హోమియో కౌన్సెలింగ్
నా వయసు 52 ఏళ్లు. గత ఆర్నెల్ల నుంచి రాత్రిపూట మూత్ర విసర్జన కోసం మాటిమాటికీ లేచేవాణ్ణి. ఈమధ్య మూత్రం బొట్లు బొట్లుగా వస్తోంది. కంట్రోల్ తప్పింది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
- రమేశ్, కందుకూరు
పురుషుల్లో అత్యంత ప్రధానమైన గ్రంథి ప్రోస్టేట్ (పౌరుషగ్రంథి). ఇది వీర్యం ఉత్పత్తిలో కీలకమైన భూమిక పోషిస్తుంది. సంతానం కలగజేయడానికి కారణమయ్యే శుక్రకణాలు ఈ ప్రోస్టేట్ గ్రంథి తయారు చేసే స్రావాలలో కలిసి వీర్యం రూపంలో బయటకు వస్తుంటాయి. ఇలా సంతాన సాఫల్యంలో ఈ గ్రంథికి అంతటి ప్రాధాన్యం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ గ్రంథి కొద్దికొద్దిగా ఉబ్బుతుంటుంది. ఫలితంగా మూత్రవిసర్జనలో రకరకాల సమస్యలు తలెత్తడం సహజంగా జరిగే పరిణామమే. దీన్ని బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా’ అంటారు.
ప్రోస్టేట్ గ్రంథి సమస్య సాధారణంగా 40 సంవత్సరాలు పైబడ్డ వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశవాసుల్లో ఈ సమస్య ఒకింత తక్కువేగానీ... పట్టణ ప్రాంతాల్లో, మాంసాహారం తినేవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన లక్షణాలు కనిపించినా, మూత్ర సమస్యలు వేధిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
కారణాలు : ప్రోస్టేట్ పెరగడానికి హార్మోన్ల స్థాయి తగ్గుదల ముఖ్యకారణం. కాస్త అరుదే అయినా గాయాలు కావడం గౌట్ సమస్య
లక్షణాలు : మాటిమాటికీ మూత్రం రావడం పదే పదే మూత్ర విసర్జన చేయాలనిపించడం మూత్రం ఆపుకోలేకపోవడం మూత్రం ఆగి ఆగి రావడం మూత్ర విసర్జనలో రక్తం పడటం
వ్యాధి నిర్ధారణ : అల్ట్రా సౌండ్ సోనోగ్రఫీ బయాప్సీ స్కానింగ్
చికిత్స : హోమియోపతి వైద్య విధానంలో ప్రోస్టేట్ గ్రంథి వాపు నుంచి పూర్తి ఉపశమనం కలిగించే మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ విధానంలో కేవలం లక్షణాలను తగ్గించడమే కాకుండా సమస్యను పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుంది. రోగి శారీరక తత్వాన్ని బట్టి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. ఆర్నికా, బెల్లడోనా, కోనియం, తూజా, మెర్క్‌సాల్ వంటి మందులు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. అయితే అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో తగిన మోతాదులో వీటిని వాడాల్సి ఉంటుంది.
- డాక్టర్ మురళి
కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి
హైదరాబాద్
మాటిమాటికీ మూత్రం... ఎందుకిలా?
Published Tue, Sep 13 2016 11:47 PM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM
Advertisement