డాక్టర్ అవతారమెత్తిన గద్వాల ఆస్పత్రి వాచ్మెన్ | Sweeper gives treatment to children for skin disease at Gadwala government hospital | Sakshi
Sakshi News home page

డాక్టర్ అవతారమెత్తిన గద్వాల ఆస్పత్రి వాచ్మెన్

Published Wed, Dec 25 2013 3:43 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM

Sweeper gives treatment to children for skin disease at Gadwala government hospital

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని గద్వాల ప్రభుత్వాసుపత్రిలో బుధవారం దారుణం చోటుచేసుకుంది.  డాక్టర్గా అవతారమెత్తిన గద్వాల ఏరియా ఆస్పత్రి వాచ్మెన్ ఇద్దరు చిన్నారులకు వైద్యం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.  చర్మవ్యాధితో బాధపడుతూ ఇద్దరు చిన్నారులు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వాచ్మెన్ వైద్యం  ఆ చిన్నారుల ప్రాణంమీదకు తెచ్చింది.

వైద్యుడు రాసిచ్చిన మందును చర్మానికి పూయకుండా.. ఆ మందును వాచ్మెన్ నేరుగా ఆ చిన్నారులతో  తాగించాడు. ఫార్మసిస్టు అందుబాటులో లేకపోవడంతో ఇద్దరు చిన్నారులకు వాచ్మెన్ చికిత్స చేసినట్టు తెలుస్తోంది. వైద్యం వికటించడంతో ఆ ఇద్దరు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement