బాదం పప్పు, జీడిపప్పు రెండు ఆర్యోగానికి మంచిది. ఈ రెండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు వద్దకు వచ్చేటప్పటికీ ఏదీ బెటర్ అనే సందేహం వస్తుంది. పైగా ఏదో ఒక్కటే ఎక్కువ తీసుకున్నా మంచిది కాదు. దీని వల్ల శరీరానికి అవసరమైన పోషకాలను కోల్పోతాం. ఈ రెండిటిలోనూ ఉండే కొవ్వులు, విటమిన్లు బరువును అదుపులో ఉంచుతాయి. ఇవి తీసుకుంటే తక్కువ ఆహారం తీసుకుంటాం. పైగా పొంట నిండిన ఫీలింగ్ ఉంటుంది. హెల్తీగా అనిపిస్తుంది కూడా. ముందుగా జీడిపప్పు, బాదంపప్పుల్లో ఏమేమీ ఉంటాయో సవివరంగా చూద్దాం!.
బాదంపప్పు..
ఇతర డ్రైఫ్రూట్స్‌తో పోలిస్తే బాదంపప్పులో అత్యధికంగా పీచు పదార్థాలు ఉంటాయి. ఔన్సుకు మూడు గ్రాములు పీచు పదార్థం ఉంటుంది. ఇందులో విటమిన్ 'ఈ' పుష్కలంగా ఉంటుంది. శక్తమంతమైన ఆంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అంతేగాక రోగనిరోధక శక్తిని పెంచే బ్యాక్టీరియాల స్థాయిలను కూడా పెంచుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం టైప్2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే రక్తంలో ఎల్‌డీఎల్ స్థాయిలను పెంచుతాయి. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
జీడిపప్పు..
తినేందుకు రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది మంచి స్నాక్స్ ఐటెమ్ కూడా ఉంటుంది. వెన్న, పాలకి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పరిమితం చేస్తుంది. ఎందుకంటే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్నందున డయాబెటిస్ రోగులకు కూడా ఇది మంచిదే. అలాగే ఇది రక్తంలోని ఎల్‌డీఎల్ కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
ఏది మంచిదంటే..
బాదం శరీరంలోని అదనప్పు కొవ్వుని తొలగించడంలో కీలకంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అమైనో యాసిడ్ ఎల్ అర్జినైన్‌లు పుష్కలంగా ఉంటాయి. అధిక బరువు తగ్గటం కోసం క్రమం తప్పకుండా బాదం తీసుకోవడం అనేది మంచి ఎంపిక అని చెబుతున్నారు. అయితే జీడిపప్పులో కొవ్వు ఎక్కువగా ఉన్నందున బరువు వద్దకు వచ్చేటప్పటికీ బాదంనే ప్రిఫర్ చేయమని చెబుతున్నారు. అలాగని బాదం తీసుకుంటే బరువు తపోతారని చెప్పేందుకు కచ్చితమై అధ్యయనాలు ఏవీ లేవన్నారు. జీడిపప్పులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తింటే ఎక్కువ సేపు నిండుగా ఉన్న ఫీల్ కలుగుతుంది. ఇందులో ఎక్కువ విటమిన్ కే, జింక్ వంటివి ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతో అవసరమైన విటిమిన్లు. అయితే బాదంలో ఫైబర్, విటమిన్ 'ఈ', కాల్షియం ఉన్నందున బరువు తగ్గడంలో తోడ్పడతాయని చెబుతున్నారు నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ డ్రై ఫ్రూట్స్‌ని ఆహారంలో చేర్చుకోవాలనుకుంటే మాత్రం నిపుణులు లేదా డైటీషియన్ల సలహాలు, సూచనలు తీసుకుని ఫాలో అవ్వడం మంచిది.
(చదవండి: కొరియన్ బ్యూటీ బ్రాండ్స్ వ్యవస్థాపకురాలిగా సత్తా చాటుతున్న టీచర్!)
Comments
Please login to add a commentAdd a comment