Homeopathic counseling
-
సోరియాసిస్‌కు చికిత్స ఉందా?
నా వయసు 38 ఏళ్లు. గత 10 సంవత్సరాలుగా సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్నో రకాల పూతలు, ఎన్నో మందులు వాడుతున్నా. తగినట్టే తగ్గి మళ్లీ మళ్లీ వస్తోంది. సమస్య పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? సోరియాసిన్ అనేది దీర్ఘకాలిక సమస్య. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 125 మిలియన్ల మంది దీనితో బాధపడుతున్నారని అంచనా. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరినీ బాధించే సమస్య సోరియాసిస్. దీనివల్ల సామాజికంగా కూడా రోగి చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. మానసిక అశాంతికి దారితీస్తుంది.చాలామంది సోరియాసిన్ను ఒక సాధారణ చర్మవ్యాధిగా భావిస్తారు. కానీ ఇది ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ సమస్య. ఇది చర్మ సమస్యే అయినా ఇది మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్యగా పరిగణించాలి. ఈ వ్యాధి వచ్చిన వారిలో చర్మ కణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడి, అవి వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్ల వంటివీ ఏర్పడతాయి. దురద కూడా ఎక్కువ. చిరాకుగా ఉంటుంది. సోరియాసిస్ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. కారణాలు : ►వంశపారంపర్యం ►మానసిక ఒత్తిడి, ఆందోళన ►శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత ►దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం. లక్షణాలు : ►చర్మం ఎర్రబారడం ►తీవ్రమైన దురద ►జుట్టు రాలిపోవడం ►కీళ్లనొప్పులు ►చర్మం పొడిబారినప్పుడు పగుళ్లు ఏర్పడి రక్తస్రావమూ అవుతుంది. నిర్ధారణ పరీక్షలు : స్కిన్ బయాప్సీ, ఈఎస్ఆర్, సీబీపీ, ఎక్స్–రే పరీక్షలు. చికిత్స : సోరియాసిస్ నివారణ/చికిత్సలకు హోమియోలో సమర్థమై మార్గాలు ఉన్నాయి. అయితే సోరియాసిస్‌ను వెంటనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి ఈ సమస్యనుంచి విముక్తి కోసం సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ స్పాండిలోసిస్ తగ్గుతుందా? నా వయసు 47 ఏళ్లు. గత కొన్ని నెలల నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అంటున్నారు. మందులు వాడుతున్నా, నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? ఎముకల అరుగుదల వల్ల వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్‌ను స్పాండిలోసిస్ అంటారు. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని పేర్కొంటారు. కారణాలు ►కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు. ►జాయింట్స్‌లోని ద్రవం తగ్గడం వల్ల ►స్పైన్ దెబ్బతినడం వల్ల ►వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి ఉండే దారి సన్నబడి, నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు సర్వైకల్ స్పాండిలోసిస్ : – మెడనొప్పి, తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. లంబార్ స్పాండిలోసిస్ : నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి మొదలై పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, నడవడానిక్కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి. నివారణ ►వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. చికిత్స ►రోగి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే కాన్స్టిట్యూషనల్ చికిత్సతో వారిలోని రోగనిరోధక శక్తి క్రమంగా పెరిగి, సమస్య పూర్తిగా తగ్గుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
వరుసగా అబార్షన్స్...సంతానం కలుగుతుందా?
నా వయసు 33 ఏళ్లు. పెళ్లయి ఎనిమిదేళ్లు అవుతోంది. మూడుసార్లు అబార్షన్ అయ్యింది. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని అన్నారు. అయినా ఈ విధంగా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. హోమియో ద్వారా నాకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉందా? మీకు జరిగినట్లు ఇలా రెండు లేదా మూడుసార్లు గర్భస్రావం అయితే దాన్ని ‘రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్’గా పేర్కొంటారు. కారణాలు: ►ఇలా గర్భస్రావాలు జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని... ►గర్భాశయం అసాధారణంగా నిర్మితమై ఉండటం (రెండు గదుల గర్భాశయం) ►గర్భాశయంలో కణుతులు / పాలిప్స్ ఉండటం ►గర్భాశయపు సర్విక్స్ బలహీనంగా ఉండటం ►కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు ►కొన్ని ఎండోక్రైన్ వ్యాధులు ►వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం ►రకరకాల ఇన్ఫెక్షన్లు రావడం వంటి ఎన్నో కారణాలు గర్భస్రావానికి దారితీస్తాయి. అయితే కొంతమందిలో ఎలాంటి కారణం లేకుండా కూడా గర్భస్రావాలు జరుగుతుండవచ్చు. చికిత్స: రోగనిరోధకశక్తిని పెంపొందించడం, హార్మోన్ల అసమతౌల్యతను చక్కదిద్దడం వంటి చర్యల ద్వారా సంతాన లేమి సమస్యను పరిష్కరించవచ్చు. అలాగే గర్భస్రావానికి దారితీసే అనేక కరణాలు కనుగొని, వాటికి తగి చికిత్స అందించడంతో పాటు కాన్స్టిట్యూషన్ పద్ధతిలో మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తే సంతాన సాఫల్యం కలుగుతుంది. అయితే అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో కారణాలతో పాటు వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన ఔషధాలను వాడితే సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ వేరికోస్వెయిన్స్తగ్గుతాయా? నా వయసు 45 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై నరాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా? మీకు ఉన్న సమస్య వేరికోస్ వెయిన్స్. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్ వెయిన్స్ అంటారు. ఇందులో శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు. ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. ఈ వేరికోస్ వెయిన్స్ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలలోనూ వస్తుంది కానీ 80 శాతం కేసుల్లో ఇది కాళ్లపైనే కనిపిస్తుంది. సాధారణంగా 30 ఏళ్ల పైబడిన వారిలో ఈ వేరికోస్ వెయిన్స్ కనిపిస్తుంది. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ►ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ►కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ►ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: ►కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ►కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం ►చర్మం దళసరిగా మారడం ►చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం వ్యాధి నిర్ధారణ: అల్ట్రాసౌండ్, డ్యూప్లెక్స్ డాప్లర్ అల్ట్రా సౌండ్. చికిత్స: వేరికోస్ వెయిన్స్, వేరికోసిల్ వంటి వ్యాధులకు అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులు సూచిస్తారు. ఈ సమస్యకు హామామెలిస్, పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ స్పాండిలోసిస్‌కు పరిష్కారం ఉందా? నా వయసు 45 ఏళ్లు. గత కొన్ని నెలల నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అంటున్నారు. మందులు వాడుతున్నా, నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? ఎముకల అరుగుదల వల్ల వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్‌ను స్పాండిలోసిస్ అంటారు. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని పేర్కొంటారు. కారణాలు: ►కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు ►జాయింట్స్‌లోని ద్రవం తగ్గడం వల్ల ►స్పైన్ దెబ్బతినడం వల్ల ►వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి ఉండే దారి సన్నబడి, నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు: సర్వైకల్ స్పాండిలోసిస్: మెడనొప్పి, తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. లంబార్ స్పాండిలోసిస్: నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి మొదలై పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, నడవడానిక్కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి. నివారణ: వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. చికిత్స: రోగి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే కాన్స్టిట్యూషనల్ చికిత్సతో వారిలోని రోగనిరోధక శక్తి క్రమంగా పెరిగి, సమస్య పూర్తిగా తగ్గుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
దేహంలోని నీరు పోతే...
నేను బిజినెస్ పనిమీద ఎక్కువగా ఎండలోనే గడపాల్సి ఉంటుంది. ఎండలు ఇప్పటికే తీవ్రం అయిపోయాయి. వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు. – సూర్యనారాయణ, ఖమ్మం భానుడి అధిక తాపాన్ని తట్టుకోలేక చాలామంది వడదెబ్బకు గురవుతుంటారు. ఇది ఒక ప్రాణాంతకమైన పరిస్థితి అనే చెప్పవచ్చు. అన్ని వయసుల వారినీ బాధిస్తుంది. చిన్న పిల్లలు, వృద్ధులకు తాకిడి ఎక్కుడ. అధిక వాతావరణ ఉష్ణోగ్రతకు గురికావడం వల్ల శరీరం శీతలీకరణ వ్యవస్థ పనిచేయకపోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత 102 ఫారెన్‌హీట్‌కు పెరిగి, కేంద్రనాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపడాన్ని వడదెబ్బ అంటారు. సాధారణంగా వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు... దేహం చెమటను స్రవించడం ద్వారా ఆ వేడిని తగ్గించుకుంటుంది. ఎక్కువ సమయం ఎండకు గురవడం వల్ల చెమట ద్వారా నీరు, లవణాలు ఎక్కువగా పోతాయి. వాటిని మళ్లీ భర్తీ చేసుకోలేనప్పుడు శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ సమయంలో శరీరంలోని కణాలు రక్తంలోని నీటిని ఉపయోగించుకుంటాయి. దాంతో మన రక్తం పరిమాణం తగ్గుతుంది. గుండె, చర్మం, ఇతర అవయవాలకు తగినంత రక్తప్రసరణ అందదు. దాంతో శీతలీకరణ వ్యవస్థ మందగించి శరీర ఉష్ణోగ్రత అంతకంతకూ పెరిగిపోతుంది. దేహం వడదెబ్బకు లోనవుతుంది. వడదెబ్బ లక్షణాలు: ఎండదెబ్బకు గల లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 102 ఫారెన్‌హీట్ డిగ్రీల కంటే ఎక్కువగా పెరిగిపోవడం, చర్మం పొడిబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెదడ, వాంతులు, వికారం, విరేచనాలు, కండరాల తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. తక్షణం స్పందించి జాగ్రత్త తీసుకోకపోతే పరిస్థితి విషమిస్తుంది. వడదెబ్బకు లోనైన వ్యక్తి కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: నీరు, ఇతర ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి ఎండలో తిరగడాన్ని తగ్గించాలి, తలపై ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వదులుగా ఉండే పల్చటి, లేతవర్ణం దుస్తులను ధరిస్తే మంచిది. మాంసాహారం, టీ, కాఫీ, మసాలాలు మానేయడం లేదా తక్కువగా తీసుకోవడం మేలు. కూరగాయలు, పప్పులు, పుచ్చ, నారింజ, ద్రాక్ష పండ్ల వంటి తాజాఫలాలు తీసుకోవాలి రోజుకు 10 – 12 గ్లాసుల నీరు తాగాలి మద్యం వల్ల దేహం డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది పిల్లల్ని తీవ్రమైన ఎండలో ఆడనివ్వవద్దు. నీడపట్టునే ఉండేలా చూడాలి. -
ఫారింజైటిస్...
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 32 ఏళ్లు. నాకు గత కొంతకాలంగా గొంతు పచ్చి చేసి పుండులా ఏర్పడటంతో తీవ్రమైన గొంతునొప్పి వస్తోంది. ఆహారం మింగే సమయంలో ఇబ్బందిగా ఉంటోంది. మందులు వాడినప్పుడు సమస్య తగ్గినా జలుబు చేసినప్పుడు, తెల్లవారుజామున చల్లటి వాతావరణాన్ని ఎదుర్కొన్న ప్రతిసారీ సమస్య తిరగబెడుతోంది. గత చలికాలంలో నాకు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉండేది. అయితే పగటివేళ ఎండ ఎక్కువగానే ఉంటున్నా... ఇప్పుడు ఉదయం పూట చలికి తిరిగినప్పుడు సమస్య మళ్లీ మళ్లీ వస్తోంది. హోమియో చికిత్స ద్వారా మళ్లీ తిరగబెట్ట విధంగా పూర్తిగా నయం చేసేలా సలహా ఇవ్వగలరు. – సంతోష్మోహన్, నిజామాబాద్ మీరు తెలిపిన వివరాలను బట్టి మీరు ఫ్యారింజైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గొంతు వెనక భాగాన్ని ఫ్యారింగ్స్ అంటారు. ఈ భాగానికి ఇన్ఫెక్షన్ రావడాన్ని ఫ్యారింజైటిస్ లేదా సోర్ థ్రోట్ అంటారు. సాధారణంగా ఈ వ్యాధి ఒక వారం రోజలలో తగిపోతుంది. కానీ సరైన చికిత్స అందించకుండా తరచూ ఈ వ్యాధికి గురవుతున్నట్లయితే చెవి ఇన్ఫెక్షన్లు, సైనసైటిస్, కిడ్నీ సంబంధింత వ్యాధులు (గ్లోమరులోనెఫ్రైటిస్), రుమాటిక్ ఫీవర్ వంటి వాటికి దారితీయవచ్చు ఒక్కోసారి శరీరమంతా ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం కూడా ఉంది. కారణాలు: ►ఈ వ్యాధి 90 శాతం కేసుల్లో వైరస్ వల్ల కలుగుతుంది. జలుబు, ఫ్లూ, మీజిల్స్, మోనోనూక్లియోసిస్, చికన్పాక్స్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ సమస్యకు కారణం కావచ్చు. ►మరికొంత మందిలో ఇది బ్యాక్టీరియా వల్ల కూడా కావచ్చు. కోరింతదగ్గు, కొన్ని స్టెఫలోకోకస్ సూక్ష్మజీవులు, డిఫ్తీరియా వంటి బ్యాక్టీరియా వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ►ఈ ఇన్ఫెక్షన్కు గురైన వ్యక్తి దగ్గడం లేదా తుమ్ముడం చేసినప్పుడు ఆ తుంపిర్ల ద్వారా వైరస్ లేదా బ్యాక్టీరియా గాల్లోకి చేరి, తద్వారా ఇతర వ్యక్తులకు వ్యాపించే అవకాశం ఉంది. ►పొగతాగడం, పరిశుభ్రత పాటించకపోవడం, వ్యాధికి గురైన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వంటి అంశాల వల్ల ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుంది. ► కొన్ని అలర్జీలు, గొంతుకండరాలు ఒత్తిడికి గురికావడం, గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ), హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు, గొంతు, నాలుక లేదా లారింగ్స్లో కణుతులు ఏర్పడటం వల్ల కూడా గొంతు నొప్పి కలుగుతుంది. లక్షణాలు: ► ఫ్యారింజైటిస్ ముఖ్యలక్షణాల్లో గొంతునొప్పి, మింగేటప్పుడు నొప్పిగా ఉండటం చాలా ముఖ్యమైనవి. మిగతా లక్షణాలు ఇన్ఫెక్షన్కు కారణమైన బ్యాక్టీరియా లేదా వైరస్ మీద ఆధారపడి ఉంటాయి. ► వైరల్ ఫ్యారంజైటిస్ : గొంతునొప్పితో పాటు గొంతులోపలి భాగం ఎర్రగా మారడం, ముక్కు కారణం లేదా ముక్కుదిబ్బడ, పొడిదగ్గు, గొంతు బొంగురుపోవడం, కళ్లు ఎర్రబారడం, చిన్న పిల్లల్లో విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లలో నోటిలో, పెదవులపై పుండ్లలా ఏర్పడటం కూడా సంభవిస్తుంది. ► బ్యాక్టీరియల్ ఫ్యారంజైటిస్ : దీనిలో కూడా గొంతు పచ్చిగా ఉండటం, మింగే సమయంలో నొప్పి కలగడం, గొంతు ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్లతో పోలిస్తే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో లక్షణాల తీవ్రత ఎక్కువ. ► పైన పేర్కొన్న లక్షణాలతో పాటు జ్వరం, ఒంటినొప్పులు, తలనొప్పి, టాన్సిల్స్ వాపు, వాటి చుట్టూ తెల్లటి పొర ఏర్పడటం, గొంతుకు ముందుభాగంలోని లింఫ్‌గ్రంథుల వాపు వంటి లక్షణాలు గమనించవచ్చు. ► ఇదే సమస్య పిల్లల్లో వస్తే... కొంతమంది చిన్నపిల్లల్లో వికారం, వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలూ కనిపించవచ్చు. చికిత్స: ఒంట్లోని రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు సూక్ష్మజీవుల వల్ల ఫ్యారింజైటిస్ వస్తుంది. జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో రోగి శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి లక్షణాలు, కారణాలు, వాతావరణంలోని మార్పుల ఆధారంగా చికిత్స చేయవచ్చు. హోమియో విధానంలో చికిత్సతో ఈ వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ సమస్యకు దీర్ఘకాలికంగా యాంటీబయాటిక్స్ వాడితే కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చు. కానీ హోమియో విధానంలో సమస్య మళ్లీ తిరగబెట్టకుండా చికిత్స చేయడం సాధ్యమే. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
కూర్చోవడానికీ ఇబ్బందిగా ఉంది!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 47 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి మలద్వారం వద్ద బుడిపెలా బయటకు వస్తోంది. మల విసర్జన సమయంలో రక్తం పడుతోంది. అప్పుడప్పుడు సూదితో గుచ్చినట్లు నొప్పి వస్తోంది ఉంది. కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది. డాక్టర్ పైల్స్ అని చెప్పారు. హోమియోతో నయమవుతుందని తెలిసింది. తగిన సలహా ఇవ్వండి. – ఈశ్వర్‌కుమార్, జగ్గయ్యపేట ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తున్న సమస్యలలో ఇది ఒకటి. మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే రక్తనాళాలు (సిరలు) ఉబ్బి, మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి, ఇబ్బంది పెడతాయి. తీవ్రతను బట్టి వీటిని నాలుగు దశలుగా వర్గీకరించవచ్చు. మొలల దశలు: గ్రేడ్–1 దశలో మొలలు పైకి కనిపించవు. నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది. గ్రేడ్–2లో రక్తం పడవచ్చు, పడకపోవచ్చు కానీ మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి. ⇔ వాటంతట అవే లోపలకు వెళ్లిపోతుంటాయి. గ్రేడ్–3లో మల విసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి. ⇔ కానీ మల విసర్జన తర్వాత తర్వాత వాటంతట అవి లోపలికి పోకుండా వేలితో నెడితే లోనికి వెళ్తాయి. గ్రేడ్–4 దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు. కారణాలు: ∙మలబద్ధకం ∙మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండరబంధనం సాగిపోతుంది. ⇔ తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి ⇔ సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం ∙స్థూలకాయం (ఒబేసిటీ) ⇔ చాలాసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువ ⇔ మలబద్ధకమేగాక అతిగా విరేచనాలు కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు ⇔ మంచి పోషకాహారం తీసుకోకపోవడం ∙నీళ్ళు తక్కువగా తాగడం ⇔ ఎక్కువగా ప్రయాణాలు చేయడం lఅధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం ⇔ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లు నొప్పి ⇔ మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం. నివారణ: మలబద్ధకం లేకుండా చూసుకోవాలి ⇔ సమయానికి భోజనం చేయాలి ⇔ ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువుండేలా చూసుకోవాలి. ⇔ కొబ్బరినీళ్లు, నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ⇔ మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తగ్గించాలి. ⇔ మెత్తటి పరుపుపై కూర్చోవాలి. హోమియోలో రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఇచ్చే మందులిచ్చి వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. -
సర్వైకల్ స్పాండిలోసిస్‌కు శాశ్వత పరిష్కారం
హోమియో కౌన్సెలింగ్ నా వయస్సు 45 సంవత్సరాలు. నేను గత కొంతకాలంగా మెడనొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్ని సంప్రదిస్తే మెడ ప్రాంతంలోని వెన్నెముకలోని డిస్కులు అరుగుదలకు గురయ్యాయని చె ప్పి, మందులు ఇచ్చారు. అవి వాడుతున్నా, ఉపశమనం లభించడం లేదు. పైగా చేతులు కూడా బలహీనంగా అనిపిస్తున్నాయి. చిన్న బరువులు కూడా ఎత్తలేకపోతున్నాను. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు. - కె.శ్రీనివాస్, ఒంగోలు మెడనొప్పి, ఈ మధ్యకాలంలో చిన్న వయస్సు వారిని కూడా వేధించే ఆరోగ్య సమస్య. మారుతున్న మానవుని జీవన విధానం వల్ల ఈ విధమైన సమస్యలు చిన్న వయస్సులో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్ని రకాల మందులు వాడినా ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం లభించక చాలామంది బాధపడుతుంటారు. కానీ హోమియో చికిత్స ద్వారా పూర్తిగా నయం అయే అవకాశం ఉంది. మెడ భాగంలోని వెన్నెముకలోని డిస్కులు, జాయింట్లలోని మృదులాస్తి క్షీణతకు గురవడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. దాదాపు 15 శాతం పైగా ఇది 60 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: వయస్సు పైబడటం, వ్యాయామం లేకపోవడం, క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగటం, డిస్కులు జారిపోవడం లేదా చీలికకు గురికావడం, వృత్తిరీత్యా అధిక బరువులు మోయటం, మెడను ఎక్కువ సమయం అసాధారణ రీతిలో ఉంచడం, ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు పని చేయడం, ఎత్తై దిండ్లు వాడటం, ఎక్కువ సమయం మెడను వంచి ఉంచడం, మెడకు దెబ్బ తగలడం, పూర్వం మెడకు శస్త్ర చికిత్స జరిగి ఉండటం, అధిక మానసిక ఒత్తిడి, అధిక బరువు, ధూమపానం, జన్యుపరమైన అంశాల వల్ల మెడనొప్పి పెరిగే అవకాశం ఉంది. లక్షణాలు: సాధారణం నుండి తీవ్రస్థాయిలో మెడనొప్పి. మెడనుంచి భుజాలకు, చేతులకు, వేళ్ల వరకు పాకడం, డిస్కులు అరుగుదల వల్ల వెన్నుపూసల మధ్య స్థలం తగ్గి రాపిడి శబ్దాలు వినిపించడం, మెడ బిగుసుకుపోవడం, తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం, నరాలపై ఒత్తిడి పడితే చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవటం, చిన్న బరువులు కూడా ఎత్తలేకపోవడం, నడకలో నిలకడ కోల్పోవడం వంటివి. చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో మాత్రమే అందించే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్సా విధానం ద్వారా మీ మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని, అందుకు సరిపడా ఔషధాన్ని అందించడం ద్వారా మెడనొప్పిని పూర్తిగా నయం చేయడమే కాకుండా వెన్నెముకను దృఢం చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి,హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
పక్క తడుపుతున్నాడు
హోమియో కౌన్సెలింగ్ మా బాబు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రాత్రి నిద్రలో అప్పుడప్పుడు పక్క తడుపుతున్నాడు. కొన్నిసార్లు పగటి నిద్రలో కూడా. దీనికి కారణం ఏమిటి? హోమియో ద్వారా దీన్ని నివారించవచ్చా? - ఒక సోదరి, మోత్కూరు ప్రపంచంలో ప్రతి మూలలోనూ ఇలాంటి సమస్యతో పిల్లలు, ఈ కారణంగా బాధపడే తల్లిదండ్రులు ఉంటారు. దీన్ని బెడ్‌వెట్టింగ్ లేదా నాక్చర్నల్ అన్యురసిస్ లేదా స్లీప్ వెట్టింగ్ అంటారు. కొందరు పిల్లలు పగలు నిద్రపోయేటప్పుడు కూడా మూత్రవిసర్జన చేస్తుంటారు. ముఖ్యంగా ఆరు సంవత్సరాలలోపు పిల్లల్లో ఈ పరిస్థితిని ఎక్కువగా చూస్తుంటాం. మూత్రాశయం మీద నియంత్రణ నాలుగు సంవత్సరాల వయసులో వస్తుంది. కొందరిలో ఆ తర్వాత వస్తుంది. ఐదేళ్లలోపు పిల్లల్లో 16 శాతం మందిలో, ఆరేళ్ల పిల్లల్లో 13 శాతం, ఏడు-ఎనిమిదేళ్ల పిల్లల్లో 9 శాతం మందిలో, పది-పద్నాలుగేళ్ల పిల్లల్లో 4 శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. బెడ్ వెట్టింగ్ అన్నది పిల్లల్లో అసంకల్పితంగా జరుగుతుంది. ఎవ్వరూ కావాలని ఇలా చేయరు. దీనివల్ల బాధపడే పిల్లలు బయట ఎవరికీ దీన్ని చెప్పుకోలేరు. ఇక తల్లిదండ్రులు దీని గురించి పిల్లలపై అరవడం, వారిని భయపెట్టడం చేస్తుంటారు. తాము పెద్ద తప్పు చేస్తున్నామనే అపరాధ భావనను పిల్లల్లో కలిగిస్తుంటారు. అది పిల్లల్లో మరింత ఆత్మన్యూనతకు కారణమవుతుంది. కారణాలు : మూత్రంలో ఇన్ఫెక్షన్ వంశపారంపర్యం ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకోవడం కొందరిలో మానసిక వైకల్యం ఫుడ్ అలర్జీలు లక్షణాలు : రాత్రిపూట పక్క తడపడంతో పాటు మరికొన్ని లక్షణాలు కూడా పిల్లల్లో కనిపిస్తుంటాయి. అవి... మాటిమాటికీ మూత్ర విసర్జన చేస్తుండటం మూత్రంలో మంట మలబద్దకం వ్యాధి నిర్ధారణ : యూరినరీ అనాలసిస్, అల్ట్రాసౌండ్, యూరోడైనమిక్స్ చికిత్స : హోమియోలో మంచి మందులు ఉన్నాయి. కండరాలను నియంత్రణలోకి వచ్చేలా చేయడంలో అవి బాగా తోడ్పడతాయి. హోమియోలో నక్స్‌వామికా, పల్సటిల్లా, సెపియా, కాస్టికమ్ వంటి మందులు ఇందుకు సమర్థంగా తోడ్పడతాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో అవి వాడాల్సి ఉంటుంది. - డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
టైప్-1 డయాబెటిస్‌కు చికిత్స ఉందా?
హోమియో కౌన్సెలింగ్ టైప్-1 డయాబెటిస్ అంటే ఏమిటి? మా పిల్లవాడికి టైప్-1 డయాబెటిస్ అన్నారు. దీని గురించి వివరించి, మావాడు పాటించాల్సిన ఆహార నియమాలు వివరించండి. - నరేంద్రకుమార్, విజయవాడ పిల్లల్లో సాధారణంగా 15 ఏళ్ల లోపు వారిలో వచ్చే చక్కెర వ్యాధిని టైప్-1 డయాబెటిస్ అంటారు. టైప్-1 డయాబెటిస్ అంటే ఇందులో క్లోమగ్రంథి అస్సలు పనిచేయదు. అంటే క్లోమగ్రంథి తయారు చేయాల్సిన ఇన్సులిన్ శరీరంలో అస్సలు ఉండదు. లక్షణాలు: టైప్-1 డయాబెటిస్ హఠాత్తుగా వస్తుంది. రక్తంలో గ్లూకోజు ఆర్నెల్ల నుంచి పన్నెండు నెలల్లోపు 100-500 పెరగవచ్చు. ఆకలి, దాహం వేయడం, మూత్రవిసర్జనకు ఎక్కువసార్లు వెళ్తుంటారు. రోగనిరోధకశక్తి తగ్గడంతో తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. ఎదుగుదల తగ్గుతుంది. చిన్నపిల్లల్లో డయాబెటిస్ ఉంటే పాటించాల్సిన ఆహార నియమాలు: పిల్లల్లో ఎలాంటి ఆహార నియమాలు వద్దు 15-25 మధ్య వయసువారు లావుగా ఉంటేనే బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే జంక్‌ఫుడ్ తగ్గించుకోవాలి. ఇన్సులిన్ నిరోధకత రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ను పెంచుతుంది కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే ఆహారంలో పిండిపదార్థాలు తగ్గించుకోవాలి 5-15 ఏళ్ల వయసువారికి ఎలాంటి ఆహారనియమాలు పెట్టకూడదు. వారి ఎదుగుదల కోసం వాళ్ల బరువుకు తగినట్లు ఎన్ని క్యాలరీలు అవసరమవుతాయో డైటీషియన్‌ను సంప్రదించి వారు చెప్పినట్లు పాటించాలి. త్వరగా జీర్ణమయ్యే పిండి పదార్థాలను వాడాలి. మార్కెట్లో దొరికే పిజ్జా, బర్గర్, ఐస్‌క్రీమ్స్, నూడుల్స్, బిస్కెట్లు వాడకూడదు.పిల్లల ఎదుగుదలకు ఆహారం ఎంతోముఖ్యం. కాబట్టి తల్లిదండ్రులు ఆహారం విషయంలో ఆంక్షలు విధించడం, ఆహారాన్ని తగ్గించి, వ్యాయామాలను పెంచడం చేస్తే అసలే పిల్లల్లో తక్కువగా ఉండే రోగనిరోధకశక్తి మరింత తగ్గుతుంది. దీనికితోడు క్షయవ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. చికిత్స: హోమియోలో టైప్-1కు అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది. ఇన్సులిన్‌తోపాటు హోమియో మందులు ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మీరు మీ బాబుకు హోమియో చికిత్స ఇప్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. - డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్,పాజిటివ్ హోమియోపతి,విజయవాడ, వైజాగ్ -
సైనస్‌కు సమర్థమైన చికిత్స
హోమియో కౌన్సెలింగ్ నా వయస్సు 22 ఏళ్లు. గత 7 ఏడేళ్లుగా సైనసైటిస్ వ్యాధితో బాధపడుతున్నాను. రెండేళ్ల క్రితం సమస్య తీవ్రతరమవడంతో శస్త్ర చికిత్సను కూడా చేయించుకోవడం జరిగింది. తరువాత కొన్ని నెలల వరకు బాగానే వున్నా, వ్యాధి మళ్లీ మొదలవుతుండడంతో వాతావరణ మార్పులు ఏర్పడినప్పుడల్లా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. నా ఈ సమస్య హోమియో చికిత్స ద్వారా మళ్లీ తిరగబెట్టకుండా సంపూర్ణంగా నయమయ్యే అవకాశం ఉందా? - భాస్కర్, మంగళగిరి సైనసైటిస్ దీర్ఘకాలికంగా వేధించే శ్వాసకోశ సంబంధిత వ్యాధి. చల్లని వాతావరణం ఏర్పడిందంటే, దీని బారిన పడినవారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. శస్త్రచికిత్స చేయించిన తరువాత కూడా ఇది మళ్లీ తిరగబెట్టే అవకాశముంటుంది. అయితే హోమియో చికిత్స ద్వారా ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుంది సైనస్‌లోని శ్లేష్మపు పొర శోదమునకు లేదా వాపునకు గురవడాన్ని సైనసైటిస్ అని అంటారు. కారణాలు: తరచూ జలుబు చేయడం, ఎలర్జీ సమస్యలు, డిఎన్ఎస్ - ముక్కు రంధ్రాల మధ్య గోడ పక్కకు మరలడం, నాజల్ పాలిస్, ఏదైనా దెబ్బ తగలడం వలన సైనస్ ఎముకలు విరగడం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం,ఆస్తమా మొదలైన సమస్యలు దీనికి ప్రధాన కారణాలు. లక్షణాలు: - ముక్కు దిబ్బడ, సైనస్ ప్రభావిత భాగాలలో నొప్పి, ముక్కు ద్వారా చీముతో కూడిన ద్రవాలు బయటకు రావడం, తల నొప్పి. పంటి నొప్పి, దగ్గు, జ్వరం, నీరసం, నోటి దుర్వాసన వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: శ్వాసకోశ ఇబ్బందులన్నింటిలోకి ప్రధానమైన సమస్య అయిన సైనసైటిస్ వ్యాధికి హోమియోలో పత్యేక రీతిలో సమర్థమైన చికిత్స వుంది. అధునాతమైన జెనెటిక్ కాన్స్టిట్యుషనల్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరచి,సైనసైటిస్‌ని సంపూర్ణంగా నివారింపచేయడం పూర్తిగా సాధ్యమవుతుంది. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
ముక్కులో కండ.. తగ్గుతుందా..?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 28 సంవత్సరాలు. నాకు గత కొంతకాలంగా ముక్కులో కండమాదిరి పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుండడంతో డాక్టర్ని సంప్రదించాను. వారు వాటిని నాజల్ పాలిప్స్‌గా నిర్ధారించి, కొన్ని మందులు రాసిచ్చారు. అవి వాడుతున్నాను కానీ పూర్తి ఉపశమనం లభించడం లేదు. . హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటే చెప్పగలరు. - నాగేంద్రకుమార్, కడప నాజల్ పాలిప్స్ అనేది దీర్ఘకాలికంగా వేధించే శ్వాసకోశ సమస్య. చల్లని వాతావరణం ఏర్పడితే ఈ వ్యాధితో బాధపడేవారు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించినా మళ్లీ తిరగబెట్టొచ్చు. మీరు ఆందోళన చెందకండి. హోమియో చికిత్స ద్వారా మీ సమస్య పూర్తిగా నయం అవుతుంది. ముక్కు, సైనస్లలో ఏర్పడే మృదువైన కండ కలిగిన వాపును నాజల్ పాలిప్స్ అంటారు. ఇది ముక్కు రెండు రంధ్రాలలోనూ, సైనస్‌లలోనూ ఏర్పడతాయి. ఏ వయస్సు వారైనా ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది. కానీ యుక్త, మధ్యవయస్సు కలిగిన వారిలో, స్త్రీలలో కంటే 2-4 రెట్లు పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా ముక్కు లోపలిభాగం, సైనస్‌లు ఒకవిధమైన మృదువైన శ్లేష్మపు పొరతో కప్పి ఉంటాయి. ఈ పొర ఒకవిధమైన పల్చటి ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఈ ద్రవం ముక్కునూ, సైనస్లనూ తేమగా ఉంచుతూ ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశించిన దుమ్మూధూళీ ఇతర సూక్ష్మజీవులను చిన్న వెంట్రుకల లాంటి వాటి సాయంతో గొంతులోకి, ముక్కులోకీ చేర్చి తద్వారా బయటకు పంపేస్తుంటుంది. ఈ శ్లేష్మపు పొర దీర్ఘకాలికంగా శోధకు గురయితే అది వాచి గురుత్వాకర్షణ వలన కిందకు వేలాడటం మూలాన పాలిప్స్ ఏర్పడతాయి. ఇవి ముక్కు రంధ్రాలకు అడ్డుగా నిలుస్తాయి. తద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. కారణాలు: ఈ సమస్యకి కచ్చితమైన కారణాలు తెలియరాలేదు కానీ తర చు ఇన్ఫెక్షన్కు గురికావడం, ఆస్తమా, దీర్ఘకాలికంగా సైనసైటిస్‌కు గురికావడం, అలర్జిక్ రైనైటిస్, ఆస్ప్రిన్ లాంటి మందులకు సున్నితత్వం కలిగి ఉండటం, వంశపారంపర్యత వంటి అంశాలు మాత్రం ఈ వ్యాధిని ప్రేరేపిస్తాయని చెప్పొచ్చు. లక్షణాలు: ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం తద్వారా నోటిద్వారా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. ఈ సమస్య వల్ల రాత్రిళ్లు నిద్రలో కొంత సమయం ఊపిరి ఆడకపోవడం వల్ల నిద్రసరిగా పట్టకపోవడం, గురక, వాసన, రుచిని గ్రహించే శక్తి మందగించటం, తలనొప్పి, ముఖం లేదా నుదురు భాగంలో నొప్పిగా ఉండటం, కళ్లలో దురద వంటివి. చికిత్స: హోమియోలో అందించే అధునాతనమైన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం ద్వారా అసమతుల్యతకు గురయిన రోగనిరోధక శక్తిని సరిచేస్తారు. తద్వారా నాజల్ పాలిప్స్ సమస్య పూర్తిగా న యం అవుతుంది. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్, సీఎండ్‌డి, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
మాటిమాటికీ మూత్రం... ఎందుకిలా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. గత ఆర్నెల్ల నుంచి రాత్రిపూట మూత్ర విసర్జన కోసం మాటిమాటికీ లేచేవాణ్ణి. ఈమధ్య మూత్రం బొట్లు బొట్లుగా వస్తోంది. కంట్రోల్ తప్పింది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - రమేశ్, కందుకూరు పురుషుల్లో అత్యంత ప్రధానమైన గ్రంథి ప్రోస్టేట్ (పౌరుషగ్రంథి). ఇది వీర్యం ఉత్పత్తిలో కీలకమైన భూమిక పోషిస్తుంది. సంతానం కలగజేయడానికి కారణమయ్యే శుక్రకణాలు ఈ ప్రోస్టేట్ గ్రంథి తయారు చేసే స్రావాలలో కలిసి వీర్యం రూపంలో బయటకు వస్తుంటాయి. ఇలా సంతాన సాఫల్యంలో ఈ గ్రంథికి అంతటి ప్రాధాన్యం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ గ్రంథి కొద్దికొద్దిగా ఉబ్బుతుంటుంది. ఫలితంగా మూత్రవిసర్జనలో రకరకాల సమస్యలు తలెత్తడం సహజంగా జరిగే పరిణామమే. దీన్ని బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా’ అంటారు. ప్రోస్టేట్ గ్రంథి సమస్య సాధారణంగా 40 సంవత్సరాలు పైబడ్డ వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశవాసుల్లో ఈ సమస్య ఒకింత తక్కువేగానీ... పట్టణ ప్రాంతాల్లో, మాంసాహారం తినేవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన లక్షణాలు కనిపించినా, మూత్ర సమస్యలు వేధిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. కారణాలు : ప్రోస్టేట్ పెరగడానికి హార్మోన్ల స్థాయి తగ్గుదల ముఖ్యకారణం. కాస్త అరుదే అయినా గాయాలు కావడం గౌట్ సమస్య లక్షణాలు : మాటిమాటికీ మూత్రం రావడం పదే పదే మూత్ర విసర్జన చేయాలనిపించడం మూత్రం ఆపుకోలేకపోవడం మూత్రం ఆగి ఆగి రావడం మూత్ర విసర్జనలో రక్తం పడటం వ్యాధి నిర్ధారణ : అల్ట్రా సౌండ్ సోనోగ్రఫీ బయాప్సీ స్కానింగ్ చికిత్స : హోమియోపతి వైద్య విధానంలో ప్రోస్టేట్ గ్రంథి వాపు నుంచి పూర్తి ఉపశమనం కలిగించే మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ విధానంలో కేవలం లక్షణాలను తగ్గించడమే కాకుండా సమస్యను పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుంది. రోగి శారీరక తత్వాన్ని బట్టి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. ఆర్నికా, బెల్లడోనా, కోనియం, తూజా, మెర్క్‌సాల్ వంటి మందులు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. అయితే అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో తగిన మోతాదులో వీటిని వాడాల్సి ఉంటుంది. - డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి హైదరాబాద్ -
సకాలంలో చికిత్స అందిస్తే పక్షవాతాన్ని నియంత్రించవచ్చు!
న్యూరో కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 45 ఏళ్లు. ఇటీవల ఆమెకు పక్షవాతం వచ్చింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యమైంది. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే మా అమ్మగారికి బ్రెయిన్లో రక్తం క్లాట్ అవ్వడంతో స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం మా అమ్మగారు మాట్లాడలేకపోతున్నారు. ఆమెను క్రమం తప్పకుండా ఆసుపత్రికి తీసుకెళ్ల చికిత్స అందిస్తున్నాం. పక్షవాతం వస్తే అది పూర్తిగా నయం కాదా? ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారకుండా ఉండటానికి ఎలాంటి చికిత్సను అందించాలో దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - కళ్యాణి, చిత్తూరు శరీరంలోని అన్ని అవయవాలను నియంత్రించేది మెదడు ఒక్కటే. శరీరానికి బ్రెయిన్ ఒక కంట్రోల్ రూమ్ లాంటిది అలాంటి మెదడులో క్లాట్ ఏర్పడటం అంటే అది శరీరంలోని అవయవాలపై నేరుగా ప్రభావం చూపడమే. ఈ సమస్య వల్ల కొన్ని అవయవాలపై మెదడు తన నియంత్రణను కోల్పోతుంది. అయితే మెదడులో క్లాట్ ఏర్పడటం అరుదైన విషయమేమీ కాదనే చెప్పాలి. వయసు, స్ట్రెస్, మానసిక ఆందోళన, జీవనశైలి, డయాబెటిస్, స్థూలకాయం, బీపీ, జన్యుపరమైన ఇతరత్రా కారణాల వల్ల ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది. పక్షవాతం బారిన పడటానికి ముందస్తుగా ప్రతి ఒక్కరిలో కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఈ ప్రమాద ఘంటికలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదిస్తే చాలా వరకు సమస్యలను అధిగమించవచ్చు. మెదడులో రక్తసరఫరా ఆగిన చోటును బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. మూతి వంకరపోవడం, ముఖం, చేతులు బలహీనపడటం, నడకలో తేడా రావడం, అస్పష్టంగా కనిపించడం, మాట్లాడటంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. హెచ్చరికల్లాంటి ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలా కాకుండా స్ట్రోక్ వచ్చి ఆలస్యమైనప్పటికీ ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అన్ని వైద్య సదుపాయాలున్న ఆసుపత్రిలో నిపుణులైన న్యూరోసర్జన్ లేదా న్యూరాలజిస్ట్లను సంప్రదిస్తే మంచి ఫలితం ఉంటుంది. మీ అమ్మగారి చికిత్స విషయంలో మీకు ఎలాంటి భయాలూ అవసరం లేదు. వైద్యశాస్త్రంలో వచ్చిన అధునాతనమైన సాంకేతిక పురోగతితో మీ అమ్మగారి సమస్యను కరెక్టుగా గుర్తించి న్యూరో నావిగేషన్, మినిమల్లీ ఇన్వేజిక్, అవేక్ సర్జరీ లాంటి అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మెరుగైన వైద్యాన్ని అందించి, ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారకుండా కాపాడుకోవచ్చు. అలాగే బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ హ్యామరేజి, మల్టిపుల్ క్లాట్స్, బ్రెయిన్ ఎన్యురిజమ్స్ లాంటి తీవ్రమైన మెదడుకు సంబంధించిన ప్రాణాపాయ వ్యాధులను సమర్థంగా ఎదుర్కొనే అవకాశమూ ఉంది. మీకు ఎలాంటి భయాందోళనలూ అవసరం లేదు. అలాగే మీ అమ్మగారికి పక్షవాతం వచ్చింది కాబట్టి మీరు, మీ తోబుట్టువులు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. మీకు గానీ, మీ తోబుట్టువులకు గాని డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం (ఒబేసిటీ) లాంటి సమస్యలు ఉంటే వాటిని అదుపులో ఉంచుకోవడం అవసరం. - డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం, సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ పీసీఓడీని నయం చేయవచ్చా? హోమియో కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 26 ఏళ్లు. తనకు నెలసరి క్రమంగా రాదు. బరువు కూడా పెరుగుతోంది. ఇంకో 2 నెలల్లో వివాహం చేయాలనుకుంటున్నాం. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్ని పరీక్షలు చేసి పీసీఓడీ అని చెప్పారు. దీని గురించి మాకు అవగాహన లేదు. అంతేకాదు... ఆ టాబ్లెట్లు వేసుకుంటున్నప్పటి నుంచి బరువు మరింతగా పెరిగిపోతోంది. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? - సంతోషమ్మ, విజయవాడ అండాశయంలో ద్రవంతో నిండిన చిన్న చిన్న నీటి బుడగల్లాంటి సంచులు వస్తాయి. అవి అండం విడుదలకు అడ్డుపడటం వల్ల వచ్చే సమస్యను పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు. కొన్నిసార్లు అవి 1 నుంచి 12 వరకు ఉండవచ్చు. లక్షణాలు అండం విడుదల ఆగిపోవడం వల్ల నెలసరి సరిగా రాకపోవడం లేదా 2 - 3 నెలలకు ఒకసారి రావడం నెలసరి వచ్చినా తక్కువ రక్తస్రావం కావడం కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోవడం వల్ల గర్భం దాల్చే పరిస్థితిక కూడా ఉండకపోవచ్చు సాధారణంగా ఈ సమస్య ఉన్న కొందరిలో అవాంఛిత రోమాలు, ముఖంపై మొటిమలు, జుట్టు ఊడటం, బరువు పెరగడం వంటివి కనిపిస్తాయి దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గి ఒత్తిడికి లోనవుతారు. లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో సాధారణ స్థాయిలో ఉంటే మరికొందరిలో తీవ్రస్థాయిలో ఉండవచ్చు. కొందరిలో అసలు ఏ విధమైన లక్షణాలూ కనిపించకపోవచ్చు. ఈ వ్యాధి వల్ల కలిగే ఇతర సమస్యలు పీసీఓడీ వ్యాధి ఉన్నా హార్మోన్లపై అది ప్రభావం చూపనప్పుడు దీనివల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అయితే ఈ వ్యాధి హార్మోన్లపై ప్రభావం చూపినప్పుడు హార్మోన్ల అసమతుల్యత కలిగి సమస్యలు మొదలవుతాయి. వాటిలో ముఖ్యంగా డయాబెటిస్ నెలసరి ఇబ్బందులు సంతాన సాఫల్య సామర్థ్యం తగ్గిపోవడం అవాంఛిత రోమాలు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు బరువు తగ్గాలి. కానీ అదే సమయంలో కడుపు మాడ్చుకోకూడదు. కేవలం మంచి ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యకరంగా బరువు తగ్గాల్సి ఉంటుంది. అలా జరగకపోతే చికిత్స తీసుకున్నా ప్రయోజనం ఉండకపోగా సమస్య అధికమయ్యే అవకాశం ఉంటుంది అవాంఛిత రోమాలను నివారించేందుకు వాక్సింగ్, హెయిర్ రిమూవల్ క్రీమ్‌లు వాడకపోవడం మంచిది నెలసరి రావడం కోసం అధికంగా హార్మోన్ ట్యాబ్లెట్లు వాడకపోవడం మంచిది ఒకవేళ గర్భం దాల్చినట్లయితే క్రమం తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. లేదంటే గర్భస్రావం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. చికిత్స హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స ఇస్తారు. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి, హార్మోన్ల సమతౌల్యత సాధారణ స్థాయికి వచ్చి వ్యాధి తగ్గుతుంది. - డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
మెనోపాజ్ దాటాక గుండె జబ్బులు ఎక్కువా?
కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 43 ఏళ్లు. మెనోపాజ్ దాటిన మహిళలకు గుండెజబ్బులు ఎక్కువని ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఇది వాస్తవమేనా? - శ్రీలేఖ, కాకినాడ గతంలో పురుషులతో పోలిస్తే... మహిళల్లో గుండెజబ్బులు తక్కువగానే ఉండేవి. కానీ ఇప్పుడు స్త్రీలలోనూ గుండెజబ్బుల ముప్పు పెరుగుతోంది. ఎప్పటికప్పుడు మారిపోతున్న జీవనశైలి, క్రమపద్ధతిలో లేని నిద్ర, ఆహార నియమాలు, పనుల ఒత్తిళ్లు... లాంటి పరిస్థితులన్నీ మహిళల్లోనూ ఇప్పుడు గుండెజబ్బులను పెంచుతున్నాయి. గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాలు సన్నబారడం లేదా మూసుకుపోవడం వల్ల గుండెజబ్బులు వస్తాయి. కరొనరీ ఆర్టరీ డిసీజ్ అని పిలిచే ఈ జబ్బు గుండెపోటుకు దారితీస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళలపై ఈ ప్రమాదం పదేళ్లు ఆలస్యమవుతుంది. మెనోపాజ్ తర్వాత ఈ ముప్పు మరింత పెరిగే మాట వాస్తవమే. మెనోపాజ్ తర్వాత శరీరానికి మేలు చేసే కొలెస్ట్రాల్ తగ్గి, చెడు (బ్యాడ్) కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ పెరుగుతాయి. పెరిగే వయసుతో అధిక రక్తపోటు కూడా మొదలవుతుంది. ఇవన్నీ గుండెజబ్బుల ముప్పును పెంచే అంశాలే. నడక వంటి వ్యాయామంతో పాటు ముందు నుంచీ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వయసుతో నిమిత్తం లేకుండా గుండెజబ్బులను చాలావరకు అదుపులో ఉంచవచ్చు ప్రతిరోజూ కనీసం అరగంట నడక లేదా పరుగు లేదా ఏరోబిక్ వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. వారంలో కనీసం ఐదురోజులైనా ఈ వ్యాయామాలు చేయాలి ఆహారంలో ఉప్పును చాలా పరిమితంగా తీసుకోవాలి. పండ్లు, తాజా ఆకుకూరలు, కూరగాయల మోతాదును పెంచాలి. అలాగే శాచురేటెడ్ కొవ్వులు ఉన్న ఆహారాన్ని తగ్గించాలి మీ మానసిక ఒత్తిడిని సాధ్యమైనంతగా తగ్గించాలి. రోజూ కనీసం ఓ పది నిమిషాలు ధ్యానం చేయాలి నూనెలను చాలా పరిమితంగా తీసుకోవాలి. వయసును బట్టి కొన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటే సమస్యను ముందుగానే గుర్తించవచ్చు. ఇందుకోసం క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ ఉండాలి గుండెజబ్బులకు దారితీసే అంశాలపై (రిస్క్ ఫ్యాక్టర్లపై) దృష్టి సారించాలి. ఉదాహరణకు అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, డయాబెటిస్ లాంటివి ఉంటే వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ గుండెజబ్బులను నివారించుకుంటే వాటి వల్ల కలిగే ప్రమాదాన్నీ నివారించుకున్నట్లేనని తెలుసుకోండి. - డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. గర్భాశయంలో కణుతులు... తగ్గుతాయా? హోమియో కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. నాకు కొంతకాలంగా రుతుస్రావం ఎక్కువరోజులు కొనసాగటం, అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఏర్పడడంతో గైనకాలజిస్టును సంప్రదించాను. వారు స్కాన్ చేయించి నా గర్భాశయంలో కణితులు ఏర్పడ్డాయని, వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించినా మళ్లీ ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. హోమియోతో ఈ వ్యాధి నయం అయ్యే అవకాశం ఉందా? - పి.పి.జె, మచిలీపట్నం చాలామంది స్త్రీలలో ఈ గర్భాశయ కణితుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడడంతోపాటు వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం వంటి చర్యలకు దారితీస్తుంది. తద్వారా వారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురికావడం జరుగుతుంది కానీ హోమియో చికిత్స ద్వారా ఈ వ్యాధికి ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా పూర్తిగా నయం అయే అవకాశం ఉంది. సాధారణంగా గర్భాశయంలో ఏర్పడే కణితులను యుటిరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి గర్భాశయపు కండర కణజాలంతో ఏర్పడతాయి. 16-50 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలు ఈ వ్యాధి బారిన పడే అవకాశ ఉంది. నెలసరి ఆగిపోయిన మహిళలలో వీటి ప్రభావం తక్కువగా ఉంటుంది. సంతానోత్పత్తి వయస్సు గల వారినే ఇది ఎక్కువగా ప్రభావితం చేయడం వల్ల ఇది సంతానలేమికి కూడా దారితీస్తోంది. ఈ కణితులు ఒకటిగా లేదా చిన్న చిన్న కణితులు మిల్లీమీటరు మొదలుకొని కొన్ని సెంటీమీటర్ల పరిమాణం వరకు పెరుగుతాయి. గర్భాశయంలో ఇవి ఏర్పడే ప్రాంతపు ఉనికి, పరిమాణం రీత్యా వీటిని మూడు రకాలుగా విభజించడం జరిగింది. ఇన్ట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్: గర్భాశయం లోపలి గోడల మధ్యలో ఏర్పడే ఇవి చాలా సాధారణంగా కనిపిస్తాయి. సబ్ సీరోజల్: గర్భాశయం వెలుపలి గోడలపై ఏర్పడే ఈ ఫైబ్రాయిడ్స్ చాలా పెద్ద పరిమాణంలో పెరిగే అవకాశం ఉంది. సబ్‌మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్: ఇవి గర్భాశయంలో ఉండే మ్యూకోజల్ పొరలో ఏర్పడి గర్భాశయపు కుహరంలోకి పెరుగుతాయి. కారణాలు: హార్మోన్ల అసమతుల్యత, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల ఇవి ఏర్పడే అవకాశ ఉంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయి అధికంగా ఉండటం వల్ల ఇవి ఏర్పడే అవకాశ ఉంటుంది. నెలసరి ఆగిపోయిన మహిళలలో ఈ హార్మోన్ ఉత్పాదన తక్కువగా ఉండటం వల్ల అవి కుచించుకుపోతాయి. స్థూలకాయం, మద్యపానం, కెఫీన్ వాడకం వంటి అంశాలు ఈ కణితులు ఏర్పడటాన్ని ప్రేరేపిస్తాయి. లక్షణాలు: రుతుస్రావం ఎక్కువ రోజులపాటు కొనసాగడం, అధిక రక్తస్రావం కావడం, రెండు రుతుచక్రాల మధ్యలో రక్తస్రావం అవడం, నడుమునొప్పి, కడుపులోనొప్పి, కాళ్లలో నొప్పి. అధిక రక్తస్రావం మూలంగా రక్తహీనత ఏర్పడటం. తరచు మూత్రానికి వెళ్లాల్సి రావడం, మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటివి. చికిత్స: హోమియోలో అందించే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్సావిధానం ద్వారా ఈ గర్భాశయ కణితులను పూర్తిగా కరిగించడమే కాకుండా, హార్మోన్ల అసమతుల్యతను, రుతుచక్రాన్ని సరిచేయడం ద్వారా వ్యాధి నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. మళ్లీ వ్యాధి తిరగబెట్టకుండా సంపూర్ణంగా నయం అవుతంది. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
అలర్జిక్ రైనైటిస్ తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 25 ఏళ్లు. చాలాకాలంగా చల్లగాలి, దుమ్ముధూళి సోకిన వెంటనే ముక్కుకారడం, వెంటనే తుమ్ములు ఎక్కువగా రావడం జరుగుతోంది. కళ్లలో దురద, నీరుకారడం వంటి సమస్యలతో బాధపడుతన్నాను. డాక్టర్‌ను అడిగితే అలర్జిక్ రైనైటిస్ అన్నారు. హోమియో చికిత్స ద్వారా దీనికి శాశ్వత చికిత్స వీలవుతుందా? - రవి, వరంగల్ అలర్జిక్ రైనైటిస్‌తో బాధపడే వారి పరిస్థితిని వాతావరణంలో మార్పులు, చల్లగాలి, దుమ్ముధూళి, ఇతర వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు మరింత దుర్భరం చేస్తాయి. ఈ సమస్య ఉన్నవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తరచూ దీని బారిన పడుతూనే ఉంటారు. అలర్జిక్ రైనైటిస్ అంటే... మనకు సరిపడని పదార్థాలు శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ముక్కులోని శ్లేష్మం పొర వాపునకు గురవుతుంది. ఇలా వాపునకు గురికావడాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. కారణాలు: అలర్జీని కలిగించే పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థాయికి మించి ప్రతిక్రియ జరుపుతుంది. దాని వల్ల అలర్జిక్ రైనైటిస్ సమస్య వస్తుంది పూలమొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు ఈ సమస్యకకు ప్రధానమైన కారణమని చెప్పవచ్చు దుమ్ము ధూళి జంతుకేశాలు, బూజు, కుటుంబ చరిత్ర వంటి అంశాలు ఈ సమస్యకు ఇతర కారణాలుగా చెప్పవచ్చు పొగతాగే అలవాటు, కొన్ని రసాయనాలు, వాతావరణంలోని కాలుష్యాలు, సుగంధద్రవ్యాల వంటివి అలర్జిక్ రైనైటిస్ సమస్యను ప్రేరేపిస్తాయి. లక్షణాలు: ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, విపరీతంగా తుమ్ములు, ముక్కులో అంగిలిలో దురద, కళ్ల నుంచి నీరుకారడం, కళ్లు దురదగా ఉండటం, ముఖంలో వాపు, దగ్గు, తరచూ తలనొప్పి, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స: హోమియో చికిత్సలతో ఎలాంటి శ్వాసకోశవ్యాధులనైనా తగ్గించవచ్చు. జనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో అందించే ఈ చికిత్సలో రోగి శారీరక, మానసిక లక్షణాలను, శరీర తత్వాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. రోగనిరోధక వ్యవస్థలలో గల అసమతౌల్యతను సరిచేయడం ద్వారా అలర్జిక్ రైనైటిస్ సమస్యను మళ్లీ తిరగబెట్టకుండా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ఇన్నాళ్ల తర్వాతా తిరగబెడుతుందా? క్యాన్సర్ కౌన్సెలింగ్ నేను దాదాపు పన్నెండేళ్ల క్రితం కిడ్నీలో క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నాను. మళ్లీ ఇటీవలే నడుము నొప్పి వస్తుంటే వైద్య పరీక్షలు చేయించుకున్నాను. రిపోర్ట్‌లను పరిశీలించాక డాక్టర్ బోన్ క్యాన్సర్ అని చెప్పారు. అది కిడ్నీ నుంచి వెన్నుకు పాకిందంటున్నారు. పన్నేండేళ్ల తర్వాత క్యాన్సర్ మళ్లీ తిరగబెడుతుందా? అది నయమయ్యే అవకాశం ఉందా? - సతీశ్‌కుమార్, నంద్యాల కిడ్నీ క్యాన్సర్ లేదా మరికొన్ని క్యాన్సర్లు చికిత్స తీసుకున్నప్పటికీ తిరగబెట్టే అవకాశం ఉంది. అది ఐదేళ్లు, పదేళ్లు, పదిహేను లేదా ఇరవై ఏళ్ల తర్వాతైనా కావచ్చు. అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్యాన్సర్‌పై అదుపు సాధించేందుకు అనేక చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఇక మీ విషయానికి వస్తే మీరు వెన్నుకు రేడియేషన్ చికిత్స తీసుకోవచ్చు. ఎక్స్-నైఫ్ ఎస్ఆర్ఎస్తో క్యాన్సర్‌ను అదుపు చేయవచ్చు. ఈ చికిత్స ప్రక్రియ వల్ల ఎలాంటి దుష్ర్పభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) కూడా ఉండవు. నొప్పిని కూడా తక్షణం నివారించవచ్చు. మా అమ్మగారికి 68 ఏళ్లు. ఆమెకు గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్ వచ్చింది. మొదటి దశ (స్టేజ్-1)లో ఉందని డాక్టర్ తెలిపారు. మాకు తెలిసిన డాక్టర్లను సంప్రదిస్తే రెండు మార్గాలు తెలిశాయి. మొదటిది... శస్త్రచికిత్స. రెండోది రేడియోథెరపీ. మేం కాస్త అయోమయంలో ఉన్నాం. శస్త్రచికిత్స అన్నా, రేడియోథెరపీ అన్నా భయంగా కూడా ఉంది. దయచేసి మాకు తగిన మార్గాన్ని సూచించగలరు. - యోగేశ్వరరావు, కాకినాడ మొదటి దశ సర్విక్స్ క్యాన్సర్‌ను సర్జరీ లేదా రేడియోథెరపీ ద్వారా నయం చేయగలం. అయితే చాలా సందర్భాల్లో దీనికి మొదట శస్త్రచికిత్స చేసి, తర్వాత రేడియోథెరపీ ఇస్తారు. మీరు రేడియోథెరపీయే కోరుకుంటే అది కూడా సాధ్యమే. చాలా సందర్భాలలో సర్జరీ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. ఇటీవల రేడియేషన్ టెక్నాలజీలలో వచ్చిన పురోగతి వల్ల రేడియోథెరపీ వల్ల ఇతర దుష్ర్పభావాలు కూడా దాదాపు ఉండవు. మీరు నిర్భయంగా రేడియోథెరపీ చేయించుకోండి. -
హెపటైటిస్-బి పూర్తిగా నయమవుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. నాకు ఈమధ్య పచ్చకామెర్లు అయ్యాయి. వాంతులు, అన్నం తినబుద్ధికాకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు చేసి హెపటైటిస్-బి అని నిర్ణయించారు. ఇప్పుడు తగ్గినా మళ్లీ ఎప్పుడైనా రావచ్చు అని చెప్పారు. హెపటైటిస్-బికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? - గోపాల్‌రావు, నల్లగొండ హెపటైటిస్-బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. ఇది వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. మొత్తం జనాభాలో 3-5 శాతం మంది దీనితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఉన్నవారిలో కాలేయానికి వాపురావడం, వాంతులు, పచ్చకామెర్లు ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ముదిరితే కాలేయ క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం కూడా ఉంది. వ్యాధి వ్యాప్తి: ఒకసారి వ్యాధి ఒంట్లోకి ప్రవేశించిందంటే, హెపటైటిస్-బి వైరస్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.రక్తంలోనూ, లాలాజలంలోనూ, వీర్యంలోనూ, మానవుడి శరీర స్రావాల్లో ఈ వైరస్ ఉంటుంది. ఈ వ్యాధి ఎక్కువగా శరీర ద్రవాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. సూదుల ద్వారా, గర్భవతి అయిన తల్లి నుంచి బిడ్డకు వ్యాపించవచ్చు. తొలి దశ : వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్ది రోజులకు కామెర్లు వస్తాయి. దీన్ని అక్యూట్ దశ అంటారు. ఆమెర్లతో పాటు వికారం, అన్నం తినాలపించకపోవడం, కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలు ఉండవచ్చు. ఈ దశలో ఎలీజా అనే పరీక్ష చేయిస్తే పాజిటివ్ వస్తుంది. రెండోదశ: ఈ దశలో వైరస్ శరీరంలో చాలాకాలం నుంచి ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని దీర్ఘకాలిక సమస్యగా పరిగణిస్తారు. అంటే వైరస్ శరీరంలో ఉండిపోవడానికి ప్రయత్నిస్తుందన్నమాట. ఈ దశలో కామెర్లు తగ్గినా కూడా హెచ్‌బీఎస్‌ఏజీ వైద్య పరీక్ష పాజిటివ్ అనే వస్తుంది. ఇలాంటి వారికి శరీరంలో వైరస్ ఉన్నా ఏ బాధలూ ఉండవు. వీరిలో వైరస్ ఉన్నట్లే తెలియదు. అది వారికి ఇతరత్రా ఏవైనా వైద్య పరీక్షలు చేయాల్సి వచ్చినప్పుడు, మహిళలకు గర్భధారణ సమయంలో మిగతా పరీక్షలు చేయాల్సి వచ్చినప్పుడు, రక్తదానం సమయంలో... వైరస్ ఉన్నట్లు బయటపడుతుంది. తమకు ఏ సమస్య లేకపోయినా... వారి నుంచి ఇతరులకు సంక్రమించే అవకాశం మాత్రం ఉంటుంది. తొలిదశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ దశలో పదే పదే కామెర్లు వచ్చిపోతుంటాయి. వీరిలో 99.5 శాతం మందికి ప్రాణభయం ఉండదు. కానీ వైరస్ శరీరంలో ఉండిపోయి బాధిస్తుంది. కాబట్టి మీరు మంచి (పౌష్టిక) ఆహారం, విశ్రాంతి తీసుకోవాలి. అంతేకాకుండా లివర్‌ను దెబ్బతీసే మందులు వాడకూడదు. ప్రతి ఆర్నెల్లకొకసారి పరీక్ష చేయించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వైరస్ శరీరం నుంచి పూర్తిగా పోవడానికి చాలా సమయం పడుతుంది. రెండో దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వీరి శరీరంలో వైరస్ ఉన్నప్పటికీ ఏ బాధలు / సమస్యలు ఉండవు. అయినప్పటికీ వీరి శరీరం నుంచి ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ప్రతి ఆరెల్లకొకసారి పరీక్ష చేయించుకుంటూ, తగిన చికిత్స తీసుకుంటూ, మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి. పొగ/మద్యం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. వీళ్లకు ఎప్పుడో ఒకసారి భవిష్యత్తులో లివర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కొందరిలో సమస్యలేమీ లేకపోయినా ఉన్నట్లుండి అకస్మాత్తుగా లక్షణాలు మొదలు కావచ్చు. హెపటైటిస్-బి వ్యాధి ఒక్కోసారి భవిష్యత్తులో క్యాన్సర్‌కి కారణం కూడా కావచ్చు. లివర్ ఫైబ్రోసిస్ మొదలై మెల్లగా లివర్ సిర్రోసిస్‌కు దారితీసే అవకాశం ఉంది. చికిత్స : హోమియోలో ఎలాంటి సమస్యకైనా కాన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా చికిత్స చేయవచ్చు. రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని క్రమేపీ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తారు. ఇలా క్రమక్రమంగా వ్యాధిని పూర్తిగా తగ్గిస్తారు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ -
బాబుకు ఆస్తమా... తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ మా బాబు వయసు పదేళ్లు. పుట్టినప్పటి నుంచి దగ్గు, ఆయాసం ఉన్నాయి. ఆయాసపడే సమయంలో పిల్లికూతలు వినిపిస్తుంటాయి. ఇప్పుడు వర్షాకాలం రాబోతోంది. ఎప్పుడు హాస్పిటల్లో చేర్చాల్సివస్తుందో అని ఆందోళనగా ఉంటోంది. హోమియోలో ఆస్తమాకు పూర్తి చికిత్స ఉందా? - నాగరాజు, గుంటూరు ఆస్తమా ఒక సాధారణమైన దీర్ఘకాలిక సమస్య. ఇది ఊపిరితిత్తుల్లోని వాయునాళాలకు సంబంధించిన వ్యాధి. వాయునాళాలు మూసుకుపోయి గాలిపీల్చడం, వదలడం కష్టంగా మారుతుంది. దీన్ని ఉబ్బసం, ఆయాసం, ఆస్తమా అనే పేర్లతో పిలుస్తుంటారు. ఇది దీర్ఘకాలికంగా... అంటే ఏళ్లతరబడి మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. పిల్లలు, పెద్దలు అందరిలోనూ కనిపిస్తుంది. ఆస్తమా సమయంలో శ్వాసనాళాలు సంకోచించి, శ్లేష్మం (కళ్లె/ఫ్లెమ్) ఎక్కువగా తయారవుతుంది. అది కూడా ఊపిరిని అడ్డుకుంటుంది. కారణాలు: దుమ్ము, ధూళి, కాలుష్యం వాతావరణ పరిస్థితులు, చల్లగాలి వైరస్లు, బ్యాక్టీరియాతో వచ్చే ఇన్ఫెక్షన్స్ పొగాకు పెంపుడు జంతువులు సుగంధద్రవ్యాలు, ఘాటైన వాసనలు పుప్పొడి రేణువులు వంశపారంపర్యం మొదలైనవి. లక్షణాలు: ఆయాసం దగ్గు రాత్రిపూట రావడం గాలి తీసుకోవడం కష్టం కావడం; పిల్లికూతలు ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం. వ్యాధి నిర్ధారణ : ఎల్ఎఫ్టీ (లంగ్ ఫంక్షన్ టెస్ట్), ఛాతీ ఎక్స్‌రే, అలర్జీ టెస్టులు, కొన్ని రక్తపరీక్షలు. చికిత్స: ఆస్తమా నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించే మందులు హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి. అవి ఆస్తమా లక్షణాలకు తగ్గించడమే కాకుండా, ఆ లక్షణాలను కలిగించే కారకాల పట్ల శరీరానికి వ్యాధి నిరోధకతను పెంచుతాయి. రోగి శారీరక, మానసిక, వంశపారంపర్య తత్వాలనూ, వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. ఈ విధానంలో ఆర్సినిక్ ఆల్బ్, ఇపికాక్, నేట్రమ్ సల్ఫ్, కాల్కేరియా కార్బ్, యాంటిమోనమ్ ఆల్బ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో తగిన మందులు వాడితే హోమియో విధానం ద్వారా ఆస్తమాను పూర్తిగా తగ్గించవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ చెయ్యి వణుకు... తగ్గడం ఎలా? న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. ఏదైనా పనిచేసేటప్పుడు నా కుడి చెయ్యి వణుకుతూ ఉంది. ఈ మధ్య మాట కూడా వణుకుతోంది. నా సమస్యకు పరిష్కారం ఉందా? - రామచంద్రరావు, నిడదవోలు మీరు ఎసెన్షియల్ ట్రెమర్ అనే జబ్బుతో బాధపడుతున్నారు. ఇది వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఈ జబ్బు ఉన్నవారిలో ఏదైనా పనిచేస్తున్నప్పుడు... అంటే... కాఫీ తాగేటప్పుడు, పెన్నుతో రాసేటప్పుడు.. ఇలా ఏదైనా పనిచేస్తున్నప్పుడు చేయి వణుకుతూ ఉంటుంది. టెన్షన్ ఎక్కువైనా, పని ఒత్తిడి పెరిగినా ఇలా వణకడం పెరగవచ్చు. వణుకు కొద్దిమాత్రంలో ఉంటే మందులు వాడాల్సిన పని లేదు. అయితే ఎక్కువగా వణకుతుండేవారిలో ప్రొపనలాల్, ప్రిమిడోన్ అనే మందులు వాడటం ద్వారా ఆ సమస్యను తగ్గించవచ్చు. మీరు న్యూరాలజిస్ట్‌ను కలిసి, తగిన మందులు తీసుకోండి. మీ సమస్య తీవ్రత తగ్గుతుంది. నా భర్త వయసు 56 ఏళ్లు. మద్యం అలవాటు ఉంది. ప్రతిరోజూ తాగుతారు. ఒక్కోసారి ఫిట్స్ వచ్చి పడిపోతుంటాడు. మద్యం తాగకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు. మద్యం తాగకపోతే వణుకు వస్తుంటుంది. మావారి సమస్యకు పరిష్కారం చెప్పండి. - సులోచన, వరంగల్ మద్యం తాగేవారికి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అతిగా మద్యం తీసుకోవడం వల్ల ఆల్కహాల్ ఇంటాక్సికేషన్తో ఫిట్స్ రావచ్చు. చీప్‌లిక్కర్‌కు అలవాటు పడిన వారిలో కొంతమందికి ఒక్కసారిగా మానేయడం వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. మద్యం ఆపేసిన కొద్దిమందిలో రెండురోజులు పొంతనలేకుండా మాట్లాడటం, ఉమ్మివేయడం వంటివి చేస్తుంటారు. దీన్ని డెలీరియమ్ ట్రెమర్స్ అంటారు. దీన్ని మందులతో తగ్గించవచ్చు. అయితే మద్యం జోలికి పోకుండా క్రమం తప్పకుండా టాబ్లెట్స్ తీసుకునేలా చూడాలి. కొంతమందిలో మందులతో ఈ అలవాటును మాన్పించలేకపోతే ‘డీ-అడిక్షన్’ సెంటర్లో ఉంచి చికిత్స అందించాలి. మీకు దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్‌నూ, సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి, తగిన చికిత్స అందేలా చూడండి. డాక్టర్ మురళీధర్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్ హైదరాబాద్ -
అది సీఓపీడీ వల్ల కావచ్చు...
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35. నాకు కొంతకాలంగా కొద్దిదూరం నడిస్తే ఆయాసంగా, ఛాతీ బరువుగా అనిపిస్తోంది. నాకు చాలా ఏళ్లుగా పొగతాగే అలవాటున్నందువల్ల ఇది గుండెకు సంబంధించిన వ్యాధి అనుకుని పరీక్షలు చేయిస్తే, అన్ని రిపోర్టులూ నార్మల్‌గానే వచ్చాయి. అయినా నాకు ఈ సమస్య ఎందుకు వస్తోంది? హోమియో చికిత్స ద్వారా పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు. - కిరణ్ కుమార్, హైదరాబాద్ దీర్ఘకాలికంగా పొగతాగే అలవాటు వల్ల ఊపిరితిత్తులకు హాని కలిగి శ్వాస తీసుకోవడంలో తలెత్తడాన్ని క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడి) అంటారు. సాధారణంగా మనం పీల్చుకున్న గాలి ముక్కు ద్వారా ట్రాకియా అనే నాళాన్ని చేరుతుంది. ట్రాకియా చివరి భాగంలో రెండు నాళాలుగా చీలి ఉంటుంది. వీటిని బ్రాంకై అంటారు. ఇవి ఊపిరితిత్తులతో ప్రవేశించి, కొన్ని వేలసంఖ్యలో ఉన్న అతి సన్నని నాళాలుగా విభజింపబడతాయి. వీటిని బ్రాంకియోల్స్ అంటారు. ఈ నాళాలు మిక్కిలి చిన్న గాలి తిత్తులుగా ఏర్పడతాయి. వీటిపై చిన్న రక్తనాళాలు ప్రయాణిస్తుంటాయి. గాలి వాయుతిత్తుల వరకు చేరినప్పుడు, ఆక్సిజన్ ఈ రక్తనాళాలకు చేరుతుంది. అదే సమయంలో రక్తనాళాలలోని కార్బన్ డై ఆక్సైడ్ ఈ వాయుతిత్తులను చేరుతుంది. తద్వారా శ్వాస బయటకు వదిలినప్పుడు వెలుపలికి వెళ్లిపోతుంది. ఈ ప్రక్రియను గ్యాస్ ఎక్స్ఛేంజ్ అంటారు. ఈ వాయుద్వారాలు, గాలి తిత్తులు సాగే స్వభావం కలిగి ఉంటాయి. ఇవి గాలి పీల్చుకున్న సమయంలోనూ, వదిలినప్పుడూ ఒక గాలిబుడగలా పని చేస్తాయి. దీర్ఘకాలికంగా పొగతాగడం వల్ల గాలితిత్తులు, వాయుద్వారాలు దెబ్బతిని వాటి సాగే గుణాన్ని కోల్పోతాయి. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇతర కారణాలు: ఎక్కువగా కాలుష్యవాయువులను పీల్చడం, వృత్తిరీత్యా కొన్ని పొగలను, రసాయనాలను, దుమ్మును పీల్చవలసి రావడం, జన్యుపరమైన కారణాలు. లక్షణాలు: శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, తరచు దగ్గు, ఊపిరి తీసుకున్నప్పుడు కొన్ని రకాలైన గురగుర శబ్దాలు వినిపించడం, ఛాతీ బరువుగా అనిపించడం వంటివి. జాగ్రత్తలు: స్మోకింగ్ మానివేయడం ద్వారా ఈ వ్యాధి పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంది. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, కలుషిత వాయువులకు దూరంగా ఉండటం, అవి శరీరంలోకి ప్రవేశించటం ముక్కుకు మాస్క్ కట్టుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్సావిధానం ద్వారా రోగి మానసిక, శారీరక తత్వాలను బట్టి, కుటుంబ చరిత్రను ఆధారంగా తీసుకుని చికిత్స అందించడం ద్వారా వ్యాధి లక్షణాలను పూర్తిగా తగ్గించడమే కాకుండా ఎలాంటి దుష్ఫలితాలూ లేకుండా వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్,హోమియోకేర్ ఇంటర్నేషనల్,హైదరాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నేను ఉంగరం పెట్టుకునే చోట వేలు నల్లబడుతోంది. మంటగా ఉండటంతో పాటు వేలిపై దురద వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - సుష్మ, దామరచర్ల మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ‘కాంటాక్ట్ డర్మటైటిస్’ ఉన్నట్లు తెలుస్తోంది. మీరు ఏదైనా సబ్బుగానీ లేదా డిటెర్జెంట్ గాని ఉపయోగిస్తుంటే... దాని మిగిలిపోయిన భాగం ఉంగరం వెనక ఉండిపోయి, అది చర్మానికి ఆనుకుంటూ ఉండవచ్చు. దాంతో అలా ఆ సబ్బు లేదా డిటెర్జెంట్ ఆనుకొని ఉండేచోట అలర్జీ వస్తోంది. ఇతర లోహాల మిశ్రమాల (అల్లాయ్స్)తో చేసే ఆభరణాల వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ కింద సూచించిన జాగ్రత్తలు తీసుకోండి. మీ ఉంగరాన్ని తరచూ తీసి శుభ్రం చేసుకొని మళ్లీ ధరించండి. మీరు చేతులు కడుక్కునే సమయంలో వేళ్లన్నీ శుభ్రమయ్యేలా చూసుకోండి. ఉంగరాన్ని వేరే వేలికి తొడిగేందుకు అవకాశం ఉంటే, మీరు అలా కూడా మార్చి చూడవచ్చు. చర్మం నల్లగా అయ్యే ప్రాంతంలో హ్యాలోమెటాజోన్ వంటి మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ ఉన్న క్రీమును రెండు వారాల పాటు రాయండి. అప్పటికీ సమస్య తగ్గకపోతే మీకు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 49 ఏళ్లు. అండర్వేర్ ధరించే చోట చర్మం మడతలలో ఎరుపు, నలుపు రంగు మచ్చలు ఉన్నాయి. ఒక్కోసారి అక్కడ దురదగా కూడా ఉంటోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - వి. సుధాకర్, చల్లపల్లి మీ లక్షణాలను బట్టి మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ఇట్రకొనజోల్-100 ఎంజీ మాత్రలను పదిరోజుల పాటు నోటి ద్వారా తీసుకోవాలి. అలాగే మచ్చలున్న చోట మొమాటోజోన్, టర్బినాఫిన్ ఉన్న క్రీమును 2-3 వారాల పాటు రాయాలి. దీంతోపాటు మీరు ప్రతిరోజూ మల్టీవిటమిన్ టాబ్లెట్లు కూడా తీసుకుంటూ ఉండాలి. - డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్,త్వచ స్కిన్ క్లినిక్,గచ్చిబౌలి, హైదరాబాద్ -
ఫిట్స్... మళ్లీ రాలేదని మందులు ఆపద్దు
హోమియో కౌన్సెలింగ్ మా అబ్బాయికి 21 సం. కొంతకాలంగా విపరీతమైన నడుంనొప్పి, వెన్నెముక బిరుసుగా మారి ముందుకు వంగినట్లుగా నడవడం వంటి సమస్యలతో బాధపడుతుండడంతో డాక్టర్ ని సంప్రదించాం. ఆయన కొన్ని పరీక్షలు చేయించి, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్గా నిర్థారించారు. హోమియో చికిత్స ద్వారా దీనికి పరిష్కారం లభించే అవకాశం ఉందా? - డి. యాదవేణి, హైదరాబాద్ మీరు ఆందోళన చెందకండి. హోమియో చికిత్స ద్వారా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. మన శరీరంలో వెన్నెముకది కీలకమైన పాత్ర. వెన్నెముక ఏదైనా వ్యాధికి గురైతే దానిలో మార్పులు సంభవించి, సాధారణ కదలికలు కష్టతరంగా మారడమే కాకుండా ఆ ప్రాంతం నుంచి వెలువడే నరాలపై ఒత్తిడి పడితే తీవ్రమైన నొప్పి, ఇతర సమస్యలూ తలెత్తుతాయి. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్: ఇది ఒక ఆటో ఇమ్యూన్ సమస్య. ఇతర ఆర్థరైటిస్ సమస్యలలాగే ఈ వ్యాధిలో కూడా వెన్నెముక శోథకు గురయి నొప్పిని కలిగిస్తుంది. ఈ సమస్య తీవ్రస్థాయికి చేరితే శోథకు గురైన వెన్నుపూసలు, ఇతర జాయింట్ల ఎముకలు అసాధారణంగా పెరిగి ఒకదానితో ఒకటి కలిసిపోయి బిరుసుగా, వెదురు కర్రలా మారుతుంది కాబట్టి దీనిని వైద్యపరిభాషలో బాంబూ స్పైస్ అని కూడా అంటారు. ఇలా మారిన వెన్నెముక తన సాధారణ కదలికలు కోల్పోయి కొంచెం ముందుకు వంగడం జరుగుతుంది. తుంటి ప్రాంతంలోని వెన్నెముకను ముఖ్యంగా దెబ్బతీయడం ఈ వ్యాధి ప్రత్యేకత. ఏ వయస్సు వారినైనా ప్రభావితం చేసే ఈ సమస్య ముఖ్యంగా 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది స్త్రీల కంటే పురుషులలో ఎక్కువ. ఇది వెన్నెముకను మాత్రమే కాకుండా ఇతర జాయింట్లను, అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది. కారణాలు: జన్యుపరమైన అంశాలు, కుటుంబ చరిత్ర వ్యాధి కారణం. లక్షణాలు: సాధారణం నుండి తీవ్రస్థాయి నడుం నొప్పి, తుంటి, పిరుదులలో కూడా నొప్పి. వెన్నెముక, జాయింట్లు బిగువుగా మారి కదలికలు కష్టతరంగా ఉండటం. కళ్లు ఎర్రగా మారడం, మంట, వెలుతురును చూడలేకపోవటం, చూపు మందగించటం, బరువు తగ్గడం, ఆకలి లేమి, నీరసం, రక్తహీనత వంటివి. ఈ వ్యాధి వల్ల గుండెలోని కవాటాలు దెబ్బతిని, గుండె సమస్యలు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపటం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వ్యాధి తీవ్రంగా ఉంటే వెన్నెముక నుండి వచ్చే నరాలపై ఒత్తిడి పడడంతో చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారటం, సత్తువ కోల్పోవడం వంటి లక్షణాలుంటాయి. హోమియో చికిత్స: హోమియోలో జెనెటిక్స్ కాన్స్టిట్యూషనల్ విధానంలో వ్యాధి లక్షణాలను తగ్గించడమే కాకుండా, వ్యాధి మూలాలను గుర్తించి చికిత్స అందించడం ద్వారా తొలిదశలోనే వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ న్యూరో కౌన్సెలింగ్ మా బాబుకు 12 ఏళ్లు. ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఒకసారి ఫిట్స్ వచ్చాయి. డాక్టర్ పరీక్షలు చేసి, మందులు రాసిచ్చి ఒక నెల వాడమన్నారు. మళ్లీ రమ్మన్నారు. అలాగే చేశాం. కానీ మళ్లీ రాకపోవడంతో ఇక డాక్టర్ దగ్గరకు వెళ్లలేదు. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఫిట్స్ వచ్చాయి. అలా ఫిట్స్ వచ్చినప్పుడు వాడి నోటి నుంచి నురుగు రావడం, కళ్లు తేలేయడం, కొన్ని నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చేయడం జరుగుతోంది. మా బాబుకు మళ్లీ మళ్లీ ఫిట్స్ రావడం మాకు ఆందోళన కలిగిస్తోంది. మా బాబు సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - శకుంతల, విజయవాడ వేర్వేరు కారణాల వల్ల మన మెదడు ఎప్పుడైనా తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు ఇలా ఫిట్స్ (మూర్చ లేదా సీజర్స్) రావడం సాధారణమే. ఇందుకు అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవి అంతగా ప్రమాదకరమైనవి కాదు. ఫిట్స్‌కు గురైన వ్యక్తి కొన్ని నిమిషాల తర్వాత ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్ లేకుండానే కోలుకుంటాడు. ఈ సమయంలో కొందరు మూర్ఛకు గురైన వ్యక్తి చేతిలో ఇనుము లేదా తాళం చెవి పడుతుంటారు. దీని వల్ల ఆ వ్యక్తికి ఎలాంటి లాభం చేకూరదు. కొందరైతే అలాంటి సమయంలో నోటిలో ఇనుప వస్తువు లేదా గుడ్డలు పెడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఆ సమయంలో పేషెంట్‌కి గాలి బాగా ఆడాలి. శ్వాస తీసుకోడానికి ఎలాంటి ఇబ్బందీ కలగకూడదు. ఫిట్స్ వచ్చినప్పుడు సదరు వ్యక్తిని ఒక పక్కకు ఓరగా గానీ లేదా వెల్లకిలా పడుకోబెట్టి వీలైనంతవరకు గాలి పీల్చుకోడానికి ఇబ్బంది లేకుండా చూడాలి. ఫిట్స్ అటాక్ తర్వాత ఆ వ్యక్తి అలసిపోయి చాలాసేపటి వరకు పడుకొని ఉంటాడు. అయితే ఫిట్స్ నుంచి కోలుకున్న వ్యక్తిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి, ఫిట్స్‌కి గల అసలు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒకసారే వచ్చింది కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేస్తే మళ్లీ తక్కువ సమయంలో మళ్లీ మళ్లీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఒత్తిడి వల్ల బ్రెయిన్లో మార్పులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడమే ఉత్తమం. అలాగే ఫిట్స్ అటాక్ తర్వాత అలసిపోయి పడుకున్న పేషెంట్ కొన్ని నిమిషాల వ్యవధిలోనే నిద్ర నుంచి లేవని పక్షంలో దాన్ని సీరియస్ మెడికల్ సమస్యగా గుర్తించి వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స అందించాలి. డాక్టర్ బి.జె.రాజేశ్ సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నాకు ఎనిమిది నెలల క్రితం అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో జరిపిన రక్తపరీక్షల్లో హెపటైటిస్-బి పాజిటివ్ అని చెప్పారు. ఆర్నెల్ల తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకుంటే, మళ్లీ హెపటైటిస్-బి పాజిటివ్ అన్నారు. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - లక్ష్మయ్య, వరంగల్ మీకు నిర్వహించిన రక్తపరీక్షలో ఆర్నెల్ల తర్వాత కూడా హెపటైటిస్-బి పాజిటివ్ వచ్చిందన్నారు. దాన్నిబట్టి మీకు క్రానిక్ హెపటైటిస్-బి అనే వ్యాధి ఉంది అని తెలుస్తోంది. ఈ వ్యాధి ఉన్నవారు మొదట కొన్ని రక్త పరీక్షలు (హెచ్బీసీఏజీ, యాంటీ హెచ్బీసీఏజీ, ఎల్ఎఫ్టీ, హెచ్‌బీవీ డీఎన్ఏ వంటివి) చేయించుకొని, వ్యాధి ఏ దశలో ఉందో తెలుసుకోవాలి. చాలామందిలో వ్యాధి ఇన్‌యాక్టివ్‌గా ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి యాక్టివ్ స్టేజ్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. వ్యాధి ఇన్‌యాక్టివ్‌గా ఉన్నవారికి ఎలాంటి మందులూ అవసరం లేదు. మీరు చేయవలసినదల్లా ప్రతి 3 నుంచి 6 నెలల కొకసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి, ఎల్ఎఫ్టీ పరీక్ష చేయించుకొని మీ వ్యాధి యాక్టివ్ దశలోకి ఏమైనా వెళ్లిందా అని చూసుకోవాలి. యాక్టివ్ దశలోకి వెళ్తే, అప్పుడు వివిధ రకాల మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గర్లోని వైద్యనిపుణుడిని సంప్రదిస్తే వాటిల్లో ఏది వాడాలో సూచిస్తారు. నాకు చాలా రోజులుగా ఛాతీలో మంట వస్తోంది. దగ్గర్లోని మెడికల్ షాపులో అడిగితే ఒక మందు ఇచ్చారు. అది తాగినప్పుడు మంట తగ్గుతోంది. తర్వాత యథావిధిగా మంట వస్తోంది. అది తగ్గడానికి మార్గం చెప్పండి. - రాజశేఖర్, కోదాడ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీకు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ ఉన్నట్లు తెలుస్తోంది. వీలైతే మీరొకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోవడం మంచిది. మీరు మీ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మీ వ్యాధి లక్షణాల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని సూచనలు... కొవ్వు పదార్థాలు తగ్గించండి, కాఫీ, టీలను మానేయండి పొగతాగడం, మద్యం అలవాటు ఉంటే పూర్తిగా మానేయండి మీరు ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఎక్కువగా అది తగ్గించుకోండి తిన్న వెంటనే నిద్రించకండి పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటిస్తూ డాక్టర్ సలహా మేరకు హెచ్-2 బ్లాకర్స్, పీపీఐ మందులు వాడండి. డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటే...
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నేను రోజూ ఆల్కహాల్ తీసుకుంటాను. నాకు ఈ మధ్య కడుపులో నీరు రావడం, కాళ్ల వాపు రావడం జరిగింది. మా దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. కొన్ని రోజులు వాడాక తగ్గింది. కానీ సమస్య మళ్లీ వచ్చింది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - రామకృష్ణ, నకిరెకల్ మీకు లివర్ / కిడ్నీ / గుండె సమస్యలు ఉన్నప్పుడు కడుపులో నీరు రావడం, కాళ్ల వాపు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. మీరు ఆల్కహాల్ తీసుకుంటారని చెప్పారు కాబట్టి మీకు లివర్ సమస్య వచ్చి ఉండవచ్చు. అయితే మీకు ఏయే పరీక్షలు చేశారో మీ లేఖలో రాయలేదు. మీకు ఒకసారి కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ పరీక్ష, కిడ్నీ ఫంక్షన్ పరీక్ష, కడుపులో నీటి పరీక్ష చేయించుకోవాలి. దాని రిపోర్టులతో మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదిస్తే, వారు మీకు తగిన చికిత్స అందిస్తారు. నేను నెల రోజుల క్రితం కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. అందులో కడుపు స్కానింగ్‌లో నాకు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్లు తెలిసింది. అయితే నాకు ఎప్పుడూ కడుపు నొప్పి రాలేదు. ఇలా రాళ్లు ఉన్నవారు ఆపరేషన్ చేయించుకోవాలని కొందరు సలహా ఇస్తున్నారు. నాకు ఆందోళనగా ఉంది. దయచేసి దీనికి చికిత్స ఏమిటో చెప్పండి. - కృష్ణమూర్తి, విజయవాడ మీరు చెప్పిన వివరాల ప్రకారం మీకు ‘ఎసింప్టమాటిక్ గాల్ స్టోన్ డిసీజ్’ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉండి, వ్యాధి లక్షణాలే ఏమీ లేనివారిలో ఏడాదికి వందమందిలో సుమారు ఇద్దరికి మాత్రమే వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. అంటే 98 శాతం మంది నార్మల్‌గానే ఉంటారు. మీకు వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించడం లేదు కాబట్టి ఆపరేషన్ అవసరం లేదు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఒకసారి మీకు దగ్గర్లో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిస్తే, వారు మీ కండిషన్‌ను ప్రత్యక్షంగా చూసి తగిన సలహా ఇస్తారు. హోమియో కౌన్సెలింగ్ నా వయసు 42. కొద్దిరోజులుగా కాళ్లు వాచిపోయి నడుస్తున్నప్పుడు నొప్పిగా ఉంటోంది. డాక్టర్‌ను కలిస్తే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అన్నారు. దీని గురించి నాకు అవగాహన లేదు. దయచేసి నాకు వచ్చిన సమస్య ఏమిటో తెలిపండి. దీనికి హోమియోలో చికిత్స ఉందా? - రవికుమార్, ఖమ్మం మన కాళ్ల నుంచి రకాన్ని గుండెకు చేరవేసే సిరల్లో ఎక్కడైనా రక్తం గడ్డకట్టడం జరిగితే తలెత్తే సమస్య పేరే డీప్ వీన్ థ్రోంబోసిస్ (డీవీటీ). మన శరీరంలో తల నుంచి కాళ్ల వరకూ ప్రతి అవయవానికీ, ప్రతి కణానికీ రక్త సరఫరా అవసరం. ఈ రక్త సరఫరా కోసం మన దేహమంతటా రక్తనాళాలు ఉంటాయి. వాటిని చెడు రక్తాన్ని గుండెకు చేరవేసే వాటిని సిరలు అంటారు. కాళ్ల నుంచి రక్తాన్ని శుద్ధి కోసం గుండెకు తీసుకెళ్లే సిరల్లో ఎక్కడైనా రక్తం గడ్డకడితే అది రక్త ప్రవాహానికి అవరోధంగా మారుతుంది. అలా జరిగినప్పుడు రక్త ప్రసరణ నిలిచిపోయి, ఆ భాగంలో వాపు వస్తుంది. దీనినే డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటారు. కొన్ని కారణాలు: నడక కరువై పాదాలకు, కాళ్లకు తగినంత వ్యాయామం లేకపోవడం ఊపిరితిత్తుల క్యాన్సర్ క్లోమగ్రంథి క్యాన్సర్ సుదీర్ఘ విమాన ప్రయాణాలు అదేపనిగా కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేయడం హార్మోన్ మాత్రలు ఎక్కువగా వాడటం ఏదైనా జబ్బు కారణంగా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత సుదీర్ఘకాలం పాటు మంచం మీద ఎక్కువ రోజులు ఉండాల్సి రావడం ఒంట్లో రక్తం గడ్డ కట్టే తత్వాన్ని పెంచే వ్యాధులలో బాధపడేవారిలో ఈ సమస్య కనిపిస్తుంది. ఇక కొందరు మహిళల్లో గర్భధారణ కూడా దీనికి ఒక కారణం. లక్షణాలు : కాళ్లలో నొప్పి, నడుస్తున్నప్పుడు అసౌకర్యంగా ఉండటం కాళ్లు/చేతులపై చర్మం నల్లబారడం, అవి కుళ్లిపోవడం (గ్యాంగ్రీన్) కాలు తొడ భాగంలో ఎర్రగా కందిపోయినట్లు, వాచిపోయి... నడవటం కష్టంగా అనిపించడం ప్రమాదాలు: ఈ సమస్యతో ప్రమాదాలు రెండు రకాలుగా వస్తాయి. మొదటిది: సిరల్లో ఏర్పడ్డ రక్తపు గడ్డ కారణంగా సిర మూసుకుపోయి, చెడు రక్తం కిందే నిలిచిపోతుంది. దాంతో నీరు, ఖనిజాలు, లవణాలు అక్కడే నిలిచిపోతాయి. దీనివల్ల కణజాలంపై ఒత్తిడి పెరిగి పక్కనే ఉన్న ధమనులు నొక్కుకుపోయి, మంచి రక్తం సరఫరా తగ్గి, గ్యాంగ్రీన్ ఏర్పడే అవకాశం ఉంది. రెండోది: సిరల్లో ఏర్పడ్డ గడ్డలను తొలగించకపోవడం వల్ల అవి రక్త ప్రసరణలో కలిసి మెల్లగా పైకి పయనించి, గుండెలోకి చేరతాయి. అక్కడి నుంచి ఊపిరితిత్తులోకి వెళ్లి అక్కడ రక్తనాళాల్లో ఇరుక్కుపోయి అత్యంత ప్రమాదకరమైన ‘పల్మనరీ ఎంబాలిజమ్’ అనే పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా తయారవుతుంది. బీపీ పడిపోతుంది. నివారణ : నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అదేపనిగా కూర్చొని ఉండకుండా అప్పుడప్పుడూ నడవడం గర్భిణులు డాక్టర్ల సలహాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం పక్షవాతం, క్యాన్సర్‌తో బాధపడుతూ మంచంపై ఉండేవారు ఈ సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. చికిత్స: హోమియోలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులు ఇవ్వడం జరుగుతుంది. కిడ్నీ కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 63 ఏళ్లు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. మాలో ఎవరైనా కిడ్నీని దానం చేద్దాం అనుకున్నాం గానీ బ్లడ్‌గ్రూపు కలవడం లేదు. ఇప్పుడు మేమేం చేయాలి? - దామోదర్, నల్లగొండ కిడ్నీ వంద శాతం పాడైపోయినప్పుడు మాత్రమే కిడ్నీ మార్పిడి ద్వారా రోగిని రక్షిస్తారు. దీనికి దాత అవసరమవుతారు. లైవ్ డోనార్ (బతికి ఉన్న వారి నుంచి కిడ్నీ సేకరించడం), కెడావర్ డోనార్ (చనిపోయిన వ్యక్తి నుంచి కిడ్నీని సేకరించడం) అని రెండు రకాల దాతల నుంచి కిడ్నీని సేకరిస్తారు. లైవ్ డోనార్స్ విషయంలో రక్తసంబంధీకులు మాత్రమే కిడ్నీని దానం చేయాలి. అంతేగాక వీరి బ్లడ్ గ్రూపు కిడ్నీని పొందే వ్యక్తి బ్లడ్ గ్రూపుతో కలవాల్సి ఉంటుంది. కిడ్నీ దానం చేసేవారికి హైబీపీ, డయాబెటిస్, గుండెజబ్బులు, మెదడు జబ్బులు, కాలేయవ్యాధులైన హెపటైటిస్-బి, సి ఉండకూడదు. దాత ఒక కిడ్నీ దానం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని నిర్ధారణ చేశాకే కిడ్నీ మార్పిడి చేస్తారు. రక్తసంబంధీకుల బ్లడ్ గ్రూపులు కలవకపోతే రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది... స్వాప్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్, రెండోది ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్. స్వాప్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్... తమ రక్త సంబంధీకులకు కిడ్నీ దానం చేయాలని ఉన్నాగానీ బ్లడ్ గ్రూపులు కలవకపోవడం వల్ల అది సాధ్యపడనప్పుడు... అదే సమస్యతో బాధపడుతున్న వేరొకరి రక్త సంబంధీకులలో బ్లడ్ గ్రూపు సరిపడిందనుకోండి. ఇలా ఒకరి రక్తసంబంధీకులకు మరొకరు పరస్పరం కిడ్నీలు దానం చేసుకునే ప్రక్రియను స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. ఈ విధానంలో వీరి కిడ్నీని వారి బంధువుకూ, వారి కిడ్నీని వీరి బంధువుకు అమర్చే ఏర్పాటు చేస్తారు. వీరిద్దరికీ ఒకేసారి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరుగుతుంది. బ్లడ్ గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడి... ప్రస్తుతం బ్లడ్‌గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయడం వీలవుతుంది. దీనికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు అనుసరించాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. బ్లడ్‌గ్రూపు సరిపకపోయినప్పటికీ ఈ విధానంలో చేసిన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా... కంపాటబుల్ కిడ్నీ మార్పిడి సర్జరీల మాదిరిగానే విజయవంతం అవుతున్నాయి. కాబట్టి మీరు మీ అమ్మగారికి తగిన విధానాన్ని అనుసరించేందుకు ఉపయుక్తమైన మార్గాలను తెలుసుకునేందుకు ఒకసారి అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నచోట, నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన సూచనాలు తీసుకోండి. -
తొందరపడి ఆపరేషన్... ఇప్పుడు బిడ్డ కావాలి!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. ఈ వేసవిలో విహారయాత్రకు వెళ్లొచ్చిన తర్వాత ఆకలి మందగించింది. మలబద్దకంగా అనిపించడంతో పాటు మూత్రం పచ్చగా వస్తోంది. కొందరు కామెర్లు వచ్చాయని అంటున్నారు. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? - రాజ్‌కుమార్, హైదరాబాద్ కామెర్లు అనేది కాలేయ సంబంధిత వ్యాధి. ఒక వ్యక్తి ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు అతని కంటే ముందుగా ఇతరులే దీన్ని గుర్తిస్తారు. రక్తంలో బిలురుబిన్ పాళ్లు పెరిగినప్పుడు చర్మం, కనుగుడ్లు, మ్యూకస్ మెంబ్రేన్స్‌లో పసుపుపచ్చ రంగు తేలడాన్ని పచ్చకామెర్లు అంటారు. శరీరానికి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్‌ను రక్తంలోకి ఎర్రరక్తకణాలు సరఫరా చేస్తాయి. ఇందులో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. దీని జీవితకాలం 120 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత హీమోగ్లోబిన్‌లోని హీమ్ అనే పదార్థం ప్లీహం (స్ల్పీన్)లో శిథిలమైపోయి బైలురుబిన్, బైలివర్డిన్ అనే పసుపు రంగు వ్యర్థ పదార్థాలుగా మారిపోతాయి. శరీరంలో పసుపు రంగు పదార్థాలు పేరుకుపోవడాన్ని కామెర్లుగా చెప్పవచ్చు. సాధారణంగా కాలేయం ఈ వ్యర్థ పదార్థాలను సేకరించి, పైత్యరసంతో పాటు కాలేయ వాహిక (బైల్ డక్ట్) ద్వారా పేగుల్లోకి పంపుతుంది. అక్కడి నుంచి మలంతో పాటు ఈ పసుపు రంగు వ్యర్థపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. కామెర్లకు కారణాలు: హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అనే వైరస్ల కారణంగా కామెర్లు వచ్చే అవకాశం ఉంది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం పుట్టుకతో వచ్చే కొన్ని లోపాలు కాలేయం పాడైపోవడం కాలేయం నుంచి పేగుల్లోకి వెళ్లే కాలేయ వాహికలో అంతరాయం ఏర్పడటం వంటివి జరిగితే కామెర్ల సమస్య తలెత్తే అవకాశం ఉంది. లక్షణాలు: వికారం, వాంతులు పొత్తికడుపులో నొప్పి జ్వరం, నీరసం, తలనొప్పి కడుపు ఉబ్బరంగా ఉండటం కామెర్లు సోకినప్పుడు కళ్లు పచ్చబడటం. వ్యాధి నిర్ధారణ: సీబీపీ, ఎల్ఎఫ్టీ, సీటీ స్కాన్, ఎమ్మారై, అల్ట్రా సౌండ్ స్కాన్ చికిత్స: కామెర్లను తగ్గించడానికి హోమియోపతిలో మంచి మందులున్నాయి. రోగి లక్షణాలను, శారీరక, మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకొని డాక్టర్లు మందులు సూచిస్తారు. ప్రారంభదశలోనే వాడితే కామెర్లను పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సమస్యకు హోమియోలో చెలిడోనియం, సెలీనియం, లైకోపోడియం, మెర్క్‌సాల్, నాట్‌సల్ఫ్ వంటి మందులు డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు 10 నెలలు. గుక్కపట్టి ఏడుస్తున్నప్పుడు పాప ముఖం నీలంగా మారిపోతోంది. ఇది చాలా ఆందోళనగా కలిగిస్తోంది. మా పాప సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - ధరణి, కోదాడ మీ పాప సమస్యను ‘బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్’గా చెప్పవచ్చు. పాప కాసేపు ఊపిరి తీసుకోకుండా ఉండటంతో ఇలా జరుగుతోంది. పిల్లల్లో కోపం / ఫ్రస్టేషన్ / భయం / కొన్ని సందర్భాల్లో గాయపడటం జరిగినప్పుడు ఇలా కావడం చాలా సాధారణం. ఈ సమస్య గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తొమ్మిది నెలల నుంచి 24 నెలల లోపు పిల్లల్లో ఇది ఎక్కువ. కుటుంబ చర్రితలో ఈ లక్షణం ఉన్నవారి పిల్లల్లో ఇది ఎక్కువ. ఈ లక్షణం ఉన్న పిల్లలు పెద్దయ్యాక చాలా మొండిగా అవుతారంటూ అపోహలున్నా, వాటికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఇది ఎందుకు వస్తుందనేది చెప్పడం కష్టమైనప్పటికీ రక్తహీనత ఉన్నవారిలో ఇది ఎక్కువ శాతం మందిలో కనిపిస్తుంది. బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్‌లో... సింపుల్, సైనోటిక్, పాలిడ్, కాంప్లికేటెడ్ అని నాలుగు రకాలు ఉన్నాయి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు వస్తోంది సైనోటిక్ అనిపిస్తోంది. ఇక ప్యాలిడ్ అనే రకంలో పిల్లలు పాలిపోయినట్లుగా అయిపోయి, స్పృహతప్పిపోతారు. ఇటువంటి పిల్లల్లో ఒకసారి ఈసీజీ, ఈఈజీ తీయించడం అవసరం. ఎందుకంటే గుండెకు సంబంధించిన తీవ్రమైన కారణాలు ఏవైనా ఉంటే అవి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక చికిత్స విషయానికి వస్తే... పాపలో ఈ ధోరణి కనిపించినప్పుడు కుటుంబ సభ్యులంతా తీవ్రమైన ఆందోళనకు గురవుతారు. కాబట్టి వాళ్లకు ధైర్యం చెప్పడమే మొదటి చేయాల్సిన పని. ఇక చాలా కొద్దిమందిలో మాత్రం ఐరన్ ఇవ్వడం ఉపయోగకరం. పిల్లలూ, తల్లిదండ్రుల మధ్య ప్రేమాభిమానాలు బలపడినకొద్దీ ఈ లక్షణం క్రమంగా తగ్గిపోతుంది. ఐదేళ్ల వయసు వచ్చాక ఈ సమస్య కనిపించడం చాలా అరుదు. పైన పేర్కొన్న పరీక్షలు కూడా పాపకు ఏవైనా తీవ్రమైన సమస్య ఉన్నాయేమోనని తెలుసుకోడానికి మాత్రమే. ఈ విషయంలో నిర్భయంగా ఉండండి. మరీ అవసరమైనప్పుడు మీ పిల్లల డాక్టర్‌ను ఒకసారి సంప్రదించండి. ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. జీవితంలో సెటిల్ అవకముందే పిల్లలు ఎందుకని గతంలో 3 సార్లు మందుల ద్వారా, 2 సార్లు ఆపరేషన్ ద్వారా గర్భధారణ కాకుండా అడ్డుకున్నాం. ఈ మధ్యే ఒక పాప పుట్టింది. ఏదో కంగారులో మా వారు డెలివరీ సమయంలోనే నాకు కు.ని. ఆపరేషన్ చేయించడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడేమో ‘తొందర పడ్డాను, మళ్లీ పిల్లలు కావాలంటే ఎలా’ అని బాధపడుతున్నారు. ఐవీఎఫ్, సర్రోగసీ లాంటి ఖర్చుతో కూడిన పద్ధతులు కాకుండా ఆపరేషన్ జరిగాక కూడా వేరే ఏదైనా పద్ధతి ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉందా? ఒకవేళ వీలైనా భవిష్యత్‌లో నాకేమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా తెలియజేయగలరు? - ఓ సోదరి, విజయవాడ గర్భధారణ ప్రక్రియ నార్మల్‌గానే జరిగేందుకు వీర్యం, అండం, ఫెలోపియన్ ట్యూబ్స్ అవసరం. ట్యూబెక్టమీ ఆపరేషన్‌లో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ రెండింటినీ బ్లాక్ చేస్తారు. ఫలితంగా వీర్యం, అండం ఈ ట్యూబ్లలో కలవడానికి వీలుండదు. తద్వారా గర్భాన్ని నివారించడం జరుగుతుంది. ట్యూబెక్టమీ జరిగితే మీకు నార్మల్‌గా గర్భధారణ సాధ్యం కాదు. ఇక ఉన్న మార్గాల్లో ఒకటి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్). ఇందులో మీ నుంచి అండాన్ని, మీ భర్త నుంచి వీర్యాన్ని సేకరించి, ల్యాబ్‌లో ఫలదీకరణం చేసి, ఇలా రూపొందిన పిండాన్ని మీ గర్భసంచి (యుటెరస్)లోకి ప్రవేశపెడతారు. కానీ మీరు ఈ ప్రక్రియ పట్ల ఆసక్తిగా లేరు. ఇక రెండో మార్గం... మీ ట్యూబ్స్ మార్గాన్ని పునరుద్ధరించడం. దీన్ని ట్యూబల్ రీ-కెనలైజేషన్ అని అంటారు. ఈ ప్రక్రియలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లో మూసిన మీ ట్యూబ్స్‌ను మళ్లీ తెరుస్తారు. అయితే దీన్ని తెరిచే ముందర కొంత ప్లానింగ్ అవసరం. ఇందులో మీ ఫెలోపియన్ ట్యూబ్‌ల పొడవు, అక్కడ మిగిలి ఉన్న ట్యూబ్‌ల సైజును బట్టి, ఈ ప్రక్రియ ఎంత వరకు విజయవంతమవుతుందో చెప్పవచ్చు. ఈ ప్రక్రియలో మీకు మత్తు (అనస్థీషియా) ఇచ్చి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే దానికి ముందర మీ దంపతులతో కొన్ని చర్చలు, కొంత కౌన్సెలింగ్ అవసరం. ఇక సరోగసీ లాంటి ప్రక్రియలు మీ కేసులో అవసరం లేదు. గతంలో మీరు మూడు సార్లు మందుల ద్వారా, రెండు సార్లు ఆపరేషన్‌తో రెండు సార్లు గర్భధారణను అడ్డుకున్నారు. అలాంటి ప్రక్రియలతో కొన్నిసార్లు ఫెలోపియన్ ట్యూబ్స్‌లో అడ్డంకులు ఏర్పడటం, మూసుకుపోవడం, గర్భసంచి లోపలి పొర అతుక్కుపోవడం వంటి ప్రమాదాలు జరగవచ్చు. అలాంటి ప్రమాదాలు నివారించేందుకు తాత్కాలిక గర్భనివారణ మార్గాలు ఎన్నో ఉన్నాయి. మీరు వాటిని అనుసరించి ఉండాల్సింది. అది జరిగిపోయిన విషయం కాబట్టి ఇప్పుడు మీరు తదుపరి బిడ్డ కోసం గట్టిగా నిశ్చయించుకుంటే, ఒకసారి మీకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల గురించి మీ డాక్టర్‌తో ఒకసారి నేరుగా చర్చించండి. మీకు ఉపయుక్తమైన మార్గాన్ని అవలంబించండి. -
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఉష్ణోగ్రతలు
హోమియో కౌన్సెలింగ్ ఎండలు నానాటికీ ముదిరిపోతున్నాయి కదా, ఈ అధిక భానుడి తాపాన్ని తట్టుకుని, వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వడదెబ్బకు గురయితే హోమియో చికిత్స ఏమి తీసుకోవాలి? దయచేసి వివరించగలరు. - ప్రవీణ్‌కుమార్, ఆదోని వడడెబ్బ ఒక ప్రాణాంతకమైన పరిస్థితి అని చెప్పవచ్చు. ఏ వయస్సు వారినైనా ప్రభావితం చేసే ఈ వడదెబ్బ ఎక్కువగా చిన్న పిల్లలను, వృద్ధులలో ఎక్కువ. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీని బారిన పడకుండా కాపాడుకోవచ్చు. సాధారణంగా వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చెమట పట్టడం ద్వారా శరీరం సాధారణ ఉష్ణోగ్రతను కలిగి ఉండేలా చేస్తుంది. ఇలా ఎక్కువ సమయం ఎండని ఎదుర్కొన్నప్పుడు చెమట ద్వారా అధికమొత్తంలో నీరు, లవణాలను కోల్పోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ సమయంలో శరీరంలోని కణాలు రక్తంలోని నీటిని ఉపయోగించడం జరుగుతుంది. దీనివల్ల రక్తం పరిమాణం తగ్గి, గుండె, చర్మానికి, ఇత ర అవయవాలకు తగినంత రక్తప్రసరణ చేయలేకపోవడం వల్ల చర్మం యొక్క సహజమైన శీతలీకరణ వ్యవస్థ మందగించి శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల వడదెబ్బ లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు: ఎండదెబ్బ లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత పెరగడం, చర్మం పొడిబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెదడ, వాంతులు, వికారం, విరేచనాలు, కండరాల తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. జాగ్రత్తలు: నీరు, ఇతర ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి. ఎక్కువ ఎండ తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎండలో వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే పల్చని, లేతరంగు దుస్తులు ధరించాలి. కాటన్ దుస్తులయితే మంచిది. తలపై ఎండ పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. మద్యపానం, కెఫీన్ కలిగిన పానీయాలు తీసుకోరాదు. అవి అధిక మూత్రవిసర్జన కలిగించడం ద్వారా డీహైడ్రేషన్‌కు గురిచేస్తాయి. కాబట్టి తీసుకోకపోవడం మంచిది. గాలి ప్రసరణ బాగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఎండదెబ్బకు గురయితే హోమియోలో తగిన మందులు వాడటం ద్వారా ప్రమాదం నుంచి బయటపడవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్,హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
అవి కిడ్నీ ఇన్ఫెక్షన్కు సూచనలు కావచ్చు..!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 45. నాది మార్కెటింగ్ జాబ్ కావడం వల్ల వృత్తిరీత్యా సిటీ అంతా తిరగవలసి వస్తుంది. ద్విచక్రవాహనంలో ప్రయాణం చేస్తుంటే తలనొప్పి, తలతిరగడం, నోరు ఎండిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. దయచేసి నా సమస్యలకు హోమియోలో ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పగలరు. - టి.వి.ప్రమోద్, మహబూబ్‌నగర్ వేసవిలో ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు అలా కావడం సహజమే. వడదెబ్బ తగిలిందంటే ఇంకా చాలా సమస్యలు వస్తాయి. మెదడులో థెర్మోరెగ్యులేటర్ అనే కేంద్రం ఉంటుంది. ఇది ఎండలోకి వెళ్లినప్పుడు శరీరాన్ని చల్లబరచే ప్రయత్నం చేస్తుంది. విఫలమై నప్పుడు శరీరం వేడెక్కి, ఒళ్లంతా చెమటలు పట్టడం మొదలవుతుంది. దాంతో శరీరంలోని నీరంతా బయటికి వెళ్లిపోతుంది. అలా ఒంట్లో ఉన్న నీటిలో 25 శాతానికి మించి నీరు బయటకు వెళ్లిపోవడాన్ని డీ హైడ్రేషన్ అంటారు. డీ హైడ్రేషన్ ప్రభావం అందరి మీదా ఒకేలా ఉండదు. వయసు పైబడిన వారు, పసిపిల్లలు, మధుమేహవ్యాధిగ్రస్థులు డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డీ హైడ్రేషన్‌కు గురయినప్పుడు పొటాషియం తగ్గిపోయి కండరాల నొప్పులు, కండరాల బలహీనత ఏర్పడుతుంది. ఒక్కోసారి కాళ్లూ చేతులూ చచ్చుబడిపోతాయి. కారణాలు: మద్యపానం, కూల్ డ్రింక్స్, మసాలాలు అతిగా తీసుకోవడం, తగిన నీరు తాగకపోవడం వల్ల, రేడియేషన్, కీమోథెరపీ తీసుకుంటున్న క్యాన్సర్, హెచ్.ఐ.వి బాధితులు, మొండి జబ్బులు ఉన్న వారు కూడా డీ హైడ్రేషన్‌కు త్వరగా గురవుతారు. లక్షణాలు: తలనొప్పి, కండరాలనొప్పి, అలసట, నీరసం, కొద్దిపాటి జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, కళ్లు మండటం, శరీరం వేడెక్కటం జాగ్రత్తలు: బయటికి వెళ్లేటప్పుడు, నీరు, పళ్లరసాలు, ఓఆర్ఎస్ ద్రావణాలు వెంటపెట్టుకుంటే డీ హైడ్రేషన్ బారిన పడరు. పళ్లరసాలు, మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటి ద్రవాలు తీసుకోవాలి. రెండు మూడు లీటర్ల నీటిని అదనంగా తాగాలి. లేత రంగులు, వదులు దుస్తులు, ప్రత్యేకించి కాటన్ దుస్తులు ధరించడం శ్రేయస్కరం. నిర్ధారణ: రక్తపరీక్షలు, బిఎమ్ఐ, బియూఎన్, సీబిసి హోమియో చికిత్స: డీహైడ్రేషన్‌కు హోమియోపతిలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను అనుసరించి మందులను డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబుకు పన్నెండేళ్లు. ఇప్పటికీ పక్కతడుపుతూనే ఉన్నాడు. రాత్రిళ్లు ప్రతి రెండు గంటలకోసారి మూత్రవిసర్జనకంటూ మమ్మల్ని నిద్రలేపుతుంటాడు. పగలు కూడా చాలా ఎక్కువసార్లే మూత్రానికి వెళ్తున్నాడు. మాకు తగిన సలహా ఇవ్వండి. - దీప్తి, ఆదిలాబాద్ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ బాబు కండిషన్‌ను ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అని చెప్పవచ్చు. ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్తుంటే అతడికి పాలీయూరియా అన్న కండిషన్ కూడా ఉందేమోనని అనుమానించాలి. ఈ సమస్యకు కారణాలూ ఎక్కువే. అందులో కొన్ని ముఖ్యమైనవి... నీళ్లు ఎక్కువగా తాగడం, యూరినరీ ఇన్ఫెక్షన్స్, మానసిక సమస్యలు, ఎండోక్రైన్ సమస్యలు, యూరినరీ బ్లాడర్ డిజ్‌ఫంక్షన్, దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు, మలబద్దకం వంటివి. అతడి సమస్యకు కచ్చితమైన కారణాన్ని తెలుసుకోడానికి కంప్లీట్ యూరిన్ అనాలిసిస్, 24 గంటల్లో అతడు విసర్జించే మూత్రపరిమాణం పరీక్షలతో పాటు యూరిన్ ఆస్మనాలిటీ, అల్ట్రాసౌండ్ ఆఫ్ కేయూబీ పరీక్షలు చేయించాలి. ఇలాంటి పిల్లల్లో సాధారణంగా సాయంత్రం నుంచి రాత్రివరకు నీళ్లు ఎక్కువగా తాగకుండా చూడటం, తియ్యటి పదార్థాలను ఎక్కువగా తీసుకోకుండా చూడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో పాటు యూరిన్ పాస్ చేసేటప్పుడు విసర్జన పూర్తిగా చేసేలా చూడటం ప్రధానం. ఇలాంటి మంచి విసర్జక అలవాట్లతో ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. అయితే పైన పేర్కొన్న కారణాలలో ఏవైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు అన్ని మూత్రపరీక్షలు (కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్) చేయించండి. మీరు ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని సంప్రదించండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్,\ రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ కిడ్నీ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. నాకు గత కొన్నిరోజుల నుంచి మూత్రవిసర్జన సమయంలో మంటగానూ, నొప్పిగానూ ఉంటోంది. అప్పుడప్పుడూ జ్వరం వస్తోంది. వాంతి వచ్చేలా అనిపిస్తోంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని మందులు రాసిచ్చారు. ఒక వారం పాటు వాడినప్పటికీ ఎలాంటి మార్పూ లేదు. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - భద్రం, రాజమండ్రి మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీకు కిడ్నీలో గానీ, యూరినరీ బ్లాడర్‌లో గానీ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు అనిపిస్తోంది. మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు సాధారణంగా బ్యాక్టీరియా మన శరీరంలోకి దూరి ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది. ఒక్కోసారి కిడ్నీలోకి కూడా ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో కిడ్నీ ఇన్ఫెక్షన్ చోటు చేసుకుంటుంది. అంతేకాకుండా శరీరక సంబంధాల ద్వారాగానీ, షుగర్ వ్యాధి వల్లగానీ ఈ కిడ్నీ లేదా యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకవేళ ఈ సమస్య కొన్ని నెలలపాటు నుంచి మిమ్మల్ని బాధపెడోతందంటే మీ కిడ్నీలో రాళ్లు లేదా మూత్రనాళంలో సమస్య ఉన్నట్లు అనుమానించాల్సి ఉంటుంది. మీకు జ్వరం కూడా వస్తోందని రాశారు. వాంతులు అవ్వడం లేదంటున్నారు. మరి నడుం పైభాగంలో మీకు ఎలాంటి నొప్పి గానీ అనిపించడం లేదా? తరచూ మూత్రం రావడం, నొప్పి లేదా మంట పుట్టడం లాంటి లక్షణాలతో కిడ్నీ లేదా యూరినరీ బ్లాడర్ సమస్యను కనుగొనలేము. అలాగే మూత్రం, ఎక్స్‌రే లాంటి పరీక్షల ద్వారా కూడా తెలుసులేము. ఇక మీకు మామూలుగా జ్వరం ఉండి, కాస్త నొప్పి, మంటతో బాధపడుతూ ఉండి, బాగానే తింటూ, నీరు తాగుతూ, ద్రవాహారం తీసుకోగలుతున్నారంటే కొన్ని యాంటీబయాటిక్స్ వాడితే సరిపోతుంది. కానీ మీకు వంద డిగ్రీలపైగా జ్వరం ఉండి, విపరీతమైన నొప్పి లేదా మంటతో బాధపడుతూ, ఏమీ తినలేకపోవడం, తాగలేకపోవడం లాంటి లక్షణాలుంటే మాత్రం మిమ్మల్ని వెంటనే ఆసుపత్రిలో చేర్చి, మీకు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందించాల్సి ఉంటుంది. మీకు యాంటీబయాటిక్స్ ఇవ్వడంతో పాటు, ఐవీ ఫ్లుయిడ్స్ ఎక్కిస్తారు. కిడ్నీలో ఉండే ఇన్ఫెక్షన్ను సమూలంగా తీసేస్తారు. దీనికి రెండు వారాల సమయం పడుతుంది. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో ఉండే మలినాలు తొలగిపోతాయని ఇచ్చే సలహా మంచిదే గానీ బ్యాక్టీరియా ద్వారా కిడ్నీకి కలిగే తీవ్రమైన నష్టం గురించి చాలామందికి తెలియదు. అందుకే ఇలాంటి చిన్నపాటి హెచ్చరికలు వచ్చినప్పుడు సరైన పరీక్షలు చేయించుకొని తగిన చికిత్స తీసుకుంటే సరిపోతుంది. లేదా కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. అందరిలోనూ కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు తొందరగా బయటపడవు. రోగం ముదిరిన తర్వాత మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. అప్పుడు చేయిదాటిపోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి ఆరోగ్య సమస్యలు చిన్నవిగా ఉన్నప్పుడే మేల్కోవడం మంచిది. మీరు డాక్టర్‌ను సంప్రదించి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి. డా.ఊర్మిళ ఆనంద్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ - కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
రక్తనాళాల్లో బ్లాక్స్? ఇవీ జాగ్రత్తలు...
హోమియో కౌన్సెలింగ్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాణ్ణి ఈమధ్య రాత్రి నిద్రపట్టడం లేదు. చెమటలు పట్టడం, ఆందోళన, ప్రతి చిన్న విషయానికి ఆదుర్దాపడటం లాంటి లక్షణాలు ఉన్నాయి. ఈమధ్యనే తీవ్రమైన ఒత్తిడి వల్ల నా ఉద్యోగం కూడా వదులుకున్నాను. అయినా నా మనసు, శరీరం నా అదుపులో ఉండటం లేదు. హోమియోలో దీనికి పరిష్కారం ఉందా? - రవి, హైదరాబాద్ ఈ ఆధునిక యుగంలో శారీరక శ్రమ తగ్గి, ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోతోంది. స్ట్రెస్ కలిగించే సందర్భాన్ని, సమయాన్నీ, శారీరక, మానసిక పరిస్థితిని బట్టి... ఒత్తిడి (స్ట్రెస్) తాలూకు తీవ్రత ఒక్కో వ్యక్తిలో ఒక్కో రకంగా ఉంటుంది. ఆకస్మికంగా అధిక ఒత్తిడి లేదా దీర్ఘకాలిక ఒత్తిడి కలుగుతూ పోతూ ఉండే అది ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. ఇటీవల చూస్తున్న చాలా ప్రధాన వ్యాధుల్లో 80 శాతంపైగా ఒత్తిడి కారణంగానే వస్తున్నాయని పరిశోధకులు వెల్లడించిన అధ్యయన ఫలితాల వల్ల తెలుస్తోంది. ఒత్తిడికి కారణాలు: ఆర్థిక సమస్యలు ఉద్యోగాల్లో, పనుల్లో ఒత్తిడి దీర్ఘకాలిక ఆందోళన తీవ్రమైన నిరాశ నిస్పృహలు పరిణామాలు: ఒత్తిడి వల్ల మన శరీర రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడటం వల్ల క్యాన్సర్, డయాబెటిస్, రుమాటిజమ్, జీర్ణకోశ వ్యాధులు పెరుగుతాయి. లక్షణాలు : ఆవేశంగా ఉండటం లేదా చిన్న చిన్న విషయాలకు కోపం రావడం వికారం, తలతిరగడం ఛాతీనొప్పి, గుండె స్పందనల వేగం పెరగడం చిరాకు, ఒంటరితనం విరేచనాలు లేదా మలబద్దకం నిద్రలేకపోవడం. చికిత్స: ఒత్తిడిని, దాని వల్ల కలిగే దుష్పరిణామాలను తగ్గించడానికి హోమియోలో మంచి చికిత్స ఉంది. ఒత్తిడి తగ్గించడానికి హోమియోలో యాసిడ్ ఫాస్, ఇగ్నీషియా, కాక్యులస్ ఇండికస్, నేట్రమ్ మ్యూర్... మొదలైన మందులు బాగా పనిచేస్తాయి. అయితే ఒక వ్యక్తి ఎంత ఒత్తిడితో ఉన్నాడు అన్న అంశంతో పాటు వారి కుటుంబ, సామాజిక పరిస్థితులతో పాటు అతడు పనిచేసే వాతావరణాన్ని సైతం పరిగణనలోకి తీసుకొని చికిత్సను సూచిస్తారు. వాటిని అనుభవజ్ఞులైన నిపుణుల పర్యవేక్షణలో వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 50 ఏళ్లు. ‘హెపటైటిస్-బి’తో బాధపడుతూ, చికిత్స పొందుతున్నారు. కానీ అప్పుడప్పుడూ కడుపులో నొప్పి, కొద్దిరోజులుగా బరువు తగ్గడం, మనిషి కూడా నీరసం అయిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మా నాన్నగారి విషయంలో మాకు తగిన సలహా ఇవ్వండి. - చైతన్య, నెల్లూరు మీరు తెలిపిన విషయాలను పరిశీలిస్తే మీ నాన్నగారికి జీర్ణాశయంలో క్యాన్సర్ ఉండే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. హెపటైటిస్-బితో బాధపడుతున్న చాలామందిలో ఇలా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఒకసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయడం వల్ల విషయం తెలిసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి మీ నాన్నగారికి ఈ కింద పేర్కొన్న స్క్రీనింగ్ పరీక్షలు చేయించడం మంచిది. ఫుల్ బ్లడ్ కౌంట్ టెస్ట్ మూడు రోజులు వరసగా మలపరీక్ష సిగ్మాయిడోస్కోపీ సీటీస్కాన్ పెట్ స్కాన్, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ స్కాన్ ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాన్జియో పాంక్రియాటోగ్రఫీ... వంటి పరీక్షలు చేయించడం వల్ల విషయం తెలుస్తుంది. మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను కలిసి ఈ పరీక్షలు చేయించడం మంచిది. నా వయసు 45 ఏళ్లు. నేను గృహిణిని. మా నాన్నగారు పెద్దపేగు క్యాన్సర్‌తో చనిపోయారు. ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? అలా వచ్చే అవకాశం ఉంటే ముందుగా గుర్తించడం ఎలా? - సాయిలక్ష్మి, అమలాపురం పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలావరకు వంశపారంపర్యంగానే స్తుంటాయి. కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎలాంటి లక్షణాలూ లేకపోయినా ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. పెద్దపేగుల క్యాన్సర్‌ను కొలనోస్కోపీ పరీక్ష ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. కాబట్టి మీరు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోండి. నార్మల్‌గా ఉన్నట్లయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పదేళ్ల తర్వాత ఒకసారి ఈ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. బరువు 120 కేజీలు. నాకు డయాబెటిస్ ఉంది. ఈ మధ్య గుండెపోటు వచ్చింది. దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను కలిస్తే గుండెలోని రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. ఈ బ్లాక్స్ ఎవరిలో ఎక్కువగా వస్తాయి? వాటి చికిత్సలు, జాగ్రత్తలు తెలుపగలరు. - సంతోష్మోహన్, మెదక్ మొదట మీరు బరువు తగ్గించుకోవడం చాలా అవసరం. డయాబెటిస్, హైబీపీతో బాధపడేవారిలో, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నవారిలో, పొగతాగేవారిలో, స్థూలకాయులు, తగినంత శారీరక శ్రమ చేయనివారిలో రక్తనాళాలు పూడుకుపోవడం ఎక్కువ. ఇవేకాకుండా రక్తంలో లైపోప్రొటీన్-ఏ, హోమోసిస్టిన్, కార్డియోలిపిన్, ఫైబ్రినోజెన్ వంటివి ఉన్నవారికి సైతం రక్తనాళాల్లో పూడికలు పేరుకుపోయే ముప్పు ఎక్కువ. పైన పేర్కొన్న అంశాలలో రెండు కంటే ఎక్కువగా ఉన్నవారు గుండె పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. వాళ్లతో పాటు... కాస్త శ్రమ చేస్తే గుండెనొప్పి/ఆయాసం వస్తున్నవారు, కుటుంబంలో గుండెపోటు చరిత్ర ఉన్నవారు, శారీరకంగా అధికంగా శ్రమించే క్రీడాకారులు, పోలీసు వంటి ఉద్యోగాల కోసం ఫిట్నెస్ పరీక్షలకు వెళ్తున్నవారు, తరచు ఫిట్నెస్ పరీక్షలు అవసరమయ్యే పైలట్ల వంటి ఉద్యోగులు సైతం గుండెలో పూడికలు ఉన్నాయేమో అని పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. అందరికీ గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలూ అవసరం ఉండదు. కానీ శారీరక వ్యాయామంతో కూడుకున్న ‘ట్రెడ్మిల్’ పరీక్షతో మంచి ప్రయోజనం ఉంటుంది. దీని ఫలితాల ఆధారంగా చాలావరకు పెద్ద, ప్రమాదకరమైన పూడికలు లేవని మాత్రం నిర్ధారణ అవుతుంది. కొలెస్ట్రాల్, హైబీపీ వంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు, 40 ఏళ్లు పైబడిన వాళ్లు ప్రతి రెండేళ్లకోసారి, 50 ఏళ్లు పైబడిన వారు ప్రతి ఏడాదీ ట్రెడ్మిల్, ఎకో, ఈసీజీ... ఈ మూడు పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇతరత్రా సాధారణ పరీక్షలలో పూడికలు ఉన్నాయని అనుమానం వ్యక్తమైనప్పుడు కచ్చితంగా గుర్తించి నిర్ధారణ చేసేందుకు యాంజియోగ్రామ్ పరీక్ష చేస్తారు. పూడికలు ఉన్నట్లు ఈ పరీక్ష సమయంలోనే గుర్తిస్తే అప్పటికప్పుడు ‘స్టెంట్స్’ అమర్చుతారు. చికిత్స : సాధారణంగా 40-60 ఏళ్ల మధ్య వయసువారిలో ఒకటిగానీ, రెండు గానీ పూడికలు ఉంటే స్టెంట్లు అమర్చి రక్తప్రసారాన్ని చక్కదిద్దుతారు. రెండుకంటే ఎక్కువ రక్తనాళాల్లో పూడికలు ఉంటే, ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో ‘బైపాస్’ ఆపరేషన్ ఉత్తమం. జాగ్రత్తలు: పీచు ఎక్కువగా ఉండే శాకాహారం తీసుకోవడం యోగా, ధ్యానం చేయడం నిత్యం వ్యాయామం చేయడం డయాబెటిస్, హైబీపీ, కొలెస్ట్రాల్, ట్లైగ్లిజరైడ్స్ వంటి కొవ్వులను కచ్చితంగా అదుపులో ఉంచుకోవడం కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా గుండెపోటు ఉంటే ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. -
ఆరు నెలలుగా ఆ సమస్య వేధిస్తోంది!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. నాకు గత ఆరు నెలలుగా మలద్వారం వద్ద బుడిపెలా ఏర్పడి మల విసర్జన సమయంలో రక్తం పడుతోంది. నొప్పి, మంట ఉండి అప్పుడప్పుడు సూదితో గుచ్చినట్లుగా ంది. కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉంది. డాక్టర్‌ను కలిస్తే పైల్స్ అని చెప్పారు. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? - రాములు, నల్లగొండ ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తున్న సమస్యలలో ఇది ఒకటి. మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే సిరలు ఉబ్బి మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి.మొలలు దశలు : గ్రేడ్-1 దశలో మొలలు పైకి కనిపించవు.నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది. గ్రేడ్-2లో రక్తం పడవచ్చు, పడకపోవచ్చు కానీ మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి. వాటంతట అవే లోపలకు వెళ్లిపోతుంటాయి.గ్రేడ్-3లో మల విసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి. కానీ మల విసర్జన తర్వాత తర్వాత వాటంతట అవి లోపలికి పోకుండా వేలితో నెడితే లోనికి వెళ్తాయి. గ్రేడ్-4 దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు. కారణాలు : మలబద్దకం మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండరబంధనం సాగిపోతుంది. తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి. సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం స్థూలకాయం (ఒబేసిటీ) చాలాసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువ మలబద్దకం మాత్రమే గాక అతిగా విరేచనాలు కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు మంచి పోషకాహారం తీసుకోకపోవడం నీరు తక్కువగా తాగడం ఎక్కువగా ప్రయాణాలు చేయడం అధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు : నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లుగా నొప్పి మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం. నివారణ : మలబద్దకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం సమయానికి భోజనం చేయడం ముఖ్యం ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం కొబ్బరినీళ్లు నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవడం మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తక్కువగా తీసుకోవడం మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటివి పైల్స్ నివారణకు తోడ్పడే కొన్ని జాగ్రత్తలు. హోమియోలో రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఇచ్చే మందులతో వ్యాధిని నయం చేస్తారు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. ఒక నెల నుంచి నాకు ఛాతీలో విపరీతమైన మంటగా ఉంటోంది. డాక్టరును కలిస్తే ఎసిడిటీ మందులు ఇచ్చారు. వాటిని వాడినా ఏమాత్రం ఉపశమనం లేదు. ఛాతీ మధ్యలో మంట, నొప్పి, భుజం లాగడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కనబడుతున్నాయి. అప్పుడప్పుడూ చెమటలు కూడా పడుతున్నాయి. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - రవి, హైదరాబాద్ సాధారణంగా గుండెపోటు లక్షణాలతో వైద్యులను కలిసే రోగుల్లో ఎక్కువ మంది అసిడిటీ రోగులే ఉంటారు. కానీ మీరు చెబుతున్న అంశాలను బట్టి చూస్తుంటే మీకు గుండెపోటు వచ్చే ముందు కనిపించే ముందస్తు హెచ్చరిక లక్షణాల్లా అనిపిస్తున్నాయి. అసిడిటీని గుండెపోటుగా భ్రమిస్తే పర్వాలేదు. కానీ గుండెపోటును ఎసిడిటీగా పొరబడితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. మీరు డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడానని అంటున్నారు. కొన్నిసార్లు గుండెనొప్పికీ, ఎసిడిటీకి తేడా కనిపెట్టడం కష్టమవుతుంది. ఛాతీనొప్పిని పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకునే కన్నా అది గుండెనొప్పి కాదని తెలుసుకోడానికి చేసే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం చాలా మేలు. గుండెపోటు వచ్చే ముందు కొన్ని హెచ్చరికలు చేస్తుంది.మొదట ఛాతీ మధ్యభాగంలో నొప్పి మొదలవుతుంది అది మెల్లగా ఛాతీ ఇరువైపులకు వ్యాపిస్తుంది. ఆ తర్వాత వెనకైవైపునకు పాకుతుంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. చెమటలు పడతాయి కొన్నిసార్లు మూర్ఛ రావచ్చు వాంతులు కూడా అవుతాయి. అంతేకాకుండా 10-20 నిమిషాల పాటు నొప్పి తగ్గకపోతే అది కచ్చితంగా గుండెపొప్పే అని అనుమానించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. బాధితుడిని ఎంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్తే అంత మెరుగైన ఫలితాలు అందించవచ్చు. చాలామంది ఛాతీ ఎడమవైపున నొప్పి వచ్చినా కూడా నిర్లక్ష్యం వహిస్తారు. దాంతో నొప్పి పెరిగాక ఆసుపత్రులకు వెళ్లి అనవసరంగా ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. అందుకే ఎసిడిటీ సమస్య వచ్చినా, నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకొని గుండెనొప్పిపై ఒక నిర్ధారణకు రావడం చాలా ముఖ్యం. డాక్టర్ అనుజ్ కపాడియా సీనియర్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. గృహిణిని. నా కుడి మోకాలులో గత రెండేళ్లుగా విపరీతమైన నొప్పిగా ఉంది. అది ఇటీవల మరీ తీవ్రమయ్యింది. నడవడం బాగా కష్టమైపోతోంది. నా మోకాలి లోపలి భాగమంతా అరిగిందనీ, మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ) అవసరమని మాకు తెలిసిన ఆర్థోపెడిక్ సర్జన్ ఒకరు చెబుతున్నారు. అసలు నా కాళ్ల మీద నిలబడగలనా అని నాకు చాలా ఆందోళనగా ఉంది. ఈ వయసులో అంత పెద్ద సర్జరీ చేయించుకోవడం నాకు చాలా కష్టంగా అనిపిస్తోంది. ఇప్పుడు పాక్షిక మోకాలి మార్పిడి (పార్షియల్ నీ రీప్లేస్మెంట్) కూడా చేస్తున్నారని మరో డాక్టర్ అన్నారు. అయితే అది అంత ప్రభావపూర్వకం కాదని, నేను టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీకే వెళ్లాలని ఇంకో సీనియర్ డాక్టర్ చెప్పారు. నేను పూర్తిగా అయోమయంలో ఉన్నాను. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - శ్రీలక్ష్మి, హైదరాబాద్ చాలా సాధారణంగా నిర్వహించే టోటల్ రీప్లేస్మెంట్ సర్జరీ మీలాంటి వారికి బాగానే ఉండే సర్జరీ. అయితే మీలా తక్కువ వయసు ఉన్న వారికి పాక్షిక మోకాలి మార్పిడి శస్త్రచికిత్స (పార్షియల్ నీ రీప్లేస్మెంట్) మరింత బాగుంటుంది. ఎందుకంటే పూర్తి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ రీప్లేస్మెంట్ సర్జరీ)తో పోలిస్తే పార్షియల్ నీ రీ ప్లేస్మెంట్లో ఎముకలోని కేవలం 20 శాతాన్ని మాత్రమే తొలగిస్తారు. మిగతాది అంతా అలాగే ఉంటుంది. ఇక ఇందులో విజయావకాశాలు (సక్సెస్ రేట్) 98 శాతం ఉంటాయి. దీని ఫలితాలు సాధారణంగా 20 ఏళ్ల పాటు ఉంటాయి. నొప్పి కూడా తక్కువే. మోకాలు ముడుచుకునే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. చాలా మంది సర్జన్లు పాక్షిక మోకాలి సర్జరీని అంతగా సిఫార్సు చేయరు. కానీ మీ వయసుకు మీరు పార్షియల్ సర్జరీని చేయించుకోవచ్చు. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
హోలీ వేళ ఈ జాగ్రత్తలు తీసుకోండి
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 88 ఏళ్లు. ఈమధ్య నాకు మల బద్ధకం సమస్య ఎక్కువైంది. మలవిసర్జన తర్వాత విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌గారు పరీక్షించి ఫిషర్ అని చెప్పారు. ఆపరేషన్ అవసరమన్నారు. హోమియోలో దీనికి చికిత్స ఉందా? - గోపాల్‌రావు, కోదాడ మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. నిత్యం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల శాతం తగ్గడం వల్ల మలబద్ధకం వస్తుంది. దాంతో మలవిసర్జన కష్టమవుతుంది. మలవిసర్జన సజావుగా జరగనప్పుడు ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడటాన్ని ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ప్రతి ఐదుగురిలో ఒక్కరికి మలద్వార సమస్యలు వస్తున్నాయి. మలబద్ధకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు: దీర్ఘకాలిక మలబద్ధకం ఎక్కువకాలం విరేచనాలు వంశపారంపర్యం అతిగా మద్యం తీసుకోవడం ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట చురుకుగా ఉండలేరు చిరాకు, కోపం విరేచనంలో రక్తం పడుతుంటుంది కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. వ్యాధి నిర్ధారణ: సీబీపీ, ఈఎస్ఆర్, ఎమ్మారై, సీటీస్కాన్ హోమియో చికిత్స: ఫిషర్‌తో బాధపడుతున్న వారికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. దీంతో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం అవుతుంది. ఏ సైడ్ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స చేయడం హోమియో విధానం ప్రత్యేకత. ఈ సమస్యకు నక్స్‌వామికా, నైట్రస్ యాసిడ్, సల్ఫర్ వంటి మందులు ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ స్కిన్ కౌన్సెలింగ్ హోలీ వేడుకలో మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోడానికి కొన్ని సూచనలు... రంగులు పూసుకునే ముందు మీజుజీ ముఖంపైన, చర్మంపైన కాస్త హెయిరాయిల్గానీ లేదా కొబ్బరినూనెగాని పూసుకోండి. దీని వల్ల ఆ తర్వాత రంగులు తేలిగ్గా వదులుతాయి. సాధ్యమైనంత వరకు పొడిగా ఉండే గులాల్ వంటి రంగులను వాడండి. నేరుగా ఎండలో హోలీ ఆడకండి. ఆ సమయంలో మనకు దాని ప్రభావం తెలియకపోవచ్చు. కానీ దాని వల్ల డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. హోలీ ఆడే సమయంలో ఎస్పీఎఫ్ 50 ప్లస్ ఉండే వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్ వాడండి. కేవలం స్వాభావికమైన రంగులనే (నేచురల్ కలర్స్) వాడండి. కొందరు ఆటలోని జోష్‌లో పెదవులకు సైతం రంగు పూసుకోవచ్చు. దీనివల్ల అది నోటిలోకి ప్రవేశించే అవకాశం ఉంది. హోలీ వేడుకలు పూర్తి అయిన వెంటనే ఒళ్లంతా శుభ్రమయేలా స్నానం చేయండి. రంగులు తేలిగ్గా వదిలిపోయేందుకు ముందుగా నూనె పూసుకోండి. రంగులు వదిలించుకునే ప్రయత్నంలో చాలా కఠినంగా ఉండే సబ్బులు లేదా డిటర్జెంట్ సబ్బులను ఉపయోగించవద్దు. కేవలం జంటిల్ సోప్స్ మాత్రమే వాడండి. స్నానం తర్వాత ఒళ్లంతా ముద్దగా అయపోయేలా షియా బటర్ ఉన్న మాయిశ్చరైజర్ రాసుకోండి. పొడి రంగులు వాడే సమయంలో అవి కళ్లలోకి పోకుండా జాగ్రత్త పడండి. వేడుకల తర్వాత ఒంటిపై దద్దుర్లు లేదా ఎర్రమచ్చలు, చర్మంపై అలర్జీ వంటివి వస్తే తప్పక డర్మటాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి, హైదరాబాద్ పల్మనాలజీ కౌన్సెలింగ్ నాకు డస్ట్ అలర్జీ ఉంది. హోలీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - వినోద్, హైదరాబాద్ హోలీ వేడుకల్లో ఉపయోగించే పొడి రంగుల వల్ల డస్ట్ అలర్జీతో కనిపించే దుష్ర్పభావాలే కనిపించవచ్చు. ఈ పౌడర్స్ వల్ల హోలీ సమంలో వాడే రంగుల వల్ల అలర్జిక్ రైనైటిస్ ఉన్నవారిలో ముక్కునుంచి స్రావాలు కారుతుంటాయి. రంగుల పండుగ సందర్భంగా వాడే పొడి రంగులు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల కలిగే అలర్జీ... ‘ఆస్తమా’ను ప్రేరేపించవచ్చు. ఒక్కోసారి మనకు సరిపడని పదార్థానికి ఎక్స్పోజ్ అయినప్పుడు గాలిపీల్చుకునేందుకు దోహదపడే ఊపిరితిత్తుల నాళాలు సన్నబడిపోయి గాలి స్వేచ్ఛగా ప్రవహించేందుకు దోహదపడకుండా అడ్డుపడతాయి. దీన్నే అలర్జీగా చెప్పవచ్చు. అలర్జీ వల్ల కళ్లు ఎర్రబారడం కూడా కొందరిలో కనిపిస్తుంది. ఇక ఆస్తమా రోగుల్లో మ్యూకస్ ఎక్కువగా, చిక్కగా స్రవించి శ్వాసనాళానికి అడ్డుపడుతూ ఉంటుంది. దానివల్ల ఒక్కోసారి ప్రాణాలకు ప్రమాదం జరగవచ్చు. ఆస్తమా మొదలు కాగానే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి... ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది. శ్వాస కొద్దిగా అందేలోపే ఛాతీ గట్టిగా బిగదీసుకుపోయి పట్టేసినట్లుగా ఉండటం. తీవ్రమైన ఆయాసం దగ్గు శ్వాస తీసుకునే సమయంలో గొంతులోంచి పిల్లికూతలు వినిపించడం. ఇతర లక్షణాలు: ఆస్తమా రోగుల్లో ప్రధాన లక్షణాలతో పాటు మరికొన్ని అదనపు లక్షణాలూ కనిపించవచ్చు. అవి... ముక్కులు బిగదీసుకుపోవడం, సైనుసైటిస్ లక్షణాల్లోలా ముక్కు నుంచి స్రావాలు కనిపించడం, కొందరిలో ఒంటిపై దద్దుర్లు (ర్యాషెస్), చర్మంపై పగుళ్లు (డర్మటైటిస్) వంటివీ కనిపించవచ్చు. హోలీ వేడుకల్లో ఆడే రంగువల్ల ఆస్తమా కలిగితే అది ప్రాణాపాయానికీ దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఆస్తమా వ్యాధి చరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉన్నవారు ఈ వేడుకలకు దూరంగా ఉండటమే మంచిది. ఇక వ్యాధిగ్రస్తులు తాము వాడే ఇన్హేలర్ వంటి ఫస్ట్‌లైన్ ట్రీట్మెంట్ తీసుకున్నా ఇది తగ్గకపోతే వెంటనే డాక్టరును సంప్రదించాలి. వారి పర్యవేక్షణలో తక్షణమే ఆస్తమా అటాక్‌ను తగ్గించే మందులు, దీర్ఘకాలంలో యాంటీహిస్టమైన్ వంటి మందులు వాడాల్సిన అవసరం రావచ్చు. డా. రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ -
అది పక్షవాతం కాదు... బెల్స్పాల్సీ
న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. నాకు ఉన్నట్టుండి మూడు రోజులుగా కుడివైపు మూతి వంకరపోతోంది. కనురెప్ప మూసుకుపోవడం లేదు. ఇది పక్షవాత లక్షణమా? - నిరంజనరావు, కర్నూలు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘బెల్స్ పాల్సీ’ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖానికి వెళ్లే ఒక నరం దెబ్బతినడం వల్ల, వైరల్ జ్వరాల కారణంగా కూడా ఇది రావచ్చు. అయితే ఇది పక్షవాతం అనే అపోహ ఉంది. అది నిజం కాదు. కొన్ని రకాల మందులతో దీన్ని తగ్గించవచ్చు. ముఖానికి ఫిజియోథెరపీ చేయడంతోనూ, ఫేషియల్ స్టిమ్యులేషన్తోనూ ఇది తగ్గే అవకాశం ఉంది. ఈ జబ్బు వచ్చిన 80 శాతం మందిలో రెండు నెలల్లోనే నయమవుతుంది. కొంతమందిలో ఇది రెండోవైపు కూడా వచ్చి చేతులు, కాళ్లు కూడా చచ్చుబడ్డట్టు ఉండవచ్చు. అలా జరిగితే ఆసుపత్రిలో అడ్మిట్ అయి వైద్యం చేయించుకోవాలి. ఆందోళనపడనక్కరలేదు. డాక్టరును సంప్రదించి సరైన మందులు, ఫిజియోథెరపీ తీసుకోండి. బెల్స్ పాల్సీ తప్పక నయమవుతుంది. మా అబ్బాయి వయసు 15 ఏళ్లు. ఏడాది నుంచి చాలా నీరసంగా కనిపిస్తున్నాడు. ఏ పని చేయాలన్నా చాలా సమయం తీసుకుంటున్నాడు. ఒక్కోసారి చేతులు, మెడ వంకర్లు పోతున్నాయి. తగిన సలహా ఇవ్వండి. - ఆనందరావు, నూజివీడు ఈ వయసులో ఉన్న పిల్లల్లో ‘విల్సన్ డిసీజ్’ అనే జబ్బు రావచ్చు. ఈ జబ్బు వచ్చిన వారిలో చేతులు, కాళ్లు వంకర్లు పోవడం, మాట స్పష్టంగా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నీళ్లు కూడా మింగలేకపోవడం జరగవచ్చు. ఈ జబ్బును ‘స్లిట్ లాంప్’ పరీక్ష, కొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై స్కానింగ్ పరీక్షలతో నిర్ధారణ చేయవచ్చు. మన శరీరంలో ‘కాపర్’ ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఈ జబ్బు వస్తుంది. దీన్ని కొన్ని మందులతో తగ్గించవచ్చు. చేతులు కాళ్లు వంకరలు తగ్గడానికి కూడా మందులు ఉంటాయి. అయితే కొన్ని నెలలు మొదలుకొని, కొన్నేళ్ల వరకు వాడాల్సి రావచ్చు. ఇది జన్యుపరమైన జబ్బు కాబట్టి ఒకే కుటుంబంలోని చాలా మంది పిల్లల్లోనూ వచ్చే అవకాశం ఉంది. దీన్ని నివారించాలంటే దగ్గరి సంబంధాల్లో పెళ్లిళ్లు చేసుకోకపోవడమే మంచిది. డర్మటాలజీ కౌన్సెలింగ్ ఎండలోకి వెళ్లినప్పుడల్లా నా ముఖం, మెడ భాగాలు ఎర్రగా మారుతున్నాయి. ఈ ఎర్రమచ్చల్లో దురదగా ఉంటోంది. గత పది రోజుల నుంచి ఈ పరిణామాన్ని గమనిస్తున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - వనజ, గుంటూరు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు సన్‌బర్న్స్ వస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది ‘ఫొటోసెన్సిటివిటీ’ ఉన్నవారిలో ఈ వేసవిలో ఇది చాలా సాధారణ సమస్య. దీనికోసం ఈ కింది సూచనలు పాటించండి. ► ఆ ఎర్రమచ్చల మీద ‘డెసోనైడ్’ అనే మైల్డ్ స్టెరాయిడ్ ఉన్న క్రీము ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రాసుకుంటూ పదిరోజుల పాటు వాడండి. ► ఎండలో బయటకు వెళ్లే ముందు 50 ప్లస్ ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ రాయండి. ప్రతిరోజూ ఉదయం రాసుకొని బయటకు వెళ్లడంతో పాటు ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్ క్రీమ్ రాసుకుంటూ ఉండాలి. ► ప్రతిరోజూ యాంటీ ఆక్సిడెంట్స్ ట్యాబ్లెట్లను ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తీసుకోండి. ఇవి కనీసం మూడు నెలల పాటు వాడండి. మంచి రంగు ఉండే తాజా పండ్లు ఎక్కువగా తినండి. అలాగే ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు ఎక్కువగా వాడాలి. ► అలాగే క్యారట్, క్యాప్సిక ం (పసుపు పచ్చరంగులో ఉండేవి) ఎక్కువగా తీసుకోవాలి. ► పైన పేర్కొన్న జాగ్రత్తలతో పాటు రోజూ కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల మన ప్రతి కణం పునరుత్తేజం పొందుతుంది. పై సూచనలు పాటించాక కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఒకసారి డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. హోమియో కౌన్సెలింగ్ నా వయసు 45 సంవత్సరాలు. కొంతకాలంగా మూత్రంలో మంట, అప్పుడప్పుడు చీము, రక్తం పడటం, నడుంనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్ని సంప్రదిస్తే కిడ్నీలు ఇన్ఫెక్షన్కి గురైనాయని చెప్పారు. మందులు వాడుతున్నా, సమస్య పూర్తిగా తగ్గడం లేదు. హోమిమో చికిత్స ద్వారా నా సమస్యకి పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు. - అపర్ణ, విజయవాడ మన శరీరంలో మూత్రపిండాలది అత్యంత కీలకమైన పాత్ర. అవి నిరంతరం రక్తాన్ని వడపోసి, శరీరంలోని మలినాలను, అధిక నీటిశాతాన్ని మూత్రం ద్వారా బయటకు పంపించడమే కాకుండా శరీరానికి అవసరమయ్యే లవణాల సమతుల్యతనూ కాపాడతాయి. అలాగే రక్త పీడనాన్ని కూడా నియంత్రిస్తుంటాయి. నేటి ఆధునిక జీవనశైలి వలన ఎక్కువ మంది తరచు మూత్రపిండాల ఇన్ఫెక్షన్లకు గురౌతున్నారు. మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం అన్నీ వస్తాయి. సాధారణంగా రక్తప్రవాహం ద్వారా కానీ, మూత్రకోశ ఇన్ఫెక్షన్స్ ద్వారా కానీ మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. కారణాలు:మూత్ర వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫెక్షన్ కలగడానికి 80 శాతం వరకు బ్యాక్టీరియా, 15 శాతం వరకు వైరస్లు మరికొంత శాతం ఫంగల్, కొన్ని పరాన్నజీవులు కారణం. మూత్రం ఎక్కువ సమయం విసర్జించకుండా ఉన్న సమయంలో బ్యాక్టీరియా అధికంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మూత్ర వ్యవస్థలో రాళ్లు మూత్రవిసర్జనకు అడ్డుగా నిలిచి ఈ సమస్య ఉత్పన్నం అవడానికి తోడ్పడతాయి. పురుషుల్లో పోలిస్తే స్త్రీలలో మూత్రకోశం ఇన్ఫెక్షన్లను ఎక్కువగా గమనించవచ్చు. ముఖ్యంగా రజస్వల అయ్యే సమయంలోనూ, ప్రసూతి సమయంలో కూడా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం వీరిలో ఎక్కువగా ఉంటుంది. కృత్రిమ మూత్ర గొట్టాలు(క్యాథెటర్స్), స్టెంట్స్, థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్, హార్మోన్ల అసమతుల్యత, మలబద్దకం వలన కూడా మూత్ర మార్గం ఇన్ఫెక్షన్లు క లుగుతాయి. లక్షణాలు: మూత్రపిండాల ఇన్ఫెక్షన్ల వలన రోగికి తరచు జ్వరం, కడుపు నొప్పి వస్తుంటాయి. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు కడుపునొప్పి నడుముకు లేదా గజ్జలలోకి, అటుపైన తొడల వరకు కూడా పాకుతుంది. కొన్ని సందర్భాల్లో మూత్రంలో చీము, రక్తం కూడా పడటం గమనించవచ్చు. ఆకలి లేకపోవడం, ఒళ్ళు నొప్పులు, నీరసంతో పాటు మూత్రంలో చీము, రక్తం పడటం వంటి ఇతర మూత్రకోశ సమస్యలూ ఉంటాయి. జాగ్రత్తలు: వ్యక్తిగత శుభ్రత పాటించ డం, ఎక్కువ నీరు తాగటం, మూత్రాన్ని నియంత్రించకుండా ఉండటం, కృత్రిమ గర్భనిరోధక సాధనాలు వాడేటప్పుడు జాగ్రత్త వహించడం, మలబద్దకం ఏర్పడకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి కలగకుండా నియంత్రించుకోవచ్చు. హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా రోగనిరోధక శక్తిని ప్రేరేపించడం వల్ల ఇన్ఫెక్షన్ తాలూకు సమస్యలు సంపూర్ణంగా పరిష్కరించబడతాయి. -
తలనొప్పి... తగ్గేదెలా?
న్యూరో కౌన్సెలింగ్ నా వయసు 39 ఏళ్లు. తరచూ తలనొప్పి వస్తోంది. దీని నుంచి విముక్తి పొందడానికి తగిన మార్గాలు చెప్పండి. - నవీన, కరీంనగర్ * మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. తలనొప్పి తగ్గడానికి మీరు ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించండి. * ఎక్కువ శబ్దం, కాంతి లేని చోట విశ్రాంతి తీసుకోండి. విపరీతమైన శబ్దం, శక్తిమంతమైన వెలుగు వంటి అంశాలు తలనొప్పిని మరింత ప్రేరేపిస్తాయి. * ఘాటైన వాసనలకు దూరంగా ఉండండి. సరిపడని పర్ఫ్యూమ్ల వల్ల తలనొప్పి ఎక్కువ కావచ్చు. * తలనొప్పి తగ్గుతుందనే అపోహతో టీ, కాఫీలను పరిమితికి మించి తాగడం మంచిది కాదు. * చాక్లెట్లు, కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం మానేయాలి. కెఫిన్ ఉండే శీతలపానీయాల నుంచి దూరంగా ఉండాలి. * ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు పనిచేయాల్సి వచ్చినప్పుడు యాంటీగ్లేర్ గ్లాసెస్ ధరించడం మంచిది. ప్రతి అరగంటకు ఒకసారి కనీసం ఐదు నిమిషాల పాటు రిలాక్స్ కావాలి. కనురెప్ప కొట్టకుండా అదేపనిగా కంప్యూటర్ స్క్రీన్‌ను చూడటం సరికాదు. * కంటికి ఒత్తిడి కలిగించే పనులు చేయకూడదు. కుట్లు, అల్లికలు వంటి పనులు చేసేవారు మధ్య మధ్య కాస్త విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. * తలనొప్పితో పాటు వాంతులు, తలతిరగడం వంటివి కనిపిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. - డాక్టర్ మురళీధర్‌రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 34 సంవత్సరాలు. ఈమధ్య కాళ్లు నొప్పిగా ఉండి, నడుముభాగం నుంచి కాలివేళ్ల వరకు లాగినట్లుగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సయాటికా అన్నారు. సయాటికా అంటే ఏమిటో తెలియజేస్తూ, హోమియోపతిలో దీనికి పరిష్కారం సూచించగలరు. -ఏనుగుల శ్రీనివాసరావు, మెదక్ సయాటికా అనేది ఒకరకపు నొప్పి. ఇది ముఖ్యంగా తుంటినుండి మొదలై కాలివరకు నొప్పి వస్తుంది. సయాటిక్ నరంలోకి వచ్చే అసాధారణ లోపాల వల్ల ఇది వస్తుంది. ఈ సయాటిక్ నరం నడుములోని వెన్నుపాము నుంచి ప్రారంభమై దిగువకు ప్రయాణించి పాదాలను చేరుకుంటుంది. కాలిలో ఉండే అనేక కండరాలను, ఇతర నిర్మాణాలను నియంత్రిస్తుంది. సయాటిక్ నరం ప్రయాణించే మార్గంలో అడ్డంకులు లేదా అవరోధాలు ఏర్పడటం లేదా నరం నలగడం లేదా వత్తుకుపోవడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది. కారణాలు: ప్రధాన కారణం హెర్నియేటెడ్ డిస్క్. అంటే వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ వెలుపలికి చొచ్చుకొని వచ్చి, వెన్నుపామును నొక్కడం వల్ల సయాటిక్ నరం ఒత్తుకుపోయి నొప్పి వస్తుంది. వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు అరిగిపోవడం లేదా దానిలో ఉండే జిగురు వంటి పదార్థం తగ్గిపోవడం వల్ల కూడా బయటి నుంచి సయాటిక్ నరంపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లాంబార్ స్పైనల్ స్టీనోసిస్: ఏ కారణం చేత అయినా వెన్నుపాము ప్రయాణించే మార్గం ఇరుకుగా మారితే దానిని స్టీనోసిస్ అంటారు. దీనివల్ల నరాలపై వత్తిడి పెరుగుతుంది. నొప్పి వస్తుంది. ఫైరీ ఫార్మిస్ సిండ్రోమ్: ఫైరీ ఫార్మిస్ అనే కండరం సయాటిక్ కండరంపై అమరి ఉంటుంది. ఒకవేళ ఈ కండరంలో ఒత్తిడి పెరిగితే సయాటిక్ నరం పైన కూడా ఒత్తిడి పెరిగి, నొప్పి వస్తుంది. ఇది ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల లేదా మోటారు వాహనాల యాక్సిడెంట్లు, జారిపడటం వంటి వాటివల్ల కూడా వస్తుంది. లక్షణాలు: ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, నడవలేకపోవడం, చేతివేళ్లు, కాలివేళ్లు తిమ్మిరి పట్టినట్లు అవడం, కాళ్లు, పాదాలలో సూదులతో గుచ్చినట్లు ఉండటం, ఒక్కోసారి నొప్పితోబాటు కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించడం వంటివి సయాటికాలో ముఖ్యలక్షణాలు. నిర్ధారణ: ఎక్స్‌రే, నొప్పి లక్షణాల ఆధారంగా. నివారణ: పోషకాహారం తీసుకోవడం, మజిల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజులు చేయడం, విశ్రాంతి తీసుకోవడం ద్వారా. హోమియో చికిత్స: హోమియోలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా వ్యాధిని అదుపు చేయడం జరుగుతుంది. మీరు హోమియో వైద్య నిపుణులను సంప్రదించండి. - డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి,హైదరాబాద్ బ్లడ్ క్యాన్సర్ కౌన్సెలింగ్ మా అమ్మగారికి 40 ఏళ్లు. ఈమధ్య కొన్ని పరీక్షలు చేయించినప్పుడు ఆమెకు బ్లడ్‌క్యాన్సర్ అని తెలిసింది. బ్లడ్ క్యాన్సర్ రావడానికి కారణాలు చెప్పండి. - లక్ష్మిసుప్రియ, నిడదవోలు రక్తకణాల ఉత్పత్తి ప్రభావితం కావడం వల్ల బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. ఇది ప్రధానంగా బోన్ మ్యారో (ఎముకమజ్జ /మూలగ)లో ప్రారంభమవుతుంది. ఇక్కడి మూలకణాలు వృద్ధిచెంది... అవి ఎర్ర, తెల్ల కణాలుగానూ, ప్లేట్లెట్స్గానూ తయారవుతాయి. బ్లడ్ క్యాన్సర్ వచ్చినవారిలో తెల్లరక్తకణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. దాంతో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఇలా అనియంత్రితంగా రక్తకణాలు పెరగడాన్ని బ్లడ్‌క్యాన్సర్‌గా చెప్పుకోవచ్చు. ఇలా నియంత్రణ లేకుండా పెరిగిన కణాలు మిగతా వాటిని పనిచేయనివ్వవు. ఫలితంగా రోగనిరోధక శక్తి కోల్పోతారు. బ్లడ్ క్యాన్సర్స్‌లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. అవి... 1) లుకేమియా 2) లింఫోమా 3) మైలోమా లక్షణాలు: బ్లడ్‌క్యాన్సర్‌లో పరిపక్వం కాని తెల్లరక్తకణాలు అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతుంటాయి. వీటివల్ల గాయాలైనప్పుడు రక్తాన్ని గడ్డకట్టించడానికి అవసరమైన ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ఫలితంగా క్యాన్సర్ రోగులలో గాయాలైనప్పుడు అధిక రక్తస్రావం, శరీరం కమిలినట్లుగా కనపడటం, చర్మం మీద ఎర్రగా దద్దుర్లు కనిపిస్తుంటాయి. తెల్ల రక్తకణాలు వ్యాధి కారక సూక్ష్మజీవులతో పోరాడుతూ ఉండే తెల్లరక్తకణాల పనితీరు దెబ్బతింటుంది. దాంతో అవి తమ విధులను సక్రమంగా నెరవేర్చలేవు. పైగా అవి విపరీతంగా పెరగడం వల్ల ఎర్రరక్తణాలు తగ్గిపోవడంతో రోగికి రక్తహీనత రావచ్చు. దాంతో వాళ్లకు ఆయాసం కూడా రావచ్చు. ఇతర జబ్బులలో కూడా ఈ లక్షణాలు ఉండవచ్చు. అందుకే కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు బోన్‌మ్యారో పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఇతర లక్షణాలు: జ్వరం, వణుకు, రాత్రుళ్లు చెమటలు పోవడం, ఇన్ఫ్లుయెంజా, అలసట, ఆకలి లేకపోవడం, చిన్నగాయం నుంచి అధిక రక్తస్రావం, తలనొప్పి, కాలేయం, స్ప్లీన్ వాడు, ఎముకల నొప్పి, సాధారణంగా బ్లడ్ క్యాన్సర్ ఉన్నవారికి ప్రధానంగా మందులతో (కీమోథెరపీ) చికిత్స చేస్తారు. మీ అమ్మగారి విషయంలో మీ డాక్టర్ చెప్పిన సూచనలు పాటించి, తగిన చికిత్స అందించండి. - డాక్టర్ శైలేశ్ ఆర్ సింగీ,సీనియర్ హిమటో ఆంకాలజిస్ట్, బీఎమ్‌టీ స్పెషలిస్ట్, సెంచరీ హాస్సిటల్స్, హైదరాబాద్ -
ఈ వయసులోనే...
హై-బీపీ.. మందులు వాడాలా? హోమియో కౌన్సెలింగ్ నా వయసు 28. పెళ్లయి, మూడేళ్లయింది. ఇంకా సంతానం లేదు. బహిష్టు సమయంలో విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్ దగ్గరకు వెళితే నాకు డిస్మనోరియా అని చెప్పి కొన్ని మందులు ఇచ్చారు. అదేమైనా ప్రమాదకరమైన జబ్బా? దీనికి హోమియోలో చికిత్స ఉందా? - బి.శ్రీదేవి, రాజమండ్రి స్త్రీల ఆరోగ్యసమస్యలలో నెలసరి సమస్యలు ముఖ్యమైనవి. ఎక్కువశాతం స్త్రీలు పిరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతుంటారు. దీనిని బహిష్టునొప్పి (డిస్మనోరియా) అంటారు. డిస్మనోరియా అన్ని వయసులలోని వారికీ ఉండే సమస్యే అయినప్పటికీ యుక్తవయస్కులలో ఎక్కువ. లక్షణాలు: డిస్మనోరియా ముఖ్యంగా మూడు రకాలు. మొదటిరకంలో బహిష్టుకు మూడు నుంచి ఐదురోజుల ముందు నుంచే పొత్తికడుపు, నడుము భాగంలో నొప్పి మొదలవుతుంది. ఇది రుతుస్రావం మొదలయ్యాక మందులు వాడినా, వాడకున్నా తగ్గిపోతుంది. దీనిని కంజెస్టివ్ డిస్మనోరియా అంటారు. రెండవ రకంలో తీవ్రమైన నొప్పి, వాంతులు, శరీరం వణకడం, తలతిరగడం వంటి లక్షణాలు కనపడవచ్చు. దీనిని స్పాస్మోడిక్ డిస్మనోరియా అంటారు. మూడవరకంలో విపరీతంగా నొప్పి, రక్తస్రావంలో పెద్దపెద్ద గడ్డలు ఉంటాయి. దీనిని మెంబ్రేనస్ డిస్మనోరియా అంటారు. కారణాలు: గర్భాశయం చుట్టూ ఉన్న కండరాల్లో సరైన సంకోచ వ్యాకోచాలు జరగకపోవడం, గర్భాశయం ముఖద్వారం చిన్నదిగా లేదా ముడుచుకుని ఉండటం వల్ల స్రావం సాఫీగా జరగక నొప్పి వస్తుంది. కొందరిలో యోని ముఖద్వారం చిన్నదిగా ఉండటం వల్ల స్రావం సరిగ్గా బయటకు రాక చిన్నచిన్న గడ్డల రూపంలో రుతుస్రావం వెలువడి నొప్పి వస్తుంది. గర్భాశయం ఆకృతిలోనూ, పరిమాణంలోనూ తేడాలవల్ల, గర్భాశయం వెనుకకు తిరిగి ఉండటం వల్ల, గర్భాశయంలో గడ్డలుండటం, చీము చేరడం, అండాశయంలో కంతులు పెరగడం, గర్భనిరోధక ఔషధాల సేవనం, గర్భనిరోధక పద్ధతులను పాటించడం, మానసిక ఆందోళన, హార్మోన్ల అసమతౌల్యతల వల్ల కూడా నొప్పి కలిగే అవకాశాలు ఉంటాయి. హోమియో చికిత్స: పాటిజివ్ హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ పద్ధతిలో మీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ కిడ్నీ కౌన్సెలింగ్ నా వయసు 33 ఏళ్లు. నాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు గానీ... ఈ మధ్య జ్వరం వచ్చింది. డాక్టర్‌ను సంప్రదించినప్పుడు ఆయన పరీక్షలు చేశారు. అప్పుడు నా బీపీ 170/120 ఉందనీ, మందులు వాడాలని చెప్పారు. మందులు వాడకుండా ఉంటే భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? - సత్యనారాయణ, విజయవాడ మీ వయసు వారికి ఏ కారణం లేకుండా హైపర్‌టెన్షన్ (బీపీ సమస్య) రావడం చాలా అరుదు. కానీ నలభై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉంటే మూత్రపిండాలకు (కిడ్నీలకు) సంబంధించిన సమస్య ఏదైనా ఉందా అని చూడాలి. దీనికోసం ఒకసారి మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్, క్రియాటినిన్ వంటి పరీక్షలతో పాటు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన ఇతర పరీక్షలూ చేయించుకోండి. వాటి ద్వారా అసలు మీకు బీపీ అంతగా పెరగడానికి కారణాలు తెలుసుకోవాలి. బయటకు కనిపించేలా ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ మందులు తప్పనిసరిగా వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. అంతేగాక... ఆహారంలో ఉప్పు చాలా తగ్గించి వాడటం అవసరం. ఇక స్థూలకాయం ఎక్కువగా ఉన్నవాళ్లు బరువు తగ్గించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయండి. నా వయసు 25 ఏళ్లు. రెండేళ్లుగా అప్పుడుప్పుడూ మూత్రం ఎరుపు రంగులో వస్తోంది ఇలా రెండు నుంచి మూడు రోజుల పాటు వస్తోంది. ఆ తర్వాత తగ్గిపోతోంది. నొప్పి లేకపోవడంతో ఇంతవరకూ పట్టించుకోలేదు. దీని వల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? - విశ్వప్రసాద్, కందుకూరు సాధారణంగా కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కొందరికి ఇలాంటి సమస్య రావచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్, యూరిన్ ఎగ్జామినేషన్ వంటి పరీక్షలు చేయించాలి. దాంతో మీ సమస్యకు అసలు కారణం ఏమై ఉంటుందో తెలుస్తుంది. అందుకే మీరు ఒకసారి డాక్టర్‌ను కలవడం మంచిది. సమస్య నిర్ధారణ అయితే దానికి తగిన మందులు వాడవచ్చు. మీకు సాధారణ ఇన్ఫెక్షన్ ఉంటే అది మామూలు యాంటీబయాటిక్ మందులతోనే తగ్గిపోతుంది. మీరు ఒకసారి యూరిన్‌లో ప్రోటీన్లు పోతున్నాయా అనే విషయాన్ని తెలుసుకునే పరీక్షలూ చేయించాలి. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ లివర్ కౌన్సెలింగ్ నా వయసు 65 ఏళ్లు. కీళ్ల నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - శ్రీనాధరావు, కమలాపురం కీళ్ల నొప్పులలో చాలా రకాలు ఉన్నాయి. ఎముకలూ, దానిపైన రక్షణగా ఉండే చిగురు ఎముక (కార్టిలేజ్) అరగడం వల్ల కీళ్లనొప్పులు, వాపు వస్తాయి. ఈ కండిషన్‌ను ఆర్థరైటిస్ అంటారు. ఈ రకాలలో ఇప్పటికి వందకు పైగా గుర్తించారు. తమ రోగ నిరోధక వ్యవస్థే తమ ఎముకలపై ప్రతికూలంగా వ్యవహరిస్తుంది. ఈ సమస్యను ‘రుమటాయిడ్ ఆర్థరైటిస్’ అంటారు. ఒక్కోసారి ఏదైనా ప్రమాదంలో గాయపడినా, బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ల తర్వాత కూడా ఆర్థరైటిస్ రావచ్చు. మీకు ఏదైనా ప్రమాదం జరిగిందా లేక ఏవైనా జబ్బు వచ్చి తగ్గాక ఈ పరిణామం సంభవించిందా అన్న వివరాలు లేవు. ఇక ఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్లు నొప్పిగా ఉండటంతో పాటు, ఆ ప్రాంతం ఎర్రబారడం, వేడిగా అనిపించడం, బిగుతుగా అనిపించడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. మీ వయసులో ఉన్నవారికి ఆర్థరైటిస్ మామూలే అయినా ఇప్పుడు అన్ని వయసుల వాళ్లలోనూ (పిల్లల్లోనూ) ఇది కనిపిస్తోంది. మహిళల్లో మరీ ఎక్కువ. (మహిళల్లో 24.3 శాతం ఆర్థరైటిస్‌తో బాధపడుతుంటే పురుషుల్లో ఇది 18.7 శాతం మాత్రమే). ఇక స్థూలకాయం కూడా ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలను మరింత పెంచుతుంది. నివారణ: ఆర్థరైటిస్‌ను నివారించడానికి ముందు నుంచే అన్ని కీళ్లూ చురుగ్గా కదిలేలా వాకింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. దీనివల్ల కీళ్లతో పాటు శరీర సంపూర్ణ ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి. వారంలో మీరు వ్యాయామం చేసిన సమయం కనీసం 150 నిమిషాలకు తగ్గకుండా జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఇక్కడ శరీరం సహకరిస్తున్నంత వ్యాయామమే చేయాలి తప్ప... దాన్ని తీవ్రమైన శ్రమకు గురిచేసేలా మీ ఎక్సర్సైజ్ ఉండకూడదు. బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమస్యకు ఎన్ఎస్ఏఐడీ, డీఎమ్‌ఏఆర్‌డీ, బయాలాజిక్ రెస్పాన్సెస్ అనే మందులు అందుబాటులో ఉన్నాయి. ఇక మీరు ఒకసారి మీ ఫిజిషియన్‌ను లేదా ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, అవసరమైన పరీక్షలు చేయించుకొని తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ ప్రవీణ్ రావు సీనియర్ ఆర్థోపెడిక్ - జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ -
ఆ మందులు వాడుతున్నారా.. కాస్త జాగ్రత్త!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. ఆర్నెల్లుగా మెడ, చెవుల వద్ద దురద వస్తోంది. నేను రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు ధరించడం వల్ల ఈ సమస్య వస్తున్నట్లు అనిపిస్తోంది. ఎన్ని ఆయింట్మెంట్స్, క్రీమ్స్ రాస్తున్నా తగ్గడం లేదు. హోమియోలో దీనికి శాశ్వత చికిత్స ఉందా? - సునీత, కర్నూలు డర్మటైటిస్ అనేది ఒక చర్మవ్యాధి. శరీరంలో పేరుకుపోయి విషపదార్థాలు దీనికి కారణాలు. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి. కాంటాక్ట్ డర్మటైటిస్: ఈ రకం చర్మవ్యాధిలో చర్మం గులాబీ లేదా ఎరుపు రంగు దద్దుర్లు వస్తాయి. రబ్బరు తొడుగులు లేదా ఆభరణాలు, నికెల్/కోబాల్ట్ వంటి లోహాల వల్ల ఈ తరహా అలర్జీ కలుగుతుంది. జుట్టురంగులు, చర్మసంరక్షణ ఉత్పత్తుల వల్ల కూడా ఇది రావచ్చు. నుములార్ డర్మటైటిస్: ఈ తరహా చర్మవ్యాధిలో నాణెం ఆకృతిలో ఎరుపు మచ్చలు వస్తాయి. ఇవి సాధారణంగా కాళ్లు, చేతులు, భుజాలు, నడుముపై ఎక్కువగా కనిపిస్తాయి. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువ. ఎగ్జిమా: ఇది కూడా ఒక రకం డర్మటైటిస్. దీర్ఘకాలిక చర్మ ఇన్ఫెక్షన్ను ఎగ్జిమా అంటారు. ఇందులో చర్మం ఎరుపురంగులోకి మారడం, కమిలినట్లు కావడం, కొద్దిగా పొరలుగా తయారు కావడం కనిపిస్తాయి. ఎగ్జిమా బయటపడేటప్పుడు ఒక నిర్దిష్టమైన విధానాన్ని అవలంబిస్తుంది. మొదట చర్మం ఎరుపురంగులోకి మారి, ఆ తర్వాత వాపుతో కూడిన పొక్కులు వస్తాయి. అవి క్రమంగా నీటిపొక్కులగా కూడా మారవచ్చు. సెబోరిక్ డర్మటైటిస్: ఇది ముఖ్యంగా పిల్లల్లో కనిపిస్తుంది. సాధారణంగా ముఖం, నెత్తి మీద చర్మంపై ఎరుపు లేదా పసుపు రంగులో చర్మం కమిలినట్లుగా కనిపిస్తుంది. దీని తీవ్రతవల్ల జుట్టు రాలవచ్చు. కారణాలు: డర్మటైటిస్‌కు చాలా కారణాలు ఉంటాయి. అవి... కొన్ని రకాల మందులు జుట్టుకు వాడే రంగులు జంతు చర్మాలతో తయారయ్యే వస్తువులు రోల్డ్‌గోల్డ్ నగలు బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల. చికిత్స: డర్మటైటిస్‌కు హోమియోలో మంచి మందులు ఉన్నాయి. యాంటిమోనియమ్ క్రూడమ్, అపిస్ మెల్లిఫికా, రస్టాక్సికోడెండ్రాన్, సల్ఫర్, వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే డర్మటైటిస్ పూర్తిగా తగ్గుతుంది. - డాక్టర్ మురళి అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 60. ఏడాది క్రితం బై-పాస్ ఆపరేషన్ అయ్యింది. ఆ తర్వాత కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గడానికి, రక్తం పలచగా ఉండటానికి డాక్టర్ కొన్ని మందులు ఇచ్చారు. అయితే రక్తాన్ని పలచబార్చే మందుల వల్ల కొన్ని సమస్యలు వస్తాయని కొందరు మిత్రులు చెప్పారు. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తప్రసరణ త్వరగా ఆగదని అంటున్నారు. ఈ విషయంపై నాకు తగిన సలహా ఇవ్వండి. - కె. జనార్దన్, చిత్తూరు గుండె ఆపరేషన్ అయ్యాక మళ్లీ జబ్బు రాకుండా ఉండటానికి కార్డియాలజిస్ట్ సలహా మేరకు జీవితాంతం ఆస్పిరిన్, స్టాటిన్ వంటి మాత్రలు వాడాల్సి ఉంటుంది. ఇవే కాకుండా గుండె పంపింగ్ సరిగా లేకపోతే ఆపరేషన్ కంటే ముందుగా బీటా బ్లాకర్స్, ఏసీఈ ఇన్హిబిటర్స్ వంటి మందులతో గుండె పంపింగ్‌ను సరిచేయవచ్చు. రక్తాన్ని పలచబార్చే మందుల్లో ప్లేట్లెట్స్ కణాల మీద ప్రభావం చూపేవీ, రక్తం గడ్డ (క్లాట్) మీద ప్రభావం చూపేవీ రెండు రకాలు ఉంటాయి. యాంటీప్లేట్లెట్ (యాస్పిరిన్, క్లోపెడోగ్రెల్) వల్ల రక్తస్రావం అయ్యే అవకాశాలు తక్కువ. కానీ యాంటీకోయాగ్యులెంట్స్ మీద ఉంటే మాత్రం (ఎసిట్రోమ్, వార్‌ఫేరిన్ ఇచ్చినట్లయితే) అప్పుడు రక్తస్రావం కాకుండా, దెబ్బలేమి తగలకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మందులు వాడే వారిలో రక్తస్రావం జరగడానికి అవకాశం ఉంది. అయితే ఏదైనా కారణం వల్ల రక్తస్రావం అవుతుంటే శుభ్రమైన బట్టతో దాన్ని అదిమిపట్టి వెంటనే దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించాలి. అంతేకాకుండా ‘ఐఎన్ఆర్’ను 2 నుంచి 3 మధ్యలో ఉంచుకోవాలి. నాకు ఐదు నెలల క్రితం ఛాతీ నొప్పి వచ్చింది. తక్షణం హాస్పిటల్ వెళ్లాం. అక్కడ హార్ట్ ఎటాక్ అని చెప్పి యాంజియోగ్రామ్ చేసి, స్టెంట్ అమర్చారు. ఇది జరిగి మూడు నెలలు అవుతోంది. ఇప్పుడు నేను అన్ని పనులూ చేసుకోవచ్చా? మందులు ఎన్ని రోజులు వాడవలసి ఉంటుందో వివరించండి? - శ్రీనివాసరావు, కొత్తగూడెం ఇప్పుడు మీ హార్ట్ పంపింగ్ ప్రక్రియ అంతా నార్మల్‌గానే ఉందని మీ లేఖలోని వివరాలను బట్టి తెలుస్తోంది. కాబట్టి గుండెజబ్బు రాకముందు మీరు ఏయే పనులు చేసుకునేవారో, వాటన్నింటినీ ఇప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అయితే మీరు కొన్ని ఆహారనియమాలు పాటిస్తూ, వాకింగ్, యోగాలాంటివి ప్రాక్టిస్ చేయడం మంచిది. ఒక్కసారి హార్ట్ ఎటాక్ వచ్చి స్టెంట్ అమర్చిన తరువాత యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్ మాత్రలు తప్పనిసరిగా ఒక ఏడాది పాటు ఎలాంటి అంతరాయం లేకుండా వాడాలి. అవేగాక స్టాటిన్స్ వంటి మందులు జీవితాంతం వాడాలి. కాబట్టి వాటిని మీ కార్డియాలజిస్ట్ సూచించిన మోతాదులో వాడుతుంటే ఇకపై మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కొత్త జనరేషన్ స్టెంట్ల మన్నిక ఎక్కువ కాబట్టి తిరిగిపూడుకుపోతాయనే భయం లేదు. - డాక్టర్ సి. రఘు కార్డియాలజిస్ట్ ప్రైమ్ హాస్పిటల్స్ అమీర్‌పేట, హైదరాబాద్ ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం కెరీర్ మీదే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాను. మరో 3 - 5 ఏళ్ల వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఇప్పుడు సమస్యల్లా ఇలా వైవాహిక జీవితాన్ని వాయిదా వేసుకోవడం వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టే విషయంలో ఏమైనా సమస్యలు వస్తాయా? నాలో అండం ఉత్పత్తి కావడం, వాటి పనితీరులో ఏదైనా ఇబ్బందులు వస్తాయా? దయచేసి వివరంగా చెప్పండి. - సునంద, హైదరాబాద్ సంతాన సాఫల్యం విషయంలో వయసు చాలా కీలకమైన భూమిక పోషిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అండాల ఉత్పత్తి, వాటి నాణ్యత తగ్గుతుంటుంది. పైగా మీరు పెళ్లి చేసుకోవాలన్న సమయానికి మీ రుతుక్రమం కూడా ఆగిపోయే వయసు వస్తుంది. ఆ సమయంలో గర్భధారణ అవకాశాలు తగ్గవచ్చు. మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే 38 ఏళ్ల తర్వాత గర్భధారణ అవకాశాలు బాగా తగ్గిపోతాయి. ఇప్పుడు మీ అండాల సామర్థ్యాన్ని తెలుసుకోడానికి చాలా మంచి పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. మీ ఒవేరియన్ సమర్థతను కొన్ని రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు అల్ట్రా సౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులలో త్వరగా మెనోపాజ్ వచ్చే మెడికల్ చరిత్ర ఉంటే మీకూ రుతుస్రావం త్వరగా ఆగిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. పైగా వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో ఫైబ్రాయిడ్స్, ట్యూబ్‌లకు సంబంధించిన వ్యాధులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు డయాబెటిస్, హైబీపీ వంటివి వచ్చే అవకాశం కూడా ఎక్కువే. ఇవన్నీ గర్భధారణతో పాటు, గర్భస్రావాలనూ పెంచవచ్చు. పైగా పెద్ద వయసులో నెల తప్పిన వాళ్లలో పిండంలో క్రోమోజోముల సమస్యలు ఏర్పడే అవకాశాలు అధికం అవుతుంటాయి. పై అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కెరియన్ ప్లానింగ్‌కూ, కుటుంబ జీవితానికీ సమతౌల్యం ఉండేలా జాగ్రత్త తీసుకోండి. ఎవరైనా ఫెర్టిలిటీ నిపుణులతో చర్చించి, వారి నుంచి సలహాలూ, సూచనలు తీసుకోండి. మీ అండాలను భద్రపరిచేలా అవకాశాలను పరిశీలించి, వారు మీకు సరైన రీతిలో మార్గనిర్దేశనం చేస్తారు. - డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్ రోడ్ నెం. 1, బంజారాహిల్స్ హైదరాబాద్ -
రొమ్ము క్యాన్సర్ పూర్తిగా తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 20 సంవత్సరాలు. నేను డిగ్రీ చదువుతున్నాను. నాకు రెండేళ్లుగా విపరీతమైన తలనొప్పి. తలలో ఒకవైపు మొదలై కంటి వరకు తీవ్రమైన నొప్పి ఉంటుంది. డాక్టర్గారిని సంప్రదిస్తే మైగ్రేన్ అని చెప్పి, కొన్ని మందులు రాసిచ్చారు. ఆ మందులు వాడినప్పుడు నొప్పి తగ్గుతోంది. మానేస్తే మళ్లీ మామూలే. దీంతో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాను. నా సమస్యకి హోమియోలో పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? - టి.విజయ్ కుమార్, నల్గొండ మీరు ఆందోళన చెందకండి. హోమియోలో మైగ్రైన్‌కి పూర్తి చికిత్స లభిస్తుంది. ఈ సమస్య సాధారణంగా 15 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో అధికంగా వచ్చే అవకాశం ఉంది. పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా చూస్తాం. ఈ పార్శ్వపు నొప్పితో బాధపడుతున్నవారిలో నెలలో ఐదుకంటే ఎక్కువసార్లు తలనొప్పి వస్తుంటుంది. ఒకపక్కే వచ్చే ఈ నొప్పి నాలుగు గంటల నుండి మూడు రోజుల వరకు తీవ్రంగా బాధిస్తుంది. వాంతులు అవడం, శబ్దాలను, వెలుతురును భరించలేకపోవడం వంటి లక్షణాలు తలనొప్పితోబాటు కానీ, ముందుకానీ ఉంటాయి. కారణాలు: ఒత్తిడి, నిద్రలేకపోవడం, ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్. నెలసరి సమయంలో, గర్భిణులలో, మెనోపాజ్ సమయంలో సాధారణంగా ఈ నొప్పి వస్తుంటుంది. స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల కూడా ఈ మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. అతి వెలుగు, గట్టి శబ్దాలు, ఘాటైన వాసనలు, పార్శ్వపునొప్పికి కారణాలు కావచ్చు. పొగతాగటం, ఇంట్లో పొగతాగేవారుండటం, మద్యపానం లేదా ఇతర మత్తుపదార్థాలు తీసుకోవడం కూడా కారణాలవుతాయి. పైన పేర్కొన్న అంశాలకు దూరంగా ఉండటం వల్ల కొంతవరకు తలనొప్పిని అదుపులో ఉంచవచ్చు. నొప్పి తగ్గిన తర్వాత కూడా చికాకు ఎక్కువగా ఉండటం, నీరసం, వికారం, వాంతులు, విరేచనాలు కావడం వంటి లక్షణాలుంటాయి. రోగనిర్ధారణ పరీక్షలు: రోగలక్షణాలను బట్టి ఎక్కువసార్లు పార్శ్వపునొప్పిని నిర్ధారించడం జరుగుతుంది. ఈసీజీ, సీటీ బ్రెయిన్, ఎమ్మారై- బ్రెయిన్ వంటి పరీక్షల ద్వారా ఇతరత్రా వ్యాధులు లేవని నిర్ధారించుకోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పిని నిర్ధారించుకోవచ్చు. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్యవిధానం ద్వారా ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన కచ్చితమైన చికిత్స ద్వారా పార్శ్వపునొప్పి తీవ్రతను తగ్గించడమే కాకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్, ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 56 ఏళ్లు. నాకు పన్నెండేళ్లుగా షుగర్ ఉంది. ఈమధ్య ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాళ్లలో వాపులు వస్తున్నాయి. రక్తపరీక్ష చేయిస్తే క్రియాటినిన్ 10, యూరియా 28 అని వచ్చింది. యూరిన్ పరీక్ష చేయిస్తే 3 ప్లస్ అన్నారు. నాకు షుగర్ వల్ల సమస్య అవుతోందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - దయాసాగర్, శ్రీకాకుళం మీ రిపోర్ట్ ప్రకారం మీకు యూరిన్‌లో ప్రోటీన్ ఎక్కువగా పోతోందని తెలుస్తోంది. ఇది షుగర్ వల్లనా లేక ఏదైనా కిడ్నీ సమస్యల వల్లనా లేదా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి. మీరు ఒకసారి కంటి డాక్టర్‌ను కూడా కలవాలి. షుగర్ వల్ల రెటీనా దెబ్బతిన్నదేమోనని (డయాబెటిక్ రెటినోపతీ) అని చూపించుకోవాలి. మీకు మూత్రంలో ఎక్కువగా ప్రోటీన్ పోవడానికి కూడా షుగర్ వల్లే అయి ఉంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లకు భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట మీ షుగర్ లెవెల్స్‌ను బాగా నియంత్రించుకోవాలి. తినకముందు బ్లడ్ షుగర్ 110 ఎంజీ/డీఎల్, తిన్న తర్వాత 160 ఎంజీ/డీఎల్ ఉండేట్లుగా చూసుకోవాలి. బీపీ 125/75 లోపల ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. బ్లడ్ కొలెస్ట్రాల్ 150 ఎంజీ ఉండేలా మందులు వాడాలి. ఇవి కాకుండా ఆహారంలో ఉప్పు తగ్గించాలి. పొగతాగడం / ఆల్కహాల్ అలవాట్లు ఉంటే వాటిని దూరంగా ఉండాలి. డాక్టర్ సలహా లేకుండా నొప్పి నివారణ మందులు వాడకూడదు. మా అబ్బాయికి ఐదేళ్లు. పొద్దున్నే లేచినప్పుడు కళ్ల మీద రెప్పలు ఉబ్బి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కాళ్లలో వాపు కనిపిస్తోంది. యూరిన్ టెస్ట్‌లో ప్రోటీన్ 3 ప్లస్ ఉందని చెప్పారు. ఈ సమస్య ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? - రవీంద్రరావు, కొత్తగూడెం మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు నెఫ్రొటిక్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారికి మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా పోతుంటాయి. మొదటగా ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. మీరు ఒకసారి మీ బాబుకు 24 గంటల్లో మూత్రంలో ఎంత ప్రోటీన్ పోతుందో తెలుసుకునే పరీక్ష చేయించండి. దానితో పాటు ఆల్బుమిన్ కొలెస్ట్రాల్ పరీక్ష కూడా చేయించండి. నెఫ్రోటిక్ సిండ్రోమ్‌లో సీరమ్ ఆల్బుమిన్ తక్కువగా ఉండి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో చాలా సాధారణంగా వచ్చే సమస్య. మొదటిసారి వచ్చినప్పుడు మూడు నెలల పాటు స్టెరాయిడ్స్ వాడాలి. అవి వాడే ముందు మీ బాబుకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేవని నిర్ధారణ చేసుకోవాలి. ఈ వ్యాధి పదిహేనేళ్ల వయసు వరకు మళ్లీ మళ్లీ వస్తుంటుంది. అయితే మొదటిసారే పూర్తి చికిత్స చేయించుకుంటే మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. ఈ పేషెంట్స్ ఉప్పు, కొవ్వు పదార్థాలు తగ్గించి వాడాలి. ఇన్ఫెక్షన్ వస్తే వ్యాధి తిరగబెట్టవచ్చు. అలాంటప్పుడు మొదట ఇన్ఫెక్షన్ నియంత్రించుకోవాలి. - డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్,కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్, హైదరాబాద్ క్యాన్సర్ హెల్త్ కౌన్సెలింగ్ నా వయసు 18 ఏళ్లు. నా చిన్నప్పుడే మా అమ్మ రొమ్ము క్యాన్సర్‌తో చనిపోయింది. మా అక్కకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఒక రొమ్మును తొలగించాల్సి వచ్చింది. కుటుంబంలో ఇలా చాలామందికి క్యాన్సర్ రావడంతో నాకూ ఈ వ్యాధి వస్తుందేమో అని భయంగా ఉంది. నాకు ఈ ఏడాది లేదా పై ఏడాది పెళ్లి చేస్తామంటున్నారు. నా వైవాహిక జీవితం బాగానే ఉంటుందా? నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? వస్తే తగ్గుతుందా? దీని బారిన పడకూడదంటే నేను తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలు ఏవైనా ఉంటే తెలియజేయండి. - ఒక సోదరి, విజయవాడ ఇటీవల చాలామంది మహిళలు రొమ్ము (బ్రెస్ట్) క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం... దీని పట్ల తగిన అవగాహన లేకపోవడం. అంత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా అవగాహన లోపం వల్ల ముందుగానే దీన్ని గుర్తించలేకపోతున్నారు. ఇక మీ విషయానికి వస్తే మీ కుటుంబంలో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డవారు ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ రావడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ మీకు కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉంది కాబట్టి ఒకసారి పరీక్షలు చేయించుకుంటే మీ అనుమానాలు తొలగిపోతాయి. ‘సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ అనే పరీక్ష ద్వారా మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా, లేదా అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. ఒకవేళ మొదటే గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్ ఉన్నా ఇప్పుడున్న వైద్య సదుపాయాలతో దీని నుంచి పూర్తిగా బయటపడవచ్చు. మీరు ఎలాంటి భయాందోళనలూ పెట్టుకోకుండా ముందుగా మ్యామోగ్రామ్ పరీక్ష చేయించుకోండి. ఒకవేళ అవసరమైతే వైద్యులు మీకు నీడిల్ బయాప్సీ అనే మరో పరీక్ష చేస్తారు. ఒకవేళ ఇప్పుడు పరీక్షలో మీకు ఎలాంటి బ్రెస్ట్ క్యాన్సర్ లేదని తేలినప్పటికీ మీకు 30 సంవత్సరాలు వచ్చే వరకూ మూడేళ్లకొకసారి బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. - డాక్టర్ అవినాశ్ పాండే మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ, హైదరాబాద్ -
రేడియేషన్ చికిత్సలో ఇతర కణాలు దెబ్బతినవు
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. కడుపులో మంట, ఆకలి లేకపోవడం, మలబద్ధకం కనిపించాయి. డాక్టర్ గారు , కాలేయం పనితీరులో లోపం ఉందన్నారు. హోమియోలో చికిత్స ఉందా? - సునీల్‌కుమార్, విశాఖపట్నం ప్రస్తుతం తీసుకునే ఆహారపు అలవాట్లు మారడంతో ఆహారంలో కొవ్వులు పేరుకుపోయి కాలేయ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కాలేయం జీర్ణవ్యవస్థకు సంబంధించిన గ్రంథి. ఇది పైత్యరసాన్ని స్రవిస్తుంది. కాలేయం స్రవించే ఈ పదార్థాలు ఎంజైమ్‌లు లేకపోయినా బైలిరుబిన్, బైలివర్దిన్ అనే రంగు పదార్థాలు ఉండి, కొవ్వులు జీర్ణం కావడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాలేయం చాలా కీలకమైన విధులను నిర్వహిస్తుంది. ఇందులోని 20-25 శాతం పనిచేసినా శరీరంలోని విధులు నిర్విఘ్నంగా సాగుతుంటాయి. ఏదైనా బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవుల వల్ల హెపటైటిస్ అనే కాలేయవాపు వ్యాధి రావచ్చు. కాలేయ సమస్యలు ప్రధానంగా హెపటైటిస్లోని ఏ, బీ, సీ, డీ, ఈ అనే వైరస్ వల్లనే వస్తుంటాయి. అయితే హెపటైటిస్లోని కొన్ని రకాలు మన శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపడమే గాక... ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. కాలేయానికి హెపటైటిస్, సిర్రోసిస్, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, హీమోక్రొమటోసిస్, విల్సన్స్ డిసీజ్, ఫ్యాటీ లివర్, క్యాన్సర్, గిల్బర్ట్ సిండ్రోమ్, పసిరికలు వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కారణాలు: కలుషిత ఆహారం తీసుకోవడంవ్యాయామం లేకపోవడం మత్తుపదార్థాలు, పొగతాగడం వంటి అలవాట్లు ఇన్ఫెక్షన్ రక్తమార్పిడి వంటివి కాలేయ సమస్యలు రావడానికి కారణాలు లక్షణాలు: బరువు తగ్గడం, గాయాలు తొందరగా తగ్గకపోవడం జీర్ణసమస్యలు మలబద్ధకం నీరసం, ఆకలి మందగించడం సమస్య ముదిరిన కొద్దీ ముక్కు నుంచి రక్తస్రావం, కాళ్లలో వాపు, మందులకు సరిగా స్పందించకపోవడం, జీర్ణాశయంలోని సిరలు వ్యాకోచించడం వంటివి జరుగుతాయి. జాగ్రత్తలు: కాలేయ సంబంధ వ్యాధులను ప్రాథమికదశలోనే గుర్తిస్తే చాలా తేలికగా నయం చేసుకోవచ్చు కొవ్వు, ప్రోటీన్లు వంటివి తక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి మద్యం, పొగతాగడం పూర్తిగా మానేయాలి సమతుల ఆహారం తీసుకోవాలి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకునేలా జీవనశైలి మార్చుకోవాలి. హోమియో చికిత్స: ఈ విధానంలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరచే అద్భుతమైన మందులు ఉన్నాయి. ఆరమ్‌మెట్, కాల్కేరియా అర్స్, బెలడోనా, లైకోపోడియమ్, నేట్రమ్ సల్ఫ్, మెర్క్‌సాల్ వంటి మందులు మంచి ఫలితాలను చూపుతాయి. వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. దాంతో కాలేయ సమస్యలను సమూలంగా నయం చేయవచ్చు. డాక్టర్ మురళి అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ డయాబెటిక్కౌన్సెలింగ్ నా వయసు 65 ఏళ్లు. చాలాకాలంగా డయాబెటిస్ ఉంది. ఇటీవల మా డాక్టర్ షుగర్ ఉన్నవాళ్లు ప్రత్యేకంగా పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. పాదాలను సంరక్షించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - నవనీతరావు, కొండాపూర్ డయాబెటిస్ రోగులు పాదాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పాదాలకు సంబంధించి ఏ సమస్యలూ రాకుండా పాటించాల్సినవి... పొగతాగకండి చెప్పులు లేకుండా అసలు నడవవద్దు. మీ ఇంట్లో కూడా పాదరక్షలు లేకుండా నడవకండి ప్రతిరోజూ పాదాలను పరిశీలించుకుంటూ ఉండాలి. ఎర్రబారడం, వేడిగా అనిపించడం, పుండ్లు, పగుళ్లు, గాయాలు, షూ వేసుకోవడం వల్ల గానీ లేదా ఇతర అంశాల వల్లగానీ గోళ్ల సమస్యలు లేకుండా చూసుకోండి. పాదం అడుగుభాగాన్ని అద్దంలోనూ పరిశీలించుకోండి. పైన పేర్కొన్న అంశాలు కనిపిస్తాయా అని చూసుకోండి. మీ షూస్లోగానీ లేదా చెప్పుల్లో గానీ రాయిలాంటివి చేరితే తక్షణం తీసేయండి. మీ గోర్లు కాలి కండలోకి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. పాదాల్లో మృదువుగా లేకపోతే... స్పర్శతో దాన్ని తెలుసుకోండి మీరు షూస్ కొనుక్కోవాలంటే సాయంత్రం పూట తీసుకోండి. దీనివల్ల ఆ సమయానికి పాదాలు పూర్తిగా సాగి ఉంటాయి. అప్పుడు మీకు దొరికే సైజ్ చాలా కరెక్ట్. పాదాలకు చాలా అనువుగా ఉండే షూ లేదా చెప్పులు మాత్రమే తీసుకోండి. పాదరక్షల కింది భాగం కూడా చాలా మృదువైన మెటీరియల్‌తో చేసి ఉండాలి. చెప్పుల పైన ఉన్న కప్పు భాగం కూడా అంతే మృదువుగా ఉండాలి ఒకసారి వేసుకున్న తర్వాత అదేపనిగా రెండుగంటల పాటు వేసుకొని ఉండకండి మీరు చెప్పులు వేసుకునే ముందర కాలికి మాయిశ్చరైజర్ పూసుకోండి. పాదం పొడిగా ఉన్నప్పుడే పాదరక్షలు ధరించాలి మీ పాదాలను హీటింగ్ ప్యాడ్స్, వేడినీటి బుడగలు, రూమ్హీటర్ల నుంచి, మంట నుంచి జాగ్రత్తగా చూసుకోండి కాలికి ఆనెకాయల వంటివి రాకుండా జాగ్రత తీసుకోండి. ఒకవేళ ఉంటే దానికి జిగురుగా ఉండే ప్లాస్టర్స్ వేయకండి కాలికి ఏవైనా రసాయనాలు అంటకుండా జాగ్రత్త తీసుకోండి. బలమైన యాంటీసెప్టిక్ పదార్థాలు పాదాలకు తగలకుండా జాగ్రత్త తీసుకోండి మీ బొటనవేలి గోరును కట్ చేసుకునే సమయంలో కాస్త బయటికే ఉండేలా ట్రిమ్ చేసుకోండి చాలా బిగుతుగా ఉండే స్టాకింగ్స్ వంటివి ధరించవచ్చు. లైట్‌కలర్స్ ఉండే సాక్స్ వేసుకోవాలి. సాక్స్‌లో ఏవైనా చిరుగులు ఉంటే వాటిని ధరించవద్దు. పాదాల విషయంలో ఏ సందేహం వచ్చినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్ కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ లంగ్ క్యాన్సర్ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. మార్కెటింగ్ జాబ్‌లో ఉన్నాను. స్మోకింగ్ అలవాటు వల్లే నా ఊపిరితిత్తి (లంగ్)కి క్యాన్సర్ సోకినట్లు ఈమధ్య నిర్వహించిన టెస్ట్‌లలో బయటపడింది. రేడియేషన్ థెరపీ చేయించుకుంటే నయమైపోతుందని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. పైగా ఊపిరి తీసుకున్నప్పుడల్లా లంగ్ కదులుతూ ఉంటుంది కాబట్టి రేడియేషన్ చికిత్స చేస్తున్నప్పుడు లంగ్తో పాటు ఇతర కణాలూ దెబ్బతింటాయేమోనని ఆందోళనగా ఉంది. నా అనుమానాలు నన్ను కలవరపెడుతున్నాయి. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - చంద్రశేఖర్, హైదరాబాద్ లంగ్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం పొగతాగే అలవాటు. దీనికి తోడు మీరు మార్కెటింగ్ జాబ్ చేస్తున్నారని అంటున్నారు కాబట్టి ఎక్కువగా తిరగడం వల్ల వాతావరణంలోని వాయు కాలుష్యం కూడా క్యాన్సర్‌కు కారణమై ఉండవచ్చు. మొదటి స్టేజ్ అంటున్నారు కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీ లంగ్ క్యాన్సర్ సమస్యను రేడియేషన్ థెరపీతో సక్సెస్‌ఫుల్‌గా, సమూలంగా నిర్మూలించవచ్చు. రేడియేషన్ థెరపీలో వచ్చిన అత్యాధునిక చికిత్సలు మంచి ఫలితాలను అందజేస్తున్నాయి. ఆధునిక వైద్య విధానాలవల్ల ఏర్పడే ఇమేజింగ్‌తో లంగ్ కదులుతున్నప్పటికీ క్యాన్సర్ కణాలను టార్గెట్ చేసి, నాశనం చేస్తారు. కేవలం క్యాన్సర్ కణాలపై మాత్రమే ఈ రేడియేషన్ పడుతుంది. అది కూడా లంగ్‌లో ఉన్న క్యాన్సర్ కణాలపైనే పనిచేసేలా లక్ష్యాలను సంధిస్తారు. దాంతో లంగ్ కదులుతూన్నప్పటికీ, కేవలం టార్గెట్‌కు మాత్రమే చికిత్స కిరణాలు తగులుతాయి. దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే మీ లంగ్‌కు గానీ, మీరు భయపడుతున్నట్లు దానికి పరిసరాల్లో ఉండే ఏ ఇతర అవయవాలకు గానీ ఎలాంటి హానీ జరగదు. ఇతర ఆరోగ్యకరమైన కణాలపై ఎలాంటి రేడియేషన్ ప్రభావమూ ఉండదు. రేడియేషన్ థెరపీతో కేవలం క్యాన్సర్ ఉన్న భాగమే నశిస్తుంది. మీ ఇతర అవయవాలు రేడియేషన్ ప్రభావానికి లోనుకావు. ఇప్పటివరకూ మీలాంటి కేసుల్లో అంతా పాజిటివ్ రిజల్ట్సే వచ్చాయి. కాబట్టి మీరు ఎలాంటి భయాందోళనలూ పెట్టుకోకుండా నిరభ్యంతరంగా రేడియేషన్ థెరపీ తీసుకోవచ్చు. డాక్టర్ కె. కిరణ్ కుమార్ సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
మంచి పోషకాహారంతోనే క్యాన్సర్‌కు చెక్!
హోమియో కౌన్సెలింగ్ నా వయస్సు 34 ఏళ్లు. నేను టీచర్‌గా పనిచేస్తున్నాను. నాకు మూడేళ్ల క్రితం కిడ్నీలో రాళ్ల సమస్యకి శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడు కొంత కాలం నుండి మళ్లీ విపరీతమైన నడుం నొప్పితో పాటు మూత్రంలో మంటగా ఉంటుందని డాక్టరు గారిని సంప్రదిస్తే మళ్లీ కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయని చెప్పారు. అసలు ఇవి ఎందుకు ఏర్పడుతున్నాయి. నా ఈ సమస్యకి పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? - సత్యనారాయణ, అమలాపురం మీరు ఆందోళన చెందకండి. మీ ఈ సమస్యకి హోమియో చికిత్స ద్వారా పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో కిడ్నీలో రాళ్లు అతి సాధారణ సమస్యగా మారుతోంది. మన శరీరంలో మూత్ర పిండాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి రక్తాన్ని వడపోసి చెడు పదార్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపించి శరీరంలోని లవణాల సమతుల్యతను కాపాడతాయి. మూత్రంలో అధికంగా ఉండే లవణాలు స్ఫటిక రూపాన్ని దాల్చి ఘనస్థితికి చేరినప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మూత్ర వ్యవస్థలో భాగం అయిన మూత్రపిండాలు, మూత్రకోశంలో ఎక్కడైనా రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. వీటన్నిటినీ వాడుక భాషలో కిడ్నీలో రాళ్లు అని అంటుంటాం. కారణాలు: చాలామందిలో కిడ్నీలో రాళ్లు అనగానే పాలకూర, టొమాటో తినడం ద్వారా ఏర్పడతాయనే అపోహ ఉంటుంది కానీ ఇవి ప్రేరేపకాలు మాత్రమే. అధిక మోతాదులో ఆక్సలేట్స్, కాల్షియం, యూరిక్ యాసిడ్, సిస్టీన్ వంటి కరగని పదార్థాలు మూత్రం ద్వారా విసర్జించటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మూత్రకోశం ఇన్ఫెక్షన్లు, మూత్ర మార్గంలో అడ్డంకులు ఏర్పడటం, హైపర్ పారాథైరాయిడిజం, హైపర్ కాల్సేమియా, చిన్న ప్రేగు ఆపరేషన్లు, రేనల్ ట్యూబులార్ అసిడోసిన్, ఆస్ప్రిన్, ఆంటాసిడ్స్, విటమిన్-సి వంటి కొన్ని మందుల వల్ల, కాల్షియం సప్లిమెంట్లు వల్ల, ఎక్కువ సేపు ఒకే చోట కూర్చొని పనిచేయడం, శరీరంలోని విటమిన్-ఎ శాతం తగ్గడం, అధిక మోతాదులో సోడియం (ఉప్పు) తీసుకోవడం, మంచి నీరు రోజుకి 1.5 లీటర్ల కంటే తక్కువ మోతాదులో సేవించటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతాయి. తగిన వైద్యచికిత్స తీసుకుంటే, హోమియో ద్వారా వీటిని మళ్లీ రాకుండా చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 44 ఏళ్లు. నాకు కుడిపైపు తుంటి భాగంలో నొప్పి వస్తోంది. గత ఆర్నెల్లుగా ఈ నొప్పి ఉంటోంది. దాంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. మా దగ్గర ఎముకల నిపుణుడిని సంప్రదిస్తే ఇది తుంటి ఎముక చివరలో ఉండే బంతి లాంటి భాగం దెబ్బతిన్నదనీ, అది ఒక రకం ఆర్థరైటిస్ అనీ చెప్పారు. నాకు హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరమని అన్నారు. కానీ నేను పనిచేసే చోట ఉన్న ఉన్న మిత్రులు మాత్రం అది పనివల్ల వస్తోందనీ, సర్జరీ అవసరం లేదనీ అంటున్నారు. నేను చాలా మెల్లిగా మాత్రమే నడవగలుగుతున్నాను. వేగంగా పనులు చేసుకోలేకపోతున్నాను. ఇది నన్ను చాలా ఆందోళన పరుస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - సుధాకర్, కోదాడ మీ ఫ్రెండ్స్ చెప్పినట్లే చాలామందిలో తుంటి ఎముక మార్పిడి (టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ) అనే శస్త్రచికిత్స మీద చాలా రకాల సందేహాలు ఉన్నాయి. అవి కేవలం అపోహలు మాత్రమే. ఒకవేళ మీ ఆర్థోపెడిక్ సర్జన్ అదే సమస్య అని నిర్ధారణగా చెబితే, మరో నిపుణుడి నుంచి రెండో అభిప్రాయం (సెకండ్ ఒపీనియన్) తీసుకోవడంలో తప్పులేదు. అయితే తుంటి ఎముక మార్పిడి మీద ప్రజల్లో ఉన్న దురభిప్రాయాలు సరికాదు. అది గత 30 ఏళ్లుగా సురక్షితంగా చేస్తున్న ప్రక్రియ. నిపుణులైన డాక్టర్లు దాన్ని చేయడం వల్ల ఎలాంటి దుష్ర్పభావాలూ రావు. పైగా అది చేశాక ఆటలాడవద్దు అని ముందుజాగ్రత్తగా డాక్టర్లు చెప్పినా, పాశ్చాత్య దేశాల్లో చాలామంది సోర్ట్స్ వంటివి ఆడుతూనే ఉంటారు. టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీతో దుష్ర్పభావాలు (కాంప్లికేషన్లు) కనిపించే అవకాశం కేవలం ఒక శాతం మాత్రమే. కాబట్టి మీరు సర్జరీ గురించి అపోహలు పెట్టుకోవద్దు. కాకపోతే నిపుణులను సంప్రదించి, రెండో అభిప్రాయం మాత్రం తీసుకోండి. నా వయసు 68 ఏళ్లు. నాకు గత రెండేళ్లుగా మోకాళ్లలో నొప్పి ఉంది. ఇటీవల ఇది చాలా ఎక్కువైంది. ఇప్పుడు నడవడం కూడా కష్టమవుతోంది. తగిన సలహా ఇవ్వండి. - సుజాత, తిరుపతి మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ సమస్య తీవ్రమవుతూ పోతుంది. ముందుగా మీరు మీ దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి ఎక్స్-రే తీయించుకోండి. ఈ సమస్యకు తొలిదశలో నొప్పి నివారణ మందులు, కాండ్రోప్రొటెక్టివ్ డ్రగ్స్ అనే మందులు వాడతారు. ఫిజియోథెరపీ వ్యాయామాలూ సూచిస్తాం. అప్పటికీ నొప్పి తగ్గకపోతే మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ) అవసరమవుతుంది. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్ హైదరాబాద్ క్యాన్సర్ హెల్త్ కౌన్సెలింగ్ మా బాబు వయసు తొమ్మిదేళ్లు. గత కొంతకాలంగా బ్లడ్‌క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. కీమోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. అయితే... వాడు సరిగ్గా తినడం లేదు. ఎంత బతిమాలినా మెతుకు ముట్టడం లేదు. ఒకవైపు ట్రీట్మెంట్ ఇస్తుండటం మరోవైపు సరిగా తినకపోవడంతో వాడు చాలా నీరసంగా తయారవుతున్నాడు. వాడికి నయమవుతుందా... వాడూ అందరు పిల్లల్లా ఎదగగలుగుతాడా అని మాకు చాలా బెంగగా ఉంది. దయచేసి మా సమస్యకు సరైన పరిష్కారం చూపండి. - మాలతి, హైదరాబాద్ క్యాన్సర్‌తో బాధపడుతున్నవారు మంచి పోషకాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. క్యాన్సర్ వ్యాధికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నప్పటికీ సరైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోకపోతే అది వృథానే అవుతుంది. క్యాన్సర్ నిర్మూలనకు పోషకాహారం చాలా ముఖ్యపాత్రను పోషిస్తుంది. సంపూర్ణ పోషకాహారం లేకపోయినా క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. మీ బాబుకి కీమోథెరపీ చికిత్స అందిస్తున్నారు కాబట్టి కొన్ని తాత్కాలికమైన సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయి. దీనివల్ల నోరు ఎండిపోయినట్టు అయి, నాలుకకు రుచిలేకపోవడం, వాంతులు, డయేరియాలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే... బాబుకు పోషకాహారం అందించడం చాలా అవసరం. ఇందుకు మీరు ఒక డైట్‌చార్ట్ తయారు చేసుకోవాలి. బాబుకు ఏది ఇష్టంగా అనిపిస్తే అది వండిపెడుతుండాలి. అది తినకూడదు... ఇది తినకూడదు అని చెప్పకుండా అతడికి ఏది ఇష్టంగా తింటుంటాడో అది పెడుతూనే మరోపక్క సంపూర్ణ పోషకాహారంపై దృష్టిపెట్టాలి. ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉండే ఆహారాన్ని ఎక్కువస్థాయిలో బాబుకు అందించాలి. ఒక్కసారే ఎక్కువగా పెట్టకుండా కొంచెం ఎక్కువసార్లు తినేలా చూడండి. అలాగే మధ్యమధ్యన ఫ్లూయిడ్స్, స్పోర్ట్స్ డ్రింక్స్ లాంటివి ఇవ్వండి. డల్‌గా కాకుండా యాక్టివ్ ఎప్పుడుంటాడో గమనించి ఆ సమయాల్లో కాస్త ఎక్కువగా తినిపించండి. చల్లనివి, సాల్టీవీ, స్పైసీగా ఉండేవి, ఫ్లేవర్స్‌తో కూడుకున్న ఆహారం ఈ సమయల్లో నోటికి బాగుంటుంది. కొవ్వు, స్వీట్స్ జోలికి వెళ్లకండి. అందరూ కలిసి అతడితో భోంచేయండి. మీరు ఎలాంటి భయాందోళనలు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండండి. డాక్టర్ భరత్ వాస్వానీ సీనియర్ హెమటో ఆకాంలజిస్ట్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ -
శ్వాసకోశ సమస్యలన్నీ సైనస్‌కు ఇబ్బందే...
హోమియో కౌన్సెలింగ్ నా మిత్రుడికి 24 సంవత్సరాలు. తను గత ఆరు నెలలుగా తీవ్రమైన తలనొప్పి, ముక్కుదిబ్బడ, తుమ్ములు, ముక్కుకారడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే సైనసైటిస్ అని నిర్థారించి, నివారణగా యాంటీబయాటిక్స్ ఇచ్చారు. వాటిని వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. హోమియోలో దీనికి పరిష్కారం ఉంటే చెప్పగలరు. - ఎస్.పవన్ కుమార్, తెనాలి. కపాలంలో గాలితో నిండి కవాటాలను సైనస్‌లని అంటారు. ఈ సైనస్‌లు మ్యూకస్ మెంబ్రేన్ అనే మెత్తటి పొరతో కప్పి ఉంటాయి. ఈ మెంబ్రేన్ పలుచటి ద్రవపదార్థాన్ని స్రవిస్తుంది. ఇవి స్రవించే మార్గంలో వివిధ కారణాల వల్ల అడ్డంకులు ఏర్పడి ఇన్ఫెక్షన్ రావచ్చు. దీనినే సైనసైటిస్ అంటారు. అన్ని రకాల శ్వాసకోశ సమస్యలు ఈ సైనస్పై ప్రభావం చూపుతాయి. లక్షణాలు: సైనస్‌లు ఉన్న భాగం నొప్పి, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, తల బరువుగా ఉండటం, కొంచెం దూరం నడిస్తే ఆయాసం, జ్వరం, నిద్రలేమి, తలనొప్పి, తుమ్ములు, ఆకలి మందగించడం వంటివి. కారణాలు: ముక్కులో వచ్చే ఇన్ఫెక్షన్లు, సైనస్లకు దగ్గరగా ఉండే ఎముకలు విరగడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, దంతాల ఇన్ఫెక్షన్స్, నాసల్ కేవిటీలో ద్రవాలు నిల్వ ఉండటం, చల్లని వాతావరణం, పౌష్టికాహారలోపం, డయాబెటిస్, తట్టు, అమ్మవారు, కోరింత దగ్గు, డీఎన్ఎస్. సైనసైటిస్లలో మాక్సిలరీ సైనసైటిస్, ఫ్రంటల్ సైనసైటిస్, ఇథిమాయిడల్ సైనసైటిస్, స్పీనాయిడల్ సైనసైటిస్ అని నాలుగు రకాలున్నాయి. నిర్ధారణ: వ్యాధి లక్షణాలను బట్టి, సైనస్ ఎక్స్‌రే, సీబీపీ, ఈఎస్సార్ల ఆధారంగా. నివారణ: వేడినీటి ఆవిరి పట్టడం, వ్యాయామం చేయడం, ఎలర్జీ కలిగించే వస్తువులకు,చల్లటి ఆహార పదార్థాలకు, చల్లటి వాతావరణానికి, ఇన్ఫెక్షన్స్, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండటం, శ్వాసకోశ వ్యాధులు దీర్ఘకాలంపాటు ఉండకుండా చూసుకోవడం, ధూమపానం అలవాటుంటే మానేయడం, దుమ్మూధూళికి దూరంగా ఉండటం. హోమియో చికిత్స: హోమియోలో ఎటువంటి సమస్యలకయినా కాన్స్టిట్యూషనల్ చికిత్స ద్వారా క్రమేపీ రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధి తీవ్రతను తగ్గించి క్రమక్రమంగా వ్యాధి నివారణ జరుగుతుంది. మీ స్నేహితుడిని వెంటనే హోమియో వైద్యనిపుణుని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోమని చెప్పండి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నాకు ఈ మధ్యకాలంలో కడుపులో నీరు వస్తుంది. కాళ్లు వాపుగా ఉంటున్నాయి. దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను కలిస్తే మందులు ఇచ్చారు. అవి వేసుకున్నప్పుడు ఈ రెండు సమస్యలు తగ్గిపోయాయి. కానీ కొన్నిరోజుల తరువాత మళ్లీ ఈ సమస్యలు మొదలైనవి. మందులు వేసుకున్నప్పుడు తగ్గుతుంది. ఎందుకిలా? నేను రోజూ ఆల్కహాల్ తీసుకుంటాను. దానివల్ల ఇలా జరుగుతుందంటారా? జీవితాంతం ఈ మందులు వాడాలా? ఇంకేదైనా సమస్య ఉందా? ఏం చేయాలో సరైన సలహా ఇవ్వగలరు. - రమణ, శ్రీకాకుళం మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే సాధారణంగా కిడ్నీ సమస్యల వల్ల వాపు కనిపిస్తుంది. కడుపులో నీరు చేరడం కూడా ఉంటుంది. లివర్ మరియు గుండెకు సంబంధించిన జబ్బులు ఉన్నప్పుడు కూడా ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నారు కాబట్టి ఇది లివర్ వల్ల వచ్చిన వ్యాధి అయి ఉంటుంది. మీరు ఏమైనా పరీక్షలు చేయించుకున్నారో లేదో చెప్పలేదు. ఒకసారి మీరు కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, కడుపులోని నీరు పరీక్షలు చేయించుకోండి. వాటి రిపోర్టుల ఆధారంగా మీ దగ్గరలోని గ్యాస్ట్రో ఎంట్రారాలజిస్టును కలిస్తే సరైన చికిత్స అందించగలుగుతారు. నాకు చాలా రోజుల నుంచి ఛాతీలో మంటగా ఉంటోంది. చిన్న విషయమే కదా అని మెడికల్ షాపులో అడిగితే డైజిన్ జెల్ తాగమని ఇచ్చారు. ఇది తాగినప్పుడు మంట తగ్గుతుంది. కానీ తరువాత మళ్లీ పరిస్థితి మామూలే. దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? - తేజ, అమలాపురం మీరు తెలిపిన విషయాలను బట్టి చూస్తే మీకు గ్యాస్ట్రో ఈసోఫెగల్ రిప్లెక్స్ డిసీజ్ ఉన్నట్లనిపిస్తోంది. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్యం ఇది. మీరు మీ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలావరకు మీ సమస్య తగ్గిపోతుంది. మీరు కాఫీ, టీలను మానేయాలి. ఆహారంలో కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలి. మద్యం మానివేయాలి. పొగ తాగకూడదు. బరువు ఎక్కువగా ఉంటే తగ్గించుకోవాలి. భోజనం చేయగానే పడుకోకూడదు. ఈ మార్పులు తప్పనిసరిగా చేస్తే మీరు మీ సమస్యను అధిగమించగలరు. అయినా తగ్గకపోతే మీరు డాక్టర్ సలహా మేరకు ఒక్కసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకొని చికిత్స పొందగలరు. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ న్యూరో కౌన్సెలింగ్ మా అమ్మకు 53 ఏళ్లు. చాలాకాలంగా ఆమె భరించలేనంత తలనొప్పితో బాధపడుతున్నారు. అన్నిరకాల వైద్యాలు ప్రయత్నించిన తర్వాత ఇటీవల ఎమ్మారై స్కాన్ చేయిస్తే మెదడులో క్యాన్సర్ కణితులు ఉన్నట్లు తేలింది. ఇది మాకు షాక్‌లా ఉంది. సర్జరీ, రేడియేషన్‌తో కణితులను తొలగించవచ్చని ఆయన అంటున్నారు. కానీ మాకు ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వగలరు. - రవళి, గుడివాడ మెదడులో క్యాన్సర్ కణితులు ఉన్నట్లు హఠాత్తుగా తెలుసుకోవడం ఎవరికైనా ఆందోళనే కలిగిస్తుంది. ఒకప్పుడు మెదడులో కణితులకు చికిత్స కష్టమేమోగానీ, ఇప్పుడున్న చికిత్స పద్ధతులతో అంతగా ఆందోళన చెందాల్సిన విషయం కాదు. సాధారణ కణితులను సర్జరీ చేసి తొలగిస్తే సరిపోతుంది. కానీ క్యాన్సర్ కణితుల విషయంలో వాటిని తొలగించడంతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటివి అవసరమవుతాయి. మెదడులో వచ్చే కణితుల్లో నాలుగు గ్రేడులు ఉంటాయి. ఇతర క్యాన్సర్ల మొదటి దశతో మొదలై క్రమేపీ ముదిరి నాలుగో దశకు చేరతాయి. కాబట్టి ఇలాంటి క్యాన్సర్లను ముందుగానే గుర్తిస్తే వాటిని దాదాపుగా నయం చేసే వీలుంటుంది. కానీ మెదడులో వచ్చే క్యాన్సర్ కణితుల విషయంలో క్రమేపీ ఒక దశ నుంచి మరో దశకు వెళ్లడం ఉండదు. మొదలవుతూనే అవి మూడు లేదా నాలుగో దశలతో ఉండవచ్చు. కణితి మొదటి రెండు గ్రేడులలో ఉంటే చికిత్సతో రోగి జీవితకాలాన్ని పదేళ్లకు పెంచవచ్చు. కానీ నాలుగో దశలో కణితులు ఉంటే మాత్రం రోగి ఎక్కువకాలం జీవించడం కష్టం. కణితి చాలా చిన్నగా ఉండి, ఎమ్మారై స్కానింగ్‌లో అది మొదటి రెండు గ్రేడ్లలో ఉందని తేలితే వెంటనే సర్జరీ చేసి తొలగించాల్సిన అవసరం లేదు. అది పెరిగి 2 నుంచి 3 సెం.మీ. సైజుకు చేరితే అప్పుడు సర్జరీ అవసరమవుతుంది. అలాగే మెదడులోని నుదురు, చెవుల భాగంలో వచ్చే కణితులను సర్జరీతో తొలగిస్తే చాలావరకు సాధారణ జీవితం గడపవచ్చు. కానీ మెదడు మధ్యభాగంలో వచ్చే కణితులను పూర్తిగా తొలగించడం అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే మనకు మాటలు వచ్చేలా చేసే కేంద్రం, శరీర కదలికలను నియంత్రించే కేంద్రం వంటి వాటిని గుర్తించి, వాటిని ముట్టుకోకుండా మిగతా భాగంలో ఉన్న కణితిని తొలగించాలి. మిగిలిపోయిన భాగాలను రేడియోథెరపీ, కీమోథెరపీల ద్వారా నయం చేయవచ్చు. ఒకవేళ కణితి మెదడు మధ్యభాగంలో వస్తే మెదడు కణజాలాన్నీ, కణితినీ వేరు చేసి చూడటం కష్టమవుతుంది. పొరబాటున కణితితో పాటు మెదడు భాగాన్ని కూడా తొలగిస్తే చాలా నష్టం. కాబట్టి ఈ తేడాను గుర్తించేందుకు నిపుణులు మైక్రోస్కోపిక్, నావిగేషన్ వంటి పరిజ్ఞానాలను వినియోగిస్తారు. కాబట్టి మీరు ఆందోళన చెందకుండా అన్ని సౌకర్యాలతో పాటు నిపుణులైన న్యూరోసర్జన్లు ఉన్న దగ్గర్లోని కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స తీసుకోండి. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం సీనియర్ న్యూరో సర్జన్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ -
చిన్నపేగుల్లో అల్సర్... మందులతో తగ్గుతుంది
హోమియో కౌన్సెలింగ్ నాకు కొంతకాలంగా మోచేతి నొప్పి వస్తోంది. చిన్న బరువును కూడా ఎత్తలేకపోతున్నాను. ఎక్స్‌రే తీయిస్తే, ఇది టెన్నిస్ ఎల్బో అన్నారు. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? - ఎస్వీఆర్, గుంటూరు టెన్నిస్ ఎల్బో అన్న మాట వినగానే ఇది క్రీడాకారులకు సంబంధించిన ఆరోగ్య సమస్యగా అనుకుంటారు. క్రీడాకారులకేగాక చాలామంది మోచేతితో ఎక్కువగా పని చేసేవారిలో ఈ సమస్యలు చూస్తుంటాము. ఇది కొన్ని భంగిమలలో పని చేస్తున్నప్పుడు ఒక్కోసారి తీవ్రంగా ఉంటుంది. కొన్ని పరిశోధనలలో తేలిన విషయమేమిటంటే, ఈఎల్ఆర్బీ అనే కండరం బలహీనపడటం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య సాధారణంగా 30 నుంచి యాభై సంవత్సరాల వారికి వస్తుంది. టెన్నిస్ ఎల్బో పార్శ్వ మోచేతి ముడుకు శోధను ల్యాటరల్ ఎపికాన్ డైలిటిస్ అని కూడా అంటారు. ఇది సాధారణంగా నలభై నుండి 60 ఏళ్ల వయసు వారికి వస్తుంది. ఇది మోచేతి చుట్టూ నొప్పిని కలిగిస్తుంది. మోచేతి ఎముక భాగం బయట నొప్పిని కలిగిస్తుంది. ఇది ఎక్కువగా కుడిచేతిని వాడే వారిలో వస్తుంది. ఒక్కోసారి రెండు మోచేతుల్లోనూ సంభవించవచ్చు. ఎల్బో సాధారణంగా క్రీడాకారులకు, వెయిట్‌లిఫ్టింగ్‌లో పాల్గొనేవారికి, కార్పెంటింగ్ పనులు చేసేవారికి, పెయింటర్లకు, రోడ్డు నిర్మాణ కార్మికులకు, అల్లికల పని చేసేవారికి, చెఫ్‌లకు, వెయిటర్లకు వస్తుంది. టెన్నిస్ క్రీడాకారుల్లోనే కాకుండా రిపీటెడ్ మూవ్మెంట్స్ ఎక్కువగా చేసేవారిలో కనిపిస్తుంది. కారణాలు: టెన్నిస్ రాకెట్‌తో ఆడటం, ఎక్కువ బరువులు ఎత్తటం, కార్పెంటింగ్ పని చేయడం, టైపింగ్ ఎక్కువగా చేయటం, రోడ్డు నిర్మాణ పనులు చేయడం. లక్షణాలు: మోచేయి చుట్టూ నొప్పి, చేతులు వణకటం, చేయి కింది నుంచి పై వరకు తీవ్రమైన నొప్పి, కొన్ని వస్తువులు (కత్తి, ఫోర్క్, టూత్‌బ్రష్ వంటివి) మోచేతిలో నొప్పి, బలంగా డబ్బా మూతలు తెరిచినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు నిర్ధారణ: ఎక్స్‌రే, ఎమ్మారై, రక్తపరీక్షలు, ఈఎంజీ హోమియో చికిత్స: హోమియోపతిలో టెన్నిస్ ఎల్బోకి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి శారీరక, మానసిక తత్వాన్ని పూర్తిగా విశ్లేషించి, వైద్యులు అందుకు తగిన మందులను సూచిస్తుంటారు. దీనికి సాధారణంగా ఆర్నికా యెన్టానా, బెల్లడోనా, బ్రయోనియా, ఫెరమ్ ఫాస్పారికమ్, కాల్మియా ల్యాటిఫోలియా, రస్ టాక్సికోడెన్, రస్టాక్సికోడెన్ డ్రావ్, సాన్గునేరియా, సల్ఫర్ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. వీటితోపాటు ఫిజియోథెరపీ కూడా చేయిస్తే మంచిది. తద్వారా టెన్నిస్ ఎల్బోకి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. నా కళ్లు చిన్నప్పట్నుంచీ పచ్చగా ఉంటాయి. మా దగ్గరలోని డాక్టర్‌కు చూపిస్తే లివర్ ఫంక్షన్ టెస్ట్, అబ్డామినల్ స్కానింగ్ చేయించి, ఎలాంటి సమస్యా లేదని చెప్పారు. పుట్టుకతోనే కళ్లు పచ్చగా ఉన్నాయి. వాటి వల్ల సమస్య ఏమీ ఉండదని చెప్పారు. నిజమేనా? భవిష్యత్తులో ఎటువంటి సమస్యా రాదంటారా? - జలజ, ఈ-మెయిల్ మీరు ‘గిల్బర్ట్ సిండ్రోమ్’ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారిలో కామెర్ల శాతం పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు కామెర్లు ఎక్కువ అవుతాయి. ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు, ఉపవాసం చేస్తున్నప్పుడు కామెర్లు ఎక్కువ కావడం, ఆ తర్వాత వాటంతట అవే తగ్గడం జరుగుతుంటుంది. ఒక్కోసారి కామెర్లు 5 ఎంజీ/డీఎల్ వరకూ వెళ్లే ప్రమాదం ఉంది. అయినప్పటికీ దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులోనూ ఎలాంటి సమస్యా రాదు. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండవచ్చు. నా వయసు 35 ఏళ్లు. గత ఆర్నెల్లుగా నాకు కడుపులో మంట, నొప్పి వస్తోంది. ఒక నెల రోజులుగా వాంతులు కూడా అవుతున్నాయి. ఎండోస్కోపీ చేయించుకుంటే చిన్నపేగుల్లో అల్సర్ ఉందని చెప్పారు. నేను ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందా లేక నా సమస్య మందులతో తగ్గుతుందా తెలియజేయగలరు. - సుధాకర్, శ్రీకాకుళం మీరు చెప్పిన లక్షణాలు ‘క్రానిక్ డియోడినల్ అల్సర్’ అనే వ్యాధితో బాధపడుతున్నవారిలో కనిపిస్తాయి. ఈ అల్సర్ సాధారణంగా ‘హెలికోబ్యాక్టర్ పైలోరీ’ అనే బ్యాక్టీరియాతో వస్తుంది. దీన్ని పూర్తిగా నశింపజేయడానికి ప్రస్తుతం మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని క్రమం తప్పకుండా వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు... ఈ మందుల వల్ల మళ్లీ మళ్లీ అల్సర్ వచ్చే అవకాశాలతో పాటు అల్సర్ వల్ల వచ్చే ఇతర సమస్యలూ తగ్గుతాయి. ఎండోస్కోపీలో చిన్నపేగుల్లోని దారి మూసుకుపోయినట్లయితే ఈ చికిత్స ద్వారా అది తగ్గుతుంది. ఆపరేషన్ అవసరం లేదు. మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి మందులు వాడితే సరిపోతుంది. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. నా ఒంటి రంగు గోధుమ వర్ణంలో ఉంటుంది. అయితే గత ఏడాది కాలం నుంచి నా నుదుటి మీద చర్మం నల్లగా మారుతోంది. మందంగా కూడా అవుతోంది. కణతల వద్ద, మెడ మీద, చంకల వద్ద, నడుము దగ్గర ఇలాగే అవుతోంది. ప్రధానంగా చర్మం మడతలు పడ్డ చోట ఇలా జరుగుతోంది. నాకు కొంచెం ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సుదర్శన్ రావు, నిడదవోలు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘ఆకాంథోసిస్ నైగ్రిక్యాన్స్’ అనే కండిషన్‌తో బాధపడుతున్నారు. ఇది ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ వల్ల జరుగుతున్న పరిణామం. సాధారణంగా స్థూలకాయుల్లో ఇలా జరుగుతుంది. దీన్ని ‘హెచ్ఓఎమ్ఏ-ఐఆర్’ అనే పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు. రక్తంలోని సీరమ్ ఇన్సులిన్ ఎక్కువ కావడం వల్ల దీన్ని నిర్ధారణ చేయడం సాధ్యమవుతుంది. అలా ఇది రక్త పరీక్షలో బయటపడుతుంది. దీనికి చికిత్స ఈ కింది విధంగా జరుగుతుంది. బరువు తగ్గించుకోవడం జీవనశైలిని మార్చుకోవడం (అంటే సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం మేని రంగును చక్కబరిచేందుకు మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మేని ఛాయ క్రమంగా మెరుగువుతుంది. ఇందుకోసం పూత మందుగా ఉపయోగించాల్సినవి... ఆర్బుటిన్ - లికోరైస్ - కోజిక్ యాసిడ్ పైన పేర్కొన్న మందులతో పాటు క్లిగ్‌మెన్స్ రెజీమ్ అనే ప్రక్రియను రోజు విడిచి రోజు రాత్రివేళ అమలు పరచాలి. యాభైకు ఎక్కువగా ఎస్పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్‌ను రోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాన్నం రెండు వరకు రాసుకుంటూ ఉండాలి. ఒంటి లోపలి వ్యవస్థలను చక్కబరచడానికి యాంటీ ఆక్సిడెంట్ మాత్రలు, విటమిన్ సి కాప్స్యూల్ వంటివాటితో పాటు డాక్టర్ సలహా మేరకు మెట్ఫార్మిన్ -500ఎంజీ ప్రతిరోజూ వాడాలి. ఇతర ప్రక్రియలు: ఫీనాల్, టీసీఏ వంటి మందులతో కెమికల్ పీలింగ్ 4 - 6 సెషన్ల పాటు చేయించుకోవాలి లేజర్ టోనింగ్ కూడా పిగ్మెంట్ను తగ్గించడంతో పాటు మందమైన చర్మం మామూలుగా కావడానికి, నలుపు తగ్గడానికి ఉపయోగపడుతుంది. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి హైదరాబాద్ -
బైపాస్ అంటే భయం... ఏం చేయాలి?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 48 సంవత్సరాలు. గత పదేళ్లుగా దీర్ఘకాలిక జలుబు, దగ్గు, తుమ్ములతో బాధపడుతున్నాను. జూన్ నుంచి ఫిబ్రవవరి వరకు ఈ సమస్య అధికంగా ఉంటుంది. దీనికి హోమియోలో చికిత్స ఉందా? - సునిల్‌కుమార్, హైదరాబాద్ అలర్జీ అనే పదాన్ని మనం సర్వసాధారణంగా రోజూ వింటూ ఉంటాము. పారిశ్రామిక ప్రాంతాలలో, పెద్ద పట్టణాలలో ఉండటం వల్ల వాతావరణ కాలుష్యానికి లోనవడం అలర్జీకి ప్రధాన కారణాలు. అలర్జీ అంటే శరీర రోగ నిరోధక శక్తి అసందర్భ ప్రతిచర్య. అలర్జీకి కారకమైన వాటిని అలర్జైన్స్ అంటారు. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ అలర్జీ బారిన పడుతున్నారు. దీనిని వైద్యపరిభాషలో అలర్జిక్ రైనైటిస్ అంటారు. అలర్జీకి సంబంధించిన ప్రేరేపకాలు ఎదురయినప్పుడు శరీరం యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ యాంటీబాడీస్ ముక్కులో మాస్ట్ కణాలకు అతుక్కుని ఉంటాయి. ఏదైనా పడని వస్తువు తిన్నా, తాగినా మాస్ట్‌కణాలు హిస్టామిన్ అనే పదార్థాన్ని విడుదల చేస్తాయి. దీనివల్ల ముక్కులోని పొరలన్నీ ఉబ్బిపోతాయి. 70 శాతం మంది ముక్కు అలర్జీతో బాధపడుతున్నారు. ఆస్తమా రోగులలో 80 శాతం మందిలో అలర్జీ ప్రధాన కారణంగా ఉంటుంది. డస్ట్ అలర్జీ ఉన్నవారు దుమ్ములో ప్రవేశించడానికి ప్రయత్నిస్తే వెంటనే విపరీతంగా తుమ్ములు, కళ్ల దురద, ముక్కు దురద, గొంతులో, చెవిలో దురద, ముక్క వెంట నీళ్లు కారడం, దగ్గు, ముక్కులు మూసుకుపోవడం, ఆయాసం, పిల్లికూతలు వస్తుంటాయి. కారణాలు: మనం తినే ఆహారంలో, తాగే పదార్థాలలో, పీల్చే గాలిలో అలర్జీ కారకాలు ఉంటాయి. పొగ, ఆల్కహాల్, హెయిర్ డైస్, కొన్ని రకాల నొప్పులు తగ్గించే మందులు అలర్జీ ప్రేరేపకాలుగా గుర్తించవచ్చు. డస్ట్‌మైట్స్, ధూళికణాలు, బొద్దింకలు, చెట్లు, గడ్డి, కొన్ని రకాల పువ్వులనుంచి వచ్చే పుప్పొడి వల్ల కూడా డస్ట్ అలర్జీ వస్తుంది. జంతువుల బూరు, ఈకల వల్ల కూడా దీని బారిన పడతారు. లక్షణాలు: తుమ్ములు, ముక్కులో నుంచి నీరు కారడం, కళ్లలో దురద, ముక్కు బిగుసుకుపోవడం, గొంతులో ఏదో అడ్డుపడ్డ భావన, ఆయాసం, గురక, దగ్గు, ఛాతి బిగుసుకుపోవడం, నిర్ధారణ: సీబీపీ, సీటీస్కాన్, ఎక్స్‌రే, అలర్జీ లెవెల్ పరీక్షల ద్వారా. హోమియో చికిత్స: డస్ట్ అలర్జీని తగ్గించడానికి హోమియోలో మంచి మందులున్నాయి. రోగినిరోధక శక్తిని పెంచి వ్యాధి నివారణ అయ్యేలా చేస్తాయి. హోమియో నిపుణుని ఆధ్వర్యంలో మందులు వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 45 ఏళ్లు. ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు ఇటీవల నిర్థారణ అయ్యింది. ఆయనకు బైపాస్ సర్జరీ చేయాలన్నారు. ఐదేళ్ల క్రితం మా పెదనాన్నకి గుండెపోటు వస్తే బైపాస్ సర్జరీ నిర్వహించారు. ఆయనకి సర్జరీ జరిగి పదేళ్లు గడచినా ఇప్పటికీ దగ్గినప్పుడు ఛాతి నొప్పి వస్తుంటుందని ఆయన చెబుతుంటారు. గతంలో మా పెదనాన్నకి చేసిన విధంగానే ఛాతిపై, కాలిపై పెద్ద పెద్ద కోతలు పెట్టి బైపాస్ సర్జరీ చేస్తారేమో అని మా నాన్న భయపడుతున్నారు. బైపాస్ సర్జరీకి కచ్చితంగా ఛాతిని కోసి ఆపరేషన్ చేస్తారా? మా నాన్నగారి సమస్యకు ప్రత్యామ్నాయం ఉందా? - ఫణికుమార్, అదిలాబాద్ బైపాస్ సర్జరీ చేస్తారేమో అనే భయంతో మీ నాన్నగారు వైద్యుల వద్దకు వెళ్లకుండా ఉంటే సమస్య మరింత తీవ్రతరమై ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు (బ్లాక్స్) ఎక్కువగా ఉంటే బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది. బైపాస్ సర్జరీలో గుండెకు రక్త ప్రసరణను పునరుద్ధరించేందుకు కొత్త మార్గాన్ని సృష్టిస్తారు. ప్రస్తుతం బైపాస్ సర్జరీ విధానంలో ఎన్నో మార్పులు చేటు చేసుకున్నాయి. గతంలో మీ పెదనాన్న గారికి చేసిన విధంగా ఛాతీపై పెద్ద పెద్ద కోతలు లేకుండానే చిన్న కోతలతో బైపాస్ సర్జరీ నిర్వహించగలిగే మినిమల్లీ ఇన్వేసివ్ డెరైక్ట్ కరొనరీ బైపాస్ (ఎంఐడిసిఎబి-మిడ్‌కాబ్) వంటి అత్యాధునిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. చాతీకి ఎడమవైపు 5-6 సెం.మీ. కోతతో సర్జరీ నిర్వహిస్తారు. ఈ విధానంలో కోత తక్కువగా ఉండటంతో రక్తస్రావం తక్కువగా ఉంటుంది. గాయం త్వరగా మానుతుంది. భవిష్యత్తులో ఎదురయ్యే దుష్ర్పభావాలను చాలావరకు తగ్గించవచ్చు. కానీ ప్రస్తుతం ఎండోస్కోపిక్ వెయిన్ హార్వెస్ట్ విధానంలో చిన్న కోతతో కాలి నుంచి సిరలను తొలగించి బైపాస్ సర్జరీ నిర్వహించగలుగుతున్నారు. నూతన శస్త్రచికిత్స విధానాలలో కోతలు తక్కువగా ఉండటంతో రోగి త్వరితగతిన కోలుకుంటారు. దాంతో ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేకుండా 3-4 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి రోగిని డిశ్చార్జ్ చేస్తారు. శరీరంపై పెద్ద పెద్ద కోతలు పెట్టేవసరం లేకుండానే బైపాస్ సర్జరీ నిర్వహిస్తారని, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని మీ నాన్నగారికి అర్థమయ్యేలా వివరించి, వీలైనంత త్వరగా వైద్యుల వద్దకు తీసుకెళ్లండి. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏం చేయాలనేది వైద్యులు నిర్థారిస్తారు. డాక్టర్ పి.వి.నరేష్ కుమార్ సీనియర్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ అండ్ కార్డియోథొరాసిక్ సర్జన్ యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా కిడ్నీలో 5.4 మి.మీ. పరిమాణంలో రాళ్లు ఉన్నాయని కేయూబీ సీటీ స్కాన్ రిపోర్టులను పరిశీలించాక డాక్టర్ చెప్పారు. వాటిని మామూలుగా తొలగించడం సాధ్యం కాదనీ, ఎండోస్కోపీ సర్జరీ చేయాలని అన్నారు. ఇప్పుడు నా సందేహం ఏమిటంటే... వాటిని టాబ్లెట్ల సహాయంతో కరిగించడం వీలు కాదా? పైగా దాదాపు రూ. 25,000 ఖర్చవుతుందని కూడా చెప్పారు. నేను అంత ఖర్చు భరించలేను. కాబట్టి దయచేసి నా విషయంలో తగిన సలహా ఇవ్వగలరు. - కె. శివమ్మ, ఈ-మెయిల్ కిడ్నీ స్టోన్స్‌గా వ్యవహరించే ఈ రాళ్లను రీనల్ కాల్యుకులీ అంటారు. ఈ కండిషన్‌ను నెఫ్రోలిథియాసిస్ అని చెబుతారు. మీ కిడ్నీలో 5.4 మి.మీ. పరిమాణంలోని రాళ్లు సాధారణంగా ఆపరేషన్ అవసరం లేకుండానే మందులతో కరిగిపోతాయి. పేషెంట్ విపరీతమైన నొప్పితో బాధపడుతున్నప్పుడు, మూత్రపిండాల వ్యవస్థ విఫలమైనప్పుడు, కిడ్నీలు ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేర్కొన్న సందర్భాల్లోనూ పేషెంట్ కండిషన్ బట్టి ముందుగా మందులతో చికిత్స చేసి, నెలరోజుల పాటు రాయి ఉన్న పరిస్థితిని పరిశీలిస్తారు. నెలరోజుల్లో కరిగి మూత్రంతో పాటు బయటకు వెళ్లనప్పుడు మాత్రమే ఆపరేషన్ అవసరమవుతుంది. మీరు ఆపరేషన్ కంటే ముందుగా కనీసం ఒక నెల రోజుల పాటు మందులు వాడి చూడండి. వాటి ద్వారా మీ మూత్రపిండాల్లోని రాళ్లు యూరిన్ ద్వారా బయటకు వెళ్లే అవకాశం ఉంది. మీ రిపోర్టులతో ఒకసారి మీ దగ్గర్లోని నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 48 ఏళ్లు. నేను తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్నాను. దాన్ని తట్టుకోలేక నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) వాడుతున్నాను. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? - హరిబాబు, నెల్లూరు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడినట్లయితే కిడ్నీ దెబ్బతినే అవకాశం లేకపోలేదు. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నేరుగా మెడికల్ షాప్ నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకొని వాడడం మంచిది కాదు. కొన్ని పెయిన్ కిల్లర్స్‌లో రెండు లేదా మూడు రకాల మందులు కలిపి ఉంటాయి. ఇవి కిడ్నీకి హాని చేస్తాయి. ఫిజియోథెరపీ వంటి ఇతర పద్ధతులతో నొప్పి తగ్గించుకోడానికి ప్రయత్నించండి. నీళ్లు ఎక్కువగా తాగండి. మీ భుజం నొప్పి తగ్గడం కోసం ఒకసారి మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించండి. మీ అంతట మీరే మందులు వాడకండి. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ -
హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి?
హోమియో కౌన్సెలింగ్ నాకు చలికాలం రాగానే ముక్కులో దురదగా ఉండటం, తుమ్ములు చాలాసేపు రావడం, తుమ్ములు ఆగిన వెంటనే కాసేపు ముక్కు నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను కలిస్తే అలర్జిక్ రైనైటిస్ అన్నారు. అంటే ఏమిటి? హోమియోలో దీనికి వైద్యం ఉందా? - వెంకటేశ్, నిర్మల్ చలికాలం అనగానే గుర్తుకు వచ్చేవి అలర్జీ సమస్యలు. ముఖ్యంగా అలర్జిక్ రైనైటిస్ ఎక్కువగా బాధిస్తుంది. ప్రతి ఏడాదీ చలికాలం అనగానే చాలా మంది తమ ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకుంటారు. చల్లటినీరు, శీతల పానియాలు తాగకుండా ఉన్నప్పటికీ, ఇతర జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అలర్జిక్ రైనైటిస్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురవుతారు. అలర్జిక్ రైనైటిస్ అంటే: ఇది ఒక వ్యక్తి అలర్జిక్ కారకాలకు గురైనప్పుడు ముక్కలోని శ్లేష్మపొర వాపునకు గురై ముక్కు నుంచి నీరు లాంటి ద్రవం కారడం, తుమ్ములు, ముక్కు దిబ్బడ, కళ్లలోనూ అంగిలిలో దురద, చికాకు, నిద్రలేమి, మగతగా ఉండటం, స్వల్పజ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు కనిపిస్తాయి. కారణాలు: వాతావరణ మార్పు, ముఖ్యంగా శీతకాలం, దుమ్ము, ధూళియ ఘాటైన వాసనలు, మస్కిటో రెపెలెంట్స్, పెంపుడు జంతువులు - వాటి వెంట్రుకలు, విసర్జకాలు, పూలమొక్కల నుంచి వచ్చే పుప్పొడి, శీతల పానియాలు, ఐస్‌క్రీముల వంటివి అలర్జిక్ రైనైటిస్‌కు కారణమవుతాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్ఆర్, అబ్సల్యూట్ ఇసినోఫిల్ కౌంట్, ఐజీఈ యాంటీబాడీస్ పరీక్షల వంటి వాటితో వ్యాధి నిర్ధారణ చేస్తారు. వ్యాధి తీవ్రతనూ అంచనా వేస్తారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు : దుమ్ము, ధూళి నుంచి దూరంగా ఉండాలి కూల్‌డ్రింక్స్, పడని వస్తువులకు, ఘాటైన వాసనలుకు దూరంగా ఉండాలి ఇంటి పరిసరాల్లో ఉండే పార్థీనియం మొక్కలను తొలగించి, పుప్పొడినుంచి దూరంగా ఉండాలి. హోమియోలో చికిత్స: హోమియోలో అలర్జిక్ రైనైటిస్‌ను తగ్గించడానికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. అధునాతన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ప్రక్రియ ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుతారు. తమకు సరిపడని ఆహారాలు తీసుకున్నా, వాతావరణంలోకి వెళ్లినా తట్టుకునేలా వ్యక్తులను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుతారు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. నా భార్య వయసు 30 ఏళ్లు. గత ఐదేళ్లుగా వేచిచూస్తున్నా సంతానం లేదు. ఇద్దరమూ డాక్టర్‌ను కలిసి కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నాం. సంతాన సాఫల్యం కోసం వారు సూచించిన మందులు తీసుకుంటున్నాం. నా ఫ్రెండ్స్‌లో ఒకరికి ఐసీఎస్ఐ ప్రక్రియ ద్వారా సంతాన సాఫల్యం పొందినట్లు తెలుసుకున్నాను. మేము గతంలో ఐవీఎఫ్ గురించి విని ఉన్నాం. కానీ ఐసీఎస్ఐ అంటే ఏమిటో తెలియదు. మేము కూడా ఐసీఎస్ఐ ప్రక్రియను అవలంబించవచ్చా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. - శ్రీనివాస్, ఏలూరు మీరు ఏ వైద్య పరీక్షలు చేయించుకున్నారు, వాటి ఫలితాలు ఏమిటన్నది ముందుగా తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాతే మీ ఇద్దరి పరిస్థితిని అంచనా వేసి, దానికి అనుగుణంగా, మీరు ఏ ప్రక్రియను అనుసరిస్తే మంచిదో చెప్పగలం. ఇక మీరు అడిగిన విషయానికి వస్తే... ఇంట్రా సైటోప్లాజ్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అనే ప్రక్రియను సంక్షిప్తంగా ‘ఐసీఎస్ఐ’ అంటారు. ఈ ప్రక్రియలో భార్యకు కొన్నాళ్ల పాటు రోజూ హార్మోన్ ఇంజెక్షన్లు చేయాల్సి ఉంటుంది. ఆమెలోని గర్భసంచి పొర, అండాలు సైజ్ బాగా పెరిగాక వెంటనే... ఆమె నుంచి అండాలను సేకరించే ప్రక్రియను ప్రారంభిస్తాం. దీన్ని ఆమెకు సాధారణ అనస్థీషియా ఇచ్చి చేస్తాం. ఇందుకోసం ఆమె కొన్ని గంటల పాటు హాస్పిటల్లో ఉండాలి. అండాలను సేకరించాక వాటి సంఖ్య, నాణ్యత తెలుస్తాయి. ఆ తర్వాత భర్త నుంచి వీర్య సేకరణతో పాటు దీని నాణ్యత నిర్ధారణ కూడా జరుగుతుంది. ఆ తర్వాత వీర్య కణాన్ని అండంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఫలితంగా అండం కాస్తా పిండంగా మారుతుంది. ఇది జరిగిన మూడో రోజున గానీ లేదా ఐదో రోజున గానీ ఆ పిండాన్ని గర్భసంచి (యుటెరస్) లో అమరుస్తాం. సాధారణంగా వీర్యంలో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్న పురుషులకూ, ఐవీఎఫ్ ప్రక్రియ విఫలమవుతున్న వారికి ఐసీఎస్ఐ ప్రక్రియ ఉపయోగంగా ఉంటుంది. అండాన్ని రూపొందించాక ఇక మిగతా ప్రక్రియ ఐవీఎఫ్ లాగే ఉంటుంది. అయితే ల్యాబ్‌లో నిర్వహించే కొన్ని ప్రక్రియలు కాస్త వేరుగా ఉంటాయి. ఐవీఎఫ్ అనే ప్రక్రియ అండం ప్రయాణం చేసే ట్యూబ్లలో లోపాలు ఉన్నవారికి, ఎండోమెట్రియాసిస్ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి, సంతాన సాఫల్యంలో నిర్దిష్టంగా తెలియని ఇబ్బందులు ఉన్నవారికి, అండాల సంఖ్య తక్కువగా ఉన్నవారికి, ప్రీ ఇప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ చేయించుకున్న వారికి ఐవీఎఫ్‌ను సూచిస్తాం. ఇక మీ విషయంలో మీ ఇద్దరినీ ఒకసారి పరీక్షించి, మీ రిపోర్టులను చూసి, మీకు అనువైన పద్ధతేమిటో నిర్ణయించవచ్చు. డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్ రోడ్ నెం. 1, బంజారాహిల్స్ హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ మా వారి వయసు 50 ఏళ్లు. మాకు ఇద్దరు పిల్లలు. ఆయన పదేళ్లుగా గుండె సమస్యతో బాధపడుతున్నారు. బైపాస్ సర్జరీ, రీ-డూ సర్జరీ కూడా చేయించాం. కానీ ఫలితం లేదు. హార్ట్ ఫెయిల్యూర్ అన్నారు. మందులు వాడుతున్నారు. రెండుళ్లుగా నరకయాతన పడుతున్నారు. ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ ఒక్కటే పరిష్కారం అని చెప్పారు. మాకు ఆందోళనగా ఉంది. ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్’ అంటే ఏమిటి? దయచేసి దానికి సంబంధించిన అన్ని విషయాలను వివరంగా చెప్పండి. - సుధారాణి, కాకినాడ గుండెపనితీరు పూర్తిగా పడిపోయిన వారికి మాత్రమే గుండె మార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. సాధారణంగా 65 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి, శరీరంలోని మిగతా అన్ని అవయవాల పనితీరు నార్మల్‌గా ఉండటంతో పాటు ఎలాంటి ఇన్ఫెక్షన్లూ, యాంటీబాడీస్ లేకుండా ఉంటేనే గుండెమార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. మీరు చెప్పిన వివరాలను బట్టి మీ వారికి గుండె నుంచి రక్తం పంప్ అయ్యే సామర్థ్యం 20 శాతం లేదా పది శాతానికి పడిపోయినట్లు అనిపిస్తోంది. ఈ పరిస్థితినే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఇలాంటి వారికి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు వెంటనే మీ వారి పూర్తి వివరాలను ప్రభుత్వ సంస్థ అయిన ‘జీవన్‌దాన్’కు అందించి, అందులో మీ వారి పేరు నమోదు చేయించండి. అవయవదానం చేశాక చనిపోయిన వారు లేదా బ్రెయిన్‌డెడ్‌కు గురైన వారి బంధువులు అవయవదానానికి ముందుకు వచ్చిన సందర్భాల్లో ‘జీవన్‌దాన్’ ప్రతినిధులు పూర్తిగా ప్రాధాన్యక్రమంలో గుండెను ప్రదానం చేస్తారు. అలాంటి వారి నుంచి మీవారికి తగిన గుండె లభ్యం కాగానే, మీకు సమాచారం అందజేస్తారు. వారి నుంచి గుండె సేకరించిన (హార్ట్ హార్వెస్టింగ్ జరిగిన) నాలుగు గంటల లోపే ఆ గుండెను రోగికి అమర్చాల్సి ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు మీకు ఎంత త్వరగా గుండె లభ్యమైతే, ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. గుండె మార్పిడి తర్వాత రోగులు అది చక్కగా పనిచేసే మందులతో పాటు ఇమ్యునోసప్రెస్సెంట్స్ అనే ఔషధాలను వాడాల్సి ఉంటుంది. గుండె మార్పిడి ఆపరేషన్లలో చాలావరకు విజయవంతమవుతున్నాయి. ఇలాంటి శస్త్రచికిత్స చేసిన వారు గతంలో కంటే ఎక్కువ కాలమే జీవిస్తున్నారు. కాబట్టి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ పి.వి. నరేశ్‌కుమార్, సీనియర్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ అండ్ మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియో థొరాసిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
నియమాలు పెడితే నిరోధక శక్తి తగ్గుతుంది
హోమియో కౌన్సెలింగ్ టైప్-1 డయాబెటిస్ అంటే ఏమిటి? మా పిల్లవాడికి టైప్-1 డయాబెటిస్ అన్నారు. దీని గురించి వివరించి, మావాడు పాటించాల్సిన ఆహార నియమాలు వివరించండి. - నాగార్జున, నల్గొండ పిల్లల్లో సాధారణంగా 15 ఏళ్ల లోపు వారిలో వచ్చే చక్కెరవ్యాధిని టైప్-1 డయాబెటిస్ (మధుమేహం) అంటారు. టైప్-1 డయాబెటిస్ అంటే ఇందులో క్లోమగ్రంథి అస్సలు పనిచేయదు. అంటే క్లోమగ్రంథి తయారు చేయాల్సిన ఇన్సులిన్ శరీరంలో అస్సలు ఉండదన్నమాట. కాబట్టి వీరికి ఇన్సులిన్ మాత్రలతో ఆరంభించి, కొంతకాలానికి ఇంజెక్షన్‌కు మారుస్తుంటారు. సి-పెప్టైడ్ అనే ప్రోటీన్ మోతాదు 0.3 నానోగ్రాము ఉంటే క్లోమగ్రంథి సక్రమంగా పనిచేస్తున్నట్టు లెక్క. అంతకన్నా తక్కువ ఉంటే క్లోమగ్రంథి పనిచేయక, టైప్-1 డయాబెటిస్ ఉన్నట్టు నిర్ధారణ చేయవచ్చు. కొందరిలో ఈ కొలత సాధారణంగా ఉంటూ కూడా మధుమేహం వస్తుంది. అంటే ఇన్సులిన్ బాగానే ఉంది కానీ మధుమేహం వచ్చింది కాబట్టి ఇది టైప్-2 డయాబెటిస్ అని చెప్పవచ్చు. కాబట్టి పిల్లల్లో మధుమేహం ఉంటే నేరుగా ఇన్సులిన్ ఇవ్వకుండా సి-పెప్టైడ్ ఏ స్థాయిలో ఉందో చూసుకొని వైద్యం చేయాల్సి ఉంటుంది. చిన్నపిల్లల్లో మధుమేహం ఉంటే పాటించాల్సిన ఆహార నియమాలు: పిల్లల్లో ఎలాంటి ఆహార నియమాలు తగవు. 15-25 మధ్య వయసువారు లావుగా ఉంటేనే బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే జంక్‌ఫుడ్ తగ్గించుకోవాలి. ఇన్సులిన్ నిరోధకత రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ను పెంచుతుంది కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే ఆహారంలో పిండిపదార్థాలు తగ్గించుకోవాలి 5 - 15 ఏళ్ల పిల్లల ఎదుగుదల కోసం వాళ్ల బరువుకు తగినట్లు ఎన్ని క్యాలరీలు అవసరమవుతాయో డైటీషియన్‌ను సంప్రదించి వారు చెప్పినట్లు పాటించాలి. త్వరగా జీర్ణమయ్యే పిండి పదార్థాలను వాడాలి. ఆహారం విషయంలో ఆంక్షలు విధించడం, ఆహారాన్ని తగ్గించి, వ్యాయామాలను పెంచడం చేస్తే అసలే పిల్లల్లో తక్కువగా ఉండే రోగనిరోధకశక్తి మరింత తగ్గుతుంది. దీనికితోడు క్షయవ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఎలాంటి లక్షణాలతో టైప్-1ను గుర్తించవచ్చు? టైప్-1 డయాబెటిస్ హఠాత్తుగా వస్తుంది. రక్తంలో గ్లూకోజు ఆర్నెల్ల నుంచి పన్నెండు నెలల్లోపు 100 - 500 పెరగవచ్చు అతిమూత్రం, ఆకలి, దాహం వేయడం, మూత్రవిసర్జనకు ఎక్కువసార్లు వెళ్తుడడం జరుగుతుంది. రోగనిరోధకశక్తి తగ్గడంతో తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు ఎదుగుదల తగ్గుతుంది. హోమియో వైద్యవిధానంలో చికిత్స: హోమియోలో టైప్-1కు అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది. ఇన్సులిన్‌తోపాటు హోమియో మందులు ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. డాక్టర్ టి. కిరణ్ కుమార్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు ఆరు నెలలు. తల మీద విపరీతమైన ర్యాష్‌తో పాటు ఇన్ఫెక్షన్ వచ్చింది. మా పిల్లల వైద్యులు ఇచ్చిన చికిత్సతో తగ్గిందిగానీ, కొన్నాళ్లకు మళ్లీ వచ్చింది. ఇక పాపకు తలలోని కొన్నిప్రాంతాల్లో జుట్టు సరిగా రావడం లేదు. మా పాప సమస్యకు పరిష్కారం చెప్పండి. ఇది భవిష్యత్తులో రాబోయే సమస్యలకు ఏదైనా సూచికనా? - శ్రీకాంత్, అనంతపురం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు మాడు (స్కాల్ప్) భాగంలో చర్మం మీద ర్యాష్ వచ్చినట్లుగా, కొద్దిగా సూపర్ యాడ్ ఇన్ఫెక్షన్ కూడా అయినట్లుగా అనిపిస్తోంది. ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. ఇది కాస్త దీర్ఘకాలికంగా కనిపించే సమస్యగా చెప్పవచ్చు. దీన్ని ప్రధానంగా నెలల పిల్లల్లో, యుక్తవయసుకు వచ్చిన పిల్లల్లో కూడా చూస్తుంటాం. ఈ సమస్య ఉన్న పిల్లలకు మాడు (స్కాల్ప్)పైన పొరల్లా ఊడటం, అలాగే కొన్నిసార్లు తలంతా అంటుకుపోయినట్లుగా ఉండటం, కొన్ని సందర్భాల్లో మాడుపై పొర ఊడుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఇది రావడానికి ఇదమిత్థంగా కారణం చెప్పలేకపోయినప్పటికీ... కొన్నిసార్లు ఎమ్.పర్ఫూరా అనే క్రిమి కారణం కావచ్చని కొంతవరకు చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల్లో... అందునా ముఖ్యంగా నెల నుంచి ఏడాది వయసు ఉండే పిల్లల్లో ఈ సమస్యను మరీ ఎక్కువగా చూస్తుంటాం. కొన్నిసార్లు ఈ ర్యాష్ ముఖం మీదకు, మెడ వెనక భాగానికి, చెవుల వరకు వ్యాపిస్తూ ఉండవచ్చు. ఇది వచ్చిన పిల్లల్లో పై లక్షణాలతో పాటు కొందరిలో నీళ్ల విరేచనాలు (డయేరియా) లేదా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తుంటే దాన్ని ఇమ్యూనో డెఫిషియెన్సీ డిసీజ్‌కు సూచికగా చెప్పవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతర కండిషన్స్... అంటే అటోపిక్ డర్మటైటిస్, సోరియాసిస్ వంటి స్కిన్ డిజార్డర్స్ కూడా ఇదేవిధంగా కనిపించవచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే ఈ సమస్య ఉన్నవారికి యాంటీసెబోరిక్ (సెలీనియం, సెల్సిలిక్ యాసిడ్, టార్) షాంపూలతో క్రమం తప్పకుండా తలస్నానం చేయిస్తుండటం, తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ తలకు పట్టించడం, ఇమ్యూనోమాడ్యులేటర్స్ వంటి మందుల వల్లా తప్పనిసరిగా నయమవుతుంది. అలాగే ఈ సమస్య ఉన్న భాగాన్ని తడిబట్టతో తరచూ అద్దుతూ ఉండటం చాలా ముఖ్యం.ఇదేమీ భవిష్యత్తు వ్యాధులకు సూచిక కాదు. మీరు ఒకసారి మీ పిల్లల డాక్టర్‌ను లేదా డర్మటాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. ఈ సమస్య తప్పక తగ్గిపోతుంది. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్ విజయనగర్ కాలనీ హైదరాబాద్ ఫిజియోథెరపీ కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 60 సంవత్సరాలు. ఆమె మోకాలి చిప్పలు అరిగిపోవడం వల్ల ఇటీవల మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్ చేశారు. బాగా ఫిజియోథెరపీ చేస్తే తొందరగా కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు. ఇంటి దగ్గరే ఉండి ఫిజియోథెరపీ ఎలా చేసుకోవాలో తెలియజేయగలరు. - ఎం.వి.ఎస్. ఫణికుమార్, హైదరాబాద్ ఆపరేషన్ తర్వాత డిశ్చార్జ్ అయ్యేముందు వైద్యులు కొన్ని వ్యాయామాల గురించి చెబుతారు. స్టాటిక్ క్వాడ్రిసెస్ట్: వెల్లకిలా పడుకుని కాళ్లు చాపుకుని కూర్చుని మోకాలిని గట్టిగా కిందికి వంచి ఐదు లేదా పది సెకన్లపాటు ఉంచాలి. తిన్నగా కాళ్లు పైకి లేపటం: వెల్లకిలా పడుకుని తొడ కండరాలను బిగించి మోకాళ్లను తిన్నగా పైకి ఎత్తి 5 నుంచి పది సెకన్లపాటు ఉంచి నెమ్మదిగా కిందికి దించాలి. చీలమండల వ్యాయామం: పాదాన్ని పైకి, కిందికి పిక్క కండరాలను బిగిస్తూ ఆడించాలి. ఈ వ్యాయామాన్ని చీలమండలం, పాదం, కాళ్ల వాపు తగ్గేవరకు చేయాలి. మోకాలు తిన్నగా చేసే వ్యాయామం: మోకాలి కింద చిన్న తువ్వాలును మడిచిపెట్టి తొడ కండరాన్ని బిగించి కాలిని తిన్నగా పైకిలేపాలి. మోకాలిని మంచం మీద జార్చటం: మోకాలిని వంచి మడమతో మంచం మీద జార్చాలి, ఎంత వరకు ముడవగలరో అంత మడిచి, ఆ పొజిషన్లో 5 నుంచి పది నిమిషాలు ఉంచి మరల కాలిని కిందికి జార్చాలి. కూర్చొని ఆసరాతో మోకాలు వంచటం: మంచం కింద గాని కుర్చీలోగాని కూర్చొని ఆపరేషన్ అయిన కాలి మడమ కింద రెండవకాలు మడమను పెట్టి నెమ్మదిగా కాలిని పైకి ఎత్తాలి. ఇలా కాలిని తిన్నగా ఎత్తిన తర్వాత 5 నుంచి 10 సెకన్లు ఉంచాలి. కూర్చొని మోకాలిని వంచటం: ఆపరేషన్ అయిన తర్వాత గదిలో నడవడం, చిన్న చిన్న రోజువారీ పనులు మొదలు పెట్టాలి. దీనివల్ల కాళ్ల కీళ్లకు రక్తప్రసరణ జరిగి కదలికలు మెరుగుపడతాయి. నడవడం: మోకాలు త్వరగా నయం అవడంలో దోహదపడే అంశం సరైన పద్ధతిలో నడవడం. మొదట మీరు మీ డాక్టర్ లేదా ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో వాకార్ లేదా క్రచ్చెస్ సాయంతో ఏ కాలుపై ఎంత బరువు పెట్టాలో, ఎలా నిలబడాలో తెలుసుకోవాలి. డాక్టర్ ఆర్. వినయ కుమార్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫిజియోథెరపీ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్, హైదరాబాద్. -
బీపీ, షుగర్ ఉన్నా... బైపాస్ సర్జరీ చేయవచ్చు
హోమియో కౌన్సెలింగ్ మా పాపకు తొమ్మిదేళ్లు. వేసవిలో బాగానే ఉంటుంది కానీ, వర్షాకాలం, శీతాకాలాలలో విపరీతమైన జలుబు, ముక్కు దిబ్బెడ, తలనొప్పితో బాధపడుతుంటుంది. డాక్టర్‌కు చూపిస్తే సైనసైటిస్ అని చెప్పి, ఆపరేషన్ చేయాలన్నారు. హోమియోలో ఈ సమస్యకు పరిష్కారం ఉంటే చెప్పగలరు. - పుష్ప, హైదరాబాద్ ప్రతి ఒక్కరిలోనూ నుదురు, కళ్లకు కింది భాగంలో ముక్కుకు రెండువైపులా గాలితో నిండిన సంచుల్లాంటి నిర్మాణాలుంటాయి. వీటినే సైనస్ అంటారు. ఈ సైనస్‌లు మెత్తటి శ్లేష్మపు పొరతో కప్పి ఉంటాయి. ఈ పొర ఒక పలుచటి ద్రవపదార్థాన్ని నిరంతరం ఉత్పత్తి చేస్తుంటుంది. ఈ ద్రవపదార్థం ఎటువంటి ఆటంకాలు లేకుండా ముక్కు రంధ్రాల్లోకి చేరుకుంటుంది. కాని కొన్ని సందర్భాల్లో ఇది ప్రవహించే మార్గంలో అవరోధాలు ఏర్పడి, అది సైనసైటిస్‌కు దారి తీస్తుంది. దీంతో సైనస్ భాగాలలో నొప్పితో బాటు బరువెక్కినట్లుంటుంది. తరచు జలుబు, అలర్జీ, నాసల్ పాలిప్స్, ముక్కు రంధ్రల మధ్య గోడ పక్కకు మరలడం, సైనస్ ఎముకలు విరగడం, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా సైనసైటిస్ వస్తుంది. రకాలు: సైనసైటిస్ ముఖ్యంగా రెండురకాలు. 1. నాలుగు వారాలు లేదా అంతకంటే తక్కువ కాలవ్యవధిలో ఎక్కువగా ముక్కు నుంచి నీరు కారడం, నొప్పి ఉంటాయి. దీనినే అక్యూట్ సైనసైటిస్ అంటారు. 2. వ్యాధిలక్షణాలు 8 వారాలకంటే ఎక్కువ రోజులు ఉన్నట్లయితే దానిని క్రానిక్ సైనసైటిస్ అంటారు. లక్షణాలు: ముక్కు నుంచి నీరు కారడం, ముక్కు దిబ్బడ, వాసన తెలియకపోవడం, దగ్గు, జ్వరం, పంటినొప్పి, శ్వాసపీల్చుకోవడం ఇబ్బందిగా ఉండటం, నాసికా రంధ్రాలలో చీము పట్టడం, తల ముందుకి వంచినప్పుడు నొప్పిగా, బరువుగా ఉండటం, తలనొప్పి, చెవులు బరువెక్కడం, నీరసం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. నిర్థారణ: ఎక్స్‌రే, సీటిస్కాన్, ఎమ్మారై, నాసల్ ఎండోస్కోపీ, ఐజీఐ, అలర్జీ టెస్ట్, పి.ఎఫ్‌టి ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో సైనసైటిస్‌కు ప్రత్యేక రీతిలో, సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉంది. అధునాతనమైన కాన్స్టిట్యూషనల్ సిమిలిమం ద్వారా అసమతుల్యతకు గురైన రోగనిరోధక శక్తిని సరిచేసి, సైనసైటిస్‌ను సంపూర్ణంగా నివారిస్తారు. శరీరంలో రోగనిరోధకతను పెంపొందించి, తద్వారా అన్ని ప్రతికూల పరిస్థితులలో ఆరోగ్యవంతమైన జీవనం సాగించే విధంగా హోమియోకేర్ ఇంటర్నేషనల్ కచ్చితమైన వైద్యాన్ని అందిస్తుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ న్యూరో కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 62 ఏళ్లు. గత మూడు నెలలుగా తల నొప్పి, మాట్లాడటం కష్టం కావడం, కొద్దిగా వినికిడి లేకపోవడం, అప్పుడప్పుడూ వాంతులు వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాం. ఆయన ఎమ్మారై స్కానింగ్ తీయించి, మెదడులో ట్యూమర్స్ ఉన్నాయని అన్నారు. దీనికి చికిత్స వివరాలు తెలుపండి. - ఆర్. వెంకటేశ్వర్లు, చీరాల మెదడు కణజాలంలో అసాధారణ పెరుగుదల వల్ల బ్రెయిన్ ట్యూమర్లు ఏర్పడతాయి. ఇందులో ఒక రకం క్యాన్సర్ ట్యూమర్. ఇందులో మళ్లీ రెండు రకాలు ఉంటాయి. మొదటిది మెదడులోనే ఏర్పడుతుంది. రెండోరకం శరీరంలోని ఇతర భాగాల్లో మొదలై... మెదడుకు వ్యాపించి, అక్కడ ట్యూమర్‌గా ఏర్పడుతుంది. మెదడు ట్యూమర్ వల్ల తలనొప్పి, ఫిట్స్, కంటిచూపు, నడక, మాట, స్పర్శలో తేడారావడం, వాంతులు, మానసికమైన మార్పు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడు ట్యూమర్ల నిర్ధారణ చేయడానికి సీటీ స్కానింగ్, ఎమ్మారై వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి చికిత్స ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. అయితే కొన్ని రకాల ట్యూమర్లు నెమ్మదిగా పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అలాంటి వాటికి జీవితకాలంలోనే ఎలాంటి శస్త్రచికిత్సా అవసరం ఉండకపోవచ్చు. చికిత్స ఎంతవరకు సఫలం అవుతుందన్న విషయం మెదడులో ఆ ట్యూమర్ ఉండే ప్రదేశాన్ని బట్టి, ఎంత త్వరగా పెరుగుతుందన్న అంశం పైన ఆధారపడి ఉంటుంది. మెదడులోనే పుట్టే ప్రైమరీ ట్యూమర్ల కంటే ఇతర చోట పుట్టి, మెదడుకు వ్యాపించే సెకండరీ లేదా మెటస్టాటిక్ ట్యూమర్లు మరింత వేగంగా పెరుగుతాయి. పరిమాణంలో పెద్దవిగా ఉన్న ట్యూమర్లకు సర్జరీ తప్పనిసరి. ఇలాంటి సందర్భాల్లో ముఖ్యమైన అవయవాలకు వెళ్లే నాడులకు ట్యూమర్లు దగ్గరగా ఉంటే వాటిని పూర్తిగా తొలగించడానికి వీలుపడదు. అలాంటప్పుడు ట్యూమర్‌ను కొంతమేరకు తీసివేసి, మిగిలిన దాన్ని స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ద్వారా చికిత్స చేయవచ్చు. న్యూరో సర్జరీ విభాగంలో ఎస్.ఆర్.ఎస్. అనే చికిత్స ప్రక్రియ భవిష్యత్తులో మరింత చిన్న చిన్న ట్యూమర్లకూ మరింత సమర్థంగా అందించే దిశగా ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పవచ్చు. డాక్టర్ టి.వి.ఆర్.కె. మూర్తి సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ కార్డియో కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 54 ఏళ్లు. ఏడాది క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పుడు యాంజియోప్లాస్టీ చేసి, ఒక స్టెంట్ వేశారు. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు నడుస్తున్నప్పుడు ఆయాసపడుతున్నారు. డాక్టర్ దగ్గరకు తీసుకెళితే పరీక్షలు చేసి, బైపాస్ చేయాలంటున్నారు. మా నాన్నగారికి బీపీతో పాటు షుగర్ కూడా ఉంది. ఈ వయసులో ఆయన సర్జరీని తట్టుకోగలరా? దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. - ఏ. సుబ్బారాయుడు, రాజమండ్రి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు (బ్లాక్స్) ఏర్పడితేనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. రెండు లేదా మూడు అడ్డంకులు ఉంటే యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేస్తారు. మీ నాన్నగారికి గుండె రక్తనాళాల్లో ఎక్కువగా బ్లాక్స్ ఏర్పడి ఉండవచ్చు. అందుకే డాక్టర్ బైపాస్ సర్జరీని సూచించి ఉంటారు. ఒకప్పుడు గుండె ఆపరేషన్లు అంటే ప్రజలు చాలా భయపడేవారు. కానీ ఇప్పుడు వైద్యరంగంలో అనేక మార్పులు, అత్యాధునిక వైద్య ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుండె ఆపరేషన్లు చాలా సురక్షితంగా చేయగలగుతున్నారు. అందులో భాగంగానే అతి చిన్న కోతతో ‘మినిమల్లీ ఇన్వేజివ్ బైపాస్ సర్జరీ’ అనే అధునాతన పద్ధతి కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా ఛాతీ ఎముకలు కట్ చేయకుండానే కొన్ని ప్రత్యేకమైన పరికరాలతో శస్త్రచికిత్స సులువుగానే నిర్వహించవచ్చు. ఈ ఆపరేషన్ ద్వారా కోత తక్కువగా ఉండటం వల్ల నొప్పి కూడా తక్కువగానే ఉంటుంది. ఈ విధానంలో తక్కువ రక్తస్రావం జరుగుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం కూడా చాలా తక్కువ. శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ 3 - 4 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. ముఖ్యంగా ఈ చికిత్సా విధానం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అలాగే 50 పైబడిన వారికి కూడా ఈ శస్త్రచికిత్స విధానం అత్యంత సురక్షితం. బీపీ, షుగర్ ఉన్నవారికి కూడా నిపుణుల ప్రత్యేక పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహిస్తారు. ఎటువంటి ఆందోళన అవసరం లేదు. డాక్టర్ సుఖేష్ కుమార్ రెడ్డి సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ యశోద హాస్పిల్స్ సోమాజిగూడ హైదరాబాద్ -
ఒంటికి పని చెప్తే కంటి నిండా నిద్ర!
హోమియో కౌన్సెలింగ్ డయాబెటిస్ వ్యాధి హోమియో విధానంలో తగ్గుతుందా? - రవిచంద్ర, చీరాల డయాబెటిస్ రక్తంలో చక్కెరపాళ్లు అధికం కావడం వల్ల వచ్చే వ్యాధి. ఇందులో మూత్రం ఎక్కువగా రావడం, ఆకలి, దాహం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇందులోని కొన్ని ముఖ్యమైన రకాలుంటాయి. శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడాన్ని టైప్-1 అనీ, ఉత్పత్తి చేసిన ఇన్సులిన్‌ను కణాలు సక్రమంగా వినియోగించలేకపోవడాన్ని టైప్-2 అనీ, గర్భధారణ సమయంలో వచ్చే డయాబెటిస్‌ను జెస్టెషనల్ డయాబెటిస్ అని అంటారు. టైప్-1 డయాబెటిస్: ఈ రకం వ్యాధి ఉన్న వారిలో క్లోమగ్రంథిలో ఉండే బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం వల శరీరంలో చక్కెరపాళ్లు పెరుగుతూ ఉంటాయి. వీళ్లలో రోగనిరోధక వ్యవస్థను రక్షించే టీ-సెల్స్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. కానీ పుట్టినప్పుడు వాళ్లు నార్మల్‌గానే ఉండవచ్చు. రానురానూ గ్లూకోజ్ పాళ్లు పెరగడంతో పిల్లలు బలహీనపడతారు. దీన్నే ‘జువెనైల్ డయాబెటిస్’ అని కూడా అంటారు. టైప్-2 డయాబెటిస్: ఇది ఎక్కువగా నడివయసు వారిలో కనిపిస్తుంటుంది. తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి ఉన్నప్పుడు పిల్లల్లోనూ ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగినప్పుడు రక్తంలో చక్కెరపాళ్లు అధికమై బయటపడవచ్చు. జెస్టెషనల్ డయాబెటిస్: గర్భధారణ సమయంలో వచ్చిన డయాబెటిస్ చాలామందిలో ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. అయితే అది మళ్లీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్తో వచ్చే దుష్ర్పభావాలు చాలా ఎక్కువే. దీనివల్ల రక్తనాళాలు దెబ్బతినడం, గుండె సంబంధిత వ్యాధులు రావడం, కంటిలోని సున్నితమైన రక్తనాళాలు దెబ్బతిని (డయాబెటిస్ రెటినోపతి), చూపు కోల్పోవడం కూడా జరగవచ్చు. కిడ్నీలపై (డయాబెటిస్ నెఫ్రోపతి) దుష్ర్పభావం పడటం, నరాలు దెబ్బతినడం వల్ల వేళ్ల చివర్లకు చీమలు పాకినట్లు ఉండటం, స్పర్శ తగ్గడం, అరికాళ్ల నొప్పుల వంటి సమస్యలు రావచ్చు. హోమియోలో డయాబెటిస్‌కు మంచి మందులు ఉన్నాయి. తీపిని ఇష్టపడేవారు, ఆధ్యాత్మికత ఉన్నవారికి సల్ఫర్, స్థూలకాయం ఉండి, త్వరగా కన్నీళ్లు వచ్చేవారికి కాల్కేరియా కార్బ్, తేలిగ్గా ఉద్వేగాలకు గురై, త్వరగా కోపం వచ్చేవారు, ఘాటైన మసాలా ఆహారాలను ఇష్టపడేవారికి నక్స్ వామికా వంటి ఎన్నో మంచి మందులు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. - డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్,పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఉద్యోగరీత్యా ఒత్తిళ్ల వల్ల తలనొప్పి వస్తోందని అనుకున్నాను. ఇటీవల మరిన్నిసార్లు రావడంతో డాక్టర్‌ను కలిశాను. ఆయన మైగ్రేన్‌గా గుర్తించారు. దయచేసి నాకు తగిన పరిష్కారం చూపించండి. - సుహాస్, హైదరాబాద్ అనేక రకాల తలనొప్పుల్లో మైగ్రేన్ ఒకటి. ఇది 15 శాతం మంది యువతుల్లో, 6 శాతం మంది యువకుల్లో కనిపిస్తుంది. కొందరిలో ఇది తలకు ఒకవైపునే కనిపిస్తే, మరికొందరిలో తల మొత్తంలో నొప్పి వస్తుంటుంది. కడుపులో తిప్పడం, వాంతి కావడం, శబ్దాలను - కాంతిని భరించలేకపోవడం వంటి లక్షణాలు ఈ తలనొప్పుల్లో కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మైగ్రేన్ జన్యుపరంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశాలు చాలా ఉంటాయి. వాటిని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. అవి... నిద్ర సరిగా లేకపోవడం, ఎండలో తిరగడం, చాక్లెట్లు, ఐస్‌క్రీములు ఎక్కువగా తీసుకోవడం వంటివి నొప్పిని తక్షణం మొదలయ్యేలా చేసే ట్రిగరింగ్ ఫ్యాక్టర్లలో కొన్ని. మనలో ఏ అంశం నొప్పిని ప్రేరేపిస్తోందో కనుగొంటే... చాలావరకు మైగ్రేన్‌ను నివారించవచ్చు. దాంతోపాటు సరైన పోషకాహారం తీసుకోవడం, మంచి ఆహార అలవాట్లు పాటించండం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కెఫిన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం వంటివి మైగ్రేన్‌ను నివారించే కొన్ని అంశాలు. మైగ్రేన్ చికిత్సలో రెండు రకాల మందులు ఉపయోగిస్తారు. మొదటివి... తలనొప్పి వచ్చినప్పుడు తక్షణం నొప్పి నుంచి ఉపశమనం కలిగించే మందులు. వీటిని నోటి ద్వారా ఇస్తారు. ఒకవేళ రోగికి వాంతులు అవుతుంటే ముక్కు ద్వారాగానీ లేదా ఇంజెక్షన్ ద్వారా గానీ ఈ తరహా మందులు ఇవ్వవచ్చు. ఇక రెండో రకమైనవి... మున్ముందు నొప్పి రాకుండా ఉండటం కోసం దీర్ఘకాలం వాడాల్సిన మందులు. మీరు డాక్టర్‌ను సంప్రదించి మైగ్రేన్ పునరావృతం కాకుండా కోసం వాడాల్సిన దీర్ఘకాలిక మందులను వాడితే ఇది తిరగబెట్టే అవకాశాలు తక్కువ. డాక్టర్ నీలేశ్ విజయ్ చౌధురీ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. లైఫ్‌స్టయిల్ కౌన్సెలింగ్ నేను కూర్చొని చేసే వృత్తిలో ఉన్నాను. రాత్రిపూట సరిగా నిద్రపట్టడం లేదు. ఒళ్లు అలిసేలా వ్యాయామం చేయమనీ, దాంతో బాగా నిద్రపడుతుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. వ్యాయామం చేసేవాళ్లకు అంతగా నిద్రపట్టదని మరికొందరు చెబుతున్నారు. నాకు వాస్తవాలు వివరించండి. - ధన్‌రాజ్, నకిరేకల్ మీరు చెప్పిన రెండు అంశాలూ నిజమే. నిద్రకు ఉపక్రమించబోయే మూడు గంటల ముందుగా వ్యాయామం అంత సరికాదు. అలా చేస్తే నిద్రపట్టడం కష్టమే. అయితే రోజూ ఉదయంగానీ లేదా ఎక్సర్‌సైజ్‌కూ, నిద్రకూ చాలా వ్యవధి ఉండేలా గానీ వ్యాయామం చేస్తే మంచి నిద్ర పడుతుంది. ఒళ్లు అలిసేలా వ్యాయామంతో ఒళ్లెరగని నిద్రపడుతుంది. ఉదయం చేసే వ్యాయామంతో ఒత్తిడి నుంచి దూరమవుతారు. అయితే ఉదయం వేళ చేసే వ్యాయామం పగటి వెలుగులో అయితే మరింత ప్రభావపూర్వకంగా ఉంటుంది. మీరు ఉదయం వేళలో వ్యాయామం చేయలేకపోతే అది సాయంత్రం వేళ అయితే మంచిది. మీ రోజువారీ పనుల వల్ల అప్పటికి మీ శరీర ఉష్ణోగ్రత కూడా కాస్త పెరిగి ఉంటుంది. ఇక నిద్రవేళకు మన శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గుతుంటంది. కానీ వ్యాయామంతో మళ్లీ శరీరాన్ని ఉత్తేజపరచడం జరుగుతుంది. ఇక కార్డియోవాస్క్యులార్ వ్యాయామాల వల్ల గుండె స్పందనల వేగం, రేటు పెరుగుతాయి. శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. వీటన్నింటి ఉమ్మడి ప్రభావాల వల్ల నిద్ర తగ్గుతుంది. అంతేకాదు... వ్యాయామం ముగిసిన 20 నిమిషాల తర్వాతగానీ గుండె కండరాల రక్తం పంపింగ్ ప్రక్రియ సాధారణ స్థితికి రాదు. అందుకే వ్యాయామానికీ, నిద్రకూ మధ్య వ్యవధి ఉండేలా చూసుకోవాలన్న మాట. ఇక స్ట్రెచింగ్ వ్యాయామాలు, బలాన్ని పెంచుకనే స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ తరహా వ్యాయామాలూ శరీరానికి మేలు చేసినా... అవేవీ కార్డియోవాస్క్యులార్ వ్యాయామాలకు సాటిరావు. యోగా ప్రధానంగా తనువునూ, మనసునూ రిలాక్స్ చేసే ప్రక్రియ. మీ ఫ్రెండ్స్‌లో కొందరు చెప్పినట్లుగా దీర్ఘకాలిక నిద్రలేమికి వ్యాయామం విరుగుడు. అందుకే మరీ తీవ్రంగా (విగరస్‌గా) కాకుండా... మరీ చేసీచెయ్యనట్లు (మైల్డ్)గా కాకుండా... మాడరేట్ ఎక్సర్సైజ్ చేయండి. కంటినిండా నిద్రపోండి. వాకింగ్, జాగింగ్, జంపింగ్, స్విమ్మింగ్, టెన్నిస్ ఆడటం, డాన్స్ చేయడం లాంటి ఏ ప్రక్రియ అయినా వ్యాయామానికి మంచిదే. అయితే మీకు గుండెజబ్బులూ, స్థూలకాయం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే వ్యాయామాలు మొదలుపెట్టే ముందు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, మీకు తగిన వ్యాయామాలు సూచించమని అడగడం మేలు. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ మా చిరునామా: వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com నిర్వహణ: యాసీన్ -
పులుపు తగ్గిస్తే కానీ అల్సర్ తగ్గదా?
హోమియో కౌన్సెలింగ్ మా అబ్బాయి స్వభావసిద్ధంగా చురుగ్గా ఉంటాడు. ఆ చురుకుదనం వల్ల ఆటల్లో పరుగెడుతున్నాడు. కానీ త్వరగా ఆయాసపడుతున్నాడు. అలా ఆయాసం వస్తే అది ఆస్తమానేనా? పిల్లల్లో ఆస్తమాను గుర్తుపట్టడానికి మార్గాలు చెప్పండి. - శ్రీరేఖ, పెంచికల్‌దిన్నె పిల్లల్లో ఆస్తమా వచ్చినప్పుడు వారు శ్వాసతీసుకోడానికి ఇబ్బంది పడుతుంటారు. ఆయాసపడుతుంటారు. పడుకున్నప్పుడు పిల్లికూతలు వస్తాయి. రాత్రివేళ దగ్గు కూడా వస్తుంటుంది. పిల్లల స్వభావసిద్ధత వల్ల చాలా చురుగ్గా పరుగెడుతుంటారు. ఇక మాట్లాడినప్పుడు కూడా మాట పూర్తికావడానికి తగినంత దమ్ము అందుతుండదు. ఇలా జరిగినప్పుడు దాన్ని ఆస్తమాగా గుర్తుపట్టడానికి వీలవుతుంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి. సీబీపీ, ఈఎస్ఆర్, అబ్సల్యూట్ ఇజినోఫిల్ కౌంట్, ఛాతీ ఎక్స్‌రే, సీటీ స్కాన్, స్పైరోమెట్రీ, పల్మునరీ ఫంక్షన్ పరీక్షలు మొదలైనవాటిని వ్యాధి నిర్ధారణ కోసం డాక్టర్లు చేయిస్తుంటారు. పైన పేర్కొన్న పరీక్షల ద్వారా ఆస్తమానా లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర వ్యాధి ఏమైనా ఉందా అని వారు నిర్ధారణ చేస్తుంటారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... దుమ్ము, ధూళి నుంచి దూరంగా ఉండాలి శీతలపానీయాలు, ఐస్‌క్రీములు తినకూడదు పెంపుడు జంతువుల నుంచి దూరంగా ఉండాలి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండే పార్థీనియం మొక్కలను తొలగించి, పుప్పొడికి దూరంగా ఉంచాలి కొన్ని జంతువుల విసర్జరకాల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి పెయింట్ వంటి ఘాటైన వాసనలు, వివిధ రకాల స్ప్రేలు, దోమల నివారణకు ఉపయోగించే ఘాటైన వాసనలు వెలువరించే మస్కిటో రిపల్లెంట్స్ వంటివి పిల్లలకు సరిపడటం లేదని గుర్తిస్తే వాటిని వాడకూడదు. చికిత్స: హోమియో విధానంలో అలర్జీలకు సంబంధించిన ఎలాంటి వ్యాధినైనా జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమిలియం ద్వారా నయం చేయవచ్చు. ఈ ప్రక్రియలో రోగనిరోధకశక్తిని పెంపొందించపజేసి, ఎలాంటి అలర్జిక్ ప్రతిచర్యనైనా శరీరం తట్టుకునేలా ఇమ్యూనిటీని పెంచే మందులు ఇస్తారు. ఇలా ఇమ్యూన్ సిస్టమ్‌ను బూస్ట్ చేయడం వల్ల ప్రతికూల పరిస్థితల్లోనూ పిల్లలు ఆరోగ్యంతో ఉండేలా చూడటం హోమియో విధానం ప్రత్యేకత. -డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ జనరల్ కౌన్సెలింగ్ నాకు కొన్ని పులుపు పదార్థాలంటే చాలా ఇష్టం. ఉదాహరణకు పులుసు కూరలు, చింతకాయ పచ్చడి, పండుమిరపకాయ పచ్చడి వంటివి ఇష్టంగా తింటాను. అవి తిన్న వెంటనే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంటుంది. చాలా మంది డాక్టర్లను కలిస్తే ఇది అల్సర్ వల్ల కావచ్చని అంటున్నారు. నేను ఎప్పటికీ నాకు ఇష్టమైన వాటిని తినలేనా? నాకు తగిన సలహా ఇవ్వండి. - ఉపేంద్రనాథ్, సిరిసిల్ల పుల్లటి పదార్థాలు తినడం అన్నది అసిడిటీని పెంచడం మాత్రమే కాదు... ఒకవేళ కడుపులో అల్సర్స్ ఉంటే అవి తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి. మీరు నోట్లో నుంచి ఓరల్ ఎండోస్కోపీ చేయించుకుంటే... మీకు అల్సర్ ఉన్నా లేదా ఇతరత్రా ఏమైనా సమస్యలు ఉన్నా తెలుస్తుంది. మీరు మీ లేఖలో మీకు సరిపడని పదార్థాలు తింటే ఈ విధమైన సమస్యలు వస్తున్నాయో, మీకు కలుగుతున్న ఇబ్బంది ఏమిటో నిర్దిష్టంగా చెప్పలేదు. మీరు ముందుగా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు మీకు ఎండోస్కోపీ చేశాక... అల్సర్స్ ఉన్నట్లు నిర్ధారణ అయితే... పాంటాప్రొజోల్ లేదా ఒమెప్రొజోల్ మందులను సూచిస్తారు. నా వయసు 45 ఏళ్లు. నాకు కొద్ది రోజులుగా కుడి డొక్కలో నొప్పి వస్తోంది. కాసేపటి తర్వాత దానంతట అదే తగ్గుతోంది. ఆ తర్వాత నాకు ఎలాంటి సమస్యా ఉండదు. చాలాకాలం నుంచి ఈ సమస్య ఉంది. కొందరు ఇది తీవ్రమైన సమస్య కావచ్చని అంటుండటంతో ఆందోళనగా ఉంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - టి. రవికుమార్, ఒంగోలు మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు గాల్‌బ్లాడర్‌లో రాయి ఉండే అవకాశం ఉంది. చాలా మందిలో ఈ సమస్య ఉన్నప్పుడు బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ కొంత మందిలో మధ్యమధ్యలో నొప్పి కలగడం ద్వారా ఆ సమస్య బయటపడుతుంది. మీరు అల్ట్రా సౌండ్ అబ్డామిన్ స్కాన్ చేయించుకోవాలి. సీరమ్ అమిలేజ్ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్షల్లో రాయి ఉన్నట్లు నిర్ధారణ అయితే మీరు సర్జన్‌ను సంప్రదించాలి. రాయి పరిమాణాన్ని బట్టి నిపుణులు తగిన శస్త్రచికిత్స మార్గాన్ని సూచిస్తారు. డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కన్సల్టెంట్-ఇంటర్నల్ మెడిసిన్ అండ్ డయాబెటిస్, సెంచరీ హాస్పిటల్, బంజారాహిల్స్, హైదరాబాద్ ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. గృహిణిని. పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. ఇంకా పిల్లలు లేరు. నేను మందులు వాడినప్పుడే నాకు రుతుక్రమం వస్తోంది. లేడీడాక్టర్ కొన్ని పరీక్షలు చేయించారు. నా ఎఫ్ఎస్హెచ్ పాళ్లు 50 ఇంటర్నేషనల్ యూనిట్స్/ఎమ్ఎల్ అన్నారు. దాంతో పాటు ఏఎమ్‌హెచ్ కూడా చాలా తక్కువగా ఉందని చెప్పారు. నా అండాశయ సామర్థ్యం (ఒవేరియన్ కెపాసిటీ) చాలా తక్కువగా ఉందన్నారు. నా భర్త శుక్రకణాల సంఖ్య నార్మల్‌గానే ఉంది. ఇప్పుడు మేము ఏం చేయాలి? - ధనలక్ష్మి, విశాఖపట్నం మీ కండిషన్‌ను ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. సాధారణంగా ఇది శాశ్వతమైన సమస్య. అయితే కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా గర్భం రావచ్చు కూడా. ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్‌కు కారణాలూ పెద్దగా తెలియదు. కొన్నిసార్లు క్రోమోజోముల్లోని లోపాలు, తమ వ్యాధి నిరోధక శక్తి తమనే దెబ్బతీసే ఆటో ఇమ్యూన్ సమస్యలు, గాలాక్టోసీమియా వంటివి కారణమవుతాయి. ఈ కండిషన్ ఉన్నవారి కుటుంబాలలో ఇది తరచూ కనిపిస్తుంటుంది. ఈ సమస్య ఉన్నవారికి ఆటోఇమ్యూన్ పరీక్షలూ, ఫ్రాజైల్ ఎక్స్ క్రోమోజోమ్ పరీక్షలూ, డెక్సాస్కాన్ వంటివి అవసరమవుతాయి. సాధారణంగా ఈ కండిషన్ ఉన్నవారిలో గర్భధారణ అవకాశాలు తక్కువ కాబట్టి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) చేయించుకోవాల్సిందిగా సూచిస్తాం. ఉన్న కొద్దిపాటి అండాలను సేకరించడం కష్టమైతే, అప్పుడు దాతల నుంచి సేకరించి, వాటితో మీ భర్త శుక్రకణాలతో ఫలదీకరణ చేయించి, పిండాన్ని రూపొందించి, దాన్ని మీ గర్భసంచిలోకి ప్రవేశపెడతాం. ఇలాంటి సమస్య ఉన్నవారు తమ సాధారణ ఆరోగ్యాన్నీ కాపాడుకోవాల్సి ఉంటుంది. మీరు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం (ఫిజికల్ ఫిట్నెస్) కోసం రోజూ వ్యాయామం చేయడం, క్యాల్షియమ్, విటమిన్-డి ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం అవసరం. మీకు ప్రిమెచ్యుర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ ఉన్నందుకు మీ డాక్టర్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని సూచిస్తారు. ఆ హార్మోన్లను సుమారు యాభై, యాభైయొక్కఒక్క ఏళ్లు వరకు వాడాల్సి ఉంటుంది. వేర్వేరు వైద్య విభాగాలకు చెందిన మల్టీడిసిప్లనరీ టీమ్‌తో మీరు సత్ఫలితాలను పొందవచ్చు. - డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ -
సంతాన సాఫల్య చికిత్సకు అతిగా స్పందిస్తే...
హోమియో కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 65. ఆయనకు చాలా సంవత్సరాలుగా ఆస్తమా ఉంది. చలికాలం వస్తే ఆయన బాధలు చెప్పనలవి కాదు. దీనికి హోమియోలో ఏమైనా చికిత్స ఉంటే చెప్పగలరు. - పి.శశాంక్, చీరాల వాతావరణంలో మార్పులు, దుమ్ము, ధూళి, ఘాటైన వాసనలు, పెంపుడు జంతువులు, వాటి వెంట్రుకలు, విసర్జకాలు, పూలమొక్కల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు, మస్కిటో రిపెలెంట్స్, వివిధ రకాల స్ప్రేలు, శీతలపానీయాలు, ఐస్‌క్రీమ్స్, జన్యు సంబంధిత కారణాలు ఉబ్బసం రావడానికి కారణమవుతున్నాయి. ఆస్తమా ఎవరిలో చూడవచ్చంటే.. ఆస్తమా ముఖ్యంగా అలర్జీతో బాధపడేవారిలో ఎక్కువగా వస్తుంది. కానీ చాలా వరకు ఈ సమస్య చిన్న వయసులోనే ప్రారంభమవుతుంది. కుటుంబసభ్యులలో ఎవరైనా ఆస్తమాతో బాధపడుతుంటే వారి పిల్లలలో కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు: శ్వాసనాళాలు సంకోచానికి గురికావడం వలన గాలి రవాణాకు ఆటంకం కలిగి దగ్గు, ఆయాసం, ఛాతి బరువుగా ఉండడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడడం, పిల్లికూతలు తదితర లక్షణాలుగా గుర్తించాలి. పిల్లల్లో ఆస్తమా గుర్తు పట్టడం ఎలా? పిల్లలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఆయాసం ఉంటుంది. పడుకున్నప్పుడు పిల్లికూతలు వస్తుంటాయి. రాత్రివేళ దగ్గు ఉంటుంది. పరిగెత్తినప్పుడు ఎక్కువగా ఆయాసపడతారు. మాట్లాడినప్పుడు ఆయాసపడడం గమనించవచ్చు. నిర్ధారణ: సి.బిపి. ఇ.ఎస్.ఆర్, అబ్సల్యూట్ ఇసినోఫిల్-కౌంట్, ఎక్స్‌రే చెస్ట్, సీటీ స్కాన్, స్పిరోమెట్రి, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ మొదలైనవి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు :పెంపుడు జంతువులకు, దుమ్మూ, ధూళికి దూరంగా ఉండటం, శీతలపానీయాలు, ఐస్‌క్రీమ్‌లు తినకపోవడం, ఇంటి పరిసరాలలో ఉండే పార్థినియం మొక్కలను తొలగించి పుప్పొడికి దూరంగా ఉండాలి. హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో ఎలాంటి ఎలర్జీలకు సంబంధించిన ఏ వ్యాధికైనా చికిత్స చేస్తారు. అధునాతన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియం ద్వారా అసమతుల్యతకు గురైనటువంటి రోగ నిరోధక శక్తిని సరిచేస్తారు. సమర్థవంతంగా తట్టుకునేలా ఇమ్యూన్ సిస్టమ్‌ను సరిచేసి అన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తారు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. చాలా ఎక్కువ ఒత్తిడికి గురిచేసే రంగంలో పనిచేస్తున్నాను. చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ వల్ల సిగరెట్ కాల్చడం అలవాటైంది. ఇప్పుడు ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం సిగరెట్లు కాల్చుతున్నాను. రోజూ రెండు మూడు ప్యాకెట్ల వరకూ సిగరెట్స్ కాల్చుతుంటాను. ఇటీవల నాకు తీవ్రంగా ఆయాసం, దగ్గు వస్తోంది. దాంతోపాటు సరిగా నిద్రపట్టడం లేదు. సాధారణ సమస్యే కదా, అదే తగ్గిపోతుందిలే అని పట్టించుకోలేదు. ఇప్పుడు ఉపశమనం కోసం ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించడం లేదు. దగ్గు, ఆయాసం తగ్గకపోగా రోజురోజుకూ మరింత పెరుగుతోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - మధు, హైదరాబాద్ సిగరెట్లు కాల్చడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. సరదాగా ప్రారంభమయ్యే అలవాటు వదులుకోలేని వ్యసనంగా మారి మీ సంతోషాలతో పాటు, మీ ఆరోగ్యాన్నీ సర్వనాశనం చేస్తుంది. మీరు రోజుకు మూడు పాకెట్ల వరకూ సిగరెట్లు కాల్చుతారని తెలిపారు. అంత ఎక్కువగా సిగరెట్లు కాల్చడం మీ ఆరోగ్యంపై చాలా తీవ్రమైన దుష్ర్పభావం చూపుతుంది. ఊపిరితిత్తులు ప్యాడైపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతుక్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. పొగతాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు పూడుకుపోయి గుండె సంబంధిత సమస్యలు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ), నిద్రలేమి వంటి సమస్యలూ వచ్చే అవకాశం ఉటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటే సిగరెట్లు కాల్చడం మరీ ప్రమాదకరం. కాబట్టి మీరు వెంటనే సిగరెట్లు కాల్చడం మానేసి వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకోండి. పొగతాగడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సిగరెట్ ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. మీరు ఎంత త్వరగా పొగతాగడం మానేస్తే మీ ఆరోగ్యానికి అంత మంచిది. డా. పి. నవనీత్‌సాగర్‌రెడ్డి సీనియర్ పల్మునాలజిస్ట్ యశోద హాస్పిటల్స్ సోమాజీగూడ హైదరాబాద్ ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 26 ఏళ్లు. ఈ నెలలోనే సంతాన సాఫల్యం కోసం చికిత్స తీసుకున్నాను. నాకు కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది. డాక్టర్‌ను సంప్రదిస్తే ‘ఒవేరియన్ హైపర్‌స్టిమ్యులేషన్’ అని చెప్పి పెయిన్‌కిల్లర్స్ ఇచ్చారు. దీనివల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్యలొస్తాయా? - లత, హైదరాబాద్ సంతాన సాఫల్యం కోసం చికిత్స తీసుకుంటున్న సమయంలో శరీరం దానికి అతిగా ప్రతిస్పందించడాన్ని ‘ఒవేరియన్ హైపర్‌స్టిమ్యులేషన్’గా పేర్కొనవచ్చు. మీ విషయంలో డాక్టర్ ఏ రకమైన చికిత్స ప్రక్రియను అవలంబించారు అన్న విషయం మీ లేఖలో లేదు. సాధారణంగా గొనాడోట్రాఫిన్ అనే ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంటుంది. కొందరిలో క్లోమిఫీన్ అనే మందులు వాడుతున్నప్పుడూ ఇలా జరగవచ్చు. కొందరిలో మందు మోతాదు ఎక్కువైనా ఒవేరియన్ హైపర్‌స్టిమ్యులేషన్ జరగవచ్చు. సాధారణంగా సన్నగా ఉన్నా లేదా పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నా ఒవేరియన్ హైపర్‌స్టిమ్యులేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి సమస్య వచ్చిన మహిళల్లో పొత్తికడుపులో నొప్పి, కడుపు ఉబ్బినట్లుగా కనిపించడం, వాంతులు వంటివి ఒవేరియన్ హైపర్స్టిమ్యులేషన్లో సాధారణంగా కనిపించే కొన్ని లక్షణాలు. ఈ పరిస్థితి కనిపించినప్పుడు చాలామందిలో ఔట్‌పేషెంట్‌గానే ఉంచి, దీన్ని ఎదుర్కొనవచ్చు. అయితే కొంతమంది మహిళలకు మాత్రం ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సి రావచ్చు. దీనికి పూర్తిగా బెడ్‌రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా చేయడం వల్ల కూడా కొన్ని ‘రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయే ‘థ్రాంబోఎంబోలిజమ్’ అనే పరిస్థితి ఏర్పడవచ్చు. మీలాంటి పరిస్థితి వచ్చిన వారిలో వారి బరువు, స్కానింగ్, రక్తపరీక్షల రిపోర్టులు పరిశీలించాల్సి వస్తుంది. చాలామందికి చిన్నపాటి చికిత్సలతోనే పరిస్థితి చక్కబడుతుంది. అయితే సంతాన సాఫల్య చికిత్స తీసుకున్నవారిలో ఇలాంటి సమస్య వస్తే... అది మళ్లీ మళ్లీ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువే. కాబట్టి డాక్టర్ మీరు తీసుకునే మందు మోతాదును అడ్జెస్ట్ చేస్తారు. ఒకవేళ మీకు ఐవీఎఫ్ జరుగుతున్నప్పుడు ఈ సమస్య వస్తే మీలో పిండం అభివృద్ధి చెందే అన్ని చికిత్సలనూ ఆపివేసి, చికిత్సను మరో విడత చికిత్సకు (నెక్స్ట్ సైకిల్‌కు) సర్దుబాటు చేయాల్సి రావచ్చు. ఒకవేళ ఈసారే మీకు గర్భం వచ్చి ఉంటే మీ హైపర్‌స్టిమ్యులేషన్ తీవ్రత ఎక్కువవైనా, మీ గర్భం నార్మల్‌గానే కంటిన్యూ అవుతుంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ -
అలర్జీ కాస్తా ఆస్తమాకు దారి తీయవచ్చు...
