హెల్దీ బాత్‌ | Always bathe with hot water to avoid skin infections | Sakshi
Sakshi News home page

హెల్దీ బాత్‌

Published Thu, Mar 14 2019 2:01 AM | Last Updated on Thu, Mar 14 2019 2:01 AM

Always bathe with hot water to avoid skin infections - Sakshi

ఐదు బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయం అందులో వందగ్రాముల తాజా పుదీనా ఆకులు వేసి మెత్తగా పేస్టు చేయాలి. పేస్టు చేయడానికి అవసరమైనంత గోరువెచ్చటి నీటిని వేయవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి ఆరిన తర్వాత వేడి నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మం నునుపుదనం, మెరుపు సంతరిచుకోవడంతోపాటు చర్మవ్యాధులను దూరం చేస్తుంది.

►స్నానం చేయడానికి పావుగంట ముందుగా మజ్జిగలో దూదిని ముంచి ఒంటికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మసౌందర్యంతో పాటు దేహ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఎండకు 
వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.

►తరచు స్కిన్‌ ఇన్‌ఫెక్షన్‌లు బాధిస్తుంటే ఒక లీటరు నీటిలో వేపాకులను వేసి మరిగించి ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి.

►ఒక బకెట్‌ నీటిలో మూడు స్పూన్ల తేనె కలుపుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా, నునుపుగా మారుతుంది.

►ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ కాలంలో చెమటతో దుర్వాసన వస్తుంటుంది. స్నానం చేసే నీటిలో ఒక టీ స్పూన్‌ పన్నీరు కలుపుకుంటే రోజంతా తాజాగా ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement