Prostate gland
-
మగవారిలో ప్రోస్టేట్ పెరిగితే ప్రమాదమా?
మన మానవాళి విస్తరిస్తోందంటే దానికి తోడ్పడే గ్రంథుల్లో కీలకమైనది ప్రోస్టేట్. కేవలం పురుషులలో మాత్రమే ఉంటూ పునరుత్పత్తికి తోడ్పడే ఈ గ్రంథే లేకపోతే సంతానమే లేదు. వృషణాలు వీర్యకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ వీర్యకణాలు ఈదడానికి కావాల్సిన ద్రవాన్ని ఉత్పత్తి చేసే ఈ ప్రోస్టేట్ గ్రంథి... చాలామందిలో వాళ్ల 50వ ఏళ్ల వయసు తర్వాత అమాంతం పెరిగిపోయి కొన్ని అనర్థాలను తెచ్చిపెడుతుంది. అవేమిటో, వాటిని అధిగమించాల్సిన మార్గమేమిటో వివరించే కథనమిది. ప్రోస్టేట్ సాధారణంగా 18–22 గ్రాముల బరువుంటుంది. కానీ 50 ఏళ్లు దాటిన కొందరిలో ఇది అకస్మాత్తుగా సైజు పెరిగిపోయే అవకాశం ఉంది. మానవ శరీర నిర్మాణం ఎంత సంక్లిష్టంగా ఉంటుందంటే... మూత్రంనాళం చుట్టూతా ఈ ప్రోస్టేట్ గ్రంథి ఆవరించి ఉండటంతో... ఇది హఠాత్తుగా సైజ్ పెరగడంతో ఆ నాళం నొక్కుకుపోయి... క్రితం రోజుదాకా సాఫీగా వచ్చిన మూత్రం అకస్మాత్తుగా ఆగిపోయి, లోపల ఎంతగానో మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్నా, ఎంతగా ముక్కుతున్నా రాక బెంబేలెత్తిస్తుంది. అలాంటి సమయాల్లో అత్యవసరంగా హాస్పిటల్‌కు వెళ్లాల్సిన స్థితిలో ‘ప్రోస్టేట్ పెరుగుదల’ (ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్) తెలుస్తుంది. కొందరిలో మాత్రమే ఇలా పెరిగిపోయే ఈ గ్రంథి సైజు... ఎందుకంత హఠాత్తుగా పెరిగిపోతుందనేది ఇప్పటికీ వైద్యవర్గాలకు తెలియని రహస్యమే. అది వయసు పెరగడం వల్ల వచ్చే అనేక పరిణామాల్లో అదీ ఒకటిగా భావిస్తున్నారు. రెండు రకాలుగా పెరుగుదల: ప్రోస్టేట్ పెరుగుదల రెండు రకాలుగా ఉంటుంది. సైజు పెరిగినప్పటికీ ఆ కణాల్లో ఏదీ ప్రమాదకరం కాకుండా కేవలం సైజు మాత్రమే పెరుగుతుంది. ఇలాంటి పెరుగుదలను ‘బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా’ అంటారు. ఇక రెండోది క్యాన్సర్ కణాల వల్ల సంభవిస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా ఆ గ్రంథి సైజు పెరుగుతుంది. ఇది ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా. లక్షణాలు: ప్రోస్టేట్ పెరుగుదలలో రెండు విధాలుగా లక్షణాలు కనిపిస్తాయి. మొదటిది స్టోరేజీ... అంటే మూత్రం భర్తీ అవడం వల్ల కనిపించే లక్షణాలు. రెండోది వాయిడింగ్... అంటే మూత్రపు సంచి (బ్లాడర్) ఖాళీ కావడానికి సంబంధించిన లక్షణాలు. స్టోరేజీ: రాత్రివేళల్లో మామూలు కంటే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సిరావడం. పగటివేళల్లో కూడా చాలా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సిరావడం. మూత్రం ఏమాత్రం ఆపుకోలేకపోవడం. మూత్రవిసర్జనపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం. వాయిడింగ్: ► మూత్రవిసర్జన కోసం నిలబడ్డ తర్వాత ఎంతోసేపటికి గాని మూత్రపు ధార మొదలుకాకపోవడం. ► మూత్రపుధార మెల్ల మెల్లగా, ఆగుతూ ఆగుతూ వస్తుండటం. ► మూత్రపు సంచి (బ్లాడర్) ఖాళీ కావడానికి చాలా సమయం తీసుకోవడం. ► మూత్రవిసర్జన అన్నది ఎప్పటిలా సాఫీగా కాకుండా చాలా శ్రమతో, బాధతో జరుగుతున్నట్లుగా అనిపించడం. ► మూత్రవిసర్జనలో నొప్పి. ► మూత్రవిసర్జన ముగిసే సమయానికి ముక్కి ముక్కి పోయాల్సిరావడం. ► ఆ తర్వాత కూడా మూత్రం ఎంతోకొంత లోపలే ఉండిపోవడం (లేదా అలా ఉండిపోయిన ఫీలింగ్ ఉండటం). ► ఒక్కోసారి మూత్రపు ధారలో రక్తపు చారిక కనిపించడం (మూత్రంలో లేదా బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇది కనిపిస్తుంది). నివారణ: ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ నివారణ పూర్తిగా మన అదుపులో ఉండదు. అయితే కొన్ని సాధారణ జాగ్రత్తల ద్వారా ప్రోస్టేట్ సమస్యలను కొంతవరకు నివారించవచ్చు. అవి... ► మూత్రవిసర్జన ఫీలింగ్ రాగానే... ఆపుకోకుండా వెంటనే మూత్రవిసర్జన చేసేయాలి. ► కెఫిన్ మోతాదులు ఎక్కువగా ఉండే కూల్డ్రింకులూ, కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ► నిద్రకు ఉపక్రమించబోయే ముందర 2 – 3 గంటల ముందుగా మాత్రమే నీళ్లు తాగడం / ద్రవాహారాలు తీసుకోవడం. ► డాక్టర్ సలహా లేకుండా అలర్జీల కోసం / ఊపిరితిత్తుల్లోకి గాలి సాఫీగా ప్రవహించేలా చేసే డీ–కంజెస్టెంట్స్ లేదా యాంటీహిస్టమైన్ మందులు తీసుకోకపోవడం. ► ఇవి బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా ముప్పును పెంచే అవకాశం ఉంది. ►చాలా చల్లని వాతావరణంలో మనల్ని మనం వెచ్చగా ఉంచుకోవడం (చలి వాతావరణం ఈ సమస్యను మరింత పెంచుతుంది). ► చురుగ్గా ఉండాలి. ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ► పొత్తికడుపు కండరాలపై నియంత్రణను పెంచే ‘కెగెల్స్ ఎక్సర్సైజ్’లు ప్రాక్టీస్ చేయడం కొంతవరకు మేలు చేస్తుంది. ► శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవడం. చికిత్స: ప్రోస్టేట్ గ్రంథికి వచ్చిన సమస్య, పెరుగుదలకు కారణాలూ, దాని తీవ్రతా, లక్షణాలూ... బాధితులు ఎదుర్కొనే సమస్యలను బట్టి చికిత్స ఉంటుంది. ఉదాహరణకు... ►ప్రోస్టెటైటిస్ : ప్రోస్టేట్ గ్రంథికి వచ్చే ఇన్ఫెక్షన్ను ప్రోస్టెటైటిస్ అంటారు. మిగతా ఇన్ఫెక్షన్ల లాగానే దీనికి యాంటిబయాటిక్స్‌తో చికిత్స చేస్తే పూర్తిగా తగ్గుతుంది. కాకపోతే కాస్త ఎక్కువ కాలం పాటు ఈ చికిత్స చేయాల్సి ఉంటుంది. ► మూత్రాన్ని ఏమాత్రం ఆపుకోలేకపోవడం, మూత్రధారలో రక్తపు చారిక, పెరిగిన ప్రోస్టేట్ గ్రంథి అన్నివైపుల నుంచి నొక్కేయడం వల్ల మూత్రం లోపలే ఉండిపోవడం, మాటిమాటికీ వచ్చే ఇన్ఫెక్షన్లూ, కిడ్నీ దెబ్బతినడం వంటి సమస్యల్ని తొలుత మందులతో అదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పటికీ మందులతో అదుపు సాధ్యం కాకపోతే అప్పుడు శస్త్రచికిత్స అవసరమవుతుంది. ► ప్రోస్టేట్ పెరిగిన పరిమాణం, దాని ఆకృతి వంటి అంశాలను బట్టి వేర్వేరు రకాల ప్రక్రియలు (ప్రొసీజర్స్) అవసరమవుతాయి. వీటన్నింటిలో బినైన ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా సమస్య కోసం సాధారణంగా ‘ట్రాన్స్ యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్’(టీయూఆర్‌పీ) అనే శస్త్రచికిత్స ప్రక్రియను అనుసరిస్తుంటారు. ► కొందరిలో లేజర్ సహాయంతో ‘లేజర్ ప్రోస్టెక్టమీ’ చేస్తుంటారు. మామూలు శస్త్రచికిత్సతో పోలిస్తే దీనిలో కొన్ని ప్రయోజనాలు ఎక్కువ. రక్తాన్ని పలచబార్చే మందులు వాడుతున్నవారికీ, ప్రోస్టేట్ సైజు విపరీతంగా పెరిగినవారు, గుండె సమస్యలున్నవారికీ లేజర్ సహాయంతో చేసే చికిత్స వల్ల ప్రయోజనాలుంటాయి. ఉదాహరణకు ► రక్తస్రావం చాలా తక్కువ ►హాస్పిటల్లో ఉండాల్సిన వ్యవధి కూడా తక్కువ కావడం ► త్వరగా కోలుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటాయి. పై అంశాలను దృష్టిలో ఉంచుకుని... మూత్రవిసర్జన కోసం చాలాసేపు టాయ్లెట్లో గడపాల్సి వస్తున్నా, ధార సరిగా లేకపోయినా, విసర్జన తర్వాత కొంత మిగిలిపోయినట్లు అనిపిస్తున్నా... ఒకసారి యూరాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకుని, అవసరాన్ని బట్టి తగిన చికిత్స తీసుకోవడం మేలు. సమస్య నిర్ధారణ ఇలా ► ఈ సమస్య నిర్ధారణ కోసం వైద్యులు ‘డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్’ (డీఆర్ఈ) ద్వారా ప్రోస్టేట్ పెరిగినదీ, లేనిదీ తెలుసుకుంటారు. దాంతో పాటు... ► మైక్రోస్కోప్ సహాయంతో ఏవైనా ఇన్ఫెక్షన్స్ను అన్వేషిస్తూ చేసే మూత్రపరీక్ష ► యూరిన్ కల్చర్ ఎగ్జామినేషన్ ► మూత్ర ప్రవాహ వేగం (యూరనరీ ఫ్లో / యూరోఫ్లోమెట్రీ) ► పొత్తికడుపు భాగంలో నిర్వహించే ఆల్ట్రాసౌండ్ స్కానింగ్. ఈ పరీక్ష ద్వారా మూత్రపిండాలు (కిడ్నీ), యురేటర్ (మూత్రపిండం నుంచి మూత్రపు సంచి వరకు ఉండే ట్యూబ్) , మూత్రపు సంచి (బ్లాడర్)ల పరిమాణంతో పాటు మూత్రపు సంచిలో మూత్రం మిగిలిపోతోందా అన్న విషయాలు తెలుస్తాయి. ► బ్లడ్ యూరియా, క్రియాటినైన్ పరీక్షలు. డా. వి. చంద్రమోహన్, సీనియర్ యూరాలజిస్ట్, యూరో సర్జన్ -
ప్రొస్టేట్ క్యాన్సర్‌పై నానో కత్తి
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మగవారికి ప్రొస్టేట్ క్యాన్సర్ శాపంగా పరిణమిస్తోంది. దీన్ని గుర్తించిన తర్వాత రేడియో థెరపీ లేదా ఆపరేషన్ చేసి ప్రొస్టేట్ గ్రంధిని తొలగించడమనే మార్గాలు మాత్రమే రోగులకు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా దీన్ని పూర్తిగా నిర్మూలించే సరికొత్త చికిత్సా విధానంపై డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేవలం గంటలోపు పూర్తయ్యే ఈ చికిత్స ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నయం చేస్తుందంటున్నారు. ఈ చికిత్సలో మందులకు లొంగని కణతులపైకి ఎలక్ట్రిక్ తరంగాలను పంపి వాటిని నాశనం చేస్తారు. ‘నానో నైఫ్’గా పిలిచే ఈ సరికొత్త చికిత్సా విధానం చాలా సులువైనదని, సైడ్ ఎఫెక్టులు చాలా స్వల్పమని యూనివర్సిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్ సర్జన్లు చెప్పారు. నిజానికి ఈ నానో నైఫ్ చికి త్సను ఇప్పటికే లివర్, క్లోమ క్యాన్సర్లలో వాడుతున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌పై దీన్ని తొలిసారి వాడినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఏమిటీ నానో నైఫ్.. ఈ ట్రీట్మెంట్ పేరు నానో నైఫ్ కానీ, నిజంగా చికిత్సలో నైఫ్ (కత్తి) వాడరు. చర్మం ద్వారా ఒక సూదిని పంపి ఆల్ట్రాసౌండ్స్ను ఉపయోగించి కణతులను (ట్యూమర్లు) గుర్తిస్తారు. అనంతరం ఆ కణితి చుట్టూ నాలుగు సూదులు గుచ్చుతారు. వీటి ద్వారా నానో నైఫ్ మిషన్ ఎలక్ట్రిక్ తరంగాలను పంపుతుంది. ఈ తరంగాలు కణతుల్లోని కణాలపై ఉండే త్వచాన్ని ధ్వంసం చేస్తాయి. దీంతో ఆ కణుతులు నాశనం అవుతాయి. ఈ మొత్తం ప్రక్రియ 45–60 నిమిషాల్లో పూర్తవుతుంది. లకి‡్ష్యత కణుతులపైకి కరెంట్ తరంగాలను పంపి నిర్వీర్యం చేసే ఈ పద్దతిని ఇర్రివర్సబుల్ ఎలక్ట్రోపోరేషన్ అంటారు. దీనివల్ల కణతులకు చుట్టుపక్కల కణజాలంపై పెద్దగా ప్రభావం పడకుండా ఉంటుంది. సాంకేతికత సాధించిన విజయాల్లో ఇది ఒకటని ఈ ఆపరేషన్ తొలిసారి నిర్వహించిన డాక్టర్ ఆలిస్టర్ గ్రే అభిప్రాయపడ్డారు. ముదిరితే కానీ తెలియదు.. మగవారిలో మూత్రాశయం దిగువన ఉండే ప్రొస్టేట్ గ్రంధిలో కణజాలం అదుపుతప్పి పెరగడాన్ని ప్రొస్టేట్ క్యాన్సర్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో సంభవించే క్యాన్సర్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత ప్రమాదకరమో, పురుషుల్లో ఈ క్యాన్సర్ అంతే ప్రమాదకారిగా మారింది. ఏటా లక్షలమంది దీని బారినపడి మరణిస్తున్నారు. ఇతర క్యాన్సర్లలో కనిపించినట్లు ఈ క్యాన్సర్ సోకగానే లక్షణాలు కనిపించవు. దీంతో చాలామందిలో ఇది సోకిన విషయం చివరి దశలో కానీ బయటపడదు. మూత్ర విసర్జనలో ఇబ్బంది అనిపిస్తే డాక్టర్లు ప్రొస్టేట్ క్యాన్సర్‌గా అనుమానిస్తారు. బయాప్సీ ద్వారా ఈ క్యాన్సర్‌ను నిర్ధారిస్తారు. రేడియోథెరపీ నిర్వహించడం, ఆపరేషన్‌తో కణుతులను తొలగించడం వంటి చికిత్సామార్గాలున్నాయి. అయితే వీటితో సైడ్ ఎఫెక్టులు ఎక్కువ. ఇండియాలో ఏడాదికి సుమారు లక్షకుపైగా ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 85 శాతం కేసులు 3, 4వ దశల్లో మాత్రమే గుర్తించడం జరుగుతోంది. ఇది సోకడానికి నిర్దిష్ఠ కారణాలు తెలియదు. ఎలాంటి దురలవాట్లు లేనివారికి కూడా ఇది సోకే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపడం ద్వారా ఇది రాకుండా నివారించవచ్చు. – నేషనల్ డెస్క్,సాక్షి -
Prostate Gland: బాదంకాయంత ఉండే ఈ గ్రంథిలో ఒక్కసారిగా పెరుగుదల ఎందుకు?
Prostate Gland Enlargement Causes Symptoms How It Cured Explained In Telugu: పురుషుడిలో పునరుత్పత్తికి ప్రోస్టేట్ గ్రంథే కీలకం. అదే లేకపోతే సంతానమే లేదు. వృషణాలు వీర్యకణాలను ఉత్పత్తి చేస్తే... అవి తేలిగ్గా ఈదుతూ వెళ్లేందుకు అవసరమైన ద్రవాన్ని ప్రోస్టేట్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. వీర్యకణాలు అండాలను చేరుకునేవరకు నశించిపోకుండా... ప్రోటీన్లూ, ఎంజైములూ, గ్లూకోజూ, కాస్తంత కొవ్వుల సాయంతో కాపాడుతుంది ఈ ద్రవం. అంతేకాదు... స్త్రీ శరీరంలో కాస్త ఆమ్లగుణం ఉండటం వల్ల... దాన్ని న్యూట్రలైజ్ చేసేలా ప్రోస్టేట్ ద్రవం కాస్తంత క్షారగుణం కలిగి ఉంటుంది. ఫలితంగా ద్రవంలోని క్షారగుణం స్త్రీ శరీరంలోని ఆమ్లగుణాన్ని తట్టుకుని మరీ వీర్యకణాలను బతికించి, ఎట్టకేలకు గమ్యానికి చేర్చి అండం పిండమయ్యేలా తోడ్పడుతుంది. కానీ చిత్రమేమిటంటే... బాదంకాయంత ఉండే ఈ గ్రంథి 50 ఏళ్ల వయసు దాటాక అమాంతం పెరిగిపోతుంది. అప్పుడు వచ్చే అనర్థాలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకోవలసిన చర్యలను తెలుసుకుందాం. నడి వయసు దాటాక కొంతమందిలో అమాంతం సైజు పెరిగిపోయే ప్రోస్టేట్ సాధారణంగా 18–22 గ్రాముల బరువుంటుంది. ఈ ప్రోస్టేట్ గ్రంథి మధ్య నుంచే మూత్రం బయటకు వచ్చే నాళం ఉంటుంది. ప్రోస్టేట్ గ్రంథి పెరగడం వల్ల చాలామందిలో కనిపించే లక్షణమేమిటంటే... మూత్రపు సంచి (బ్లాడర్)లో మూత్రం పూర్తిగా నిండిపోతుంది. అయితే సైజు పెరిగిన ప్రోస్టేట్ గ్రంథి మూత్రనాళాన్ని నొక్కేయడంతో మూత్రం బయటకు వచ్చే దారి ఉండదు. ఓ పక్క కడుపు ఉబ్బిపోయిన ఫీలింగ్‌తో ఒత్తుగా మూత్రం వస్తున్నట్లు అనిపించడం... మరో పక్క అది ఎంతకూ బయటకు రాకపోవడం ఇబ్బందిగా మారుతుంది. వెంటనే హాస్పిటల్‌కు చేరిస్తే.. తొలుత ఓ పైప్‌ను ప్రవేశపెట్టి డాక్టర్లు లోపలున్న మూత్రాన్ని ఖాళీ చేస్తారు. ఆ తర్వాత సైజు పెరిగిన ప్రోస్టేట్‌కు అవసరమైన చికిత్స అందిస్తారు. ఎందుకిలా సైజుపెరుగుతుంది? కొందరిలో ప్రోస్టేట్ గ్రంథి సైజు అమాంతం ఎందుకు పెరుగుతుందో ఇప్పటికీ తెలియరాలేదు. ఓ వయసు దాటాక వృషణాల్లోని కణాలూ, వాటి నిర్మాణంలో వచ్చే మార్పులతో పాటు అవి ఉత్పత్తి చేసే టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయుల మార్పుల వల్ల ఇలా జరుగుతుందన్నది వైద్యశాస్త్రవేత్తల విశ్లేషణ. లక్షణాలు ప్రోస్టేట్ పెరుగుదలలో రెండు విధాలైన లక్షణాలు కనిపిస్తాయి. మొదటిది స్టోరేజీ... అంటే మూత్రం భర్తీ అవడం వల్ల కనిపించే లక్షణాలు. రెండోది వాయిడింగ్... అంటే మూత్రపు సంచి (బ్లాడర్) ఖాళీ కావడానికి సంబంధించిన లక్షణాలు. స్టోరేజీ ∙రాత్రివేళలల్లో మామూలు కంటే ఎక్కువగా తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుండటం. ∙పగటివేళల్లో కూడా చాలా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సిరావడం. ∙మూత్రం ఏమాత్రం ఆపుకోలేకపోవడం. ∙మూత్రవిసర్జన విషయంలో ఎలాంటి నియంత్రణ లేకపోవడం. వాయిడింగ్ మూత్రవిసర్జనలో ఇబ్బంది. ధారళంగా కాకుండా... మూత్రపుధార చాలా మెల్లగా రావడం. మూత్రపు సంచి (బ్లాడర్) ఖాళీ కావడానికి చాలా సమయం తీసుకోవడం. మూత్రవిసర్జనలో నొప్పి. మూత్రం ఎంతోకొంత లోపలే ఉండిపోవడం. ∙ఒక్కోసారి మూత్రపు ధారలో రక్తపు చారిక కనిపించడం (బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇది కని పిస్తుంది). ప్రోస్టేట్ సమస్యల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బలవంతంగా ఆపుకోకుండా వెంటనే మూత్రవిసర్జన చేసేయడం మూత్రవిసర్జన కోసం కొన్ని వేళలను నిర్ణయించుకుని... వచ్చినా రాకున్నా ఆ సమయంలో మూత్రవిసర్జనకు వెళ్లడం. కెఫిన్ మోతాదులు ఎక్కువగా ఉండే కూల్డ్రింకులూ, కాఫీ వంటివి తీసుకోకపోవడం లేదా చాలా పరిమితంగా తీసుకోవడం. రోజూ సాధారణంగా తాగేదానికన్నా మరీ ఎక్కువగా నీళ్లు తాగకపోవడం. నిద్రపోవడానికి 2 – 3 గంటల ముందుగా మాత్రమే నీళ్లు తాగడం. డాక్టర్ సలహా లేకుండా అలర్జీల కోసం / ఊపిరితిత్తుల్లోకి గాలి సాఫీగా ప్రవహించేలా చేసే డీ–కంజెస్టెంట్స్ లేదా యాంటీహిస్టమైన్ మందులు తీసుకోకపోవడం. ఇది బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా ముప్పును పెంచే అవకాశం ఉంది. చాలా చల్లని వాతావరణంలో మనల్ని మనం వెచ్చగా ఉంచుకోవడం. చురుగ్గా ఉండటం. అలా ఉండటం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. ఆసక్తి ఉన్నవారు ప్రయత్నపూర్వకంగా పొత్తికడుపు కండరాలపై నియంత్రణను పెంచే ‘కెగెల్స్ ఎక్సర్సైజ్’లు ప్రాక్టీస్ చేయడం. శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవడం. చికిత్స ప్రోస్టెటైటిస్ : ప్రోస్టేట్ గ్రంథికి వచ్చే ఇన్ఫెక్షన్ను ప్రోస్టెటైటిస్ అంటారు. మిగతా ఇన్ఫెక్షన్ల లాగానే దీనికి యాంటిబయాటిక్స్‌తో చికిత్స చేస్తే పూర్తిగా తగ్గుతుంది. దీనికి సరైన యాంటిబయాటిక్స్‌తో కాస్త ఎక్కువ కాలం పాటు చికిత్స చేయాల్సి ఉంటుంది. మూత్రం ఏమాత్రం ఆపుకోలేకపోవడం, మూత్రంలో ఎరుపు కనిపించడం, మూత్రధారలో రక్తపు చారిక, మూత్రం లోపలే ఉండిపోవడం, మాటిమాటికీ వచ్చే ఇన్ఫెక్షన్లూ, కిడ్నీ దెబ్బతినడం వంటి సమస్యలు మందులతో అదుపు కాకపోతే శస్త్రచికిత్స అవసరమవుతుంది. ప్రోస్టేట్ పెరిగిన పరిమాణం, దాని ఆకృతి వంటి అంశాలను బట్టి వేర్వేరు రకాల ప్రక్రియలు అవసరమవుతాయి. వీటన్నింటిలో బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా సమస్య కోసం సాధారణంగా ‘ట్రాన్స్ యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్’ (టీయూఆర్‌పీ) అనే శస్త్రచికిత్స ప్రక్రియను అనుసరిస్తుంటారు. మరికొందరిలో లేజర్ సహాయంతో ‘లేజర్ ప్రోస్టెక్టమీ’ చేస్తుంటారు. సంప్రదాయ శస్త్రచికిత్సతో పోలిస్తే... రక్తాన్ని పలచబార్చే మందులు వాడుతున్నవారికీ, ప్రోస్టేట్ సైజు మరీ విపరీతంగా పెరిగినవారికీ, గుండె సమస్యలున్నవారికీ లేజర్ సహాయంతో చేసే చికిత్స వల్ల ప్రయోజనాలుంటాయి. పెరుగుదలలో రెండు రకాలు ప్రోస్టేట్ పెరుగుదల రెండు రకాలుగా ఉంటుంది. కణాల్లో ఎలాంటి హానికరమైన మార్పు లేకుండా కేవలం సైజు పెరగడం అన్నది మొదటిది. దీన్ని ‘బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా’ అంటారు. ఇక రెండోది ప్రమాదకరమైన పెరుగుదల. ఇందులో పెరుగుదల అన్నది క్యాన్సర్ కణాల వల్ల సంభవించి, ప్రోస్టేట్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. సమస్య నిర్ధారణ ఇలా... ఈ సమస్య నిర్ధారణ కోసం వైద్యులు తన వేళ్లను మల మార్గం గుండా లోనికి ప్రవేశపెట్టి వేళ్ల స్పర్శ సహాయంతో ప్రోస్టేట్ పెరిగినదీ, లేనిదీ తెలుసుకుంటారు. దీన్నే ‘డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్’ (డీఆర్ఈ) అంటారు. మైక్రోస్కోప్ సహాయంతో మూత్రపరీక్ష (ఏదైనా ఇన్ఫెక్షన్ జాడల కోసం) యూరిన్ కల్చర్ ∙మూత్ర ప్రవాహ వేగం (యూరనరీ ఫ్లో / యూరోఫ్లోమెట్రీ) మూత్రపిండాలు (కిడ్నీ), యురేటర్ (మూత్రపిండం నుంచి మూత్రపు సంచి వరకు ఉండే ట్యూబ్) , మూత్రపు సంచి (బ్లాడర్)ల పరిమాణంతో పాటు మూత్రపు సంచిలో మూత్రం మిగిలిపోతోందా అన్న విషయాలు తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ స్కానింగ్. ∙బ్లడ్ యూరియా, క్రియాటినైన్ పరీక్షలు. -డాక్టర్ శ్యామ్ వర్మ, రోబోటిక్ / ల్యాపరోస్కోపిక్ అండ్ లేజర్ యూరాలజిస్ట్, హైదరాబాద్. -
మాటిమాటికీ మూత్రం... ఎందుకిలా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. గత ఆర్నెల్ల నుంచి రాత్రిపూట మూత్ర విసర్జన కోసం మాటిమాటికీ లేచేవాణ్ణి. ఈమధ్య మూత్రం బొట్లు బొట్లుగా వస్తోంది. కంట్రోల్ తప్పింది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - రమేశ్, కందుకూరు పురుషుల్లో అత్యంత ప్రధానమైన గ్రంథి ప్రోస్టేట్ (పౌరుషగ్రంథి). ఇది వీర్యం ఉత్పత్తిలో కీలకమైన భూమిక పోషిస్తుంది. సంతానం కలగజేయడానికి కారణమయ్యే శుక్రకణాలు ఈ ప్రోస్టేట్ గ్రంథి తయారు చేసే స్రావాలలో కలిసి వీర్యం రూపంలో బయటకు వస్తుంటాయి. ఇలా సంతాన సాఫల్యంలో ఈ గ్రంథికి అంతటి ప్రాధాన్యం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ గ్రంథి కొద్దికొద్దిగా ఉబ్బుతుంటుంది. ఫలితంగా మూత్రవిసర్జనలో రకరకాల సమస్యలు తలెత్తడం సహజంగా జరిగే పరిణామమే. దీన్ని బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా’ అంటారు. ప్రోస్టేట్ గ్రంథి సమస్య సాధారణంగా 40 సంవత్సరాలు పైబడ్డ వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశవాసుల్లో ఈ సమస్య ఒకింత తక్కువేగానీ... పట్టణ ప్రాంతాల్లో, మాంసాహారం తినేవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన లక్షణాలు కనిపించినా, మూత్ర సమస్యలు వేధిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. కారణాలు : ప్రోస్టేట్ పెరగడానికి హార్మోన్ల స్థాయి తగ్గుదల ముఖ్యకారణం. కాస్త అరుదే అయినా గాయాలు కావడం గౌట్ సమస్య లక్షణాలు : మాటిమాటికీ మూత్రం రావడం పదే పదే మూత్ర విసర్జన చేయాలనిపించడం మూత్రం ఆపుకోలేకపోవడం మూత్రం ఆగి ఆగి రావడం మూత్ర విసర్జనలో రక్తం పడటం వ్యాధి నిర్ధారణ : అల్ట్రా సౌండ్ సోనోగ్రఫీ బయాప్సీ స్కానింగ్ చికిత్స : హోమియోపతి వైద్య విధానంలో ప్రోస్టేట్ గ్రంథి వాపు నుంచి పూర్తి ఉపశమనం కలిగించే మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ విధానంలో కేవలం లక్షణాలను తగ్గించడమే కాకుండా సమస్యను పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుంది. రోగి శారీరక తత్వాన్ని బట్టి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. ఆర్నికా, బెల్లడోనా, కోనియం, తూజా, మెర్క్‌సాల్ వంటి మందులు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. అయితే అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో తగిన మోతాదులో వీటిని వాడాల్సి ఉంటుంది. - డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి హైదరాబాద్ -
యూరాలజీ కౌన్సెలింగ్
ప్రోస్టేట్ వాచింది... చికిత్స ఏమిటి? నా వయసు 78 ఏళ్లు. ఇటీవలే మూత్రం రాక అల్లల్లాడి డాక్టర్‌ను సంప్రదిస్తే ప్రోస్టేట్ గ్రంథి వాచిందని, ఈ సమస్యను బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా (బీపీహెచ్) అంటారని చెప్పారు. సర్జరీ అవసరమని అన్నారు. నాకు ఆపరేషన్ అంటే భయం. సురక్షితమైన సర్జరీ ప్రక్రియలు ఏవైనా ఉన్నాయా తెలియజేయగలరు. - రఘురామయ్య, ఒంగోలు మీరు చెబుతున్న బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా అనే సమస్య చాలా పెద్ద వయసు వారిలో కనిపిస్తుండటం చాలా సాధారణం. ఈ సమస్య ఉండి, ఈ కింది లక్షణాలు కనిపిస్తే మాత్రం దాన్ని పరిష్కరించడానికి సర్జరీ అవసరమవుతుంది. అవి... → మూత్రాశయం నిండిపోయినా... మూత్రవిసర్జన సాధ్యం కాకపోవడం. → దీర్ఘకాలంపాటు ఈ సమస్యతో బాధపడుతుండటం వల్ల అది కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీయడం. → మూత్రవిసర్జన జరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున రక్తం పడుతుండటం → మూత్రాశయంలో రాళ్లు ఉండటం. పై సమస్యలు ఉన్నప్పుడు హైరిస్క్ పేషెంట్లలో సాధారణమైన ఓపెన్ సర్జరీ కంటే ఎండోస్కోపిక్ రెసెక్షన్తో ప్రోస్టేట్‌లో పెరిగిపోయిన భాగాన్ని తొలగించడం మేలు. ఈరోజుల్లో లేజర్ కిరణాలను ఉపయోగించడం ద్వారా ప్రోస్టేట్ సంబంధిత శస్త్రచికిత్సలను చాలా సురక్షితంగా చేయడం సాధ్యమవుతోంది. లేజర్స్ ఉపయోగించడం వల్ల రక్తాన్ని పలచబార్చే మందులను వాడే రోగులకూ శస్త్రచికిత్స చేయవచ్చు. ఎందుకంటే సంప్రదాయ శస్త్రచికిత్స ప్రక్రియలతో పోలిస్తే లేజర్స్ వల్ల రక్తస్రావం ఎక్కువగా జరిగే అవకాశం ఉండదు. పైగా ప్రోస్టేట్‌కు చేసే సంప్రదాయ శస్త్రచికిత్స వల్ల కొందరికి సైడ్‌ఎఫెక్ట్‌గా అంగస్తంభన వైఫల్యాలు రావచ్చు. కానీ లేజర్‌తో చేసే చికిత్సలో ఈ అవకాశం చాలా అరుదు అనే చెప్పాలి. ఇక ప్రోస్టేట్ గ్రంథి పెరిగిపోయిన హైరిస్క్ పేషెంట్లలో ఒక చిన్న గొట్టాన్ని (దీన్ని ప్రోస్టేటిక్ స్టెంట్ అంటారు) యురెథ్రాలోకి అంటే మూత్రనాళంలోకి అమర్చడం ద్వారా ప్రోస్టేట్ పెరుగుదల వల్ల మూత్రప్రవాహానికి పడ్డ అడ్డంకిని అధిగమించవచ్చు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ నందకుమార్ మాధేకర్ యూరాలజిస్ట్, యాండ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, సన్‌షైన్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
యాండ్రాలజీ కౌన్సెలింగ్
ఈ వయసులో ప్రోస్టేట్ సమస్యలు సాధారణం! నాకు 65 ఏళ్లు. ఇటీవల మూత్రపరీక్షలు చేయించుకుంటే ప్రోస్టేట్ గ్రంథిలో గడ్డలు వచ్చినట్లు చెప్పారు. మూత్రం సరిగ్గా రాకపోవడంతో ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా ఆపరేషన్ చేసి తొలగించాలని చెబుతున్నారు. దీన్ని తొలగించాక వీర్యం రాదు అని అంటున్నారు. అంగస్తంభన ఏమైనా దెబ్బతింటుందేమోనని నాకు ఆందోళనగా ఉంది. ఈ విషయంలో నాకు సరైన సలహా ఇవ్వగలరు. - జె.పి.ఆర్.కె., రాయచోటి అరవై ఏళ్లు పైబడ్డవారిలో ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు రావడం సాధారణం. వీటిని మందులతో లేదా ఎండోస్కోపీ (టీయూఆర్‌పీ) ప్రక్రియతో నయం చేస్తాం. ఎక్కువభాగం వీర్యం ఈ ప్రోస్టేట్ గ్రంథి వల్లనే తయారవుతుంది. కాబట్టి దీన్ని తొలగించినప్పుడు వీర్యం తక్కువగా వస్తుంది. అయితే సెక్స్ చేయడానికి గాని, సెక్స్‌లో సంతృప్తి పొందడానికి గాని ఈ ఆపరేషన్ ఏవిధంగానూ అడ్డంకి కాదు. దీని వల్ల ఎలాంటి సెక్స్ లోపమూ రాదు. అందువల్ల ఈ ఆపరేషన్ అవసరమని డాక్టర్లు చెబితే నిర్భయంగా టీయూఆర్‌పీ సర్జరీ చేయించుకోవచ్చు. నాకు 48 ఏళ్లు. ఈవుధ్యనే షుగర్ బయటపడింది. సెక్స్ చేశాక పురుషాంగం చివర నొప్పి, వుంటగా ఉంటోంది. అంగం మీద చర్మం కూడా బాగా పొడిపొడిగా, కొంచెం దురదగా ఉంటోంది. ఒకరోజు తర్వాత అంతా తగ్గిపోతోంది. అయితే పురుషాంగం మీది చర్మం వెనక్కు వెళ్లడం లేదు. నా సమస్యకు తగిన పరిష్కారం సూచించండి. - జీ.వి.ఆర్.ఎల్.ఎమ్., కందుకూరు షుగర్ ఉన్నవాళ్లలో పురుషాంగం చివరన ఉండే చర్మం వుూత్రంతో తడిసి అది ఇన్ఫెక్షన్కు దారితీయువచ్చు. ఒక్కోసారి పేషంట్స్లో షుగర్ వ్యాధి ఈ కారణం వల్లనే బయటపడుతుంది. ఈ కండిషన్‌ను బెలనోప్టరుుటిస్ అని అంటారు. ఇలా కావడం ఇదే మొదటిసారి కాబట్టి డాక్టర్‌ను కలిసి యూంటీబయూటిక్ పూర్తి కోర్సు తీసుకొండి. అలాగే డాక్టర్ సూచనల మేరకు లోకల్ కీమ్స్ కూడా అప్లరుు చేస్తే ఈ సవుస్య పూర్తిగా నయువువుతుంది. ఒకవేళ ఇదే కండిషన్ ఏడాదిలో రెండు, వుూడుసార్లు కనిపిస్తూ ఇలాగే ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంటే సున్తీ చేరుుంచుకోవడం శ్రేయస్కరం. ఒకసారి డయూబెటిస్ ఉందని తెలిసిన తర్వాత బ్లడ్ షుగర్‌ను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం. నాకు 25 ఏళ్లు. చాలా మంది అమ్మాయిలతో సెక్స్ సంబంధాలు ఉన్నాయి. ఈమధ్య మూత్రధార సరిగ్గా రావడం లేదు. జ్వరం వస్తోంది. బరువు తగ్గిపోతోంది. నాకు హెచ్ఐవీ వచ్చిందేమో అని భయంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - వి.బి.ఆర్., గుంటూరు మీరు మొట్టమొదట మీ వివాహేతర సంబంధాలను పూర్తిగా నిలిపివేయండి. ఆ తర్వాత హెచ్ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, హెపటైటిస్-సి, వీడీఆర్ఎల్ వంటి పరీక్షలన్నీ చేయించుకోండి. మూత్ర ధార సరిగ్గా రావడం లేదు కాబట్టి మూత్రం కల్చర్ పరీక్ష, ఆర్జీయూ అనే ఎక్స్-రే చేయించుకోవాలి. మీకు మూత్రనాళంలో ఏదైనా అడ్డంకి ఉందేమో చూడాలి. ఇలా ఉంటే దాన్ని స్ట్రిక్చర్ అంటారు. ఈ పరీక్షలన్నీ చేయించుకుని, ఆ ఫలితాల ఆధారంగా సరైన చికిత్స పొందండి. మీరు వెంటనే యూరాలజిస్ట్‌ను కలవండి.