
జగన్ సమైక్య శంఖారావం యాత్ర
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర ఒకరోజు వాయిదా పడింది. ఈ నెల 17వ తేదీకి బదులు 18వ తేదీకి వాయిదాపడింది.
జగన్‌కు మెడనొప్పి కారణంగా సమైక్య శంఖారావం యాత్ర ఒక రోజు వాయిదా వేసినట్లు ఆ పార్టీ చిత్తూరు జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి చెప్పారు. 18 నుంచి జగన్ సమైక్య శంఖారావం యాత్ర తిరిగి ప్రారంభిస్తారని వైఎస్‌ఆర్ సీపీ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.