ఈ వయసులో ప్రోస్టేట్ సమస్యలు సాధారణం!
నాకు 65 ఏళ్లు. ఇటీవల మూత్రపరీక్షలు చేయించుకుంటే ప్రోస్టేట్ గ్రంథిలో గడ్డలు వచ్చినట్లు చెప్పారు. మూత్రం సరిగ్గా రాకపోవడంతో ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా ఆపరేషన్ చేసి తొలగించాలని చెబుతున్నారు. దీన్ని తొలగించాక వీర్యం రాదు అని అంటున్నారు. అంగస్తంభన ఏమైనా దెబ్బతింటుందేమోనని నాకు ఆందోళనగా ఉంది. ఈ విషయంలో నాకు సరైన సలహా ఇవ్వగలరు.
- జె.పి.ఆర్.కె., రాయచోటి
అరవై ఏళ్లు పైబడ్డవారిలో ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు రావడం సాధారణం. వీటిని మందులతో లేదా ఎండోస్కోపీ (టీయూఆర్‌పీ) ప్రక్రియతో నయం చేస్తాం. ఎక్కువభాగం వీర్యం ఈ ప్రోస్టేట్ గ్రంథి వల్లనే తయారవుతుంది. కాబట్టి దీన్ని తొలగించినప్పుడు వీర్యం తక్కువగా వస్తుంది. అయితే సెక్స్ చేయడానికి గాని, సెక్స్‌లో సంతృప్తి పొందడానికి గాని ఈ ఆపరేషన్ ఏవిధంగానూ అడ్డంకి కాదు. దీని వల్ల ఎలాంటి సెక్స్ లోపమూ రాదు. అందువల్ల ఈ ఆపరేషన్ అవసరమని డాక్టర్లు చెబితే నిర్భయంగా టీయూఆర్‌పీ సర్జరీ చేయించుకోవచ్చు.
నాకు 48 ఏళ్లు. ఈవుధ్యనే షుగర్ బయటపడింది. సెక్స్ చేశాక పురుషాంగం చివర నొప్పి, వుంటగా ఉంటోంది. అంగం మీద చర్మం కూడా బాగా పొడిపొడిగా, కొంచెం దురదగా ఉంటోంది. ఒకరోజు తర్వాత అంతా తగ్గిపోతోంది. అయితే పురుషాంగం మీది చర్మం వెనక్కు వెళ్లడం లేదు. నా సమస్యకు తగిన పరిష్కారం సూచించండి.
- జీ.వి.ఆర్.ఎల్.ఎమ్., కందుకూరు
షుగర్ ఉన్నవాళ్లలో పురుషాంగం చివరన ఉండే చర్మం వుూత్రంతో తడిసి అది ఇన్ఫెక్షన్‌కు దారితీయువచ్చు. ఒక్కోసారి పేషంట్స్‌లో షుగర్ వ్యాధి ఈ కారణం వల్లనే బయటపడుతుంది. ఈ కండిషన్‌ను బెలనోప్టరుుటిస్ అని అంటారు. ఇలా కావడం ఇదే మొదటిసారి కాబట్టి డాక్టర్‌ను కలిసి యూంటీబయూటిక్ పూర్తి కోర్సు తీసుకొండి. అలాగే డాక్టర్ సూచనల మేరకు లోకల్ కీమ్స్ కూడా అప్లరుు చేస్తే ఈ సవుస్య పూర్తిగా నయువువుతుంది. ఒకవేళ ఇదే కండిషన్ ఏడాదిలో రెండు, వుూడుసార్లు కనిపిస్తూ ఇలాగే ఇన్ఫెక్షన్స్‌కు దారితీస్తుంటే సున్తీ చేరుుంచుకోవడం శ్రేయస్కరం. ఒకసారి డయూబెటిస్ ఉందని తెలిసిన తర్వాత బ్లడ్ షుగర్‌ను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం.
నాకు 25 ఏళ్లు. చాలా మంది అమ్మాయిలతో సెక్స్ సంబంధాలు ఉన్నాయి. ఈమధ్య మూత్రధార సరిగ్గా రావడం లేదు. జ్వరం వస్తోంది. బరువు తగ్గిపోతోంది. నాకు హెచ్‌ఐవీ వచ్చిందేమో అని భయంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి.
- వి.బి.ఆర్., గుంటూరు
మీరు మొట్టమొదట మీ వివాహేతర సంబంధాలను పూర్తిగా నిలిపివేయండి. ఆ తర్వాత హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, హెపటైటిస్-సి, వీడీఆర్‌ఎల్ వంటి పరీక్షలన్నీ చేయించుకోండి. మూత్ర ధార సరిగ్గా రావడం లేదు కాబట్టి మూత్రం కల్చర్ పరీక్ష, ఆర్‌జీయూ అనే ఎక్స్-రే చేయించుకోవాలి. మీకు మూత్రనాళంలో ఏదైనా అడ్డంకి ఉందేమో చూడాలి. ఇలా ఉంటే దాన్ని స్ట్రిక్చర్ అంటారు. ఈ పరీక్షలన్నీ చేయించుకుని, ఆ ఫలితాల ఆధారంగా సరైన చికిత్స పొందండి. మీరు వెంటనే యూరాలజిస్ట్‌ను కలవండి.
యాండ్రాలజీ కౌన్సెలింగ్
Published Thu, Jul 2 2015 11:24 PM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM
Advertisement