play games
-
గేమింగ్ ప్రియులకు గూగుల్ అదిరిపోయే గుడ్‌న్యూస్..!
గేమింగ్ ప్రియులకు గూగుల్ అదిరపోయే శుభవార్త తెలిపింది. వచ్చే ఏడాది నుంచి ల్యాప్ టాప్, పీసీ, ట్యాబ్లెట్ వంటి పరికరాలలోని విండోస్ ప్లాట్‌ఫామ్ లో కూడా ఎటువంటి చింత లేకుండా గేమ్స్ ఆడేందుకు ప్రత్యేక ప్లాట్‌ఫామ్ తీసుకొని రానున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు విండోస్ ప్లాట్‌ఫామ్ మీద గేమ్స్ ఆడాలంటే వేర్వేరు పోర్టల్ నుంచి గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. మొబైల్ లోని గూగుల్ ప్లే స్టోర్ గేమ్స్ లాగా ఒకే దగ్గర కావు, దీంతో గేమింగ్ ప్రియులు కొంత అసౌకర్యానికి గురి అయ్యేవారు. గేమింగ్ లవర్స్ ఆసక్తిని గమనించిన గూగుల్ విండోస్ ప్లాట్‌ఫామ్ లో కూడా ప్లే స్టోర్ లాంటి ప్రత్యేక ప్లాట్‌ఫామ్ తీసుకొని రానున్నట్లు ప్రకటించింది. గేమ్ అవార్డ్స్ 2021 సందర్భంగా హోస్ట్ జియోఫ్ కీగ్లీ ప్రధాన క్రాస్ ప్లాట్‌ఫామ్ ప్రకటన చేశారు. గూగుల్ నిర్మించిన గూగుల్ ప్లే గేమ్స్ యాప్ విండోస్ ప్లాట్‌ఫారంపై కూడా లభ్యం కానుంది. దీంతో గేమింగ్ లవర్స్ తమ విండోస్ పీసీలో ఆండ్రాయిడ్ గేమ్స్ అడుకోవచ్చు. ఆండ్రాయిడ్, గూగుల్ ప్లేలోని గేమ్స్ గురుంచి గూగుల్ ప్రొడక్ట్ డైరెక్టర్ గ్రెగ్ హార్ట్రెల్ ది వెర్జ్ తో మాట్లాడుతూ.. గెమర్స్ మరిన్ని పరికరాల్లో గూగుల్ ప్లే గేమ్స్ పొందగలరు. వారు త్వరలో ఫోన్, టాబ్లెట్, క్రోమ్ బుక్, విండోస్ పీసీ మధ్య ఎటువంటి అంతరాయం లేకుండా గేమ్స్ ఎంజాయ్ చేయగలరు అని అన్నారు. లాంఛ్ తేదీ గురుంచి ఖచ్చితమైన వివరాలు మాత్రం వెల్లడించలేదు. (చదవండి: భారత్ ఎకానమీకి ఢోకాలేదు.. క్రెడిట్ సూసీ నివేదిక) -
నకిలీ సంఘాల దొంగాట..
