Cashew
-
వన్నెతగ్గిన జీడిపప్పు
వేటపాలెం: జీడిపప్పు తయారీ కేంద్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో జీడిపప్పు పరిశ్రమలు ప్రస్తుతం మూతపడే స్థితికి చేరాయి. విదేశాల నుంచి ముడి జీడిగింజల దిగుమతులు నిలిచిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. మనదేశం జీడి మామిడి ఉత్పత్తి, జీడిపప్పు ప్రాసెసింగ్, ఎగుమతుల్లో ప్రపంచంలోనే అగ్రగామి. ఇక్కడ నుంచే 65శాతం ఎగుమతులు జరుగుతున్నాయి.మనదేశంలోని ఫ్యాక్టరీలకు ఏటా 15–16 లక్షల టన్నుల ముడి జీడిగింజలను ప్రాసెస్ చేసి జీడిపప్పును ఎగుమతి చేసే సామర్థ్యం ఉంది. అయితే సగటు జీడిగింజల ఉత్పత్తి మాత్రం 7.28 లక్షల టన్నులు మాత్రమే ఉంది. దీంతో ఆఫ్రికా దేశాల నుంచి ముడి జీడిగింజలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వీటి ధర ఒక్కసారిగా పెరగడంతో దిగుమతులు తగ్గి, ముడిసరుకు అందక ఎగుమతులు క్షీణిస్తున్నాయి. దేశంలో జీడిగింజల ఉత్పత్తిలో మహారాష్ట్ర మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా, ఉత్పాదకతలో మాత్రం మొదటి స్థానంలో మహారాష్ట్ర, రెండో స్థానంలో పశ్చిమబెంగాల్, మూడో స్థానంలో కేరళ ఉన్నాయి. మన రాష్టంలో శ్రీకాకుళంలోని పలాస, కాశీబుగ్గ వీటికి ముఖ్య కేంద్రాలుగా చెప్పవచ్చు, తరువాత విశాఖప³ట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో జీడిపప్పు తయారీ పరిశ్రమలు ఉన్నాయి. గింజల ధరల్లో భారీ పెరుగుదలజీడిమామిడి పంట ఏటా మార్చి, ఏప్రిల్‌లో వస్తుంది. వ్యాపారులు ఈ నెలల్లో శ్రీకాకుళం, విజయనగరం, పలాసతో పాటు, ఇతర ఆఫ్రికన్ దేశాల నుంచి జీడి గింజలు కొనుగోలు చేస్తుంటారు. 2023 మార్చిలో రైతుల నుంచి వ్యాపారులు బస్తా గింజలు రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు కొనుగోలు చేయగా, ఈ ఏడాది మార్చిలో బస్తా రూ.9 వేలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం బస్తా ధర రూ.14 వేలకు చేరుకుంది. దీంతో జీడిపప్పు ధరలు కూడా పెంచాల్సి వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు. సంక్షోభంలో పరిశ్రమరాష్ట్రవ్యాప్తంగా జీడిపప్పు పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. ఓవైపు గత ఏడాది రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో జీడి పంట గణనీయంగా తగ్గింది. మరో పక్కన కేంద్ర ప్రభుత్వం జీడిగింజల దిగుమతి పై 9.05 శాతం పన్ను విధించింది. బస్తా జీడి గింజలు ప్రస్తుతం రూ.14 వేల ధర పెరిగింది. దీంతో కష్టాలు తప్పడం లేదని జీడిపప్పు వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కరువురాష్ట్రంలో పలాస, విజయనగరం, వేటపాలెం ప్రాంతాల్లో జీడిపప్పు పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు వందేళ్లకు పైగా ఈ పరిశ్రమలు ఉన్నా జీడిపప్పు ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి సంస్థను ఏర్పాటు చేయలేదు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల వ్యాపారులు ఇతర దేశాలకు జీడిపప్పును ఎగుమతి చేసుకోవడానికి ఆయా ప్రభుత్వాలు సంస్థలను ఏర్పాటు చేశాయి. వారంతా మన రాష్ట్రంలో తయారైన జీడిపప్పును కొనుగోలు చేసుకుని ఎగుమతు చేసి లాభాలు గడిస్తున్నారు. దీంతో జీడిపప్పు పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం కరువైందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగ్గుతున్న తోటల విస్తీర్ణంరాష్ట్రవ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు కోస్తా తీర ప్రాంతాల్లో 4.25లక్షల ఎకరాల్లో జీడి మామిడి తోటలున్నాయి. ఏటా జీడిగింజల ఉత్పత్తి 92 వేల మెట్రిక్ టన్నులు. ప్రతి ఎకరాకు సాలుసరి 350 కిలోలు దిగుబడి. అయితే కోస్తాతీరం వెంబడి గడిచిన 10 ఏళ్ల నుంచి జీడి మామిడి తోటలను నరికి వేసి రైతులు ఇతర పంటలు సాగు చేస్తుండటంతో దిగుబడి గణనీయంగా తగ్గింది.కొరత ఎక్కువగా ఉందిఈ ఏడాది జీడిమామిడి గింజల కొరత ఎక్కువగా ఉంది. పప్పు ధర బాగున్నా గింజలు లేక ఇబ్బంది పడుతున్నాం. ఈ ఏడాది పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. 30 శాతమే పండటంతో దాదాపు 70 శాతం గింజలను బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. విదేశాల నుంచి దిగుమతులు లేవు. – ప్రతి వెంకట సుబ్బారావు,జీడిపప్పు వ్యాపారి, వేటపాలెం, బాపట్ల జిల్లా -
జీడిపప్పు vs బాదం పప్పు: ఏది బెటర్?
బాదం పప్పు, జీడిపప్పు రెండు ఆర్యోగానికి మంచిది. ఈ రెండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు వద్దకు వచ్చేటప్పటికీ ఏదీ బెటర్ అనే సందేహం వస్తుంది. పైగా ఏదో ఒక్కటే ఎక్కువ తీసుకున్నా మంచిది కాదు. దీని వల్ల శరీరానికి అవసరమైన పోషకాలను కోల్పోతాం. ఈ రెండిటిలోనూ ఉండే కొవ్వులు, విటమిన్లు బరువును అదుపులో ఉంచుతాయి. ఇవి తీసుకుంటే తక్కువ ఆహారం తీసుకుంటాం. పైగా పొంట నిండిన ఫీలింగ్ ఉంటుంది. హెల్తీగా అనిపిస్తుంది కూడా. ముందుగా జీడిపప్పు, బాదంపప్పుల్లో ఏమేమీ ఉంటాయో సవివరంగా చూద్దాం!. బాదంపప్పు.. ఇతర డ్రైఫ్రూట్స్‌తో పోలిస్తే బాదంపప్పులో అత్యధికంగా పీచు పదార్థాలు ఉంటాయి. ఔన్సుకు మూడు గ్రాములు పీచు పదార్థం ఉంటుంది. ఇందులో విటమిన్ 'ఈ' పుష్కలంగా ఉంటుంది. శక్తమంతమైన ఆంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అంతేగాక రోగనిరోధక శక్తిని పెంచే బ్యాక్టీరియాల స్థాయిలను కూడా పెంచుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం టైప్2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే రక్తంలో ఎల్డీఎల్ స్థాయిలను పెంచుతాయి. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీడిపప్పు.. తినేందుకు రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది మంచి స్నాక్స్ ఐటెమ్ కూడా ఉంటుంది. వెన్న, పాలకి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పరిమితం చేస్తుంది. ఎందుకంటే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్నందున డయాబెటిస్ రోగులకు కూడా ఇది మంచిదే. అలాగే ఇది రక్తంలోని ఎల్డీఎల్ కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఏది మంచిదంటే.. బాదం శరీరంలోని అదనప్పు కొవ్వుని తొలగించడంలో కీలకంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అమైనో యాసిడ్ ఎల్ అర్జినైన్లు పుష్కలంగా ఉంటాయి. అధిక బరువు తగ్గటం కోసం క్రమం తప్పకుండా బాదం తీసుకోవడం అనేది మంచి ఎంపిక అని చెబుతున్నారు. అయితే జీడిపప్పులో కొవ్వు ఎక్కువగా ఉన్నందున బరువు వద్దకు వచ్చేటప్పటికీ బాదంనే ప్రిఫర్ చేయమని చెబుతున్నారు. అలాగని బాదం తీసుకుంటే బరువు తపోతారని చెప్పేందుకు కచ్చితమై అధ్యయనాలు ఏవీ లేవన్నారు. జీడిపప్పులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తింటే ఎక్కువ సేపు నిండుగా ఉన్న ఫీల్ కలుగుతుంది. ఇందులో ఎక్కువ విటమిన్ కే, జింక్ వంటివి ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతో అవసరమైన విటిమిన్లు. అయితే బాదంలో ఫైబర్, విటమిన్ 'ఈ', కాల్షియం ఉన్నందున బరువు తగ్గడంలో తోడ్పడతాయని చెబుతున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ డ్రై ఫ్రూట్స్‌ని ఆహారంలో చేర్చుకోవాలనుకుంటే మాత్రం నిపుణులు లేదా డైటీషియన్ల సలహాలు, సూచనలు తీసుకుని ఫాలో అవ్వడం మంచిది. (చదవండి: కొరియన్ బ్యూటీ బ్రాండ్స్ వ్యవస్థాపకురాలిగా సత్తా చాటుతున్న టీచర్!) -
దీపావళి పండుగకి ఈజీగా కాజు పిస్తా రోల్స్ చేసుకోండిలా!
కాజు పిస్తా చేయడానికి కావలసినవి: జీడిపప్పు – ఒకటిన్నర కప్పులు పిస్తా పప్పు – ఒకటిన్నర కప్పులు కండెన్స్డ్ మిల్క్ – ఒకటింబావు కప్పులు గ్రీన్ ఫుడ్ కలర్ – ఐదు చుక్కలు బటర్ – రెండు టేబుల్ స్పూన్లు పంచదార పొడి – కప్పు యాలకులపొడి – పావు టీస్పూను; తయారీ విధానం: జీడిపప్పును దోరగా వేయించి, మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ అయిన తరువాత జల్లెడపట్టి పొడిని తీసుకోవాలి. బాణలిలో వెన్న వేసి వేడెక్కనివ్వాలి. కరిగిన బటర్లో కండెన్స్డ్ మిల్క్ పోయాలి. నిమిషం పాటు పాలను కలుపుతూ ఉండాలి. తరువాత జీడిపప్పు పొడి వేయాలి. సన్నని మంటమీద తిప్పుతూ ఐదునిమిషాలు వేయించాలి. తరువాత దించేసి చల్లారనివ్వాలి. చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని జీడిపప్పు మిశ్రమాన్ని ముద్దలా కలిపి పెట్టుకోవాలి. ∙ఇప్పుడు పిస్తాపప్పుని దోరగా వేయించి మెత్తగా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని జల్లెడపట్టి మెత్తటి పొడిని తీసుకోవాలి. పిస్తా పొడిలో పంచదార పొడి, యాలకుల పొడి, ఫుడ్ కలర్ కొద్దిగా వేడి నీళ్లు చల్లుకుంటూ ముద్దలా కలపాలి. ఇప్పుడు జీడిపప్పు ముద్దను రెండు ముద్దలుగా చేసి, ఒక్కో ముద్దను మందపాటి చపాతీలా వత్తుకుని, కాస్త వెడల్పుగా ఉండేలా ముక్కలు కోయాలి. పిస్తా ముద్దను చిన్న ఉండలుగా చేసి, వీటిని పొడవాటి రోల్స్‌లా చుట్టుకోవాలి. జీడిపప్పు ముక్కపైన పిస్తా రోల్‌ను పెట్టి, జీడిపప్పు ముక్కను రోల్ చేయాలి. పిండి ముద్దను మొత్తాన్ని ఇలా రోల్ చేసి, పైన కుంకుమ పువ్వు, సిల్వర్ పేపర్‌తో గార్నిష్ చేస్తే కాజుపిస్తా రోల్స్ రెడీ. (చదవండి: రోజూ ఒక కప్పు 'టీ' తాగితే.. మధుమేహం ఉండదు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
జీడీపై ఈనాడు చీడరాతలు
-
భల్లూక కల్లోలం
వజ్రపుకొత్తూరు రూరల్: జంతువులు వనాల నుంచి జనాల మధ్యకు చేరుతున్నాయి. అటవీ ప్రాంతాలు కుచించుకుపోతుండడంతో వన్య మృగాలు ఆవాసాలను వెతుక్కుంటూ ఊళ్ల మీద పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఎలుగు బంట్లు ఇలాగే గ్రామాల్లోకి జొరబడుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యల్లో ఎలుగులు గుంపులు గుంపులుగా ఉద్దాన తీర ప్రాంత గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాత్రి వేళల్లో సైతం ఎలుగులు గ్రామ వీధుల్లో విచ్చల విడిగా సంచరిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ప్రధానంగా తమ జీవనాధారం అయిన జీడి పంట సాగు చేసేందుకు తోటలకు వెళ్లడానికి సైతం ప్రాణ భయంతో వెనుకంజ వేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు భయం..భయం జిల్లాలో ఉద్యానవనంగా ప్రత్యేక గుర్తింపు కలిగిన ఉద్దానానికి భల్లూకాల భయం వెంటాడుతోంది. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో గల వజ్రపుకొత్తూరు, పలాస, మందస, కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో దాదాపుగా 15 వేల హెక్టార్లలో జీడి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం జీడి పంట పూత దశలో ఉండటంతో రైతులు పంట రక్షణకు కంచె ఏర్పాట్లు, పురుగు మందులు పిచికారీతో పాటు ఇతర పనులు చేసేందుకు జీడి తోటలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఎలుగులు విచ్చల విడిగా తోటల్లో సంచరిస్తుండటంతో ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిళ్లు వీధుల్లో సంచారం ప్రధానంగా ఉద్దాన తీర ప్రాంతాలైన గుణుపల్లి, మెట్టూరు, చీపురుపల్లి, రాజాం అనకాపల్లి, బహడపల్లి, సిరిపురం, డోకులపాడు, బాతుపురం, అక్కుపల్లి, బైపల్లి, గరుడబద్ర, ఎం.గడూరు, పల్లిసారథి తదితర గ్రామాల్లో రాత్రి సమయంలో ఎలుగులు సంచరిస్తుండటంతో ప్రజలు ఆరుబయట అడుగు పెట్టేందుకు వణికిపోతున్నారు. అలాగే రోడ్డులపై ప్రయాణం చేయడానికి సైతం వాహనదారులు భయపడుతున్నారు. ఇప్పటికే అనేక మంది ఎలుగు దాడికి గురైన సంఘటనలు ఉద్దానంలో చోటు చేసుకున్నాయి. అలాగే అక్కుపల్లిలో ఓ దుకాణంలోకి, రాజాంలో అంగన్వాడీ కేంద్రంలోకి జొరబడి సరుకులు ధ్వంసం చేశాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎలుగులు సంచారాన్ని నియంత్రించాలని కోరుతున్నారు. తోటకు వెళ్లడానికి భయం వేస్తోంది కౌలుకు తీసుకున్న జీడి పంటను సాగు చేసేందుకు తోటకు వెళ్దామంటేనే భయం వేస్తోంది. నిత్యం ఎలుగులు తోటలో సంచరిస్తుండటంతో ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందో తెలీని పరిస్థితి ఉంది. జీవనాధారం అయిన జీడి పంటను విడిచి పెట్టలేక, సాగు చేయలేక అయోమయంగా ఉంది. – మడ్డు భూలక్ష్మి, జీడి కౌలు రైతు, డోకులపాడు, వజ్రపుకొత్తూరు మండలం. కవ్వింపు చర్యలు వద్దు.. ఎలుగుల సంచారంపై ఇప్పటికే గ్రామాల్లో అవగాహన చర్యలు చేపడుతున్నాం. తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరిస్తున్నాం. ఎలుగు కనబడినా.. ఎదురుపడినా కవ్వింపు చర్యలకు పాల్పడొద్దు. వాటిని రెచ్చగొట్టేలా ప్రవర్తించొద్దు. అరుపులు కేకలు వేస్తే భయాందోళనకు గురై మనిషి మీద దాడికి యత్నిస్తాయి. అలాగే రైతులు జీడి తోటలకు ఒంటరిగా వెళ్లొద్దు. తోటల్లోకి వెళ్లేటప్పడు రక్షణాయుధాలను, పనిముట్లను వెంట ఉంచుకోవడం తప్పనిసరి. – రజినీకాంత్, అటవీశాఖాధికారి, కాశీబుగ్గ -
నిన్నటి వరకు ఆ పండు పనికిరాదు.. ఆ ఒక్క నిర్ణయంతో ఇప్పుడు కాసులు కురిపిస్తోంది
నిన్నా మొన్నటి వరకు ఆ పండు ఎందుకూ పనికిరానిది. గింజకున్న విలువ పండుకు లేదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న చర్యలతో దానికీ మంచిరోజులొచ్చాయి. ఇప్పుడా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇలా దశ తిరిగిన జీడిమామిడి రైతుల కథాకమామిషు ఏమిటంటే.. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొత్తం 3.31 లక్షల ఎకరాల్లో జీడి మామిడి సాగవుతోంది. 90 శాతం పంట ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో సాగవుతోంది. పైసా విలువ కూడా చేయదని పిక్క తీసేసిన జీడి పండు చెత్తకుప్పల పాలయ్యేది. ఇలా ఎకరాకు 4 టన్నుల చొప్పున జీడి పండు వృధా అయ్యేది. కానీ, మూణ్నెల్ల క్రితం తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలానికి చెందిన ‘వైఎస్సార్ చేయూత’, ‘ఆసరా’ మహిళా లబ్ధిదారులు వినూత్నంగా ఆలోచించారు. జీడి మామిడి పండును ప్రాసెసింగ్ చేయడం ద్వారా జ్యూస్, సోడా, జామ్, పచ్చళ్లు తయారుచేసే ఓ కుటీర పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. అదే ఇప్పుడు రాష్ట్రంలో కోట్ల రూపాయల కొత్త సంపద సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న టానేజర్ అనే స్వచ్ఛంద సంస్థ వీరికి సాంకేతిక సహకారం అందించింది. దీంతో వీరంతా కలిసి రూ.18 లక్షల ఖర్చుతో కుటీర పరిశ్రమను ఏర్పాటు చేశారు. ముగ్గురు మహిళలు రైతుల నుంచి పండు సేకరించడంతో పాటు, ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఇలా దేశంలోనే మొట్టమొదటిసారి జీడి పండు నుంచి ఉప ఉత్పత్తులను తయారుచేసే ప్రక్రియకు ఇక్కడ బీజం పడింది. మొదటగా జ్యూస్, సోడాల తయారీ మొదలుపెట్టారు. వీటి అమ్మకాల ద్వారా ఈ మూడున్నర నెలల్లో రూ.3.68 లక్షల ఆదాయం పొందారు. వృధాగా పడేసే ఆ జీడి పండును గంగవరం మండలంలో 240 మంది జీడి మామిడి రైతుల నుంచి కిలో రూ.1.50–రూ.2 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దానిని ప్రాసెసింగ్ చేసి 15,400 యూనిట్ల జ్యూస్, సోడా బాటిళ్లను తయారుచేశారు. తద్వారా ఒక్కో జీడి మామిడి రైతుకు రూ.3 వేల చొప్పున అదనపు ఆదాయం రాగా.. మూడున్నర నెలల్లో నిర్వహణ ఖర్చులు పోను రూ.లక్ష నికర ఆదాయాన్ని మహిళలు పొందారు. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల ద్వారా శాశ్వత జీవనోపాధి కోసం 23లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరందరికీ విడతల వారీగా ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు ప్రభుత్వమే అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తుంది. ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న వ్యాపార సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వడంతో పాటు మార్కెటింగ్‌లోనూ సహకరిస్తుంది. అవసరమైతే బ్యాంకుల ద్వారా అదనపు రుణ సదుపాయం కల్పిస్తున్నాం. ఆర్గానిక్ బట్టల తయారీ, చిరుధాన్యాల మార్కెటింగ్‌లో కొత్త అవకాశాలు కల్పించేందుకు ఆలోచిస్తున్నాం. ఇందుకోసం వాల్‌మార్ట్ వంటి సంస్థలతో ఒప్పందానికి సర్కారు పరిశీలిస్తోంది. – ఇంతియాజ్, సెర్ప్ సీఈవో 600 కేజీల పండు ద్వారా అదనపు ఆదాయం మా పొలంలోని జీడి మామిడి పండ్లు సుమారు 600 కేజీలను విక్రయించడంవల్ల ఈ ఏడాది రూ.1,200లు అదనపు ఆదాయం లభించింది. అలాగే, ఇందుకు సంబంధించిన కర్మాగారంలో హెల్పర్‌గా పనిచేయడంవల్ల అదనంగా నెలకు రూ.7,000 జీతంగా లభిస్తోంది. – వై. రాణి, పావని స్వయం సహాయ సంఘం సభ్యురాలు జీడిమామిడి రైతులకు ఎంతో మేలు జీడిమామిడి పండ్ల రసంతో ఆపిల్ సోడా, ఆపిల్ సిరప్ తయారుచేసే యూనిట్ నెలకొల్పేందుకు సెర్ప్, టానేజర్ సంస్థ ప్రతినిధులు ఎంతో కృషిచేశారు. ఏజెన్సీలో జీడిమామిడి సాగుచేసే గిరిజన రైతులకు ఆర్థికంగా మరింత ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ఉత్పత్తిని మార్కెటింగ్ చేసేందుకు వారపు సంతల్లో అవగాహన కల్పిస్తున్నాం – కంగల అబ్బాయిదొర, ఎఫ్‌పీఓ, అధ్యక్షులు, గంగవరం మండలం వివిధ వ్యాపారాల్లో 7.17లక్షల మంది పెట్టుబడి ఇక రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజికవర్గాల్లో 45–60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.75 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 24 లక్షల మంది లబ్ధిదారులకు రెండు విడతల్లో రూ.8,839 కోట్లు ఇప్పటికే ప్రభుత్వం లబ్ధిచేకూర్చింది. ఇదే సమయంలో వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా కూడా రెండేళ్లలో దాదాపు రూ.12,800 కోట్ల మొత్తాన్ని పొదుపు సంఘాల మహిళలకు అందజేశారు. మహిళలు ఈ ప్రయోజనాలను ఉపయోగించుకుని 2020–21లో 2.68 లక్షల మంది వివిధ వ్యాపార, జీవనోపాధులు ఏర్పర్చుకున్నారు. వీరిలో 78 వేల మంది కిరాణా దుకాణాలు పెట్టుకుని నెలకు రూ.5 వేల అదనపు ఆదాయం పొందగా.. 1.19 లక్షల మంది ఆవులు, గేదెలను కొనుగోలు చేస్తే, 70 వేల మంది గొర్రెలు మేకలను కొనుగోలు చేశారు. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా లబ్ధిదారులకు మరో రూ.1,510 కోట్లు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని కల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 4.49 లక్షల మందికి వ్యాపార, జీవనోపాధులు పెంపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటికే 1.06 లక్షల మందికి తోడ్పాటు అందించింది. వంద కోట్ల అదనపు ఆదాయం గంగవరం కుటీర పరిశ్రమ ద్వారా తయారైన ఉత్పత్తుల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపుతుండడంతో ఈ ప్రాంతంలో ఈ తరహా చిన్న, పెద్ద పరిశ్రమల స్థాపనకు వీలు ఏర్పడినట్లయింది. రానున్న రోజుల్లో ఈ తరహా పరిశ్రమల సంఖ్య పెరిగి రైతులందరి నుంచి పండు కొనుగోలు చేసే పరిస్థితి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా రైతులకే ఏటా రూ.100 కోట్ల వరకు అదనపు ఆదాయం దక్కే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు.. ఈ తరహా పరిశ్రమల ఏర్పాటుతో లక్షలాది మంది యువతకు, మహిళలకు ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగవుతాయన్నారు. -
Cashew: ‘పశ్చిమ’ జీడిపప్పుకు విశేష ఆదరణ
జిల్లాలో జీడిపప్పు పరిశ్రమ విస్తరిస్తోంది. ఇసుక నేలలు, మెట్ట భూముల్లో సాగవుతున్న జీడితోటల నుంచి వచ్చే పంట నాణ్యంగా ఉండటంతో ఇక్కడి జీడిపప్పు రుచిగా ఉంటోంది. జిల్లాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు జీడి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో ‘పశ్చిమ’ జీడిపప్పుకు మంచి గిరాకీ ఉంది. దేవరపల్లి: జీడిపప్పు తయారీలో పశ్చిమగోదావరి జిల్లా గుర్తింపు పొందింది. మెట్ట ప్రాంతంలో జీడిపప్పు తయారీ ఎక్కువగా ఉంది. దేవరపల్లి, దూబచర్ల, తాడిమళ్ల ప్రాంతాల్లో జీడిపప్పు పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. దాదాపు 15 ఏళ్లుగా ఈ ప్రాంతం నుంచి జీడిపప్పు ఎగుమతులు జరుగుతున్నాయి. రోజుకు 40 టన్నుల వరకు జీడిపప్పు ఎగుమతి అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో జీడిపప్పు తయారీ కుటీర పరిశ్రమగా ఉంది. పరిశ్రమల ద్వారా ఎందరో కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఎక్కువగా మహిళలకు ఉపాధి లభిస్తోంది. ఇళ్ల వద్ద మహిళలు జీడిపప్పు తయారు చేసి ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమలో తయారు చేసిన జీడిపప్పును మహిళలు ఇళ్లకు తెచ్చుకుని పప్పుపై ఉన్న పొట్టును తొలగించి, శుభ్రం చేసి తిరిగి పరిశ్రమకు అప్పగిస్తారు. ఇలా రోజుకు ఒక్కో మహిళ 20 నుంచి 25 కిలోల పప్పును శుభ్రం చేస్తారు. దీని ద్వారా రూ.250 వరకు సంపాదిస్తున్నారు. జిల్లాలోని జీడి పరిశ్రమల్లో సుమారు 3 వేల మంది వరకు పనిచేస్తున్నారు. ఒక్కో పరిశ్రమలో స్థాయిని బట్టి 70 మంది వరకు పనిచేస్తున్నారు. 100 వరకు పరిశ్రమలు ► జిల్లాలో జీడిపప్పు పరిశ్రమలు 100 వరకు ఉన్నాయి. ► వీటిలో 50 పరిశ్రమలు పెద్దవి కాగా మిగిలినవి చిన్నవి. ► దేవరపల్లిలో 10, దూబచర్లలో 8, తాడిమళ్లలో 25 వరకు పరిశ్రమలు ఉన్నాయి. ► జీడిగింజ నుంచి ఐదు రకాల పప్పును ఉత్పత్తి చేస్తున్నారు. ► గుండు, బద్దతో పాటు మూడు రకాల ముక్కను తీస్తున్నారు. ► గుండు, బద్ద ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ► కె.ముక్క (బద్దలో సగం)కు ఎక్కువ డిమాండ్ ఉంది. ► పప్పుతో పాటు పొట్టు, తొక్కలకు కూడా గిరాకీ ఉంది. ► జిల్లాలోని మెట్ట ప్రాంతంలో సుమారు 25 వేల ఎకరాల్లో జీడిమామిడి పంట సాగు ఉంది. ముక్కకు డిమాండ్ గుండు, బద్ద కంటే ముక్కకు డిమాండ్ బాగా ఉంది. కోవిడ్ నిబంధనలు సడలింపులతో ముక్క గిరాకీ పెరిగింది. హోటల్స్‌లో ముక్క ఎక్కువగా వినియోగిస్తారు. బస్తా గింజలకు సుమారు 3 కిలోల ముక్క వస్తుంది. రెండేళ్లుగా కోవిడ్‌తో పరిశ్రమల ఒడుదుడుకులతో సాగుతోంది. జిల్లాలో పండుతున్న జీడిమామిడికి నాణ్యత ఎక్కువ. దీంతో పప్పు రుచిగా, నాణ్యంగా ఉండటంతో మార్కెట్లో ఆదరణ బాగుంది. –పెంజర్ల గణేష్‌కుమార్, కార్యదర్శి, కాజూనట్ మర్చంట్స్ అసోసియేషన్, దేవరపల్లి తయారీ ఇలా.. చెట్టు నుంచి జీడి గింజలను సేకరించిన రైతులు వ్యాపారులకు విక్రయిస్తారు. వ్యాపారులు గింజలను పరిశ్రమలకు తరలిస్తారు. అక్కడ గింజలను బాయిలర్‌లో కాల్చి యంత్రాల ద్వారా బద్దలు చేసి గుండును తీస్తారు. గుండుపై ఉన్న పొర (పొట్టు)ను కూలీల ద్వారా తొలగించి బద్ద, గుండు, ముక్క తయారు చేస్తారు. ఐదు రకాలుగా పప్పును తయారు చేసి కిలో చొప్పున ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తారు. బస్తా (80 కిలోలు) గింజల నుంచి 22 నుంచి 24 కిలోల వరకు పప్పు వస్తుంది. బస్తా జీడిగింజల ధర రూ.10,400 ఉంది. -
ఉద్దానం జీవనాడి.. జీడి
వజ్రపుకొత్తూరు: ఉద్దానం పేరు చెబితే గుర్తుకువచ్చేవి రెండే రెండు. ఒకటి కొబ్బరి, రెండు జీడి. 1945కు ముందు నుంచే ఇక్కడ జీడి ఆధిపత్యం చూపడం మొదలుపెట్టింది. ఇక్కడ రైతాంగానికి జీడి జీవ నాడి. ఉద్దానంలో పండే జీడిపిక్కలు నాణ్యమైనవి. ఉత్పత్తి చేసే పప్పు పలుకు సైజు, లెక్కనుబట్టి నాణ్యత నిర్ణయిస్తారు. అత్యంత నాణ్యత కలిగిన జంబో క్వాలిటీ స్థానికంగా దొరకదు. ఉత్పత్తి అయిన మొత్తంలో జంబో జీడి పప్పు జాతీయ స్థాయిలో ఎగుమతి చేస్తారు. అమెరికన్ మార్కెట్లో 454 గ్రాములను ఒక పౌను అంటారు. ఒక పౌను జీడి పప్పు తూకం వేయగా వచ్చిన కౌంటు ప్రకారం వాటి నాణ్యతను నిర్ణయిస్తారు. అందులో భాగంగా జీడి పప్పును 16 రకాలుగా విభజిచారు. మొదటిది 180 రకం అంటే 180 గుడ్లు(పలుకులు). దీని ధర డిమాండ్ సమయంలో రూ.980 వరకు పలుకగా ప్రస్తుతం రూ.740గా ఉంది. ఈ రకంను ఎగుమతికి మాత్రమే సిద్ధం చేస్తారు. స్థానికంగా దొరకదు. కోల్కత్తా, ముంబాయి, డిల్లీ, మద్రా సు, చత్తీస్‌గఢ్, ప్రాంతాలకు టిన్, పౌచ్‌ల రూపంలో ఎగుమతి చేస్తారు. ఇక పోతే 210 రకం ఇందులో కిలోకు 210 గుడ్లు తూకం వేస్తారు. ఇది ఎక్కువగా ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ఇలా గుడ్లు బట్టి 240, 320, 400 రకాలను వివిధ ధరల్లో విక్రయిస్తారు. జేహెచ్ రకం అంటే బద్ద (గుడ్డులో సగం పలుకు) దీన్ని తిరుపతి శ్రీవారీ లడ్డూ ప్రసాదంలో వినియోగిస్తారు. ఇది కాకుండా డబుల్ నంబర్ వన్, స్టాండర్డు బట్స్, జేహెచ్, కేఎల్ డబ్ల్యూపి, పీసెస్, ఎస్.ఎస్.డబ్ల్యూ, డి. డబ్ల్యూ, బి.బి, ఎస్.డబ్యూ.పీ, డీసీ తదితర రకాలు ఉన్నాయి. కుండల్లో కాల్చి(రోస్టింగ్) వలిచే జీడి పప్పుకు డిమాండ్ ఎక్కువ. ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి కొత్తూరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వసప అనే ఊరొకటి ఉంది. కేవలం ఎనిమిది వందల మందే ఉంటారు. కానీ నిరంత రం ఆ ఊరికి వ్యాన్లు, బైకుల మీద చాలా మంది వస్తుంటా రు. కారణం చికెన్ బిర్యానీ.. అవును వసపలో వెంకటరావు అనే వ్యక్తి తయారు చేసే బిర్యానీని లొట్టలేసుకుని మరీ తింటా రు. శ్రీకాకుళం, ఆమదాలవల స, పాలకొండతో పాటు ఒడిశా లోని పర్లాకిమిడి, కాశీనగర్, గుణుపూర్ నుంచి కూడా ఎంతో మంది కేవలం బిర్యానీ తీసుకెళ్లడానికే ఈ ఊరికొస్తుంటారు. గ్రామానికి చెందిన కె.వెంకటరావు ఉపాధి కోసం హైదరబాద్ వెళ్లి అక్కడ బిర్యానీ తయారు చేయడం చేర్చకుని అనంతరం ఇక్కడే హొటల్ పెట్టారు. బిర్యానీ రుచి అదిరిపోవడంతో చుట్టుపక్కల వారంతా ఫిదా అయిపోయారు. పిక్నిక్ సీజన్లలో ఒక రోజు ముందు ఆర్డర్ ఇస్తే గానీ బిర్యానీ దొరకదు. అధికారులు కూడా ప్రత్యేక సందర్భాల్లో ఇక్కడి నుంచే బిర్యానీ తీసుకెళ్తుంటారు. -
కళ్ల ముందే కష్టం బూడిద
ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం–కవిటి మండలాల సరిహద్దుల్లో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో డొంకూరు, లక్ష్మీపురం, సీమూరు నెలవంక పరిధిలోని 50 ఎకరాల జీడితోట సోమవారం అగి్నకి ఆహుతైంది. ఈ గ్రామాల పరిధిలో పాతిక మంది రైతులు జీడి, మొగలి, సరుగుడు, నీలగిరి తోటలు సాగు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉన్నట్టుండి తోటలో మంటలు చెలరేగడంతో నిమిషాల వ్యవధిలో అగ్నికీలలు 50 ఎకరాలకు వ్యాపించాయి. తోటలు గ్రామాలకు దూరంగా ఉండడంతో ప్రమాదాన్ని పసిగట్టి అక్కడకు వెళ్లే సరికే ఘోరం జరిగిపోయింది. కాలిపోయిన పంటలను చూసి రైతులు కన్నీరుమున్నీరయ్యారు. అటవీ శాఖకు సంబంధించి సరుగుడు తోటకు కూడా కొంత మేర నష్టం వాటిల్లింది. కాలిపోయిన తోటల్లో 40 ఎకరాలు తమకు చెందిందే ఉందని డొంకూరు గ్రామానికి చెందిన రైతులు లబోదిబోమంటున్నారు. -
అనుగ్రహానికి అన్నం నైవేద్యం
అమ్మ అంటేనే అనుగ్రహించేది అని అర్థం. దుర్గమ్మ తల్లి తన భక్తులను బిడ్డలుగా భావించి సదా అనుగ్రహిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ పిల్లలు తమ సంతృప్తి కోసం తల్లికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా పెడుతుంటారు. ఆపై ప్రసాదంగా స్వీకరిస్తారు. నవరాత్రుల సందర్భంగా బియ్యంతో చేసే ఈ నైవేద్యాలను చేయండి. అనుగ్రహాన్ని పొందండి. పరమాన్నం కావలసినవి: బియ్యం – కప్పు; పంచదార – 4 కప్పులు; పాలు – 2 కప్పులు; నెయ్యి – టేబుల్ స్పూను; జీడిపప్పు – 10; కిస్మిస్ – గుప్పెడు; కొబ్బరి తురుము – పావు కప్పు; ఏలకుల పొడి – అర టీస్పూను. తయారి: ►బియ్యం శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి ►పాలు స్టౌ మీద పెట్టి, మరుగుతుండగా అందులో బియ్యం పోసి బాగా కలపాలి ►బాగా ఉడికిన తరువాత పంచదార వేసి కలిపి కొద్దిసేపు స్టౌ మీదే ఉంచాలి ►బాణలిలో నెయ్యి వేసి కాగాక జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి తీసేయాలి ►ఉడుకుతున్న పరమాన్నంలో పచ్చి కొబ్బరి తురుము, వేయించిన జీడిపప్పు, కిస్మిస్లను వేసి బాగా కలపాలి ►ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించేయాలి ►ఈ ప్రసాదం తింటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి ఆశీర్వదించినట్లే. బెల్లం అన్నం కావలసినవి: బియ్యం – కప్పు; బెల్లం పొడి – కప్పున్నర; నెయ్యి – టేబుల్ స్పూను; కొబ్బరి ముక్కలు – అర కప్పు (నేతిలో వేయించాలి); పచ్చ కర్పూరం – టీ స్పూను; ఏలకుల పొడి – అర టీ స్పూను. తయారి: ►ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి రెండున్నర కప్పుల నీళ్లు జత చేసి ఉడికించాలి ►అన్నం పూర్తిగా ఉడికిన తరువాత బెల్లం పొడి వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి ►ఏలకుల పొడి వేసి బాగా కలపాలి ►నెయ్యి, వేయించిన కొబ్బరి ముక్కలు, పచ్చ కర్పూరం వేసి బాగా కలిపి దించేయాలి ►వేడివేడిగా తింటుంటే సాక్షాత్తు మహిషాసుర మర్దని ప్రత్యక్షం కావలసిందే. కదంబం కావలసినవి: బాస్మతి బియ్యం – రెండు కప్పులు; క్యారట్, బీన్స్, పచ్చి బఠాణీ, క్యాప్సికమ్, ఉల్లికాడలు, ఉల్లిపాయలు, బంగాళ దుంప, మెంతి కూర, పుదీనా – అన్ని ముక్కలు కలిపి ఒక కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4; ఏలకులు – 2; లవంగాలు – 2; దాల్చినచెక్క – చిన్న ముక్క; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – చిన్న కట్ట; ఉప్పు – తగినంత; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; జీడి పప్పు – గుప్పెడు; కిస్మిస్ – టేబుల్ స్పూను; దానిమ్మ గింజలు – టేబుల్ స్పూను. తయారి: ►ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి నాలుగు కప్పుల నీళ్లు పోసి ఉడికించి పక్కన ఉంచాలి ►బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వరుసగా వేసి కొద్దిగా వేయించాలి ►తరిగి ఉంచుకున్న కూర ముక్కలు, కరివేపాకు వేసి పచ్చి పోయేవరకు వేయించి తీసేయాలి ►ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి విడివిడిలాడేలా చేయాలి ►కూర ముక్కలు, ఉప్పు వేసి కలపాలి ►జీడి పప్పు, కిస్మిస్, దానిమ్మ గింజలు జత చేసి బాగా కలపాలి ►కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి ►ఉల్లి రైతా కాంబినేషన్లో తింటే శాకంభరీదేవి ప్రత్యక్షం కావలసిందే. పెసర పొడి పులిహోర కావలసినవి: పెసర పప్పు – 4 టీ స్పూన్లు; అన్నం – 2 కప్పులు; ఎండు మిర్చి – 3 + 3; పసుపు – కొద్దిగా; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను + ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; పల్లీలు – రెండు టేబుల్ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 4; కరివేపాకు – 2 రెబ్బలు; ఉప్పు – తగినంత. తయారి: ►స్టౌ మీద బాణలిలో పెసరపప్పు వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి ►అదే బాణలిలో ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి ►చల్లారాక అందులో సరిపడా ఉప్పు, జీలకర్ర ఇంగువ వేసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి ►రెండు కప్పుల అన్నాన్ని ఒక పాత్రలోకి తీసుకుని ఇందులో నాలుగు టీ స్పూన్ల పెసర పొడి, ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక స్పూను నూనె వేసి కలపాలి ►స్టౌ మీద బాణలిలో పులిహోర పోపు కోసం నూనె వేసి కాగాక, అందులో ఘుమఘుమలాడేలా ఇంగువ, పచ్చి సెనగ పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి ►పెసర పొడి వేసిన అన్నానికి పోపు జత చేయాలి ►అంతా ఒకసారి బాగా కలియబెడితే పెసర పొడి పులిహోర రెడీ. పెరుగన్నం లేదా దద్ధ్యోదనం కావలసినవి: బియ్యం – రెండు కప్పులు; అల్లం – చిన్న ముక్క; పచ్చి మిర్చి – 10; ఎండు మిర్చి – 5; సెనగ పప్పు – టీ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – చిన్న కట్ట; దానిమ్మ గింజలు – టేబుల్ స్పూను; చిన్న ద్రాక్ష లేదా కిస్మిస్ ద్రాక్ష – కప్పు; చెర్రీ ముక్కలు – టీ స్పూను; టూటీ ఫ్రూటీ ముక్కలు – టీ స్పూను; జీడి పప్పులు – 10; నెయ్యి – టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత తయారీ: ►ముందుగా బియ్యం కడిగి నీళ్లు ఒంపేసి, ఐదు కప్పుల నీరు జత చేసి ఉడికించాలి ►అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా దంచి పక్కన ఉంచాలి ►బాణలిలో నెయ్యి వేసి కాగాక పచ్చి సెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి ►ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి, అందులో వేయించిన పోపు సామాను వేసి బాగా కలపాలి ►తగినంత ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ►చివరగా దానిమ్మ గింజలు, దానిమ్మ గింజలు చిన్న ద్రాక్ష లేదా కిస్మిస్ ద్రాక్ష, చెర్రీ ముక్కలు, టూటీ ఫ్రూటీ ముక్కలు, జీడి పప్పులు వేసి బాగా కలపాలి ►పుల్లగా ఉండే నిమ్మకాయ ఊరగాయతో అందిస్తే ప్రసాదాన్ని కూడా అన్నంలా తినేస్తారు. ఉప్పు పొంగలి లేదా కట్ పొంగల్ కావలసినవిః బియ్యం – కప్పు; పెసర పప్పు – కప్పు; జీలకర్ర – టీ స్పూను; మిరియాల పొడి – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – తగినంత; నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు – గుప్పెడు. తయారి: ►ముందుగా ఒక గిన్నెలో బియ్యం, పెసర పప్పు వేసి నీళ్లతో బాగా కడిగి నీరు ఒంపేయాలి ►ఆరు కప్పుల నీరు జత చేసి, కుకర్‌లో ఉంచి, నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►బాణలిలో నెయ్యి వేసి కరిగాక ముందుగా జీలకర్ర వేసి చిటపటలాడించాలి ►మిరియాల పొడి వేసి వేగుతుండగానే, జీడిపప్పు వేసి బాగా వేయించాలి ►కరివేపాకు వేసి వేయించి వెంటనే దించేయాలి ►ఉడికించుకున్న బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని గరిటెతో మెత్తగా మెదిపి, ఉప్పు జత చేయాలి ►నేతిలో వేయించి ఉంచుకున్న పదార్థాలను వేసి బాగా కలిపి వేడివేడిగా వడ్డించాలి ►అల్లం పచ్చడి, కొబ్బరి చట్నీల కాంబినేషన్‌తో ఈ ప్రసాదానికి రెట్టింపు రుచి వస్తుంది. పులిహోర కావలసినవి: బియ్యం – 4 కప్పులు; చింత పండు – 100 గ్రా.; పచ్చి సెనగ పప్పు – టేబుల్ స్పూను; మినప్పప్పు – టేబుల్ స్పూను; ఆవాలు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 15; పచ్చి మిర్చి – 10; కరివేపాకు – 4 రెమ్మలు; వేయించిన పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు; నువ్వుల పొడి – 2 టేబుల్ స్పూన్లు (నువ్వులు వేయించి పొడికొట్టాలి); జీడి పప్పులు – 15; నూనె – 100 గ్రా.; ఇంగువ – టీ స్పూను; పసుపు – టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారి: ►ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి, నీరు ఒంపేసి, తగినన్ని నీళ్లు జత చేసి బియ్యం ఉడికించాలి ►ఉడికిన అన్నాన్ని వేడిగా ఉండగానే ఒక పెద్ద పళ్లెంలోకి తిరగబోసి, గరిటెతో పొడిపొడిగా అయ్యేలా కలపాలి ►ఒక గిన్నెలో చింతపండులో తగినంత నీరు పోసి నానబెట్టి, రసం తీసి పక్కన ఉంచుకోవాలి ►బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వరుసగా వేసి దోరగా వేయించాలి ►చింతపండు పులుసు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి, ఉడికించి దించేయాలి ►అన్నంలో చింతపండు రసం, పోపు మిశ్రమం వేసి బాగా కలపాలి ►నువ్వుల పొడి, పల్లీలు, జీడి పప్పులు వేసి బాగా కలిపి సుమారు గంటసేపు ఊరిన తరవాత తింటే ప్రసాదాన్ని రుచిగా ఆస్వాదించవచ్చు. కొబ్బరి అన్నం కావలసినవి: బియ్యం – 2 కప్పులు; కొబ్బరి తురుము – 2 కప్పులు; పచ్చి మిర్చి – 10; పచ్చి సెనగపప్పు – టేబుల్ స్పూను; మినప్పప్పు – టేబుల్ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; ఎండు మిర్చి – 6; పల్లీలు – టేబుల్ స్పూను (వేయించినవి); అల్లం ముక్కలు – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; జీడి పప్పు – గుప్పెడు (నేతిలో వేయించాలి); నెయ్యి – టేబుల్ స్పూను; నిమ్మకాయ – 1; ఉప్పు – తగినంత; నూనె – టేబుల్ స్పూను; కొత్తిమీర – కొద్దిగా తయారి: ►బియ్యం శుభ్రంగా కడిగి, 3 కప్పుల నీళ్లు జత చేసి ఉడికించాలి ►అన్నం వేడిగా ఉండగానే పెద్ద పళ్లెంలో వేసి విడివిడిలాడేలా కలపాలి ►బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ►కొబ్బరి జత చేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాక, ఉప్పు వేసి కలపాలి ►అన్నం జత చేసి బాగా కలిపి, దించే ముందు నిమ్మ రసం పిండాలి ►వేయించిన పల్లీలు, నేతిలో వేయించిన జీడిపప్పులు వేసి బాగా కలపాలి ►కొత్తిమీరతో అందంగా అలంకరించితే నోరూరించే కొబ్బరి అన్నం ప్రసాదం తినడం కోసం తొందరపడక తప్పదు. – నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ -
జీడిపప్పుకు ఆశపడి..
టీనగర్ : జీడి పప్పు బస్తాలు ఇస్తానని చెప్పి రూ. 50 వేల నగదు, బంగారు చైన్‌ను అపహరించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై రాయపేట అవ్వై శన్బుగం రోడ్డులో ఈరోడ్డుకు చెందిన వెంకటేష్(42) జీడీ పప్పు దుకాణం నడుపుతున్నాడు. ఈ నెల 15న ఉదయం 10 గంటల సమయంలో అతనికి ఒక ఫోన్‌కాల్ వచ్చింది. అందులో మాట్లాడిన వ్యక్తి తన పేరు ఆనంద్ అని పరిచయం చేసుకున్నాడు. జీడి పప్పు హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్నట్లు, రూ. 35 వేలు అడ్వాన్స్‌గా అందజేస్తే 300 కిలోల జీడి పప్పు ఇస్తానని, మిగతా నగదు తర్వాత ఇస్తానని తెలిపాడు. దీన్ని నమ్మిన వెంకటేష్, అతని స్నేహితుడు బాలాజీని దీని గురించి అడిగాడు. ఈ నెల 15వ తేది అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాలాజీ దుకాణానికి వెంకటేశ్ వెళ్లాడు. అక్కడ బాలాజీ, ఆనందన్ తనకు తెలిసిన వ్యక్తేనని, నగదు ఇచ్చి వెళ్లమని తెలిపాడు. అందుకు వెంకటేష్ తన వద్ద నగదు లేదని చెప్తుండగానే హఠాత్తుగా అతను వెంకటేష్‌ను బెదిరించి, అతని వద్దనున్న ఏటీఎం కార్డు, పిన్ నెంబర్‌ను తీసుకున్నాడు. తర్వాత బెదిరించిన వ్యక్తి అక్కడున్న ఏటీఎం నుంచి రూ. 50 వేలు తీసుకున్నాడు. వెంకటేష్ ధరించిన బంగారు చైన్‌ను లాక్కుని పరారయ్యాడు. జరిగిన విషయం గురించి కొత్వాల్‌చావడి పోలీసు స్టేషన్లో వెంకటేష్ ఫిర్యాదు చేశాడు. -
జీడితోటలు దగ్ధం
శ్రీకాకుళం, వజ్రపుకొత్తూరు: మండలంలో పెద్దమురహరిపురం గ్రామంలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో జీడితోటలు దగ్ధమైయ్యాయి. పీఎంపురం, రెయ్యిపాడు గ్రామాల మధ్య దట్టమైన పొగలతో కూడిన మంటలు ఎగసి పడటాన్ని గమనించిన రెయ్యిపాడు, పీఎంపురం గ్రామస్తులు పలాస అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదంలో పీఎంపురం గ్రామంలోని కె.గంగయ్యకు చెందిన జీడి తోటతో పాటు మరికొంత మంది రైతుల తోటలు దాదాపు రెండు ఎకరాలు పూర్తిగా కాలిపోయి బూడిదైయ్యాయని స్థానికులు చెప్పా రు. రూ.3 లక్షల వరకు రైతులకు నష్టం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. హుటాహుటీన వచ్చిన అగ్నిమాపక సిబ్బంది రాత్రి 8 గంటల వరకు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఇతర రైతుల తోటలకు మంటలు విజృంభించకుండా ఫైరింగ్ గ్యాప్స్ ఏర్పాటు చేశారు. ఇటీవల తిత్లీ తుఫాన్ కారణంగా నేలకొరిగిన జీడి చెట్లు ఎండకు బాగా ఎండిపోయి ఉండడంతో తోటలు బాగు చేసే క్రమంలో స్థానిక రైతులు ఎవరో మంటల పెట్టడంతో అగ్ని కీలలు తోటలంతా వ్యాపించి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున మం టలు ఎగసి పడడంతో సమీపంలో ఉన్న తోట లకు చెందిన రైతులు ఆందోళన చెందారు. దాదాపు 300 ఎకరాల్లో అక్కడ నేలకొరిగిన జీడి తోటలు ఉన్నాయి. అవన్నీ ఎండువి కావడంతో మంటలు వ్యాపిస్తే భారీ నష్టంతో పాటు పెను ప్రమాదం జరిగి ఉండేదని భయభ్రాంతులకు గురైయ్యారు. మంటలు అదుపులోకి తేవడంతో అటు రెయ్యిపాడు, ఇటు పీఎంపురంనకు చెందిన రైతులు ఊపిరి పీల్చుకున్నారు. మం టలు ఎగసి పడిన ప్రాంతాన్ని ఎంపీపీ జి.వసంతరావు, పీఎంపురం గ్రామాభివృద్ధి సంఘం అధ్యక్షుడు కె.గోపాల్, గ్రామపెద్దలు తదితరులు పరిశీలించారు. -
ఇడ్లీ విత్ కాజూ చట్నీ అండ్ గన్ పౌడర్
ఇడ్లీని చట్నీతో నంచుకుని తినడం దక్షిణ భారతేదశంలో సంప్రదాయంగా వస్తోంది. వీటిని తయారుచేసి అలంకరించడంలో వైవిధ్యాలు ఉన్నాయి. మా అత్తగారు తయారుచేసే మదరాసీ గన్‌పౌడర్ గురించి వివరించాలనుకుంటున్నాను. ఇందుకోసం రవ్వ ఇడ్లీ మిశ్రమం (20 ఇడ్లీలకు సరిపడా) సిద్ధం చేసుకోవడానికి కావలసినవి... బొంబాయి రవ్వ 100 గ్రా., పెరుగు 5 టేబుల్ స్పూన్లు, అర టీ స్పూను బేకింగ్ పౌడర్, రుచికి తగినంత ఉప్పు, 30 మి.లీ. నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ వేయించిన జీడిపప్పు పలుకులు, ఇడ్లీ పిండిలో పోపు వేయడానికి ఒక టేబుల్ స్పూన్ బటర్ కావాలి. ఒక టీ స్పూన్ నూనెలో మినప్పప్పు, పచ్చి సెనగపప్పు, ఒక టీ స్పూను ఆవాలు, అర టీ æస్పూన్ కరివేపాకు వేసి వేయించాలి. గన్ పౌడర్ కోసం... ఒక టీ స్పూన్ నూనె, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ సెనగ పప్పు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, కడిగిన బియ్యం ఒక టేబుల్ స్పూన్, అర టీ స్పూన్ ఎండు మిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఒక వెల్లుల్లి రెబ్బ, ఒక టేబుల్ స్పూను వేయించిన నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ పంచదార పొడి, తగినంత ఉప్పు ఉంచుకోవాలి. కొబ్బరి జీడిపప్పు చట్నీ కోసం... ఒక టీ స్పూన్ నూనె, పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు, ఒక రెమ్మ కరివేపాకు, 50 మి.లీ. కొబ్బరి పాలు, ఒక టీ స్పూన్ వేయించిన జీడిపప్పులు సిద్ధం చేసుకోవాలి. సర్వ్ చేయడానికి... ఒక టీ స్పూన్ సాల్టె్టడ్ బటర్, అర టీ స్పూన్ అల్లం తురుము, అర టీ స్పూన్ వెల్లుల్లి తరుగు, అర టీ స్పూన్ పచ్చి మిర్చి తరుగు, ఒక టీ స్పూన్ వేయించిన జీడి పప్పు, ఒక టీ స్పూన్ వేయించి కొబ్బరి ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, అర టీ స్పూన్ ఉల్లి కాడల తరుగు తీసుకోవాలి. పోపు తయారు చేసుకోవడం... స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి. పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించి దింపేయాలి. ఇడ్లీ పిండి తయారు చేసుకోవడం... ఒక పాత్రలో బొంబాయి రవ్వ, పెరుగు, బేకింగ్ పౌడర్, ఉప్పు, జీడిపప్పు పలుకులు, నీళ్లు వేసి బాగా కలిపాక, వేయించి ఉంచుకున్న పోపును ఈ పిండిలో వేసి కలిపి సుమారు అరగంట సేపు పక్కన ఉంచాలి. ఇడ్లీలు తయారు చేయడం.... ఇడ్లీ స్టాండును శుభ్రంగా కడిగి, ఇడ్లీ రేకులకు బటర్ పూయాలి. సిద్ధంగా ఉంచుకున్న ఇడ్లీ పిండి మిశ్రమాన్ని ఈ రేకులలో వేసి ఇడ్లీ స్టాండును స్టౌమీద ఉంచి ఉడికించి దింపేయాలి. గన్ పౌడర్ ఇలా తయారుచేసుకోవాలి... స్టౌమీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, పచ్చి సెనగపప్పు, బియ్యం, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి. నువ్వులు జత చేసి, పదార్థాలన్నీ బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి, దింపేసి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి (మరీ మెత్తగా ఉండకూడదు). పంచదార, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి. జీడిపప్పు, కొబ్బరి పచ్చడి తయారుచేద్దాం... స్టౌమీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించాలి. కొబ్బరి పాలు, వేయించిన జీడిపప్పు పలుకులు జత చేసి, కొద్దిసేపు సన్నని మంట మీద ఉంచి, దింపేసి చల్లారనివ్వాలి. బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. పాన్‌లో బటర్ వేసి స్టౌమీద ఉంచి కరిగించాక, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి. తయారుచేసి ఉంచుకున్న ఇడ్లీలను జత చేయాలి. వీటి మీద గన్ పౌడర్ వేయాలి. ఇడ్లీలకు గన్ పౌడర్ బాగా పట్టేలా జాగ్రత్తగా కలపాలి. వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, వేయించిన కొబ్బరి ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉల్లికాడల తరుగు జత చేసి, స్టౌమీద నుంచి దింపేయాలి. సర్వింగ్ ప్లేట్లలో ఇడ్లీలను అందంగా అలంకరించి, జీడిపప్పు, కొబ్బరి చట్నీతో అందించాలి. క్యాలీఫ్లవర్ గ్రీన్ పీస్ అండ్ కినోవా పులావ్ కావలసినవి: ఉడికించిన కినోవా బియ్యం – 300 గ్రా. (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. వీటి ఖరీదు కొద్దిగా ఎక్కువే ఉంటుంది. ఈ బియ్యం బదులు బాస్మతి బియ్యం కూడా వాడుకోవచ్చు); అల్లం తురుము – 2 టీ స్పూన్లు; ఉల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్; క్యాలీ ఫ్లవర్ తరుగు – 3 టేబుల్ స్పూన్లు; తాజా పచ్చి బఠాణీ – 3 టేబుల్ స్పూన్లు; పసుపు – అర టీ స్పూన్; మిరప కారం – అర టీ స్పూన్; ఉప్పు – కొద్దిగా; గరం మసాలా పొడి – అర టీ స్పూన్; జీలకర్ర – ఒక టీ స్పూన్; పుదీనా తరుగు – 2 టీ స్పూన్లు; ఆలివ్ ఆయిల్ – ఒక టేబుల్ స్పూన్ తయారీ స్టౌమీద బాణలి ఉంచి వేడయ్యాక ఆలివ్ ఆయిల్ వేయాలి. నూనె కాగాక జీలకర్ర వేసి చిటపటలాడేవరకు వేయించాలి. అల్లం తురుము, ఉల్లి తరుగు వేసి వేయించాలి. క్యాలీఫ్లవర్ తరుగు, పచ్చి బఠాణీ జత చేసి మరోమారు వేయించాలి. పసుపు, మిరప కారం, గరం మసాలా పొడి వేసి బాగా కలిపి, మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు జత చేసి ఉడికించాలి. కొద్దిగా మెత్తబడ్డాక, ఉడికించిన కినోవా వేసి బాగా కలిపి, ఉప్పు జత చేయాలి. పుదీనా ఆకులతో అలంకరించి వేడివేడిగా అందించాలి. -
నువ్వుల్.. నవ్వుల్
‘పండుగ రోజు నువ్వులుండాలి!’ ‘అదేంటండీ! పండుగ రోజు ఉండాల్సింది నవ్వులు కదండీ!’ ‘అరే! నువ్వులుంటే... నవ్వులుంటాయ్రా భాయ్’ ‘చెవిలో పువ్వులుండవా?’ ‘ద్వారానికి పువ్వులు... ఇంట్లో పిండి వంటలు... వాటిలో నువ్వులు... ఇంటిల్లపాదీ ఆరోగ్యాల నవ్వులు...’ ‘భలేగా పిండికొట్టి మరీ చెప్పావోయ్! పిండివంటల్లో నువ్వులుంటే... ఆరోగ్యాల నవ్వులన్నమాట!’ నువ్వుల కజ్జికాయలు కావల్సినవి: మైదా/గోధుమపిండి – కేజీ, నువ్వులు – కేజీ, బెల్లం – 800 గ్రాములు, ఏలకుల పొడి – అర టీ స్పూన్, జీడిపప్పు – వంద గ్రాములు, నెయ్యి/నూనె – వేయించడానికి తగినంత తయారీ: ∙ముందుగా పిండిని మెత్తగా చపాతీలకు కలుపుకున్నట్టు కలుపుకొని, పక్కన ఉంచాలి. నువ్వులను దోరగా వేయించి, చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా ఉండేలా గ్రైండ్ చేయాలి. బెల్లాన్ని పొడి చేసి అందులో ఏలకుల పొడి వేసి అన్నీ సమంగా కలిసే వరకు కలపాలి. ∙పిండిని పూరీ చేయడానికి తగినంత చిన్న చిన్న ఉండలు తీసుకొని ఒక్కొక్క ఉండను ఒత్తాలి. దానిని మౌల్డ్‌లో లేదా చేతి మీద వేసుకొని నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని పెట్టాలి. తర్వాత చివర్లను మూసివేయాలి. కజ్జికాయ ఆకారం వస్తుంది. ఇలా చేసుకున్న అన్ని కజ్జికాయలను కాగుతున్న నూనెలో వేసి, దోరగా వేగనివ్వాలి. కజ్జికాయలు చేయడానికి మౌల్డ్, వెనుక చక్రం ఉండే స్పూనులను వాడచ్చు. సకినాలు కావల్సినవి: బియ్యం– కప్పు, వాము – టీ స్పూను, నువ్వులు – పావు కప్పు, ఉప్పు – తగినంత, నూనె – తగినంత తయారీ: రాత్రిపూట బియ్యం కడిగి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయమే నీళ్లు వంపేసి, బియ్యాన్ని పిండి చేయాలి. ఈ పిండిలో వాము, నువ్వులు, ఉప్పు వేసి కలపాలి. అలాగే దీంట్లో తగినన్ని నీళ్లు పోసి, ముద్దలా చేయాలి. ఈ పిండి చేత్తో పట్టుకుంటే మృదువుగా ఉండాలి. శుభ్రమైన కాటన్ క్లాత్‌ని పరిచి, పిండి తీసుకొని చేత్తోనే చక్రాల్లా చుట్టాలి. పది, పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. పొయ్యి మీద బాణలి పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. తయారు చేసుకున్న వాటిని కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా వేయించి, తీయాలి. నువ్వుల ఉండలు కావల్సినవి: నువ్వులు – అర కిలో, బెల్లం – 400 గ్రాములు, ఏలకుల పొడి – టీ స్పూన్, నెయ్యి – కొద్దిగా తయారీ: తెల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులు కానీ నువ్వుల ఉండలకు వాడచ్చు. నల్ల నువ్వులైతే వేయించిన తర్వాత కాస్త నలిపి పొట్టు పోయేటట్లు చేసుకోవాలి. లేదంటే అలాగే కూడా వాడుకోవచ్చు. నువ్వులను వేయించి పొడి చేయాలి. కొన్నింటిని పొడి చేయకుండా అలాగే ఉంచాలి. లేదా కాస్త పలుకుగా ఉండేట్లు దంచాలి. ఇందులో బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి – రెండూ కలిసే వరకు రోట్లో దంచాలి. చేతికి నెయ్యి రాసుకుని కావల్సిన సైజులో ఉండలు చేయాలి. కావాలంటే నువ్వులలో వేరుసెనగపప్పు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. వీటిని విడిగా వేయించి, పొడి చేసి కలపాలి. అరిసెలు కావల్సినవి: బియ్యం– కేజీ, బెల్లం – 800 గ్రాములు, నువ్వులు – తగినన్ని, నెయ్యి లేదా నూనె – వేయించడానికి తగినంత తయారి: ∙అరిసెలు చేయడానికి ముందు రోజు నుంచే కావల్సినవి సిద్ధం చేసుకోవాలి. బియ్యాన్ని ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లను ఒంపేసి, తడిగా ఉన్నప్పుడే దంచాలి. దంచిన పిండిని జల్లించాలి. ఈ పిండి ఆరిపోకుండా, గాలి తగలకుండా ఒక పాత్రలో వేసి అదిమి మూత పెట్టాలి. పిండి సిద్ధమయ్యాక బెల్లాన్ని పాకం పట్టాలి. ముందుగా బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. పెద్ద పాత్రలో ఒక గ్లాసు నీటిని, బెల్లం ముక్కలను వేసి పాకం వచ్చేదాక మరగనిచ్చి, బియ్యప్పిండి కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకుంటే పాకం పిండి సిద్ధం. ∙బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి కాగనివ్వాలి. పాకం పిండిని పూరీకి, చపాతీకి తీసుకున్నట్టు నిమ్మకాయంత ముద్దలు తీసుకొని నువ్వులలో అద్దాలి. ఇలా అద్దినట్లయితే అవి పిండికి చుట్టూ అంటుకుంటాయి. అప్పుడు పాలిథిన్ పేపర్ మీద పెట్టి వేళ్లతో వలయాకారంగా అద్ది, కాగిన నూనెలో వేసి దోరగా రెండువైపులా వేయించాలి. తర్వాత తీసి అరిసెల పీట మీద వేసి, నూనె కారిపోయేటట్లు ఒత్తాలి. అరిసెల పీటకు బదులుగా రంధ్రాలున్న చెక్కలుంటాయి. వీటితో బాణలిలో నుంచి తీసేటప్పుడే నూనె వదిలేటట్లు ఒత్తేయవచ్చు. అరిసె మెత్తగా రావాలంటే పాకం లేతగా ఉన్నప్పుడు బియ్యప్పిండి కలుపుకోవాలి.గట్టిగా, ఎక్కువ తీపితో కావాలనుకుంటే పాకాన్ని ముదరనివ్వాలి. ∙ఒక ప్లేటులో నీళ్లు పోసి ఉడుకుతున్న బెల్లం మిశ్రమాన్ని స్పూన్‌తో కొద్దిగా తీసుకొని నీటిలో వేయాలి. దీనిని చేత్తో నొక్కి రౌండ్ చేయాలి. ఆ రౌండ్‌ని పైకెత్తి ప్లేటు మీద వేసినప్పుడు మెత్తగా జారిపోకుండా అలాగే ఉంటే పాకం వచ్చినట్లు. ముదురు పాకం కావాలనుకుంటే ఆ రౌండ్ ప్లేటుకు తగిలినప్పుడు ఠంగున శబ్దం వచ్చేదాకా మరగనివ్వాలి. ఇలా చేసుకున్న అరిసెలు 15 రోజుల వరకు ఉంటాయి. తినేటప్పుడు పెనం మీద సన్నని సెగకు వేడి చేస్తే అప్పటికప్పుడు చేసిన అరిసెలాగ వేడిగా, మెత్తగా వస్తాయి. జంతికలు, కారప్పలు కావల్సినవి: బియ్యప్పిండి – 3 కప్పులు, సెనగపిండి – కప్పు, పుట్నాల పప్పు∙– పావు కప్పు, వెన్న – పావు కప్పు (కరిగించాలి), కారం – టీ స్పూన్, ఉప్పు – తగినంత, నువ్వులు– 2 టీ స్పూన్లు, జీలకర్ర– టీ స్పూన్, నూనె – తగినంత తయారీ: ∙పుట్నాల పప్పు వేయించి, పొడి చేయాలి. బియ్యప్పిండి, సెనగపిండి, పుట్నాల పప్పు పిండి, కారం, ఉప్పు, జీలకర్ర, వాము కలపాలి. దీంట్లో తగినన్ని నీళ్లు పోసి, పిండి ముద్ద చేయాలి. పిండి మృదువుగా అయ్యేంత వరకు కలపాలి. ∙జంతికల అచ్చులో పిండి పెట్టి, పేపర్ మీద మురుకులు ఒత్తి, నూనెలో వేసి రెండు వైపులా కాల్చి తీయాలి. (పైవన్నీ కలిపి, పూరీలా చేసి, నూనెలో రెండువైపులా కాల్చి తీస్తే కారప్పలు సిద్ధం.) -
కుందువానిపేటలో ఉద్రిక్తత!
శ్రీకాకుళం రూరల్: మండలంలోని కుందువానిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. మా కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న ఉన్న జీడి చెట్లను తొలగించి, కటే ్ట ఇళ్లు మాకోద్దంటూ ఇటీవల ఈ గ్రామస్తులు జీడిమామిడి తోటల తొలగింపు ప్రక్రియను అడ్డుకున్న విషయం విదితమే. అయితే ఇటీవల అధికారులు చర్చల పేరుతో కాలయాపన చేసి తీరా శుక్రవారం ఉదయం ఐదు గంటలకే భారీ బందోబస్తు మధ్య గ్రామాన్ని ముట్టడించడంతో ఈ పరిస్థితి నెలకుంది. ఆర్డీవో, తహశీల్దారు, సీఐ, ముగ్గురు ఎస్సైల సమక్షంలో విచక్షణా రహితంగా ప్రవర్తించి అడ్డుకున్న వారందరినీ పశువుల మాదిరిగా లాక్కువచ్చి జీపుల్లోకి ఎక్కించి ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. 57 మందిని అరెస్టు చేశారు. దీంతో మహిళలంతా పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది ఆక్టోబర్ 12వ తేదీన సంభవించిన హుద్‌హుద్ తుపాను సమయంలో సీఎం చంద్రబాబు ఈ గ్రామాన్ని సందర్శించారు. మత్స్యకారులందరికీ తుపాన్లను తట్టుకునే ఇళ్లు కట్టిస్తామని, మోడల్ విలేజ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఇప్పిలి రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నంబరు 219లోని ఐదు ఎకరాల 46 సెంట్లను గయాలు(పోరంబోకు)గా రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు గుర్తించారు. ఈ భూమిలో ఉన్న జీడిమామిడి తోటలను తొలగించేందుకు అధికారులు పలుమార్లు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గురువారం వరకు చర్చల పేరుతో కాలం చేసిన ఆర్డీవో బలివాడ దయానిధి, ఇన్చార్జి తహశీల్దారు పూజారి రాంబాబు, సీఐ అప్పలనాయుడు, ఎస్సైలు, సుమారు 70 మంది పోలీసులు, 30 మంది రెవెన్యూ సిబ్బంది ఉదయం ఐదు గంటలకే కుందువానిపేట గ్రామాన్ని ముట్టడించారు. జీడి తోటలను ఏసీబీలతో తొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా..ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అడ్డుకున్నారు. అవసరమైతే ప్రాణాలర్పిస్తాం కానీ తోటలను తొలగించకనీయమంటూ స్పష్టం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో అధికారులు, పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈనేపథ్యంలో పోలీసులు అడ్డుపడిన వారినీ, అడిగినా వారందరినీ ఇష్టారాజ్యంగా అరెస్టులు చేశారు. ఇప్పటి వరకూ అధికారులు సానుకూలంగా మాట్లాడారని, తీరా ఈ రోజున ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తూ అరెస్టులు చేయడం దారుణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు వారి మాటలను పట్టించుకోకుండా అధికార పక్ష నాయకుల ఒత్తిడుల నేపథ్యంలో ఆ స్థలాన్నే కేటాయించడానికి పూనుకుని, అడ్డుపడిన వారందరినీ అరెస్టు చేసి శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. 57 మందిని అరెస్టు చేసి..వీరందరిపైనా కేసులు నమోదు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. దీంతో గ్రామంలోని మహిళలంతా పోలీసు స్టేషన్‌కు చేరుకుని బైఠాయించి నిరసన తెలిపారు. -
తరాలు మారినా... మిఠాయిదే పైచేయి!
న్యూఢిల్లీ: దీపావళి పండుగ అంటే చెప్పేదేముంటుంది. చాక్లెట్లు, మిఠాయిల షాపులు కస్టమర్లతో కళకళలాడిపోతుంటాయి. రేటెంతయినా ఈ పండుగ రోజు స్వీట్స్‌కు ఉండే డిమాండే వేరు. తమ ఇంట్లోకే కాకుండా బంధువులకు, స్నేహితులకు సైతం స్వీట్స్ పంపే, పంచే ప్రత్యేక పండుగ ఇది. షాపులకు వెళ్లామంటే- పలు రకాల మిఠాయిలు, చాక్లెట్ల ‘రుచులు’ ఊరించేస్తుంటాయి. పలు రకాలు చాక్లెట్లు, వివిధ స్వీట్లు కలర్‌ఫుల్ ప్యాకెట్లలో ఆకర్షిస్తుంటాయి. అయితే ఆకర్షణీయమైన ప్యాకెట్లలో దిగుమతయ్యే చాక్లెట్లు, ఫ్యాన్సీ కుకీలు, కేకులు, ముఫిన్స్ ఎంత పోటీ ఇస్తున్నా... మన భారత సాంప్రదాయక మిఠాయిలతో అవి పోటీ పడలేకపోతుండడమే విశేషం. ఇండస్ట్రీ చాంబర్ అసోచామ్ అంచనా ప్రకారం మొత్తం ఈ మార్కెట్ విలువ దాదాపు రూ.49,000 కోట్లు (8 బిలియన్ డాలర్లలో). సాంప్రదాయక స్వీట్ల హవా! మన సాంప్రదాయక మిఠాయిలు మార్కెట్లో తన పట్టును కాపాడుకోవడమే కాకుండా, విస్తరిస్తున్న మార్కెట్‌కు అనుగుణంగా వీటి విక్రయాలు సైతం పెరుగుతున్నాయి. ఇక్కడ మన మిఠాయిల కొనుగోళ్ల పట్ల కస్టమర్లకు ఉన్న భావోద్వేగ అంశాలు సైతం కీలకంగా మారినట్లు షాపుల యజమానులు తెలుపుతున్నారు. జీడిపప్పు పౌండర్, చక్కెరతో తయారుచేసే స్వీట్ కేక్ కాజు కట్లీసహా మైసూర్‌పాక్, బాదమ్ హల్వా, గులాబ్ జామ్ వంటి స్వీట్స్ మార్కెట్లో తమ హవాను చాటుతున్నాయి. కొన్ని స్వీట్స్ కొనేముందు అవి కనీసం కొన్ని రోజులు అలమరాల్లో మన్నే విషయాన్ని సైతం తమ కొనుగోళ్ల సందర్భంగా కస్టమర్లు పరిగణనలోకి తీసుకుంటారని వర్తకులు పేర్కొంటున్నారు. ఆయా అంశాల్లోసైతం మన సాంప్రదాయ మిఠాయిలకే ప్రాధాన్యత, ప్రత్యేకత ఉంటోందని ఈ రంగంలో నిపుణుల మాట. బ్రాండెడ్ స్వీట్స్ మార్కెట్ గత యేడాదితో పోల్చితే ప్రస్తుత దీపావళికి 30 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు. మిఠాయివాలా డాట్ ఇన్ వెబ్సైట్ 400 రకాల బ్రాండెడ్ స్వీట్‌ను ఆఫర్ చేస్తోంది. మన స్వీట్స్‌కు డిమాండ్ మరింత పెరిగేదని, అయితే సాంప్రదాయక స్వీట్లలో కల్తీ భయాందోళన కలిగిస్తోందని ఈ రంగంలో నిపుణులు తెలిపారు. దీనితో చాక్లెట్లవైపు కొందరు కస్టమర్లు మొగ్గుచూపుతుండడం గమనార్హం. ప్రస్తుతం భారత చాక్లెట్ పరిశ్రమల పరిమాణం రూ.5,000 కోట్లు. ఇది వచ్చే రెండేళ్లలో రూ.7,500 కోట్లు దాటుతుందని అంచనా.