spandilosis
-
మెడి టిప్: స్పాండిలోసిస్ పెరగకుండా జాగ్రత్తలివి..
మెడలో ఉన్న వెన్నుకు సంబంధించిన ఎముకలు అరిగి.. రాపిడికి గురైనప్పుడు వెన్నుపూసల నరాలపై ఒత్తిడి పడటం వల్ల వచ్చే నొప్పిని ‘స్పాండిలోసిస్’ అంటారు. ఈ నొప్పి తగ్గడానికీ.. అలాగే ముందు నుంచే స్పాండిలోసిస్ నివారణకూ పాటించాల్సిన జాగ్రత్తలివి.. బరువైన వస్తువులు.. అంటే నీళ్లబక్కెట్లు, సూట్‌కేసులు, బ్రీఫ్‌కేసులు, ల్యాప్‌టాప్‌లు మోయడం వంటి పనులు చేయకూడదు. తలపైన బరువులు (మూటలు, గంపలు వంటి అతి బరువైనవి) పెట్టుకోకూడదు. పడుకునే సమయంలో తలగడ కేవలం తల కింది వరకే కాకుండా భుజాల వరకూ ఉండేలా చూసుకోవాలి. దాంతో మెడకు కొంత సపోర్ట్ ఉండేలా జాగ్రత్తపడాలి. తలగడ అందుబాటులో లేకపోతే కనీసం ఒక బెడ్‌షీట్ నాలుగు ఇంచుల ఎత్తుగా ఉండేలా మడత వేసి తల కింద పెట్టుకోవాలి. దాని మీద ఓ టర్కీ టవల్‌ను రోల్ చేసినట్లుగా చుట్టి మెడకింద పెట్టుకోవాలి. మూడు నెలల నుంచి ఆర్నెల్ల వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమస్య ఉన్నప్పుడు తలగడ లేకుండా పడుకోవడం అన్నది సరికాదు. తలగడ ఉండటం వల్లనే తప్పనిసరిగా మెడకూ, భుజాలకు సపోర్ట్ ఉంటుంది. సమస్య రెండో దశలో ఉన్నప్పటికీ మందులతో పాటు ఇక్కడ పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటే సమస్య దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గనివారు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. ఇవి చదవండి: చాలాసేపు కదలకుండా కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త! -
తీవ్రమైన మెడ, నడుం నొప్పి.. తగ్గుతుందా?
పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. గత ఏడాది కాలం నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. దగ్గరలో ఉన్న డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అంటున్నారు. దీనికి మందులు వాడుతున్నాను. నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? - జనార్దన్‌రావు, కత్తిపూడి స్పాండిలోసిస్ అనేది వెన్నెముకకు సంబంధించిన సమస్య. స్పాండిలోసిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అంటారు. కారణాలు: కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు జాయింట్స్‌లో వాటర్ తగ్గడం వల్ల కూడా నొప్పి రావచ్చు స్పైన్ దెబ్బతిని కూడా నొప్పి రావచ్చు వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి దారి ఉంటుంది. ఆ దారి సన్నబడితే నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు: సర్వైకల్ స్పాండిలోసిస్: - మెడనొప్పి, తలనొప్పి తల అటు-ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. లంబార్ స్పాండిలోసిస్ : నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి ఒకవైపు కాలు, పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, దాంతో నడవడానికి కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి. నిర్ధారణ : వ్యాధి లక్షణాలను బట్టి ఎక్స్-రే ఎమ్మారై, సీటీ స్కాన్ నివారణ: వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. హోమియో చికిత్స: హోమియో ప్రక్రియలో ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా పరిష్కారం ఉంది. రోగి వ్యక్తిగత లక్షణాలను బట్టి వారి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని చికిత్స ఇస్తారు. ఇలా కాన్స్టిట్యూషనల్ చికిత్స అందిస్తే క్రమంగా రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధి తీవ్రత క్రమంగా తగ్గుతుంది. దాంతో క్రమక్రమంగా పూర్తిగా వ్యాధి నివారణ జరుగుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ -
కూర్చున్నా, నిల్చున్నా నడుము నొప్పి... తగ్గేదెలా?
ఆర్థో కౌన్సెలింగ్ నా వయసు 64 ఏళ్లు. కొద్ది నెలలుగా నాకు నడుము నొప్పి వస్తోంది. కూర్చున్నా, నిల్చున్నా నొప్పులు వస్తున్నాయి. దాంతోపాటు కాళ్లలో నొప్పులు, తిమ్మిర్లు, అవి మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. నాకు తగిన సలహా ఇవ్వండి. - నిరంజన్‌రావు, కోదాడ మీరు తెలిపన వివరాలను బట్టి చూస్తే మీరు స్పాండిలోసిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంవది. స్పాండిలోసిస్ ఉన్నవారిలో వెన్నుపూసల వల్ల నరాలు నొక్కుకుపోయి, వాటిపై ఒత్తిడి పడుతుంది. దాంతో నడుమునొప్పితో పాటు కాళ్లలో నొప్పులు, తిమ్మిర్లు ప్రారంభమవుతాయి. ఈ సమస్యతో బాధపడుతున్నవారు నడిస్తే చాలు కాళ్లలో నొప్పి రావడం మొదలవుతుంది. కాళ్లు బరువెక్కుతాయి. ఇంకొంచెం దూరం నడిస్తే ఇక నడవలేని పరిస్థితి కలుగుతుంది. ఆగిపోతే నొప్పి తగ్గుతుంది. తిరిగి నడక ప్రారంభిస్తే నొప్పి కలుగుతుంది. దీన్నే వైద్య పరిభాషలో క్లాడికేషన్ అంటారు. ఈ దశలోనే ఆ ప్రాంతంలో నడుము సమతౌల్యం తప్పుతుంది. ఆ తర్వాత నడుము మొత్తంగా ఒక పక్కకు గానీ ముందుకు గానీ ఒంగిపోతుంది. కొంచెం నడిచినా, కొంచెంసేపు నిల్చున్నా పిదుదుల భాగంలో, తొడ ఎముక భాగాల్లో నొప్పి వస్తుంది. నొప్పి క్రమంగా తీవ్రమై మంచం నుంచి బాత్రూమ్ వరకు నడవలేని పరిస్థితి వస్తుంది. అప్పటికీ చికిత్స చేయించుకోకపోతే మంచానికే పరిమితమైపోయే పరిస్థితి రావచ్చు. ఇతర ఇబ్బందులు కూడా వచ్చి ప్రాణాపాయం కలగవచ్చు. కాబట్టి మీలాంటి సమస్య ఉన్న సందర్భాల్లో వెంటనే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి. - డా. ప్రవీణ్ మేరెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
పేస్‌మేకర్ ఎందుకు అమర్చుతారు..?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. నేను ఏడాది నుంచి మెడనొప్పి, నడుము నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అన్నారు. మందులు వాడుతుంటే తగ్గినట్టే తగ్గి మళ్లీ నొప్పి వస్తోంది. హోమియోలో శాశ్వత చికిత్స ఉంటే తెలపండి. - నారాయణ స్వామి, నిజామాబాద్ స్పాండిలోసిస్ వెన్నెముకకు సంబంధించిన సమస్య. ఇది ఒక రకమైన ఆర్థరైటిస్. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అనీ, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని అంటారు. కారణాలు : కాళ్లు, చేతులలో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్‌లో అరుగుదల వల్ల నొప్పి రావచ్చు. జాయింట్స్ వాటర్ తగ్గడం వల్ల కూడా నొప్పి రావచ్చు. స్పైన్ దెబ్బతిని వెన్ను నొప్పి రావడాన్ని స్పాండిలోసిస్ అంటారు. వెన్నుపూసల మధ్య నరాలు వెళ్లడానికి దారి ఉంటుంది. ఈ దారి సన్నబడితే నరాల మీద ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు : సర్వైకల్ స్పాండిలోసిస్ - మెడనొప్పి, తలనొప్పి, తల అటు ఇటు తిప్పడం కష్టం కావడం, మెడ బిగుసుకుపోయినట్లుగా ఉండటం, నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. లంబార్ స్పాండిలోసిస్ : నడుము నొప్పితో పాటు కొన్నిసార్లు మెడనొప్పి కూడా ఉంటుంది. ఒకవైపు కాలు నుంచి పాదం వరకు నొప్పి వ్యాపిస్తుంటుంది. దీన్నే సయాటికా నొప్పి అని అంటారు. నరాలు ఒత్తిడికి గురై నడవడానికి ఇబ్బంది పడటం వంటి సమస్యలూ కనిపిస్తాయి. నిర్ధారణ : లక్షణాలను బట్టి వ్యాధిని తెలుసుకోవడంతో పాటు, ఎక్స్-రే, ఎమ్మారై, సీటీ స్కాన్లూ నిర్ధారణకు ఉపయోగపడతాయి. నివారణ : స్పైన్‌కు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఉన్నట్టుండి ఒక్కసారిగా కూర్చోవడం, నిల్చోవడం చేయకూడదు. దూరప్రాంతాలకు నడవడం సరికాదు.హోమియోలో కాన్స్టిట్యూషనల్ చికిత్సతో క్రమేపీ రోగనిరోధక శక్తి పెంచడం ద్వారా వ్యాధిని క్రమక్రమంగా తగ్గిస్తూ, పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 65 ఏళ్లు. నాకు గత ఏడాది ఛాతీలో నొప్పి రావడంతో యాంజియోగ్రామ్ చేసి ఒక స్టెంట్‌ను వేశారు. ఇప్పుడు శ్వాసలో తీవ్రమైన ఇబ్బందితో పాటు ఛాతీలో నొప్పి రావడంతో మళ్లీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాను. ఇప్పుడు డాక్టర్ నన్ను పరీక్షించి, గుండెలో విద్యుత్ సమస్య ఏర్పడిందనీ, దాన్ని సరిచేయడానికి పేస్‌మేకర్‌ను అమర్చాలని చెబుతున్నారు. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - కె. ప్రకాశ్‌రావు, జగ్గయ్యపేట గుండె జబ్బు అనగానే మనకు ఒకటే అంశం గుర్తుకు వస్తుంది. అదే గుండెపోటు. కానీ నిజానికి గుండెకు సంబంధించి ఇతర చాలా రకాల సమస్యలు వస్తుంటాయి. అందులో ఒకటి గుండెకు సరఫరా అయ్యే కరెంటు. గుండె ద్వారా శరీరానికి ఇతర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. కాబట్టి గుండె పంపుగా పని చేయడానికి శక్తి కావాలి. ఇందుకు గుండె పై భాగంలో ఉండే గదుల్లో కుడివైపున సైనో ఏట్రియల్ (ఎస్ఎ) నోడ్, ఏట్రియో వెంట్రిక్యులార్ (ఏవి) నోడ్ అనే కేంద్రాలుంటాయి. వీటి నుంచి గుండెకు విద్యుత్ ప్రేరణలు అందుతుంటాయి. ఈ విద్యుత్ ప్రేరణల వల్ల గుండె ఒక క్రమపద్ధతిలో స్పందించడం వల్ల రక్తనాళాల్లోకి రక్తం పంప్ అవుతుంది. అయితే కొన్ని సందర్భాలలో ఈ విద్యుత్ ప్రేరణల్లో మార్పులు వచ్చి గుండె లయ దెబ్బతింటుంది. దాంతో ఒక్కోసారి గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. ఒక్కోసారి దీన్నే వైద్య పరిభాషలో ట్యాకి కార్డియా అంటారు. గుండె వేగం తగ్గినప్పుడు ఛాతీ పైభాగంలో చర్మం క్రింద పేస్‌మేకర్‌ను అమర్చి గుండె వేగాన్ని సరిదిద్దుతారు. గుండె వేగం పెరిగినప్పుడు బీటా బ్లాకర్స్ అనే మందులు ఉపయోగించి గుండె లయను క్రమబద్ధీకరిస్తారు. గుండె లయ తప్పకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి బరువు పెరగకుండా చూసుకోవాలి రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి కొలెస్ట్రాల్ పాళ్లు అదుపులోనే ఉండేలా చూసుకోవాలి మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు సక్రమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ అనుజ్ కపాడియా సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు మూడు నెలలు. ఈమధ్య తరచూ ఏడుస్తోంది. డాక్టర్‌కి చూపిస్తే కడుపు నొప్పి వల్ల ఏడుస్తుండవచ్చు అని కొన్ని మందులు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి. దయచేసి మా పాప సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - అంజలి, కొత్తగూడెం పిల్లలు ఆగకుండా ఏడవడానికి అనేక కారణాలు ఉంటాయి. చిన్న సమస్య మొదలుకొని ప్రమాదకరమైన జబ్బుల వరకూ పిల్లలు ఏడుపు ద్వారానే వ్యక్తపరుస్తారు.ఆకలిగా ఉన్నా, చెవి నొప్పి ఉన్నా సరే ఏడ్వడం ద్వారానే వాటిని తెలియబరుస్తుంటారు. పిల్లల ఏడుపుకు కొన్ని కారణాలు: ఆకలి వేసినప్పుడు, భయపడినప్పుడు, దాహం వేసినప్పుడు, డయపర్ తడిగా అయినప్పుడు, వాతావరణం వారికి చల్లగా లేదా వేడిగా ఉన్నప్పుడు, పెద్ద పెద్ద శబ్దాలు అవుతున్నప్పుడు, కాంతి ఎక్కువైనా, పొగలు కమ్ముకున్నా, ఏవైనా నొప్పులు ఉన్నప్పుడు, పళ్ళు వస్తున్నప్పుడు, ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు, కడుపు నొప్పి (ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్), జ్వరం, జలుబు, చెవినొప్పి, మెదడువాపు జ్వరం, గుండె సమస్యలు, కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలను కూడా పిల్లలు ఏడుపు ద్వారానే వ్యక్తం చేస్తారు. ఒకటి నుంచి ఆర్నెల్ల వయసులో ఉన్న పిల్లలు ఎక్కువగా ఏడవటానికి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన రుగ్మతలు, చెవి నొప్పి, జలుబు వంటివి కారణాలు. మీ పాప విషయంలో ఏడుపు బహుశా కడుపునొప్పి (ఇన్ఫెన్టైల్ కోలిక్) కారణం అనిపిస్తుంది. ఈ సమస్య సాధారణంగా ఆరువారాల నుంచి మూడు నెలలలోపు పిల్లల్లో వస్తుంటుంది. ఈ వయసు పిల్లలు కడుపునొప్పితో ఏడుస్తుండటం తరచూ చూస్తుంటాం. ఇది ముఖ్యంగా పేగులకు సంబంధించిన నొప్పి. ఇది చాలా సాధారణమైన సమస్య. ఇలాంటి పిల్లల్లో ఏడుపుకు ఫలానా అంటూ నిర్దిష్టంగా కారణం అని చెప్పలేకపోయినా... ఆకలి, గాలి ఎక్కువగా మింగడం, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెర ఎక్కువ కావడం వంటి కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు. ఇటువంటి పిల్లలను ఎత్తుకోవడం (అప్ రైట్ పొజీషన్), లేదా వాళ్లను పొట్టమీద పడుకోబెట్టడం, తేన్పు వచ్చేలా చేయడం (ఎఫెక్టివ్ బర్పింగ్)తో ఏడుపు మాన్పవచ్చు. చికిత్స : కొందరికి యాంటీస్పాస్మోడిక్‌తో పాటు మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనే రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే తప్పకుండా మీ పిల్లల డాక్టర్‌కు చూపించి తగిన చికిత్స తీసుకోవాలి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
అలర్జీ కాస్తా ఆస్తమాకు దారి తీయవచ్చు...
హోమియో కౌన్సెలింగ్ మా అమ్మగారికి 65 సంవత్సరాలు. ఆమె గత కొన్నేళ్లుగా సర్వైకల్ స్పాండిలోసిస్‌తో బాధపడుతున్నారు. దయచేసి ఆమెకు తగిన హోమియో మందులు సూచించగలరు. - పి. పద్మజ, మచిలీపట్నం సుమారు 90 శాతం జనాభాలో ప్రతి ఒక్కరికి 60 సంవత్సరాలు వచ్చేసరికి కొద్దిపాటి స్పాండిలోసిస్ సమస్య వస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇలా ప్రధానంగా వయసుతో వచ్చే ఈ సమస్య ఇటీవలి కాలంలో యుక్త వయస్కుల్లోనే కనిపిస్తుంది. దీనికి గల కారణాలు అనేకం. సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా మెడనొప్పి వ్యాయామం లేకపోవడం, అధిక బరువులు ఎత్తడం, పెరుగుతున్న పని ఒత్తిడికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. సర్వైకల్ స్పాండిలోసిస్ అనగానేమి? మానవ శరీర వ్యవస్థలో వెన్నెముక ఒక మూలస్తంభం లాంటిది. వెన్నుపూస పలు విభాగాల సమ్మేళనం. వెన్నెముకకు తోడుగా కండరాలు, డిస్కులు, లిగమెంట్లు ఉంటాయి. ఇవి సులభంగా వంగడానికి, శరీరంలోని కదలికలకు తోడ్పడతాయి. వెన్నెముకలోని ప్రతి రెండు పూసల మధ్య మృదువైన పదార్థం ఉంటుంది. దీనినే డిస్క్ అని అంటారు. వెన్నుపాము (స్పైనల్ కార్డ్) నుండి అసంఖ్యాకమైన నరాలు వెళుతుంటాయి. మెడ భాగం నుంచి వెళ్లే నరాలు కాళ్లలోకి వెళతాయి. వెన్నెముక మెడ, నడుం భాగాల్లోని డిస్కులే ఎక్కువగా దెబ్బతింటాయి. కాని ముఖ్యంగా మెడ దగ్గర రావడం వల్ల దీనిని సర్వైకల్ స్పాండిలోసిస్ అని పిలుస్తారు. కారణాలు: వెన్నెముకకు దెబ్బ తగలడం, అధిక బరువులు ఎత్తడం, గంటల తరబడి కూర్చొని పని చేయడం, సరైన డ్రైవింగ్ పద్ధతులు పాటించకుండా ఎక్కువగా డ్రైవింగ్ చేయడం, వయసు పెరిగే కొద్ది వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదలకు గురికావడం మరియు కొన్ని రకాల ‘ఆటోఇమ్యూన్ డిసీజెస్’ వల్ల కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి లక్షణాలు చూడవచ్చు: మెడనొప్పి, మెడ బిగుసుకుపోవడం, నొప్పి మెడ ప్రాంతంలో ప్రారంభమై భుజాల్లోకి, చేతుల వరకు వ్యాపించడం, తిమ్మిర్లు, చేతి కండరాలు బలహీనపడటం, భుజాలు, చేతివేళ్లలో స్పర్శ తగ్గిపోవడం, తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్ధారణ: ఎక్స్‌రే సర్వైకల్ స్ప్రెయిన్, ఎమ్.ఆర్.ఐ., సి.బి.పి., ఇ.ఎస్.ఆర్ వంటి పరీక్షల ద్వారా నిర్థారించడం జరుగుతుంది. హోమియో ఇంటర్నేషనల్ చికిత్స: హోమియో ఇంటర్నేషనల్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్య పద్ధతి ద్వారా మెడనొప్పి తగ్గించవచ్చు. అంతేకాదు, వెన్నుపూసలను దృఢంగా చేయడం ద్వారా మెడనొప్పి సమస్యలు తిరగబెట్టకుండా స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 44 ఏళ్లు. రెండు నెలల క్రితం కుడికాలి బొటనవేలు వాచి, తీవ్రమైన నొప్పి వచ్చింది. దానికి గాయం అయినట్లుగా నాకేమీ అనిపించలేదు. ఆ నొప్పి సాయంత్రానికి పెరిగి, కాస్త జ్వరం కూడా వచ్చింది. అప్పుడు నేను మాకు దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను కలిస్తే, పెయిన్‌కిల్లర్ కూడా ఇచ్చారు. ఐదారు రోజుల్లో సమస్య దానంతట అదే సద్దుమణిగింది. ఒక వారం క్రితం వరకూ అంతా బాగానే ఉంది. కానీ మళ్లీ కుడి బొటనవేలిలో మునుపటిలాగే నొప్పి వస్తోంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - కరుణాకర్, కర్నూలు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి అది ‘గౌట్’ అనే వ్యాధిలా అనిపిస్తోంది. గౌట్ ఉన్నవారిలో రక్తంలో యూరిక్ యాసిడ్ పాళ్లు పెరుగుతాయి. ఈ యూరిక్ యాసిడ్ పేరుకుపోయి కీళ్ల వద్ద రాళ్లలా (క్రిస్టల్స్‌లా) మారుతుంది. ప్రధానంగా కాలి బొటనవేలు, పాదాలలోని ఎముకలు, చీలమండ ఎముకల మధ్య ఇది చేరుతుంది. దాంతో కీళ్ల కదలికల సమయంలో ఎముకలు ఈ రాళ్లతో రాపిడి చెందడం వల్ల అక్కడి కీలు వాచి, నొప్పి కూడా వస్తుంది. సాధారణంగా కొన్నాళ్లలో దానంతట అదే తగ్గిపోతుంటుంది. కానీ రక్తంలో మళ్లీ యూరిక్ యాసిడ్ పాళ్లు పెరిగినప్పుడు నొప్పి, వాపు మళ్లీ తిరగబెడతాయి. వేటమాంసం, నిమ్మజాతికి సంబంధించిన పండ్లు (నిమ్మ, నారింజ వంటివి) తిన్నప్పుడు, ఆల్కహాల్ తీసుకునేవారిలో కీళ్లలో యూరిక్ యాసిడ్ రాళ్లు పెరిగే అవకాశాలు ఎక్కువ. అప్పుడు సమస్య మళ్లీ మళ్లీ వస్తుంటుంది. ఇలాంటివారు ఆహారంలో వేటమాంసం (రెడ్‌మీట్), నిమ్మజాతిపండ్లను తినకూడదు. ఆల్కహాల్ అలవాటు ఉంటే మానేయాలి. ఈ వాపు, నొప్పి తగ్గిన తర్వాత తగినంత వ్యాయామం చేయాలి. బరువు తగ్గాలి. పైన పేర్కొన్న జాగ్రత్తలన్నీ యూరిక్ యాసిడ్ రాళ్ల నివారణకు తోడ్పడతాయి. దాంతో గౌట్ కూడా నివారితమవుతుంది. అవసరాన్ని బట్టి మీకు రక్తంలోని యూరిక్ యాసిడ్ పాళ్లను తగ్గించడానికి కొన్ని మందులు కూడా వాడాల్సి రావచ్చు. కాబట్టి ఒకసారి మీ యూరిక్ యాసిడ్ పరీక్ష చేయించి, మీరు ఒకసారి మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించండి. పల్మనాలజీ కౌన్సెలింగ్ మా పాప వయసు ఐదేళ్లు. తరచూ జలుబు చేస్తుంటుంది. మందులు వాడితే తగ్గుతుంది. కానీ ఇంచుమించు నెలకొకటి రెండుసార్లు జలుబు బారిన పడి, చాలా బాధపడుతోంది. మాకు భయంగా ఉంటోంది. భవిష్యత్తులో ఆస్తమా వస్తుందా? లంగ్స్ పని తీరు మీద ఏదైనా ప్రభావం ఉంటుందా? దయచేసి తెలియజేయండి. - వసుధ, నల్గొండ చిన్నపిల్లల్లో జలుబు సాధారణమే. కానీ, అలర్జీ వల్ల వచ్చే జలుబు సాధారణం కాదు. దీనిని నిర్లక్ష్యం చేస్తే అది ఆస్తమాకు దారితీయవచ్చు. అందుకే ప్రాథమిక దశలోనే లక్షణాలకు కాకుండా, వ్యాధికి చికిత్స అందిస్తే అలర్జీ... ఆస్తమాకి మారే అవకాశం ఉండదు. సాధారణంగా జలుబు 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ అలర్జీ వల్ల వచ్చే జలుబు పదిరోజులైనా తగ్గదు. ఇది గుర్తుంచుకోండి. ముక్కు నుంచి పసుపు లేదా ఆకుపచ్చ స్రావం కారుతుంటే ఇన్ఫెక్షన్ వల్ల అది వచ్చినట్లు భావించాలి. అలాకాకుండా తెల్లగా వస్తుంటే అది అలర్జీ వల్ల వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. అలర్జీ వల్ల తుమ్ములు, పొడిదగ్గు, గొంతునొప్పి సైతం ఉంటాయి. మీరు చెప్పిన అంశాలను బట్టి మీ పాపవి అలర్జీ లక్షణాలే అనిపిస్తున్నాయి. దీనితో పాటు కళ్ల నుంచి నీరు, ముక్కు మూసుకుపోయినట్లుంటే అది అలర్జిక్ రైనైటిస్ తాలూకు లక్షణంగా పరిగణించాలి. మీలాగే చాలామంది జలుబు చేయగానే పిల్లలను డాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు ఇప్పిస్తారు. దాని వల్ల జలుబు తాత్కాలికంగా తగ్గిపోతుంది. కానీ తరచూ జలుబు చేస్తుంటే అది ‘అలర్జిక్ రైనైటిస్’ అని అర్థం చేసుకోవాలి. లక్షణాలకు మాత్రమే చికిత్స తీసుకుంటూ పోతే లోపల వ్యాధి పెరిగిపోతుంది. అలా కాకుండా వ్యాధికి చికిత్స తీసుకుంటే అది పూర్తిగా తగ్గిపోతుంది. మీరు ఆలస్యం చేయవద్దు. అలా చేస్తే అది ఆస్తమాకు దారితీస్తుంది. ఇలాంటి సమయల్లో డాక్టర్ పర్యవేక్షణ లేకుండానే చాలామంది విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటం, నిబ్యులైజర్ పెట్టించడం చేస్తున్నారు. మీరు మీ పాపను వెంటనే మీకు దగ్గర్లోని డాక్టర్‌కు చూపించండి. -
రాజకపోతాసనం
కపోతం అంటే పావురం. ఈ ఆసనం వేసినప్పుడు దేహాకృతి... ఠీవిగా నిలుచున్న కపోతాన్ని తలపిస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని రాజకపోతాసనం అంటారు. ఎలా చేయాలి? వజ్రాసనంలో (ఒకటవ ఫొటోలో ఉన్నట్లు) వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవాలి. కుడికాలిని పూర్తిగా వెనుకకు చాపాలి. ఈ స్థితిలో కాలు పూర్తిగా నేలకు తాకుతుండాలి. ఇప్పుడు రెండు చేతులను పైకి లేపి మోచేతుల దగ్గర వంచి తల వెనుకకు తీసుకోవాలి. ఈ స్థితిలో తలను వీలయినంత వెనక్కి వంచాలి. ఇదే సమయంలో కుడి మోకాలిని వంచి అరికాలిని తల నుదురుభాగానికి తాకించాలి. తలమీద ఉన్న కుడిపాదాన్ని రెండు చేతులతో పట్టుకోవాలి. ఈ స్థితిలో చూపు ఆకాశం వైపు ఉండాలి. ఛాతీ భాగం ముందుకి నెట్టినట్లు ఉండాలి. ఆసనం స్థితిలోకి వెళ్లిన తర్వాత శ్వాస సాధారణంగా ఉండాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత యథాస్థితికి రావాలి. ఇదే క్రమాన్ని ఎడమకాలితో కూడా కొనసాగించాలి. ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదుసార్లు సాధన చేయాలి. ఉపయోగాలు ఇవి ! మోకాళ్లు, భుజాలు, మోచేతులు, తొడలు, శక్తిమంతం అవుతాయి. థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది. గొంతు సంబంధ వ్యాధులు నయమవుతాయి. స్వరంలో స్పష్టత వస్తుంది. ఛాతీ విశాలమవుతుంది. శ్వాససంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. అజీర్తి, మలబద్దకం తొలగిపోతాయి. రుతుక్రమ సమస్యలతోపాటు ఇతర గర్భకోశ సమస్యలు కూడా నివారణ అవుతాయి. వెన్నునొప్పి పోతుంది. శరీరం మొత్తం దృఢతరమవుతుంది. జాగ్రత్తలు! స్పాండిలోసిస్, హైబీపీ ఉన్నవాళ్లు చేయకూడదు. మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్నప్పుడు, భుజాల నొప్పులు, మైగ్రేన్ (పార్శ్వపు తలనొప్పి), మెదడుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నప్పుడు చేయరాదు. బీరెల్లి చంద్రారెడ్డి యోగా గురువు సప్తరుషి యోగవిద్యాకేంద్రం, హైదరాబాద్ ఫొటోలు: శివ మల్లాల -
సర్వైకల్ స్పాండిలోసిస్
సర్వైకల్ స్పాండిలోసిస్ సాధారణంగా మెడకు సంబంధించి లక్షణాలు కనిపిస్తాయి. అయితే మెడ వెన్నుపూసలో మార్పులు రావటం వలన వివిధ రకాల లక్షణాలు కనిపిస్తాయి. సర్వైకల్ స్పాండిలోసిస్ పురుషులలో తొందరగా, ఎక్కువగా వస్తుంది. వయసు మీరిన కొద్దీ వృద్ధులలో 90 శాతం పైన వెన్నుపూసలలో మార్పులు చూస్తాము. దీని గురించి 1992లో జరిగిన కొన్ని పరిశోధనల ప్రకారం... 40 సంవత్సరాలు దాటిన పురుషులలో ఈ వెన్నుపూసకు సంబంధించిన మార్పులు సర్వసాధారణం. వెన్నుపూసలో మార్పుల వలన నరాల మీద ఒత్తిడి ఏర్పడి మెడనొప్పి, మెడ పట్టి వేయటం, తలనొప్పి, కళ్ళు తరగడం, భుజాలు, చేతులు నొప్పి, తిమ్మిర్లు చూస్తాము. మెడ ఆకృతి చూస్తే మెడలోని ఏడు వెన్నుపూసలు, కండరాలు, పైన రెండు లిగమెంట్స్ మెడ వెన్నుపూస... మెడ అటు ఇటు తిరగటానికి, మిగిలినవి పటుత్వానికి ఉపయోగపడతాయి. వెన్నుపూసల మధ్యగా వెళ్లే వెన్నుపాము మన శరీరంలో జరిగే సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. మెడకు దెబ్బ తగలడం వలన, వెన్నుపూసలో మార్పుల వలన నరం మీద ఒత్తిడి పెరిగి సమాచారం చేరడంలో లోపం వలన తలతిరగడం, తిమ్మిర్లు, నడకలో తేడా రావచ్చు. మెడనొప్పి ముఖ్యంగా 40 సం॥దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. నేటి నవీన యుగంలో ద్విచక్ర వాహనం ఎక్కువగా నడిపేవారిలో సైకిలు తొక్కేవారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులలో ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడు 20-30 సం॥వయస్సు వారిలో కూడా ఈ వ్యాధి చూస్తున్నాము. పెరిగిన నాగరికత, నవీన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో ఇది స్త్రీ, పురుషులలో ఇద్దరికీ వస్తుంది. పురుషులలో చిన్నవయస్సులో, స్త్రీలలో 40॥తర్వాత రావడం సాధారణం. కారణం ఎముకలు అరగడం, ఎముకలలోపల జిగురు పదార్థం (కార్టిలేజ్) తగ్గడం వలన ఎముకల బలం సాంద్రత తగ్గుతుంది. ఎముకలు అరుగుట వలన ఎగుడు, దిగుడు bone spurs తయారవుతాయి. దాంతో కండరాల నొప్పి, మెడ తిప్పడంలో ఇబ్బంది, చేతులు లాగడం, మెడనొప్పి వలన పైకి చూస్తే కళ్ళు తిరగడం, ఛాతి భాగంలో నొప్పి, సూదులు పొడిచినట్లుగా నొప్పి, మంటలు, నడకలో తూలినట్లు కావడం, కండరాల రిఫ్లెక్సెస్లో మార్పులు, మలమూత్ర విసర్జనపై అదుపు కోల్పోవడం. రోగ నిర్థారణ: 1. X-Ray, 2. MRI చేయకూడనివి పరుగెత్తడం ఎక్కువసేపు టీవీ చూడటం, అదేపనిగా కంప్యూటర్‌పై పనిచేయడం, స్టిచ్చింగ్, ఎంబ్రాయిడింగ్ చేయడం నిటారుగా కూర్చోవడం రోజూ చిన్న చిన్న మెడ ఎక్సర్సైజ్ వైద్యుని సలహాపై మాత్రమే చేయాలి. నివారణ మెడ వ్యాయామం, ఫిజియోథెరపి, ట్రాక్షన్, వేడి, చల్లటి ప్యాడ్స్ వాడటం ద్వారా స్పాండిలోసిస్ను తగ్గించవచ్చు. దీనితోపాటు సరైన కుర్చీ వాడటం, నిటారుగా కూర్చోవటం పెద్ద దిండు వాడకుండా, ఎప్పుడూ ఛ్ఛిటఠిజీఛ్చి ఞజీౌఠీ వాడటం మెడకు సపోర్టు ఇవ్వటం ఎక్కువసేపు అదేపనిగా కంప్యూటర్, మౌస్‌ను వాడకుండా ఉండటం మానసిక ఆందోళన, ఒత్తిడి తగ్గించుకోవటం. హోమియో చికిత్స హోమియోపతిలో సర్వైకల్ స్పాండిలోసిస్‌కు ఖచ్చితమైన చికిత్స ఉంది. ఇది ఓపికగా కొన్ని నెలలు వాడితే వెన్నుపూసలో జరిగే మార్పులను అదుపు చేస్తూ, కండరాలకు బలం చేకూర్చుతూ, దానివలన కలిగే అనర్థాలను నివారించవచ్చు. ఆపరేషన్ వరకు వెళ్ళకుండా నివారించవచ్చు. ముఖ్యంగా హోమియోపతిలో కల్కేరియా గ్రూపుకు చెందిన మందులు అయిన కల్కేరియా ఫాస్, కల్కేరియా ప్లోర్, కాల్మియా, బ్రెవొనియా, స్పెజిలియ, హైపరికం జెల్సిమియం, రుస్టక్స్, కోనియం సాంగనురియ, యాసిడ్‌ఫాస్ మంచి మందులు. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109