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ క్రీడా సంఘాలు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటలాడిస్తామంటూ ఆశ చూపించే కేటుగాళ్లు.. ట్రస్టులను ఏర్పాటు చేసి అందినకాడికి దండుకుంటూ.. గుర్తింపు లేని ఆటలు ఆడిస్తూ ఆటను వ్యాపారంగా మారుస్తున్నారీ బడా బాబులు. జాతీయ స్థాయిలో తమ సంఘానికి ప్రత్యేక గుర్తింపు ఉందంటూ.. భారత క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ఒలింపిక్ సంఘం అనుమతి ఉందని నమ్మబలుకుతూ ఏటా లక్షలు గడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి నకిలీ సంఘాలపై చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర, జాతీయ క్రీడా సంఘాలు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి, ఖమ్మం: జిల్లాలోని నకిలీ క్రీడా సంఘాలు ఆటల పేరుతో అమాయక క్రీడాకారులను దోపిడీ చేస్తున్నాయి. జాతీయస్థాయిలో ఏర్పాటైన క్రీడా సంఘం తొలుత రాష్ట్రస్థాయిలో తమకు అనువైన క్రీడాంశానికి సంబంధించిన సీనియర్ క్రీడాకారులతో పరిచయం పెంచుకుని.. రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసి.. తర్వాత జిల్లాస్థాయిలో సంఘ ఏర్పాటుకు పూనుకుంటుంది. జిల్లాలో ఏర్పాటైన క్రీడా సంఘం బాధ్యులు.. పేరున్న జిల్లాస్థాయి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు మాయమాటలు చెప్పి పావులుగా వాడుకుంటున్నారు. అయితే తమ సంఘం ద్వారా అందించే సర్టిఫికెట్లు క్రీడాకారులకు పనికి రావని రాష్ట్ర, జాతీయ సంఘం బాధ్యులకు మాత్రం తెలుసు. జిల్లాస్థాయి బాధ్యులకు ఆ విషయం తెలియనీయకుండా గోప్యంగా ఉంచుతున్నారు. తీరా తెలిశాక వారితోపాటు మోసపోయిన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏటా జాతీయ, అంతర్జాతీయ టోర్నీలకు క్రీడాకారులను తీసుకెళ్తున్నామని.. తామే ఖర్చులు భరించి.. తమ సంస్థ ద్వారా ఎంతో మందిని జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దామని మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో ప్రతిభ కలిగిన క్రీడాకారులతోపాటు అర్హత లేని వారిని భారత జట్టుకు ఎంపిక చేసి.. వారి నుంచి భారీ స్థాయిలో డబ్బులు గుంజుతున్నట్లు తెలుస్తోంది. అవగాహన లేని వారికే.. సంబంధిత క్రీడ పట్ల అవగాహన లేని వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తీసుకెళ్లి.. అక్కడ ఒకటో రెండో మ్యాచ్‌లు తూతూ మంత్రంగా ఆడించి తిరిగి ఇంటికి పంపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 29 క్రీడా సంఘాలకు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు ఉంది. ఇందులోని క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన వారున్నారంటే వేళ్లమీద లెక్కించొచ్చు. అదే నకిలీ క్రీడా సంఘాల ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వారి సంఖ్య కూడా జిల్లాలో గణనీయంగానే ఉంది. కొన్ని క్రీడా సంస్థలు క్రీడలపై అవగాహన లేని వారికి మాయమాటలు చెప్పి.. టోర్నీలో పాల్గొంటే మంచి భవిష్యత్ ఉంటుందని నమ్మబలుకుతున్నారు. ఇందులో సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఉండడం గమనార్హం. మీడియా కంట పడకుండా నకిలీ క్రీడా సంఘాల నిర్వాహకులు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులకు ఆశ చూపించి.. మోసం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా.. నకిలీ క్రీడా సంస్థలు ఢిల్లీ, హర్యాన, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. నకిలీ క్రీడా సంఘం ముసుగులో దోపిడీ జరుగుతుందనే దానికి జిల్లాలో జరిగిన పలు సంఘటనలే నిదర్శనం. పాఠశాల స్థాయిలో ఆడుతున్న ఓ క్రీడాకారుడు నకిలీ క్రికెట్ సంస్థ వలలో చిక్కుకున్నాడు. అతడిని శ్రీలంకకు తీసుకెళ్లి అక్కడ సరదాగా ఒక మ్యాచ్ ఆడించి.. నిర్వాహకులు తయారు చేసిన అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్‌ను సదరు క్రీడాకారుడికి ఇచ్చారు. అంతేకాక ఆ క్రీడాకారుడి వద్ద నుంచి రూ.లక్ష వరకు నిర్వాహకులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. కొందరు స్పాన్సర్ల వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా లండన్, నేపాల్‌కు పలువురు క్రికెటర్లను తీసుకెళ్లి ఇలాగే డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. నగరంలోని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన బాలుడిని నేపాల్ దేశంలో అంతర్జాతీయ కబడ్డీ పోటీలు ఉన్నాయని, ఇది అధికారిక సంఘం తరఫున జరుగుతుందని చెప్పి నమ్మించారు. దీంతో ఈ క్రీడాకారుడు తనతోపాటు మరో పది మంది క్రీడాకారులను ఈ వలలో చిక్కుకునేలా చేశాడు. ఇదంతా నమ్మిన వారి తల్లిదండ్రులు నిర్వాహకుల మాటలు నమ్మి వేలాది రూపాయలు చెల్లించగా.. తీరా వారిచ్చిన సర్టిఫికెట్ల నకిలీవని తేలడంతో నోరెళ్లబెట్టారు. నగరంలోని బూర్హన్పురానికి చెందిన చిరు వ్యాపారికి ఇద్దరు పిల్లలు. ఉన్నట్టుండి పరిచయమైన ఓ వ్యక్తి క్రీడారంగంలో అత్యున్నత అవకాశాలు ఉన్నాయని, తమ క్రీడా సంఘం ద్వారా ఆడిస్తే సర్టిఫికెట్లు రావడంతోపాటు పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయని నమ్మబలికాడు. ముందుగా రూ.25వేలు తీసుకుని పిల్లాడిని తమ వెంట తీసుకెళ్లారు. తర్వాత కొద్ది రోజులకే జాతీయస్థాయిలో మీ వాడు ప్రథమ స్థానంలో నిలిచాడని సమాచారం అందించారు. వెంటనే అంతర్జాతీయ పోటీలకు వెళ్లాలని చెప్పడంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. అయితే కొద్దిరోజుల తర్వాత తెలిసింది అవన్నీ ఉత్తుత్తి సర్టిఫికెట్లని, ఈ విషయంలో తాము మోసపోయామని లబోదిబోమన్నారు. ‘నకిలీ’పై అప్రమత్తంగా ఉండాలి.. జిల్లాలో కొన్ని నకిలీ క్రీడా సంఘాల పేరిట జాతీయ, అంతర్జాతీయస్థాయి టోర్నీలకు తీసుకెళ్తున్నామని నమ్మబలుకుతున్న వారి పట్ల క్రీడాకారులు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర, జిల్లా స్పోర్ట్స్ అథారిటీలకు అనుబంధంగా ఉన్న క్రీడా సంఘాలు నిర్వహించే టోర్నీల్లో మాత్రమే పాల్గొనాలి. ఎటువంటి గుర్తింపు లేని క్రీడా సంఘాల బాధ్యులు చెప్పే మాటలు నమ్మొద్దు. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో ఆడాలనుకునే వారు ముందుగా తమను సంప్రదిస్తే అన్ని విషయాలు తెలియపరుస్తాం. – ఎం.పరంధామరెడ్డి, డీవైఎస్ఓ, ఖమ్మం -
చేతిస్పర్శతో ఒంటి చికిత్సకు.. ఫిజియోథెరపిస్ట్
ఆటలు ఆడుతున్నప్పుడు కాలు బెణుకుతుంది. నడుస్తున్నప్పుడు కింద పడితే కీళ్లు పట్టేస్తాయి. ఆ బాధ వర్ణనాతీతం. ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, మెడ నొప్పి, బ్యాక్ పెయిన్ వంటివి తరచుగా వేధిస్తుంటాయి. చేతిస్పర్శతోనే ఇలాంటి బాధల నుంచి ఉపశమనం కలిగించే వైద్యుడు.. ఫిజియోథెరపిస్ట్. ఈ తరహా వైద్యంపై గతంలో ప్రజల్లో అంతగా అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఒళ్లు నొప్పుల నుంచి విముక్తి కోసం సంబంధిత వైద్యులను ఆశ్రయించేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఫిజియోథెరపిస్ట్‌లకు అవకాశాలు మెరుగవుతున్నాయి. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంటే ఉద్యోగాలకు, ఉపాధి అవకాశాలకు ఢోకా లేకపోవడం యువతను ఆకర్షిస్తోంది. నిపుణులకు అవకాశాలు పుష్కలం: ఫిజియోథెరపీ/ఫిజికల్ థెరపీ గతంలో కాళ్ల నొప్పులు, మెడ నొప్పులు వంటి వాటికే పరిమితం. వైద్య రంగంలో ప్రస్తుతం ఫిజియోథెరపిస్ట్‌ల పరిధి విస్తరించింది. దాదాపు అన్ని విభాగాల్లో వీరి సేవలు అవసరమవుతున్నాయి. ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, గైనకాలజీ, స్పోర్ట్స్ మెడిసిన్ వంటి వాటిలో వీరి భాగస్వామ్యం తప్పనిసరిగా మారింది. ఈ వైద్యులు ఉష్ణం, వ్యాక్స్, ఎలక్ట్రిసిటీ వంటివి ఉపయోగించి ఎక్సర్సైజ్లు, థెరపీల ద్వారా రోగులకు స్వస్థత చేకూర్చాల్సి ఉంటుంది. తగిన వ్యాయామాలను సూచించాలి. ఫిజియోథెరపిస్ట్‌లకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, రిహాబిలిటేషన్ సెంటర్లు, స్పెషల్ స్కూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, స్పోర్ట్స్ అకాడమీలు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వేతర సంస్థల్లో కొలువులు ఉన్నాయి. తగిన అనుభవం, వనరులు అందుబాటులో ఉంటే సొంతంగా ఫిజియో థెరపీ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అనుకూలమైన పనివేళలు ఉండడం ఇందులోని సానుకూలాంశం. కావాల్సిన నైపుణ్యాలు: రోగులకు సేవ చేయాలన్న దృక్పథం ఫిజియోథెరపిస్ట్‌లకు ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. చికిత్స ఫలించేదాకా ఓపిక, సహనంతో పనిచేయగలగాలి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ రంగంలో ప్రారంభంలో తక్కువ వేతనాలున్నా అనుభవం పెరిగేకొద్దీ సంపాదన కూడా పెరుగుతుంది. ఎప్పటికప్పుడు పనితీరును తప్పనిసరిగా మెరుగుపర్చుకోవాలి. అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైన తర్వాత ఫిజియోథెరపీ/ఫిజికల్ థెరపీలో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులో చేరొచ్చు. తర్వాత పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సు కూడా పూర్తిచేస్తే కెరీర్ పరంగా మంచి అవకాశాలుంటాయి. వేతనాలు: ఫిజియోథెరపిస్ట్‌కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభంలో నెలకు రూ.25 వేల వేతనం అందుతుంది. చీఫ్ ఫిజియోథెరపిస్ట్ స్థాయికి చేరుకుంటే నెలకు రూ.75 వేలు పొందొచ్చు. ప్రైవేట్ రంగంలో ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వేతనం లభిస్తుంది. అనుభవాన్ని బట్టి వేతనంలో పెరుగుదల ఉంటుంది. సొంతంగా ఫిజియోథెరపీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటే పనితీరును బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఉస్మానియా మెడికల్ కాలేజీ-హైదరాబాద్ వెబ్సైట్: www.osmaniamedicalcollege.com నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్) వెబ్సైట్: www.nims.edu.in అపోలో కాలేజీ ఆఫ్ ఫిజియోథెరపీ-హైదరాబాద్ వెబ్సైట్: www.apollocollegedurg.com డెక్కన్ కాలేజీ ఆఫ్ మెడికల్ సెన్సైస్ వెబ్సైట్: http://deccancollegeofmedicalsciences.com పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండీకాప్డ్-న్యూఢిల్లీ వెబ్సైట్: www.iphnewdelhi.in పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వెబ్సైట్: http://pgimer.edu.in/ కాంపిటీటివ్ కౌన్సెలింగ్ కానిస్టేబుల్ పరీక్షలో లోహశాస్త్రం పాఠ్యాంశం ప్రాధాన్యతను తెలపండి? ఏయే అంశాలపై ప్రశ్నలు అడుగుతారు? - వి. కిరణ్ కుమార్, సికింద్రాబాద్ లోహశాస్త్రం అత్యంత ప్రాచీనమైంది. రుగ్వేదంలోనే దీని ప్రస్తావన ఉంది. ఢిల్లీలోని ఐరన్‌పిల్లర్ నేటికీ చెక్కు చెదరకుండా ఉండటం మన పూర్వీకుల లోహశాస్త్ర పనితీరుకు నిదర్శనం. బంగారం, ప్లాటినం తప్ప మిగిలిన లోహాలన్నీ ప్రకృతిలో సంయోగ స్థితిలోనే లభిస్తున్నాయి. అవి సల్ఫైడులు, ఆక్సైడులు, క్లోరైడులు, కార్బొనేటుల వంటి సమ్మేళన రూపాల్లో లభిస్తున్నాయి. వాటి నుంచి పరిశుద్ధ లోహం నిష్కర్షణ చేయడంలో అనేక దశలుంటాయి. దీనికి సంబంధించి వివిధ రూపాల్లో ప్రశ్నలడగవచ్చు. లోహాలకు సంబంధించిన ఖనిజాలపై కూడా ప్రశ్నలు అడుగుతారు. ఉదా: అల్యూమినియం ధాతువేది? జవాబు. బాక్సైట్. వివిధ దశల్లోని భర్జనం, భస్మీకరణం, ప్లవన క్రియ వంటి వాటిపై ప్రశ్నలు రావచ్చు. ఇక లోహక్షయాన్ని నిరోధించే గాల్వనైజేషన్ వంటి ప్రక్రియలపై ప్రశ్నలడగవచ్చు. 2013లో ఈ అంశంపైనే ప్రశ్న అడిగారు. సాధారణంగా జింక్, టిన్ వంటి లోహాల పూతలు పూస్తారు. జింక్ చర్యాశీలత ఎక్కువ కాబట్టి కొన్నిసార్లు జింక్ కంటే టిన్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ఇక మరొక ముఖ్యమైన అంశం లోహాల ఉపయోగాలు, మిశ్రమలోహాల సంఘటనం, వాటి ఉపయోగాలు. 2012 పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో స్టెయిన్లెస్ స్టీల్ సంఘటనంపై ప్రశ్న వచ్చింది. ఈ చాప్టర్ కోసం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పాత టెక్ట్స్‌బుక్ ఉపయుక్తంగా ఉంటుంది. ఇన్పుట్స్: డాక్టర్ బి. రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ పోటీ పరీక్షల్లో ‘భారత రాజ్యాంగ పరిషత్’ పాఠ్యాంశం నుంచి ఏయే అంశాలపై ప్రశ్నలు అడుగుతారు? ఎలా చదవాలి? - ఎన్. భాస్కర్ రెడ్డి, నాచారం రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం, సభ్యుల ఎన్నిక, వివిధ కమిటీలు - అధ్యక్షులు తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు స్వాతంత్య్రోద్యమ చరిత్రను అధ్యయనం చేయాలి. రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, రాజేంద్రప్రసాద్, అంబేద్కర్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మొదలైన ప్రముఖులకు సంబంధించి ముఖ్యమైన అంశాలు తెలిసి ఉండాలి. మన రాజ్యాంగ నిర్మాణంపై ప్రభావం చూపిన ఇతర దేశ రాజ్యాంగాలు, వాటి నుంచి గ్రహించిన అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. రిఫరెన్స పుస్తకాలు: 1. భారత రాజ్యాంగ అభివృద్ధి - ఎం.ఎ. తెలుగు అకాడమీ 2. భారత రాజ్యాంగం - తెలుగు అకాడమీ 3. భారత ప్రభుత్వం - రాజకీయాలు- తెలుగు అకాడమీ ఇన్పుట్స్: కె కాంతారెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ ఎడ్యూ న్యూస్: కెనడా స్టడీ పర్మిట్ దరఖాస్తులు 15 శాతం అధికం కెనడా.. నాణ్యమైన ఉన్నత విద్యనందిస్తూ భారత విద్యార్థిలోకం దృష్టిని ఆకర్షిస్తున్న దేశం. కెనడాకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. న్యూఢిల్లీలోని కెనడియన్ హైకమిషన్‌కు విద్యార్థులు చేసుకున్న స్టడీ పర్మిట్ దరఖాస్తుల్లో గతంలో కంటే 15 శాతం పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది హైకమిషన్ 14,000 స్టడీ పర్మిట్లను జారీ చేసింది. కెనడాకు వెళ్తున్న విద్యార్థులు ఎంచుకుంటున్న కోర్సుల విషయంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. లిబరల్ ఆర్ట్స్, కమ్యూని కేషన్స్, జర్నలిజం, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, సైకాలజీ, ఇంటర్నేషనల్ స్టడీస్, మ్యూజిక్, ఫిల్మ్ అండ్ డిజైన్ కోర్సులను ఎక్కువగా అభ్యసిస్తున్నారు. గతంలో సెన్సైస్, ఇంజనీరింగ్, బిజినెస్ స్టడీస్‌లో ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లేవారు. రిక్రూటర్లు ప్రస్తుతం క్రిటికల్ థింకింగ్, రైటింగ్, కమ్యూనికేషన్ వంటి స్కిల్స్‌కు పెద్దపీట వేస్తుండ డంతో వాటిని నేర్పించే లిబరల్ ఆర్ట్స్ కోర్సుపై యువత ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కెనడాలో యూనివర్సిటీ డిగ్రీలు సరళంగా ఉంటాయి. అంతేకాకుండా అక్కడ చదువుకుంటూనే పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకోవచ్చు. ప్రతిభా వంతులైన విద్యార్థులకు స్టైపెండ్స్, స్కాలర్షిప్స్ లభిస్తాయి. అమెరికాతో పోలిస్తే కెనడాలో ట్యూషన్ ఫీజులు చాలా తక్కువ. సెప్టెంబర్ 25 నుంచి సీమ్యాట్ దేశవ్యాప్తంగా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో 2015-16 విద్యా సంవత్సరానికి పీజీడీఎం, ఎంబీఏ, పీజీసీఎం, ఎగ్జిక్యూటివ్ పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశానికి కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్)-2014 పరీక్షను సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. ఈ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో జరగనుంది. వివరాలకు వెబ్సైట్: www.aicte-cmat.in జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీఎస్సీ(నర్సింగ్), కాలపరిమితి: నాలుగేళ్లు బీఎస్సీ(మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ) బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కాలపరిమితి: మూడేళ్లు అర్హతలు: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ ఉత్తీర్ణత. ఎంపిక: ప్రవేశ పరీక్ష/అకడమిక్ మెరిట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 23 చివరి తేది: అక్టోబర్ 9 వెబ్సైట్: http://ntruhs.ap.nic.in/ సీఎస్ఐఆర్- సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఎస్ఐఆర్- సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. సైంటిస్ట్ పోస్టుల సంఖ్య: 31 విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంఈ/ ఎంటెక్ లేదా ఫిజిక్స్/కెమిస్ట్రీ/ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్లో పీహెచ్డీ ఉండాలి. వయసు: 32 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష , ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 20 వెబ్సైట్: http://www.cbri.res.in/ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మేనేజర్ (ఫైనాన్స్): 1 అర్హతలు: సీఏతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. అకౌంటెంట్: 19 అర్హతలు: మొదటి శ్రేణితో బీకాం లేదా రెండో శ్రేణితో ఎంకాం ఉత్తీర్ణులై ఉండాలి. మూడేళ్ల అనుభవంతో పాటు ట్యాలీ సాఫ్ట్వేర్ పరిజ్ఞానం ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్: 143 అర్హతలు: 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 29 వెబ్సైట్: http://nielitchd.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కాలపరిమితి: ఏడాది అర్హతలు: ఏదైనా బ్యాచిలర్‌స డిగ్రీ ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక: జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 25 వెబ్సైట్: http://www.nird.org.in/ -
వివేకం: ఆడు! ఆటలాడు!!
శరీరారోగ్యానికి ముఖ్యమైనవి ఆటలు. స్కూల్లో చదువుకునే రోజుల్లో, నేను ఆడని ఆట లేదనే చెప్పాలి. తాడు పట్టుకుని పైకి పాకడం, శరీరాన్ని వంపులు తిప్పుతూ చేసే విన్యాసం, బాక్సింగ్, కబడ్డీ, బ్యాడ్మింటన్ దేన్నీ వదిలిపెట్టలేదు. నా చిన్నవయసులో ఎవరు క్రికెట్ ఆడుతున్నా వెళ్లేవాణ్ని. బ్యాటింగ్ లభించేది కాదు, ఫీల్డింగ్ దొరికేది. దాంతోనే ఎంతో సంతోషం. ఈ రోజుల్లో కూడా పిల్లలెవరైనా ఆటలాడుతుంటే, నాకు నేనే వెళ్లి వారి ఆటల్లో పాల్గొంటాను. కాలేజీలో చేరిన తర్వాత హాకీ జట్టులో చోటు దొరికింది. ఆ వయసులో మిగతా ఆటల్లో కన్నా, మోటర్‌బైక్ నడపడంలో, ఆకాశంలో ఎగరడంలో ఉత్సాహం ఉండేది. కొన్ని నిమిషాల పాటు గాలిలో ఎగరాలంటే, ఎన్నో గంటలు శిక్షణ అవసరమయ్యేది. నాకప్పుడు ఇరవై రెండేళ్ల వయసు. ఒకసారి, నీలగిరి కొండల మీద గ్లైడర్‌తో ఎగిరాను. ఎక్కడో, చాలా దూరాన దిగాను. సూర్యుణ్ని చూసి దిశను నిర్ణయించుకుని నడవడం మొదలుపెట్టాను. నడుస్తూ ఉన్నాను. రాత్రి, పగలు చూడకుండా నడుస్తూనే ఉన్నా. వెంట తెచ్చుకున్న ఒకే ఒక శాండ్విచ్ తినేశాను. ఆకలి తీరలేదు. అక్కడక్కడా ఒకటి రెండు గ్రామాలు కనిపించాయి. అక్కడి ప్రజలకు తమిళం తప్పించి మరో భాష తెలియదు. అప్పుడు నాకు తమిళం మాట్లాడ్డం రాదు. ఎలాగో, ఒక టీ కొట్టు కనిపించింది. వేడి వేడి ఇడ్లీలు కనిపించాయి. నా ఆకలికి పాతిక ఇడ్లీలు లాగించేద్దాం అనిపించింది. పర్సు చూసుకున్నాను.ఇలా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అంత డబ్బూ ఖర్చు చేయలేక, రూపాయిన్నర ఖర్చుతో, రెండే రెండు ఇడ్లీలు తిని సరిపెట్టుకున్నాను. నా జట్టు మనుషులు, రెండున్నర రోజుల తర్వాత నన్ను కలిశారు. ఇంత జరిగినా, నాలో ఎగరాలనే ఆశ కొంచెం కూడా తగ్గలేదు. కరకు హృదయాలతో కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను కూడా ఆటలు సహజమైన స్థితికి తీసుకురావడం కళ్లారా చూశాను. మొదటిసారి ఖైదీలను కలవడానికి పర్మిషన్ దొరికింది. చెరసాలలో అడుగిడగానే అక్కడి వాతావరణంలో తీరని శోకం ఉన్నట్లు తోచింది. దాదాపు 200 మందిని ఆటలాడుకునే మైదానానికి రమ్మని ఆహ్వానించాను. ‘‘పాఠాలు వినడానికి మిమ్మల్ని పిలవడం లేదు. మీతో బంతాట ఆడుకోవడానికే పిలిచాను’’ అన్నాను. వారి మొహాల్లో కొద్దిగా మార్పు గోచరించింది. ఆట ప్రారంభమైంది. మొదట తటపటాయించినా, పది పదిహేను నిమిషాల్లో వారు తమను తాము మర్చిపోయారు. పూర్తిగా ఆటలో లీనమైపోయారు. అరుస్తూ, ఒకరినొకరు తగులుకుంటూ, తోసుకుంటూ చిన్నపిల్లల్లా ఆటలో మునిగిపోయారు. ఆట ముగిసిన తర్వాత, నేను బయల్దేరే సమయంలో ‘వెళ్లకండి’ అంటూ, కొందరు నా చేతులు పట్టుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఆట మహాత్మ్యం అది. - జగ్గీ వాసుదేవ్ సమస్య - పరిష్కారం వృత్తిపరంగా నేను మరీ మంచిగా ఉంటే పనులు జరగడం లేదు. అందువల్ల కోపం నాకు మంచి మార్గమా? - ఎస్.గోపాల్, హైదరాబాద్ సద్గురు: మీరు ప్రపంచంలో చేసేవి వృత్తిలాగా చేయడం కన్నా ఔత్సాహికునిలా చేయడం, అంటే చేయడంలోని ఆనందం తెలియడం వల్ల చేసేవానిగా చేయడం మంచిది. ఔత్సాహికునిగా చేసేవాడు, చేయడంలోని అంతరార్థం తెలిసినవాడు. వృత్తిపరంగా చేసేవాడికి దాని విలువ తెలియదు. అతను అది చేయడానికి కారణం, ఆ చేయడం వల్ల అతనికేదో లాభం ఉంది కాబట్టే. అటువంటి జీవితం చాలా రసహీనమైంది. మీలో నిమగ్నత ఉంటే మీద్వారా సహజంగానే కొన్ని పనులు జరుగుతాయి. అది ఎంతో మనోహరంగా ఉంటుంది. నిమగ్నత లేకుండా చేసే పనులు వికృతంగా ఉంటాయి. అంటే మీరు వృత్తిలాగా చేస్తే, జీవితం వికారంగా ఉంటుంది. అదే ఔత్సాహికునిగా చేస్తే ఫరవాలేదు. అదే లాభాపేక్ష లేకుండా, స్వేచ్ఛగా చేస్తే, మీరు ఎంతో ఉత్సాహంగా చేయొచ్చు. అది మరింత అద్భుతం. మీరు వృత్తిపరంగా చేయడమే కాక, కోపం కూడా అదనపు చిక్కు. ఈ కోపం పాత్ర ఏమిటి? మీరు అలా చెబితే మనుషులు వినరు. వినాలంటే, దానికి నిమగ్నత కావాలి. మీరు ఎంతో నిమగ్నతతో, ఉత్సాహంతో చెబితే చుట్టూ ఉన్నవారందరూ స్పందిస్తారు. -
'విభజన విషయంలో కాంగ్రెస్ నాటకాలు'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతుందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి శనివారం హైదరాబాద్ ఆరోపించారు. తమ పార్టీ అగ్రనేత సుష్మాస్వరాజ్‌ను విస్మరించే నైతికత ఆ పార్టీకి ఎక్కడదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీయే లేదని, అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి ఎక్కడిదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక్కసారి కూడా పార్లమెంట్‌కు వెళ్లని నేతల సర్టిఫికెట్ తమకు అక్కరలేదని జి.కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలనుద్దేశించి ఎద్దేవా చేశారు.