హోమియో కౌన్సెలింగ్ మా అమ్మగారికి 65 సంవత్సరాలు. ఆమె గత కొన్నేళ్లుగా సర్వైకల్ స్పాండిలోసిస్‌తో బాధపడుతున్నారు. దయచేసి ఆమెకు తగిన హోమియో మందులు సూచించగలరు. - పి. పద్మజ, మచిలీపట్నం సుమారు 90 శాతం జనాభాలో ప్రతి ఒక్కరికి 60 సంవత్సరాలు వచ్చేసరికి కొద్దిపాటి స్పాండిలోసిస్ సమస్య వస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇలా ప్రధానంగా వయసుతో వచ్చే ఈ సమస్య ఇటీవలి కాలంలో యుక్త వయస్కుల్లోనే కనిపిస్తుంది. దీనికి గల కారణాలు అనేకం. సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా మెడనొప్పి వ్యాయామం లేకపోవడం, అధిక బరువులు ఎత్తడం, పెరుగుతున్న పని ఒత్తిడికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. సర్వైకల్ స్పాండిలోసిస్ అనగానేమి? మానవ శరీర వ్యవస్థలో వెన్నెముక ఒక మూలస్తంభం లాంటిది. వెన్నుపూస పలు విభాగాల సమ్మేళనం. వెన్నెముకకు తోడుగా కండరాలు, డిస్కులు, లిగమెంట్లు ఉంటాయి. ఇవి సులభంగా వంగడానికి, శరీరంలోని కదలికలకు తోడ్పడతాయి. వెన్నెముకలోని ప్రతి రెండు పూసల మధ్య మృదువైన పదార్థం ఉంటుంది. దీనినే డిస్క్ అని అంటారు. వెన్నుపాము (స్పైనల్ కార్డ్) నుండి అసంఖ్యాకమైన నరాలు వెళుతుంటాయి. మెడ భాగం నుంచి వెళ్లే నరాలు కాళ్లలోకి వెళతాయి. వెన్నెముక మెడ, నడుం భాగాల్లోని డిస్కులే ఎక్కువగా దెబ్బతింటాయి. కాని ముఖ్యంగా మెడ దగ్గర రావడం వల్ల దీనిని సర్వైకల్ స్పాండిలోసిస్ అని పిలుస్తారు. కారణాలు: వెన్నెముకకు దెబ్బ తగలడం, అధిక బరువులు ఎత్తడం, గంటల తరబడి కూర్చొని పని చేయడం, సరైన డ్రైవింగ్ పద్ధతులు పాటించకుండా ఎక్కువగా డ్రైవింగ్ చేయడం, వయసు పెరిగే కొద్ది వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదలకు గురికావడం మరియు కొన్ని రకాల ‘ఆటోఇమ్యూన్ డిసీజెస్’ వల్ల కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి లక్షణాలు చూడవచ్చు: మెడనొప్పి, మెడ బిగుసుకుపోవడం, నొప్పి మెడ ప్రాంతంలో ప్రారంభమై భుజాల్లోకి, చేతుల వరకు వ్యాపించడం, తిమ్మిర్లు, చేతి కండరాలు బలహీనపడటం, భుజాలు, చేతివేళ్లలో స్పర్శ తగ్గిపోవడం, తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్ధారణ: ఎక్స్‌రే సర్వైకల్ స్ప్రెయిన్, ఎమ్.ఆర్.ఐ., సి.బి.పి., ఇ.ఎస్.ఆర్ వంటి పరీక్షల ద్వారా నిర్థారించడం జరుగుతుంది. హోమియో ఇంటర్నేషనల్ చికిత్స: హోమియో ఇంటర్నేషనల్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్య పద్ధతి ద్వారా మెడనొప్పి తగ్గించవచ్చు. అంతేకాదు, వెన్నుపూసలను దృఢంగా చేయడం ద్వారా మెడనొప్పి సమస్యలు తిరగబెట్టకుండా స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 44 ఏళ్లు. రెండు నెలల క్రితం కుడికాలి బొటనవేలు వాచి, తీవ్రమైన నొప్పి వచ్చింది. దానికి గాయం అయినట్లుగా నాకేమీ అనిపించలేదు. ఆ నొప్పి సాయంత్రానికి పెరిగి, కాస్త జ్వరం కూడా వచ్చింది. అప్పుడు నేను మాకు దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను కలిస్తే, పెయిన్‌కిల్లర్ కూడా ఇచ్చారు. ఐదారు రోజుల్లో సమస్య దానంతట అదే సద్దుమణిగింది. ఒక వారం క్రితం వరకూ అంతా బాగానే ఉంది. కానీ మళ్లీ కుడి బొటనవేలిలో మునుపటిలాగే నొప్పి వస్తోంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - కరుణాకర్, కర్నూలు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి అది ‘గౌట్’ అనే వ్యాధిలా అనిపిస్తోంది. గౌట్ ఉన్నవారిలో రక్తంలో యూరిక్ యాసిడ్ పాళ్లు పెరుగుతాయి. ఈ యూరిక్ యాసిడ్ పేరుకుపోయి కీళ్ల వద్ద రాళ్లలా (క్రిస్టల్స్‌లా) మారుతుంది. ప్రధానంగా కాలి బొటనవేలు, పాదాలలోని ఎముకలు, చీలమండ ఎముకల మధ్య ఇది చేరుతుంది. దాంతో కీళ్ల కదలికల సమయంలో ఎముకలు ఈ రాళ్లతో రాపిడి చెందడం వల్ల అక్కడి కీలు వాచి, నొప్పి కూడా వస్తుంది. సాధారణంగా కొన్నాళ్లలో దానంతట అదే తగ్గిపోతుంటుంది. కానీ రక్తంలో మళ్లీ యూరిక్ యాసిడ్ పాళ్లు పెరిగినప్పుడు నొప్పి, వాపు మళ్లీ తిరగబెడతాయి. వేటమాంసం, నిమ్మజాతికి సంబంధించిన పండ్లు (నిమ్మ, నారింజ వంటివి) తిన్నప్పుడు, ఆల్కహాల్ తీసుకునేవారిలో కీళ్లలో యూరిక్ యాసిడ్ రాళ్లు పెరిగే అవకాశాలు ఎక్కువ. అప్పుడు సమస్య మళ్లీ మళ్లీ వస్తుంటుంది. ఇలాంటివారు ఆహారంలో వేటమాంసం (రెడ్‌మీట్), నిమ్మజాతిపండ్లను తినకూడదు. ఆల్కహాల్ అలవాటు ఉంటే మానేయాలి. ఈ వాపు, నొప్పి తగ్గిన తర్వాత తగినంత వ్యాయామం చేయాలి. బరువు తగ్గాలి. పైన పేర్కొన్న జాగ్రత్తలన్నీ యూరిక్ యాసిడ్ రాళ్ల నివారణకు తోడ్పడతాయి. దాంతో గౌట్ కూడా నివారితమవుతుంది. అవసరాన్ని బట్టి మీకు రక్తంలోని యూరిక్ యాసిడ్ పాళ్లను తగ్గించడానికి కొన్ని మందులు కూడా వాడాల్సి రావచ్చు. కాబట్టి ఒకసారి మీ యూరిక్ యాసిడ్ పరీక్ష చేయించి, మీరు ఒకసారి మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించండి. పల్మనాలజీ కౌన్సెలింగ్ మా పాప వయసు ఐదేళ్లు. తరచూ జలుబు చేస్తుంటుంది. మందులు వాడితే తగ్గుతుంది. కానీ ఇంచుమించు నెలకొకటి రెండుసార్లు జలుబు బారిన పడి, చాలా బాధపడుతోంది. మాకు భయంగా ఉంటోంది. భవిష్యత్తులో ఆస్తమా వస్తుందా? లంగ్స్ పని తీరు మీద ఏదైనా ప్రభావం ఉంటుందా? దయచేసి తెలియజేయండి. - వసుధ, నల్గొండ చిన్నపిల్లల్లో జలుబు సాధారణమే. కానీ, అలర్జీ వల్ల వచ్చే జలుబు సాధారణం కాదు. దీనిని నిర్లక్ష్యం చేస్తే అది ఆస్తమాకు దారితీయవచ్చు. అందుకే ప్రాథమిక దశలోనే లక్షణాలకు కాకుండా, వ్యాధికి చికిత్స అందిస్తే అలర్జీ... ఆస్తమాకి మారే అవకాశం ఉండదు. సాధారణంగా జలుబు 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ అలర్జీ వల్ల వచ్చే జలుబు పదిరోజులైనా తగ్గదు. ఇది గుర్తుంచుకోండి. ముక్కు నుంచి పసుపు లేదా ఆకుపచ్చ స్రావం కారుతుంటే ఇన్ఫెక్షన్ వల్ల అది వచ్చినట్లు భావించాలి. అలాకాకుండా తెల్లగా వస్తుంటే అది అలర్జీ వల్ల వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. అలర్జీ వల్ల తుమ్ములు, పొడిదగ్గు, గొంతునొప్పి సైతం ఉంటాయి. మీరు చెప్పిన అంశాలను బట్టి మీ పాపవి అలర్జీ లక్షణాలే అనిపిస్తున్నాయి. దీనితో పాటు కళ్ల నుంచి నీరు, ముక్కు మూసుకుపోయినట్లుంటే అది అలర్జిక్ రైనైటిస్ తాలూకు లక్షణంగా పరిగణించాలి. మీలాగే చాలామంది జలుబు చేయగానే పిల్లలను డాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు ఇప్పిస్తారు. దాని వల్ల జలుబు తాత్కాలికంగా తగ్గిపోతుంది. కానీ తరచూ జలుబు చేస్తుంటే అది ‘అలర్జిక్ రైనైటిస్’ అని అర్థం చేసుకోవాలి. లక్షణాలకు మాత్రమే చికిత్స తీసుకుంటూ పోతే లోపల వ్యాధి పెరిగిపోతుంది. అలా కాకుండా వ్యాధికి చికిత్స తీసుకుంటే అది పూర్తిగా తగ్గిపోతుంది. మీరు ఆలస్యం చేయవద్దు. అలా చేస్తే అది ఆస్తమాకు దారితీస్తుంది. ఇలాంటి సమయల్లో డాక్టర్ పర్యవేక్షణ లేకుండానే చాలామంది విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటం, నిబ్యులైజర్ పెట్టించడం చేస్తున్నారు. మీరు మీ పాపను వెంటనే మీకు దగ్గర్లోని డాక్టర్‌కు చూపించండి. -
స్కూల్లో కళ్లు తిరిగి పడిపోతే...?
హోమియో కౌన్సెలింగ్ నేను కెమికల్ ఫ్యాక్టరీలో ప్రోడక్ట్ మేనేజర్‌ను. కడుపులో మంట, వికారం ఉంటే డాక్టర్‌కు చూపించుకున్నాను. ఎండోస్కోపీ చేసి అల్సర్ అన్నారు. దీనికి హోమియో శాశ్వత పరిష్కారం చూపించండి. - అనిల్‌కుమార్, కరీంనగర్ ఈ మధ్య కాలంలో ఆరోగ్యసమస్యలను వ్యాధులుగా పరిగణించడం జరుగుతోంది. కానీ వాటిని జబ్బుగా అనుకోవడం కంటే జీవనశైలి లోపాలుగా చెప్పుకోవడం సబబు. అలాంటి జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రధానంగా కనిపించే సమస్యలో ఒకటి గ్యాస్ట్రిక్ అల్సర్. శరీరంలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆసిడ్ ఉండటం అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్స్ తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని యాసిడ్‌తో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే యాసిడ్‌ను తట్టుకొని జీవిస్తుంది. పైగా యాసిడ్ ఉత్పత్తి అధికంగా జరిగేలా దోహదం చేస్తుంది. ఫలితంగా జీర్ణాశయ అల్సర్లు మొదలవుతాయి. గ్యాస్ట్రిక్ అల్సర్స్... ముఖ్యంగా 60 ఏళ్ల వయసులో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచ జనాభాలో 35 శాతం నుంచి 40 శాతం గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారని ఒక అంచనా. ఇందులో ముఖ్యంగా మహిళలు దీని బారిన ఎక్కువగా పడుతున్నారు. గ్యాస్ట్రిక్ అల్సర్స్‌కు కారణాలు: మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం మద్యపానం, పొగతాగడం సమయానికి ఆహారం, నీరు వంటివి తీసుకోకపోవడం కలుషితమైన ఆహారం, నీరు వంటి వాటి ద్వారా మన శరీరంలో క్రిములు చేరి, జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. లక్షణాలు: కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్ధకం తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్తవిరేచనాలు కొంచెం తిన్నా కడుపు నిండినట్లుగా ఉండటం, ఆకలి తగ్గడం నోటిలో ఎక్కువగా నీరు ఊరడం. వ్యాధి నిర్థారణ: ఎక్స్‌రే, ఎండోస్కోపీ, రక్తపరీక్షలు, బయాప్సీ, మలపరీక్ష వంటివి. చికిత్స: గ్యాస్ట్రిక్ అల్సర్‌కి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సినిక్ ఆల్బ్, ఆసిడ్ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు చక్కగా పనిచేస్తాయి. పల్మొనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. గృహిణిని. మేము ఒక పారిశ్రామిక ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. ఇటీవల నాకు తీవ్రంగా దగ్గు, ఆయాసం వస్తోంది. ఊపిరిపీల్చడంలో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాను. ‘ఇది సాధారణ సమస్యే కదా, అదే తగ్గుతుందిలే’ అని అంతగా పట్టించుకోలేదు. ఈ సమస్య తగ్గకపోగా... రోజురోజుకూ తీవ్రమవుతోంది. మా కాలనీలోనే ఒకరికి ఇలాంటి లక్షణాలే ఉంటే హాస్పిటల్లో చూపించుకున్నారు. తనకు ఆస్తమా ఉందని తేలింది. నాకూ అలాంటి సమస్య ఏమైనా ఉందా అని అనుమానంగా ఉంది. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. - సునీత, హైదరాబాద్ మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీరు శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు పారిశ్రామిక ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. పరిశ్రమల నుంచి వెలువడే పొగలో అనేక రసాయనాలు ఉంటాయి. వాటిని పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. రసాయనాలుతో కూడిన గాలి పీల్చినప్పుడు... కాలుష్యాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అలర్జీ, ఆస్తమా, సీఓపీడీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తాయి. మీకు కొంతకాలంగా దగ్గు, ఆయాసం తగ్గడం లేదని తెలిపారు కాబట్టి మీరు వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని, వ్యాధి నిర్ధారణ త్వరగా జరిగితే, శ్వాసకోశ సంబంధ వ్యాధులను వాటికి ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందగలగుతారు. మీరు సాధ్యమైనంతవరకు మీ ఇంటి చుట్టూ ఉండే పరిసరాల్లో పచ్చటి చెట్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. పచ్చదనంతో కాలుష్యప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. దాంతో పాటు మీ ఇంటి పరిసరాల్లో దుమ్ము, ధూళి లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో ఎవరికైనా పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేసేలా చూడండి. ఎందుకంటే పొగతాగేవాళ్లతో పాటు ఆ పొగ పీల్చేవారికి కూడా అది ప్రమాదమే. పరిశ్రమలతో పొగతో పాటు, సిగరెట్ కాల్చితే వచ్చే పొగ... ఈ రెండింటి వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడే అవకాశాలు మరింత పెరుగుతాయి. ఇక మీరు వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించండి. పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబుకు పదేళ్లు. వాడు ప్రేయర్ సమయంలో కళ్లు తిరిగిపడిపోయాడని స్కూల్లో టీచర్ పిలిపించి చెప్పారు. రెండుసార్లు ఇలా జరిగింది. మొదటిసారి ఏమీ అనిపించలేదు. కానీ రెండోసారి జరగడం వల్ల ఆందోళనగా ఉంది. దయచేసి మా అబ్బాయి విషయంలో తగిన సలహా ఇవ్వండి. - ధనలక్ష్మి, విజయవాడ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పిల్లలకు ఉన్న రుగ్మత సింకోప్ లేదా సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్పవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం 47 శాతం మంది స్కూలు పిల్లలు కళ్లు తిరిగి పడిపోతుంటారు. ఇది చాలా సాధారణ సమస్య. అయితే పిల్లల్లో ఈ సమస్య కనిపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఆర్థోస్టాకిక్ హైపోటెన్షన్. అంటే పిల్లల పొజిషన్స్‌లో మార్పుల వల్ల వాళ్లలో రక్తపోటు తగ్గి ఇలా జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యూరో కార్డియోజెనిక్ మార్పులు, గుండె సమస్యలు కూడా ఇలా పడిపోడానికి కారణం కావచ్చు. కొందరు పిల్లల్లో రక్తంలో గ్లూకోజ్ పాళ్లు తగ్గడం, ఫిట్స్, మైగ్రేన్, ఊపిరి బిగబట్టడం (బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్) వంటివి ఇందుకు కారణమవుతాయి. అయితే ఇదెంత సాధారణమైన సమస్య అయినప్పటికీ ఇలా పడిపోవడం మాటిమాటికీ కనిపిస్తుంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం. ప్రధానంగా ఇటువంటి పిల్లల్లో గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉన్నాయేమో అని తెలుసుకోవడం కూడా ముఖ్యమే. గుండెకు సంబంధించిన సమస్య లేదని నిర్ధారణ అయితే కాస్త నిశ్చింతగా ఉండవచ్చు. ఇక పైన పేర్కొన్న ఇతర కారణాలు ఏమైనా కావచ్చేమో అని తెలుసుకోవడం కూడా అవసరం. అరుదుగా ఫిట్స్ కూడా ఈ రకంగానే కనిపించవచ్చు. సాధారణంగా చాలా ఎక్కువగా భయం కలగడం వల్ల, తీవ్రమైన నొప్పి వల్ల, భయానక దృశ్యాలు చూడటం వల్ల లేదా డీహైడ్రేషన్ వల్ల అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే కొబ్బరినీళ్ల వంటివి తాగిస్తూ ఉండటం, పిల్లలు కింద కూర్చుని పైకి లేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం వంటివి ఈ సమస్య నివారణకు తోడ్పడే జాగ్రత్తలు. ఇక మీ బాబు విషయంలో పైన పేర్కొన్న కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే అంతా చక్కబడుతుంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీరు మరొకసారి మీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోండి. -
ఫాస్ట్ ట్రాక్ విధానంలో మూడుగంటల్లోనే నడవగలరు!
హోమియో కౌన్సెలింగ్ నాకు విపరీతమైన వెన్ను నొప్పి వస్తోంది. దీనికి హోమియోలో తగిన చికిత్స సూచించండి. - సుందర్, మెదక్ ఇటీవల వెన్ను సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ తరహా నొప్పి వస్తోంది. మీరు వెన్నునొప్పి అని రాశారు. కానీ అది ఏ భాగంలోనో రాయలేదు. మన వెన్నెముకలో 33 ఎముకలు ఉంటాయి. అందులో 7 మెడ భాగంలో, 12 వీపు భాగంలో, 5 నడుము భాగంలో మిగతావి అంతకంటే కిందన ఉంటాయి. ఎముకకూ, ఎముకకూ మధ్యన డిస్క్ అనే మెత్తటి పదార్థం ఉంటుంది. ఇది మన కదలికల సమయంలోగానీ, ఏదైనా పనిచేసేటప్పుడు ఎముకల మధ్య రాపిడిని నివారిస్తుంది. ఈ డిస్క్ మధ్యన మెదడు నుంచి వచ్చే నాడులు ఉంటాయి. ఉదాహరణకు నడుము దగ్గర ప్రారంభమై తొడల ద్వారా కాళ్ల వరకూ వెళ్లే అతి పెద్ద నరాన్ని ‘సయాటిక్ నర్వ్’ అంటారు. నడుము వద్ద ఉండే ఎల్4-ఎల్5 మధ్య సయాటిక్ నరం ఆరంభం అవుతుంది. ఈ నరం మీద ఒత్తిడి పెరిగి నొప్పికి దారితీయడాన్ని సయాటిక్ ఈ నరం ఒత్తిడికి గురవ్వడం వల్ల వచ్చే నొప్పిని సయాటికా అంటారు. ఇక మెడ భాగంలోని వెన్నుపూసల అరుగుదలతో పాటు మరికొన్ని కారణాల వల్ల వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. మెడ భాగంలోని రెండు వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ పక్కకు జరగడం, మెడకు తీవ్రమైన గాయం కావడం వంటి కారణాలతో ఈ సమస్య కావచ్చు. గంటల తరబడి కూర్చొని పనిచేసే వారిలోనూ, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యేవాళ్లలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ బాధితుల్లో మెడ భాగంలో తీవ్రమైన నొప్పి, చేయి లేదా భుజాలకు నొప్పి పాకడం, చేతి వేళ్ల తిమిర్లు లేదా ఆ భాగాలు మొద్దుబారడం లక్షణాలు ఈ సమస్య కనిపిస్తుంటుంది. ఇక కొందరిలో నడము వద్ద ఉండే వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరిగిపోవడం వల్ల కూడా అక్కడ ఉండే నరాల మీద ఒత్తిడి పడి లంబార్ స్పాండిలైటిస్ అనే సమస్య రావచ్చు. ముఖ్యంగా ఎల్3, ఎల్4, ఎల్4 వంటి వెన్నుపూసలలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. హోమియో చికిత్స: వెన్నుకు సంబంధించిన ఏ నొప్పులకైనా మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రయోనియా, రస్టాక్స్. కామొమిల్లా మాగ్‌ఫాస్ వంటి మందులను రోగి తత్వాన్ని, మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇస్తారు. నిపుణులైన హోమియో డాక్టర్లు సూచించిన కాలపరిమితి మేరకు వాటిని వాడితే, ఆపరేషన్ అవసరం లేకుండానే శాశ్వతమైన ఫలితం లభిస్తుంది. హోమియో మందులతో పాటు మంచి పౌష్టికాహారం, ఫిజియోథెరపీ వల్ల కూడా వెన్ను సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 62 ఏళ్లు. విపరీతమైన మోకాళ్లనొప్పులతో బాధపడుతున్నాను. వైద్యులను సంప్రదిస్తే మొదట మందులు ఇచ్చారు. అయినా నొప్పి తగ్గకపోయేసరికి మోకాలు చిప్ప మార్పిడి శస్త్రచికిత్స చేయించుకొమ్మని సూచిస్తున్నారు. ఈ వయసులో ఆపరేషన్ చేయించుకోవాలంటే భయంగా ఉంది. ఒకవేళ ఆపరేషన్ చేయించుకున్నా నెలల తరబడి మంచానికే పరిమితమైతే నాకు సేవలు చేసేవారు ఎవరూ లేరు. నా సమస్యకు ఆపరేషన్ ఒక్కటే మార్గమా? ఇతర ప్రత్యామ్నాయం చికిత్సలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సత్యనారాయణ, కరీంనగర్ మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స గురించి మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మీకు రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యల వంటి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా అన్న విషయం మీరు తెలపలేదు. ప్రస్తుతం మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలో అత్యాధునిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఒకవేళ మీకు మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు లేకుండా ఉంటే ఫాస్ట్‌ట్రాక్ విధానంలో మోకాలు మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించడానికి వీలవుతుంది. ఈ విధానంలో సర్జరీ చేస్తే ఆపరేషన్ జరిగిన మూడు గంటల్లోనే మీరు నడవగలుగుతారు. సాధ్యమైనంతవరకు సర్జరీ జరిగిన 24 గంటల్లోపే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. మీరు నెలల తరబడి మంచానికి పరిమితం కావాల్సిన అవసరం ఉండదు. దాంతో మీరు ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. సర్జరీ జరిగిన నాలుగురోజుల్లో మీరు పూర్తిగా కోలుకొని సాధారణ జీవితం గడపగలుగుతారు. సర్జరీ తర్వాత మీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఈ విధానంలో ఆపరేషన్ ముందు నుంచే నొప్పి నివారణ ప్రక్రియలు ప్రారంభిస్తారు. మీకు ఎలాంటి బాధ లేకుండా సర్జరీ చేస్తారు. ఫాస్ట్‌ట్రాక్ విధానంలో ఆపరేషన్ చేయడానికి వైద్యులు నిర్ధారణ చేస్తే, ఈ సర్జరీకి ముందు, తర్వాత చేయాల్సిన వ్యాయామాలు, ఫిజియోథెరపీ గురించి వైద్యులు క్షుణ్ణంగా తెలియజేస్తారు. మీ సందేహాలూ, అపోహలూ పూర్తిగా నివృత్తి అయిన తర్వాతనే సర్జరీకి సిద్ధం చేస్తారు. కాబట్టి మీరు అనవసరమైన భయాందోళనలూ, అపోహలను పక్కనబెట్టి వెంటనే శస్త్రచికిత్సకు సిద్ధమవండి. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నాకు 8 నెలల క్రితం అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో రక్తపరీక్షల్లో హెపటైటిస్ ‘బి’ పాజిటివ్ అని చెప్పినారు. ఆర్నెల్ల తర్వాత మళ్లీ టెస్ట్ చేస్తే మళ్లీ హెపటైటిస్ ‘బి’ పాజిటివ్ అన్నారు. ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఉందా లేదా సరైన సలహా ఇవ్వగలరు. - లక్ష్మయ్య, వరంగల్ మీకు 6 నెలల తర్వాత కూడా హెపటైటిస్ ‘బి’ పాజిటివ్ అన్నారు కాబట్టి మీకు క్రానిక్ హెపటైటిస్ ‘బి’ అనే వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఉన్నవారు మొదట కొన్ని రక్త పరీక్షలు చేసుకొని వ్యాధి ఏ స్టేజిలో ఉందో తెలుసుకోవాలి. వ్యాధి చాలామందిలో సుప్తావస్థలో ఇన్‌యాక్టివ్ దశలో ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి యాక్టివేట్ స్టేజ్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇన్‌యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నవారికి ఏ మందులు అవసరం లేదు. వీరు చేయవలసిందల్లా ప్రతి 3 నుండి 6 నెలలకు ఒకసారి గాస్ట్రో ఎంటరాలజిస్టుని సంప్రదించి ఎల్.ఎఫ్.టి. పరీక్షలు చేసుకొని మీ వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లోకి ఏమైనా వెళ్లిందా అనేది చూసుకోవాలి. యాక్టివ్ స్టేజ్‌లోకి వెళ్తే దానికి వివిధ రకాలైన మందులు లభ్యమవుతాయి. అందులో మీరు ఏ డ్రగ్ వాడాలో మీ దగ్గరలోని డాక్టర్ని సంప్రదించి వాడడం అవసరం. నా వయసు 55. మలద్వారం ద్వారా రక్తం పడుతోంది. డాక్టర్ని సంప్రదిస్తే పైల్స్ అని చెప్పి ఆపరేషన్ చేశారు. కాని రక్తం పడడం ఆగలేదు. దయచేసి నా సమస్యకు సరైన సలహా ఇవ్వగలరు. - రామారావు, వైజాగ్ మలద్వారం ద్వారా రక్తం రావడానికి పైల్స్ ఒక కారణం కావచ్చు, కాని రక్తం రావడానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు. అందులో ముఖ్యంగా పెద్ద పేగు కాన్సర్. మీరు ఒకసారి కొలనోస్కోపి / సిగ్మాయిడోస్కోపి అనే పరీక్ష చేయించుకోవడం మంచిది. ఆ పరీక్షలో మీకు రక్తం ఎక్కడ నుండి వస్తుందో తెలుస్తుంది. కారణం తెలిస్తే సరైన వైద్యం చేయించుకోవచ్చు. 50 ఏళ్లు పైబడిన వాళ్ల పెద్దప్రేగు కాన్సర్ రావడానికి చాలా అవకాశం ఉంది. ఈ కాన్సర్‌ని తొలి దశలో కనుగొంటే క్యూర్ అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు అశ్రద్ధ చేయకుండా దగ్గరలోని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి. -
బ్రెయిన్ ట్యూమర్‌కు ఆపరేషన్ తప్పదా?
హోమియో కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 56. గత కొద్దికాలంగా ఆమె మెడ నొప్పితో బాధపడుతున్నారు. డాక్టర్‌కు చూపిస్తే ఆమెకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉందని చెప్పి, కొన్ని సూచనలు చేసి, మందులు రాశారు. ఆ సూచనలు పాటిస్తూ, మందులు వాడుతున్నారు. కాని అంతగా ఫలితం కనిపించడం లేదు. హోమియోలో ఈ జబ్బుకు శాశ్వత పరిష్కారం ఉందా? - బి.అమరవాణి, పిడుగురాళ్ల మారుతున్న జీవన శైలి కారణంగా సుమారు 90 శాతం మంది ప్రతి ఒక్కరూ 60 సంవత్సరాలు వచ్చేసరికి కొద్దిపాటి స్పాండిలోసిస్ సమస్యతో బాధపడతారని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఈ సమస్య ఇటీవలి కాలంలో యుక్తవయస్కుల్లోనూ కనిపిస్తోంది. దీనికి గల కారణాలు అనేకం. సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా మెడనొప్పి ముఖ్యంగా గంటల తరబడి కూర్చొని పని చేయడం, సరియైన వ్యాయామం లేకపోవడం, అధిక బరువులు ఎత్తడం, పెరుగుతున్న పని ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏమిటి? మానవ శరీర వ్యవస్థలో వెన్నెముక ఒక మూలస్తంభం లాంటిది. వెన్నుపూస పలు విభాగాల సమ్మేళనం. వెన్నెముకకు తోడుగా కండరాలు, డిస్కులు, లిగమెంట్లు ఉంటాయి. ఇవి సులభంగా వంగడానికి, శరీరంలోని కదలికలకు తోడ్పడతాయి. వెన్నెముకలోని ప్రతి రెండు పూసల మధ్య మృదువైన పదార్థం ఉంటుంది. దీనినే డిస్క్ అంటారు. వెన్నుపాము (స్పైనల్ కార్డ్) నుండి అసంఖ్యాకమైన నరాలు వెళుతుంటాయి. మెడభాగం నుంచి వెళ్లే నరాలు చేతుల్లోగుండా, నడుం భాగం నుండి వెళ్లే నరాలు కాళ్లల్లో గుండా వెళుతుంటాయి. వెన్నెముక మెడ, నడుము భాగాల్లోని డిస్కులే ఎక్కువగా దెబ్బతింటాయి. కాని మెడ దగ్గర ఎక్కువగా రావడం వల్ల దీనిని సర్వైకల్ స్పాండిలోసిస్ అని పిలుస్తారు. కారణాలు: వెన్నెముకకు దెబ్బ తగలడం, అధిక బరువులు ఎత్తడం, గంటల తరబడి కూర్చొని పని చేయడం, సరైన పద్ధతులు పాటించకుండా ఎక్కువగా డ్రైవింగ్ చేయడం, వయసు పెరిగే కొద్దీ వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదలకు గురి కావడం, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: మెడనొప్పి, మెడ బిగుసుకుపోవడం, నొప్పి మెడ ప్రాంతంలో ప్రారంభమై భుజాల్లోకి, చేతుల వరకు వ్యాపించడం, తిమ్మిర్లు, చేతి కండరాలు బలహీనపడటం, భుజాలు, చేతివేళ్లలో స్పర్శ తగ్గిపోవడం, తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు నిర్థారణ: ఎక్స్‌రే సర్వైకల్ స్పైన్, ఎమ్మారై, సీబీపీ, ఇ.ఎస్.ఆర్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: హోమియో కేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్యపద్ధతి ద్వారా మెడనొప్పి తగ్గించడమే కాకుండా వెన్నుపూసలను దృఢంగా చేయడం ద్వారా మెడ, వెన్ను సమస్యలు తిరగబెట్టకుండా స్పాండిలోసిస్ సమస్యలను సంపూర్ణంగా నయం చేయవ చ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ న్యూరోసర్జరీ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. నాకు ఇటీవల బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. బ్రెయిన్ ట్యూమర్‌కు తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుందా? ఆపరేషన్ అంటే నాకు చాలా భయం. ముఖ్యంగా బ్రెయిన్‌కు ఆపరేషన్ చేస్తే తర్వాత మాట పడిపోతుంది, పక్షవాతం వస్తుందేమో అని చాలా భయంగా ఉంది. మందులతో బ్రెయిన్ ట్యూమర్ నయం అయ్యే అవకాశం లేదా? ఆపరేషన్ కాకుండా ఇంకా వేరే చికిత్సలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? ఆపరేషన్ పట్ల ఆందోళనతో డాక్టర్ వద్దకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. - కళ్యాణి, గుంటూరు మీకు బ్రెయిన్ ట్యూమర్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. అయితే మీకు మెదడులో ఏర్పడిన కణితి పరిమాణం, కణితి రకాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. అన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్లకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. కణితి పరిమాణం మూడు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటే ఆపరేషన్ లేకుండా రేడియో సర్జరీ ద్వారా సురక్షితంగా కణితిని తొలగించవచ్చు. ఒకవేళ కణితి పరిమాణం మూడు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ముందు మీరు ఆపరేషన్‌పై ఉన్న భయాన్ని పోగొట్టుకోండి. ఒకవేళ మీకు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి తలెత్తినా భయపడకండి. బ్రెయిన్ ట్యూమర్‌కు ఆపరేషన్ చేయించుకుంటే మాటపడిపోతుందనీ, పక్షవాతం వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. ప్రస్తుతం అత్యాధునిక శస్త్రచికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి దుష్ర్పభావాలు తలెత్తకుండా సురక్షితంగా అపరేషన్ చేయవచ్చు. ఆపరేషన్‌కు భయపడి వైద్యుల వద్దకు వెళ్లకుండా ఉంటే సమస్య మరింత క్లిష్టంగా మారుతుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు అర్థమయ్యేలా కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాతనే ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ తర్వాత మళ్లీ మీరు సాధారణ జీవితం గడపగలుగుతారు. - డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్,సికింద్రాబాద్ స్లీప్ కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 12 ఏళ్లు. నిద్రలోంచి ఉలిక్కిపడి మేల్కొంటోంది. కెవ్వున అరుస్తోంది. ఆమె ప్రవర్తన చాలా భయంగొలిపేదిగా ఉంది. మా అమ్మాయి విషయంలో తగిన సలహా ఇవ్వండి. - సురేశ్‌కుమార్, నల్గొండ నిద్రలో ఉలిక్కిపడి లేవడం, భయపడటం, ఆందోళన పడటం, కెవ్వున అరవడం ఇవన్నీ నిద్రకు సంబంధించిన ఒకరకం సమస్య. దీన్నే ‘స్లీప్ టై’ అంటారు. నిద్రలో ఉండగానే ఇవన్నీ చేస్తారు. నిద్రలోని ఒక దశ అయిన... కనుపాపలు చలించని స్థితి (నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్-నాన్ ఆర్ఈఎమ్) దశలో కనిపించే సమస్య ఇది. నిద్రలో నడవడం కూడా ఈ తరహా సమస్య కిందికే వస్తుంది. ఏదైనా ఒక సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తూ అది తాము పరిష్కరించలేని సమస్య అని బాగా ఆందోళనపడ్డప్పుడు ఒక్కోసారి ఇలా ప్రవర్తిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో వాళ్లు లేచి, ఈ నైట్టై దశలో 1-2 నిమిషాలు ఉంటారు. తర్వాత మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. వాళ్లకు సాంత్వన కలిగిస్తే ఈ పరిస్థితి క్రమంగా తగ్గిపోతుంది. అలాంటి స్థితిలో ఉన్న పేషెంట్‌ను చూసి, తల్లిదండ్రులు ఆందోళనపడటం చాలా సాధారణం. అయితే మీరు ఆందోళన పడాల్సిందేమీ లేదు. చాలామంది పిల్లల్లో ఈ సమస్య యుక్తవయసు రాగానే తగ్గుతుంది. వాళ్లు ఒకప్పుడు అలా ప్రవర్తించారన్న అంశమే వాళ్లకు గుర్తుండదు. అలాంటి వాళ్లలో అదేమీ మానసిక రుగ్మత కాదు. ఆరుగురిలో ఒక్కరికి మాత్రమే పెద్దయ్యాక కూడా ఈ పరిస్థితి వస్తుంటుంది. యుక్తవయస్కుల్లో కూడా ఈ సమస్య వస్తుందంటే... బహుశా వాళ్లు యాంగ్జైటీ లేదా డిప్రెషన్‌తో బాధపడుతూ ఉండవచ్చు. ఒక్కోసారి నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి, దీర్ఘకాలికంగా ఉండే మైగ్రేన్, స్లీప్ఆప్నియా వంటి సమస్యలు కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. మీపాప ఏదైనా సమస్య గురించి ఆందోళన పడుతున్నా, ఏదైనా పరిస్థితి గురించి భయపడుతున్నా... ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలమనే భరోసాను ఆమెకు ఇవ్వండి. మీరు స్లీప్ స్పెషలిస్ట్‌ను సంప్రదించండి. - డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్,కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ -
డయాలసిస్ చేయిస్తుంటే... ఒంటిపై దురద ఎందుకు?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. బాగా ముక్కితే గానీ మలవిసర్జన కావడం లేదు. నాకు మలద్వారం వద్ద ఇబ్బందిగా అనిపిస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - అమీర్‌బాషా, గుంటూరు మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల మీరు పేర్కొంటున్న సమస్యలు వస్తున్నాయి. మీ ప్రశ్నలో మీ సమస్య పైల్స్, ఫిషర్ లేదా ఫిస్టులానా అన్న స్పష్టత లేదు. అయితే ఈ మూడు సమస్యల్లోనూ మలబద్దకంతో మలవిసర్జన సాఫీగా జరగదు. పైల్స్‌ను సాధారణ వాడుకలో మొలలు అని కూడా అంటారు. మలద్వారం వద్ద ఉండే సిరలు ఉబ్బడం వల్ల ఈ సమస్య వస్తుంది. పీచుపదార్థాలు తక్కువగా తీసుకునేవారిలో మలం గట్టిపడి మలబద్దకానికి దారితీస్తుంది. తద్వారా కలిగే ఒత్తిడి వల్ల మలద్వారం చుట్టూ ఉండే సిరలు ఉబ్బుతాయి. పైల్స్ ఉన్నవారిలో నొప్పి, కొందరిలో మలవిసర్జన సమయంలో రక్తం పడటం, మలద్వారం వద్ద ఏదో అడ్డంకి ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక యానల్ ఫిషర్ సమస్య ఉన్నవారిలో మలద్వారం చుట్టూ ఉండే చర్మం చిట్లిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మలబద్ధకం వల్ల మలం బయటకు రావడానికి అధికంగా ముక్కడం. యానల్ ఫిషర్లో ప్రధానమైన లక్షణం మలద్వారం వద్ద తీవ్రమైన నొప్పి. మలం బయటకు వచ్చేటప్పుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక యానల్ ఫిస్టులా అంటే... మలద్వార భాగానికీ, చర్మానికీ మధ్యలో ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడటం. విసర్జన సమయంలో కలిగే తీవ్రమైన ఒత్తిడికి మలద్వారంలో ఉండే కణజాలం దెబ్బతింటుంది. ఇలా దెబ్బతిన్న కణజాలంలోకి బ్యాక్టీరియా ప్రవేశించి తొలిచేస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడుతుంది. మలద్వారం వద్దగల చర్మంపై ఇది ఒక చీముతో కూడిన గడ్డలాగా కనపడుతుంది. దీన్ని చీముగడ్డగా భావించి చికిత్స చేయడం వల్ల పైన చర్మం మీద ఉన్న గడ్డ నయమవుతుంది. కానీ లోపల ఉండే ద్వారం అలాగే మిగిలి ఉంటుంది. అందుకే ఈ సమస్య తరచూ వచ్చి ఇబ్బంది పెడుతుంది. యానల్ ఫిస్టులాలో కనపడే ప్రధాన లక్షణం మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, దీనితో పాటు అక్కడ ఏర్పడ్డ రంధ్రం నుంచి చీముతో కూడిన రక్తం బయటకు వస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పైల్స్, ఫిషర్, ఫిస్టులా... ఈ మూడు సమస్యలకూ హోమియోపతిలో అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రైయోనియా, నక్స్‌వామికా, అల్యూమినా, కొలిన్సోనియా వంటి మందులను రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇస్తారు. వీటిని నిర్ణీత కాలం పాటు క్రమం తప్పకుండా వాడటం వల్ల సురక్షితమైన, శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. ఒక ఏడాదిగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నాను. నాకు ఈమధ్య విపరీతంగా చర్మం దురద పెడుతోంది. ఎందుకిలా జరుగుతోంది? దురద రాకుండా ఉండటానికి ఏం చేయాలి? - మనోహర్, వరంగల్ డయాలసిస్ చేయించుకునే పేషెంట్స్‌లో చర్మం పొడిగా అవుతుంది. అంతేకాకుండా వాళ్ల రక్తంలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటంవల్ల కూడా దురద ఎక్కువగా వస్తుంటుంది. చర్మం పొడిగా ఉన్నవాళ్లు స్నానం తర్వాత చర్మంపై వాజిలేన్ లేదా మాయిష్చరైజర్ రాసుకోవాలి. రక్తంలో ఫాస్పరస్ తగ్గించే మందులు తీసుకోవడంతో పాటు ఆహారంలో పాల ఉత్పాదనలు, మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. రక్తహీనత ఉన్నవాళ్లు రక్తం పెరగడానికి మందులు వాడాలి. మా బాబు వయసు ఎనిమిదేళ్లు. ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ముఖం, కాళ్లు వాపు వచ్చాయి. యూరిన్‌లో ప్రోటీన్స్ పోయాయనీ, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్పి చికిత్స చేశారు. నెలరోజులు మందులు వాడిన తర్వాత యూరిన్‌లో ప్రోటీన్ పోవడం తగ్గింది. మందులు ఆపేశాము. మళ్లీ 15 రోజుల తర్వాత యూరిన్‌లో మళ్లీ ప్రోటీన్లు పోవడం ప్రారంభమైంది. మళ్లీ మందులు వాడితే ప్రోటీన్లు పోవడం తగ్గింది. ఇలా మందులు వాడినప్పుడల్లా తగ్గి, ఆపేయగానీ యూరిన్‌లో మళ్లీ ప్రోటీన్లు పోతున్నాయి. అయితే ఎక్కువకాలం మందులు వాడితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందా అని ఆందోళనగా ఉంది. వాటివల్ల ఏవైనా సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలూ ఉన్నాయా? వివరంగా చెప్పండి. - అక్బర్‌ఖాన్, కోదాడ నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్నప్పుడు మొదటిసారి పూర్తిగా మూడు నెలల పాటు డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. కొంతమంది పిల్లల్లో మందులు మానేయగానే మళ్లీ ప్రోటీన్ పోవడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పిల్లల్లో తక్కువ మోతాదులో మందులను ఆర్నెల్ల నుంచి తొమ్మిది నెలల పాటు వాడాల్సి ఉంటుంది. కొంతమందిలో సైడ్ఎఫెక్ట్స్ కనిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు వేరే మందులు వాడాల్సి ఉంటుంది. చాలామంది పిల్లల్లో ఈ వ్యాధి 12-14 సంవత్సరాల వయసప్పుడు పూర్తిగా నయమవుతుంది. కిడ్నీలు దెబ్బతినే అవకాశం చాలా తక్కువ. మీరు ఆందోళన పడకుండా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడండి. ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా కూతురు కెరియర్ ఓరియెంటెడ్. ఈ కారణం వల్లనే పెళ్లి కూడా చాలా ఆలస్యంగా... అంటే 35వ ఏట జరిగింది. మరో నాలుగైదేళ్ల పాటు పిల్లలు వద్దనుకుంటోంది. తన వయసు రీత్యా మరో నాలుగైదేళ్లు ఆగడం సరైనదేనంటారా? తగిన సలహా ఇవ్వండి. - సుగుణ, హైదరాబాద్ వయసు పెరుగుతున్న కొద్దీ సంతానం కలిగే అవకాశాలు తగ్గుతుంటాయి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో అండం విడుదలయ్యే అవకాశాలు తగ్గుతుంటాయి. అండం నాణ్యత కూడా తగ్గుతుంది. దాదాపు ముప్పయయిదేళ్ల వయసు తర్వాత నుంచి సంతానం పొందే అవకాశాలు క్రమంగా తగ్గుతూ పోతుంటాయి. మీ కుటుంబంలో త్వరగా మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటే, మీరు మీ అమ్మాయికి ఒవేరియన్ రిజర్వ్ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఫెర్టిలిటీ చికిత్సలు చేయిస్తున్నా... సంతానవతి అయ్యేందుకు అవకాశాలు తగ్గిపోతుంటాయి. ఇక ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశాలు, ట్యూబ్స్‌లో వచ్చే వ్యాధులు వయసుతో పాటు పెరుగుతాయి. ఫలితంగా సంతానవకాశాలు సన్నగిల్లుతాయి. వయసు పెరుగుతున్న కొద్దీ డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి సమస్యలు వచ్చి, గర్భధారణలో వచ్చే కాంప్లికేషన్స్ పెరుగుతాయి. దాంతోపాటు గర్భస్రావాలు (అబార్షన్స్) అయ్యే పర్సంటేజీ (శాతం) పెరుగుతుంది. అంటే... చిన్నవయసులో గర్భస్రావాలు అయ్యే అవకాశాలు 35 కంటే చిన్నవయసు ఉన్నవారిలో 13 శాతం ఉంటే... 45 ఏళ్ల వయసు పైబడిన వాళ్లలో అది 54 శాతానికి పెరగవచ్చు. వయసు పెరిగిన మహిళల్లో క్రోమోజోములలో మార్పులు వచ్చి, బిడ్డలో పుట్టుకతోనే వచ్చే సమస్యలు వచ్చే రిస్క్ కూడా ప్రమాదమూ పెరుగుతుంది. అందుకే కెరియర్‌కూ, సంతానాన్ని పొందడం అంశంలో సమతౌల్యం పాటించేలా మీ అమ్మాయి నిపుణుల నుంచి కౌన్సెలింగ్ పొందేలా చూడండి. అయితే ఈ అంశంలో అంతగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆధునిక వైద్యశాస్త్రపరంగా సంతాన సాఫల్యాల కోసం ఉన్న సాంకేతికత వల్ల కాస్త పెద్దవయసు మహిళలకూ గర్భధారణ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. -
చక్కెర వ్యాధిగ్రస్తుల వ్యాయామంలో జాగ్రత్తలు...
హోమియో కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 24 ఏళ్లు. హార్మోన్ లోపం వల్ల ఆమెకు నెలసరి సరిగా రావడం లేదు. ఆమె బరువు పెరుగుతోంది. హోమియోపతిలో సరైన చికిత్స చెప్పండి. - రాజేశ్వరి, కర్నూలు మనిషి జీవించడానికి శ్వాస ఎంత ముఖ్యమో, ఆరోగ్యంగా ఉండటానికి హోర్మోన్లు అంతే ముఖ్యం. గర్భాశయంలో పిండం ఏర్పడినప్పట్నుంచీ జీవితాంతం హార్మోన్లు తమ ప్రభావం కలిగి ఉంటాయి. మెదడులోని హైపోథెలామస్, పిట్యూటరీ గ్రంథులు శరీర కణాల క్రమబద్ధీకరణలో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ హార్మోన్లే శరీర ఉష్ణోగ్రతను, ఆకలిని, మానసిక స్థితి, నిద్ర, దాహం, ఉద్వేగాలను అదుపులో ఉంచుతాయి. ఇవి రక్తం ద్వారా ప్రవహిస్తూ, నిర్దిష్ట అవయవాలను ప్రభావితం చేస్తాయి. ఇవి సూక్ష్మమోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ శరీరంపై ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్లయిన టీ3, టీ4... థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయి. వీటిలో అసమతౌల్యత ఏర్పడితే హైపోథైరాయిడిజమ్, హైపర్‌థైరాయిడిజమ్, గాయిటర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి. అలాగే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు మహిళల్లో నెలసరి, సెకండరీ సెక్సువల్ లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవం వంటి అంశాలకు ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతౌల్యత వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు, అవాంఛిత రోమాలు, సంతానలేమి వంటి సమస్యలు కనిపిస్తాయి. మెనోపాజ్, నెలసరి వచ్చే సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల వేడి ఆవిర్లు, మానసిక అశాంతి, నీరసం, కీళ్లనొప్పులు కూడా వస్తాయి. నెలసరి సరిగా రాకపోవడంతో పాటు, బరువు పెరుగుతోందని చెబుతున్నారు కాబట్టి మీ అమ్మాయిలో హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడి ఉండవచ్చు. ముందుగా ఆమెలోని సమస్యను తెలుసుకోవాలి. అయితే మీరు చెబుతున్న లక్షణాలను చూస్తే ఆమెకు థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య ఉండవచ్చని అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేస్తే ఆమెకు హోమియోలో కాల్కేరియా కార్బ్, థైరాయిజమ్ ఐయోడమ్, బ్రోమియమ్, సల్ఫర్ వంటి మంచి మందులే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఆమెను అనుభవజ్ఞులైన హోమియో వైద్యులకు చూపించండి. ఆమెకు ఉన్న వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ నా వయసు 49 ఏళ్లు. గత ఐదేళ్లుగా నేను డయాబెటిస్తో బాధపడుతున్నాను. చక్కెర రోగులకు వ్యాయామం అవసరమని డాక్టర్లు చెప్పారు. డయాబెటిస్ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - వి. రాము, నూతనకల్లు డయాబెటిస్ ఉన్నవారు వ్యాయామం చేయడం వల్ల మరింత మెరుగైన జీవనాన్ని సాగించగలచు.అయితే దీనికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామానికి మీ శరీరం సంసిద్ధంగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఇందుకోసం ముందుగా స్థూలకాయం ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. గుండెజబ్బులు ఏవైనా ఉన్నాయా లేదా అని కూడా తెలుసుకోవాలి. శరీరానికి ఏ మేరకు వ్యాయామం కావాలో, ఏ మేరకు సురక్షితమో కూడా తెలుసుకోవాలి. ఒకవేళ ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల కూడా కొన్ని సమస్యలు రావచ్చు. వ్యాయామానికి ముందుగా మీ ఒంట్లోని చక్కెర పాళ్లు తెలుసుకోవాలి. అవి మరీ ఎక్కువగా ఉన్నా, లేదా మరీ తక్కువగా ఉన్నా, రక్తంలోనూ, మూత్రంలోనూ కీటోన్స్ ఉన్నా శరీరకంగా ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేయకూడదు. ఒకవేళ రక్తంలోని చక్కెరపాల్లు 100 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉంటే వ్యాయామానికి ముందు కాస్త ఉపాహారం తీసుకోవాలి. ఒకవేళ చక్కెర పాళ్లు త్వరత్వరగా పడిపోతుంటే తక్షణం చాక్లెట్ లాంటిది ఏదైనా తీసుకోవాలి. మన శరీరానికి, మెదడుకు అవసరమైనంత ద్రవాహారం అందేలా చేసుకోవాలి. ఇందుకోసం వ్యాయామానికి ముందర, వ్యాయామం తర్వాత తగినన్ని నీళ్లు తాగాలి. వ్యాయమాన్ని మొదలుపెట్టడానికి తక్షణం ముందుగానూ, వెంటనే ఆ తర్వాత నీళ్లు తాగకూడదు. వాతావరణంలో చాలా ఎక్కువగా వేడి ఉన్నప్పుడు శరీరం వెంటనే అలసిపోయే వ్యాయామాలు చేయకూడదు. ఎందుకంటే కొందరిలో శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధంగా ఉంచేంత సామర్థ్యం ఉండదు. అలాంటి సందర్భాల్లో చెమటను, రక్తప్రసరణను నియంత్రించే అటనామిక్ నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే బాగా వేడి ఎక్కువగా ఉండే రోజుల్లో ఆరుబయట వ్యాయామం చేయవద్దు. డయాబెటిస్ వల్ల ఒక్కోసారి పాదాలకు జరిగే రక్తప్రసరణ తగ్గి వాటిని అయ్యే గాయాలు తెలియకపోవచ్చు. పాదాలకు తిమ్మిర్లు (పెరిఫెరల్ న్యూరోపతి) రావచ్చు. మీ పాదాలకు ఎలాంటి గాయాలు కాకుండా చూసుకోవాలి. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉత్పన్నమైనా వెంటనే దగ్గరివారికి తెలియజేసేలా మీ మొబైల్‌ఫోన్‌ను వెంటే ఉంచుకోండి. మీ వ్యాయామం ప్లానింగ్‌లో మీ కుటుంబ సభ్యులనూ భాగం చేసుకోండి. ప్రతిరోజూ ఒకేలాంటి వ్యాయామాలు రిపీట్ కానివ్వకండి. ఒకరోజు బాగా శారీరక శ్రమ ఉన్నవి చేస్తే మరో రోజు తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఇలా రోజువిడిచి రోజు వ్యాయామాలను మార్చుకోండి. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. గృహిణిని. ఇటీవల ఎక్కువగా కీళ్లనొప్పులతో బాధపడుతున్నాను. సాధారణ కీళ్లనొప్పులే అని అంతగా పట్టించుకోలేదు. గత నాలుగు రోజులుగా కీళ్లనొప్పులతో పాటు వాపు, జ్వరం కూడా ఉంటోంది. నడుస్తున్నప్పుడు నొప్పితో సరిగా నడవలేకపోతున్నాను. రోజూ చేసుకునే పనులూ చేసుకోలేకపోతున్నాను. విశ్రాంతి తీసుకుంటే నొప్పి తగ్గినట్లు అనిపిస్తోంది. తర్వాత మళ్లీ కీళ్లనొప్పులు వస్తున్నాయి. నేను ఇదివరకెప్పుడూ ఇలాంటి లక్షణాలతో అనారోగ్యానికి గురికాలేదు. మొదటిసారి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. విశ్రాంతి తీసుకుంటే ఈ నొప్పులు తగ్గిపోతాయని తెలిసినవారు చెబుతున్నారు. ఈ సమస్య ఎందుకు వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - అనసూయ, ఏలూరు మీరు తెలిపిన వివరాలను బట్టి మీకు ఆర్థరైటిస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్లనొప్పులతో పాటు జ్వరం, వాపు కూడా ఉంటోంది. వయసు పైబడిన వారిలోనే ఆర్థరైటిస్ వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నవయసులో కూడా ఆర్థరైటిస్ బారిన పడుతున్నవారు ఉన్నారు. విశ్రాంతి తీసుకోవడం వల్ల అన్ని రకాల కీళ్ల నొప్పులు తగ్గవు. కీళ్లనప్పుల్లో చాలా రకాలు ఉంటాయి. కీళ్లనొప్పి రకాన్ని బట్టి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి. ఒకవేళ మీకు ఆర్థరైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినా ఆందోళన చెందకండి. ప్రస్తుతం ఆర్థరైటిస్‌కు మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆర్థరైటిస్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే దానిని సులువుగా నివారించవచ్చు. నిర్లక్ష్యం చేస్తే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆర్థరైటిస్‌లో చాలా రకాలు ఉంటాయి. ఆర్థరైటిస్ రకాన్ని బట్టి చికిత్స ఉంటుంది. మీరు తెలిపిన లక్షణాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో కనిపిస్తాయి. దీనికి సకాలంలో చికిత్స అందించడం ద్వారా కీళ్లనొప్పుల నుంచి త్వరగా ఉపశమనం పొందడంతో పాటు మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. -
చిన్నవయసులోనే బట్టతల..?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 26. నాకు తరచు కడుపులోనొప్పి, ఉబ్బరం ఉంటుంది. వీటితోబాటు పులితేన్పులు, ఛాతీలో మంట, తలనొప్పి, కండరాల నొప్పి వంటి ఇతర సమస్యలతో కూడా బాధపడుతున్నాను. దయచేసి నా సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. -బి. ఈశ్వర ప్రసాద్, హైదరాబాద్ తరచు విరేచనాలు లేదంటే మలబద్ధకం, కడుపునొప్పి, కడుపుబ్బరం. మలవిసర్జనలో మార్పులు... అంటే నీళ్ల విరేచనాలు లేదా మలం లో చీము పడడం వంటి లక్షణాలుంటే దానిని ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటారు. రక్తహీనత, కుటుంబ చరిత్రలో గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారిలోనూ, 50 సంవత్సరాలు పైబడిన వారు బరువు తగ్గడం, మలంలో రక్తం పడటం, కడుపునొప్పి, మలవిసర్జన తర్వాత కూడా మళ్లీ వెళ్లాలనిపించడం, వికారం, వాంతులు కావడం వంటి లక్షణాలు ఉన్నవారు సిగ్మాయిడో స్కోపీ, కొలనోస్కోపీ, సీటీస్కాన్, రక్తపరీక్షలు, లాక్లోజ్ ఇన్ టాలరెన్స్ టెస్ట్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. కారణాలు: మానసిక ఒత్తిడి, గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల నూనె పదార్థాలు, మసాలాలు, కొవ్వు పదార్థాలు, కలుషిత నీరు, ఆహారం వంటివి ఐబీఎస్‌కు ప్రేరేపకాలు. కొన్ని రకాల యాంటీబయాటిక్స్ మేలు చేసే బ్యాక్టీరియాకు హాని చేయడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎవరిలో ఎక్కువ..? ఈ సమస్యను వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ గమనించవచ్చు. ముఖ్యంగా స్త్రీలలో, యుక్తవయస్సు ఉన్నవారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు: వేళకు భోజనం చేయడం, సరిపడా నీరు తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి జాగ్రత్తల ద్వారా వ్యాధిని కొంతవరకు నయం చేయవచ్చు. గోధుమ పొట్టు, మొక్కజొన్న పొట్టు, తౌడు వంటి పదార్థాలు తీసుకుంటే ఈ లక్షణాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటిని తీసుకోకపోవడం మంచిది. హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం విధానంతో ఇబీఎస్కు గల మూలకారణాన్ని గుర్తించి, రోగి మానసిక, శారీరక, వ్యాధి లక్షణాలను కూడా పరిగణనలోకి తీసుకుని చికిత్స ఇవ్వడం జరుగుతుంది. అంతే కాకుండా పేగుల్లోని క్రమరాహిత్యాన్ని సరి చేసి, మళ్లీ ఈ వ్యాధి తిరగబెట్టకుండా సంపూర్ణంగా నయం చేయొచ్చు. జెనెటిక్ కౌన్సెలింగ్ మా కుటుంబంలో చాలామందికి క్యాన్సర్ వచ్చింది. మా అమ్మకూ, మా అక్కకు రొమ్ము క్యాన్సర్ వచ్చింది. మా పిన్ని (మా అమ్మవాళ్ల చెల్లెలు) ఒవేరియన్తో బాధపడింది. నాకు కూడా క్యాన్సర్ వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. నాకు క్యాన్సర్ రిస్క్ ఉందేమో దయచేసి చెప్పండి. - రమాదేవి, కొండాపూర్ దాదాపు 10 నుంచి 15 శాతం సందర్భాల్లో క్యాన్సర్ కుటుంబాల్లో కనిపిస్తుంటుంది. ఈ పరిస్థితుల్లో పిల్లలకి క్యాన్సర్ కారక జన్యుమార్పులు సంక్రమించే అవకాశం 50 శాతం. 55 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, దగ్గర బంధువులకు (అక్కచెల్లెళ్లు) రొమ్ము లేక ఒవేరియన్ క్యాన్సర్ ఉండటం వంటివి క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్ కింద పరిగణించవచ్చు. అలాగే బీఆర్సీయే 1 లేదా బీఆర్సీయే 2 జన్యువులు మార్పునకు (మ్యూటేషన్‌కు) గురైనప్పుడు కూడా క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చేందుకు అవకాశం ఉంది. ఆ జన్యు మార్పులు రొమ్ము లేదా ఒవేరియన్ క్యాన్సర్‌ను కలగజేస్తాయి. కుటుంబంలో ఆ సమస్య వస్తుందా లేదా అని నిర్ధారణగా తెలియడానికి ఆ రెండు జన్యువుల అధ్యయనం చేయాలి. ఈ పరీక్ష కోసం దాదాపు రూ. 20,000 ఖర్చవుతాయి. ఒకసారి ఈ పరీక్షలో ఆ జన్యువులు క్యాన్సర్‌ను కలిగించేలా మ్యూటేషన్ గురయ్యాయని తెలుసుకుంటే... దాన్ని బట్టి ఆ కుటుంబ సభ్యులకు రిస్క్ ఉన్నదీ లేనిదీ చెప్పవచ్చు. నా వయసు 34. నేను, నా భార్య ఇద్దరమూ దగ్గరి బంధువులం. మాది మేనరికపు వివాహం. మాకు ఒక కొడుకు పుట్టి, రెండేళ్ల వయసులో చనిపోయాడు. అతడి ఎదుగుదల కూడా తక్కువే. ఇప్పుడు మేం సంతానం కోసం ప్లాన్ చేసుకుంటున్నాం. మాకు ఎలాంటి లోపం కలగకుండా పిల్లలు పుట్టడానికి ఏం చేయాలో చెప్పండి. - జీవన్, రైల్వేకోడూరు దంపతులిద్దరూ దగ్గరి సంబంధం ఉన్నవారైతే పిల్లలకు జన్యుపరమైన లోపాలు, పుట్టుకతోనే వచ్చే ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. సాధారణంగా దూరపు సంబంధాలు చేసుకున్నప్పుడు దంపతుల్లో ఒకే అంశానికి ఒకరి జన్యువుల్లో లోపాలు ఉన్నా మరొకరి ఆరోగ్యకరమైన జన్యువులు దాన్ని భర్తీ చేస్తాయి. కానీ దగ్గరి సంబంధాలు ఉన్న వారు పెళ్లి చేసుకున్నప్పుడు, ఇద్దరి జన్యువుల్లోనూ లోపాలు ఉండటం వల్ల అది పిల్లల్లో జన్యుపరమైన లోపాలకు దారితీస్తుంది. ఫలితంగా పుట్టుకతో వచ్చే లోపాలు రావచ్చు. ఇక ఈ తరహా రిస్క్ ప్రతి సంతానంలోనూ 25 శాతం ఎక్కువే. ఇలాంటి లోపాలు గర్భస్థ శిశువులోనే కనుగొనడానికి అవసరమైన పరీక్షల కోసం ముందుగానే మెడికల్ జెనెటిసిస్ట్ లేదా జెనెటిక్ కన్సల్టెంట్‌ను సంప్రదించండి. డర్మటాలజీ కౌన్సెలింగ్ నాకు గత నాలుగు నెలల నుంచి వేళ్ల చివర్లలో గోళ్ల వద్ద తెల్లటి మచ్చలు వస్తున్నాయి. మోచేతుల భాగంలో తెల్లటి ప్యాచ్‌లు ఏర్పడుతున్నాయి. ఇవి ఒళ్లంతా విస్తరిస్తాయేమోనని ఆందోళనగా ఉంది. సలహా చెప్పండి. - ఉత్తమ్‌కుమార్, నాగోలు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీకు విటిలిగో (బొల్లి) తొలి దశలో ఉన్నట్లు అనిపిస్తోంది. ముందుగా దీనికి కార్టికోస్టెరాయిడ్ క్రీమును రోజుకు రెండుసార్లు మచ్చలపై ఒక నెల రోజుల పాటు రాయాలి. ఆ తర్వాత మరో నెల పాటు ట్యాక్రోలిమస్ 0.3% క్రీమ్‌ను మరో నెల పాటు రాయాలి. ఆ తర్వాత స్వాభావిక చర్మరంగు ఉన్న కణాలు ఆ ప్రాంతంలో పెరుగుతాయి. ఇలా రాస్తూ ఉన్న తర్వాత కొత్త మచ్చలు రాకుండా ఉండటం, ఉన్న మచ్చల సైజు పెరగకుండా ఉండటం జరిగితే... అప్పుడు విటిలిగో అదుపులో ఉన్నట్లుగా భావించాలి. అప్పుడు ఫొటో థెరపీ వంటి చికిత్సలతో తెల్లబారిన మచ్చల రంగును క్రమంగా మార్చుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఒకసారి విటిలిగో అదుపులో వచ్చాక స్ప్లిట్ స్కిన్ గ్రాఫ్టింగ్, పంచ్ గ్రాఫ్టింగ్ వంటి శస్త్రచికిత్స ప్రక్రియలూ అనుసరించవచ్చు. మీరు వెంటనే దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి. నా వయసు 26 ఏళ్లు. నాకు విపరీతంగా జుట్టు రాలిపోతోంది. నా హెయిర్‌లైన్ వెనక్కుపోతోంది. మాడు మీద కూడా వెంట్రుకలు బాగా పలచబారిపోయాయి. ఇంత చిన్న వయసులోనే నాకు బట్టతల వచ్చేస్తున్నట్లు అనిపిస్తోంది. దయచేసి నా జుట్టు రాలిపోకుండా తగిన సలహా ఇవ్వండి. - సురేశ్, విశాఖపట్నం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు యాండ్రోజెనిక్ అలోపేషియా అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. బహుశా మీకు ఇది వారసత్వంగా వస్తున్నట్లుగా అనిపిస్తోంది. దీని వల్ల మీకు బట్టతల రాబోతోందని అర్థమవుతోంది. బహుశా మీరు అలొపేషియాలోని మొదటి నుంచి మూడో దశలో ఉన్నట్లుగా అనిపిస్తోంది. మీరు బయోటిన్‌తో పాటు.. సా పాల్మెట్టో, మినాక్సిడిల్ 5 శాతం ఉన్న లోషన్లను తలపై అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నాలుగు, ఐదు దశల్లో పై మందులకు తోడుగా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ వంటివి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇవేవీ పనిచేయకపోతే మీకు జుట్టు పుష్కలంగా ఉన్న ప్రాంతం నుంచి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియను అనుసరించడం ఒక ప్రత్యామ్నాయం. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. -
మీసాల్లో దురద తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్ మా అబ్బాయికి వంటి మీద చిన్న చిన్న కురుపుల్లా వచ్చాయి. వేళ్ల మధ్యలో కూడా పొక్కుల్లా వున్నాయి. వీటిమూలంగా దురదతో చాలా బాధ పడుతున్నాడు. దీనికి హోమియోలో మంచి మందులు ఉంటే తెల్పగలరు. - నీలిమ, హైదరాబాద్ మీ అబ్బాయికి వచ్చినది దురదతో కూడిన ఒక అంటువ్యాధి. ఇది సార్కోప్టెస్ స్కాబీ అనే ఒక పరాన్నజీవి వలన ఒకరినుండి మరొకరికి వ్యాపిస్తుంది. ఇది చర్మంలో రంధ్రా లు చేసి దురదను కలిగిస్తుంది. ఈ జీవి ఎగరలేదు కాని చాలా వేగంగా పాకుతుంది. దోమకాటు, నల్లికాటు, కుక్క లేదా పిల్లిని పెంచడం వల్ల వాటి ఒంటి మీద ఉండే రోమాల కారణంగా కూడా దురదతో కూడిన ఇన్ఫెక్షన్ ఉంటుంది. దురద రాత్రిపూట ఎక్కువగా ఉండటం, చర్మం కన్నాలు పడినట్లు ఉండటం గమనించవచ్చు. లక్షణాలు: చర్మంపై చిన్న చిన్న కురుపులలాగా, రక్తంతో కూడిన బొబ్బల మాదిరిగా వస్తాయి. ఇవి చేతివేళ్లమధ్యలో, మణికట్టు, కీళ్లవెనుక, నడుము, నాభి, పాదాల దగ్గర ఎక్కువగా వస్తాయి. దురద మొదట తక్కువగానే ఉంటుంది. కాని కాలం గడిచేకొద్దీ దురద ఎక్కువ అవుతుంది. నిద్రాభంగం కూడా అవుతుంది. గోక్కోవడం వలన చర్మం దెబ్బతిని ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కారణాలు: వ్యాధిగ్రస్థులు వాడే వస్తువులు వాడటం వలన, ఇతరుల పక్కబట్టలు, వ్యాధి కలవారిని తాకినా వచ్చే అవకాశం ఉంది. ఇది సాధారణంగా మానసిక వికలాంగులలో, శరీరభద్రతావ్యవస్థ లోపించిన వారిలో, ఎయిడ్స్, లింఫోమా ఉన్న వారిలో రావచ్చు. మోకాళ్లు, అరచేతులు, నుదురు, అరికాళ్లలో ఎక్కువగా వస్తుంది. చర్మం మొదట పొడిబారిపోయి పొట్టులాగా ఏర్పడుతుంది. తర్వాత పులిపిర్లలాగా లేదా చీముగడ్డలలాగా మారుతుంది. గోళ్లు మందంగా అయ్యి, రంగు మారతాయి. దుర్వాసనతో కూడిన చెమటలు ఎక్కువగా పడతాయి. చలిని తట్టుకోలేరు. దురద ఉంటుంది కాని సాధారణ స్కాబిస్ ఇన్ఫెక్షన్లా ఇందులో దురద అంత తీవ్రంగా ఉండదు. పుండు ఉన్న చోట చుట్టూ చిన్న చిన్న కురుపులు ఏర్పడతాయి. లింఫ్ గ్రంథుల వాపు, జ్వరం, చలి, వికారం వంటి లక్షణాలు కనపడతాయి. మానసిక ఆందోళన అధికమైన కొద్దీ దురద, చిరాకు, మంటలు ఎక్కువ అవుతాయి. నివారణ: వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం, వ్యాధిగ్రస్థులు వాడిన దుస్తులు, దువ్వెనలు తదితర వస్తువులను ఉపయోగించకపోవటం, లక్షణాలు కనిపించినప్పుడే అశ్రద్ధ చేయకుండా వైద్యుని సంప్రదించడం అవసరం. స్టార్ హోమియోపతి చికిత్స: మెర్క్‌సాల్, హెపార్ సల్ఫ్, పెట్రోలియా, సారస్పరిల్లా, ఎకినీషియా వంటి మందులను వ్యాధి లక్షణాలను బట్టి, రోగి వ్యక్తిత్వాన్ని బట్టి పరిగణనలోకి తీసుకుని మందును నిర్ధారిస్తారు. కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 23 ఏళ్లు. గత ఐదేళ్లుగా రుమాటిక్ ఫీవర్‌తో బాధపడుతున్నానను. ప్రస్తుతం నేను పెన్సిలిన్ ఎల్ఏ 1200 తీసుకుంటున్నాను. ఇంకా రెండేళ్ల వరకు పెనిడ్యూర్ ఇంజెక్షన్ తీసుకోవాలని డాక్టర్ సూచించారు. ఇంజెక్షన్ తీసుకోకపోతే నాకు ఒక్కసారిగా కీళ్లనొప్పి, ఛాతీలో నొప్పి మొదలవుతాయి. నేను ఎంతకాలం ఈ ఇంజెక్షన్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి వివరంగా చెప్పండి. - మురళీకృష్ణ, కందుకూరు మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీ గుండెలోని ఎడమవైపు గదుల్లో ఉండే మైట్రల్ వాల్వ్ వనే కవాటం పరిమాణం పెరిగి మందమైనట్లుగా తెలుస్తోంది. కాబట్టి గుండె సంకోచం జరిగేటప్పుడు రుమాటిక్ ఫీవర్ వస్తోంది. కాబట్టి మైట్రల్ వాల్వ్‌కు ఎలాంటి ఇన్షెక్షన్ సోకకుండా, నష్టం జరగకుండా మీరు పెన్సిలిన్ ప్రొఫిలాక్సిస్ (ముందుజాగ్రత్తగా) ఇంజెక్షన్ వాడాల్సి ఉంటుంది. మీ వాల్వ్ పరిస్థితిని పరిస్థితులను గమనించడానికి పన్నెండు నెలలకు ఒకసారి ఈసీజీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. మీరు పాల ఉత్పాదనలు (డయరీ ప్రాడక్ట్స్), పండ్లు, ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటే మంచిది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, వైద్యులను సంప్రదిస్తూ ఉంటే మీరు అందరిలాగే పూర్తికాలం జీవించవచ్చు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మా నాన్నగారి వయసు 60 ఏళ్లు. బరువు 90 కిలోలు. గత మూడు నెలలుగా ఛాతీలో నొప్పితో బాధపడుతున్నారు. డాక్టర్‌ను సంప్రదిస్తే కరొనరీ యాంజియోగ్రామ్ అనే పరీక్ష నిర్వహించి, గుండెకు సంబంధించిన వ్యాధి ఏమీ లేదని చెప్పారు. ఇది కండరాలకు సంబంధించిన నొప్పి అని తేల్చారు. అయితే ఛాతీలో నొప్పికి కారణం ఏమిటో తెలియడం లేదు. దయచేసి మా నాన్నగారి విషయంలో తగిన సలహా ఇవ్వండి. - జయకుమార్, నందిగామ సాధారణంగా ఛాతీలో నొప్పికి అనేక కారణాలు ఉంటాయి. ఛాతీ భాగంలో కండరాలు, ఆహారనాళం, ఊపిరితిత్తులు, దాని పొరలు... ఇలా అనేక అంతర్గత భాగాలు ఉంటాయి. కరొనరీ యాంజియోగ్రామ్ ద్వారా ఇది గుండెకు సంబంధించిన సమస్య కాదని నిర్ధారణ అయ్యింది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బహుశా అది గ్యాస్ట్రయిటిస్ సమస్య కావచ్చు. అయితే నిర్దిష్టంగా సమస్యను నిర్ధారణ చేయడానికి ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి. డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 26 ఏళ్లు. నాకు మీసాలలో విపరీతమైన దురద వస్తోంది. రోమం మూలల్లో ఇది ఎక్కువగా అనిపిస్తోంది. గత నెల రోజులుగా ఇలా జరుగుతోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - కిశోర్, హైదరాబాద్ మీరు పేర్కొన్న వివరాల ప్రకారం మీరు సెబోరిక్ డర్మటైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మీసాలలో దురద రావడం అనే సమస్య సెబమ్ అనే నూనె వంటి స్రావం ఎక్కువగా స్రవిస్తున్నందువల్ల కావచ్చు. మీ సమస్యను అధిగమించడానికి ఈ కింది సూచనలు పాటించండి. మోమటోజోన్తో పాటు టెర్బనాఫిన్ యాంటీ ఫంగల్ ఉండే కార్టికోస్టెరాయిడ్ కాంబినేషన్ క్రీమును ప్రతిరోజూ రాత్రిపూట మీ మీసాల వద్ద చర్మంపై రాసుకోండి. ఇలా పది రోజులు చేయడం వల్ల ఫలితం కనిపిస్తుంది. కొద్ది నెలల పాటు ఐసోట్రెటినాయిడ్ టాబ్లెట్లను నోటి ద్వారా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీ సమస్య సత్వర పరిష్కారానికి డర్మటాలజిస్ట్‌ను కలవండి. నా వయసు 31 ఏళ్లు. నేను రజస్వల అయినప్పటి నుంచి నా శరీరం దుర్వాసన ఎక్కువగా వస్తోంది. రోజుకు మూడు సార్లు స్నానం చేస్తున్నా ఈ దుర్వాసన తగ్గడం లేదు. నా సమస్యకు సరైన పరిష్కారం ఇవ్వండి. - ఒక సోదరి, గుంటూరు కొంతమందిలో చర్మంపై ఉండే సెబేషియస్ గ్లాండ్స్ చాలా ఎక్కువగా పనిచేస్తుంటాయి. చర్మంపై ఉన్న ఈ గ్రంథుల నుంచి సీబమ్ అనే ఒక రకమైన నూనె స్రవిస్తుంటుంది. ఈ స్రావాలకు చెమట కూడా తోడైతే, దాని వల్ల చర్మంపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా చర్మం నుంచి దుర్వాసన వస్తుంది. దీన్ని అధిగమించడానికి మీరు చేయాల్సినవి... మీ చర్మంపైన ఎక్కువ చెమట పట్టే బాహుమూలాల వంటి ప్రదేశాల్లో కొద్దిపాటి సువాసన ఉండే యాంటీబ్యాక్టీరియల్ మెడికేటెడ్ సబ్బుతో రోజుకు మూడు సార్లు శుభ్రపరచుకోండి. ఆ ప్రాంతాలలో రోజూ టాల్కమ్ పౌడర్‌ను చల్లుకోండి. రోజూ ఉదయం పూట అల్యూమినియమ్ హైడ్రాక్సైడ్ ఉండే లోషన్‌ను ఒంటిపై రాసుకోండి. ఇది మిమ్మల్ని మరింత సేపు ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది. అప్పటికీ మీ ఒంటి దుర్వాసన తగ్గకపోతే మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి. -
రెండు రోజులుగా జ్వరం... స్వైన్‌ఫ్లూ కావచ్చా?
హోమియో కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 68. ఆయన ఆరోగ్యంగానే ఉంటారు కానీ, ఈ మధ్య వాకింగ్‌కని వెళ్లి, ఇల్లు కనుక్కోలేక పోతున్నారు. అలాగే కళ్లద్దాలు, హ్యాండ్‌స్టిక్, సెల్‌ఫోన్ వంటి వాటిని ఒకచోట పెట్టి మరోచోట వెతుక్కుంటున్నారు. ఒక్కోసారి మా పిల్లల పేర్లు కూడా మర్చిపోతున్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. ఆయన మతిమరపును తగ్గించవచ్చా? - పార్థసార థి, గుంటూరు ప్రతిమనిషి తమ జీవితంలో ఎప్పుడో ఒకసారి మరచిపోవటం సహజం. ఈ మతిమరపు ఎక్కువగా వృద్ధాప్యంలో చూడటం సాధారణం. వృద్ధులు తమ వస్తువులను ఒకచోట పెట్టి, ఆ విషయం మరచిపోయి మరోచోట వెతుక్కోవడం చూస్తూనే ఉంటాం. కొంతమందిలో కొన్ని కారణాల వల్ల ఈ మతిమరపు ఎక్కువ అవుతుంటుంది. వాకింగ్ చేస్తూండగానో, మరో పనిచేస్తుండగానో తామెందుకు ఆ ప్రదేశానికి వచ్చామో మరచిపోయి చూసి మతిభ్రమించినట్లు వెర్రిగా ప్రవర్తించటం చూస్తుంటాం. అదిచూసి ఇంటిలోని వారు విసుక్కోవటం, కోప్పడటం, బాధపడటం సాధారణం. అయితే వారు తమ సమీప బంధుమిత్రులను, ముఖ్యంగా కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేక సతమతమవుతుండటం వంటి లక్షణాలను గమనించినట్లయితే వారు అల్జైమర్ డిసీజ్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించవచ్చు. అల్జైమర్స్ డిసీజ్ అంటే ఏమిటి? డెమైన్షియా అనేది మెదడుకు సంబంధించిన సమస్య. దీని వలన మనిషి అలవాటు పడ్డ పనులలో తేడా రావటం గమనిస్తాము. వృద్ధాప్యంలో చూసే మతిభ్రమణ అంటే డెమైన్షియాను అల్జైమర్స్ డిసీజ్ అంటారు. ఇది మొదట మెదడు భాగాలలో ప్రభావం చూపి క్రమేపీ మనిషి ఆలోచనా విధానంలో, జ్ఞాపకశక్తిలో, భాషావిధానంలో మార్పు తీసుకు వస్తుంది. ఇది సామాన్యంగా 60 ఏళ్ల తర్వాత వస్తుంది. ఆ తర్వాత వయస్సు పెరిగేకొద్దీ వ్యాధి తీవ్రమయ్యే అవకాశం ఉంది. స్త్రీ పురుషులిరువురిలోనూ ఈ వ్యాధి కనిపిస్తుంది. మెదడుకు బలమైన దెబ్బతగలటం వల్ల మెదడులో సరిగా రక్తప్రసరణ సరిగా జరగక భవిష్యత్తులో ఈవ్యాధి వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు రోగి ఇంటిలోనుంచి వెళ్లిపోవటం, యాంగ్జైటీకి గురవటం, తమ ఇంటినే గుర్తించలేకపోవటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. నిర్ధారణ: రోగి శారీరక, మానసిక లక్షణాలలో మార్పులను బట్టి, రక్తపరీక్ష, బ్రెయిన్ సీటీస్కాన్, ఎమ్మారై హోమియో కేర్ ఇంటర్నేషనల్ చికిత్స: రోగి శారీరక, మానసిక లక్షణాలను విశ్లేషించి వ్యాధి కారణాలను కనుగొన్న తర్వాత కోనియం, బెరైటాకార్బ్, కోబాల్ట్, అల్యూమినా, నేట్రం సల్ఫ్ వంటి మందులను వైద్యుని పర్యవేక్షణలో వాడటం ద్వారా ఈ వ్యాధిని నయం చేయవచ్చు. నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. గత ఏడాది నాకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ఏశారు. ఇంకా మందులు వాడుతున్నాను. ఇవి ఇంకా ఎన్నాళ్లు వాడాల్సి ఉంటుంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించండి. - డి. మదన్మోహన్, మెదక్ కిడ్నీ మార్పిడి అయిన తర్వాత శరీరం ఆ మూత్రపిండాన్ని నిరాకరించకుండా ఉండేందుకు వాడే మందులు జీవితాంతం తప్పనిసరిగా వాడాలి. చాలామంది కిడ్నీ బాగానే పనిచేస్తుంది కదా అని మందులు మానేస్తారు. ఇలా చేయడం వల్ల శరీరం కిడ్నీని అంగీకరించకుండా ఉండే అవకాశం ఉంది. తద్వారా మీకు సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. ఇవిగాక జలుబు, జ్వరం, ఏ ఇబ్బంది తలెత్తినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఏ మందులూ వాడకూడదు. నిల్వ పదార్థాలను తినకూడదు. ఇన్ఫెక్షన్స్ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఇంటి పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఉంటే వాటిని అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నా వయసు 34 ఏళ్లు. తరచూ జ్వరం వస్తోంది. మూత్రవిసర్జన సమయంలో మంటతో బాధపడుతున్నాను. మందులు వాడినప్పుడు తగ్గుతోంది. నెలలోపు మళ్లీ జ్వరం వస్తోంది. ఇలా పదే పదే జ్వరం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? - జ్ఞానేశ్వర్, నల్గొండ మీరు తరచూ జ్వరం, మూత్రంలో ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే, అది మళ్లీ మళ్లీ రావడానికి గల కారణాలు ఏమిటో ముందుగా నిర్ధారణ చేసుకోవాలి. షుగర్ ఉంటే కూడా ఇలా కొన్ని సందర్భాల్లో కావచ్చు. ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకోండి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లు ఉన్నాయేమో చూడాలి. యాంటీబయాటిక్స్ పూర్తి కోర్సు వాడకపోతే కూడా ఇన్ఫెక్షన్స్ ఇలా తిరగబెడతాయి. ఒకవేళ యాంటీబయాటిక్స్ పూర్తికోర్సు వాడకపోతే డాక్టర్ చెప్పిన మోతాదులో మూడు నెలల పాటు అవి వాడాలి. ఇన్ఫెక్షన్స్ తరచూ తిరగబెట్టకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు (రోజూ రెండు నుంచి మూడు లీటర్లు) తాగుతుండాలి. మూత్రవిసర్జనను ఆపుకోకూడదు. ఒకసారి మీరు డాక్టర్‌కు చూపించుకోండి. పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. ఇటీవలే వారం రోజుల పాటు దూరప్రాంతాలకు ప్రయాణం చేశాను. రెండు రోజులుగా జ్వరం. దాంతో పాటు ఒళ్లునొప్పులు, జలుబు, తలనొప్పి వంటి లక్షణాలు కూడా ఉన్నాయి. అలసటగా అనిపిస్తోంది. స్వైన్‌ఫ్లూ గురించి పత్రికల్లో వస్తున్న న్యూస్ చూసి, నాకు స్వైన్‌ఫ్లూ సోకిందేమోనని అనుమానంగా ఉంది. దయచేసిన నా సమస్యకు పరిష్కారం చూపండి. - దయాసాగర్, నల్గొండ ఒంటినొప్పులతో కూడిన జ్వరం ఉన్నంత మాత్రాన అది స్వైన్‌ఫ్లూ అనే చెప్పలేం. ఎక్కువగా ప్రయాణం వల్ల కూడా ఒళ్లునొప్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం, సురక్షితం కాని నీరు తాగడం వల్ల కూడా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. రెండు రోజుల్లో జ్వరం తగ్గకపోతే, అది స్వైన్‌ఫ్లూ అని నిర్ధారణ అయినట్లు కాదు. వైరల్ ఫీవర్లలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మీకు ఛాతీ బరువెక్కినట్లు అనిపించడం, బీపీ పడిపోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలతో పాటు మరో నాలుగు రోజుల పాటు జ్వరం తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. తగిన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. అప్పటివరకూ జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు మీ చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, మీ పరిసరాలూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. బయటకు ఎక్కడికీ వెళ్లకుండా విశ్రాంతి తీసుకోండి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కు ధరించి వెళ్లడం మంచిది. మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులా అని చూసుకోండి. ఎందుకంటే వారితో పాటు చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారిలో స్వైన్‌ఫ్లూ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ స్వైన్‌ఫ్లూ అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు జ్వరం తగ్గకుండా మాటిమాటికీ వస్తూ ఉంటే, వెంటనే డాక్టరును సంప్రదించండి. వారు దానికి కారణం ఏమిటో నిర్ధారణ చేస్తారు. -
వర్క్ స్టేషన్ మార్పులతో ఉపశమనం
హోమియో కౌన్సెలింగ్ ఇటీవల పగటిపూట, ఉదయంవేళల్లో వాతావరణం చాలా వేడిగానూ, రాత్రివేళల్లో చాలా చలిగానూ ఉంటుంది. ఈ వెంటవెంట మార్పులతో నాకు అలర్జీ ఎక్కువగా వస్తోంది. పైగా పగటివేళ కాలుష్యం, దుమ్ముతోనూ, రాత్రివేళల్లో తేమతోనూ ఆస్తమా వస్తోంది. నా సమస్యకు హోమియో వైద్య విధానంలో పరిష్కారం చెప్పగలరు. - నీలకంఠరావు, సూళ్లూరుపేట మీరు పేర్కొన్న వాతావరణం ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. చాలాసేపు ఒకే విధమైన వాతావరణం ఉంటే సాధారణంగా శరీరానికి ఏ ఇబ్బందీ ఉండదు. అయితే వెంటవెంటనే ఉష్ణోగ్రతల మార్పు వల్ల శరీర ఉష్ణోగ్రత లోనూ మార్పులు వస్తాయి. ఆ తరహా వాతావరణ మార్పులు అంత శ్రేయస్కరం కాదు. వాతావరణంలో ఇలాంటి మార్పులకు గురికావడంతో పాటు దుమ్ము, ధూళి, పొగకు ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేవారిలో అది ఆస్తమాకు దారితీసే అవకాశాలు ఎక్కువ. దానివల్ల... కొద్దిపాటి పని చేసినా తీవ్రమైన అలసట ఎక్కువసార్లు జలుబు చేయడం ముక్కులు బిగుతుగా మారడం ఊపిరి పీలుస్తున్నప్పుడు పిల్లికూతలు వినిపించడం రాత్రి వేళల్లో శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి పదేపదే కనిపించడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గడం, ఫలితంగా ఇతర ఇన్ఫెక్షన్లకు తేలిగ్గా గురికావడం జరుగుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా తగ్గుతుంది. తర్వాతి దశల్లో అది బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధులకూ దారితీయవచ్చు. వాతావరణంలో తరచూ చోటుచేసుకునే ఈ మార్పుల వల్ల వచ్చే ఆస్తమాకు హోమియో వైద్యవిధానంలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ విధానంలో శారీరక లక్షణాలతో పాటు, మానసికమైన అంశాలనూ పరిగణనలోకి తీసుకొని మందులను సూచిస్తారు. యాంటిమోనియమ్ టార్ట్, ఆర్సినిక్ ఆల్బ్, హెపార్‌సల్ఫ్, సోరియమ్, నేట్రమ్ సల్ఫ్ వాటిలో కొన్ని ముఖ్యమైన మందులు. ఇవి రోగిలో వ్యాధి నిరోధకతను పెంచి, తద్వారా ఆస్తమా రాకుండా చేస్తాయి. మీరు నిపుణులైన హోమియో వైద్యులను సంప్రదించి, వారి పర్యవేక్షణలో మందులు తీసుకోండి. వ్యాధి తీవ్రతతో పాటు మీ మనస్తత్వం, వ్యక్తిగత అంశాలను పరిగణనలోకి తీసుకొని మీ మందులనూ, మోతాదును నిర్ణయిస్తారు. హోమియో వైద్యవిధానం ద్వారా మీ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ ఫిజియో అండ్ రీహాబ్ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. రోజూ 8-10 గంటలు కూర్చొనే పనిచేస్తాను. అప్పుడప్పుడూ నడుము నొప్పి వస్తుండేది. ఇప్పుడు ఆ నొప్పి క్రమంగా కాళ్లకూ పాకుతోంది. కాళ్ల తిమ్మిర్లు వస్తున్నాయి. సరిగా నిలబడలేకపోతున్నాను. పరిష్కారం చెప్పండి. - రామ్మోహన్, హైదరాబాద్ నడుము నొప్పి అనేక కారణాలతో వస్తుంటుంది. కంప్యూటర్ ముందు చాలా సేపు కూర్చొని పనిచేసే చాలామందిలో ఇది కనిపిస్తూ ఉంటుంది. కొందరిలో అపసవ్య భంగిమలో కూర్చోవడం వల్ల నడుము నొప్పి వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో కిడ్నీకి సంబంధించిన జబ్బులు, పేగులకు సంబంధిత వ్యాధులు ఉన్నా ఇలా నడుమునొప్పి రావచ్చు. మహిళల్లో గైనిక్ సమస్యలు ఉండటం కూడా నడుము నొప్పికి ఒక కారణం కావచ్చు. పోషకాహార లోపం వల్ల ముఖ్యంగా విటమిన్-డి తగ్గడం వల్ల కూడా ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చి ఈ తరహా నొప్పులు వచ్చేందుకు అవకాశం ఉందని కొత్త పరిశోధనలు తెలుపుతున్నాయి. మీరు ముందుగా డాక్టర్‌కు చూపించి, అసలు ఏ సమస్య కారణంగా నడుమునొప్పి వస్తోందో తెలుసుకోవాలి. ఒకవేళ ఎముకలు లేదా నరాలకు సంబంధించిన అంశాల కారణంగా నడుము నొప్పి వస్తుంటే, దాన్ని నిర్దిష్టంగా నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. నొప్పి కాళ్లవైపునకు పాకుతోందనీ, కాళ్లు తిమ్మిర్లుగా ఉంటున్నాయని చెప్పిన లక్షణాలను బట్టి, ఇది చాలావరకు నరాలకు సంబంధించిన సమస్య కావచ్చు. దీనికోసం రేడియాలజీ, ఎమ్మారై పరీక్షలు చేయాల్సి రావచ్చు. ఇలా వచ్చే నడుము నొప్పి తగ్గడానికి కొన్ని రకాల వ్యాయామాలు ఉన్నాయి. అయితే నిర్దిష్టంగా అది ఫలానా కారణంతో అని తేలేవరకూ ఇలాంటి వ్యాయామాలు చేయడం సరికాదు. ఎందుకంటే కారణాలను బట్టి, నొప్పి తగ్గడానికి చేయాల్సిన వ్యాయామాలు మారుతుంటాయి. తగిన వ్యాయామాలు చేయకపోయినా వ్యాధి తీవ్రత పెరగవచ్చు. తగిన వ్యాయామాలు సూచించేందుకు మీరు రీహ్యాబ్ స్పెషలిస్ట్‌ను సంప్రదించడం మంచిది. మీరు ముందుగా డాక్టర్‌ను కలిసి తగిన వైద్యపరీక్షలు చేయించుకోండి. ఇక అప్పటివరకూ మీ కూర్చొనే భంగిమలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోండి. మీరు కుర్చీలో వెన్నును నిటారుగా ఉంచి కూర్చునేలా మీ సీట్‌ను అడ్జెస్ట్ చేసుకోవాలి. దీనిని వర్క్ స్టేషన్ మాడిఫికేషన్ టెక్నిక్ అంటారు. ఇందులో భాగంగా ప్రతి గంటకోసారి లేచి నాలుగు అడుగులు వేయాలి. అప్పుడు మీ వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది చేశాక కూడా మీకు నడుమునొప్పి వస్తూ ఉంటే, వెంటనే డాక్టర్ కలిసి, తగిన వైద్య పరీక్షలు చేయించుకోండి. డాక్టర్ మిద్దె అజయ్‌కుమార్ లెసైన్స్డ్ పీటీ (యూఎస్ఏ), డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో రీహాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ జనరల్ హెల్త్ కౌన్సెలింగ్ నా వయసు 46 ఏళ్లు. నాకు నోటి నిండా పొక్కులు వస్తున్నాయి. నోరు పూసినట్లుగా అవుతోంది. దాదాపు ప్రతి రెండు నెలలకోసారి ఇలా అవుతోంది. డాక్టర్‌ను కలిస్తే ప్రమాదం ఏమీ లేదని విటమిన్ మాత్రలు ఇచ్చారు. మాటిమాటికీ అవే మందులు వాడుతున్నాను. ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఏం చేయాలో చెప్పండి. - వినోద్, జడ్చర్ల మాటిమాటికీ నొటిలో పొక్కులు వస్తున్నాయంటే చాలా సందర్భాల్లో మానసిక ఒత్తిడి వల్ల కావచ్చు. అది నోట్లో మచ్చలుగానీ, ప్లాక్లా వస్తే అది ఓరల్ క్యాండిడియాసిస్ కావచ్చు. కొన్నిసార్లు విటమిన్లు, ఖనిజాల లోపం కూడా కావచ్చు. అయితే ఈ నోటిలోని పొక్కులు మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి ఫిజీషియన్‌ను సంప్రదించండి. ఇదే సమయంలో మీకు ఉన్న ఇతర సమస్యలు అంటే... శారీరక వ్యవస్థలకు సంబంధించినవి - కీళ్లనొప్పులు, వ్యాధినిరోధకశక్తికి సంబంధించిన సమస్యలు ఉన్నాయా అని నిర్ధారణ చేయడానికి తగిన పరీక్షలను సూచిస్తారు. నా వయసు 45 ఏళ్లు. నాకు కుడి చేయి విపరీతంగా లాగుతోంది. నా చేయి నిస్సత్తువ అయిపోయినట్లుగా ఉంది. మెడ దగ్గర నొప్పి వస్తోంది. కళ్లు తిరుగుతూ ఉన్నాయి. కిందపడిపోయినట్లుగా అనిపిస్తోంది. గత మూడు నెలలుగా ఈ నొప్పి ఇలాగే ఉంది. అప్పుడప్పుడూ నొప్పి నివారణ మందులు వాడుతున్నాను. మందులు వాడినప్పుడు నొప్పి తగ్గి మళ్లీ వస్తోంది. నాకు తగిన పరిష్కారం చూపించండి. - కామేశ్వరరావు, భద్రాచలం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే బహుశా సర్వికల్ స్పాండిలైటిస్ కారణంగా వెన్నెముక అరిగి, అది మీ నరంపై ఒత్తిడి పడి మీకు నొప్పి వస్తుండవచ్చు. మీరు బీటాహిస్టిన్, గాబాంటిన్, మిథైల్ కోబాలమైన్ వంటి మందులను డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. మెడకు సంబంధించిన వ్యాయామాలు తెలుసుకొని, వాటిని చేయాలి. దాంతో మెడకండరాలు బలపడి నొప్పి తగ్గేందుకు అవకాశం ఉంది. డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కన్సల్టెంట్ - ఇంటర్నల్ మెడిసిన్ అండ్ డయాబెటిస్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఇంట్లోనే డయాలసిస్... సీఏపీడీ
హోమియో కౌన్సెలింగ్ 1. మా బాబుకు మూడేళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో మంచి చికిత్స సూచించండి. - సునయన, నెల్లూరు ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో ఎన్నో స్థాయులు, వివిధ లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలో లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లలు తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం, నలుగురిలో కలవడలేకపోవడం, ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలను బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు గమనించి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా గరిష్ఠ స్థాయికి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎఎమ్ రెడ్డి,పాజిటివ్ హోమియోపతి 2. లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ నేను ఇటీవల బాగా అలసిపోతున్నాను. నడుము నొప్పి కూడా వస్తోంది. మాది ఎనిమిది గంటల షిఫ్ట్. నేను డబుల్ డ్యూటీలు చేస్తుంటాను. వరసగా రెండో షిఫ్ట్ కూడా పనిచేయడం వల్ల ఇలా జరుగుతోందా? ఈ అలసట అధిగమించడానికి మార్గాలు చెప్పండి. - మస్తాన్‌రావు, హైదరాబాద్ మీలా డబుల్ షిఫ్ట్ పనిచేసేవారిలో తీవ్రమైన అలసట, బాగా ఒత్తిడికి లోనైనట్లు అనిపించడం చాలా సాధారణం. పన్నెండు గంటల కంటే ఎక్కువసేపు ఏకధాటిగా (ఒకే స్ట్రెచ్‌లో) పనిచేసేవారిలో మీలా వృత్తిపరమైన అలసట వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇలా పనిచేసేవారిలో తీవ్రమైన అలసటతో పాటు కండరాల నొప్పులు, నడుమునొప్పితో పాటు చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర వృత్తిసంబంధ సమస్యలూ రావచ్చు. మీలాంటి వారు అలసటతో పాటు, వృత్తిసంబంధమైన ఇతర సమస్యలను నివారించేందుకు ఈ సూచనలు పాటించండి. * పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. సిగరెట్ పొగలో కార్బన్‌మోనాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అది రక్తకణాల్లోని ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గించి, వెంటనే అలసిపోయేలా చేస్తుంది. *చాలాసేపు కూర్చొని పనిచేసేవారైతే, శరీరానికి కదలికలు ఉండేలా తప్పనిసరిగా వ్యాయామం చేయండి. అదేపనిగా కూర్చోవడం వల్ల కూడా అలసిపోతారు. *మీ ఉద్యోగంలో ఏదైనా సమస్యలు, మీరు లక్ష్యాలను అధిగమించాల్సిన (టార్గెట్స్ రీచ్ కావాల్సిన) వృత్తిలో ఉన్నా అలసటకు లోనవుతారు. మీ సమస్యలను మీవెంట ఇంటికి మోసుకెళ్లకండి. * తగినంతగా నిద్రపొండి. కనీసం రోజూ ఎనిమిదిగంటల పాటు నిద్రపోవాలి. *మీరు పనిచేసే చోట కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే, రోజూ రెండు కప్పుల పరిమితికి మించి తాగకండి. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికివెళ్లే సమయంలో కాఫీ అస్సలు తాగవద్దు. *రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని అధిగమించండి. * భోజనవేళలను కచ్చితంగా పాటించండి. భోజనం ఎగొట్టి పనిచేయకండి. ఇలా చేస్తే రక్తంలో చక్కెరపాళ్లు తగ్గిపోయి త్వరగా, తేలిగ్గా అలసిపోతారు. *ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల మీరు డీ-హైడ్రేషన్‌కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేయగలుగుతారు. ఈ సూచనలు పాటించాక కూడా మీరు ఇంకా అలసటతోనూ, నడుంనొప్పితో బాధపడుతుంటే డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్,సికింద్రాబాద్ 3. నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్నాను. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. నేను ఉండే ఊళ్లో డయాలసిస్ సెంటర్ లేదు. డయాలసిస్ కాకుండా వేరే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? - షణ్ముఖరావు, ఆత్మకూరు ఇలా వారంలో మూడు సార్లు డయాలసిస్ చేయించాల్సిన వ్యక్తుల్లో కిడ్నీ మార్పిడి మంచి చికిత్స. అయితే ఇది అందరికీ సాధ్యపడే అంశం కాదు. మాటిమాటికీ హాస్పిటల్‌కు వెళ్లేందుకు అనువుగా లేనివారు, ఇంట్లోనే డయాలసిస్ చేసు కునే ప్రక్రియను కంటిన్యువస్ ఆంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్ (సీఏపీడీ) మెషిన్‌ను వాడటం మంచిది. ఇది చాలా సులువైన ప్రక్రియ. డయాలసిస్ పూర్తయ్యాక మామూలుగా తమ వృత్తులూ చేసుకోవచ్చు. దీనివల్ల జీవననాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) కూడా బాగా మెరుగవుతుంది. ఇలా డయాలసిస్ చేసుకునే వారికి బీపీతో పాటు ఇతర మందులు చాలా తక్కువగా అవసరం పడతాయి. నా వయసు 32 ఏళ్లు. తరచుగా జ్వరం. మూత్రవిసర్జన సమయంలో విపరీతమైన మంట కూడా ఉంటోంది. ఇలా తరచూ జ్వరం, మూత్రంలో మంట వస్తున్నాయి. ఇలా మాటిమాటికీ జ్వరం రాకుండా ఉండేందుకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? - మాలతి, జగ్గయ్యపేట మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్’తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా మీకు మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తున్న కారణం ఏమిటన్నది తెలుసుకోవాలి. మీకు షుగర్ ఉంటే కూడా ఇలా మాటిమాటికీ యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఒకసారి మీరు షుగర్ టెస్ట్ చేయించుకోండి. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లుగానీ, మూత్రనాళాల్లో వాపుగానీ ఉన్నాయేమో చూడాలి. మీకు డాక్టర్ ఇచ్చిన యాంటీబయాటిక్ పూర్తి కోర్సు వాడకుండా ఉన్నా కూడా మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్స్ తిరగబెట్టవచ్చు. మీకు ఏ కారణం లేకుండా ఇన్ఫెక్షన్ వస్తుంటే కనీసం మూడు నెలల పాటు యాంటీబయాటిక్స్ వాడాలి. రోజూ నీళ్లు ఎక్కువగా (అంటే రెండు నుంచి మూడు లీటర్లు) తాగాలి. మూత్రం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోకుండా, వెంటనే మూత్రవిసర్జనకు వెళ్లాలి. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
మీటింగ్స్‌లోనూ నిద్రపోతున్నారా?
హోమియో కౌన్సెలింగ్ నాకు 28 ఏళ్లు. మా వారికి 34 ఏళ్లు. మా పెళ్లయి నాలుగేళ్లయింది. ఇంతవ రకూ సంతానం కలగలేదు. మాకెంతో నిరాశగా ఉంది. సంతాన లేమికి హోమియోలో మందులు ఏమైనా ఉంటే సూచించగలరు. - హైమ, ఆదోని సంతానలేమి సమస్య స్త్రీ పురుషులిరువురిలోనూ 30 శాతం వరకు కొద్దిపాటి లోపాల వల్ల ఏర్పడుతుంది. మగవారిలో సంతానలేమికి కారణాలు శుక్రకణాలు లేకపోవడం లేదా శుక్రకణాల ఉత్పత్తి జరగకపోవడం, శుక్రకణాలు ఉత్పత్తి అయినప్పుడు వాటి కదలికలు సాధారణంగా లేకపోవడం, శుక్రకణాల నిర్మాణంలో తేడాలు, హైడ్రోసీల్ లేదా వెరికోసీల్ వల్ల శుక్రకణాలు దెబ్బతిని సంతానలేమికి కారణం కావచ్చు. స్త్రీలలో సంతానలేమికి కారణాలు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, గర్భసంచీ చిన్నగా ఉండటం, అసలు గర్భసంచి లేకపోవడం, గర్భసంచి రెండు గదులుగా ఉండటం, ఫెలోపియన్ ట్యూబ్స్ లేకపోవడం లేదా ట్యూబ్స్ మూసుకుపోవడం, అండాశయంలో ఎదుగుదల లేకపోవడం, యోనిమార్గం చిన్నదిగా ఉండటం లేదా మూసుకుపోవడం, వీటితోపాటు థైరాయిడ్ సమస్యలు, పి.సి.ఒ.డి, ఎఫ్.ఎస్.హెచ్, ఎల్.హెచ్, ప్రొలాక్టిన్ హార్మోన్ల అసమతుల్యత, రుతుక్రమంలో అపసవ్యతలు, ఎండోమెట్రియాసిస్, గర్భసంచిలో కణుతులు ఏర్పడి ఫెలోపియన్ ట్యూబ్స్‌కు అడ్డుపడటం వల్ల సంతానలేమి ఏర్పడుతుంది. నిర్ధారణ: మగవారిలో: సీబీపీ, ఇ.ఎస్.ఆర్, సీయూఈ, ఎఫ్.ఎస్.హెచ్, ఎల్.హెచ్, థైరాయిడ్ ప్రొఫైల్, యూ.ఎస్.ఎస్. అబ్డామిన్, యూ.ఎస్.జి. స్క్రోటమ్, కంప్లీట్ సెమెన్ ఎనాలిసిస్, సీరమ్ టెస్టోస్టీరాన్, థైరాయిడ్ ప్రొఫైల్, ఎఫ్.ఎస్.హెచ్, ఎల్. టెస్టిక్యూలార్ బయాప్సీ. ఆడవారిలో: సీబీపీ, ఇ.ఎస్.ఆర్, సీయూఈ, హెచ్.ఎస్.జి, లాప్రోస్కోపీ, థైరాయిడ్ ప్రొఫైల్, సీరం ప్రోలాక్టిన్, ఫాలిక్యులార్ స్టడీ హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యం: సంతానలేమికి హోమియోపతిలో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా స్త్రీ పురుషులలో లోపాలను సరిచేస్తూ శాశ్వత పరిష్కారం అందించటమే కాకుండా రెండవ మూడవ సంతానానికి మార్గం సుగమం చేస్తుంది. వైద్యవిధానం ద్వారా 50-60 శాతం వరకు సత్ఫలితాలను అందుకోవచ్చు. న్యూరో కౌన్సెలింగ్ నా భర్త వయసు 50. ఇటీవల ఆయనకు మెదడులో కణితి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అది పరిమాణంలో చాలా పెద్దగా ఉండి, అత్యంత సున్నితమైన భాగంలో ఉందని డాక్టర్ చెప్పారు. న్యూరోనావిగేషన్ విధానంలో శస్త్రచికిత్స చేయాలని అంటున్నారు. న్యూరోనావిగేషన్ అంటే ఏమిటి? ఆపరేషన్ అంటే మాకు చాలా ఆందోళనగా ఉంది. మీరిచ్చే సలహాపైనే మా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. - ప్రభావతి, నిజామాబాద్ మీరు తెలిపిన వివరాలను బట్టి మీ భర్తకు అత్యంత కీలకమైన భాగంలో పెద్ద కణితి ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూరోనావిగేషన్ ద్వారా శస్త్రచికిత్స చేయడం రోగికి ఎంతో ఊపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల రోగికి భవిష్యత్తులో ఎదురయ్యే దుష్ర్పభావాలు తగ్గుతాయి. మెదడులోని భాగాలను 3-డీ ఇమేజ్‌లో చూస్తే సరిగ్గా కణితి ఎక్కడ ఉందో నిర్ధారణ చేసుకొని, అక్కడికి మాత్రమే చేరేందుకు అధునాతనమైన ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. మీ భర్తకు మెదడులోని అత్యంత సున్నితమైన భాగంలో, పెద్ద పరిమాణంలో కణితి ఉన్నందున ఈ ప్రక్రియ ద్వారా శస్త్రచికిత్స చేయడమే ఉత్తమం. ఈ విధానంలో మిగతా మెదడు భాగాలు దెబ్బతినకుండా శస్త్రచికిత్స చేయడానికి వీలువుతుంది. తక్కువ కోతతో శస్త్రచికిత్స చేయడం వల్ల నొప్పి కూడా తక్కువగా ఉండటంతో పాటు, రోగి కోలుకునే వ్యవధి కూడా తక్కువ. బ్రెయిన్ ఆపరేషన్స్ చేసే సమయంలో వైద్యులు శస్త్రచికిత్స వల్ల ఎదురయ్యే రిస్క్‌లను అంచనావేసి, రోగి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. అలాంటప్పుడు అత్యంత సున్నితమైన భాగాల్లో శస్త్ర చికిత్స చేసే సమయంలో రోగి సురక్షితంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. న్యూరోనావిగేషన్ ప్రక్రియ వల్ల మెదడు లోపలి భాగాలను స్పష్టంగా చూడటం సాధ్యమవుతుంది. కాబట్టి క్లిష్టమైన ప్రాంతాలకు సర్జన్ తేలిగ్గా చేరేందుకు అవకాశం ఉండటం వల్ల న్యూరో నావిగేషన్ విధానంలో సర్జరీ అంటే మీరు గానీ, మీ భర్తగానీ అందోళన పడాల్సిన అవసరం లేదు. పైగా న్యూరోనావిగేషన్ ప్రక్రియను అనుసరించడం వల్ల కలిగే ఫలితాలు మరింత మెరుగ్గానూ ఉంటాయి. స్లీప్ కౌన్సెలింగ్ నా వయసు 35. సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నా నిద్రపై నాకు ఎలాంటి నియంత్రణా ఉండటం లేదు. మీటింగ్స్‌లో ఉంటున్నప్పుడూ, తింటున్నప్పుడు కూడా నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతున్నాను. దీనివల్ల నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం చూపండి. - నవీన్, హైదరాబాద్ మీరు చెబుతున్న దాన్ని బట్టి మీరు నార్కొలెప్సీ అనే నిద్ర సంబంధమైన రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నార్కొలెప్సీ అనే సమస్యలో నిద్ర, మెలకువ రావడం... ఈ రెండూ ప్రభావితమవుతాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు పగటివేళ కూడా నిద్రలోకి జారిపోతుంటారు. ఏ పని చేస్తున్నా ఆ సమయంలో తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. సాధారణంగా నిద్రలో దశలు కొన్ని సైకిల్స్‌లో నడుస్తుంటాయి. అంటే ప్రారంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కదిలే దశ... ఇలాగ. కనుపాపలు వేగంగా కదిలే దశను ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఆర్ఈఎమ్ నిద్ర దశ వేగంగా వచ్చేస్తుంది. ఈ ఆర్ఈఎమ్ దశలోనే మనకు కలలు వస్తుంటాయి. ఈ దశలో కనుపాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలు పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి. నార్కొలెప్సీ సాధారణంగా 15 నుంచి 25 ఏళ్ల వయసులో మొదలవుతుంది. అయితే అది ఏ వయసువారిలోనైనా కనిపించే అవకాశం ఉంది. నార్కొలెప్సీ ఎందుకు వస్తుందనే అంశం ఇంకా తెలియదు. ఇది జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి పిల్లల్లో ఇది కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. మరికొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నదాని ప్రకారం మెదడులోని హైపోక్రెటిన్ అనే రసాయన లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో ఆర్ఈఎమ్ దశకు సంబంధించిన సైకిల్‌ను కొనసాగించే మెదడులోపాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ లోపాల వల్లనే మెలకువగా ఉండగానే అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే లక్షణాలు కనిపిస్తాయని వారి పరిశోధనల్లో తేలింది. అయితే నాడీవ్యవస్థకు చెందిన ఒకటి కంటే ఎక్కువ అంశాలు నార్కొలెప్సీని కలగజేస్తాయని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిపోతాయి. మాటకూడా ముద్దముద్దగా వస్తుంది. బాధితులు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. దీనికి పూర్తిగా చికిత్స లేకపోయినా కొన్ని యాంటీ డిప్రసెంట్స్, యాంఫిటమైన్ మందులతో చికిత్స చేయవచ్చు. -
వినికిడి తగ్గిందా? బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 34 ఏళ్లు. నాకు తరచు గొంతునొప్పి వస్తూ, మింగడం కష్టం అవుతోంది. ఈ సమస్యతో ఫంక్షన్లకు వెళ్లాలంటేనే భయం వేస్తోంది. బయట ఎక్కడైనా గుక్కెడు మంచినీళ్లు తాగితే చాలు... తిప్పలు తప్పట్లేదు. దీనికి హోమియోపతిలో పరిష్కారం ఉంటే చెప్పగలరు. - కాంచన, నెల్లూరు గొంతులో తీవ్రమైన నొప్పి, దురద, అసౌకర్యం... ఈ సమస్యకు ఇంచుమించు అందరూ బాధితులే. సాధార ణంగా ఫారింజైటిస్ అంటే ముక్కు, గొంతు వెనుక ఉన్న ఒక ప్రాంతం, నోరు వెనుకభాగంలో ఉండే పల్చటి పొరలో వాపు రావడం గొంతునొప్పికి ప్రథమ లక్షణం. సమస్య ఉదయం తీవ్రంగా ఉండి, పొద్దుపోయేకొద్దీ తగ్గుతుంటుంది. ఇది ప్రాథమిక దశలోనే తగ్గవచ్చు లేదా తీవ్రం కావచ్చు. ఫారింజైటిస్ మూలంగా గొంతునొప్పి తీవ్రమై, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏ మాత్రం తగ్గకపోవచ్చు. అది వారానికి, రెండువారాలకు పైగా గొంతు బొంగురుపోయి ఉన్నప్పుడు, జ్వరం 101 డిగ్రీలకన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, తెమడలో రక్తం కనిపిస్తూ, మింగడంలో గానీ, శ్వాస తీసుకోవడంలోగానీ ఇబ్బంది అనిపించవచ్చు. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు దీనికి కారణం కావచ్చు. అలాగే నోరు సరిగా తెరుచుకోకపోడం, చెవినొప్పి, వికారం లేదా వాంతులు కావడం, తీవ్రమైన నీరసం, మెడవద్ద ఉండే లింఫ్ నోడ్స్ పెద్దవిగా కావడం, టాన్సిల్స్ మీద తెల్లని మచ్చలు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపించినప్పుడు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. జాగ్రత్తలు: గొంతు సమస్యలు మొదలైనప్పుడు ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో నోరు పుక్కిలించాలి. గొంతుకు విశ్రాంతినివ్వాలి. ద్రవపదార్థాలు తీసుకోవాలి. గొంతు తడి ఆరకుండా చూసుకోవాలి. మసాలా తగ్గించాలి. మద్యం అలవాటుంటే మానాలి. హోమియో చికిత్స బెల్లడోనా: తీవ్రమైన గొంతునొప్పి, టాన్సిల్స్ వాపు, మంట, దీనితోపాటు జ్వరం, గొంతునొప్పి. గొంతు పొడిబారినట్టుగా ఉండి ద్రవాలు తీసుకోవడానికి ఇష్టపడరు. మెర్క్‌సాల్: వాతావరణం మారితే గొంతునొప్పి, నోటిలో పొక్కులు, గొంతు అల్సర్స్, గొంతు మొద్దుబారినట్లుగా ఉండి, గొంతులో తీవ్రమైన మంట ఉంటుంది ఫైటోలెక్కా: ముక్కు ఎర్రబారడం, టాన్సిల్స్ వాచడం, కాళ్లూ చేతులూ లాగ డం, శ్లేష్మం, నోరుదుర్వాసన వంటి లక్షణాలున్నప్పుడు. కాలిమూర్: గొంతుభాగంలో గోధుమరంగు చిన్నచిన్న మచ్చలు, దీర్ఘకాలిక గొంతునొప్పి ఉన్నప్పుడు. ఇంకా లాకసిస్, లైకోపొడియా, వైతియా అనే మందులు డాక్టర్ పర్యవేక్షణలో వాడవలసి ఉంటుంది. జనరల్హెల్త్ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. నాకు మొదటి నుంచి అసిడిటీ సమస్య ఉంది. ఇటీవల ఒళ్లంతా తీవ్రమైన నొప్పులు రావడంతో డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుతున్నాను. ఒకటి రెండుసార్లు పెయిన్ కిల్లర్స్ వాడాను. అవి వాడినప్పటి నుంచి కడుపులో మంట మరింతగా పెరుగుతోంది. నాకు పరిష్కారాన్ని సూచించండి. - మనోహర్, కడప కొన్ని నొప్పి నివారణ మందుల వల్ల... ముఖ్యంగా ఎన్ఎస్ఏఐడి గ్రూపునకు చెందిన బ్రూఫెన్, డైక్లోఫెనాక్, నాప్రోక్సెన్ వంటి వాటివల్ల అసిడిటీ, గుండెలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేని మందులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకసారి మీ డాక్టర్‌ను సంప్రదించి మీకు మందులతో వస్తున్న సైడ్ఎఫెక్ట్స్ గురించి వివరించండి. డాక్టర్ మందులు మార్చి ఇస్తే మీ సమస్య తీరుతుంది. కాకపోతే మీకు ఒళ్లునొప్పులు రావడానికి గల కారణాలను కూడా తెలుసుకొని, దానికీ చికిత్స అందించడం అవసరం. కాబట్టి ఒకసారి ఫిజీషియన్‌ను సంప్రదించండి. నా వయస్సు 64 ఏళ్లు. నాకు గత పదేళ్లుగా షుగర్, బీపీ ఉన్నాయి. ఈమధ్య ముఖం బాగా ఉబ్బింది. కాళ్లపై కూడా వాపు కనిపిస్తోంది. దాంతోపాటు పొట్ట నొప్పి కూడా వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేసి మూత్రపిండాల్లో సమస్య ఉందన్నారు. కిడ్నీలు ముప్ఫయి శాతం దెబ్బతిన్నాయని చెప్పారు. నష్టపోయిన దాన్ని మళ్లీ బాగు చేయలేమని కూడా చెప్పారు. నాకు వచ్చిన సమస్య ఏమిటి? నా మూత్రపిండాలు మిగతా 70 శాతం చెడిపోకుండా ఉండాలంటే నేనేం చేయాలి. - ఓంకార్‌నాథ్, విజయనగరం షుగర్, బీపీ సమస్యలు ఉన్నవారిలో వాటిని నియంత్రించుకోకపోతే, కొంతకాలం తర్వాత మూత్రపిండాలపై వాటి దుష్ర్పభావం పడి అవి దెబ్బతినడం చాలామందిలో కనిపించే పరిణామమే. దీనికి డయాబెటిక్ నెఫ్రోపతి లేదా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) లేదా కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ (సీసీఎఫ్) కారణాలు కావచ్చు. అందువల్లనే బీపీ, షుగర్... ఈ రెండు సమస్యలూ ఉన్నవారు ఏడాదికి ఒక్కసారైనా వాటికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని చికిత్సలో తగు మార్పులు (అంటే... మందులు, వాటి మోతాదుల్లో మార్పులు) చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బహుశా మీరు ఈ పరీక్షలు తరచూ చేయించకపోవడం వల్లనో లేదా మీకు ఈ సమస్యల దుష్ర్పభావాల ఫలితాలపై తగినంత అవగాహన లేకపోవడం వల్లనో ఇప్పటికే ముప్పయి శాతం డ్యామేజీ జరిగిపోయి ఉంవడచ్చు. ఇంకా ఆరోగ్యపరంగా మరింత నష్టం వాటిల్లకుండా ఉండటం కోసం మీరు మీ బీపీ, షుగర్లను అదుపులో పెట్టుకోవడం, వైద్యులను తరచూ సంప్రదిస్తూ క్రమం తప్పకుండా సంప్రదించడం అవసరం. మీరు ఇకపై తరచూ మీ ఫిజీషియన్‌ను తప్పక సంప్రదిస్తూ ఉండండి. రేడియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 57 ఏళ్లు. ఇటీవల వినికిడి శక్తి బాగా తగ్గింది. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు చేయించి, న్యూరోసర్జన్‌ను సంప్రదించమని చెప్పారు. వినికిడి సామర్థ్యానికీ, మెదడుకూ సంబంధం ఏమిటి? డాక్టర్ ఆపరేషన్ అవసరం అంటున్నారు. నాకు శస్త్రచికిత్స అంటే భయం. దాని అవసరం లేకుండా చికిత్స చేయడం సాధ్యం కాదా? దయచేసి వివరంగా చెప్పండి. - శ్యామలరావు, అనకాపల్లి మీరు చెప్పిన లక్షణాలను బట్టి మెదడులోని కణుతుల పరిమాణం బాగా పెరగడం వల్ల వినికిడి శక్తి తగ్గిందని అనుకోవచ్చు. కొందరిలో కొన్నిసార్లు మెదడులో కణుతులు పెరుగుతాయి. వీటిని బ్రెయిన్ట్యూమర్స్ అంటారు. వీటిలో చాలా రకాలు ఉంటాయి. అయితే ప్రాథమికంగా వీటిని హానిచేయనివి (బినైన్), హానికరమైనవి (మాలిగ్నెంట్) అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. మెదడులో సాధారణంగా వచ్చే కణుతుల్లో దాదాపు వంద రకాలకు పైగా ఉన్నప్పటికీ గ్లయోమా, మినింజియోమా ఆకాస్టిక్ న్యూరోమా అనేవి ప్రధానమైనవి. ఇందులో మినింజియోమా కణుతులు హానిచేసేవి కావు. అయితే అవి మెదడు పైపొరల నుంచి గానీ, లేదా అడుగు భాగం నుంచి గానీ పుట్టుకొస్తాయి. వినికిడి శక్తి తగ్గడానికీ, మెదడు కణుతుల పెరుగుదలకూ సంబంధం ఉంది. చెవి వెలుపల నుంచి వచ్చే శబ్దతరంగాలను చెవిలోపలి శ్రవణనాడి మెదడుకు మోసుకుపోతుంది. ఈ శ్రవణనాడిని ఆలంబన చేసుకొని పెరిగే ట్యూమర్‌నే అకాస్టిక్ న్యూరోమా లేదా ష్వానోమా అంటారు. ఇది పెరుగుతున్నప్పుడు ముఖానికి సంబంధించిన ఫేషియల్ నాడితో పాటు ట్రైజెమినల్ నాడిపై ఒత్తిడి పెరుగుతుంది. అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఏర్పడితే ట్యూమర్ వల్ల కలిగే ఒత్తిడితో పరిసరాల్లోని నాడులు ప్రభావితమై వినికిడి శక్తి సన్నగిల్లుతుంది. దాంతోపాటు నోరు ఒంకరపోవడం, తూలిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. లక్షణాలు కనిపించేవారకూ చాలామందిలో మెదడులో ట్యూమర్ ఉందన్న విషయం బయటపడకపోవచ్చు. అయితే వినికిడిశక్తి తగ్గడంతో ఈఎన్టీ నిపుణుల వద్దకు వెళ్లినప్పుడు వారు చేయించే ఎమ్మారై స్కాన్ల వల్ల ఇటీవల చిన్నసైజు ట్యూమర్లూ తెలుస్తున్నాయి. వారు అకాస్టిక్ న్యూరోమాను అనుమానించినప్పుడు సంబంధిత పరీక్షలు చేయిస్తారు. ఇప్పుడు శస్త్రచికిత్స అవసరం లేకుండానే రేడియేషన్ చికిత్స ద్వారా 3 సెం.మీ. వరకు ఉన్న మెదడు ట్యూమర్లను కరిగించవచ్చు. మీరు ఆపరేషన్ గురించి ఆందోళన పడకుండా న్యూరోసర్జన్‌ను కలవండి. -
గుండె పోటు కంటే కాలి పోటు ప్రమాదమా?
హోమియో కౌన్సెలింగ్ మా బాబుకు ఆరేళ్లు. వాడికి తరచు జలుబు చేస్తోంది. వర్షాకాలం వస్తే చాలు... టాన్సిల్స్ వాచి, ఆహారం తీసుకోవడం కష్టంగా ఉంటోంది. డాక్టర్‌కు చూపిస్తే, ఇంకొంతకాలం తర్వాత ఆపరేషన్ ద్రావా తొలగించాలన్నారు. కొందరేమో టాన్సిల్స్ తొలగించడం అంత మంచిది కాదంటున్నారు. ఏం చేయాలో తెలియక మాకు ఆందోళనగా ఉంది. దయచేసి మా బాబు సమస్య పూర్తిగా తొలగేందుకు తగిన సలహా ఇవ్వగలరు. - డి.కల్యాణి, కొలనుకొండ టాన్సిలైటిస్ అంటే కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే ఇన్ఫ్లమేటరీ మార్పులు. ముఖ్యంగా టాన్సిల్స్‌లో చీము పట్టడం, నొిప్పి, వాపు లాంటి లక్షణాలతో బాధపడుతున్న స్థితిని టాన్సిలైటిస్ అంటారు. టాన్సిల్స్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. పిల్లల్లో తరచు వాస్తుంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ ఇవి క్షీణిస్తూ ఉంటాయి. టాన్సిల్స్ లింఫాయిడ్ టిష్యూ సముదాయం. పిల్లలో టాన్సిల్స్ దేహ రక్షణకు ఉపయోగపడతాయి. టాన్సిల్స్‌కు ఏ కారణం చేతనైనా చీము పడితే, అవి దేహాన్ని రక్షించే విధులను నిర్వర్తించకపోగా, చీము, రక్తనాళాల ద్వారా శరీరంలోని ఇతర అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకి, అది ఇతర రకాల వ్యాధులకు కారణమవుతుంది. వీటిని సకాలంలో గుర్తించి, తగిన చికిత్స చేయకపోతే వ్యాధి ముదిరి దీర్ఘకాల సమస్యగా మిగిలిపోతుంది. కారణాలు: అపరిశుభ్ర వాతావరణం, కిక్కిరిసిన పరిసరాలు, దుమ్ము, ధూళి ద్వారా, ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు గాలి ద్వారా, ఉమ్ము తుంపర్ల ద్వారా బ్యాక్టీరియా, వైరస్లు ఒకరినుండి ఇంకొకరికి వ్యాపిస్తాయి. చిన్నవయసు వారిలో ఎక్కువగా జరుగుతుంది. లక్షణాలు: గొంతునొప్పి, ఆహారం మిగడంలో కష్టం, 102 నుండి 103 డిగ్రీల జ్వరం, ఒళ్లునొప్పులు, చెవినొప్పి, మలబద్ధకం, అక్యూట్ టాన్సిలైటిస్‌లో జ్వర తీవ్రత ఎక్కువగా అయి, దవడ కింద బిళ్లలు నొప్పిగా ఉంటాయి. హెచ్చరిక: కొందరిలో టాన్సిలైటిస్ ప్రమాదకరం కూడా కావచ్చు. టాన్సిల్స్ పొరలో చీముగడ్డ ఏర్పడుతుంది. దానిని పెరిటాన్సిలర్ ఏబ్సెస్ అంటారు. ఇది అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదకరం. వీటిలో తీవ్రజ్వరం, ఉమ్మి కూడా మింగలేరు. ముద్దగా మాట్లాడుతూ తీవ్రమైన చెవిపోటుతో రోగి చాలా బాధపడతాయి. ఇది గొంతుకు ఒకవైపునే వస్తుంది. రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు: పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం, నీరు ఇవ్వాలి. ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలి. తరచు గొంతునొప్పి, జ్వరం వస్తూ ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి. హోమియో వైద్యవిధానం: టాన్సిలైటిస్ వ్యాధికి సంబంధించి పాజిటివ్ హోమియోపతిలో చాలా అద్భుతమైన చికిత్స ఉంది. ముఖ్యంగా పిల్లల్లో తరచు వచ్చే ఈ వ్యాధిని హోమియో మందుల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతూ, బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లని పూర్తిగా నియంత్రిస్తూ నివారిస్తూ పిల్లల్లో ఎటువంటి దుష్ర్పభావాలూ లేకుండా కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ అనే ప్రత్యేక పద్ధతి ద్వారా మందులను ఎంపిక చేసి చికిత్స చేస్తే వ్యాధి పూర్తిగా నయం అవటమే కాకుండా మున్ముందు వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా అరికట్టవచ్చు. పిల్లలు ఈ మందులను స్వీకరించడం కూడా చాలా సులభం. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. నేను నిద్రపోయే సమయంలో ఛాతీకింద ఎడమవైపున గత వారం రోజులుగా నొప్పి వస్తోంది. డాక్టర్గారిని సంప్రదిస్తే లివర్ సైజు పెరిగిందని చెప్పారు. లివర్సైజు ఎందుకు పెరిగింది తెలియజేయగలరు. - విజయ్, నిడదవోలు మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీకు లివర్ సైజు పెరిగిందని చెప్పవచ్చు. దీనికి వివిధ కారణాలు ఉండవచ్చు. అవి...ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునే వారిలో, స్థూలకాయం ఉన్నవారిలో లివర్‌లో కొవ్వు పేరుకుపోయి, దాని సైజు పెరిగే అవకాశం ఉంది. మీరు స్థూలకాయులా లేదా ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉందా అన్న అంశాలు మీరు తెలియజేయలేదు. కొన్ని రకాల వైరల్ ఇన్షెక్షన్స్... హెపటైటిస్-బి, హెపటైటిస్-సి అనే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ సైజు పెరిగే అవకాశం ఉంది. అయితే మీరు పంపిన రిపోర్టులలో అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి కాబట్టి మీకు ఆ ఇన్ఫెక్షన్లు ఉండే అవకాశం తక్కువ. ముందుగా మీరు లివర్ ఎంత సైజ్‌కు పెరిగిందన్న అంశాన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా తెలుసుకోవాలి.మీకు వస్తున్న నొప్పి ఎడమవైపున ఛాతీ కింది భాగంలో కాబట్టి ఒకసారి ఎండోస్కోపీ చేయించాలి.పై రెండు పరీక్షల వల్ల మీ లివర్ సైజు పెరగడానికి, కడుపునొప్పికీ కారణం తెలిసే అవకాశం ఉంది. దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. వాస్క్యులార్ డిసీజ్ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. నాకు పదిహేనేళ్ల క్రితం ఎడమరొమ్ము తొలగించారు. గత నెల నుంచి కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. ఆకలి తగ్గింది. కడుపులో నొప్పి వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - ఒక సోదరి, మహబూబాబాద్ మీరు రాసిన విషయాన్ని బట్టి మీకు రొమ్ముక్యాన్సర్ వచ్చినందున రొమ్ము తొలగించి ఉంటారని తెలుస్తోంది. ప్రస్తుతం కామెర్లు ఉన్నాయి కాబట్టి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవి... గతంలో ఉన్న రొమ్ము క్యాన్సర్ ప్రభావం ఏదైనా లివర్పైన పడిందా అనే విషయాన్ని పరిశీలించాలి. అలాగే ఇతర వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా సోకాయా, ఏవైనా మందులు వాడుతుంటే వాటి ప్రభావం కాలేయం మీద పడి ఈ పరిణామం సంభవించిందా అని పరీక్షించాలి. మీరు ముందుగా అల్ట్రాసౌండ్ స్కాసింగ్ (లివర్)తో పాటు లివర్‌కు చెందిన రక్తపరీక్ష చేయించుకోండి. ఒకవేళ క్యాన్సర్ ప్రభావం కాలేయంపై కూడా పడి ఉంటే, దాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు. మీరు ముందుగా పైన పేర్కొన్న పరీక్షలు చేయించి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 56 ఏళ్లు. నేను నడుస్తున్నప్పుడు కాలునొప్పిగా ఉంటోంది. పిక్కలు, తొడలు, తుంటి భాగంలోనూ నొప్పిగా ఉంటోంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు వచ్చే నొప్పి, ఆగిన వెంటనే తగ్గుతోంది. నొప్పి సన్నగా, తిమ్మిరి ఎక్కినట్లుగా ఉంటోంది. కాళ్ల కండరాలు అలసిపోయినట్లుగా, పిరుదులూ నొపిగా అనిపిస్తున్నాయి. నా సమస్యకు కారణం ఏమిటో తెలపండి. - జె. రాధాకృష్ణమూర్తి, కొత్తగూడెం మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు కాలిలోని రక్తనాళాలు పూడిపోయినట్లుగా అనిపిస్తోంది. గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళాలు బ్లాక్ అయిన గుండెపోటు వచ్చినట్లే... కాలిలోనూ అదే పరిణామం సంభవించే అవకాశం ఉంది. గుండెపోటులో ఉంటే ప్రమాదం లాగే ఈ లెగ్ అటాక్స్ ప్రమాదకరం. కాలిపైన ఎంతకూ నయంకాని అల్సర్స్ వచ్చి, చివరకు కాలు తీసేయాల్సిన పరిస్థితి దారితీయవచ్చు. లెగ్ అటాక్స్‌లో ఉన్న మరో ప్రమాదకరమైన అంశం... వీటిని చివరిదశ వరకూ గుర్తించడం కష్టం. అంతకుమించి ఈ వ్యాధి గురించి సాధారణ ప్రజల్లో అవగాహన చాలా తక్కువ. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు, 50 ఏళ్లు పైబడిన వారు, స్థూలకాయులు, రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు, పొగతాగే వారు ఈ లెగ్ అటాక్స్ గురయ్యే అవకాశాలు ఎక్కువ. మీరు పేర్కొన్న లక్షణాలతో పాటు కాళ్లు లేదా పాదాలు క్రమంగా పాలిపోయినట్లుగా ఉండటం, కాళ్లు నీలిరంగులోకి లేదా ముదురు ఎరుపు రంగులోకి మారడం వంటివీ చోటుచేసుకుంటాయి. నడవకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా మీ లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు గ్రహించాలి. ఈ రక్తనాళాల జబ్బును నిర్ధారణ చేయడానికి యాంజియోగ్రామ్ బాగా ఉపయోగపడుతుంది. అయితే నిర్ధారణలో మరింత కచ్చితత్వం కోసం అల్ట్రాసోనోగ్రఫీ, ఎమ్మారైలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలా కాలి రక్తనాళాల్లో పూడిక పేరుకుందని తెలిసినప్పుడు ప్రాథమిక దశలో సరైన మందులు, జీవనశైలిలో మార్పుల ద్వారా దీనికి చికిత్స చేస్తారు. దీనికి ఎంత త్వరగా చికిత్స చేయిస్తే అంత మంచిది. ఎందుకంటే వ్యాధి ముదిరాక డాక్టర్‌ను సంప్రదిస్తే ఒక్కోసారి కాలిని తొలగించే ప్రమాదమూ ఉండవచు. అందుకే మీలో కనిపించిన లక్షణాలను గుర్తిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇప్పుడు దీనికి బెలూన్ యాంజియోప్లాస్టీ, స్టెంట్ విధానాల వంటి సమర్థమైన, సురక్షితమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. -
ఒత్తిడి తొలగించుకుంటే చాలు
హోమియో కౌన్సెలింగ్ మైగ్రేన్ నివారణ, చికిత్స... నాకు విపరీతమైన తలనొప్పి వస్తోంది. వారంలో ఒకటి, రెండు సార్లు తీవ్రంగా వస్తోంది. ఎన్నో రక్తపరీక్షలు, ఎక్స్-రే, స్కానింగ్ పరీక్షలు చేయించాను. డాక్టర్లు దీన్ని మైగ్రేన్‌గా నిర్ధారణ చేశారు. జీవితాంతం వస్తుంటుందని చెప్పారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? - రమణ, నూజివీడు తరచూ తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. నేటి ఆధునికయుగంలో శారీరక, మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనలు తలనొప్పికి ముఖ్యమైన కారణాలు. ఇంకా రక్తపోటు, మెదడు కణుతులు, మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణల్లో మార్పులు, సైనసైటిస్ మొదలైన వాటివల్ల తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం ఉంది. తలనొపి ఏ రకానికి చెందినదో నిర్ధారణ తర్వాత ఖచ్చితమైన చికిత్స చేయడం సులువవుతుంది. మైగ్రేన్ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధికప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలోనే ఎక్కువ. మైగ్రేన్‌లో దశలూ, లక్షణాలు: సాధారణంగా మైగ్రేన్ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్ మైగ్రేన్ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ: రక్తపరీక్షలు, రక్తపోటును పరీక్షించడం, సీటీస్కాన్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్‌ను నిర్ధారణ చేయవచ్చు. నివారణ: మైగ్రేన్ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు మనం తినే ఆహారంలో మార్పులు, మనం ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావారణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి. చికిత్స: మైగ్రేన్‌ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంశీక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటిని అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్ కన్‌స్టిట్యూటషన్ సిమిలియమ్ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకోవాలి. బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్‌కు అద్భుతంగా పనిచేస్తాయి. జనరల్ హెల్త్ కౌన్సెలింగ్ ఒత్తిడి తొలగించుకుంటే చాలు నా వయసు 38 ఏళ్లు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాను. తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాను. ఎక్కువగా ఆందోళనకూ, ఉద్వేగాలకు గురవుతుంటాను. ఆలోచనలు చాలా ఎక్కువ. నిద్ర సరిగా పట్టదు. నా సమస్యలకు తగిన చికిత్సను సూచించండి. - పి. విక్రమ్, సికింద్రాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు యాంగ్జైటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. మీరు చెప్పిన లక్షణాలైన తీవ్రమైన ఆందోళనలు, ఎడతెరిపి లేని ఆలోచనలు దీన్నే సూచిస్తున్నాయి. సాధారణంగా తీవ్రమైన ఒత్తిళ్లలో పనిచేసేవారిలో ఇది చాలా ఎక్కువ. మీరు ముందుగా ఒకసారి రక్తపరీక్షలు చేయించుకొని, రక్తంలో చక్కెరపాళ్లను పరీక్షించుకోండి. ఎందుకంటే మీ తరహా పనితీరు (సెడెంటరీ లైఫ్‌స్టైల్) ఉన్నవారిలో ఒత్తిడి వల్ల రక్తంలో చక్కెరల విడుదల ఎక్కువగా ఉంటుంది. దాంతో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలా మీకు తెలియకుండానే డయాబెటిస్ ఉంటే అది నరాలపై ప్రభావం చూపి, పెరిఫెరల్ నర్వ్స్, అటనామస్ నర్వ్స్ (స్వతంత్రనాడీ వ్యవస్థ)పై ప్రభావం చూపి ఇలా గాభరా, హైరానా పడేలా చేయడం చాలా సాధారణం. మీకు చికిత్స కంటే కూడా జీవనశైలిలో మార్పులు అవసరం. సమస్యపై అవగాహనతో, పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాలి. మీరు ఉదయమే నిద్రలేచి బ్రిస్క్ వాకింగ్ వంటి వ్యాయామాలు, యోగా, మెడిషటేషన్ చేయడం, వేళకు భోజనం తీసుకోవడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆహ్లాదకరమైన వ్యాపకాలను అలవరచుకోవడం వంటి జీవనశైలి మార్పులు చేసుకోండి. దాంతో మీ సమస్య చాలావరకు తగ్గుతుంది. పైన పేర్కొన్న పరీక్షలు చేయించాక ఫిజీషియన్‌ను కలవండి. ఒకవేళ మీకు తెలియకుండా షుగర్ వచ్చి ఉంటే డాక్టర్... ఆ సమస్యకు కూడా కలిపి చికిత్స సూచిస్తారు. ఒకవేళ మీకు షుగర్ లేకపోతే... మీ జీవనశైలి వల్ల త్వరగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నందున... ఆ సమస్యను నివారించచడం కోసం జీవనశైలి మార్పులను తప్పక అనుసరిస్తూ, యాంగ్జటీని తగ్గించే మందులైన యాంగ్జియోలైటిక్స్ను డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. నాకు 65 ఏళ్లు. షుగర్, బీపీ ఏమీ లేవు. అయితే పాతికేళ్లుగా సైనస్ సమస్యతో బాధపడుతున్నాను. ఉదయం లేవగానే చాలాసేపు తుమ్ములు వచ్చి, ముక్కు, కళ్ల నుంచి ధారగా నీరు కారుతుంది. నా సమస్య తగ్గే మార్గాన్ని సూచించండి. - ఎమ్. రాజేశ్వరరావు, వరంగల్ సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు ఉదయం వేళల్లో చలిగాలి సోకినప్పుడు, ఆ గాలి వల్ల సైనస్ రంధ్రాలు మూసుకుపోయి ఒకవిధమైన తలనొప్పి (మైల్డ్ హెడేక్)తో బాధపడతారు. మీలో వ్యాధినిరోధకశక్తి పెరగడానికి విటమిన్-సి టాబ్లెట్స్ వాడటం, యాంటీ అలర్జిక్ మందులు వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీకు సరిపడని వాతావరణానికి వీలైనంత దూరంలో ఉండండి. మీకు బాగా ఇబ్బందిగా ఉంటే ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ వాడటంతో పాటు ఆవిరిపట్టడం (స్టీమ్ ఇన్హెలేషన్), నేసల్ డీ-కంజెస్టెంట్స్ వంటి మందులను డాక్టర్ సూచిస్తారు. చికిత్స కోసం మీరు ఒకసారి ఫిజీషియన్‌ను కలవండి. పీడియాట్రిక్ కౌన్సెలింగ్ గుక్కపడితే... పాప నీలంగా మారుతోంది! మా పాపకు 11 నెలలు. గుక్కపట్టి ఏడుస్తున్నప్పుడు పాప ముఖం తరచూ నీలంగా మారుతోంది. ఆ సమయంలో పాపను చూస్తుంటే ఆందోళనగా ఉంది. దయచేసి పాప సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - సునీల, విశాఖపట్నం మీ పాప ఎదుర్కొంటున్న సమస్యను ‘బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్’గా చెప్పవచ్చు. అంటే పాప కాసేపు ఊపిరి తీసుకోకుండా ఉండిపోతుందన్నమాట. పిల్లల్లో కోపం ఫ్రస్టేషన్ / భయం / కొన్ని సందర్భాల్లో గాయపడటం జరిగినప్పుడు ఇలా కావడం చాలా సాధారణం. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తొమ్మిది నెలల నుంచి 24 నెలల లోపు పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నారుల్లో ఐదు శాతం మందిలో ఇది చాలా సహజం. కుటుంబ చర్రితలో ఈ లక్షణం ఉన్నవారి పిల్లల్లో ఇది ఎక్కువ. ఇలాంటి లక్షణం ఉన్న పిల్లలు పెద్దయ్యాక చాలా మొండిగా అవుతారంటూ కొన్ని అపోహలున్నా, వాటికి శాస్త్రీయమైన ఆధారాలేమీ లేవు. ఇది ఎందుకు వస్తుందనేది చెప్పడం కష్టమైనప్పటికీ రక్తహీనత ఉన్నవారిలో ఇది ఎక్కువ శాతం మందిలో కనిపిస్తుంది. బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్‌లో... సింపుల్, సైనోటిక్, ప్యాలిడ్, కాంప్లికేటెడ్ అని నాలుగు రకాలు ఉన్నాయి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు వస్తోంది సైనోటిక్ అనిపిస్తోంది. ఇక ప్యాలిడ్ అనే రకంలో పిల్లలు పాలిపోయినట్లుగా అయిపోయి, స్పృహతప్పిపోతారు. ఇటువంటి పిల్లల్లో ఒకసారి ఈసీజీ, ఈఈజీ తీయించడం చాలా అవసరం. ఎందుకంటే తీవ్రమైన కారణాలు ఏవైనా ఉంటే అవి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక చికిత్స విషయానికి వస్తే... పాపలో ఈ ధోరణి కనిపించినప్పుడు కుటుంబ సభ్యులంతా తీవ్రమైన ఆందోళనకు గురవుతారు కాబట్టి వాళ్లకు ధైర్యం చెప్పడమే మొదటి అవసరం. చాలా కొద్దిమందిలో మాత్రం ఐరన్ ఇవ్వడం ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలూ, తల్లిదండ్రుల మధ్య ప్రేమాభిమానాలు బలపడినకొద్దీ ఈ లక్షణం క్రమంగా తగ్గిపోతుంది. ఐదేళ్ల వయసు వచ్చాక ఈ లక్షణం కనిపించడం చాలా అరుదు. పైన పేర్కొన్న పరీక్షలు కూడా ఏవైనా తీవ్రమైన సమస్య ఉందేమో అన్నది తెలుసుకోడానికి మాత్రమే. ఈ విషయంలో నిర్భయంగా ఉండండి. మరీ అవసరమైనప్పుడు మీ పిల్లల డాక్టర్‌ను సంప్రదిస్తే చాలు. -
నిద్రలో నడిచే వ్యాధి... తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్ తీవ్రమైన నడుము నొప్పి..? నా వయసు 30. నేను గత కొంతకాలంగా తీవ్రమైన నడుము నొప్పితోబాధపడుతున్నాను. నొప్పి తీవ్రత వల్ల నా రోజువారీ పనులూ చేసుకోలేకపోతున్నాను. దయచేసి పరిష్కారం చెప్పండి. - డి.పి.స్వాతి, హైదరాబాద్ నడుమునొప్పిలో చాలా రకాలున్నాయి. వాటిలో మీకు వచ్చినది ఏ రకం నడుము నొప్పో తెలుసుకుంటే చికిత్స సులభమవుతుంది.... ఆన్యులార్ టేర్: వెన్నుపూస మధ్య ఉండే ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్‌లోని ఒక భాగం చిరగటాన్ని ఆన్యులార్ టేర్ అంటారు. ఇలా చిరిగిన ఆన్యులార్ వాపునకు గురై, నడుమునొప్పికి దారి తీస్తుంది. దీనినే డిస్క్ డీ జనరేటివ్ డిసీజ్ అని అంటారు. హెర్నియేటెడ్ డిస్క్: దీనినే డిస్క్ ప్రొలాప్స్ అని కూడా అంటారు. బలహీనపడిన డిస్క్ అంచు చిరిగి దాని మధ్య భాగంలో ఉండే మెత్తని న్యూక్లియస్ బయటకు తోసుకొని రావడాన్ని హెర్నియేషన్ అంటారు. ఇలా హెర్నియేట్ అయిన డిస్క్ వెన్నెముక బయటకు వచ్చే నరాలను నొక్కినప్పుడు వచ్చే లక్షణాలను సయాటికా అని అంటారు. స్పాండిలోసిస్: ఇందులో వెన్నులోని ఎముకలు పరిమితికి మించి ముందుకు కాని వెనకకు కాని జారతాయి. స్పైనల్ స్పినోసిస్: వెన్నులోపల ఉండే స్పైనల్ కెనాల్ అనే నాళం ఇరుకుగా మారటం లేదా మూసుకుపోవడం. ఆంకిలోసింగ్ స్పాండిలోసిస్: ఇది వెన్నుపూస దీర్ఘకాలిక వాపునకు గురికావడం వల్ల వస్తుంది. ఇది ఎక్కువగా తుంటి కీలు, వెన్నుపూసలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన వారి వెన్నుపూసలోని ఎముకలు బిగుసుకుపోయి నడుం కదలికలు కష్టతరమవుతాయి. దీనినే లాంబూస్పైన్ అని అంటారు.నడుంనొప్పి దీర్ఘకాలికంగా ఉండి జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుంటా వైద్యుని సంప్రదించాలి. నిర్థారించడం ఎలాగంటే... సీబీపీ, ఆర్ ఎ ఫ్యాక్టర్, ఎక్స్‌రే, సీటీస్కాన్, ఎమ్మారై, హెచ్ఎల్ఎ బి 27 వంటి పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. ఇతర వ్యాధులను గుర్తింవచ్చు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..? ఎక్కువగా బరువులను ఎత్తకూడదు. పడుకునేందుకు స్థిరంగా ఉండే కాయర్ పరుపులను లేదా బేస్ గట్టిగా ఉండే పరుపులను వాడాలి. హై హీల్స్ చెప్పులు వాడకూడదు. ఐస్‌ప్యాక్స్, వేడి కాపడాలను ప్రయోగిస్తే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లోని జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్య పద్ధతి ద్వారా వెన్నునొప్పి, సయాటికా, కాళ్ల తిమ్మిర్లు, పాదాల మంటలకే కాకుండా మూలకారణాన్ని గుర్తించి వైద్యం చేయడం ద్వారా వెన్నుపూసను దృఢంగా చేసి మరల నడుంనొప్పి సమస్యలు రాకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నాణెం మింగాను, ఏమవుతుంది? నా వయసు 20 ఏళ్లు. మూడు నెలల క్రితం ఐదు రూపాయల నాణేన్ని మింగాను. అది బయటకు వచ్చిందో రాలేదో తెలియదు. ఒకవేళ ఆ నాణెం కడుపులోనే ఉంటే ఏదైనా సమస్యలు ఉంటాయా? - శ్రీనివాస్, ఈ-మెయిల్ మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే... మీరు నాణెం మింగి మూడు నెలలు గడచిపోవడంతో పాటు, దాని కారణంగా తలెత్తాల్సిన సమస్యలేమీ ఇప్పటి వరకు తలెత్తలేదు కాబట్టి 99 శాతం నాణెం మలమార్గం ద్వారా బయటకు వచ్చే ఉంటుందని భావించవచ్చు. కానీ ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడం కోసం ఒకసారి మీరు అబ్డామిన్ ఎక్స్-రే చేయించుకోవడం అవసరం. ఒకవేళ ఆ ఎక్స్-రేలో నాణెం పేగుల్లో ఎక్కడైనా చిక్కుబడిపోయి ఉంటే అది కూడా తెలుస్తుంది. అలా చిక్కుబడిపోయి ఉంటే డాక్టర్‌ను సంప్రదించి, దాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స అవసరం అవుతుంది. నా వయసు 56 ఏళ్లు. నేను పూర్తి ఆరోగ్య పరీక్షలు (టోటల్ హెల్త్ చెకప్) చేయించుకున్నాను. అన్ని పరీక్షల రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని తెలిపారు. కానీ కాలేయంలో కొవ్వు చేరినట్లుగా చెప్పారు. నాకు మద్యం అలవాటేమీ లేదు. కాలేయంలోని కొవ్వును ఏవిధంగా తగ్గించాలి. మందులతో ఈ సమస్య తగ్గుతుందా? - సుదర్శన్‌రావు, నేలకొండపల్లి మీ సమస్యను ఇంగ్లిష్‌లో ‘ఫ్యాటీ లివర్ డిసీజ్’ గా పరిగణిస్తారు. ఈ సమస్య మద్యం అలవాటు లేని వారిలోనూ కనిపిస్తుంది. కాబట్టి మీకు వచ్చిన సమస్యను ‘నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్’గా డాక్టర్లు చెబుతారు. హెపటైటిస్-సి వైరస్ సోకడం, డయాబెటిస్, స్థూలకాయం వంటి సమస్యలు ఉన్నవారిలో ఇలాంటి సమస్య వస్తుంటుంది. మీరు టోటల్ హెల్త్ చెకప్ చేయించుకున్నారు. అయితే ఈ వ్యాధి నిర్ధారణ కోసం మరికొన్ని నిర్దిష్ట పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, హెపటైటిస్-బి, సి, డయాబెటిస్ టెస్ట్ వంటివి అన్నమాట. మీకు ఈ సమస్య రావడానికి కారణం ఏమిటో తెలుసుకొని, దానికి మందులు వాడటమే ప్రథమచికిత్స. ఒకవేళ డయాబెటిస్ వల్ల ఈ సమస్య వచ్చి ఉంటే దాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి. స్థూలకాయం ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. సరైన జాగ్రత్తలు తీసుకొని, సరైన మందులు వాడితే 6 నుంచి 10 నెలల్లో ఈ సమస్యను తగ్గించుకునే అవకాశం ఉంది. మీరు నిర్లక్ష్యం చేస్తే ఈ వ్యాధి లివర్ సిర్రోసిస్ గా పరిణమించే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోండి. పల్మునాలజీ కౌన్సెలింగ్ నిద్రలో నడిచే వ్యాధి... తగ్గేదెలా? నా వయసు 18 ఏళ్లు. హాస్టల్లో ఉంటాను. నిద్రలేవగానే చూసుకుంటే కొన్నిసార్లు నా శరీరంపై గాయాలు కనిపిస్తున్నాయి. నేను నిద్రలో నడుస్తున్నానని నా హాస్టల్మేట్స్ కూడా చెబుతున్నారు. నాకు అంతా అయోమయంగా ఉంది. ఈ విషయంలో నేనేం చేయాలో సలహా ఇవ్వగలరు. - సుహాస్, హైదరాబాద్ కొందరిలో నిద్రలోనే నడిచే రుగ్మత ఉంటుంది. దీన్ని ‘స్లీప్ వాకింగ్’ అంటారు. ఇలా నిద్రలోనే నడవటం అన్నది గాఢ నిద్ర దశ నుంచి మామూలు దశకు, ఆ తర్వాత మెలకువ దశకు చేరే సమయంలో జరుగుతుంటుంది. సాధారణంగా ఆ దశలో వారు మాట్లాడుతున్న మాటలు కూడా అర్థరహితంగా ఉంటుంటాయి. స్లీప్ వాకింగ్ అనేది సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిదేళ్ల ప్రాయంలో కనిపించడం చాలా మామూలే. అయితే కొందరు పెద్దవాళ్లలో కనిపించడం కూడా అరుదేమీ కాదు. నిద్రలో నడుస్తున్నప్పుడు వాళ్ల కళ్లు తెరచుకొని ఉండి, అంతగా స్పష్టంగా లేని దృశ్యం వాళ్లకు కనపడుతూ ఉంటుంది. అలాంటి దశలో వాళ్లను ఏమైనా అడిగితే నిద్రలో ఉన్నట్లుగా అస్పష్టంగా జవాబివ్వవచ్చు. లేదా అస్సలు స్పందించకపోవచ్చు. వారిని తమ పడక వద్దకు తీసుకువచ్చి, నిద్రలేపితే అతడికి జరిగిందేదీ గుర్తురాకపోవచ్చు కూడా. నిద్రలో నడిచే రుగ్మతకు చాలా అంశాలు దోహదపడతాయి. సాధారణంగా కుటుంబసభ్యుల్లో ఎవరికైనా ఈ రుగ్మత ఉంటే మిగతావారిలోనూ అది కనిపించే అవకాశాలు ఎక్కువ. నిద్రలేమితో బాధపడేవారిలో, ఎప్పుడుపడితే అప్పుడు నిద్రకు ఉపక్రమించేవారిలో, తీవ్రమైన ఒత్తిడితో బాధపడేవారిలో, మద్యం తీసుకున్నవారితో పాటు కొన్ని నిద్రను తెచ్చే మాత్రలు, సైకోసిస్‌ను నయం చేసేందుకు వాడే మాత్రలు తీసుకునేవారిలోనూ ఈ సమస్య కనిపించవచ్చు. ఇక గుండెలయలో తేడా రావడం, తీవ్రమైన జ్వరం, రాత్రివేళ ఆస్తమా, రాత్రివేళ ఫిట్స్, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ వంటి వైద్యపరమైన సమస్యలతో పాటు అనేక మానసిక వ్యాధులతో బాధపడేవారితో కూడా ఈ సమస్య రావచ్చు. దీనికి వైద్యపరంగా నిర్దిష్టమైన చికిత్స అంటూ ఏదీ లేదు. కాకపోతే ‘హిప్నాసిస్’ వంటి ప్రక్రియలతో దీనికి చికిత్స చేయవచ్చు. అయితే మంచి విషయం ఏమిటంటే... సాధారణంగా పిల్లల్లో కనిపించే ఈ రుగ్మత వారు పెద్దయ్యేకొద్దీ మామూలుగానే తగ్గిపోతుంది. ఇంకా తగ్గకపోతే మాత్రం వారు సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి. ఇలాంటివారు అంచులు లేని పడక మీద పడుకోవడం, మెట్ల దగ్గరకు వెళ్లడం, పిట్టగోడ లేని పై అంతస్తుల్లో పడుకోవడం వంటివి చేయకుండా జాగ్రత్తపడాలి. -
టియుఆర్‌పితో స్తంభనలు తగ్గవు
హోమియో కౌన్సెలింగ్ ఐబిఎస్‌కు హోమియోలో మంచి చికిత్స! నా వయసు 38 ఏళ్లు. భోజనం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. మలంలో జిగురు కూడా కనిపిస్తుంది. కొద్దిగా నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన వంటివి ఉన్నాయి. ఈ సమస్యతో ఏ అంశంపైనా దృష్టి పెట్టలేకపోతున్నాను. దయచేసి నా సమస్య ఏమిటో వివరించి, హోమియోలో చికిత్స చెప్పండి. - సూర్యకుమారి, నెల్లూరు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు దీర్ఘకాల జ్వరాలు మానసిక ఆందోళన కుంగుబాటు ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం జన్యుపరమైన కారణలు చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ఒత్తిడిని నివారించుకోవాలి పొగతాగడం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. హోమియోలో చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ర్పభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. టియుఆర్‌పితో స్తంభనలు తగ్గవు నా వయసు 60. షుగర్, బీపీ సమస్యలు లేవు. సెక్స్ కూడా నార్మల్‌గానే చేయగలుగుతున్నాను. కానీ మూత్రవిసర్జన మాత్రం సాఫీగా జరగడం లేదు. ముక్కి ముక్కి చాలాసేపు మూత్రవిసర్జన చేయాల్సి వస్తోంది. రాత్రి కూడా చాలాసార్లు నిద్రలేవాల్సి వస్తోంది. యూరాలజిస్ట్‌ను సంప్రదిస్తే టీయూఆర్‌పీ అనే సర్జరీ చేయించుకోవాలని చెప్పారు. దీనివల్ల అంగస్తంభనకు, సెక్స్ చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? నాకు ఇప్పుడు సెక్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. సర్జరీ చేస్తే అంగస్తంభనలు తగ్గుతాయేమోనని ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - జీఎస్ఆర్., వరంగల్ సాధారణంగా యాభై ఏళ్ల తర్వాత ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం క్రమంగా పెరగవచ్చు. అలాంటి సందర్భాల్లో మీరు చెబుతున్న లక్షణాలు కనిపిస్తాయి. దీనికి చికిత్సగా మొదట్లో కొన్ని మందులే వాడతాం. అయితే మందులు వాడాక కూడా కూడా మూత్రధార సరిగా రాక, మూత్రం లోపల మిగిలిపోయినట్లుగా అనిపిస్తుంటే అప్పుడు ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా టీయూఆర్‌పీ సర్జరీ చేస్తారు. ఇందులో ప్రోస్టేట్ గ్రంథిని 90 శాతం వరకు తొలగిస్తారు. సాధారణంగా ఈ సర్జరీ వల్ల ఎలాంటి అంగస్తంభన సమస్యలు రావు. నిపుణులైన శస్త్రచికిత్సలు సర్జరీ నిర్వహిస్తే... అసలు ఈ సర్జరీకీ, అంగస్తంభనకు సంబంధమే ఉండదు. కాకపోతే టీయూఆర్‌పీ సర్జరీ తర్వాత వీర్యం పరిమాణం తగ్గవచ్చు. మీరు నిర్భయంగా శస్త్రచికిత్స చేయించుకోండి. నాకు 26 ఏళ్లు. కొన్నేళ్ల క్రితం నేను ఒక వేశ్యతో కలిశాను. నాకు ఎలాంటి బాధలూ లేకపోవడంతో దాన్ని గురించి పట్టించుకోలేదు. ఇటీవల ఒక సందర్భంలో రక్తపరీక్ష చేయించాల్సి వచ్చింది. ఆ సమయంలో ట్రిపనిమల్ యాంటీబాడీస్‌కు పాజిటివ్ అని రిపోర్డు వచ్చింది. ఇదొక సుఖవ్యాధి అని డాక్టర్ చెప్పారు. ఈ జబ్బు తగ్గడానికి అవకాశం ఉందా? నాకు ఆందోళనగా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన సమాధానం చెప్పండి. - ఎ.ఎస్.ఎమ్., కందుకూరు ట్రిపనిమా అనేది సిఫిలిస్‌ను కలిగించే బ్యాక్టీరియా. ఇది సెక్స్ ద్వారా సంక్రమించే జబ్బు. మీరు గతంలో ఒకసారి వేశ్యను కలిశారు కాబట్టి ఈ జబ్బు పాజిటివ్ వస్తే మళ్లీ మీ ఇమ్యూనిటీకి సంబంధించిన మరికొన్ని పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. అయితే దీనికి పూర్తి చికిత్స అందుబాటులో ఉంది. దాంతో మీ సమస్య పూర్తిగా తగ్గుతుంది. మీరు ఆందోళన పడకుండా మీకు దగ్గర్లోని యాండ్రాలజిస్ట్ లేదా యూరాలజిస్ట్‌ను కలిసి పూర్తిస్థాయి చికిత్స తీసుకోండి. మీ వ్యాధి పూర్తిగా తగ్గుతుంది. ఎండోక్రైనాలజీ కౌన్సెలింగ్ హైపర్ థైరాయిడిజమ్‌కు చికిత్స ఉంది మా అమ్మగారి వయసు 64 ఏళ్లు. గత ఐదేళ్లుగా ఆమె డయాబెటిస్తో బాధపడుతున్నారు. అయితే ఇటీవల గుండె దడగా ఉంటోందనీ, చెమటలు ఎక్కువగా పడుతున్నాయనీ చెబుతున్నారు. బరువు తగ్గిపోతోంది. అరచేతులు ఎక్కువగా తడిగా ఉంటున్నాయి. మా అమ్మగారికి ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి సరైన సలహా ఇవ్వగలరని ప్రార్థన. - ఇందుమతి, విజయవాడ మీరు తెలిపిన వివరాలనూ, లక్షణాలనూ పరిశీలిస్తే మీ అమ్మగారు ‘హైపర్ థైరాయిడిజమ్’తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కండిషన్ ఉన్నవారిలో జీవక్రియల నిర్వహణ రేటు పెరుగుతుంది. మీ అమ్మగారిలో కనిపిస్తున్న లక్షణాలతో పాటు కంగారుపడటం, చిరాకు, గుండెదడ, ఆందోళన, నిద్రలేమి, కండరాల బలహీనత, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. కాబట్టి మీరు వెంటనే మీ అమ్మగారికి థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించండి. హైపర్‌థైరాయిడిజమ్‌ను రక్త పరీక్ష ద్వారా గుర్తిస్తారు. ఈ పరీక్షలో రక్తంలో టీ3, టీ4 మోతాదు ఎక్కువ కావడం, టీఎస్‌హెచ్ మోతాదు బాగా తగ్గిపోవడం కనిపిస్తుంది. చికిత్స : దీనికి చికిత్సగా యాంటీ థైరాయిడ్ మందులు ఉపయోగిస్తారు. ఈ మందులను డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ సమస్య తగ్గే అవకాశం ఉంది. చాలామందిలో ఈ యాంటీథైరాయిడ్ మందులు ఆపిన తర్వాత మళ్లీ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా యాంటీ థైరాయిడ్ మందుల ద్వారా హార్మోన్‌ని తగ్గించి, ఆ తర్వాత ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం మూడు పద్ధతులు అనుసరిస్తారు. మొదటి దానిలో రేడియో ఆక్టివ్ అయోడిన్ మందును ఎక్కువ మోతాదులో ఇవ్వడం ద్వారా థైరాయిడ్ గ్రంథిలో హార్మోన్ తయారు చేసే కణాలను నాశనం చేస్తారు. ఇలా హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తారు. రేడియో అయోడిన్ తీసుకోలేని సందర్భంలో, తక్కువ మోతాదులో యాంటీథైరాయిడ్ మందులు వాడాల్సివస్తుంది. మూడో పద్ధతిలో థైరాయిడ్ గ్రంథిని ఆపరేషన్ ద్వారా తొలగించవచ్చు. కానీ రేడియో అయోడిన్ వాడటం వల్ల, థైరాయిడ్ ఆపరేషన్ వల్ల హార్మోన్ ఉత్పత్తి పూర్తిగా తగ్గవచ్చు. అప్పుడు జీవితాంతం థైరాక్సిన్ మాత్రలు వాడాల్సి వస్తుంది. సాధారణంగా మిగతా రెండు పద్ధతులు ఉపయోగపడనప్పుడు ఆపరేషన్ మాత్రమే చేస్తారు. మీ అమ్మగారికి డయాబెటిస్ ఉన్నందున రక్తంలో చక్కెర తగ్గినప్పుడు కూడా ఇలాంటి లక్షణాలు గమనించవచ్చు. కానీ అరచేతుల్లో చెమటలు పట్టడం అనే లక్షణం వల్ల హైపర్ థైరాయిడిజమ్ ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి సత్వరమే రక్తపరీక్షలు చేయించుకొని, దగ్గర్లోని ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించండి. డర్మటాలజీ కౌన్సెలింగ్ మొటిమలూ - వాటివల్ల వచ్చిన మచ్చలను తగ్గించవచ్చు నా వయసు 19 ఏళ్లు. నా ముఖం మీద మొటిమలు, మచ్చలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎంతగా ప్రయత్నించినా తగ్గడం లేదు. నేను బెట్నోవేట్ అనే క్రీమ్ వాడుతున్నాను. దాంతోపాటు ఐసోట్రెటినాయిన్ 20 ఎంజీ క్యాప్సూల్స్ కూడా తీసుకుంటున్నాను. అయినా ఎలాంటి మార్పూ రావడం లేదు. దయచేసి మొటిమలు, మచ్చలు తగ్గడానికి నేనేం చేయాలో సూచించండి. - విజయ్, ఈ-మెయిల్ మీ వయసు వారిలో ఇలా మొటిమలు రావడం అన్నది చాలా సాధారణమైన విషయం. ఈ వయసు పిల్లల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ల పాళ్లు పెరగడం వల్ల చర్మంపై మొటిమలు రావడం చాలా సహజంగా జరిగే ప్రక్రియ. కానీ మీ విషయంలో ఇది స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ యాక్నే లా అనిపిస్తోంది. మీరు బెట్నోవేట్ క్రీమ్ రాస్తున్నట్లు చెబుతున్నారు. బెట్నోవేట్ అనే క్రీమ్‌లో స్టెరాయిడ్ ఉంటుంది. దీనిలోని స్టెరాయిడ్ వల్ల మొదట్లో కొంచెం ఫలితం కనిపించినట్లు అనిపించినా... ఆ తర్వాత మొండిమొటిమలు (ఒక పట్టాన తగ్గనివి) వస్తాయి. అందుకే మీరు ఈ కింది సూచనలు పాటించండి. మొదట బెట్నోవేట్ క్రీమ్ వాడటాన్ని ఆపేయండి. క్లిండామైసిన్ ప్లస్ అడాపలీన్ కాంబినేషన్‌తో తయారైన క్రీమ్‌ను రోజూ రాత్రిపూట మొటిమలపై రాసుకొని పడుకోండి.అజిథ్రోమైసిన్-500 ఎంజీ క్యాప్సూల్స్‌ను వరసగా మూడు రోజుల పాటు క్రమం తప్పకుండా వేసుకోండి. ఇలా మూడు వారాలు వేసుకోవాలి. అంటే మొదటివారం సోమ, మంగళ, బుధ వారాలు తీసుకున్నారనుకోండి. దీన్నే రెండో వారం, మూడోవారం కూడా కొనసాగించాలి. ఈ అజిథ్రోమైసిన్ క్యాప్సూల్‌ను ఖాళీ కడుపుతో అంటే భోజనానికి ముందుగానీ... ఒకవేళ భోజనం చేస్తే... రెండు గంటల తర్వాత గానీ వేసుకోవాలి. మీరు వాడుతున్న ఐసోట్రెటినాయిన్ 20 ఎంజీ క్యాప్సూల్స్‌ను అలాగే కొనసాగించండి. అప్పటికీ మొటిమలు తగ్గకపోతే కాస్త అడ్వాన్స్డ్ చికిత్సలైన సాల్శిలిక్ యాసిడ్ పీలింగ్ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని రెండువారాలకు ఒకసారి చొప్పున కనీసం ఆరు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ మొటిమల వల్ల ముఖంపై గుంటలు పడినట్లుగా ఉంటే, వాటిని తొలగించడానికి ఫ్రాక్షనల్ లేజర్ వంటి చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. -
ఆ మందులు ఇంకా వాడాలా..?
హోమియో కౌన్సెలింగ్ తామరను తరిమి కొట్టవచ్చు నా వయసు 36. నాకు తొడల మీద, కాళ్ల మీద, పొట్టమీద ఎర్రగా, గుండ్రంగా మచ్చలు వచ్చాయి. ఇవి చాలా దురద పెడుతున్నాయి. నాకు ఈ మచ్చల వల్ల చాలా అసౌకర్యంగా ఉంది. హోమియోలో ఏమైనా మందులు ఉంటే సూచించగలరు. - పి.కుమార్, మాచర్ల ఎగ్జిమా అనేది దీర్ఘకాలిక చర్మసమస్య. దీనివల్ల చర్మం ఎరుపు దనంతో కమిలినట్లు కనిపించడం, దురద, రసితో కూడిన చిన్న చిన్న పొక్కులుగా ఏర్పడటం, చర్మం పొలుసులుగా రాలడంతోపాటు పిగ్మెంటేషన్ జరుగుతుంది. కారణాలు: ఇది వంశపారంపర్యం, వాతావరణ మార్పులు, అలర్జీ వల్ల వచ్చే అవకాశం ఉంది. ఎగ్జిమాను ప్రేరేపించే కారణాలు... వాతావరణ మార్పులు, దురద పుట్టించే ఆహార పదార్థాలు, సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలు, కొన్ని రకాల అలర్జిన్స్ ముఖ్యంగా డస్ట్మైట్లు, పెంపుడు జంతువులు, పుప్పొడి రేణువులు, డాండ్రఫ్ మొదలైనవి. ఒత్తిడి వల్ల కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. హార్మోన్ల అసమతుల్యత ముఖ్యంగా స్త్రీలలో ఈ లక్షణాలను మరింత దుర్భరం చేస్తాయి. ఎగ్జిమా ఎక్కువగా ఉబ్బసం, తీవ్రమైన జ్వరాలు, ఇతర శ్వాస సంబంధితమైన అలర్జీల వంటి వ్యక్తిగత చరిత్ర కలిగి ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. రకాలు... ఎగ్జిమాలో అటోపిక్ డెర్మటైటిస్ సర్వసాధారణం. అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్, కాంటాక్ట్ ఎగ్జిమా, డిస్హైడ్రియాట్రిక్ ఎగ్జిమా, న్యూరో డెర్మటైటిస్, నమ్యులార్ ఎగ్జిమా, సెబోరిక్ ఎగ్జిమా, స్పాసిస్ డెర్మటైటిస్ వంటి రకాలున్నాయి. ముఖ్యలక్షణాలు: ఇవి వయస్సును బట్టి మారుతుంటాయి. శిశువులలో... చర్మంపై దద్దులు ముఖ్యంగా బుగ్గలపై, తలపైన ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి నీటిబుగ్గల మాదిరిగా తయారై, రసికారడం, విపరీతమైన దురద, గోకడం వల్ల చర్మంపై ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి. చిన్నపిల్లలు, యుక్తవయసు వారిలో మోచేయి, మోకాలి మడతలలో, మణికట్టు, చీలమండలు, పిరుదులు, కాళ్ల మీద కనిపిస్తుంది. పెద్దవారిలో మోకాలు, మోచేయి, మెడభాగాలలో, ముఖంపైన, కళ్లచుట్టూ దద్దుర్లు వస్తాయి. చర్మం పొడిబారడం, దురద, చర్మం ఇన్ఫెక్షన్లకు గురికావడం వంటివి ఎలా నిర్థారిస్తారంటే... కుటుంబ చరిత్ర, వ్యక్తిగత చరిత్ర తెలుసుకుని వ్యాధిని నిర్ధారిస్తారు. బాహ్యపరీక్ష, అవసరమైతే రక్తపరీక్ష, కొన్ని సందర్భాలలో చర్మపు మచ్చల నిర్ధారణకై బయాప్సీ చేయించాల్సి ఉంటుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..? వ్యాధి లక్షణాలను దుర్భరం చేసే ప్రేరేపకాలకు దూరంగా ఉండాలి. ఎగ్జిమాల వల్ల వచ్చే పుండ్లను గోకడం, రక్కడం లాంటివి చేయకూడదు. హోమియో చికిత్స: కాన్స్టిట్యూషనల్ హోమియోపతిలో భాగంగా రోగి శరీర రోగనిరోధక కణాలకు పునరుజ్జీవం కల్పించి, దుష్ఫలితాలు లేకుండా ఎగ్జిమాను పూర్తిగా నయం చేయవచ్చు. అన్ని ప్రతికూల పరిస్థితులలో సైతం ఆరోగ్యవంతమైన జీవనం సాగించే విధంగా హోమియోకేర్ ఇంటర్నేషనల్ వారు అందించే వైద్య కచ్చితంగా దోహపడుతుంది. నెఫ్రాలజీ కౌన్సెలింగ్ క్రియాటినిన్ పెరిగినా డయాలసిస్ చేయలేదు..? నా వయసు 55. ఇటీవలే బాగా నిస్సత్తువగా, నీరసంగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్లాను. అన్ని పరీక్షలు చేసి క్రియాటినిన్ పాళ్లు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. దాంతో నాకు డయాలసిస్ చేస్తారేమోనని ఆందోళన పడ్డాను. కానీ డయాలసిస్ చేయడం లేదు. మందులే ఇస్తున్నారు. క్రియాటినిన్ ఎంత ఉంటే డయాలసిస్ చేస్తారు? - మస్తాన్, గుడివాడ ఒక రోగికి డయాలసిస్ మొదలుపెట్టడానికి కేవలం క్రియాటినిన్ కౌంట్ మాత్రమే ఆధారం కాదు. ఇంకా చాలా రకాల పరీక్షలు చేసి డయాలసిస్ ఎప్పుడు చేయాలో నిర్ధారణ చేస్తారు. ఇటీవలి నూతన పరిశోధనల ఆధారంగా క్రియాటినిన్ కౌంట్ 6 - 8 మధ్యలో ఉన్న రోగులకు కొందరికి డయాలసిస్ చేశారు. అయితే క్రియాటినిన్ కౌంట్ 10 - 12 మధ్య ఉన్నవారికి డయాలసిస్ ప్రారంభించినప్పుడు ఇచ్చినన్ని సత్ఫలితాలు ఈ 6 - 8 మధ్య ఉన్నవారిలో కనిపించలేదు. దీనివల్ల డయాలసిస్ చేయాలనడానికి కేవలం క్రియాటినిన్ మాత్రమే ఒక నిర్దిష్ట పరీక్ష కాదని స్పష్టంగా తేలిపోయింది. క్రియాటినిన్ ఎక్కువగా ఉండటంతో పాటు మూత్రపిండాల రోగి ఊపిరి తీసుకోలేకపోవడం, సరైన పోషకాహారం తీసుకోక సన్నబడిపోవడం, ఆకలిని కోల్పోవడం, వాంతులు కావడం (ఈ లక్షణాలన్నింటినీ యూరెమిక్ సింప్టమ్స్ అంటారు) వంటివి కనిపించినప్పుడు మాత్రమే డయాలసిస్ చేయాలన్న నిర్ణయం తీసుకుంటారు. మీ విషయానికి వస్తే మీకు ఎప్పుడు డయాలసిస్ ప్రారంభించాలన్న అంశాన్ని మీ నెఫ్రాలజిస్టు నిర్ణయిస్తారు. నా వయసు 49 ఏళ్లు. ఇటీవలే నాకు కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని తెలిసింది. నేను నీళ్లు ఎక్కువగా తాగకూడదని డాక్టర్ చెప్పారు. సాధారణంగా డాక్టర్లు నీళ్లు ఎక్కువగా తాగమని చెబుతుంటారు కదా! మరి నా విషయంలో నీళ్లు తాగవద్దని ఆంక్ష ఎందుకు పెట్టారు? నాకు అర్థమయ్యేలా వివరించగలరు. - సుందర్రావు, ఆకివీడు సాధారణంగా కిడ్నీ జబ్బులు ఉన్న వారిలో నీరు తక్కువగా తాగాలని ఆంక్షలు విధించరు. అయితే కిడ్నీ జబ్బుతో పాటు గుండెజబ్బు లేదా అలా నీరు తీసుకోవడం వల్ల హాని జరిగే అవకాశాలు ఉన్నప్పుడు మాత్రం ఎంత నీరు తీసుకోవాలన్నది డాక్టర్లు నిర్దేశిస్తారు. మన భారతదేశం లాంటి ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న దేశాల్లో మామూలు వ్యక్తి రోజుకు 5-6 లీటర్ల నీటిని తీసుకుంటాడు. అయితే కొందరి కిడ్నీలు కేవలం ఒక్క లీటరు నీటిని ప్రాసెస్ చేయడానికే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అందుకే వారికి ఉన్న జబ్బు ఆధారంగా, వారి కిడ్నీ పనిచేసే సామర్థ్యం ఎంతో తెలుసుకొని, డాక్టర్లు రోజూవారీ తీసుకోవాల్సి నీటి మోతాదును నిర్ణయిస్తారు. కార్డియాలజీ కౌన్సెలింగ్ ఆ మందులు ఇంకా వాడాలా..? నా వయసు 56. పన్నెండేళ్ల కిందట నాకు యాంజియోప్లాస్టీ చేశారు. ప్రతిరోజూ అటార్ 10, క్లోపిటాబ్-ఏ 75 తీసుకొమ్మని చెప్పారు. ఇప్పటికీ నేను ఆ మందులు తీసుకుంటూనే ఉన్నాను. పన్నెండేళ్లు గడిచాక కూడా ఇంకా నేను వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉందా? తెలియజేయగలరు. - అమీర్‌సాహెబ్, గుంటూరు మీ యాంజియోప్లాస్టీ తర్వాత మీరు ఏడాదికొకసారి మీ డాక్టర్‌ను కలుసుకొని మీరు తీసుకునే మందులను రివ్యూ చేయించుకోవాల్సింది. ఇలా దీర్ఘకాలం పాటు కొన్ని మందులు తీసుకోవడం వల్ల వాటి దుష్పరిణామాలు (సైడ్ ఎఫెక్ట్స్) కూడా ఉండవచ్చు. మొదట మీరు పీటీ-ఐఎన్ఆర్, లిపిడ్స్ (కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఎల్డీఎల్, హెచ్‌డీఎల్) పరీక్షలు చేయించుకోండి. కార్డియాక్ ఫంక్షన్ అసెస్మెంట్ కూడా చేయించుకోండి. ఇకవేళ మీ రక్తంలో లిపిడ్స్ పాళ్లు సరిగా ఉంటే అటర్వోస్టాటిన్ (అటార్ 10)ను ఆపివేయవచ్చు. ఇక క్లోపిటాబ్-ఏ 75 లో రక్తాన్ని పలచబార్చే రెండు రకాల ఏజెంట్స్ ఉంటాయి. అవి... 1) క్లోపిడోగ్రెల్, 2) ఆస్పిరిన్. ఈ రెండింటి స్థానంలో అవసరాన్ని బట్టి మీకు కేవలం ఆస్పిరిన్ 75 - 100 ఎంజీ ఇవ్వవచ్చు. అయితే ఈ మందుల మార్పిడి అంతా మీ రక్తపరీక్షలూ, కార్డియాక్ ఫంక్షన్ పరీక్షల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పైన పేర్కొన్న పరీక్షలు చేయించి ఒకసారి మీ కార్డియాలజిస్ట్‌ను కలవండి. నా వయసు 60. నాకు ఆర్నెల్ల క్రితం యాంజియోప్లాస్టీ చేసి మెడికేటెడ్ స్టెంట్ వేశారు. అప్పట్నుంచి నేను ఆస్పిరిన్-100 ఎంజీ, క్లోపిడోగ్రెల్ 75 ఎంజీ, అటెనొలాల్ 25 ఎంజీ, ఒమెప్రొజాల్ 20 ఎంజీ, ఫోలిక్‌యాసిడ్ 5 ఎంజీ, మల్టీవిటమిన్ విత్ జింక్ (రోజుకు ఒకసారి), సింవాస్టాటిన్ 10 ఎంజీ (రాత్రిపూట), ఎజెటెమైబ్ 10 ఎంజీ (రెండు నెలల క్రితం మొదలుపెట్టాను, రాత్రిపూట తీసుకుంటున్నాను)... ఈ మందులు వాడుతున్నాను. ఇటీవల రక్తపరీక్షలు చేయిస్తే టోటల్ ఆర్బీసీ - 5.4 ఎం/సీఎమ్ఎమ్, హీమోగ్లోబిన్ 14.2 జీ/డీఎల్, పీసీవీ 48%, ఎంసీవీ 89 ఎఫ్ఎల్, ఎమ్సీహెచ్ - 26 పీజీ, ఎమ్సీహెచ్సీ 29%, మోనోసైట్స్ 9%, ఇసినోఫిల్స్ 7%, బ్లడ్‌గ్లూకోజ్ 112 ఎంజీ/డీఎల్ , సీఈఏ 5.2 వీ ఎన్జీ/ఎమ్మెల్ ఉన్నాయి. లిపిడ్ ప్రొఫైల్‌లో కొలెస్ట్రాల్ 146, గ్రైగ్లిజరైడ్స్ 165, హెచ్‌డీఎల్ 40, ఎల్డీఎల్ 73 ఉన్నాయి. ఇటీవలే నేను బరువు తగ్గడానికి గ్జెనికాల్ (ఆర్లిస్టాట్ రోజుకు రెండుసార్లు భోజనం తర్వాత) తీసుకోవడం మొదలుపెట్టాను. నా రిపోర్టుల ప్రకారం అంతా బాగున్నట్టేనా? దయచేసి తెలియజేయగలరు. - చంద్రశేఖర్‌రెడ్డి, కర్నూలు మీ గుండెకు సంబంధించినంత వరకు మీ రిపోర్టులన్నీ చక్కగానే ఉన్నాయి. అయితే మీరు పంపిన దాంతో ఎర్రరక్తకణాలకూ గుండెజబ్బులకూ నేరుగా ఎలాంటి సంబంధం లేదు. మీరు ఒకసారి మీ ఫిజీషియన్నుగానీ లేదా కార్డియాలజిస్టును గానీ కలిసి, అంతర్గతంగా ఏదైనా సమస్య ఉందేమో తెలుసుకోవడం అవసరం. స్లీప్ కౌన్సెలింగ్ నిద్రలో కాళ్లు కదులుతున్నాయేమిటి? నా భార్య వయసు 50 ఏళ్లు. కాస్త లావుగా ఉంటుంది. డయాబెటిస్తో బాధపడుతోంది. ఇటీవల నిద్రలో ఆమె కాళ్లను కుదిపినట్లుగా చాలా వేగంగా కదిలిస్తోంది. నిద్రలోంచి లేచి పిక్కలు పట్టేస్తున్నాయని (మజిల్ క్రాంప్స్) అంటోంది. దీంతో ఆమె నిద్రకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దయచేసి ఆమె విషయంలో ఏం చేయాలో తగిన సలహా ఇవ్వండి. - వెంకటేశ్వరరావు, హన్మకొండ నిద్రలో ఇలా కుదుపుతున్నట్లుగా కాళ్లు వేగంగా కదిలించడాన్ని ‘పీరియాడిక్ లింబ్ మూవ్మెంట్ డిజార్డర్ (పీఎల్‌ఎమ్‌డీ) అంటారు. సాధారణంగా నిద్రపోతున్న సమయంలో మన శరీరంలో శ్వాస తప్ప మరే కదలికా ఉండదు. కానీ నిద్రలో ఇలా కదలికలు కనిపించే జబ్బు ఇదే. ఇక్కడ ‘పీరియాడిక్’ అనే పదం కదలికలు ఎంత ఫ్రీక్వెన్సీతో వస్తున్నాయనేందుకు ఉపయోగిస్తారు. ఇవి క్రమబద్ధంగా ప్రతి 20 - 40 సెకండ్ల పాటు వస్తుంటాయి. పీఎల్‌ఎమ్‌డీ అనేది నిద్రకు సంబంధించిన వ్యాధి. దీనితో బాధపడేవారు రాత్రివేళ నిద్ర తక్కువ కావడం వల్ల పగలు మగతగా ఉంటారు. పీఎల్‌ఎమ్‌డీ అనేది ఏ వయసు వారిలోనైనా రావచ్చు. అయితే సాధారణంగా మధ్యవయస్కుల్లో ఇది ఎక్కువ. పీఎల్ఎమ్డీలో ప్రైమరీ, సెకండరీ అని రెండు రకాలున్నాయి. సెకండరీ పీఎల్‌ఎమ్‌డీ అనేది అంతర్గతంగా ఇతర వ్యాధులు ఉన్నవారిలో కనిపిస్తుంది. లేదా కొందరిలో దీనికి కారణం కూడా తెలియదు. మెదడు నుంచి కాళ్లు, చేతులకు వెళ్లే నరాల్లో సమస్యల వల్ల ఇది వస్తుందని తెలుసుకానీ, ఆ సమస్యలేమిటో ఇంకా పరిశోధనల్లో వెల్లడికాలేదు. సెకండరీ పీఎల్ఎమ్డీకి చాలా కారణాలు ఉన్నాయి. అవి... డయాబెటిస్ ఐరన్ లోపం వెన్నెముకలో కణుతులు వెన్నెముక దెబ్బతినడం స్లీప్ ఆప్నియా (గురక సమస్య) నార్కోలెప్సీ (క్రమమైన వేళల్లో నిద్రపట్టడం, నిద్రలేవడం జరగకపోవడం) యురేమియా (రక్తంలో యురియా, నైట్రోజన్ సంబంధిత వ్యర్థపదార్థాల పాళ్లు పెరగడం), రక్తహీనత మొదలైనవి. పీఎల్ఎమ్డీతో బాధపడే చాలామందిలో కాళ్ల కదలికలు లేకుండా నిద్రపట్టకపోవడం, దాంతో పగటినిద్ర ఎక్కువగా ఉంటాయి. కొందరిలో ఒక కాలు, లేదా మరికొందరిలో రెండుకాళ్లూ కదులుతూ ఉండవచ్చు. దీని నిర్ధారణకు నిర్దిష్టంగా పరీక్షలేవీ లేకపోయినా, రక్తహీనత వంటి వాటి ద్వారా కారణాన్ని ఊహించవచ్చు. ఈ సమస్య ఉన్నవారికి బెంజోడయజిపైన్స్, క్లోనోజెపామ్, డోమమినెర్జిక్ ఏజెంట్స్, యాంటీకన్వల్జెంట్ ఏజెంట్స్, గాబా ఆగోనిస్స్ వంటి మందులతో చికిత్స చేయవచ్చు కాబట్టి మీరు ఆందోళన పడకుండా మీ భార్యతో కలిసి ఒక ఫిజిషియన్‌ను సంప్రదించండి.