిన్నెలో బొప్పాయి ముక్కలు, పచ్చి బఠాణీ, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించి దింపేయాలి ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక పల్లీలు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి ►జీలకర్ర జత చేసి మరోమారు వేయించాలి ►నువ్వులు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►ఎండు కొబ్బరి పొడి జత చేసి మరోమారు వేయించాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ►పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, పసుపు, కరివేపాకు, పచ్చి మిర్చి, ఉల్లి తరుగు వేసి వేయించాలి ►ఉప్పు జత చేసి బాగా కలిపి, బొప్పాయి ముక్కలు జత చేయాలి ►మెత్తగా పొడి చేసిన మసాలా పొడి వేసి మరోమారు కలపాలి ►కొద్దిసేపు కలిపిన తరవాత దింపేయాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. బొప్పాయి పెరుగు పచ్చడి కావలసినవి: పచ్చి బొప్పాయి తురుము – ఒక కప్పు; పెరుగు – 3 కప్పులు; తరిగిన పచ్చి మిర్చి – 4; ఉప్పు – తగినంత; కరివేపాకు – 2 రెమ్మలు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4; కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను; పసుపు – కొద్దిగా; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ►ఒక గిన్నెలో బొప్పాయి తురుము, తగినన్ని నీళ్లు, ఉప్పు జత వేసి స్టౌ మీద ఉంచి ఉడికించి దింపేయాలి ►ఒక పెద్ద పాత్రలో పెరుగు, పసుపు వేసి గిలకొట్టాలి ►ఉడికించిన బొప్పాయి తురుము జత చేసి బాగా కలియబెట్టాలి ►వేయించి ఉంచుకున్న పోపు వేసి కలిపి, కొత్తిమీరతో అలంకరించాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. బొప్పాయి పనీర్ కూర కావలసినవి: సన్నగా తరిగిన పచ్చి బొప్పాయి ముక్కలు – 2 కప్పులు; ఉడికించిన బంగాళ దుంప – 1; సన్నగా తరిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను; పనీర్ తురుము – ఒక టేబుల్ స్పూను; మెంతులు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత. పేస్ట్ కోసం: ఉల్లి తరుగు – పావు కప్పు; వెల్లుల్లి రేకలు – 10; అల్లం – చిన్న ముక్క; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ధనియాలు – అర టీ స్పూను; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 1. తయారీ: ►ఒక పాత్రలో ఉప్పు వేసి, తరిగిన బొప్పాయి ముక్కలు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించి, నీరు ఒంపేయాలి ►ఉడికించిన బంగాళదుంపను చిన్న చిన్న ముక్కలు చేయాలి ►చిన్న గిన్నెలో మెంతులు, కొద్దిగా నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి ఉడికించాక, నీళ్లు ఒంపేసి మెంతులను బొప్పాయి ముక్కలకు జత చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, జీలకర్ర వేసి చిటపటలాడించాలి ►పేస్ట్ కోసం తీసుకున్న పదార్థాలను మెత్తగా ముద్దలా చేసి, జీలకర్ర వేగిన తరవాత జత చేయాలి ►ఉప్పు, అర కప్పు నీళ్లు జత చేసి కొద్దిసేపు ఉడికించాలి ►బొప్పాయి ముక్కలు, బంగాళ దుంప ముక్కలు జత చేసి బాగా కలిపి, మూత ఉంచి, మంట బాగా తగ్గించి సుమారు ఐదు నిమిషాలపాటు ఉడికించాలి ►బొప్పాయి ముక్కలు బాగా మెత్తపడి, గ్రేవీ చిక్కగా అవ్వగానే దింపేసి, కొత్తిమీరతో అలంకరించాలి ►చపాతీ, పరాఠా, అన్నంలోకి రుచిగా ఉంటుంది. పచ్చి బొప్పాయి కర్రీ (నార్త్ ఇండియన్ స్టయిల్) కావలసినవి: పచ్చి బొప్పాయి – అర కేజీ; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; వెల్లుల్లి రేకలు – 4; సోంపు – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూను; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►కుకర్‌లో నూనె వేసి వేడి చేయాలి ∙సోంపు వేసి చిటపటలాడించాలి ►అల్లం వెల్లుల్లి తురుము వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి ►ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాక, టొమాటో తరుగు జత చేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి ►మిగిలిన మసాలా వస్తువులన్నీ వేసి వేయించాలి ►చివరగా బొప్పాయి ముక్కలు వేసి బాగా కలిపి, ఒక కప్పు నీళ్లు జత చేసి మూత పెట్టాలి ►మూడు విజిల్స్ వచ్చాక దింపేసి, కొత్తిమీర తరుగుతో అలంకరించి వడ్డించాలి ►పుల్కా, రోటీ, అన్నంతో తింటే రుచిగా ఉంటుంది. బొప్పాయి కొన్ని సంవత్సరాల క్రితం వరకు బొప్పాయి పండు దొడ్లో చెట్టుకి కాస్తే ఎవరికివారు తినడమో, ఇరుగుపొరుగు పంచిపెడితేనో మాత్రమే దొరికేది. కానీ, ఈ పండులోని పోషక విలువలు, ఆరోగ్య రక్షక గుణాలు ప్రాచుర్యం పొందాక, ఇది కూడా బజార్లో కొనుక్కోవలసిన పండు అయిపోయింది. ఇప్పటికీ మిగిలిన పళ్లతో పోల్చితే ఇది చవకగానే దొరుకుతోంది. కాని ప్రజలలో ఒక నిజం కాని నమ్మకం ఉంది. ఎక్కువ ఖరీదు పెట్టి కొంటే అందులో ఎక్కువ బలం ఉంటుందనీ, చవకగా దొరికే పళ్లల్లో పోషక విలువలు తక్కువనీ. ఇది కేవలం పరిజ్ఞాన లోపం వల్ల ప్రబలిన నమ్మకం. చవకగా దొరికే బొప్పాయి పండులో ఉన్నన్ని పోషక విలువలు, ఖరీదైన ఆపిల్‌లో లేవు. అందుకని పండు విలువని ఖరీదుతో వెలకట్టకూడదు. ఏ భాగాలు... పచ్చికాయని కూరగాను, పండుని ఆహారంగాను వాడతాం. గింజలలో కూడా వైద్యగుణాలు ఉన్నాయి. పండు – ప్రయోజనాలు ►పచ్చికాయలోను, పండులోను కూడా జీర్ణశక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. ఎంతటి అరగని పదార్థాన్నయినా, బొప్పాయితో కలిపి తింటే తేలికగా జీర్ణం అయిపోతుంది. మాంసాహారంతో బొప్పాయి కలిపి వండితే త్వరగా, తేలికగా జీర్ణం అవుతుంది. ►మలబద్దకం, పైల్స్ వ్యాధి ఉన్నవారికి మలబద్దకం పోగొట్టి, పైల్స్ వ్యాధి తగ్గేందుకు సహాయపడుతుంది. ►క్రమంగా తింటూంటే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ శరీరంలో పేరుకోకుండా, బయటికి పంపేసి శరీరాన్ని రక్షిస్తుంది. ►ఇందులోని విటమిన్ సి కారణంగా, నెలరోజులు నిత్యం తింటూంటే పురుషులలోని వీర్యకణాలు అన్నిరకాలుగా వృద్ధి చెందుతాయి. ►గర్భిణీలకు నిషేధం. పచ్చికాయ – గింజలు ►సిరోసిస్ ఆఫ్ లివర్ వ్యాధిగ్రస్తులు... బొప్పాయి గింజలను నూరి రసం తీసి, కొద్దిగా నిమ్మరసం కలిపి (1 చెంచా రసం + 10 చుక్కల నిమ్మ రసం) రోజూ రెండు పూటలా కొంతకాలం తీసుకుంటూంటే ఆరోగ్యం మెరుగవుతుంది. ►చర్మవ్యాధులలో... గడ్డలు, మొటిమలు, పాదాలలో వచ్చే కార్న్స్ వంటి సమస్యలలో పచ్చికాయ నుండి రసం తీసి, పైపూతగా వాడితే తగ్గుతాయి. ►నెలసరి క్రమంగా కానివారు పచ్చికాయ తింటూంటే స్రావం సక్రమంగా అవుతుంది. ►పచ్చి బొప్పాయి కాయ నుంచి కారే పాలు 1 చెంచాడు + 1 చెంచా తేనె కలిపి సేవిస్తూంటే కడుపులో పురుగులు పోతాయి. ఈ మిశ్రమం సేవించిన 1 – 2 గంటల తరవాత ఆముదం తీసుకోవాలి. – నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ -
హెల్దీ బాత్
ఐదు బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయం అందులో వందగ్రాముల తాజా పుదీనా ఆకులు వేసి మెత్తగా పేస్టు చేయాలి. పేస్టు చేయడానికి అవసరమైనంత గోరువెచ్చటి నీటిని వేయవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి ఆరిన తర్వాత వేడి నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మం నునుపుదనం, మెరుపు సంతరిచుకోవడంతోపాటు చర్మవ్యాధులను దూరం చేస్తుంది. ►స్నానం చేయడానికి పావుగంట ముందుగా మజ్జిగలో దూదిని ముంచి ఒంటికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మసౌందర్యంతో పాటు దేహ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఎండకు వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. ►తరచు స్కిన్ ఇన్ఫెక్షన్లు బాధిస్తుంటే ఒక లీటరు నీటిలో వేపాకులను వేసి మరిగించి ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. ►ఒక బకెట్ నీటిలో మూడు స్పూన్ల తేనె కలుపుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా, నునుపుగా మారుతుంది. ►ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ కాలంలో చెమటతో దుర్వాసన వస్తుంటుంది. స్నానం చేసే నీటిలో ఒక టీ స్పూన్ పన్నీరు కలుపుకుంటే రోజంతా తాజాగా ఉంటుంది. -
రెడ్ వైన్ తాగుతున్నారా.. ఐతే జాగ్రత్త
రెడ్ వైన్‌ను ఇష్టంగా తాగేవారు.. ఇకపై కాస్త జాగ్రత్తగా ఉండండి.. వీలైతే తాగడం పూర్తిగా మానేయండి.. ఇవి మేము చెప్తున్న మాటలు కాదండోయ్.. పరిశోధనలు చేసి వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలు. అధిక మోతాదులో రెడ్ వైన్ తీసుకోవడం వల్ల క్యాన్సర్, హృద్రోగంతో పాటు డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు వైద్యులు. ఈ మేరకు తన పరిశోధనల్లో పలు విషయాలు వెల్లడయ్యాయంటూ డాక్టర్ మార్క్ మెనోలాసినో ఇక ఆర్టికల్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా శుద్థిచేయని, చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ద్రాక్షరసం తాగటం వల్ల కాలేయం దెబ్బతింటుందని తెలిపారు. ఈ పరిణామాల వల్ల శరీరంలోని చెడు కొవ్వు శాతం పెరుగుతుందని కూడా పేర్కొన్నారు. చర్మవ్యాధులు కూడా.. రెడ్ వైన్ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో పాటు చర్మ సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల మొటిమలు వస్తాయని, చర్మం కళ కోల్పోతుందని డాక్టర్ ఇసాబెల్ షార్కర్ తెలిపారు. కళ్లకింద నల్లటి వలయాలు కూడా ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. మొటిమలు, చర్మంపై గల మృత కణాల వల్ల రంధ్రాలు ఏర్పడతాయి గనుక సాధ్యమైనంత వరకు రెడ్ వైన్‌ను తాగకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. మేము చెప్పాల్సింది చెప్పాం.. సో ఇకపై రెడ్ వైన్ తాగుతారో మానేస్తారో మీ ఇష్టం మరి. -
అందనంత ఎత్తులో వైద్యం!
సాక్షి, విశాఖపట్నం : కింగ్ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్) చర్మవ్యాధుల విభాగం రోగులకు అందుబాటులో లేకుండా పోతోంది. ఈ విభాగం ఓపీ సేవలందించే బ్లాకు రెండో అంతస్తులో ఉంది. వృద్ధులు, వికలాంగులు మెట్ల మార్గం ద్వారా రెండంతస్తులు ఎక్కడానికి నానా అవస్థలు పడుతున్నారు. చిన్నపిల్లలను తల్లులు ఎత్తుకుని అంత ఎత్తు ఎక్కలేకపోతున్నారు. అక్కడ లిఫ్ట్ కూడా లేదు. లిఫ్ట్ ఏర్పాటు చేసే అవకాశమూ లేదు. అలాగే ర్యాంపు కూడా లేదు. దీంతో ఎక్కడెక్కడ నుంచో ఉచిత వైద్యానికి వచ్చే ఈ పేద రోగులు రెండంతస్తులను పడుతూ లేస్తూ ఎక్కుతున్నారు. ఈ చర్మ వ్యాధుల ఓపీకి రోజుకు 150 నుంచి 200 మంది వరకు సగటున నెలకు ఐదు వేల మంది వస్తుంటారు. వీరిలో పది శాతం మంది వయో వృద్ధులు, చిన్నారులే ఉంటున్నారు. వీరు ఒకసారి ఓపీ చూపించుకున్నాక దిగువన ఉన్న మందుల కౌంటరు వద్దకు మందుల కోసం, ఇతర పరీక్షల కోసం రావలసి వస్తోంది. ఒక్కసారి ఎక్కడానికే నానా బాధలు పడుతున్న వీరు రెండోసారి రెండంతస్తులు ఎక్కి దిగడం వారి వల్ల కావడం లేదు. అలా మెట్లెక్కలేని వారు విధిలేని పరిస్థితుల్లో కేజీహెచ్ ఎదురుగాను, పరిసరాల్లోనూ ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. ఆ స్తోమతు కూడా లేని వారు ఓపిక కూడగట్టుకుని ఒక్కో మెట్టు ఎక్కి వైద్యం అందుకుంటున్నారు. విచిత్రమేమిటంటే కేజీహెచ్ పరిసరాల్లో ఉన్న చర్మవ్యాధుల ఆస్పత్రులు, క్లినిక్‌ల్లో కేజీహెచ్‌లో పనిచేస్తున్న కొంతమంది చర్మవ్యాధి వైద్యులవే కావడం విశేషం. కేజీహెచ్ ఓపీకి వెళ్లలేని వారంతా సమీపంలో ఉన్న చర్మ వ్యాధుల ఆస్పత్రుల్లో వైద్యానికి వెళ్తున్నారు. ఇలా రెండో అంతస్తులో చర్మ వ్యాధుల ఓపీ బ్లాక్ ఉండడం పరోక్షంగా ఆ వైద్యులకు బాగా కలిసొస్తోంది. అందువల్లే ఈ కేజీహెచ్ ఓపీ బ్లాక్ ఎంతగా అందుబాటులో లేకపోతే అంతగా వీరికి లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు. సీనియర్ వైద్యులకు హృద్రోగం కేజీహెచ్ చర్మ వ్యాధుల విభాగంలో 14 మంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ముగ్గురు ప్రొఫెసర్లు, మరో ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ముగ్గురు సీనియర్లలో ఇద్దరు హృద్రోగంతోను, ఒకరు ఆర్థరైటిస్తోనూ బాధపడుతున్నారు. గుండె జబ్బులతో ఉన్న వారు రెండంతస్తుల మెట్లు ఎక్కడం ప్రమాదం కావడంతో వారు దిగువన ఉన్న వార్డుకే పరిమితమవు తున్నారు. ఆర్థరైటిస్ వల్ల మరో మహిళా వైద్యురాలు కూడా ఓపీకి వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారింది. దీంతో అందుబాటులో ఉన్న అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లలో కొద్దిమందే ఓపీ చూస్తున్నారు. సైకియాట్రీ వార్డుకు మార్చాలి.. ఈ పరిస్థితుల నేపథ్యంలో దిగువన (గ్రౌండ్ ఫ్లోర్లో) నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉన్న సైకియాట్రీ వార్డును చర్మవ్యాధుల ఓపీకి కేటాయించాలని, లేనిపక్షంలో దిగువనే మరో చోట ఇవ్వాలని ఆ విభాగం వైద్యులు చాన్నాళ్లుగా కోరుతున్నారు. అయినప్పటికీ ఆ మార్పు జరగడం లేదు. గత ఏడాది నవంబర్‌లో ఒకసారి, రెండ్రోజుల క్రితం మరొకసారి వీరు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అయినప్పటికీ ఆయన స్పందించడం లేదని వైద్యులు చెబుతున్నారు. పరిశీలించి కేటాయిస్తాను.. చర్మవ్యాధుల ఓపీని గ్రౌండ్ ఫ్లోర్‌కు మార్చాలన్న డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. అయితే ఖాళీగా ఉన్న సైకియాట్రీ వార్డు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించినందున ఈ ఓపీకి కేటాయించడానికి వీల్లేదు. చర్మవైద్యుల్లో హృద్రోగంతో ఉన్న వారు ఉన్నారు. వీరి ఇబ్బందులను, రోగుల అవస్థలను దృష్టిలో ఉంచుకుని గ్రౌండ్ ఫ్లోర్‌ను కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నాను. – డా.జి.అర్జున, సూపరింటెండెంట్, కేజీహెచ్ -
నరకయాతన..
దంతాలపల్లి(డోర్నకల్): అందరితో ఆడుతూ పాడాల్సిన ఓ బాలుడు ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నాడు. జన్యు లోపం అతడికి శాపమైంది. పొలుసుల చర్మం, దురదతో బాధపడుతున్నాడు. వైద్య పరిభాషలో ఈ వ్యాధిని ఇక్తియోసిస్ వల్గారిస్ అని అంటారు. అనేక ఆస్పత్రుల చుట్టూ తిరిగినా జబ్బు నయం కాలేదు. వైద్యం చేయించలేని స్థితిలో బాలుడి తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్నారు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దంతాలపల్లి మండల కేంద్రంలోని కక్కెర్ల మల్లయ్య, నిర్మల దంపతుల కుమారుడు రాంచరణ్ స్థానిక మండల పరిషత్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. కాగా, రాంచరణ్ పుట్టుకతోనే జన్యు సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నాడు. చర్మం పొలుసులుగా మారి, దురదతో నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నాడు. రాంచరణ్ వయస్సు ఇప్పుడు పదేళ్లు. తల్లిదండ్రులు పదేళ్లుగా ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబం రాంచరణ్‌ది పేద కుటుంబం. తండ్రి గీత కార్మికుడు, తల్లి రోజూ కూలి పని చేస్తుంది. బాలుడికి తల్లిదండ్రులు ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. జన్యు సంబంధ వ్యా««ధి ఉందని, ఒకవేళ చర్మ వ్యాధి నిపుణులను సంప్రదిస్తే మెరుగైన వైద్యంతో కొంత నయమయ్యే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. డబ్బులు చెల్లించి మెరుగైన వైద్యం చేయించే ఆర్థిక స్థోమత వారికి లేదు. ఇప్పటివరకు వైద్యానికి రూ.10 లక్షలు ఖర్చు చేశారు. చికిత్స కోసం రూ.5 లక్షల వరకు ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పారు. కొడుకును చూడలేకపోతున్నం తోటి పిల్లలు ఆడుకుంట ఉంటే మావోడు చర్మం బాగాలేక దురదతో ఇబ్బంది పడుతడు. చర్మం అంతా పాములెక్క అయి ఉంది. పుట్టినప్పటి నుంచి అన్ని ఆస్పత్రులు తిప్పినం. అయినా బాగుకాలే. డాక్టర్లు అదేదో పుట్టినప్పటి నుంచి ఉండే వ్యాధి అని చెప్పిండ్రు. పెద్ద డాక్టర్ల దగ్గర చూపెట్టాలని వాళ్లకు చూపెడితే కొంత నయం అయితదన్నరు. మేము కూలి చేసుకునేటోళ్లం. మాదగ్గర అంత డబ్బు లేదు. మా కొడుక్కి వైద్యం చేయించడానికి దాతలు ముందుకు రావాలి. – నిర్మల, రాంచరణ్ తల్లి ఇది ఇక్తియోసిస్ వల్గారిస్ వ్యాధి బాలుడు రాంచరణ్‌కు సోకిన వ్యాధిని వైద్య పరి భాషలో ఇక్తియోసిస్ వల్గారిస్ అంటారు. అంటే జన్యుపరంగా చర్మానికి వచ్చిన వ్యాధి. దీని వలన చర్మం పొలుసులుగా మారి దురద వస్తుంది. దాదాపు ఇది పూర్తిగా నయం అయ్యే అవకాశాలు తక్కువ. చర్మ వ్యాధి నిపుణులను సంప్రదించి మెరుగైన వైద్యం చేయిస్తే ఫలితం కనపడవచ్చు. – డాక్టర్ అక్షయ్‌కుమార్, దంతాలపల్లి ఆర్థిక సాయం చేసేవారు 9490899551 నంబర్‌ను సంప్రదించవచ్చు. -
ఇంటిప్స్
ప్రాచీన కాలం నుంచి పసుపుని యాంటీసెప్టిక్‌గా వినియోగిస్తున్నారు.మన పెద్దవాళ్లు ఏ చిన్న దెబ్బ తగిలినా వెంటనే పసుపు తెమ్మని తొందరపెట్టడం ప్రతి ఇంట్లో సహజంగా జరిగే విషయమే. గాయాన్ని త్వరగా మాన్పే గుణం పసుపులో ఉంది. అలాగే గొంతు సంబంధ వ్యాధులు, చర్మవ్యాధులకు పసుపు బాగా పనిచేస్తుంది. పసుపు నీళ్లతో ఆవిరిపడితే దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్కు అద్భుతంగా పనిచేస్తుంది. లేదంటే గోరువెచ్చని నీటిలో పసుపు కలుపుకుని పుక్కిలిస్తే (గార్గిలింగ్) గొంతు సంబంధ వ్యాధులు త్వరగా తగ్గుతాయి. -
కృష్ణాలో ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా
-
కృష్ణాలో ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా
► చర్మ రోగాలు వచ్చే ప్రమాదం ► తాగితే డయేరియా, విరోచనాలు,టైఫాయిడ్, కామెర్ల ముప్పు ► హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు ► కృష్ణాలో కలుస్తున్న మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలు ► ప్రభుత్వం తక్షణం చర్యలు చేపడితేనే పుష్కర భక్తులకు భరోసా సాక్షి, హైదరాబాద్/గుంటూరు: పవిత్ర కృష్ణా పుష్కరాలు మరో 24 గంటల్లో ప్రారంభం కానున్నాయి. పిల్లాపాపలతో సహా తరలివచ్చేందుకు భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిరోజూ 10 లక్షల మందికిపైగా పుణ్య స్నానాలు ఆచరిస్తారని అంచనా. ఈ లెక్కన 12 రోజుల్లో 1.20 కోట్ల మందికి పైగా జనం పుష్కర స్నానాలు చేయనున్నారు. కృష్ణా నది ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే... పుష్కర స్నానం తో ప్రాణాంతక రోగాలు పక్కా అని చెప్పక తప్పదు. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు నేరుగా కలుస్తుండటంతో జీవనది కృష్ణమ్మ కాలుష్య కాసారంగా మారింది. కృష్ణా నీటిలో అత్యంత ప్రమాదకరమైన ఈ-కోలి బ్యాక్టీరియా స్థావరం ఏర్పరచుకున్నట్లు తేలింది. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నీటిని తాగితే డయేరియా, రక్తపు విరోచనాలు, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధులు, రకరకాల ఉదరకోశ జబ్బులతోపాటు కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, బ్యాక్టీరియా నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. మోగుతున్న ప్రమాద ఘంటికలు పుష్కర ఏర్పాట్లలో నిమగ్నమైన ప్రభుత్వ అధికారులకు అత్యంత ప్రమాదకరమైన ఈ-కోలి బ్యాక్టీరియా నిద్ర లేకుండా చేస్తోంది. గుంటూరు జిల్లా సీతానగరం ఘాట్‌లో ఈబ్యాక్టీరియా తీవ్రస్థాయిలో ఉన్నట్లు గత నెల 30న వైద్య నిపుణులు గుర్తించారు. కృష్ణా నదిలో నీరు ఎప్పటి నుంచో నిల్వ ఉండడం, ఘాట్ నిర్మాణ పనుల్లో భాగంగా వ్యర్థాలను నీటిలో పడేయడంతో ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందినట్లు భావిస్తున్నారు. కర్నూలులోని మురుగు నీరు, అక్కడి పరిశ్రమల నుంచి విడుదలవుతున్న రసాయనాలతో కూడిన నీరు తుంగభద్ర నది గుండా కృష్ణాలోకి ప్రవేశిస్తోంది. విజయవాడ ఎగువన కాగిత పరిశ్రమల నుంచి రసాయనాలు కృష్ణాలో కలుస్తున్నాయి. గొల్లపూడి ప్రాంతంలోని కాలనీల నుంచి మురుగు నీరంతా నదిలోకి చేరుతోంది. విష రసాయనాలు, డ్రైనేజీ నీరు కలవడం వల్ల కృష్ణా నీటిలో ఈ-కోలి బ్యాక్టీరియా మోతాదుకు మించి ఉంది. 14 ఐపీఎం బృందాల పర్యవేక్షణ గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణా నదిలో ఈ-కోలి బ్యాక్టీరియాని గుర్తించడంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఘాట్ల వద్ద నీటి నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహించేందుకు ఐపీఎం సిబ్బంది 14 బృందాలుగా ఏర్పడ్డారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడలోని దుర్గ గుడి పక్కన ఉన్న వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో వాటర్ మానిటరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల్లో అన్ని పుష్కర ఘాట్ల వద్ద నీటి నమూనాలు సేకరించి, పరీక్షలు జరపనున్నారు. ప్రభుత్వం ఏం చేయాలి? ♦ ఈ-కోలి బ్యాక్టీరియా తీవ్రత తక్కువగా ఉన్న ఘాట్లను గుర్తించి, జనం అక్కడ స్నానాలు ఆచరించేలా ప్రోత్సహించాలి. ♦ పుష్కరాలు ముగిసేలోగా మురుగు నీరు కృష్ణాలో కలవకుండా చూడాలి. ♦ బ్యాక్టీరియా బారిన పడి అస్వస్థతకు గుర య్యే వారికి వెంటనే వైద్య సేవలందించేం దుకు సిబ్బందిని సర్వసన్నద్ధంగా ఉంచాలి. ♦ పుష్కర స్నానాల్లో శాంపూలు, సబ్బుల వాడకంపై నిషేధం ఉంది. అయినా ఇది ఎక్కడా అమలు కాకపోవడం గమనార్హం. కృష్ణా పుష్కరాల్లో శాంపూలు, సబ్సులున పకడ్బందీగా నియంత్రించాలి. ♦ పుష్కర ఘాట్ల వద్ద పోగయ్యే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలి. ♦ ఘాట్ల వద్ద గంటగంటకూ క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలి. ♦ ఏపీలో 50 మైక్రాన్ల లోపు పాలిథిన్ కవర్లపై నిషేధం ఉన్నా ఇది కాగితాలకే పరిమితమైంది. కనీసం పుష్కరాల సమయంలో అయినా పాలిథిన్ కవర్లు, ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులను నిషేధించాలి. కాలుష్యం ప్రమాదకర స్థాయిలో లేదు ‘‘ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు కృష్ణా నది నీటిని పరీక్షించి ల్యాబ్ రిపోర్టులను కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు, మున్సిపాలిటీలకు అందజేస్తున్నాం. నీరు కొంత మేరకు కలుషితమైన విషయం వాస్తవమే గానీ, అదేమీ ప్రమాదకర స్థాయిలో లేదు. ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు క్లోరినేషన్ పెంచాలని సూచించాం. పుష్కరాల రోజు నుంచి ప్రతి నాలుగు గంటలకు ఒకసారి నీటి పరీక్షలు నిర్వహించి, తదగుణంగా క్లోరినేషన్ ప్రక్రియ చేయాలని ఆదేశించాం’’ అని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
మన్యాన్ని వీడని మహమ్మారి
► 2009లో వెలుగు చూసిన ఆంత్రాక్స్ ► మరో రెండు గ్రామాల్లో వ్యాధి లక్షణాలు ► పాడేరు ఆస్పత్రిలో చేరిన 19 మంది బాధితులు ► ప్రాథమిక సేవల అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలింపు ► పశుమాంసం తినడం వల్లే అంటున్న వైద్య సిబ్బంది పాడేరు: ప్రాణాంతక ఆంత్రాక్స్ మహమ్మారి మన్యాన్ని వీడటం లేదు. 2009 నుంచి ఏదో ఒక ప్రాంతంలో ఈ వ్యాధి లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత ముంచంగిపుట్టు మండలం కర్లపొదోర్, అత్తికల్లు, ఆడారిలడి, ముక్కిపుట్టు, బరడ గ్రామాల్లో ఆంత్రాక్స్ అలజడి రేపింది. అప్పట్లో 20 మందికి పైగా దీని బారిన పడ్డారు. కాళ్లు,చేతులపై పెద్ద పెద్ద గాయాలు ఏర్పడి శరీరమంతా కబళించడంతో సుమారు పది మంది చనిపోయారు. అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ భీముడువలస వాసులనూ ఇది పీడించింది. ఇక్కడ ఎవరూ చనిపోనప్పటికీ కొన్ని పశువులను కబళించింది. నాటి నుంచి అక్కడక్కడా ఈ వ్యాధి లక్షణాలు కనబడుతూనే ఉన్నాయి. ఇటీవల హుకుంపేట మండలం పనసపుట్టులో ఈ వ్యాధి లక్షణాలతో ఇద్దరు మృతి చెందారు. మరో 18 మంది విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వారు కోలుకోక ముందే జి.మాడుగుల మండలం వంజరి పంచాయతీ వెన్నెలకోటలో ఆరుగురు, గొయ్యిగుంటలో 13 మంది దీని బారిన పడ్డారు. వెన్నెలకోటకు చెందిన కొర్రా సుందరరావు, కొర్రా కృష్ణారావు, కొర్రా సీందు, గెమ్మెలి గంగన్నదొర, కిల్లో దన్ను, గెమ్మెలి భాస్కరరావు, గొయ్యిగుంటకు చెందిన కిల్లో పుల్లయ్య, మర్రినాగేశ్వరరావు, కొర్రా సుబ్బరావు, కిల్లో సుబ్బారావు, కిల్లో సుందరరావు, కిల్లో చిట్టిబాబు, పాంగి చంటి, పాంగి సుబ్బారావు, మర్రి పల్సో, కిల్లో చిట్టిబాబు, కొర్రా కామేశ్వరరావులతో పాటు మహిళలు కిల్లో సావిత్రి, మర్రి కుదే ఆంత్రాక్స్ లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో గెమ్మెలి గంగదొర కుడి కాలు అడుగుభాగం పూర్తిగా కుళ్లిపోయింది. ఇతని పరిస్థితి విషమంగా ఉంది. చర్మవ్యాధిగా కనిపించే ఈ మహమ్మారి కొద్ది రోజుల్లోనే ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుండటంతో ఆదివాసీలు మృత్యువాత పడుతున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం గ్వాలియర్ డీఆర్డీవో శాస్త్రవేత్తల బృందం రక్త నమూనాలు సేకరించి అధ్యయనం చేపట్టింది. గతంలో కూడా వైద్యనిపుణులు ముంచంగిపుట్టు ప్రాంతంలో ఆంత్రాక్స్‌పై పరిశోధనలు జరిపారు. కట్టుదిట్టమైన చర్యలతో ఆ ప్రాంతంలో ఈ వ్యాధి పూర్తిగా అదుపులోకి వచ్చింది. పశుమాంసం తినడం వల్లే .. నిల్వ ఉన్న పశుమాంసం తినడం వల్లే ఈ వ్యాధి సంక్రమిస్తున్నట్టు వైద్యబృందాల పరిశీలనలో వెల్లడవుతోంది. ఆంత్రాక్స్ వెలుగు చూసిన ప్రతి గ్రామంలోనూ దీనిపై అధ్యయనం చేసినప్పుడు ఇదే విషయం నిర్ధారణ అయింది. ఏజెన్సీలోని కొన్ని తెగల పీవీటీజీలకు పూర్వం నుంచి పశుమాంసం తినడం అలవాటు. వారపుసంతల్లోనూ దీనిని చాటుమాటుగా విక్రయిస్తుంటారు. చనిపోయినవాటిని తినడం వల్లే ఈ వ్యాధి ప్రబలుతోందన్న వాదన ఉంది. నిల్వ ఉంచిన, చనిపోయిన పశువుల మాంసం తిని వివిధ గ్రామాల వారు డయేరియా బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. ఆంత్రాక్స్ లక్షణాలు బయటపడిన వెన్నెలకోట, గొయ్యిగుంట గ్రామాల్లో రెండు వారాల్లో వ్యాధులతో 30 పశువులు, 20మేకలు చనిపోయాయి. వాటి మాంసం ఆదివాసీలు తిన్నారు. నాటి నుంచే చర్మంపై కురుపులు, పొక్కులు వచ్చాయని ఆయా గ్రామస్తులు అంగీకరిస్తున్నారు. ఏళ్లమామిడి గ్రామం నుంచి వెన్నెలకోట చుట్టంచూపుగా వచ్చిన పాంగి అప్పారావు కూడా ఈ మాంసం తిని చర్మవ్యాధులకు గురయ్యాడు. క్యుటోనియస్ ఆంత్రాక్స్‌గా అనుమానం వైద్యనిపుణుల బృందం క్యుటోనియస్ ఆంత్రాక్స్‌గా అనుమానిస్తోంది. వారం రోజులుగా పనసపుట్టులో ఈ వ్యాధి లక్షణాలపై వైద్యులు అధ్యయనం చేస్తున్నారు. రక్తనమూనాలను ప్రయోగశాలకు తరలించారు. జి.మాడుగుల మండలం వెన్నెలకోట, గొయ్యిగుంటల్లో ఆంత్రాక్స్ లక్షణాలతో మరో 19 మంది బాధపడుతున్నట్టు వెలుగులోకి రావడంతో అధ్యయనానికి పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల బృందం మంగళవారం ఈ గ్రామాల్లో పర్యటించనుంది. క్యుటోనియస్ ఆంత్రాక్స్‌గా నిర్ధారణ అయితే 10 కిలోమీటర్ల పరిధిలో పశువులకు వ్యాక్సినేషన్ చేపడతామని పశుసంవ ర్థకశాఖ ఏడీ ఎం.కిశోర్ తెలిపారు. -
బయోగ్యాస్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శన
హొసూరు: హొసూరు మున్సిపల్ పరిధిలోని చెత్తా చెదారాన్ని సేకరించి దాసరపల్లి వద్ద బయోగ్యాస్ పథకాన్ని ఏర్పాటు చేయడాన్ని వేరేచోటుకు మార్చాలని డిమాండ్ చేస్తూ దాసరపల్లి గ్రామస్థులు గురువారం బయోగా్యస్ ప్లాంట్ వద్ద ఆందోళన నిర్వహించారు. దాసరపల్లి వద్ద చెత్తాచెదారాన్ని సేకరించి వేయడంతో దాసరపల్లి, పెద్ద దిన్నూరు, ఆలూరు, దిన్నూరు, కొత్తూరు, బెగ్గిలి, ఇమ్మినపల్లి, గొల్లపల్లి తదితర 10 గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామాలలో నివశిస్తున్న 5 వేల మంది పలు శ్వాసకోస సమస్యలు, చర్మవ్యాధులకు గురవుతున్నారు. దాసరపల్లి వద్ద బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఈ 10 గ్రామాలకు చెందిన ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బయోగ్యాస్ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు నడుస్తున్నదని పేర్కొన్నారు. అధికార్లు బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటును మరో చోటుకు తరలించాలని డిమాండ్ చేస్తూ 50 మంది గ్రామస్థులు ప్రదర్శన నిర్వహించారు. బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. -
ఓ ముసుగు ముచ్చట
Protection 4 Fashion 8 స్కార్ఫ్.. ఒక రక్షణ కవచం. కాలుష్య రక్కసి నుంచి మాత్రమే కాదు కాటేసే చూపుల నుంచి కూడా. పొల్యూషన్‌కు సొల్యూషన్‌లా వచ్చిన ఈ స్కార్ఫ్ ఫ్యాషన్‌కు కేరాఫ్‌గా మారుతోంది. దీంతో అమ్మాయిలు వీటిని విరివిగా వినియోగిస్తున్నారు. వీటి ట్రెండ్ ఊపందుకోవడంతో కొత్త కొత్త వెరైటీ స్కార్ఫ్‌లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. అయితే ఫ్యాషన్ మోజులో ఏవి పడితే అవి ఉపయోగించడం వల్ల చర్మవ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు సిటీకి చెందిన డెర్మటాలజిస్టులు. - ఎస్.సత్యబాబు నిజానికి స్కార్ఫ్‌లను స్టోల్ అని పిలుస్తారు. అయితే వాడుకలో స్కార్ఫ్ అంటున్నారు. సిటీలో కాలుష్యం బారి నుంచి తప్పించుకునేందుకు అమ్మాయిలు స్కార్ఫ్‌లను విరివిగా వినియోగిస్తున్నారు. బైక్, బస్సుల్లో, ఆఖరికి నడిచి వెళ్తున్నవారు కూడా విభిన్న రకాల స్కార్ఫ్‌లను వాడుతున్నారు. ప్రొటక్షన్‌గా వచ్చిన స్కార్ఫ్‌లు కాస్త ఫ్యాషన్‌గా మారిపోయాయి. అయితే స్కార్ఫ్ల ఫ్యాబ్రిక్ వల్ల కొత్త రకం చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదముందని సిటీకి చెందిన ప్రజ్ఞ ఆసుపత్రి డాక్టర్ పద్మావతి సూరపనేని హెచ్చరిస్తున్నారు. రక్షణ కోసం వాడేది సమస్యల కారకంగా మారకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనంటున్నారు. వస్త్రం నుంచి వర్ణం దాకా కారణాలే.. దేహంతో పోలిస్తే మహిళల ముఖ చర్మం మరింత సున్నితం. కాలుష్యం నుంచి తమను తాము కాపాడుకునేందుకు స్కార్ఫ్‌లు వినియోగించినప్పటికీ తరచూ ముఖంపై రాషెస్ వస్తున్నాయని పలువురు ఫిర్యాదు చేస్తున్నారంటే కారణం... సదరు స్కార్ఫ్ల తయారీలో వినియోగించిన కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారికి ఫ్యాబ్రిక్ అలర్జీ కారణంగా రాషెస్ రావచ్చు. ముఖ్యంగా నైలాన్, పాలిస్టర్, స్పాండెక్స్ వంటి సింథటిక్ ఫ్యాబ్రిక్‌లు వినియోగిస్తే కాంటాక్ట్ డెర్మటైటిస్ (ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే చర్మవ్యాధి) సమస్య తప్పదు. అదే విధంగా కొన్ని ఫ్యాబ్రిక్స్ మెత్తగా, ముడతల్లేకుండా ఉండేందుకు వాడే ఐడొహైడ్ వంటి రసాయనాలు సైతం చర్మంపై దుష్ర్పభావాన్ని చూపిస్తాయి. అలాగే కొన్ని రకాల రంగుల్లో వినియోగించే పారా-ఫెనిలెనెడియామైన్(పిపిడి) అజో, ఆంత్రాక్క్వైనోన్ ఆధారిత డైలు కూడా అలర్జిక్ డెర్మటైటిస్‌కు కారణమవుతాయి. కాటన్, ఫ్యాబ్రిక్, ప్యూర్ సిల్క్ వంటి వాటిలో కూడా వీటిని వినియోగిస్తారు. మేకప్పుకు పైకప్పుగా వద్దు.. కన్సీలర్స్ లేదా ఫౌండేషన్‌ను ముఖానికి వినియోగించినప్పుడు అదే సమయంలో సింథటిక్ స్కార్ఫ్స్ను ఎక్కువ సేపు అదిమిపెట్టి ఉంచితే గాలి సోకకపోవడంతో విపరీతమైన స్వేదం ఏర్పడి మొటిమలు వస్తాయి. స్కార్ఫ్స్ కొనేటప్పుడు సహజ సిద్ధంగా తయారైన ఫ్యాబ్రిక్ లేదా కాటన్ లేదా లెనిన్ ఫ్యాబ్రిక్మాత్రమే ఎంచుకోవడం ఉత్తమం. రంగులు కూడా అత్యంత తక్కువ కలిసినవి మాత్రమే వినియోగించాలి. వీటిలో తక్కువ డై ఉంటుంది. ఎక్కువ సేపు స్కార్ఫ్ కట్టుకొని ఉండాల్సి వస్తే దానిని తొలగించిన వెంటనే ముఖాన్ని మంచినీటితో శుభ్రపరచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. డాక్టర్ పద్మావతి డెర్మటాలజిస్ట్, కాస్మొటాలజిస్ట్, ప్రజ్ఞ హాస్పిటల్,పంజాగుట్ట 040 23356070 / 9848367000 -
సోరియాసిస్‌కు మెరుగైన ఫలితం హోమియోపతి
చలికాలం రాగానే ఎంతోమంది అనేకరకాల చర్మ సంబంధిత వ్యాధుల తో బాధపడుతూ ఉంటారు. ఇందులో అత్యంత క్లిష్టమైన సమస్య సోరియాసిస్. ప్రపంచ జనాభాలో సుమారుగా మూడు శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీనిని కేవలం సాధారణ చర్మవ్యాధిగా పరిగణించడానికి వీలు లేదు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ వికటించడం వల్ల వచ్చే చర్మవ్యాధి. సోరియాసిస్ వ్యాధిగ్రస్థులలో చర్మంపై దురదతో కూడిన వెండిరంగు పొలుసులు కనిపిస్తాయి. ఈ వ్యాధి ప్రభావం చర్మం మీద మాత్రమే కాకుండా గోళ్ళు, తల తదితర శరీర భాగాలు కూడా వ్యాధి ప్రభావానికి లోనవవచ్చు. ఎందుకు వస్తుంది? వ్యాధినిరోధకశక్తి వికటించి స్వయంప్రేరితంగా మారడం వలన సోరియాసిస్ వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని అర్థం చేసుకోవడానికి వ్యాధినిరోధకశక్తి గురించి కొంత తెలుసుకుందాం. వైరస్, బ్యాక్టీరియా వంటివి శరీరం మీద దాడి చేసినప్పుడు వాటి నుండి రక్షణ పొందటానికి మనశరీరంలో డబ్ల్యూబీసీ (తెల్ల రక్తకణాలు) అనే ప్రత్యేకమైన రక్తకణాలు పని చేస్తుంటాయి. ఇవి అవసరమైన ప్రాంతాలకు వెళ్ళి ఇన్ఫెక్షన్ తగ్గించడమే కాకుండా గాయాలు మానేలా చేస్తాయి. సోరియాసిన్ - వంశపారంపర్యత: కొన్నికుటుంబాలలో సోరియాసిన్ అనువంశికంగా నడుస్తుంది. తల్లిదండ్రులలో ఇద్దరికీ సోరియాసిస్ ఉంటే సంతానానికి వచ్చే అవకాశం 30 శాతం ఉంటుంది. ఒకవేళ ఒకరికే ఉంటే 15 శాతం వచ్చే అవకాశం ఉంటుంది. సోరియాసిస్ ప్రభావం : సోరియాసిస్ ఒక చర్మవ్యాధిగా మాత్రమే గుర్తిస్తే అది తప్పు. దీనివలన సాధారణంగా ప్రాణాపాయం జరగదు. కాని వ్యాధితీవ్రత వలన, దీర్ఘకాలం బాధించడం వలన బాధితులు డిప్రెషన్‌కు లోనవుతారు. ఇది వ్యాధి తీవ్రతను మరింత పెంచుతుంది. సోరియాసిస్‌లో అలా వికటించిన వ్యాధినిరోధక శక్తి వలన సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి అనుబంధ అంశంగా గల ఇన్ఫ్లమేషన్ వలన సోరియాసిస్‌తో బాధపడేవారికి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవేకాక ఈ వ్యాధిగ్రస్థులు డయాబెటిస్, రక్తపోటులకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువే. సోరియాసిస్‌ను తీవ్రం చేసే అంశాలు: చల్లని పొడి వాతావరణం మానసిక ఒత్తిడి కొన్నిరకాల మందులు (మలేరియా మందులు, లితేలయా, బీటా, బ్లాకర్స్, మాంటి) ఇన్ఫెక్షన్స్, ఇతర వ్యాధులు అలవాట్లు హార్మోన్ తేడాలు ఆహార పదార్థాలు -ఉదా: గ్లూటన్ ఎక్కువగా ఉండే ఆహారం. నిర్థారణ పరీక్షలు: సీబీపీ ఈఎస్ఆర్ స్కిన్ బ్లాప్సీ కీళ్ళను ప్రభావితం చేసినప్పుడు ఎక్స్‌రే మొదలగు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలి. కాని సాధారణంగా అనుభవజ్ఞులైన డాక్టర్లు సోరియాసిస్ రోగి చర్మ లక్షణాలను బట్టి రోగాన్ని నిర్ధారిస్తారు. సోరియాసిస్‌లో రకాలు సోరియాసిస్‌ను అది వ్యక్తమయ్యే విధానాన్ని బట్టి ఐదు రకాలుగా వర్గీకరించారు. ప్లేగు సోరియాసిస్: ఇది సోరియాసిస్‌లో ఎక్కువగా కనిపించే రకం. ఎర్రని మచ్చలుగా మొదలై పెద్ద పొడగా మారడం దీని ప్రధాన లక్షణం. Guttata సోరియాసిస్: ఇది ఎర్రని పొక్కులు, పొలుసులతో వాన చినుకులుగా కనిపిస్తుంది. వ్యాధి హఠాత్తుగా మొదలవుతుంది. పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. పస్టులర్ సోరియాసిన్: దీనిలో చీముతో కూడిన పొక్కులు తయారవుతాయి. ఇన్వర్సివ్ సోరియాసిస్: దీనిలో పలుచగా పొట్టు లేకుండా ఎర్రగా కనిపించే మచ్చలు చర్మపు ముడతలలో వస్తాయి. Exythrodermic సోరియాసిస్: దీనిలో ఎర్రటి వాపుతో కూడిన మచ్చలు పెద్ద ఆకారంలో తయారవుతాయి. కాన్స్టిట్యూషన్ పద్ధతిలో సోరియాసిస్ నివారణ... కాన్స్టిట్యూషన్ విధానం ద్వారా మందులు ఇవ్వడం అంటే ఒక వ్యక్తి మానసిక, శారీరక పరిస్థితులే కాకుండా ఎమోషనల్ పరిధిని కూడా పూర్తిగా అర్థం చేసుకుని మందులు ఇవ్వడం. తర్వాత ఏయే పొటెన్సీలో ఎంత డోస్ ఇవ్వాలనేది ముఖ్యం. సరైన మందులు, పొటెన్సీ డోస్ ఇచ్చినప్పుడు వ్యాధి పూర్తిగా నివారించబడుతుంది. సాధారణంగా వాడే మందుల వలన ఈ సోరియాసిస్ తాత్కాలికంగా తగ్గినట్లు లేదా కొన్నిసార్లు అసలు ఫలితమే లేకపోవడం జరుగుతుంది. అదే హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధి తీవ్రతను బట్టి నియంత్రించి పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సోరియాసిస్‌ను అరికట్టవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స కాలం నిర్థారించబడుతుంది. -పాజిటివ్ హోమియోపతి. డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై అపాయింట్మెంట్ కొరకు 92461 99922 www.positivehomeopathy.com -
డాక్టర్ అవతారమెత్తిన గద్వాల ఆస్పత్రి వాచ్మెన్
మహబూబ్‌నగర్: జిల్లాలోని గద్వాల ప్రభుత్వాసుపత్రిలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. డాక్టర్‌గా అవతారమెత్తిన గద్వాల ఏరియా ఆస్పత్రి వాచ్మెన్ ఇద్దరు చిన్నారులకు వైద్యం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చర్మవ్యాధితో బాధపడుతూ ఇద్దరు చిన్నారులు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వాచ్మెన్ వైద్యం ఆ చిన్నారుల ప్రాణంమీదకు తెచ్చింది. వైద్యుడు రాసిచ్చిన మందును చర్మానికి పూయకుండా.. ఆ మందును వాచ్మెన్ నేరుగా ఆ చిన్నారులతో తాగించాడు. ఫార్మసిస్టు అందుబాటులో లేకపోవడంతో ఇద్దరు చిన్నారులకు వాచ్మెన్ చికిత్స చేసినట్టు తెలుస్తోంది. వైద్యం వికటించడంతో ఆ ఇద్దరు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
