సర్వైకల్ స్పాండిలోసిస్‌కు శాశ్వత పరిష్కారం
హోమియో కౌన్సెలింగ్
నా వయస్సు 45 సంవత్సరాలు. నేను గత కొంతకాలంగా మెడనొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ని సంప్రదిస్తే మెడ ప్రాంతంలోని వెన్నెముకలోని డిస్కులు అరుగుదలకు గురయ్యాయని చె ప్పి, మందులు ఇచ్చారు. అవి వాడుతున్నా, ఉపశమనం లభించడం లేదు. పైగా చేతులు కూడా బలహీనంగా అనిపిస్తున్నాయి. చిన్న బరువులు కూడా ఎత్తలేకపోతున్నాను. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు.
- కె.శ్రీనివాస్, ఒంగోలు
మెడనొప్పి, ఈ మధ్యకాలంలో చిన్న వయస్సు వారిని కూడా వేధించే ఆరోగ్య సమస్య. మారుతున్న మానవుని జీవన విధానం వల్ల ఈ విధమైన సమస్యలు చిన్న వయస్సులో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్ని రకాల మందులు వాడినా ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం లభించక చాలామంది బాధపడుతుంటారు. కానీ హోమియో చికిత్స ద్వారా పూర్తిగా నయం అయే అవకాశం ఉంది. మెడ భాగంలోని వెన్నెముకలోని డిస్కులు, జాయింట్లలోని మృదులాస్తి క్షీణతకు గురవడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. దాదాపు 15 శాతం పైగా ఇది 60 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
కారణాలు: వయస్సు పైబడటం, వ్యాయామం లేకపోవడం, క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగటం, డిస్కులు జారిపోవడం లేదా చీలికకు గురికావడం, వృత్తిరీత్యా అధిక బరువులు మోయటం, మెడను ఎక్కువ సమయం అసాధారణ రీతిలో ఉంచడం, ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు పని చేయడం, ఎత్తై దిండ్లు వాడటం, ఎక్కువ సమయం మెడను వంచి ఉంచడం, మెడకు దెబ్బ తగలడం, పూర్వం మెడకు శస్త్ర చికిత్స జరిగి ఉండటం, అధిక మానసిక ఒత్తిడి, అధిక బరువు, ధూమపానం, జన్యుపరమైన అంశాల వల్ల మెడనొప్పి పెరిగే అవకాశం ఉంది.
లక్షణాలు: సాధారణం నుండి తీవ్రస్థాయిలో మెడనొప్పి. మెడనుంచి భుజాలకు, చేతులకు, వేళ్ల వరకు పాకడం, డిస్కులు అరుగుదల వల్ల వెన్నుపూసల మధ్య స్థలం తగ్గి రాపిడి శబ్దాలు వినిపించడం, మెడ బిగుసుకుపోవడం, తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం, నరాలపై ఒత్తిడి పడితే చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవటం, చిన్న బరువులు కూడా ఎత్తలేకపోవడం, నడకలో నిలకడ కోల్పోవడం వంటివి.
చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో మాత్రమే అందించే జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ చికిత్సా విధానం ద్వారా మీ మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని, అందుకు సరిపడా ఔషధాన్ని అందించడం ద్వారా మెడనొప్పిని పూర్తిగా నయం చేయడమే కాకుండా వెన్నెముకను దృఢం చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు.
- డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
సీఎండ్‌డి,హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్