తీవ్రమైన మెడ, నడుం నొప్పి.. తగ్గుతుందా? | Palmanalaji counseling | Sakshi
Sakshi News home page

తీవ్రమైన మెడ, నడుం నొప్పి.. తగ్గుతుందా?

Published Wed, Jul 6 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

తీవ్రమైన మెడ, నడుం నొప్పి.. తగ్గుతుందా?

తీవ్రమైన మెడ, నడుం నొప్పి.. తగ్గుతుందా?

పల్మనాలజీ కౌన్సెలింగ్
 

 నా వయసు 30 ఏళ్లు. గత ఏడాది కాలం నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. దగ్గరలో ఉన్న డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అంటున్నారు. దీనికి మందులు వాడుతున్నాను. నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా?
 - జనార్దన్‌రావు, కత్తిపూడి

స్పాండిలోసిస్ అనేది వెన్నెముకకు సంబంధించిన సమస్య. స్పాండిలోసిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అంటారు.

కారణాలు:  కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు  జాయింట్స్‌లో వాటర్ తగ్గడం వల్ల కూడా నొప్పి రావచ్చు  స్పైన్ దెబ్బతిని కూడా నొప్పి రావచ్చు  వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి దారి ఉంటుంది. ఆ దారి సన్నబడితే నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది.
 
లక్షణాలు:  సర్వైకల్ స్పాండిలోసిస్: - మెడనొప్పి, తలనొప్పి తల అటు-ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది.
 
లంబార్ స్పాండిలోసిస్ : నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి ఒకవైపు కాలు, పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, దాంతో నడవడానికి కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి.
 
నిర్ధారణ :  వ్యాధి లక్షణాలను బట్టి  ఎక్స్-రే  ఎమ్మారై, సీటీ స్కాన్
 
నివారణ: వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం.
 
హోమియో చికిత్స: హోమియో ప్రక్రియలో ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా  పరిష్కారం ఉంది. రోగి వ్యక్తిగత లక్షణాలను బట్టి వారి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని చికిత్స ఇస్తారు. ఇలా కాన్‌స్టిట్యూషనల్ చికిత్స అందిస్తే క్రమంగా రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధి తీవ్రత క్రమంగా తగ్గుతుంది. దాంతో క్రమక్రమంగా పూర్తిగా వ్యాధి నివారణ జరుగుతుంది.
 
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్
 పాజిటివ్ హోమియోపతి  హైదరాబాద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement