చవకైన పెర్‌ఫ్యూమ్స్ / సెంట్స్ వల్ల అలర్జీలు కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయనీ, వీటివల్ల కొన్ని రకాల అలర్జీలు, కాంటాక్ట్ డర్మటైటిస్, ఎగ్జిమా అనే చర్మ వ్యాధులు, మైగ్రేన్ వంటి తలనొప్పులు పెరుగుతున్నాయని ఇంగ్లాండ్‌లోని క్యాంటర్‌బరీ కెంట్ ఛాసర్ హాస్పిటల్‌కు చెందిన చర్మవైద్య నిపుణులు డాక్టర్ సుసానా బ్యారన్ హెచ్చరిస్తున్నారు. వాసనల వల్ల అలర్జీలతో పాటు అవి చర్మానికి తగలడం వల్ల కూడా అనేక రకాల చర్మవ్యాధులూ వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు.
కొంతకాలం కిందట యూరోపియన్ యూనియన్ సైంటిఫిక్ కమిటీ ఒక సర్వే చేసి, తక్షణం అలర్జీకి కారణమయ్యే అలర్జెన్‌ల జాబితాను రూపొందించే కార్యక్రమానికి పూనుకుంటుంది. ఈ క్రమంలో రకరకాల సబ్బులు, షాంపూలు, సెంట్లు సైతం అలర్జీలకు కారణమవుతున్నట్లు ఆ సర్వేలో తేలింది.
చవక రకం సెంట్ల వాసనలతో మైగ్రేన్ వంటి తలనొప్పుల కేసులూ విపరీతంగా పెరుగుతున్నాయంటూ యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ విన్సెంట్ మార్టిన్ అనే న్యూరాలజిస్ట్ సైతం పేర్కొంటున్నారు. వాటితో చాలా అప్రమత్తంగా ఉండాలంటూ డెర్మటాలజిస్టులు, న్యూరాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్స్ జాగ్రత్తలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment