భూపాలపల్లి, న్యూస్‌లైన్ :
భూపాలపల్లి పట్టణంలో నకిలీ వైద్యులు యథేచ్ఛగా తమ ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. సరిైయెున అర్హ తలు లేకుండానే హంగుఆర్భాటాలతో ఏకంగా నర్సిం హోంలు ప్రారంభించి నడిపిస్తున్నారు. రోగుల నుంచి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ వారిని గుల్ల చేస్తున్నారు. చదివింది.. ఒక కోర్సు అయితే మరో కోర్సుకు సంబంధించిన మందులు రాస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
భూపాలపల్లి పట్టణంలో సుమారు 10కిపైగా ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. అయితే ఇందులో రెండింటిలో మాత్రమే ఎంబీబీఎస్ వైద్యులు ఉన్నారు. మిగతా ఆస్పత్రుల్లో వైద్యులంతా బీహెచ్‌ఎంఎస్(హోమియోపతి), బీఏఎంఎస్(ఆయుర్వేదం) విద్యను అభ్యసించినవారు. అయి నా వీరంతా వచ్చీరాని అల్లోపతి(ఇంగ్లీషు) వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రోగులకు సరిగ్గా ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఇక మాతో కాదు హన్మకొండకు తీసుకెళ్లండి అంటూ చేతులెత్తేస్తున్నారు. ప్రతిరోజు సుమారు 100 మందికిపైగా రోగులను పరీక్షిస్తూ ఒక్కో రోగికి సుమారు రూ800 నుంచి వేయి వరకు విలువ చేసే మందులు రాస్తూ నిలువు దోపిడి చేస్తున్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి అవసరం లేకున్నా రక్తపరీక్షలు నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. అంతేగాక ఏకంగా ప్రసవాలు, శస్త్ర చికిత్స సైతం చేస్తున్నట్లు తెలిసిం ది. స్థానిక బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ వైద్యులు ఇతర ప్రాంతాలకు చెందిన ఎంబీబీఎస్ వైద్యుల పేరిట తమ ఆస్పత్రులను రిజిస్ట్రేషన్ చేయించుకుని నిబంధనలకు విరుద్ధంగా వీరే అల్లోపతి వైద్యం కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇందుకుగాను సదరు ఎంబీబీఎస్ వైద్యుడికి ఏటా సుమారు రూ60 వేల వరకు ఇస్తున్నట్లు సమాచారం.
సీజ్ చేసినా ఎలా తెరుచుకున్నాయి..
2012, మే 11న భూపాలపల్లి పట్టణంలోని పలు ఆస్పత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సాంబశివరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో సాయి క్లినిక్‌లోని సాంబ య్య అనే వైద్యుడు హోమియోపతి విద్యనభ్యసించి అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు ధ్రువీకరించారు. అంతేగాక ఆస్పత్రిలో ఉన్న స్కానింగ్ మిషన్, ఈసీజీ, ఎక్స్‌రే, ప్లేట్‌లెట్ కౌంటింగ్ మిషన్లకు ఎలాంటి అనుమతులు లేకపోగా అర్హత కలిగిన సిబ్బంది లేరు. దీంతో అదేరోజు సాయి క్లినిక్ ఆస్పత్రిని డీఎంఅండ్‌హెచ్‌ఓ సాంబశివరావు సీజ్ చేశారు. అయితే అదే వైద్యుడు సరిగ్గా నెల రోజులు కూడా తిరగకముందే డీఎంఅండ్‌హెచ్‌ఓ సీజ్ చేసిన తాళాలను పగులగొట్టి ఆస్పత్రిని తెరిచి వైద్యం చేశారు. ఇటీవలే తన ఆస్పత్రిని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల మూడంతస్థుల సొంత భవనంలోకి మార్చుకున్నారు. ఇక్కడ కూడా అనుమతి లేని యంత్రాలను వాడుతూ అదే సిబ్బందిని నియమించుకుని అల్లోపతి వైద్యం కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సీజ్ అయిన ఆస్పత్రు ల నిర్వాహకులు ఓ ఉన్నతాధికారికి భారీగా ముడుపులు అందజేసి ఆస్పత్రులను తిరిగి తెరిచినట్లు ప్రచారం జరుగుతోంది.
చదివింది హోమియోపతి.. చేసేది అల్లోపతి..
Published Wed, Oct 23 2013 3:32 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement
Advertisement