ఈ నీటితో రోగాలు ఖాయం
పది మందిలో నలుగురికి చర్మరోగాలు ఎయిమ్స్ పరిశోధనల్లో వెల్లడి {పత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పర్యావరణవేత్తల సూచన సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో కలుషిత నీటి సరఫరా కారణంగా చలి కాలంలో చర్మరోగాల బారినపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చలికాలంలో ఢిల్లీలో పదిలో నలుగురు చర్మరోగాల బారినపడుతున్నట్టు ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన అధ్యయనాలు వెల్లడించాయి. వీటిలో చిన్నారుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. తాగేనీటి విషయంలో తీసుకునే జాగ్రత్తలు స్నానం చేసే, ఇతర పనులకు వినియోగించే నీటి విషయంలో ఉండకపోవడమూ ఓ కారణం అవుతోంది. చలికాలంలో వాడుకునే నీటి విషయంలోనూ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని వైద్యులు పేర్కొంటున్నారు. ఢిల్లీ నగరపాలక సంస్థల ఆధ్వర్యంలో సరఫరా అవుతున్న 12 ప్రముఖ జోన్లలో సేకరించిన నీటి నమూనాలను ఎయిమ్స్ డెర్మటాలజీ విభాగం డాక్టర్లు ఇటీవల పరిశీలించారు. వీటిలో 70శాతం నీటిలో రసాయన పదార్థాలు ఉండాల్సిన మోతాదు కంటే చాలా ఎక్కువ ఉన్నట్టు తేలింది. లెడ్‌శాతం అధిక మోతాదులో ఉన్నట్టు అధికారులు గ్రహించారు. వీటి కారణంగా చర్మంపై ఫంగస్, దురదలు వ్యాప్తి చెందే అవకాశాలున్నట్టు వైద్యులు తెలిపారు. వేసవి కాలంలో చెమట రూపంలో శరీరంలోని వ్యర్థాలు బయటికి పోతాయని, చలి కాలంలో ఈ ప్రక్రియ మందగించడంతో సాధారణంగానే చర్మరోగాలు ఎక్కువగా వస్తుంటాయని గంగారాం ఆసుపత్రి డాక్టర్. రోహిత్ బత్రా తెలిపారు. చ లికాలంలో దుస్తులు తరచూ ఉతకకపోవడం కారణంగా వాటిలో ఫంగస్ వ్యాప్తి చెందుతుందన్నారు. ఎయిమ్స్ డెర్మటాలజీ విభాగం చేసిన పరిశోధనలు వెల్లడించిన ప్రకారం ఎక్కువ మంది ప్రజలు తాగేనీటి విషయంలో చూపుతున్న శ్రద్ధ, స్నానం చేసే, వాడుకునే నీటి విషయంలో పట్టించుకోవడం లేదు. ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో సరఫరా అవుతున్న తాగునీరు, వాడుకునేందుకు సైతం పనికి రాని విధంగా ఉందని తేలింది. మెహ్రోలీ, తుగ్గకాబాద్ ప్రాంతాల్లోని నీటి నమూనాల్లో అత్యధికంగా రసాయనాలు ఉన్నట్టు తెలిసింది. ఢిల్లీలో భూగర్భ జలాలు రోజురోజుకు క లుషితం అవుతున్నట్టు పర్యావరణ శాస్త్రవేత్త అనుపమ్ మిశ్రా పేర్కొన్నారు. ఈ సమస్యను సకాలంలో గుర్తించనట్లయితే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇందుకోసం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టంను అమలులోకి తేవాలని సూచించారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నా ప్రారంభించలేదని తెలిపారు. -
ఈ నెలంతా చలే...
‘మాది’ ఎఫెక్ట్ .. = గణనీయంగా పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు = రాత్రంతా చలి.. పగలంతా ఎండ = ప్రబలనున్న జలుబు, చర్మ వ్యాధులు = అలర్జీ, ఉబ్బసం వారికి ‘పొగమంచు’ గండం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో చలి పంజా విసిరింది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. రాత్రి నుంచి తెల్లారి వరకు ఎముకలు కొరికే చలి, తర్వాత సాయంత్రం వరకు భగ భగ మండే ఎండలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తెల్లారే సరికి పరుపులు, దిండ్లు దాదాపుగా నీటిలో తడిసినట్లు చల్లబడి పోతున్నాయి. స్వెటర్లు, మంకీ క్యాప్‌లు, జెర్కిన్లతో చలి పులి నుంచి కాచుకోవడానికి పౌరులు తలమునకలుగా ఉన్నారు. ఇలాంటి వాతావరణం వల్ల జలుబు, చర్మ రోగాలు అధికమవుతున్నాయి. ఉబ్బసంతో బాధ పడుతున్న వారు మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. కాగా చలి కాలంలో ఉదయం పూట బాగా మంచు పడే అవకాశం ఉన్నందున, అలర్జీ, ఉబ్బసంలతో బాధ పడుతున్న వారు జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకుని, వైద్యుల సలహా ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. చలి కాలంలో తలుపులు, కిటికీలను మూసి వేసి ఉన్నందు వల్ల శుభ్రమైన గాలి కొరతతో ‘సిక్ బిల్డింగ్ సిండ్రోమ్’ సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీనికి విరుగుడుగా అప్పుడప్పుడు తలుపులు లేదా కిటికీలను తెరుస్తూ, మూస్తూ ఉండాలని సూచిస్తున్నారు. మరో వైపు బెంగాల్‌కు నైరుతిగా ఏర్పడిన ‘మాది’ తుఫాను కారణంగా చలి విపరీతమైంది. దీని ప్రభావం వల్ల పగటి ఉష్ణోగ్రత లు ఒకటి, రెండు డిగ్రీలు ఎక్కువై, రాత్రి ఉష్ణోగ్రతలు అదే విధంగా తగ్గుతున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆకాశ మం మేఘావృత్తమై చలి గాలులు వీచాయి. ఇదం తా ‘మాది’ ప్రభావమేనని, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలో ఇప్పుడు గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతోంది.