చేతిస్పర్శతో ఒంటి చికిత్సకు.. ఫిజియోథెరపిస్ట్ | physiotherapy will help to relief from body pains | Sakshi
Sakshi News home page

చేతిస్పర్శతో ఒంటి చికిత్సకు.. ఫిజియోథెరపిస్ట్

Published Tue, Sep 23 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM

చేతిస్పర్శతో ఒంటి చికిత్సకు.. ఫిజియోథెరపిస్ట్

చేతిస్పర్శతో ఒంటి చికిత్సకు.. ఫిజియోథెరపిస్ట్

ఆటలు ఆడుతున్నప్పుడు కాలు బెణుకుతుంది. నడుస్తున్నప్పుడు కింద పడితే కీళ్లు పట్టేస్తాయి. ఆ బాధ వర్ణనాతీతం. ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, మెడ నొప్పి, బ్యాక్ పెయిన్ వంటివి తరచుగా వేధిస్తుంటాయి.  చేతిస్పర్శతోనే ఇలాంటి బాధల నుంచి ఉపశమనం కలిగించే వైద్యుడు.. ఫిజియోథెరపిస్ట్. ఈ తరహా వైద్యంపై గతంలో ప్రజల్లో అంతగా అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఒళ్లు నొప్పుల నుంచి విముక్తి కోసం సంబంధిత వైద్యులను ఆశ్రయించేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఫిజియోథెరపిస్ట్‌లకు అవకాశాలు మెరుగవుతున్నాయి. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంటే ఉద్యోగాలకు, ఉపాధి అవకాశాలకు ఢోకా లేకపోవడం యువతను ఆకర్షిస్తోంది.
 
 నిపుణులకు అవకాశాలు పుష్కలం: ఫిజియోథెరపీ/ఫిజికల్ థెరపీ గతంలో కాళ్ల నొప్పులు, మెడ నొప్పులు వంటి వాటికే పరిమితం. వైద్య రంగంలో ప్రస్తుతం ఫిజియోథెరపిస్ట్‌ల పరిధి విస్తరించింది. దాదాపు అన్ని విభాగాల్లో వీరి సేవలు అవసరమవుతున్నాయి. ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, గైనకాలజీ, స్పోర్ట్స్ మెడిసిన్ వంటి వాటిలో వీరి భాగస్వామ్యం తప్పనిసరిగా మారింది. ఈ వైద్యులు ఉష్ణం, వ్యాక్స్, ఎలక్ట్రిసిటీ వంటివి ఉపయోగించి ఎక్సర్‌సైజ్‌లు, థెరపీల ద్వారా రోగులకు స్వస్థత చేకూర్చాల్సి ఉంటుంది. తగిన వ్యాయామాలను సూచించాలి. ఫిజియోథెరపిస్ట్‌లకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, రిహాబిలిటేషన్ సెంటర్లు, స్పెషల్ స్కూల్స్, ఫిట్‌నెస్ సెంటర్లు, స్పోర్ట్స్ అకాడమీలు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వేతర సంస్థల్లో కొలువులు ఉన్నాయి. తగిన అనుభవం, వనరులు అందుబాటులో ఉంటే సొంతంగా ఫిజియో థెరపీ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అనుకూలమైన పనివేళలు ఉండడం ఇందులోని సానుకూలాంశం.
 
 కావాల్సిన నైపుణ్యాలు: రోగులకు సేవ చేయాలన్న దృక్పథం ఫిజియోథెరపిస్ట్‌లకు ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. చికిత్స ఫలించేదాకా ఓపిక, సహనంతో పనిచేయగలగాలి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ రంగంలో ప్రారంభంలో తక్కువ వేతనాలున్నా అనుభవం పెరిగేకొద్దీ సంపాదన కూడా పెరుగుతుంది. ఎప్పటికప్పుడు పనితీరును తప్పనిసరిగా మెరుగుపర్చుకోవాలి.
 
 అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైన తర్వాత ఫిజియోథెరపీ/ఫిజికల్ థెరపీలో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులో చేరొచ్చు. తర్వాత పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సు కూడా పూర్తిచేస్తే కెరీర్ పరంగా మంచి అవకాశాలుంటాయి.
 
 వేతనాలు: ఫిజియోథెరపిస్ట్‌కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభంలో నెలకు రూ.25 వేల వేతనం అందుతుంది. చీఫ్ ఫిజియోథెరపిస్ట్ స్థాయికి చేరుకుంటే నెలకు రూ.75 వేలు పొందొచ్చు. ప్రైవేట్ రంగంలో ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వేతనం లభిస్తుంది. అనుభవాన్ని బట్టి వేతనంలో పెరుగుదల ఉంటుంది. సొంతంగా ఫిజియోథెరపీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటే పనితీరును బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు.
 
 కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
     ఉస్మానియా మెడికల్ కాలేజీ-హైదరాబాద్
 వెబ్‌సైట్: www.osmaniamedicalcollege.com
     నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్)
 వెబ్‌సైట్: www.nims.edu.in
     అపోలో కాలేజీ ఆఫ్ ఫిజియోథెరపీ-హైదరాబాద్
 వెబ్‌సైట్: www.apollocollegedurg.com
     డెక్కన్ కాలేజీ ఆఫ్ మెడికల్ సెన్సైస్
 వెబ్‌సైట్: http://deccancollegeofmedicalsciences.com
     పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండీకాప్డ్-న్యూఢిల్లీ
 వెబ్‌సైట్: www.iphnewdelhi.in
     పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
 వెబ్‌సైట్: http://pgimer.edu.in/
 
 కాంపిటీటివ్ కౌన్సెలింగ్
 కానిస్టేబుల్ పరీక్షలో లోహశాస్త్రం పాఠ్యాంశం ప్రాధాన్యతను తెలపండి? ఏయే అంశాలపై ప్రశ్నలు అడుగుతారు?    
     - వి. కిరణ్ కుమార్, సికింద్రాబాద్
 లోహశాస్త్రం అత్యంత ప్రాచీనమైంది. రుగ్వేదంలోనే దీని ప్రస్తావన ఉంది. ఢిల్లీలోని ఐరన్‌పిల్లర్ నేటికీ చెక్కు చెదరకుండా ఉండటం మన పూర్వీకుల లోహశాస్త్ర పనితీరుకు నిదర్శనం. బంగారం, ప్లాటినం తప్ప మిగిలిన లోహాలన్నీ ప్రకృతిలో సంయోగ స్థితిలోనే లభిస్తున్నాయి. అవి సల్ఫైడులు, ఆక్సైడులు, క్లోరైడులు, కార్బొనేటుల వంటి సమ్మేళన రూపాల్లో లభిస్తున్నాయి. వాటి నుంచి పరిశుద్ధ లోహం నిష్కర్షణ చేయడంలో అనేక దశలుంటాయి. దీనికి సంబంధించి వివిధ రూపాల్లో ప్రశ్నలడగవచ్చు. లోహాలకు సంబంధించిన ఖనిజాలపై కూడా ప్రశ్నలు అడుగుతారు.
 
 ఉదా: అల్యూమినియం ధాతువేది?
 జవాబు. బాక్సైట్.
 వివిధ దశల్లోని భర్జనం, భస్మీకరణం, ప్లవన క్రియ వంటి వాటిపై ప్రశ్నలు రావచ్చు. ఇక లోహక్షయాన్ని నిరోధించే గాల్వనైజేషన్ వంటి ప్రక్రియలపై ప్రశ్నలడగవచ్చు. 2013లో ఈ అంశంపైనే ప్రశ్న అడిగారు. సాధారణంగా జింక్, టిన్ వంటి లోహాల పూతలు పూస్తారు. జింక్ చర్యాశీలత ఎక్కువ కాబట్టి కొన్నిసార్లు జింక్ కంటే టిన్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ఇక మరొక ముఖ్యమైన అంశం లోహాల ఉపయోగాలు, మిశ్రమలోహాల సంఘటనం, వాటి ఉపయోగాలు. 2012 పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో స్టెయిన్‌లెస్ స్టీల్ సంఘటనంపై ప్రశ్న వచ్చింది. ఈ చాప్టర్ కోసం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పాత టెక్ట్స్‌బుక్ ఉపయుక్తంగా ఉంటుంది.
 ఇన్‌పుట్స్: డాక్టర్ బి. రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ
 
 పోటీ పరీక్షల్లో ‘భారత రాజ్యాంగ పరిషత్’ పాఠ్యాంశం నుంచి ఏయే అంశాలపై ప్రశ్నలు అడుగుతారు? ఎలా చదవాలి?
 - ఎన్. భాస్కర్ రెడ్డి, నాచారం
 రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం, సభ్యుల ఎన్నిక, వివిధ కమిటీలు - అధ్యక్షులు తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు స్వాతంత్య్రోద్యమ చరిత్రను అధ్యయనం చేయాలి. రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, రాజేంద్రప్రసాద్, అంబేద్కర్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మొదలైన ప్రముఖులకు సంబంధించి ముఖ్యమైన అంశాలు తెలిసి ఉండాలి. మన రాజ్యాంగ నిర్మాణంపై ప్రభావం చూపిన ఇతర దేశ రాజ్యాంగాలు, వాటి నుంచి గ్రహించిన అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి.  
 
 రిఫరెన్‌‌స పుస్తకాలు:
 1. భారత రాజ్యాంగ అభివృద్ధి - ఎం.ఎ. తెలుగు అకాడమీ
 2. భారత రాజ్యాంగం - తెలుగు అకాడమీ
 3. భారత ప్రభుత్వం - రాజకీయాలు- తెలుగు అకాడమీ
 ఇన్‌పుట్స్: కె కాంతారెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ
 
 ఎడ్యూ న్యూస్: కెనడా స్టడీ పర్మిట్ దరఖాస్తులు 15 శాతం అధికం
 కెనడా.. నాణ్యమైన ఉన్నత విద్యనందిస్తూ భారత విద్యార్థిలోకం దృష్టిని  ఆకర్షిస్తున్న దేశం. కెనడాకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య  పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. న్యూఢిల్లీలోని కెనడియన్ హైకమిషన్‌కు విద్యార్థులు చేసుకున్న స్టడీ పర్మిట్ దరఖాస్తుల్లో గతంలో కంటే 15 శాతం పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది హైకమిషన్  14,000 స్టడీ పర్మిట్లను జారీ చేసింది. కెనడాకు వెళ్తున్న విద్యార్థులు ఎంచుకుంటున్న కోర్సుల విషయంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
 
 లిబరల్ ఆర్ట్స్, కమ్యూని కేషన్స్, జర్నలిజం, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, సైకాలజీ, ఇంటర్నేషనల్ స్టడీస్, మ్యూజిక్, ఫిల్మ్ అండ్ డిజైన్ కోర్సులను ఎక్కువగా అభ్యసిస్తున్నారు. గతంలో సెన్సైస్, ఇంజనీరింగ్, బిజినెస్ స్టడీస్‌లో ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లేవారు. రిక్రూటర్లు ప్రస్తుతం క్రిటికల్ థింకింగ్, రైటింగ్, కమ్యూనికేషన్ వంటి స్కిల్స్‌కు పెద్దపీట వేస్తుండ డంతో వాటిని నేర్పించే లిబరల్ ఆర్ట్స్ కోర్సుపై యువత ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కెనడాలో యూనివర్సిటీ డిగ్రీలు సరళంగా ఉంటాయి. అంతేకాకుండా అక్కడ చదువుకుంటూనే పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకోవచ్చు. ప్రతిభా వంతులైన విద్యార్థులకు స్టైపెండ్స్, స్కాలర్‌షిప్స్ లభిస్తాయి. అమెరికాతో పోలిస్తే కెనడాలో ట్యూషన్ ఫీజులు చాలా తక్కువ.
 
 సెప్టెంబర్ 25 నుంచి  సీమ్యాట్
 దేశవ్యాప్తంగా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో 2015-16 విద్యా సంవత్సరానికి పీజీడీఎం, ఎంబీఏ, పీజీసీఎం, ఎగ్జిక్యూటివ్ పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశానికి కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్)-2014 పరీక్షను సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. ఈ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో జరగనుంది. వివరాలకు
 వెబ్‌సైట్: www.aicte-cmat.in

జాబ్స్, అడ్మిషన్‌‌స అలర్‌‌ట్స
 ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్
 విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
     బీఎస్సీ(నర్సింగ్), కాలపరిమితి: నాలుగేళ్లు
     బీఎస్సీ(మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ)
     బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ
 కాలపరిమితి: మూడేళ్లు
 అర్హతలు: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ ఉత్తీర్ణత.
 ఎంపిక: ప్రవేశ పరీక్ష/అకడమిక్ మెరిట్ ఆధారంగా
 రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 23
 చివరి తేది: అక్టోబర్ 9
 వెబ్‌సైట్: http://ntruhs.ap.nic.in/
 సీఎస్‌ఐఆర్- సెంట్రల్ బిల్డింగ్
 రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
 సీఎస్‌ఐఆర్- సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
     సైంటిస్ట్  
  పోస్టుల సంఖ్య: 31
 విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
 అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంఈ/ ఎంటెక్ లేదా ఫిజిక్స్/కెమిస్ట్రీ/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో పీహెచ్‌డీ ఉండాలి.
 వయసు: 32 ఏళ్లకు మించకూడదు.
 ఎంపిక: రాత పరీక్ష , ఇంటర్వ్యూ ద్వారా
 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 20
 వెబ్‌సైట్: http://www.cbri.res.in/
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
     మేనేజర్ (ఫైనాన్స్): 1
 అర్హతలు: సీఏతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి.
     అకౌంటెంట్: 19
 అర్హతలు: మొదటి శ్రేణితో బీకాం లేదా రెండో శ్రేణితో ఎంకాం ఉత్తీర్ణులై ఉండాలి. మూడేళ్ల అనుభవంతో పాటు ట్యాలీ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం ఉండాలి.
     డేటా ఎంట్రీ ఆపరేటర్: 143
 అర్హతలు: 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
 దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 29
 వెబ్‌సైట్: http://nielitchd.in
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
 రూరల్ డెవలప్‌మెంట్
 హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్‌ఐఆర్‌డీ అండ్ పీఆర్) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది.
  పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్
 కాలపరిమితి: ఏడాది
 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్‌‌స డిగ్రీ ఉండాలి. చివరి సంవత్సరం  విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 ఎంపిక: జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా.
 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 25
 వెబ్‌సైట్: http://www.nird.org.in/

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement