neck pain
-
విరాట్ కోహ్లికి గాయం!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) గాయపడినట్లు సమాచారం. మెడ నొప్పితో అతడు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉపశమనం కోసం కోహ్లి ఇంజక్షన్ కూడా తీసుకున్నాడని.. ప్రస్తుతం అతడు ఇంకా విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) వర్గాలు వెల్లడించాయి.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో విఫలంకాగా కోహ్లి ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పాల్గొన్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా టీమిండియా ఆడిన ఐదు టెస్టుల్లోనూ భాగమయ్యాడు. అయితే, కంగారూ గడ్డపై తనకున్న ఘనమైన రికార్డును ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఈసారి కొనసాగించలేకపోయాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో శతకం బాదడం మినహా.. మిగతా అన్నింట్లోనూ విఫలమయ్యాడు.రంజీలు ఆడతాడనుకుంటేఅంతేకాదు.. ఒకే రీతిలో అవుట్ కావడం కూడా కోహ్లి ఆట తీరుపై విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అతడు కూడా దేశవాళీ క్రికెట్లో ఆడాలని మాజీ క్రికెటర్లు సూచించారు. దీంతో కోహ్లి తన సొంత జట్టు ఢిల్లీ తరఫున రంజీ(Ranji Trophy) సెకండ్ లెగ్‌లో ఆడతాడనే వార్తలు వచ్చాయి. అయితే, ఈ స్టార్ బ్యాటర్ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని డీడీసీఏ కార్యదర్శి అశోక్ శర్మ ఇటీవలే తెలిపాడు.అంతేకాదు.. దేశీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇచ్చే విషయంలో ముంబై క్రికెటర్లను చూసి కోహ్లి నేర్చుకోవాలని విమర్శలు గుప్పించాడు. ఇక జనవరి 23 నుంచి ఆరంభం కాబోయే రంజీ సెకండ్ లెగ్ మ్యాచ్‌లకు ప్రకటించిన జట్టులోనూ కోహ్లి పేరును డీడీసీఏ చేర్చింది. ఈ నేపథ్యంలో అతడు గాయపడినట్లు తాజాగా వార్తలు రావడం గమనార్హం.ఇంజక్షన్ కూడా తీసుకున్నాడుఈ విషయం గురించి డీడీసీఏ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లి మెడనొప్పితో బాధపడుతున్నాడు. ఇంజక్షన్ కూడా తీసుకున్నాడు. తొలి రెండు రంజీలకు అతడు దూరమయ్యే అవకాశం ఉంది. సెలక్టర్లు మాత్రమే ఈ విషయం గురించి కచ్చితమైన సమాచారం ఇవ్వగలరు’’ అని పేర్కొన్నాయి.కెప్టెన్సీ వద్దన్న పంత్ఇక మరో ఢిల్లీ స్టార్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రం రంజీలు ఆడేందుకు సిద్ధమయ్యాడు. తొలుత అతడే ఢిల్లీ సారథిగా వ్యవహరిస్తాడని వార్తలు రాగా.. పంత్ అందుకు నిరాకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయుష్ బదోని కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇక సౌరాష్ట్ర, రైల్వేస్‌తో మ్యాచ్‌లకు డీడీసీఏ శుక్రవారం తమ జట్టును ప్రకటించనున్నట్లు సమాచారం.కాగా విరాట్ కోహ్లి 2012లో చివరిసారిగా రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. ఢిల్లీ- ఉత్తరప్రదేశ్ మధ్య ఘజియాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అయితే, రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 14, 43 పరుగులు మాత్రమే చేయగలిగాడు. నాటి మ్యాచ్‌లో యూపీ చేతిలో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.మరోవైపు.. రిషభ్ పంత్ 2017-18లో ఆఖరిగా ఢిల్లీ తరఫున రంజీ బరిలో దిగాడు. విదర్భతో నాటి ఫైనల్లో 21, 32 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ -
హెల్త్: మెడనొప్పికి అసలు కారణాలేంటో తెలుసా!?
సాధారణంగా టీనేజర్లలో మెడనొప్పి, నడుమునొప్పి లాంటి మధ్యవయస్కులకు వచ్చే ఆరోగ్య సమస్యలు అంతగా కనిపించకపోవచ్చుగానీ.. అవి రాకపోవడం అంటూ ఉండదు. ఆ వయసులో వారికుండే కొన్ని రకాల లైఫ్‌స్టైల్ అలవాట్లూ, ఇబ్బందులే అందుకు కారణం. ఉదాహరణకు.. వారు స్కూళ్లూ/కాలేజీలలో చాలాసేపు అదేపనిగా కూర్చునే ఉండటం, సరైన పోశ్చర్‌లో కూర్చోకపోవడం, బల్ల మీద ఉన్న కంప్యూటర్‌కూ, కుర్చీకీ మధ్య తగినంత దూరం లేకపోవడం లాంటి ఎన్నో అంశాల కారణంగా వాళ్లకూ మెడనొప్పి రావచ్చు. అలవాట్లే కాకుండా.. ఆరోగ్య సమస్యల విషయానికొస్తే.. థైరాయిడ్ లోపాలు, చిన్నతనంలో వచ్చే (టైప్–1) డయాబెటిస్, విటమిన్ లోపాలు, జీవక్రియల్లో లోపాల వల్ల కూడా టీనేజర్లలో మెడనొప్పి వస్తుంటుంది. అలాగే, టీనేజర్లకు ఆ వయసులో కొందరికి వచ్చే స్థూలకాయం, సరైన వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతోనూ రావచ్చు. టీనేజర్లలో మెడనొప్పి నివారణకు చేయాల్సినవి.. పై సమస్యల్లో ఏదైనా కారణమా అని మొదట చూసుకోవాలి. ఉదాహరణకు.. స్కూల్ / కాలేజీలో కూర్చునే చోట.. డెస్క్ తమ ఎత్తుకు తగినట్లుగా ఉందో లేదో, అందుకు తగినట్లుగా పోశ్చర్ ఉందో లేదో పరిశీలించుకోవాలి. కంప్యూటర్లపై పనిచేయడం లేదా వీడియో గేమ్స్ కోసం అదేపనిగా మెడను నిక్కించి ఉంచడం వల్ల ఆ భాగంలోని వెన్నుపూస ఎముకలూ, మెడ కండరాలపై తీవ్రమైన ఒత్తిడి పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. పోశ్చర్ సరిగా లేనప్పుడు / కూర్చున్నప్పుడు వెన్నుతో పాటు, దేహంలోని కండరాల మీద పడాల్సిన విధంగా కాకుండా.. ఒక్కోచోట ఎక్కువ ఒత్తిడి పడటం, మరికొన్ని చోట్ల సరిగా పడకపోవడం వంటి సమస్యలతో మెడనొప్పి, వెన్నునొప్పి రావచ్చు. అందుకే స్కూల్లో/కాలేజీలో లేదా ఇంట్లో చదువుల బల్ల / కంప్యూటర్ టేబుల్ వద్ద సరిగా (సరైన పోశ్చర్‌లో) కూర్చుండేలా చూడాలి. వెన్నుపై సమాన భారం పడేలా నిటారుగా ఉండాలి. ఏదో ఒక వైపునకు ఒంగిపోకూడదు. స్థూలకాయం ఉన్న టీనేజీ పిల్లల్లో మెడనొప్పి సమస్య ఎక్కువ. అందువల్ల ఒబేసిటీని పెంచే జంక్‌ఫుడ్ /బేకరీ ఐటమ్స్ లాంటివి కాకుండా టీనేజర్లకు అన్ని పోషకాలూ, విటమిన్లు అందేలా సమతులాహారం ఇవ్వాలి. గతంలో టీనేజీ పిల్లలు వారి వయసుకు తగ్గట్లు బాగానే ఆటలాడేవారు. కానీ ఇటీవల వారు ఆటలాడటం తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత అరుదుగా ఆడే ఆటలూ పూర్తిగా కరవైపోయాయి. దాంతో వెన్ను, దాని ఇతర ఎముకలకు తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల కూడా మెడనొప్పి రావడం ఇటీవల పెరిగింది. తగినంత వ్యాయామం లేని టీనేజర్లు.. తమ దేహ శ్రమతో తమ సామర్థ్యం (స్టామినా) పెంచుకోకపోవడం వల్ల త్వరగా అలసిపోతుంటారు. వారి మెడ భాగపు కండరాలూ, అక్కడి వెన్నుపూసల సామర్థ్యం కూడా ఇందుకు మినహాయింపు కాదు. అందుకే పిల్లలు తగినంత వ్యాయామం చేయడం / ఆటలాడటం ద్వారా స్టామినా పెంచుకుంటే మెడనొప్పి వంటి సమస్యలూ తగ్గిపోతాయి. పిల్లల్లో విటమిన్–డి లోపం వల్ల కూడా మెడనొప్పి వస్తుంది. అంతేకాదు.. వ్యాధి నిరోధకత తగ్గి.. వయసు పెరిగే క్రమంలో డయాబెటిస్, క్యాన్సర్ వ్యాధుల రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే టీనేజీ పిల్లలు ఆరుబయట ఆడేలా చూడాలి. ఇవి చదవండి: హెల్త్: నిద్రలేమి సమస్యా? అయితే ఇలా చేయండి! -
పిల్లల చేత ఇలా చేయిస్తే.. మెడనొప్పిని నివారించొచ్చు..
పిల్లల్లో మెడనొప్పి అంతగా కనిపించకపోయినా అరుదేమీ కాదు. వాళ్ల రోజువారీ అలవాట్లవల్ల కొద్దిమందిలో అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు వీపు వెనక పుస్తకాల బ్యాగ్ తాలూకు బరువు మోస్తూ... మెడను ముందుకు చాపి నడుస్తూ ఉండటం, స్కూళ్లలో బెంచీల మీద కూర్చుని... చాలాసేపు మెడ నిటారుగా ఉంచడం, కంప్యూటర్ మీద ఆటలాడుతూ చాలాసేపు మెడను కదిలించకుండా ఉంచడం వంటి అనేక అంశాలతో మెడనొప్పి రావచ్చు. ఇలాంటి పిల్లల చేత తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించేలా చేయడం వల్ల మెడనొప్పిని నివారించవచ్చు. స్కూల్లో తమ బెంచీ నుంచి డెస్క్కూ / ఇంట్లో తమ రీడింగ్ టేబుల్ నుంచి తమ కుర్చీకీ తగినంత దూరంలో ఉందా, పిల్లల ఎత్తుకు తగినట్లుగా ఉందా అన్నది చూసుకోవాలి. లేదంటే తల్లిదండ్రులు ఆ రీడింగ్ టేబుల్ ఎత్తును అడ్జెస్ట్ చేయాలి. వాటికి తగినట్లుగా తమ కూర్చునే భంగిమ (పోష్చర్) సరిగా ఉందా అన్నది కూడా తల్లిదండ్రులు పరిశీలించాలి. ∙స్కూల్లో లేదా ఇంట్లో... చదివే సమయాల్లో వెన్నును కంఫర్టబుల్‌గా ఉంచుకోవాలి. వెన్ను ఏదో ఒక వైపునకు ఒంగిపోయేలా కూర్చోకూడదు. అదే పనిగా చదవకుండా మధ్య మధ్య గ్యాప్ ఇస్తుండాలి. ∙పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతూ... మెడను చాలాసేపు నిటారుగా ఉంచడం సరికాదు. మధ్యమధ్యన మెడకు విశ్రాంతినిస్తూ ఉండాలి. ∙పిల్లలు వీడియోగేమ్స్ మాత్రమే కాదు... గ్రౌండ్లోనూ ఆటలాడేలా పేరెంట్స్ ప్రోత్సహించాలి. ∙ఊబకాయం ఉన్న పిల్లల్లో మెడనొప్పి వచ్చే అవకాశాలెక్కువ. అందుకే వారు తినే తినుబండారాలు ఆరోగ్యకరంగా ఉండాలి. వీలైనంతవరకు జంక్‌ఫుడ్ /బేకరీ ఐటమ్స్‌కు దూరంగా ఉంచాలి. ఈ జాగ్రత్తలు మెడనొప్పిని నివారిస్తాయి. అప్పటికే మెడనొప్పి ఉంటే తగ్గిస్తాయి. ఇవి పాటించాక కూడా తగ్గకపోతే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించాలి. -
మెడనొప్పి బాధిస్తుందా.. అయితే ఇలా చేయండి
ఇటీవలి కాలంలో మెడనొప్పి సమస్య చాలా మందిని వేధిస్తోంది. మెడనొప్పి ఉంటే ఏ పనులూ సరిగ్గా చేయలేం. ఈ మెడనొప్పికి కారణాలు చాలానే ఉన్నాయి. ముందుగా కారణాన్ని తెలుసుకుని, అందుకు తగ్గ చికిత్సను తీసుకుంటే మెడ నొప్పిని సులువుగా తగ్గించుకోవచ్చు. ఆఫీసులో లేదా వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్న వారు గంటల తరబడి కూర్చుని లాప్టాప్ లేదా కంప్యూటర్ మీద పనిచేయడం వల్ల మెడనొప్పి వస్తుంది. సాధారణంగా మనం కూర్చునే విధానం సరిగ్గా లేకుంటేనే మెడ నొప్పి వస్తుంది. చిన్న సమస్యే అని తేలిగ్గా తీసేస్తే సమస్య మరింత పెద్దదయ్యే ప్రమాదం ఉంది. మెడ నొప్పికి కారణాలు: సరిగ్గా కూర్చోకపోవడం: కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ లను ఎక్కువ సేపు ఉపయోగించేటప్పుడు సరిగ్గా కూర్చోకపోవడం వల్ల దీనివల్ల కండరాలకు ఒత్తిడి కలుగుతుంది. మంచం మీద పడుకుని లేదా కూర్చొని చదవడం వల్ల కూడా ఒత్తిడికి దారితీస్తాయి. ఇది మెడనొప్పికి కారణమవుతుంది. గాయాలు: తల అకస్మాత్తుగా వెనుకకు, తరువాత ముందుకు కదిలినప్పుడు, నరాలు ఒత్తుకుపోవడం... వల్ల కూడా మెడనొప్పి వస్తుంది. కీళ్ళు అరిగిపోవడం: శరీరంలోని ఇతర కీళ్ళ మాదిరిగానే మెడ కీళ్లు కూడా వయస్సు వచ్చే కొద్దీ అరుగుతాయి. ఈ అరుగుదల వల్ల మెడ కదలికలు ప్రభావితం అవుతాయి. దీనివల్ల మెడనొప్పి వస్తుంది. ► అయితే కొన్ని చిట్కాలను అనుసరించడం వల్ల ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. అవేంటంటే.. మెడ నొప్పిని తగ్గించే చిట్కాలు సరైన భంగిమ: కూర్చున్నప్పుడు లేదా నిలబడినప్పుడు భుజాలు తుంటిపై సమానమైన వాలులో ఉన్నాయని నిర్ధారించుకోండి. అలాగే మీ చెవులు నేరుగా మీ భుజాలకు సమకోణంలో ఉండేట్టు చూసుకోవాలి. సెల్ ఫోన్లు, టాబ్లెట్లు లేదా ఇతర చిన్న స్క్రీన్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగిస్తున్నప్పుడు మెడను వంచకూడదు. అలా వంచకూడదంటే ఈ వస్తువులు మీ తలకు అనుగుణంగా కాస్త ఎత్తులో పెట్టాలి. అలాగే మీ వర్క్ టేబుల్, కంప్యూటర్, కుర్చీని సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. విరామం అవసరం: ఎక్కువసేపు డ్రైవ్ చేయాల్సి వచ్చినా.. లేదా స్క్రీన్ ముందు గంటల తరబడి పనిచేయాల్సి వచ్చినా.. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. ముఖ్యంగా మెడను, భుజాలను బాగా కదిలించండి. అలాగే మీ శరీరాన్ని సాగదీయండి. భుజాలపై ఎక్కువ బరువును వేయద్దు: మీ భుజాలు, చేతులపై ఎక్కువ బరువుండే బ్యాక్ ప్యాక్ లను మోయకండి. ఎందుకంటే ఇవి మీ భుజాలపై ఒత్తిడిని కలిగిస్తాయి. తద్వారా. మెడ నొప్పి వస్తుంది. సౌకర్యంగా పడుకోవాలి: మీ తల, మెడ.. మీ శరీరంలోని మిగిలిన భాగాలకు అనుగుణంగా ఉండాలి. మీ తలకింద పెద్ద సైజు దిళ్లను అసలే ఉపయోగించకండి. దిండు లేకుండా ఉండలేమనుకుంటే చిన్న దిండును మాత్రమే ఉపయోగించండి. కాళ్ల కింద దిండును వేసుకుంటే మంచిది. దీనివల్ల వెన్నెముక కండరాలు రిలాక్స్ అవుతాయి. జీవనశైలిలో మార్పులు: ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవద్దు. ఎక్కువగా తిరగండి. నడవండి. ధూమపానం అలవాటుంటే వెంటనే మానుకోండి. ఎందుకంటే ఇది మెడ నొప్పి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు: ఇంటి నుంచి పనిచేయడం లేదా ల్యాప్ టాప్ల ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల మెడ నొప్పి వస్తుంది. అయితే శరీరాన్ని సాగదీసే స్ట్రెచింగ్ వ్యాయామాల వల్ల మెడనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా వైద్యులు లేదా ఫిజియో థెరపిస్టులు చెప్పే కొన్ని చిట్కాలను అనుసరించడం వల్ల మెడనొప్పి తొందరగా తగ్గుతుంది. కాపడం: మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి, వాపు లేదా మంటను తగ్గించడానికి చల్లని లేదా హీట్ కంప్రెస్ రెండింటినీ ఉపయోగించొచ్చు. ఇది కండరాల సడలింపునకు సహాయపడుతుంది. నొప్పిని తగ్గిస్తుంది. అయితే ఈ టెక్నిక్ ను 20 నిమిషాల కంటే ఎక్కువ సార్లు ఉపయోగించకూడదు. మసాజ్: మెడ నొప్పికి మసాజ్ థెరపీ వల్ల కండరాలను సడలించవచ్చు. తీవ్రమైన మెడ నొప్పిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అలాగే ఇది రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాలను తగ్గిస్తుంది. మెడనొప్పి తగ్గడానికి నొప్పి నివారణ మందులు ఉంటాయి. అయితే అలా మందులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్టులు తప్పవు. అందువల్ల మందులకు బదులు కొన్ని నొప్పి నివారణ చర్యలు, ఉపశమన చర్యలను పాటించడం మంచిది. -
Health Tips: రోజూ కోడిగుడ్డు తిన్నారంటే..
కొంతమంది ఉడకబెట్టిన కోడిగుడ్డు తినేందుకు ఇష్టపడరు. అలాంటి వారు దాని ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదలరు. గుడ్డులోని తెల్లసొనను తినడం వల్ల అధిక రక్తపోటును నియంత్రించుకోవచ్చు. గుడ్డు తినడం అన్ని రకాల గుండె సమస్యలను దూరం చేస్తుంది. అందువల్ల మీరు రోజూ తినే ఆహారంలో గుడ్డును చేర్చుకోవడం చాలా మంచిది. మరిన్ని ఆరోగ్య చిట్కాలు మెడ నొప్పితో బాధపడుతున్నారా? నిద్ర లేచిన తర్వాత మీకు మెడ నొప్పిగా అనిపిస్తే.. నొప్పి ప్రభావిత ప్రాంతాల్లో ఐస్ ప్యాక్ లేదా చల్లని నీటిలో క్లాత్‌ను ముంచి నీళ్లు పిండేసి మెడమీద మెల్లగా అద్దాలి. అలా చేయడం వల్ల మెడ కండరాల వాపు తగ్గుతుంది. దీంతో పాటు హీట్ ప్యాక్ ను ఉపయోగించవచ్చు. మెడ నొప్పిగా ఉన్న వాళ్లు చేతులతో మెడను నెమ్మదిగా మసాజ్ చేయాలి. అలా చేయడం వల్ల కండరాలు సర్దుకొని నొప్పి తగ్గే అవకాశం ఉంది. మసాజ్ చేసే సమయంలో కొబ్బరి లేదా నువ్వుల నూనె ఉపయోగిస్తే మేలు. ఒకోసారి నిద్రలో కూడా మెడ పట్టేస్తుంటుంది. ఇందుకోసం మీరు రాత్రిళ్లు బోర్లా పడుకోకుండా ఉంటే చాలు. చుండ్రు పోవాలంటే.. బాదం నూనెలో నిమ్మరసం కలిపి రాసుకుంటే చుండ్రు పోతుంది. ఒక గిన్నెలో కొద్దిగా బాదం నూనెను తీసుకొని.. అందులో కాస్త నిమ్మ రసాన్ని మిక్స్ చేసి.. ఆ తర్వాత జుట్టుకు పట్టించాలి. ఇది మాడుకు పట్టేట్లుగా కొద్దిసేపు చేతులతో తలపై మృదువుగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత అవసరమైతే.. గంట తర్వాత లేదా మరుసటి రోజు షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. చదవండి: Beauty Tips: ముఖంపై మంగు మచ్చలు ఉంటే.. పాలల్లో ఎర్రకందిపప్పు నూరి నేతిలో కలిపి.. -
Neck Pain: టీనేజర్లలో మెడనొప్పి.. తగ్గాలంటే!
Neck Pain: సాధారణంగా టీనేజర్లలో మెడనొప్పి, నడుమునొప్పి లాంటి మధ్యవయస్కులకు వచ్చే ఆరోగ్య సమస్యలు అంతగా కనిపించకపోవచ్చుగానీ... అవి రాకపోవడం అంటూ ఉండదు. ఆ వయసులో వారికుండే కొన్ని రకాల లైఫ్‌స్టైల్ అలవాట్లూ (పోష్చర్కు సంబంధించినవి), ఇబ్బందులూ కారణం. ఉదాహరణకు... వారు స్కూళ్లూ/కాలేజీలలో చాలాసేపు అదేపనిగా కూర్చునే ఉండటం, సరైన పోష్చర్‌లో కూర్చోకపోవడం, బల్ల మీద ఉన్న కంప్యూటర్‌కూ, కుర్చీకీ మధ్య సరైన సమన్వయం లేకపోవడం లాంటి ఎన్నో అంశాల కారణంగా వాళ్లకూ మెడనొప్పి రావచ్చు. అలవాట్లు కాకుండా... ఇక ఆరోగ్య సమస్యల విషయాన్ని తీసుకుంటే... థైరాయిడ్ లోపాలు, చిన్నతనంలో వచ్చే (టైప్–1) డయాబెటిస్, విటమిన్ లోపాలు, జీవక్రియల్లో లోపాల వల్ల కూడా టీనేజర్లలో మెడనొప్పి వస్తుంటుంది. అలాగే దేహశ్రమ, ఒకే చోట కూర్చుని ఉండటం లాంటి విషయాలకు వస్తే... టీనేజర్లకు ఆ వయసులో కొందరికి వచ్చే స్థూలకాయం, సరైన వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతోనూ రావచ్చు. టీనేజర్లలో మెడనొప్పి నివారణకు చేయాల్సినవి. పై సమస్యల్లో ఏదైనా కారణమా అని మొదట చూసుకోవాలి. ఉదాహరణకు... ►స్కూల్ / కాలేజీలో కూర్చునే చోట... డెస్క్ అతడి ఎత్తుకు తగినట్లుగా ఉందో లేదో, అతడి ఎత్తుకు తగినట్లుగా పోష్చర్ ఉందో లేదో పరిశీలించుకోవాలి. కంప్యూటర్లపై పనిచేయడం లేదా వీడియో గేమ్స్ కోసం అదేపనిగా మెడను నిక్కించి ఉంచడం వల్ల ఆ భాగంలోని వెన్నుపూస ఎముకలూ, మెడ కండరాలపై తీవ్రమైన ఒత్తిడి పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. ►పోష్చర్ సరిగా లేనప్పుడు / కూర్చున్నప్పుడు వెన్నుతో పాటు, దేహంలోని కండరాల మీద పడాల్సిన విధంగా కాకుండా... ఒక్కోచోట ఎక్కువ ఒత్తిడి పడటం, మరికొన్ని చోట్ల సరిగా పడకపోవడం వంటి సమస్యలతో మెడనొప్పి, వెన్నునొప్పి రావచ్చు. అందుకే స్కూల్లో/కాలేజీలో లేదా ఇంట్లో చదువుల బల్ల / కంప్యూటర్ టేబుల్ వద్ద సరిగా (సరైన పోష్చర్‌లో) కూర్చుండేలా చూడాలి. వెన్నుపై సమాన భారం పడేలా నిటారుగా ఉండాలి. ఏదో ఒక వైపునకు ఒంగిపోకూడదు. ►స్థూలకాయం ఉన్న టీనేజీ పిల్లల్లో మెడనొప్పి సమస్య ఎక్కువ. టీనేజర్లలో ఒబేసిటీ తగ్గేలా చర్యలు తీసుకోవాలి. ఒబేసిటీ పెంచే జంక్‌ఫుడ్ /బేకరీ ఐటమ్స్ లాంటివి కాకుండా టీనేజర్లకు అన్ని పోషకాలూ, విటమిన్లు అందేలా సమతులాహారం ఇవ్వాలి. ►గతంలో టీనేజీ పిల్లలు వారి వయసుకు తగ్గట్లు బాగానే ఆటలాడేవారు. కానీ ఇటీవల వారు ఆటలాడటం తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత అరుదుగా ఆడే ఆటలూ పూర్తిగా కరవైపోయాయి. దాంతో వెన్ను, దాని ఇతర ఎముకలకు తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల కూడా మెడనొప్పి రావడం ఇటీవల పెరిగింది. ►తగినంత వ్యాయామం లేని టీనేజర్లు... తమ దేహ శ్రమతో తమ సామర్థ్యం (స్టామినా) పెంచుకోకపోవడం వల్ల త్వరగా అలసిపోతుంటారు. వారి మెడ భాగపు కండరాలూ, అక్కడి వెన్నుపూసల సామర్థ్యం కూడా ఇందుకు మినహాయింపు కాదు. అందుకే పిల్లలు తగినంత వ్యాయామం చేయడం / ఆటలాడటం ద్వారా స్టామినా పెంచుకుంటే మెడనొప్పి వంటి సమస్యలూ తగ్గిపోతాయి. ►పిల్లల్లో విటమిన్–డి లోపం వల్ల కూడా మెడనొప్పి వస్తుంది. అంతేకాదు... వ్యాధి నిరోధకత తగ్గి... వయసు పెరిగే క్రమంలో డయాబెటిస్, క్యాన్సర్ వ్యాధుల రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే టీనేజీ పిల్లలు ఆరుబయట ఆడేలా చూడాలి. ►ఇలాంటి సూచనలు పాటించాక కూడా మెడనొప్పి వస్తుంటే... థైరాయిడ్ లేదా ఇతరత్రా వైద్య సమస్యలను గుర్తించడానికి డాక్టర్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించాలి. ఆ ఫలితాల ఆధారంగా సమస్యను సరిగా నిర్ధారణ చేసి, డాక్టర్లు తగిన చికిత్స అందిస్తారు. -డాక్టర్ వెంకటరామ్ తేలపల్లి, సీనియర్ పీడియాట్రిక్ ఆర్థోపెడీషియన్ -
మెడ పట్టేసిందా.. ఇలా చేయండి!
చాలామందికి నిద్రలోగాని, లేదా ప్రయాణంలో గానీ లేదా సుదూర ప్రయాణాల తర్వాత గాని మెడ పట్టుకుంటుంది. ఇలా మెడ పట్టేయడాన్ని ఇంగ్లిష్‌లో రై నెక్ అంటారు. ఇలా మెడ పట్టేసినప్పుడు మళ్లీ అది నిద్రలోనే సర్దుకుంటుందనీ లేదా తలదిండు తీసేసి పడుకోవడం వల్ల త్వరగా తగ్గుతుందని అనుకుంటారు. ఇది అపోహ మాత్రమే. మెడ పట్టేసినప్పుడు ఆ పరిస్థితి త్వరగా సర్దుకునేందుకు పాటించాల్సిన సూచనలివి... ఒక మెత్తటి టర్కీ టవల్‌ను తీసుకుని, దాన్ని గుండ్రంగా రోల్ చేసుకుని మెడ కింద దాన్ని ఓ సపోర్ట్‌గా వాడాలి. లేదా తలగడనే భుజాల వరకు లాగి పడుకోవాలి. తలగడ అన్నది కేవలం తలకు మాత్రమే కాకుండా... భుజాలకు కూడా సపోర్ట్ ఇచ్చేలా అమర్చుకోవాలి. దీనివల్ల మెడ నొప్పి ఒకటి రెండు రోజుల్లో తగ్గుతుంది. వ్యాయామాలు చేస్తుండేవారు మెడకు సంబంధించిన ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకూడదు. పైగా మెడ పట్టేయడం సర్దుకునేందుకు అంటూ ఎలాంటి వ్యాయామాలూ చేయకూడదు. ఇలా చేస్తే పరిస్థితి మరింత తీవ్రతరమవుతుంది. కుడి చేత్తోగాని లేదా ఎడమ చేత్తో గానీ ఐదు కిలోలకు మించి బరువు అకస్మాత్తుగా ఎత్తకూడదు. అంతకు మించిన బరువులు అసలే ఎత్తకూడదు. కొందరు సెలూన్ షాప్‌లో మెడను రెండువైపులా అకస్మాత్తుగా కటకటమని శబ్దం వచ్చేలా విరిచేస్తున్నట్లుగా తిప్పిస్తుంటారు. ఇది మొరటు పద్ధతి. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుసరించకూడదు. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే పారాసిటమల్ లేదా ప్రమాదం లేని సాధారణ నొప్పి నివారణ మందును రెండు రోజుల కోసం మాత్రమే వాడాలి. సాధారణంగా రెండు రోజుల్లో తగ్గిపోయే ఈ సమస్యలో అప్పటికీ ఉపశమనం లేకపోతే అప్పుడు డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. -
గాయాన్ని జయించిన యామీ గౌతమ్..
ముంబై: బాలీవుడ్ నటి యామీ గౌతమ్ గత కొద్ది కాలంగా తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతుంది. కాగా మెడ నొప్పిని తగ్గించుకోవడానికి యోగా చేశానని తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ వల్ల తన శరారీక, మానసిక ఫిట్నిస్పై శ్రద్ధ వహించినట్లు పేర్కొన్నారు. కాగా తన శరీరాన్ని అంతర్గతంగా నయం అయ్యే విధంగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. తన గాయాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రద్ధ వహించానని, అంతిమంగా నొప్పిని జయించి సాధారణ జీవితాన్ని గడుపుతున్నట్లు పేర్కొన్నారు. తన తదుపరి సినిమా గిన్నీ వెడ్స్ సన్నీ ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు యామీ గౌతమ్ రానున్నారు. కాగా యామీ మొదట్లో ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో అందరిని ఆకట్టుకుంది. మొదట సీరియల్ నటిగా తర్వాత మోడల్‌గా, అనంతరం హీరోయిన్గా కెరీర్లో దూసుకెళ్తుంది. కాగా ఇటీవల బాలా చిత్రం ద్వారా యామీ గౌతమ్ మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. చదవండి: అందులో తప్పేముంది? : నటి -
మెడనొప్పికి చికిత్స ఉందా?
నా వయసు 56 ఏళ్లు. గత కొంతకాలంగా నేను తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. ఆ నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. కొద్దిగా వణుకుతున్నాయి కూడా. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడభాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా? మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా, జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ►వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ►క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ►వృత్తిరీత్యా అధికబరువులు మోయడం ►ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ►ఎక్కువసేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్వు సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ►ఎత్తైన దిండ్లు వాడటం ►మెడకు దెబ్బతగలడం ►మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ►తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు : ►సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ►నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ►మెడ బిగుసుకుపోవడం ►తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ►నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ►చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ►నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ సైనసైటిస్ తగ్గుతుందా? నా వయసు 28 ఏళ్లు. ఇటీవల నాకు రోజూ ఉదయంపూట తలనొప్పి వస్తోంది. రోజూ ముక్కుదిబ్బడ వేసి చాలా అసౌకర్యంగా ఉంటోంది. ముక్కు నుంచి నీరు కూడా అదేపనిగా కారుతూ చాలా ఇబ్బంది కలిగిస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సైనసైటిస్ అన్నారు. ఇంగ్లిషు మందులు వాడినా తగ్గలేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? వాతావరణ మార్పులు జరిగినప్పుడల్లా సైనసైటిస్ సమస్య మొదలువుతుంది. మళ్లీ మళ్లీ వస్తూ దీర్ఘకాలం పాటు వేధించే ఈ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడేవారు మన సమాజంలో చాలామందే ఉంటారు. ఈ సమస్యను మూడు విభాగాలుగా చూడవచ్చు. ఒకటి ఎక్యూట్. ఇది వస్తే వారం రోజులుంటుంది. రెండోది సబ్ఎక్యూట్. ఇది నాలుగు నుంచి ఎనిమిది వారాలుంటుంది. మూడోది క్రానిక్. అంటే దీర్ఘకాలంపాటు బాధించేది అని అర్థం. కారణాలు : బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశవ్యాధులు, ముక్కులో ఎముక పెరగడం, అలర్జీ, పొగ, వాతావరణంలో ఉండే విపరీతమైన కాలుష్యం, అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు, గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, ఈత (స్విమ్మింగ్ చేయడం), జలుబు, గొంతునొప్పి, పిప్పిపన్ను, టాన్సిల్స్ వాపు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి సైనసైటిస్‌కు కారణమవుతాయి. వ్యాధి లక్షణాలు: సైనసైటిస్‌తో బాదపడేవారిలో తలనొప్పి, తలంతా బరువుగా ఉండటం, ముఖంలో వాపు, ముఖంలోని సైనస్‌లు ఉండే భాగాల్లో నొప్పి, ముక్కు దిబ్బడ వేస్తూ ఉండటం, ముక్కులో దురద పెడుతూ ఉండటం, ముక్కు నుంచి నీరు కారడం, గొంతులోకి ద్రవాలు స్రవిస్తూ ఉండటం, దగ్గు, జలుబు, చెవిలో చీము వంటి లక్షణాలు కనిపిస్తాయి. తరచూ జలుబు చేస్తూ ఉండటం, దాంతో చాలా ఎక్కువ రోజులు బాధపడటం అనేది సైనస్ వ్యాధి ప్రాథమిక లక్షణం. ఆ తర్వాత దశలో జలుబు చేసినప్పుడు ముక్కులు బిగదీసుకుపోతాయి. తీవ్రమైన తలనొప్పి, దగ్గు, శ్వాస దుర్గంధంతో కూడి ఉండటం కూడా జరుగుతుంది. చికిత్స: హోమియో చికిత్సలో శస్త్రచికిత్స అవసరం లేకుండానే సైనసైటిస్‌ను సమూలంగా తగ్గించవచ్చు. ఈ మందులతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇతర చికిత్స వల్ల తాత్కాలింగా ఉపశమనం కలుగుతుందే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. కానీ హోమియో చికిత్స వల్ల సైనసైటిస్ పూర్తిగా తగ్గిపోతుంది. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వారు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడటం వల్ల మళ్లీ మళ్లీ రాకుండా సమర్థంగా చికిత్స చేయవచ్చు. డా‘‘ కె. రవికిరణ్, మాస్టర్స్ హోమియోపతి, హైదరాబాద్ -
మెడనొప్పి చేతులకూ పాకుతోంది..?
నా వయసు 52 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. మందులు వాడుతున్నంత కాలం బాగానే ఉన్నా అవి ఆపేస్తే మాత్రం మళ్లీ నొప్పి వస్తోంది. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా? వివరంగా చెప్పగలరు. వయసు పెరగడం వల్ల వచ్చే మెడ నొప్పికి పూర్తి పరిష్కారం లభించదని చాలామంది అనుకుంటుంటారు. కానీ హోమియోచికిత్స ద్వారా ఈ సమస్యకు పూర్తి పరిష్కారం దొరుకుతుంది. మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. దీనినే సర్వైకల్ స్పైనల్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. దాదాపు 85 శాతానికి పైగా ఇది 60 ఏళ్ల వయసు పైబడిన వారిలో కనిపిస్తుంది. ప్రస్తుతం జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ►వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ►క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం ►డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ►వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ►ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ►ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్వు సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ►ఎత్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ►మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ►తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: ►సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ►నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ►మెడ బిగుసుకుపోవడం ►తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ►నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ►చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ►నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్ఆర్, ఎక్స్–రే సర్వైకల్ స్పైన్, ఎమ్మారై పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కళ్లు పచ్చగా ఉన్నాయి...పరిష్కారం చెప్పండి నా వయసు 35 ఏళ్లు. నా కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. మూత్రం కూడా పసుపురంగులో వస్తోంది. ఈ లక్షణాలు చూసి నాకు ఆందోళనగా ఉంది. నా సమస్య ఏమిటి? దీనికి హోమియోలో మంచి చికిత్స ఉందేమో దయచేసి వివరించండి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు కామెర్లు సోకినట్లు తెలుస్తోంది. ఇది దీర్ఘకాలంలో కాలేయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. మానవ శరీరంలో కాలేయం అతి ముఖ్యమైన భాగం. ఈ అవయవానికి వైరస్ కారణంగా ఇన్ఫెక్షన్ సోకితే ఎన్నో సమస్యలు మొదలవుతాయి. కాలేయం ప్రభావం చూపే వైరస్లలో ముఖ్యమైనవి హెపటైటిస్–బి, హెపటైటిస్–సి. ఈ వైరస్లు సోకగానే బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొంతకాలం పాటు ఆ వైరస్ వారి శరీరాల్లో నిద్రాణంగా ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా కాలేయాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రాణాంతకంగా మారుతుంది. లివర్ క్యాన్సర్ సిర్రోసిస్, వైరల్ హెపటైటిస్ వ్యాధులు రావడానికి కారణమవుతుంది. లక్షణాలు: హెపటైటిస్ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే లక్షణాలు బయటకేమీ కనిపించవు. అవి కనిపించడానికి చాలా ఏళ్లు పడుతుంది. కొంతమందిలో వైరస్ సోకిన కొద్దిరోజులకే కామెర్లు వస్తాయి. దీన్ని ఎక్యూట్ స్టేజ్‌గా చెప్పవచ్చు. ఈ దశలో వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. కొంతమందిలో ఈ వైరస్ తొలగిపోకుండా, శాశ్వతంగా శరీరంలోనే నివాసం ఏర్పరచుకొని బలం పెంచుకుంటూ పోతుంది. దీనిని క్రానిక్ స్టేజ్ అంటారు. ఈ దశలోనే కాళ్లవాపు, పొట్ట ఉబ్బరం, వాంతులు, ఆకలి తగ్గిపోవడం, మూత్రం పచ్చగా రావడం, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స: రోగి శారీరక మానసిక లక్షణాలను పరిశీలించి చికిత్స అందించడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. మీరొకసారి హోమియో వైద్యుడిని సంప్రదించండి. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల ఆధ్వర్యంలో మందులు వాడితే భవిష్యత్తులో కాలేయానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా పూర్తిగా కాపాడుకోవచ్చు. డా‘‘ కె. రవికిరణ్, మాస్టర్స్ హోమియోపతి, హైదరాబాద్ -
వెన్నునొప్పి తగ్గడం లేదు... పరిష్కారం చెప్పండి
నా వయసు 32 ఏళ్లు. ఒక మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నాను. రోజూ 60 కి.మీ. బైక్ మీద వెళ్తుంటాను. అలాగే కొన్ని అకౌంట్స్ కోసం కంప్యూటర్ మీద కూడా చాలా ఎక్కువగా పనిచేస్తుంటాను. నాకు మూడు నెలల క్రితం తీవ్రమైన వెన్నునొప్పి వచ్చింది. ఇప్పుడు డాక్టర్‌కు చూపించుకున్నాను. మందులు రాసిచ్చారు. ఒక వారం పాటు వాడాను. నొప్పి తగ్గింది. ఈమధ్య ఒక వారం రోజుల నుంచి వెన్నుతో పాటు మెడ భాగంలో కూడా తీవ్రమైన నొప్పి వస్తోంది. నాకున్న సమస్య ఏమిటి? పరిష్కారం సూచించండి. ఈమధ్య వయసుతో నిమిత్తం లేకుండా చాలామందిలో వెన్నునొప్పులు వస్తున్నాయి. మీ సమస్య విషయానికి వస్తే రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మీరు టూ–వీలర్ మీద చాలా లాంగ్ డ్రైవింగ్ చేయడం. పైగా డ్రైవింగ్‌లో చాలా ఎక్కువగా ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటూ ఉండవచ్చు. మన రోడ్ల మీద గతుకులు చాలా సాధారణం. ఇలాంటి నేపథ్యంలో ఇంతింత దూరాలు టూ–వీలర్‌పై ప్రయాణం చేయడం ఎంతమాత్రమూ మంచిది కాదు. ఏకధాటిగా అంతసేపు మీరు బైక్ మీద ప్రయాణం చేయడం వల్ల మీ వెన్ను (స్పైన్) తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. అంతేకాకుండా కంప్యూటర్ మీద అన్ని గంటలు పనిచేయడం వల్ల కూడా మీకు వెన్నుతో పాటు మెడ నొప్పి కూడా వస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది చాలా ప్రమాదకరం. మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న సీనియర్ స్పైన్ సర్జన్‌ను కలవండి. వారు కొన్ని పరీక్షలు చేయించి, వాటిని బట్టి మీ సమస్యకు తగిన పరిష్కారం వారు సూచిస్తారు. అయితే ఈలోగా మీరు ఈ కింద పేర్కొన్న కొన్ని సూచనలు పాటించండి. ►మీ సీటుకు ముందు భాగాన ఉండే కంప్యూటర్ డెస్క్‌ను మీ తలకు సమానంగా ఉండేలా అమర్చుకోండి. దానికి అనుగుణంగా ఉండేలా మీరు ఆఫీసులో కూర్చునే భంగిమ మార్చుకోండి. ►కొన్ని సాధారణ వార్మ్అప్ వ్యాయామాలు చేయండి ►వెన్ను, మెడ తీవ్రమైన ఒత్తిడికి, వేగవంతమైన కదలికలకు గురికాకుండా చూసుకోండి. ఇలా చేయడం వల్ల కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. -
మెడనొప్పి చేతుల వరకూ పాకుతోంది.. ఎందుకిలా?
నా వయసు 54 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. ఎందుకిలా జరుగుతోంది? హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా?– ఆర్. సుభాష్, వైరా మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా, జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు : ∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం ∙డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ∙వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ∙ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువసేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ∙ఎల్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు : ∙సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం ∙తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ∙నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ∙నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. హోమియో చికిత్స : జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు.డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,సీఎండీ, హోమియోకేర్ఇంటర్నేషనల్,హైదరాబాద్ -
మెడ నొప్పి చేతులకూ పాకుతోంది!
నా వయసు 58 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. ఆ నొప్పి చేతులకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా? మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా, జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ►వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ►క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం ►డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ►వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ►ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ఎక్కువసేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ►ఎల్తైన దిండ్లు వాడటం ►మెడకు దెబ్బతగలడం ►మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ►తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: ►సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ►నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ►మెడ బిగుసుకుపోవడం ►తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ►నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ►చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ►నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టి ట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ సోరియాసిస్నుంచి విముక్తి ఎలా? నా వయసు 39 ఏళ్లు. చాలా రోజుల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా సమస్య పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ సమస్య. ఇది చర్మ సమస్యే అయినా ఇది మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్యగా పరిగణించాలి. ఈ వ్యాధి వచ్చిన వారిలో చర్మకణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడి, అవి వెండిరంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్ల వంటివీ ఏర్పడతాయి. దురద కూడా ఎక్కువ. చిరాకుగా ఉంటుంది. సోరియాసిస్ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. కారణాలు: ►వంశపారంపర్యం ►మానసిక ఒత్తిడి, ఆందోళన ►శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత ►దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం. లక్షణాలు: ►చర్మం ఎర్రబారడం ►తీవ్రమైన దురద ►జుట్టు రాలిపోవడం ►కీళ్లనొప్పులు ►చర్మం పొడిబారినప్పుడు పగుళ్లు ఏర్పడి రక్తస్రావమూ అవుతుంది. నిర్ధారణ పరీక్షలు: స్కిన్ బయాప్సీ, ఈఎస్ఆర్, సీబీపీ, ఎక్స్–రే పరీక్షలు. చికిత్స: సోరియాసిస్ నివారణ/చికిత్సలకు హోమియోలో సమర్థమైన మార్గాలు ఉన్నాయి. అయితే సోరియాసిస్‌ను వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి ఈ సమస్య నుంచి విముక్తి కోసం సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్కుచికిత్సఉందా? నా వయసు 68 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. నాకు ఆపరేషన్ అంటే భయం. హోమియోలో ఆపరేషన్ లేకుండా దీనికి చికిత్స ఉందా? మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు: ►దీర్ఘకాలిక మలబద్దకం ►ఎక్కువకాలం విరేచనాలు ►వంశపారంపర్యం ►అతిగా మద్యం తీసుకోవడం ►ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ►మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: ►తీవ్రమైన నొప్పి, మంట ►చురుకుగా ఉండలేరు ►చిరాకు, కోపం ►విరేచనంలో రక్తం పడుతుంటుంది ►కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
చేతులకు పాకే మెడనొప్పి... తగ్గేదెలా?
నా వయసు 53 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా? మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా, జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం ∙డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ∙ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ∙ఎల్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు : ∙సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం ∙తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ∙నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలుగమనించవచ్చు. హోమియో చికిత్స : జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ గ్యాస్ట్రిక్ అల్సర్కుపరిష్కారం ఉందా? నా వయసు 35 ఏళ్లు. ఇటీవల కండుపులో మంట, వికారంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే అబ్డామిన్ స్కానింగ్ వంటి పరీక్షలు చేయించి, అల్సర్ ఉందని చెప్పారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? ఇటీవలి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణకోశ సమస్యలు ముఖ్యంగా ఈమధ్యకాలంలో కనిపిస్తున్న ఆరోగ్య సమస్యలను మనం వ్యాధులుగా పరిగణించడం కంటే జీవనశైలి లోపాలుగా పరిగణిస్తే సబబుగా ఉంటుంది. మన జీవనశైలిలో లోపాలు, ఆహారపు అలవాట్ల కారణంగా ఇటీవల గ్యాస్ట్రిక్ అల్సర్ వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణశయంలో ఆల్సర్లు పెరుగుతాయి. కారణాలు : ∙80 శాతం మందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అల్సర్లు వస్తాయి ∙చాలామందిలో కడుపులో పుండ్లు రావడానికి హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ముఖ్యమైనది ∙మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ∙మద్యపానం, పొగతాగడం ∙వేళకు ఆహారం తీసుకోకపోవడం ∙కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. లక్షణాలు : ∙కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ∙ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం ’ తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్త విరేచనాలు ∙కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, ఆకలి తగ్గడం ∙నోటిలో ఎక్కువగా నీళ్లు ఊరడం. నివారణ జాగ్రత్తలు : ∙పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి ∙మద్యపానం, పొగతాగడం అలవాట్లు మానేయాలి ∙కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి ∙కంటినిండా నిద్రపోవాలి ∙మానసిక ఒత్తిడి దూరం కావడానికి యోగా, ధ్యానం చేయాలి ∙ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. చికిత్స : గ్యాస్ట్రిక్ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సనిక్ ఆల్బ్, యాసిడ్ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ తిన్న వెంటనే టాయ్‌లెట్‌కు... ఎందుకిలా? నా వయసు 38 ఏళ్లు. ఒక్కోసారి తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన ఉన్నాయి.దయచేసి నా సమస్య ఏమిటి? నా సమస్యకు హోమియోలో చికిత్స ఉందా? మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యకు నిర్దిష్టమైన కారణం తెలియదు. అయితే... ∙జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు ∙మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ∙జన్యుపరమైన కారణలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తుంటాయి. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు వెళ్లాల్సివస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : ∙పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ∙ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్యంపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
పొట్టలో అల్సర్... తగ్గుతుందా?
నా వయసు 37 ఏళ్లు. ఇటీవల కడుపులో మంట, వికారంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేయించి, అల్సర్ ఉందని చెప్పారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – డి. రవిచంద్ర, నేలమర్రి ఇటీవలి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణకోశ సమస్యలు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అల్సర్ వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణశయంలో అల్సర్లు పెరుగుతాయి. కారణాలు: ∙80 శాతం మందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అల్సర్లు వస్తాయి ∙చాలామందిలో కడుపులో పుండ్లు రావడానికి హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ముఖ్యమైనది ∙మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ∙మద్యపానం, పొగతాగడం ∙వేళకు ఆహారం తీసుకోకపోవడం ∙కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. లక్షణాలు: ∙కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ∙ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం ∙తలనొప్పి, బరువు తగ్గడం, రక్త వాంతులు, రక్త విరేచనాలు ∙కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, ఆకలి తగ్గడం ∙నోటిలో ఎక్కువగా నీళ్లు ఊరడం. నివారణ జాగ్రత్తలు: ∙పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి ∙మద్యపానం, పొగతాగడం అలవాట్లు మానేయాలి ∙కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి ∙కంటి నిండా నిద్రపోవాలి ∙మానసిక ఒత్తిడి దూరం కావడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి ∙ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. చికిత్స: గ్యాస్ట్రిక్ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సనిక్ ఆల్బ్, యాసిడ్ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
ఎంతో కాలంగా మెడనొప్పి...
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 54 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా? – కె. దశరథ్ కుమార్, అనంతపురం మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా, జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం ∙డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ∙వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ∙ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ∙ఎల్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: ∙సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం ∙తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ∙నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ∙నడకలో బ్యాలెన్స్ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ సోరియాసిస్నుంచి విముక్తి ఎలా? నా వయసు 39 ఏళ్లు. చాలా రోజుల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా సమస్య పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? – ఎస్. దయాకర్‌రావు, నిజామాబాద్ సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ సమస్య. ఇది చర్మ సమస్యే అయినా ఇది మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్యగా పరిగణించాలి. ఈ వ్యాధి వచ్చిన వారిలో చర్మ కణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడి, అవి వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్ల వంటివీ ఏర్పడతాయి. దురద కూడా ఎక్కువ. చిరాకుగా ఉంటుంది. సోరియాసిస్ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. కారణాలు: ∙వంశపారంపర్యం ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత ∙దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం. లక్షణాలు: ∙చర్మం ఎర్రబారడం ∙తీవ్రమైన దురద ∙జుట్టు రాలిపోవడం ∙కీళ్లనొప్పులు ∙చర్మం పొడిబారినప్పుడు పగుళ్లు ఏర్పడి రక్తస్రావమూ అవుతుంది. నిర్ధారణ పరీక్షలు: స్కిన్ బయాప్సీ, ఈఎస్ఆర్, సీబీపీ, ఎక్స్–రే పరీక్షలు. చికిత్స: సోరియాసిస్ నివారణ/చికిత్సలకు హోమియోలో సమర్థమైన మార్గాలు ఉన్నాయి. అయితే సోరియాసిస్‌ను వెంటనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి ఈ సమస్యనుంచి విముక్తి కోసం సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్ నయమవుతుందా? నా వయసు 62 ఏళ్లు. నాకు మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని, ఆపరేషన్ తప్పదంటున్నారు. నాకు ఆపరేషన్ అంటే భయం. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – వేణుగోపాలరావు, సంగారెడ్డి మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. ఆహారంలో పీచుపదార్థాలు తగ్గడం వల్ల మలబద్దకం వచ్చి, మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇటీవల మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఈ రకమైన సమస్యలు చాలా మందిలో గతంలో కంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టే అవకాశాలు ఎక్కువ. అయితే హోమియో వైద్య విధానంలో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా చికిత్స చేసే అవకాశం ఉంది. కారణాలు: ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్ ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట వంటివి కనిపిస్తాయి. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే నయం చేయవచ్చు. ఏ సైడ్ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స చేయడం హోమియో విధానం ప్రత్యేకత. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
అమెరికా ఆస్పత్రిలో విశాల్
టీ.నగర్: తలనొప్పి, కీళ్లనొప్పులతో బాధపడుతున్న నటుడు విశాల్ చికిత్సల కోసం అమెరికా ఆస్పత్రిలో చేరారు. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, నిర్మాతల సంఘం అధ్యక్షుడైన విశాల్ ప్రస్తుతం ఇరుంబుతిరై, సండైకోళి–2 చిత్రాల్లో నటిస్తున్నారు. ఈయన గత కొం తకాలంగా తలనొప్పితో బాధపడుతూ వచ్చారు. అవన్ ఇవన్ చిత్రంలో నటించినప్పటి నుంచి తలనొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. తుప్పరివాలన్ చిత్రంలో నటిస్తుండగా ఒక ఫైట్ సన్నివేశంలో భుజానికి గాయం ఏర్పడింది. దీంతో తలనొప్పి అధికమైంది. ఈ నేపథ్యంలో గత వారం ఢిల్లీ ప్రైవేటు ఆస్పత్రిలో ఫిజి యోథెరపీ చికిత్సలు అందుకున్నారు. అయినప్పటికీ కీళ్లనొప్పులు పోకపోవడంతో విశాల్ అమెరికా వెళ్లారు. అక్కడున్న ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు. 10రోజుల్లో ఆయన చెన్నై తిరిగి వస్తారని సమాచారం. -
అమ్మాయి ఎప్పుడూ ఒంటరిగా.. పరధ్యానంగా!
హోమియో కౌన్సెలింగ్స్ మా అమ్మాయి వయసు 25 ఏళ్లు. గత ఆర్నెల్లుగా పరధ్యానంగా ఉంటోంది. ఎవరితో సరిగా మాట్లాడటం లేదు. ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటోంది. ఆమెకు సరైన హోమియో మందు సూచించండి. – నిరుపమ, గూడూరు మీరు చెబుతున్న లక్షణాలు డిప్రెషన్ వ్యాధిని సూచిస్తున్నాయి. డిప్రెషన్‌ను మనసుకు సంబంధించిన ఒక రకమైన రుగ్మత. దీనికి గురైన వారు విచారం, నిస్సహాయత, అపరాధభావం, నిరాశలలో ఉంటారు. భావోద్వేగాలు మారుతుంటాయి. శారీరకంగానూ కొన్ని మార్పులు కనిపిస్తాయి. అకస్మాత్తుగా బరువు కోల్పోవడం లేదా పెరగడం, చికాకు పడుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు నిర్దిష్టంగా కొన్ని కాలాలలో డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధితో బాధపడేవారు పూర్తి డిప్రెషన్లోకి కూరుకుపోయేలోపే చికిత్స అందించడం మంచిది. హోమియో విధానంలో దీనికి పరిపూర్ణ చికిత్స ఉంది. డిప్రెషన్‌ను 1950–60లలో రెండు రకాలుగా విభజించారు. ఒకటి వంశపారంపర్యంగా వచ్చేది. రెండోది న్యూరోటిక్ డిప్రెషన్. ఇవి... మన చుట్టూ ఉండే వాతావరణం, సంఘంలో అసమానతలు, ఉద్యోగం కోల్పోవడం, ఎవరైనా దగ్గరివాళ్లు దూరం కావడం లేదా చనిపోవడం, తీవ్రస్థాయి మానసిక వేదన... వంటి ఎన్నో అంశాల వల్ల రావచ్చు. వివిధ పరిశోధనల ద్వారా ఈ ఆధునిక కాలంలో దీన్ని డిప్రెసివ్ డిజార్డర్‌గా పేర్కొన్నారు. దీనిలో రకాలు: ∙మేజర్ డిప్రెషన్: ఇందులో డిప్రెషన్ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. ఆకలి లేకపోవడం, నిద్రలేకపోవడం, పనిలో శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ∙డిస్థిమిక్ డిజార్డర్: రోగి తక్కువస్థాయి డిప్రెషన్లో దీర్ఘకాలం పాటు ఉంటాడు. అయితే కొన్నిసార్లు రోగి నార్మల్‌గా ఉన్నట్లుగా అనిపించి, తిరిగి డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. ∙సైకియాటిక్ డిప్రెషన్: డిప్రెషన్‌తో పాటు భ్రాంతులు కూడా కనిపిస్తుంటాయి. ∙పోస్ట్ నేటల్ డిప్రెష : మహిళల్లో ప్రసవం తర్వాత దీని లక్షణాలు కనిపిస్తుంటాయి. ∙సీజనల్ ఎఫెక్టివ్ డిప్రెషన్: సూర్యరశ్మి తగ్గడం వల్ల కొంతమందిలో సీజనల్‌గా డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తుంటుంది. ∙బైపోలార్ డిజార్డర్: ఈ డిప్రెషన్లో కొంతమంది పిచ్చిగా, కోపంగా, విపరీతమైన ప్రవర్తనను కనబరుస్తుంటారు. కొంత ఉద్రేకం తర్వాత నార్మల్ అయిపోతారు. హోమియో వైద్యవిధానంలో నేట్రమ్మూర్, ఆరమ్‌మెట్, సెపియా, ఆర్సినిక్ ఆల్బ్, సిమిసిఫ్యూగో వంటి మందులు డిప్రెషన్ తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ మెడనొప్పి చేతులకు ఎందుకు పాకుతోంది? నా వయసు 52 ఏళ్లు. నేను కొంతకాలంగా మెడనొప్పితో బాధపడుతున్నాను. ఆ నొప్పి ఇప్పుడు చేతుల వరకూ పాకుతోంది. వేళ్లు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. మందులు వాడుతున్నంత కాలం బాగానే ఉన్నా ఆపేస్తే మాత్రం మళ్లీ నొప్పి వస్తోంది. హోమియో మందులతో ప్రయోజనం ఉంటుందా? – సంజయ్, హైదరాబాద్ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ అనిపిస్తోంది. మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. దీనినే సర్వైకల్ స్పైనల్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. కారణాలు: ∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ∙వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ∙ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ∙ఎల్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: ∙సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం ∙తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ∙నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్ఆర్, ఎక్స్–రే సర్వైకల్ స్పైన్, ఎమ్మారై పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా తగ్గేలా చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ పైల్స్ సమస్యకు పరిష్కారం చెప్పండి... నా వయసు 54 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి మలద్వారం వద్ద బుడిపెలా ఏదో బయటకు వస్తోంది. మల విసర్జనలో రక్తం పడుతోంది. సూదితో గుచ్చినట్లుగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను కలిస్తే పైల్స్ అన్నారు. హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – జీవరత్నం, కాకినాడ చాలా ఇబ్బంది కలిగించే సమస్యల్లో మొలల సమస్య ఒకటి. ఈ సమస్యలో మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే రక్తనాళాలు (సిరలు) ఉబ్బి అవి మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి. మొలల దశలు: గ్రేడ్–1 దశలో మొలలు పైకి కనిపించవు.నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది. గ్రేడ్–2లో రక్తం పడవచ్చు, పడకపోవచ్చు కానీ మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి. వాటంతట అవే లోపలకు వెళ్లిపోతుంటాయి. గ్రేడ్–3లో మల విసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి. కానీ మల విసర్జన తర్వాత తర్వాత వాటంతట అవి లోపలికి పోకుండా వేలితో నెడితే లోనికి వెళ్తాయి. గ్రేడ్–4 దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు. కారణాలు: ∙మలబద్దకం ∙మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండరబంధనం సాగిపోతుంది. తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి ∙సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం ∙స్థూలకాయం (ఒబేసిటీ) ∙చాలాసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువ ∙మలబద్దకం మాత్రమే గాక అతిగా విరేచనాలు కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు ∙మంచి పోషకాహారం తీసుకోకపోవడం ∙నీరు తక్కువగా తాగడం ∙ఎక్కువగా ప్రయాణాలు చేయడం ∙అధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం ∙మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లుగా నొప్పి ∙మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం. నివారణ: ∙మలబద్దకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ∙ సమయానికి భోజనం చేయడం ముఖ్యం ∙ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ∙నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవడం ∙మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తక్కువగా తీసుకోవడం ∙మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటివి పైల్స్ నివారణకు తోడ్పడే కొన్ని జాగ్రత్తలు.హోమియోలో రోగి వ్యాధి నిరోధక శక్తిని పెంచేలా మందులు ఇచ్చి వ్యాధిని నయం చేయచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
మెడ నొప్పి... భుజానికి పాకుతోంది!
నా వయసు 28 ఏళ్లు. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్‌ని. ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తుంటాను. రెండువారాలుగా నాకు తీవ్రమైన మెడ నొప్పి వస్తోంది. మెడ నుంచి కుడిభుజంలోకి పాకుతోంది. డాక్టర్గారిని కలిస్తే వెన్నుపూసల్లోని డిస్క్ వాపు వచ్చిందనీ, సర్జరీ అవసరం అని చెప్పారు. నాకు సర్జరీ అంటే భయం. శస్త్రచికిత్సకు బదులుగా ఏదైనాప్రత్యామ్నాయం ఉందా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – సుహాస్, హైదరాబాద్ మీలా చాలా సేపు కూర్చొని పనిచేసే వారిలో ఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అదేపనిగా గంటలకొద్దీ తప్పుడు భంగిమల్లో (ఫాల్టీ పోష్చర్‌లో) కూర్చొని పనిచేసేవారిలోవెన్నుపూసల్లోని డిస్క్‌లు బలహీనపడతాయి. ఒక్కోసారి వాటిలో వాపు కూడా రావచ్చు. దీని వల్ల కొద్ది నెలల తర్వాత తీవ్రమైన నొప్పి వస్తుంది. అయితే మంచి ఫిజియోథెరపిస్ట్ఆధ్వర్యంలో తగిన వ్యాయామాలు చేయడం వల్ల, వెన్నెముకకు అనువైన, తగిన భంగిమలో కూర్చోవడం వల్ల పరిస్థితి మెరుగుపడి కొద్దిరోజుల్లోనే పరిస్థితి మెరుగుపడుతుంది.ఇలాంటివారు తాము కూర్చొనిపనిచేసే సమయంలో ప్రతి రెండు గంటలకు లేదా మూడు గంటలకు ఒకసారి లేచి తమ మెడను కాస్త అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మీరు కూడా అటుఇటు తిరుగుతూ ఉండాలి.ఇక సర్జరీ విషయానికి వస్తే ఇలాంటి కేసుల్లో శస్త్రచికిత్స చాలా అరుదుగా అవసరమవుతుంది. నొప్పి భరించలేనంత ఉండి ఆర్నెల్లకు కూడా తగ్గకపోవడంతోపాటు ఏదైనా శరీరభాగంస్పర్శ కోల్పోయినప్పుడు సర్జరీ అవసరం అవుతుంది. ఇలాంటి పరిస్థితి రెండు శాతానికి మించదు. కాబట్టి మీరు అప్పుడే శస్త్రచికిత్స గురించి ఆలోచించకండి. తొలుత మీరుఫిజియోథెరపిస్ట్ను సంప్రదించి మీ మెడ నొప్పి తగ్గడానికి అవసరమైన వ్యాయామాలను చేయండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన ప్రత్యామ్నాయంగురించి ఆలోచించవచ్చు. మణికట్టు క్లిక్‌మంటోంది! నా వయసు 30 ఏళ్లు. బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నా కుడి మణికట్టులో కొద్ది నెలలుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. దాన్ని కొద్దిగా వంచినప్పుడు క్లిక్ మనే శబ్దం వచ్చి నొప్పి వస్తోంది. నొప్పికారణంగా ఏ పనీ చేయలేకపోతున్నాను. నాకు తగిన పరిష్కారం చెప్పండి. – పి. మహేంద్ర, నెల్లూరు మణికట్టు చాలా సంక్లిష్టమైన నిర్మాణం. మణికట్టులో 15 ఎముకలతో పాటు ఎన్నో లిగమెంట్లు ఉంటాయి. కొన్ని చిన్న ఎముకలు విరిగినప్పుడు ఆ విషయమే మనకు తెలియదు.ఉదాహరణకు స్కాఫాయిడ్ అనే ఎముక మనం మణికట్టును గుండ్రగా తిప్పడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల ఎముకలు విరిగిన విషయం సాధారణ ఎక్స్రేలోతెలియపోవచ్చు కూడా. అయితే కొన్నిసార్లు రెండు, మూడు వారాల తర్వాత చేసే రిపీటెడ్ ఎక్స్‌రేలో తెలుస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలు స్కాఫాయిడ్ ఎముక విరిగినట్లుసూచిస్తున్నాయి. మీ సమస్య టీనోసైనోవైటిస్ లేదా రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీ కూడా కావచ్చు. మీరు ఒకసారి ‘ఆర్థోపెడిక్ సర్జన్’ ను కలిసి తగిన ఎక్స్–రే పరీక్షలు చేయించుకోండి.సమస్యను బట్టి చికిత్స ఉంటుంది. అప్పుడెప్పుడో బెణికింది... ఇప్పటికీ నొప్పెడుతోంది ఆర్నెల్ల క్రితం నా కాలు స్లిప్ అయ్యి, నా చీలమండ బెణికింది. అప్పట్లో ప్లాస్టర్ వేశారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి తిరగబెడుతూ ఉంది. చీలమండ వద్ద వాపు,నొప్పి కనిపిస్తున్నాయి. ఇంతకాలం తర్వాత కూడా ఇలా ఎందుకు నొప్పి వస్తోంది. – వాసవి, కోదాడ మీ కాలు బెణికినప్పుడు చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి (స్ప్రెయిన్ అయి) ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీలిగమెంట్లు ఉన్న పరిణామం కంటే కాస్త తగ్గి పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోయి, అవి ఉండాల్సిన స్థానంలో ఉండకపోవచ్చు. ఆతర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తూ, మీలిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మెట్లు ఎక్కుతుంటే మరీ నొప్పి.. నా వయసు 29 ఏళ్లు. గత కొద్ది నెలలుగా రెండు మోకాళ్లలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. ముఖ్యంగా మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంటోంది. చాలా మందులు వాడాను. ఇంత చిన్న వయసులోనే ఇలా కీళ్లనొప్పులు రావడం చాలా ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల మున్ముందు శాశ్వతమైన సమస్యకు దారితీస్తుందోమోనని ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వండి. – మోహన్‌కుమార్, గన్నవరం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో కనిపించేసాధారణమైన సమస్య ఇది. కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏవైనా బరువులు ఎత్తినప్పుడు మోకాలి చిప్పపై పడే అదనపు భారం వల్లనే ఈ సమస్యవస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (స్కాటింగ్) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది చాలా తాత్కాలికమైన సమస్య. ఇదిఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్య కాదు. కాబట్టి అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్ -
అరుదైన రోగం..మెడ 90 డిగ్రీలు!
-
తొమ్మిదేళ్ల బాలిక.. మెడ 90 డిగ్రీలు!
పాకిస్తాన్‌లోని మిథికి చెందిన అఫ్షీన్ కుంబర్ 9 సంవత్సరాల బాలిక. ప్రస్తుతం అఫ్షీన్ కండరాల రుగ్మతతో బాధపడుతోంది. ఆమె మెడ 90 డిగ్రీల కోణంలో ఉంది. దీంతో అఫ్షీన్ సరిగా నిలబడలేదు, నడవలేదు కూర్చున్న స్థానానికే పరిమితమవుతోంది. ప్రస్తుతం బాలిక తినడానికి కూడా ఇతరులపై ఆధారపడుతోంది. దీనిని నయం చేయడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. బాలిక తండ్రి అల్లా జురియా(55), తల్లి జమీలాల్లు ఇప్పటివరకు అనేక మంది వైద్యులను కలిశామని, అయినా ఈ సమస్యకు సంబంధించిన చికిత్స ఇక్కడ అందుబాటులో లేదని చెబుతున్నారు. పుట్టినపుడు అఫ్షీన్కు ఈ సమస్య ఉండేదికాదని, ఎనిమిది నెలల వయసు ఉన్నపుడు ఆడుకుంటూ అఫ్షీన్ కింద పడిందని, అప్పటినుంచి ఇలానే బాధపడుతోందని వారు చెబుతున్నారు. ఇక్కడి వైద్యులు కరాచీలోని జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్‌కు ఆమెను తీసుకువెళ్ళమని సలహా ఇచ్చారు. మేము కూలీ పనులు చేసుకునే వాళ్లమని, అక్కడికి తీసుకెళ్లి చికిత్స చేయించేంత స్థోమత మాకు లేదని వాపోతున్నారు. నా కూతురు ఇలా బాధపడుతుంటే చూడలేక పోతున్నానని.. ప్రభుత్వం సహకరిస్తే తిరిగి మాములుగా మారుతోందనే నమ్మకం నాకు ఉందని అల్లా జురియా అంటున్నాడు. అఫ్షీన్ కండరాలకు వచ్చే అరుదైన రుగ్మతతో బాధ పడుతోందని స్థానిక డాక్టర్లు అంటున్నారు. -
చేతుల వరకూ పాకే మెడనొప్పి... ఎందుకిలా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 58. కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకుగురయ్యాయని చెప్పారు. మందులు వాడితే తగ్గుతోంది, ఆపేస్తే నొప్పి వస్తోంది. నా సమస్య హోమియో మందులతో శాశ్వతంగా తగ్గుతుందా?– సీహెచ్ వెంకటేశ్వరరావు, ఖమ్మం మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. దీనినే సర్వైకల్ స్పైనల్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. కారణాలు: ∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ∙వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ∙ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ∙ఎల్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశముంది. లక్షణాలు:సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం ∙తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ∙నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్ఆర్, ఎక్స్–రే సర్వైకల్ స్పైన్, ఎమ్మారై పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించి మెడనొప్పిని పూర్తిగా తగ్గేలా చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ సోరియాసిస్ తగ్గుతుందా? నా వయసు 38 ఏళ్లు. గత పదేళ్ల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని పూతమందులు, మాత్రలు వాడినా పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? - సురేశ్, నిజామాబాద్ సోరియాసిస్ చాలా మందిని బాధపెడుతున్న సమస్య. ప్రపంచ జనాభాలో దాదాపు మూడు శాతం మంది స్త్రీ, పురుషులు దీనితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉంది. చాలామంది దీన్ని కేవలం చర్మసమస్యగా భావిస్తారు. కానీ ఇది దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ సమస్య. అంటే మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పరిణమించడం వల్ల వచ్చే సమస్య. ఇందులో చర్మ కణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతోపాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడతాయి. ఇలా పొరలుగా ఏర్పడటం వల్ల వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న దద్దుర్ల వస్తాయి. దురద కూడా ఉంటుంది. సోరియాసిస్ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15 శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. కారణాలు: ∙వంశపారంపర్యం ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత ∙దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం. లక్షణాలు: ∙చర్మం ఎర్రబారడం ∙తీవ్రమైన దురద ∙జుట్టు రాలిపోవడం ∙కీళ్లనొప్పులు ∙చర్మం పొడిబారినప్పుడు చర్మంపై పగుళ్లు ఏర్పడి రక్తస్రావం కూడా అవుతుంది. నిర్ధారణ పరీక్షలు: స్కిన్ బయాప్సీ, ఈఎస్ఆర్, సీబీపీ, ఎక్స్–రే పరీక్షలు. చికిత్స: సోరియాసిస్ నివారణ/చికిత్సలకు హోమియో ఎంతగానో సహాయపడుతుంది. ఈ వ్యాధి విషయంలో వెంటనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి సోరియాసిస్‌కు సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఒత్తిడితో గుండెపోటు ఎందుకు వస్తుంది? కార్డియాలజీ కౌన్సెలింగ్స్ నా వయసు 38 ఏళ్లు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మార్కెటింగ్ విభాగంలో డిప్యూటీ మేనేజర్‌గా చేస్తున్నాను. ఆఫీసులో టార్గెట్లు, ఇంట్లో టీనేజీ అబ్బాయి చదువుతో బాగా ఒత్తిడికిలోనవుతున్నాను. స్ట్రెస్ వల్ల గుండెజబ్బులు వస్తాయని విన్నాను. అసలు స్ట్రెస్‌తో గుండెజబ్బులు ఎందుకు వస్తాయి? అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలపండి. – సురేశ్‌కుమార్, విజయవాడ పెరిగే ఒత్తిడి నేరుగా గుండెపైనే ప్రభావం చూపిస్తుంది. ఆధునిక నగర జీవితంలో కొంత ఒత్తిడి సహజమే. అయితే ఆఫీసులో పని, కుటుంబ కలహాలు, పిల్లల భవిష్యత్తు, ఆప్తుల అనారోగ్యవం వంటివి ఒత్తిడిని మరికొంత పెంచుతుంటాయి. ఉద్యోగస్తుల్లో ఒత్తిడికి సంబంధించి ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. పై అధికారుల ప్రవర్తన, నిర్వణశైలి, సహచరుల మధ్య పోటీ వంటి వాటితో పాటు ఏ క్షణమైనా ఉద్యోగం పోతుందన్న ఆందోళన వంటి అంశాలు మిగతావారితో పోలిస్తే గుండెపోటు ముప్పును 20 శాతం పెంచుతున్నట్లు తేలింది. ఒత్తిడి... గుండెపైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుందన్నది ఆసక్తికరమైన అంశం. సాధారణంగా ఒత్తిడి శరీరంలో అత్యవసర పరిస్థితిని సృష్టిస్తుంది. దాంతో అవయవాలలో వాచే తత్వం పెరుగుతుంది. రక్తపోటు పెరగడం, రక్తంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) తగ్గడం వంటిటి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నిరంతరాయం ఉండే ఒత్తిడి గుండెకు మరింత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఒత్తిడి, విచారం వల్ల నిద్ర దూరం అవుతుంది. వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంలో లోటుపాటు పెరుగుతాయి. ఈ రకమైన మార్పులన్నీ కలిసి గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి మొదట చేయాల్సిందల్లా ఒత్తిడితో గుండెకు ప్రమాదం ఉందన్న అంశాన్ని గుర్తించడమే. అలాగే గుండె వ్యాధులకు కారణమయ్యే అధిక రక్తపోటు, డయాబెటిస్, ఊబయాకం వంటి వాటికి చికిత్స తీసుకుంటూ ఉండాలి. ఇక రోజూ కనీసం ముప్ఫయి నిమిషాల పాటు వ్యాయామం గుండె ఆరోగ్యంతో పాటు పూర్తిస్థాయి ఒంటి ఆరోగ్యానికీ ఉపయోగపడుతుంది. అలాగే యోగా, ధ్యానం వంటివి ఒత్తిడి నుంచి దూరమయ్యేందుకు సహాయపడతాయి. డాక్టర్ టి. శశికాంత్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యశోద హార్ట్ ఇన్స్టిట్యూట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
సర్వైకల్ స్పాండిలోసిస్‌కు శాశ్వత పరిష్కారం
హోమియో కౌన్సెలింగ్ నా వయస్సు 45 సంవత్సరాలు. నేను గత కొంతకాలంగా మెడనొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్ని సంప్రదిస్తే మెడ ప్రాంతంలోని వెన్నెముకలోని డిస్కులు అరుగుదలకు గురయ్యాయని చె ప్పి, మందులు ఇచ్చారు. అవి వాడుతున్నా, ఉపశమనం లభించడం లేదు. పైగా చేతులు కూడా బలహీనంగా అనిపిస్తున్నాయి. చిన్న బరువులు కూడా ఎత్తలేకపోతున్నాను. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు. - కె.శ్రీనివాస్, ఒంగోలు మెడనొప్పి, ఈ మధ్యకాలంలో చిన్న వయస్సు వారిని కూడా వేధించే ఆరోగ్య సమస్య. మారుతున్న మానవుని జీవన విధానం వల్ల ఈ విధమైన సమస్యలు చిన్న వయస్సులో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్ని రకాల మందులు వాడినా ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం లభించక చాలామంది బాధపడుతుంటారు. కానీ హోమియో చికిత్స ద్వారా పూర్తిగా నయం అయే అవకాశం ఉంది. మెడ భాగంలోని వెన్నెముకలోని డిస్కులు, జాయింట్లలోని మృదులాస్తి క్షీణతకు గురవడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. దాదాపు 15 శాతం పైగా ఇది 60 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: వయస్సు పైబడటం, వ్యాయామం లేకపోవడం, క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగటం, డిస్కులు జారిపోవడం లేదా చీలికకు గురికావడం, వృత్తిరీత్యా అధిక బరువులు మోయటం, మెడను ఎక్కువ సమయం అసాధారణ రీతిలో ఉంచడం, ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు పని చేయడం, ఎత్తై దిండ్లు వాడటం, ఎక్కువ సమయం మెడను వంచి ఉంచడం, మెడకు దెబ్బ తగలడం, పూర్వం మెడకు శస్త్ర చికిత్స జరిగి ఉండటం, అధిక మానసిక ఒత్తిడి, అధిక బరువు, ధూమపానం, జన్యుపరమైన అంశాల వల్ల మెడనొప్పి పెరిగే అవకాశం ఉంది. లక్షణాలు: సాధారణం నుండి తీవ్రస్థాయిలో మెడనొప్పి. మెడనుంచి భుజాలకు, చేతులకు, వేళ్ల వరకు పాకడం, డిస్కులు అరుగుదల వల్ల వెన్నుపూసల మధ్య స్థలం తగ్గి రాపిడి శబ్దాలు వినిపించడం, మెడ బిగుసుకుపోవడం, తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం, నరాలపై ఒత్తిడి పడితే చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవటం, చిన్న బరువులు కూడా ఎత్తలేకపోవడం, నడకలో నిలకడ కోల్పోవడం వంటివి. చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో మాత్రమే అందించే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్సా విధానం ద్వారా మీ మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని, అందుకు సరిపడా ఔషధాన్ని అందించడం ద్వారా మెడనొప్పిని పూర్తిగా నయం చేయడమే కాకుండా వెన్నెముకను దృఢం చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి,హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
స్పాండిలోసిస్ను గుర్తించడానికి తోడ్పడే ఐదు ‘డి’లు...
మెడనొప్పితో వచ్చే సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలను ఐదు ‘డి’ లతో తేలిగ్గా గుర్తించవచ్చు. అదెలాగంటే... ఇంగ్లిష్ అక్షరం ‘డి’తో మొదలయ్యే ఐదు లక్షణాలను గమనించుకుంటూ ఉంటే చాలు. 1. డిజ్జీనెస్ : తల తిరిగినట్లు ఉండటం 2. డిప్లోపియా : కళ్లు మసకబారినట్లుగా ఉండి ఒకటే ఇమేజ్ రెండుగా అనిపించడం 3. డ్రాప్ అటాక్ : కండరాలు ఒక్కసారిగా బిగుసుకోవవడం 4. డిస్ఫేజియా : సరిగ్గా మింగలేకపోవడం 5. డిసార్థ్రియా : మాట తడబడటం ఇంగ్లిష్ అక్షరం ‘డి’తో మొదలయ్యే ఈ ఐదు లక్షణాలతో పాటు తలనొప్పి, చేతులు, భుజాలు లాగినట్లుగా ఉండటం, మెడ కండరాలు బలహీనంగా అనిపించడం, మెడ దగ్గర్నుంచి చేతుల వరకు బరువుగా అనిపించడం వంటి లక్షణాలు కూడా స్పాండిలోసిస్‌లో కనిపిస్తుంటాయి. -
తీవ్రమైన మెడ, నడుం నొప్పి.. తగ్గుతుందా?
పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. గత ఏడాది కాలం నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. దగ్గరలో ఉన్న డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అంటున్నారు. దీనికి మందులు వాడుతున్నాను. నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? - జనార్దన్‌రావు, కత్తిపూడి స్పాండిలోసిస్ అనేది వెన్నెముకకు సంబంధించిన సమస్య. స్పాండిలోసిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అంటారు. కారణాలు: కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు జాయింట్స్‌లో వాటర్ తగ్గడం వల్ల కూడా నొప్పి రావచ్చు స్పైన్ దెబ్బతిని కూడా నొప్పి రావచ్చు వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి దారి ఉంటుంది. ఆ దారి సన్నబడితే నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు: సర్వైకల్ స్పాండిలోసిస్: - మెడనొప్పి, తలనొప్పి తల అటు-ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. లంబార్ స్పాండిలోసిస్ : నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి ఒకవైపు కాలు, పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, దాంతో నడవడానికి కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి. నిర్ధారణ : వ్యాధి లక్షణాలను బట్టి ఎక్స్-రే ఎమ్మారై, సీటీ స్కాన్ నివారణ: వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. హోమియో చికిత్స: హోమియో ప్రక్రియలో ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా పరిష్కారం ఉంది. రోగి వ్యక్తిగత లక్షణాలను బట్టి వారి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని చికిత్స ఇస్తారు. ఇలా కాన్స్టిట్యూషనల్ చికిత్స అందిస్తే క్రమంగా రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధి తీవ్రత క్రమంగా తగ్గుతుంది. దాంతో క్రమక్రమంగా పూర్తిగా వ్యాధి నివారణ జరుగుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ -
మెడనొప్పి మరీ తీవ్రం...
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. నాకు మెడనొప్పి వస్తోంది. ఇటీవల అది మరీ తీవ్రమైంది. మందులు వాడటం అంటే నాకు కాస్త భయం. నొప్పి తగ్గడానికి జాగ్రత్తలు చెప్పండి. - సుధాకర్, నల్లగొండ మనం నిల్చునే, కూర్చొనే భంగిమలు సరిగా లేకపోవడం వల్లనే మెడనొప్పి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఒక్కోసారి వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ వల్ల కూడా విపరీతమైన సమస్యలు వస్తాయి. ఈ డిస్క్ జారి నరాల మీద ఒత్తిడి కలిగినప్పుడు నొప్పి వస్తుంటుంది. వెన్నుపూస నుంచి మెదడులోకి వెళ్లే రెండు రక్తనాళాలైన వర్టిబ్రల్ ఆర్టరీస్ చిన్న మెదడుకు రక్తప్రసరణ అందిస్తాయి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఆర్టరీస్ రక్తప్రసారంలో తేడాలు వచ్చి మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగకపోవచ్చు. దీనివల్ల నొప్పితో పాటు తలతిరగడం, దిమ్ముగా అనిపించడం, వాంతులు కావడం జరుగుతుంది. మెడ దగ్గర ఉండే వెన్నుపూసల్లో ఏడు పూసలు ఉంటాయి. వాటిలో మొదటి వెన్నుపూసను అట్లాస్ అని, రెండో వెన్నుపూసను యాక్సిస్ అని అంటారు. ఆ తర్వాత వెన్నుపూసలను 3, 4, 5, 6, 7 అని నెంబర్లతో పిలుస్తారు. ఇవన్నీ ఒకదానితో మరొకటి జాయింట్ అయినట్లుగా అమరి ఉంటాయి. అందులో ఏర్పడ్డ బోలు ప్రదేశంలో స్పైనల్‌కార్డ్ అంటే వెన్నుపాము ఉంటుంది. మెదడు నుంచి కాళ్లకు, చేతులకు నరాలను తీసుకెళ్తూ ఉంటుంది. ఒక వెన్నుపూసకు, మరొక వెన్నుపూసకు మధ్యలో ఉండే ఖాళీ స్థలం ఇంటర్ వర్టిబ్రల్ పారామినా నుంచి ఒక్కొక్కనరం బయటకు వస్తుంది. ఈ నరాలు ఒక్కోవైపునకు విస్తరించి ఉంటాయి. వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ ఒక షాక్ అబ్జార్బర్‌లా పనిచూస్తుంది. డిస్క్కి రక్తప్రసరణ అవసరం ఉండదు. మనం తీసుకున్న ఆహారం ద్వారానే దీనికి పోషకాలు అందుతాయి. శరీర బరువు, తలబరువును బ్యాలెన్స్ చేయడానికి ఇది దోహదపడుతుంది. నిర్ధారణ మెడనొప్పి వచ్చే వారికి ఎక్స్-రే తీస్తే సమస్య తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఎక్స్-రే బట్టి మెడపూసల్లో ఏవైనా తేడాలు ఉన్నాయా అని తెలుసుకొని దాన్ని బట్టి చికిత్స చేస్తారు. సూక్ష్మమైన సమస్యలు ఉన్నవారికి ఎమ్మారై స్కాన్ ద్వారా పరీక్షలు నిర్వహించి, దాని సహాయంతో ఏ నరం మీద ఎంత ఒత్తిడి ఉంది తెలుసుకోవచ్చు. ఆ ఒత్తిడి దేని వల్ల వచ్చింది, ఏదైనా ఎముక ఫ్రాక్చర్ అయిందా, నరాల్లో వాపు ఏమైనా ఉందా, గడ్డలు ఉన్నాయా వంటి అంశాలను తెలుసుకోవచ్చు. డిస్క్ ప్రొలాప్స్ (డిస్క్ తాను ఉన్న స్థానం నుంచి తొలగడం) జరిగితే... ఆ సమస్య ఎంత మేర ఉందో గమనించి, దానికి చికిత్స చేస్తారు. జాగ్రత్తలు ఇవి... మెడ నొప్పి వచ్చినప్పుడు వేడినీళ్లలో మెత్తటి వస్త్రాన్ని ముంచి, పిండి మెడపైన కాపడం పెట్టడం లేదా ఐస్ ముక్కను గుడ్డలో చుట్టి కాపడం పెట్టడం వల్ల సాధారణ నొప్పి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది మెడ కండరాలలో నొప్పి ఉన్నప్పుడు వాటికి తప్పనిసరిగా విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే... అలా నొప్పి వస్తుందంటే కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. అందుకే విశ్రాంతి ఇవ్వాలి. లేదంటే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది ఫిజియోథెరపిస్ట్‌ను కలిసి కండరాల విశ్రాంతి కోసం నెక్ ఎక్సర్సైజ్లు తెలుసుకొని వాటిని క్రమం తప్పకుండా చేయాలి సాధారణ నొప్పి అయితే పెయిన్‌కిల్లర్ ఆయింట్మెంట్స్ ఉంటాయి. వాటిని రాస్తూ సున్నితంగా రోజుకు ఐదారుసార్లు మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది బరువైన బ్యాగ్‌లను ఒకే భుజానికి తగిలించుకొని నడవడం వల్ల మెడ కండరాలపై, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది నడిచేటప్పుడు ఒకేవైపునకు ఒంగడం సరికాదు. -
అప్పుడు ఏడ్వాలో నవ్వాలో అర్థం కాలేదు!
సెలబ్రిటీల జీవితం చాలా సుఖంగా ఉంటుంది. అన్ని సౌకర్యాలూ ఉంటాయి. చీకూ చింతా లేకుండా హ్యాపీగా బతికేయొచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ, వాళ్లకూ ఇబ్బందులు ఉంటాయ్. బాడీగార్డులు లేకుండా బయటికొస్తే.. వీరాభిమానులతో ఇబ్బంది ఉండదు కానీ, వెర్రి అభిమానులతో ఇబ్బందులు తప్పవ్. అసలు సెలబ్రిటీలు ఏ మూడ్‌లో ఉన్నారో కూడా చూసుకోకుండా ఫొటోగ్రాఫులూ, ఆటోగ్రాఫులూ అడుగుతారు. ఇంకా ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. ఇటీవల రకుల్‌ప్రీత్ సింగ్‌కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తెలుగు పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా దూసుకెళుతోన్న రకుల్‌కి ఈ మధ్య కాస్త తీరిక చిక్కింది. అంతే.. తన క్లోజ్‌ఫ్రెండ్స్‌తో కలిసి లాస్ వేగాస్ వెళ్లారు. అక్కడికెళ్లాలనే కల రకుల్‌కి ఎప్పట్నుంచో ఉంది. వేగాస్‌లో చూడాల్సినవన్నీ చూసేసి, తిరుగు ప్రయాణమయ్యారు. వేగాస్ నుంచి సీటెల్ వెళ్లి, అట్నుంచి దుబాయ్ వెళ్లి, అక్కణ్ణుంచి హైదరాబాద్ రావాలన్నది ఈ బ్యూటీ ప్లాన్. కట్ చేస్తే.. సీటెల్ ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటరై, ఫ్లైట్ ఎక్కుదామనుకుంటున్న సమయంలో మెడ దగ్గర సన్నగా నొప్పి మొదలైందట. ఆ నొప్పి భరించలేనంత పెద్దది కావడంతో తన మ్యానేజర్‌కి ఫోన్ చేసి, విషయం చెప్పారు రకుల్. అప్పటికప్పుడు రకుల్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లారట. ఒకవైపు నొప్పితో రకుల్ విలవిలలాడుతుంటే.. అక్కడే ఉన్న ఒకావిడ, ‘మీరు రకుల్ కదూ’ అని అడగడంతో పాటు, ‘మీతో ఫొటో దిగాలని ఉంది’ అన్నదట. అలాంటి పరిస్థితిలో రకుల్‌కి ఏమనిపించి ఉంటుందో ఊహించవచ్చు. చుట్టూ ఉన్నవాళ్లు రకుల్ పరిస్థితి చెప్పడంతో, ఆవిడ ‘అయ్యో’ అని అక్కణ్ణుంచి వెళ్లిపోయారట. ‘‘నిజంగా నాకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు. ఏడుపు కన్నా నవ్వే వచ్చింది’’ అని రకుల్ పేర్కొన్నారు. -
కాంబినేషన్ కీమోథెరపీతో క్యాన్సర్‌కు చికిత్స!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. మందులు వాడుతున్నంత కాలం బాగానే ఉన్నా అవి ఆపేస్తే మాత్రం మళ్లీ నొప్పి వస్తోంది. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా? - వీరారెడ్డి, ఖమ్మం వయసు పెరగడం వల్ల వచ్చే మెడ నొప్పికి పూర్తి పరిష్కారం లభించదని చాలామంది అనుకుంటుంటారు. కానీ హోమియో చికిత్స ద్వారా ఈ సమస్యకు పూర్తి పరిష్కారం దొరుకుతుంది. మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. దీనినే సర్వైకల్ స్పైనల్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. దాదాపు 85 శాతానికి పైగా ఇది 60 ఏళ్ల వయసు పైబడిన వారిలో కనిపిస్తుంది. ప్రస్తుతం జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ఎక్కువ టైం మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ఎత్తై దిండ్లు వాడటం మెడకు దెబ్బతగలడం మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం మెడ బిగుసుకుపోవడం తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం చిన్న బరువునూ ఎత్తలేకపోవడం నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్ఆర్, ఎక్స్-రే సర్వైకల్ స్పైన్, ఎమ్మారై పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కేన్సర్ కౌన్సెలింగ్ నా వయసు 33 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. ఇటీవల తరచూ అనారోగ్యానికి గురవుతుంటే చెన్నై వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాను. క్యాన్సర్ అని తేలింది. వెంటనే కీమోథెరపీ మొదలుపెట్టాలని డాక్టర్లు చెప్పారు. కానీ కొందరు బంధువులు, స్నేహితులు కీమోథెరపీ అంటే భయపెడుతున్నారు. అసలు కీమోథెరపీ అంటే ఏమిటి? క్యాన్సర్ చికిత్సలో దాని ప్రయోజనాలు ఏమిటి? సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి. దయచేసి నా సందేహాలకు సమాధానాలు చెప్పగలరు. - భానుప్రసాద్, కర్నూలు మందుల ద్వారా క్యాన్సర్‌కు చేసే చికిత్సనే కీమోథెరపీ లేదా కీమో అంటారు. సర్జరీ లేదా రేడియేషన్ థెరపీ ద్వారా శరీరంలోని కొన్ని ప్రాంతాలలో తిష్టవేసిన క్యాన్సర్ కణజాలాన్ని తొలగించగలుగుతాం లేదా నాశనం చేయగలం. కీమో ద్వారా శరీరంలో ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ క్యాన్సర్ కణజాలాన్ని నిర్మూలించవచ్చు. కీమోథెరపీ ద్వారా శరీరంలో ముందుగా ఏర్పడిన క్యాన్సర్ కణితి మొదలుకొని శరీరంలోని అనేక భాగాలకు విస్తరించిన క్యాన్సర్ కణజాలాన్ని సైతం ధ్వసం చేయవచ్చు. కీమోథెరపీలో 100కు పైగా మందులను వివిధ కాంబినేషన్లలో వినియోగిస్తుంటారు. ఒక్కోసారి క్యాన్సర్ చికిత్స కోసం వీటిలో ఒకే మందును సైతం వాడవచ్చు. అయితే సాధారణంగా వివిధ రకాల మందుల సమ్మేళనంతో ఒక క్రమపద్ధతిని అనుసరించి అందించే విధానాన్ని కాంబినేషన్ కీమోథెరపీ అని వ్యవహరిస్తారు. పలు రకాల మందులు, వాటి ప్రభావాల తీరు వల్ల ఉమ్మడిగా క్యాన్సర్ కణాలపై పోరాడి వాటిని సమూలంగా సంహరించగలుగుతాయి. ఒకే మందు వాడటం వల్ల క్యాన్సర్ కణాలు ఆ మందుకు లొంగకుండా తయారయ్యే ప్రమాదం ఉన్నందున కాంబినేషన్ కీమోథెరపీని వినియోగిస్తారు. మీ విషయంలో ఏ విధానం అవలంబించాలన్నది మీ డాక్టర్ నిర్ణయిస్తారు. అలాగే కీమోథెరపీలో భాగంగా మందులను ఎంత మోతాదులో, ఏవిధంగా, ఎప్పుడెప్పుడు, ఎంతకాలం ఇవ్వాలన్నది కూడా చికిత్సలో భాగమే. ఈ నిర్ణయాలన్నీ కూడా మీరు ఏ రకమైన క్యాన్సర్ కణితితో బాధపడుతున్నారు, శరీరంలో అది ఏ భాగంలో ఉంది, ఎంత పెద్దగా ఉంది, అది మీ శరీర కార్యకలాపాలను, ఆరోగ్యాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తోంది అన్న అంశాలపై ఆధారపడి ఉంటుంది. కీమోథెరపీలో భాగంగా ఇచ్చే మందులను బట్టి మీ శరీరంలో అనేక విధాలుగా అతివేగంతో విస్తరించే క్యాన్సర్ కణాల విధ్వంసం జరుగుతుంది. క్యాన్సర్‌లో చాలా రకాలున్నాయి. అవి శరీరంలో ఒక్కో భాగంలో ఒక్కో విధంగా పెరుగుతుంటాయి. కాబట్టి అవి పెరిగే విధానాన్ని అనుసరించి, వాటిని లక్ష్యంగా చేసుకొని అనేక కీమోథెరపీ మందులను రూపొందించడం జరిగింది. దయచేసి సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీరు ఎక్కువగా ఆందోళన చెందకండి. కీమోథెరపీ లాంటి అత్యాధునిక వైద్య చికిత్సలతో సైడ్ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గించగలిగారు. ఇప్పుడు క్యాన్సర్ ఎంతమాత్రమూ ప్రాణాంతక వ్యాధి కాదు. ఎంత తొందరగా క్యాన్సర్‌ను గుర్తించగలిగితే అంత సంపూర్ణంగా దాని నుంచి విముక్తి పొందే అవకాశాలున్నాయి. డాక్టర్ జి.వంశీకృష్ణారెడ్డి సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్ ఆర్ధోపెడిక్ కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 65 ఏళ్లు. ఏడాదిక్రితం మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ) చేయించాం. శస్త్రచికిత్స సమయంలో ఆమె నేల మీద కూడా కూర్చోగలిగేందుకు హై-ఫ్లెక్స్ ఇంప్లాంట్ అమర్చాం. కానీ ఆమె నేల మీద కూర్చోలేకపోతున్నారు. ఒకింత చిన్న స్టూల్స్ వంటి వాటి మీద కూడా కూర్చోవడం సాధ్యం కావడం లేదు. హై-ఫ్లెక్స్ ఇంప్లాంట్స్ అమర్చాక కూడా తాను కోరుకున్నట్లుగా కింద కూర్చోవడం ఎందుకు సాధ్యపడటం లేదు? - యాదగిరి, నల్లగొండ మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఎంతగా కాళ్లు ముడుచుకుంటున్నాయి అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి శస్త్రచికిత్స టెక్నిక్ ఉపయోగించారు, శస్త్రచికిత్సలో నైపుణ్యం వంటి అంశాలు ఇందులో కీలక భూమిక పోషిస్తాయి. హై-ఫ్లెక్స్ ఇంప్లాంట్స్ అనేది మామూలు కంటే ఎక్కువగా ఒంగుతాయని నిపుణులు పేర్కొంటారు. అంతేగాని ఇవి నేల మీద కూర్చోడానికి మాత్రమే ఉద్దేశించినవి కాదు. ఇందులో మూడు అంశాలను మీరు గమనించాలి. మొదటిది... ఒకరు శస్త్రచికిత్స తర్వాత మోకాళ్లను ఎంతమేరకు వంచగలరు అనే అంశం వారు శస్త్రచికిత్సకు ముందు ఎంతగా వంచారనే అంశంతో పోల్చి చూడాలి. రెండో అంశం... శస్త్రచికిత్సకుల నైపుణ్యం, ఆ సర్జరీలోని క్వాలిటీ, మూడో అంశం శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ ఎంతగా వ్యాయామం చేస్తే ఫలితాలు అంతగా బాగుంటాయి. అందుకే మీ అమ్మగారు తగినంత వ్యాయామం చేసేలా జాగ్రత్తలు తీసుకోండి. దాంతో ఫలితాలు మరింతగా మెరుగుపడతాయి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఆయుర్వేద కౌన్సెలింగ్
మెడనొప్పికి పంచకర్మ నా వయస్సు 36 సంవత్సరాలు. నాకు తరచూ మెడనొప్పిగా ఉంటోంది. ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు చెయ్యి లాగడం మొదలవుతోంది. మందులు వాడినప్పుడు నొప్పి తగ్గుతోంది. మందులు మానగానే మళ్లీ వస్తోంది. దీనికి ఆయుర్వేదంలో సరైన వైద్యం ఉందా? - రవి వర్మ, విశాఖపట్నం మీరు కంప్యూటర్ ముందు ఎక్కువగా పనిచేసే వృత్తిలో ఉన్నవాళ్లలో ప్రతి 100 మందిలో 70 మంది ఈ లక్షణాలతో బాధపడుతున్నారు. దీనికి అనే కారణాలున్నాయి. ఈ వృత్తిలో వున్న చాలామందిలో శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. ఆహార అలవాట్లలో విపరీతమైన మార్పు వచ్చింది. నిద్రా సమయంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. వీటి ప్రభావం మన శరీర, మానసిక వ్యవస్థలపై పనిచేసి, చాలా దుష్ర్పభావాలు చూపిస్తున్నాయి. అందులో ఒకటి ఈ మెడనొప్పి. ఈ మెడనొప్పిని ఆయుర్వేదంలో మన్యస్తంభము అనీ, అపబాహుకము అని, అల్లోపతి వైద్యశాస్త్రంలో సర్వికల్ స్పాండిలోసిస్ అని అంటారు. ఎక్కువగా మానసిక ఆందోళనకు గురికావడం, నిద్ర సరిగా లేకపోవడం, అన్నం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కూడా కొంతమందిలో మెడనొప్పి వస్తూ ఉంటుంది. కారణాలు: 1) మెడ భాగంలో ఉన్న ఎముకల మధ్య ఉన్న ఖాళీభాగం తగ్గడం వల్ల, ఎముకల మధ్యలో వాపు రావడం వల్ల, ఎముకలు అరిగిపోవడం వల్ల కూడా పై లక్షణాలు కనిపిస్తుంటాయి. 2) కొంతమందిలో తల తిరగడం, పైకి లేస్తే కింద పడిపోతున్నట్లుగా ఉండడం వల్ల తలనొప్పి; మెడ నరాలు నొక్కుకుని పోయినట్లుగా, వాచినట్లుగా ఉండి, రక్తప్రసరణ తక్కువగా ఉండడం వల్ల కూడా మెడనొప్పి వస్తూ ఉంటుంది. 3) కొంతమందిలో మెడనొప్పి తక్కువగా ఉండి, మెడ దగ్గర నుండి అరచేయి వరకు లాగడం, నొప్పిగా ఉండడం, తిమ్మిరిగా, మొద్దుబారినట్టు ఉండడం వంటి లక్షణాలు ఉండచ్చు. మెడభాగంలోని ఎముకల మధ్య ఉన్న డిస్క్ భాగంలో వాపు రావడం వల్ల కానీ, అది పక్కకు జరగడం వల్ల కానీ ఇలా జరుగుతుంది. పై లక్షణాలు తెలుసుకోవడానికి ఎక్స్‌రే కానీ, ఎంఆర్ఐ కానీ తీయవచ్చు. ఆయుర్వేద వైద్యుడికి మాత్రం ఇవేవీ అవసరం లేదు. మీ లక్షణాలను బట్టి వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. చికిత్సా క్రమంలో... 1) వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే ఎక్కువ సమయం పడుకోవడం మంచిది. తలభాగంలో తక్కువ పరిమాణంలో ఉన్న దిండును వాడడం మంచిది. 2) కొద్దిరోజుల వరకు బరువైన వస్తువులను మోయరాదు. 3) శతపాక క్షీరబలా తైలాన్ని ఉదయం, రాత్రి వ్యాధి తీవ్రతను బట్టి తీసుకోవలసి ఉంటుంది. 4) మానసిక ఆందోళన, రక్తపోటు, తలతిరగడం ఉన్నట్లయితే ‘మానసమిత్రవటకం’ను వాడడం మంచిది. 5) ఎముకలమధ్య వాపు ఉన్నట్లయితే వాపు తగ్గడానికి ‘త్రయోదశాంగ గుగ్గులు’ వాడడం మంచిది. తిమ్మిరి, చెయ్యి మొద్దుబారినట్లు ఉండటం వంటి వాటికి వాతగజాంకుశరస్, లశూనాదివటి ని కలిపి తీసుకోవడం మంచిది. పంచకర్మ పద్ధతిలో శిరోధార, నస్యకర్మ, గ్రీవవస్తి, మనల్కిడీ లాంటి పంచకర్మ చికిత్సలను తీసుకున్నట్లయితే శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత, మెడనొప్పికి సంబంధించిన ఆసనాలు, మానసిక ప్రశాంతతకు ప్రాణాయామం, ధ్యానం మొదలైన వాటిని అలవాటు చేసుకోవడం మంచిది. -
ఫిజియోథెరపీ కౌన్సెలింగ్
నాకు నిద్రలో మెడ పట్టుకుంది. తగ్గాలంటే ఏం చేయాలి? - హరీశ్, తుని నిద్రలో మెడపట్టుకోవడం చాలా సాధారణంగా కనిపించే సమస్య. దీనితో వచ్చే మెడనొప్పిని తగ్గించుకోవడం కోసం హీట్‌ప్యాక్ (వేడికాపడం) తర్వాత కోల్డ్ప్యాక్ (ఐస్‌ముక్కలు టవల్లో చుట్ట్టి కాపడంలా పెట్టడం) కొంతకొంత వ్యవధిలో చేస్తుండాలి. (ఒకవేళ ఇలా మెడలు పట్టేసిన చోటగానీ లేదా మరేచోటనైనా నొప్పితోపాటు ఆ ప్రదేశం ఎర్రబారడం, వాపు కనిపిస్తే వేడికాపడం కంటే కోల్డ్ ప్యాక్ చాలా ప్రభావపూర్వకంగా పనిచేస్తుంది). ఇలా హీట్‌ప్యాక్, ఐస్‌ప్యాక్‌ల మధ్యమధ్యన నొప్పి రానంతమేరకు మెడను నెమ్మదిగా పక్కలకు, వెనక్కు వంచాలి. కానీ ముందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ వంచవద్దు. కూర్చున్నా, నిల్చున్నా, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మెడను నిటారుగా ఉంచాలి. ఇలా మెడనొప్పిగా ఉన్నప్పుడు మెడను గుండ్రంగా తిప్పవద్దు. నాకు తీవ్రమైన నడుము నొప్పి వస్తోంది. ఈ నొప్పి తగ్గడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - సుభానీ, గుంటూరు మీ నడుము కండరాలు బలంగా ఉన్నప్పటికీ ఇలా నడుము నొప్పి వచ్చినప్పుడు సాధ్యమైనంత విశ్రాంతి తీసుకోండి. చాలావరకు విశ్రాంతితోనే నడుము నొప్పి ఉపశమిస్తుంది. అలాగే నిద్రపోతున్నప్పుడు ఈ నొప్పి నడుం పట్టుకుని ఈ నొప్పి వచ్చి ఉంటే వెల్లకిలా కాకుండా ఓరగా ఓ పక్కకు పడుకోండి. ఈ సమయంలో మీ రెండు కాళ్ల మధ్య ఒక చిన్న తలగడ ఉంచుకోండి. దీనివల్ల మీ నడుం వద్ద ఉన్న కండరాలపై అదనపు భారం పడకుండా ఈ తలగడ ఒక సపోర్ట్‌లా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఐస్‌ప్యాక్ పెట్టడం వల్ల నొప్పి, వాపు తగ్గుతాయి. ఐస్‌ప్యాక్ లేకపోతే ఒక టవల్‌ను ప్లాస్టిక్‌బ్యాగ్‌లో ఉంచి, దాన్ని మీ ఫ్రిజ్‌లోని డీప్ ఫ్రీజర్‌లో 15-30 నిమిషాలు ఉంచి, ఆ తర్వాత తీసి, నొప్పి ఉన్న చోట అద్దండి. ఈ ఐస్ప్యాక్తో నొప్పి తగ్గుతుంది. -
చేతిస్పర్శతో ఒంటి చికిత్సకు.. ఫిజియోథెరపిస్ట్
ఆటలు ఆడుతున్నప్పుడు కాలు బెణుకుతుంది. నడుస్తున్నప్పుడు కింద పడితే కీళ్లు పట్టేస్తాయి. ఆ బాధ వర్ణనాతీతం. ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, మెడ నొప్పి, బ్యాక్ పెయిన్ వంటివి తరచుగా వేధిస్తుంటాయి. చేతిస్పర్శతోనే ఇలాంటి బాధల నుంచి ఉపశమనం కలిగించే వైద్యుడు.. ఫిజియోథెరపిస్ట్. ఈ తరహా వైద్యంపై గతంలో ప్రజల్లో అంతగా అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఒళ్లు నొప్పుల నుంచి విముక్తి కోసం సంబంధిత వైద్యులను ఆశ్రయించేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఫిజియోథెరపిస్ట్‌లకు అవకాశాలు మెరుగవుతున్నాయి. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంటే ఉద్యోగాలకు, ఉపాధి అవకాశాలకు ఢోకా లేకపోవడం యువతను ఆకర్షిస్తోంది. నిపుణులకు అవకాశాలు పుష్కలం: ఫిజియోథెరపీ/ఫిజికల్ థెరపీ గతంలో కాళ్ల నొప్పులు, మెడ నొప్పులు వంటి వాటికే పరిమితం. వైద్య రంగంలో ప్రస్తుతం ఫిజియోథెరపిస్ట్‌ల పరిధి విస్తరించింది. దాదాపు అన్ని విభాగాల్లో వీరి సేవలు అవసరమవుతున్నాయి. ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, గైనకాలజీ, స్పోర్ట్స్ మెడిసిన్ వంటి వాటిలో వీరి భాగస్వామ్యం తప్పనిసరిగా మారింది. ఈ వైద్యులు ఉష్ణం, వ్యాక్స్, ఎలక్ట్రిసిటీ వంటివి ఉపయోగించి ఎక్సర్సైజ్లు, థెరపీల ద్వారా రోగులకు స్వస్థత చేకూర్చాల్సి ఉంటుంది. తగిన వ్యాయామాలను సూచించాలి. ఫిజియోథెరపిస్ట్‌లకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, రిహాబిలిటేషన్ సెంటర్లు, స్పెషల్ స్కూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, స్పోర్ట్స్ అకాడమీలు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వేతర సంస్థల్లో కొలువులు ఉన్నాయి. తగిన అనుభవం, వనరులు అందుబాటులో ఉంటే సొంతంగా ఫిజియో థెరపీ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అనుకూలమైన పనివేళలు ఉండడం ఇందులోని సానుకూలాంశం. కావాల్సిన నైపుణ్యాలు: రోగులకు సేవ చేయాలన్న దృక్పథం ఫిజియోథెరపిస్ట్‌లకు ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. చికిత్స ఫలించేదాకా ఓపిక, సహనంతో పనిచేయగలగాలి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ రంగంలో ప్రారంభంలో తక్కువ వేతనాలున్నా అనుభవం పెరిగేకొద్దీ సంపాదన కూడా పెరుగుతుంది. ఎప్పటికప్పుడు పనితీరును తప్పనిసరిగా మెరుగుపర్చుకోవాలి. అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైన తర్వాత ఫిజియోథెరపీ/ఫిజికల్ థెరపీలో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులో చేరొచ్చు. తర్వాత పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సు కూడా పూర్తిచేస్తే కెరీర్ పరంగా మంచి అవకాశాలుంటాయి. వేతనాలు: ఫిజియోథెరపిస్ట్‌కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభంలో నెలకు రూ.25 వేల వేతనం అందుతుంది. చీఫ్ ఫిజియోథెరపిస్ట్ స్థాయికి చేరుకుంటే నెలకు రూ.75 వేలు పొందొచ్చు. ప్రైవేట్ రంగంలో ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వేతనం లభిస్తుంది. అనుభవాన్ని బట్టి వేతనంలో పెరుగుదల ఉంటుంది. సొంతంగా ఫిజియోథెరపీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటే పనితీరును బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఉస్మానియా మెడికల్ కాలేజీ-హైదరాబాద్ వెబ్సైట్: www.osmaniamedicalcollege.com నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్) వెబ్సైట్: www.nims.edu.in అపోలో కాలేజీ ఆఫ్ ఫిజియోథెరపీ-హైదరాబాద్ వెబ్సైట్: www.apollocollegedurg.com డెక్కన్ కాలేజీ ఆఫ్ మెడికల్ సెన్సైస్ వెబ్సైట్: http://deccancollegeofmedicalsciences.com పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండీకాప్డ్-న్యూఢిల్లీ వెబ్సైట్: www.iphnewdelhi.in పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వెబ్సైట్: http://pgimer.edu.in/ కాంపిటీటివ్ కౌన్సెలింగ్ కానిస్టేబుల్ పరీక్షలో లోహశాస్త్రం పాఠ్యాంశం ప్రాధాన్యతను తెలపండి? ఏయే అంశాలపై ప్రశ్నలు అడుగుతారు? - వి. కిరణ్ కుమార్, సికింద్రాబాద్ లోహశాస్త్రం అత్యంత ప్రాచీనమైంది. రుగ్వేదంలోనే దీని ప్రస్తావన ఉంది. ఢిల్లీలోని ఐరన్‌పిల్లర్ నేటికీ చెక్కు చెదరకుండా ఉండటం మన పూర్వీకుల లోహశాస్త్ర పనితీరుకు నిదర్శనం. బంగారం, ప్లాటినం తప్ప మిగిలిన లోహాలన్నీ ప్రకృతిలో సంయోగ స్థితిలోనే లభిస్తున్నాయి. అవి సల్ఫైడులు, ఆక్సైడులు, క్లోరైడులు, కార్బొనేటుల వంటి సమ్మేళన రూపాల్లో లభిస్తున్నాయి. వాటి నుంచి పరిశుద్ధ లోహం నిష్కర్షణ చేయడంలో అనేక దశలుంటాయి. దీనికి సంబంధించి వివిధ రూపాల్లో ప్రశ్నలడగవచ్చు. లోహాలకు సంబంధించిన ఖనిజాలపై కూడా ప్రశ్నలు అడుగుతారు. ఉదా: అల్యూమినియం ధాతువేది? జవాబు. బాక్సైట్. వివిధ దశల్లోని భర్జనం, భస్మీకరణం, ప్లవన క్రియ వంటి వాటిపై ప్రశ్నలు రావచ్చు. ఇక లోహక్షయాన్ని నిరోధించే గాల్వనైజేషన్ వంటి ప్రక్రియలపై ప్రశ్నలడగవచ్చు. 2013లో ఈ అంశంపైనే ప్రశ్న అడిగారు. సాధారణంగా జింక్, టిన్ వంటి లోహాల పూతలు పూస్తారు. జింక్ చర్యాశీలత ఎక్కువ కాబట్టి కొన్నిసార్లు జింక్ కంటే టిన్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ఇక మరొక ముఖ్యమైన అంశం లోహాల ఉపయోగాలు, మిశ్రమలోహాల సంఘటనం, వాటి ఉపయోగాలు. 2012 పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో స్టెయిన్లెస్ స్టీల్ సంఘటనంపై ప్రశ్న వచ్చింది. ఈ చాప్టర్ కోసం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పాత టెక్ట్స్‌బుక్ ఉపయుక్తంగా ఉంటుంది. ఇన్పుట్స్: డాక్టర్ బి. రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ పోటీ పరీక్షల్లో ‘భారత రాజ్యాంగ పరిషత్’ పాఠ్యాంశం నుంచి ఏయే అంశాలపై ప్రశ్నలు అడుగుతారు? ఎలా చదవాలి? - ఎన్. భాస్కర్ రెడ్డి, నాచారం రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం, సభ్యుల ఎన్నిక, వివిధ కమిటీలు - అధ్యక్షులు తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు స్వాతంత్య్రోద్యమ చరిత్రను అధ్యయనం చేయాలి. రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, రాజేంద్రప్రసాద్, అంబేద్కర్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మొదలైన ప్రముఖులకు సంబంధించి ముఖ్యమైన అంశాలు తెలిసి ఉండాలి. మన రాజ్యాంగ నిర్మాణంపై ప్రభావం చూపిన ఇతర దేశ రాజ్యాంగాలు, వాటి నుంచి గ్రహించిన అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. రిఫరెన్స పుస్తకాలు: 1. భారత రాజ్యాంగ అభివృద్ధి - ఎం.ఎ. తెలుగు అకాడమీ 2. భారత రాజ్యాంగం - తెలుగు అకాడమీ 3. భారత ప్రభుత్వం - రాజకీయాలు- తెలుగు అకాడమీ ఇన్పుట్స్: కె కాంతారెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ ఎడ్యూ న్యూస్: కెనడా స్టడీ పర్మిట్ దరఖాస్తులు 15 శాతం అధికం కెనడా.. నాణ్యమైన ఉన్నత విద్యనందిస్తూ భారత విద్యార్థిలోకం దృష్టిని ఆకర్షిస్తున్న దేశం. కెనడాకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. న్యూఢిల్లీలోని కెనడియన్ హైకమిషన్‌కు విద్యార్థులు చేసుకున్న స్టడీ పర్మిట్ దరఖాస్తుల్లో గతంలో కంటే 15 శాతం పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది హైకమిషన్ 14,000 స్టడీ పర్మిట్లను జారీ చేసింది. కెనడాకు వెళ్తున్న విద్యార్థులు ఎంచుకుంటున్న కోర్సుల విషయంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. లిబరల్ ఆర్ట్స్, కమ్యూని కేషన్స్, జర్నలిజం, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, సైకాలజీ, ఇంటర్నేషనల్ స్టడీస్, మ్యూజిక్, ఫిల్మ్ అండ్ డిజైన్ కోర్సులను ఎక్కువగా అభ్యసిస్తున్నారు. గతంలో సెన్సైస్, ఇంజనీరింగ్, బిజినెస్ స్టడీస్‌లో ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లేవారు. రిక్రూటర్లు ప్రస్తుతం క్రిటికల్ థింకింగ్, రైటింగ్, కమ్యూనికేషన్ వంటి స్కిల్స్‌కు పెద్దపీట వేస్తుండ డంతో వాటిని నేర్పించే లిబరల్ ఆర్ట్స్ కోర్సుపై యువత ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కెనడాలో యూనివర్సిటీ డిగ్రీలు సరళంగా ఉంటాయి. అంతేకాకుండా అక్కడ చదువుకుంటూనే పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకోవచ్చు. ప్రతిభా వంతులైన విద్యార్థులకు స్టైపెండ్స్, స్కాలర్షిప్స్ లభిస్తాయి. అమెరికాతో పోలిస్తే కెనడాలో ట్యూషన్ ఫీజులు చాలా తక్కువ. సెప్టెంబర్ 25 నుంచి సీమ్యాట్ దేశవ్యాప్తంగా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో 2015-16 విద్యా సంవత్సరానికి పీజీడీఎం, ఎంబీఏ, పీజీసీఎం, ఎగ్జిక్యూటివ్ పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశానికి కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్)-2014 పరీక్షను సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. ఈ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో జరగనుంది. వివరాలకు వెబ్సైట్: www.aicte-cmat.in జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీఎస్సీ(నర్సింగ్), కాలపరిమితి: నాలుగేళ్లు బీఎస్సీ(మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ) బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కాలపరిమితి: మూడేళ్లు అర్హతలు: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ ఉత్తీర్ణత. ఎంపిక: ప్రవేశ పరీక్ష/అకడమిక్ మెరిట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 23 చివరి తేది: అక్టోబర్ 9 వెబ్సైట్: http://ntruhs.ap.nic.in/ సీఎస్ఐఆర్- సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఎస్ఐఆర్- సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. సైంటిస్ట్ పోస్టుల సంఖ్య: 31 విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంఈ/ ఎంటెక్ లేదా ఫిజిక్స్/కెమిస్ట్రీ/ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్లో పీహెచ్డీ ఉండాలి. వయసు: 32 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష , ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 20 వెబ్సైట్: http://www.cbri.res.in/ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మేనేజర్ (ఫైనాన్స్): 1 అర్హతలు: సీఏతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. అకౌంటెంట్: 19 అర్హతలు: మొదటి శ్రేణితో బీకాం లేదా రెండో శ్రేణితో ఎంకాం ఉత్తీర్ణులై ఉండాలి. మూడేళ్ల అనుభవంతో పాటు ట్యాలీ సాఫ్ట్వేర్ పరిజ్ఞానం ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్: 143 అర్హతలు: 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 29 వెబ్సైట్: http://nielitchd.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కాలపరిమితి: ఏడాది అర్హతలు: ఏదైనా బ్యాచిలర్‌స డిగ్రీ ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక: జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 25 వెబ్సైట్: http://www.nird.org.in/ -
జగన్‌కు మెడనొప్పి: శంఖారావం ఒక రోజు వాయిదా
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర ఒకరోజు వాయిదా పడింది. ఈ నెల 17వ తేదీకి బదులు 18వ తేదీకి వాయిదాపడింది. జగన్‌కు మెడనొప్పి కారణంగా సమైక్య శంఖారావం యాత్ర ఒక రోజు వాయిదా వేసినట్లు ఆ పార్టీ చిత్తూరు జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి చెప్పారు. 18 నుంచి జగన్ సమైక్య శంఖారావం యాత్ర తిరిగి ప్రారంభిస్తారని వైఎస్ఆర్ సీపీ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.