Muscle aches
-
కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఇలా చేయండి!
రాత్రిపూట మంచి నిద్రలో ఉన్నప్పుడు హఠాత్తుగా మెలకువ వస్తుంది. ఏ బాత్ రూమ్‌కో వెళ్లాల్సి వచ్చి కాలు కింద పెడదామని చూస్తే అడుగు ముందుకు పడదు. పిక్కలు, కండరాలు పట్టేసినట్లుంటుంది. చాలామందికి ఇదొక బాధాకరమైన అనుభవం. అంతేనా.. మండుటెండలో చెమట పట్టేలా కష్టపడుతున్నప్పుడు ఉన్నట్లుండి తొడ కండరాలు పట్టేసి విపరీతమైన బాధతో కుంటుతూ నడవాల్సి వస్తుంతది. ఒక్కోసారి మంచి చలికాలంలో వేళ్లు కొంకర్లుపోయినట్లుగా అయి΄ోయి ఎంత ప్రయత్నించినా అవి అలాగే బిగుసుకు΄ోయి బాగా నొప్పితో పళ్ల బిగువున బాధను అణిచి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి అనుభవాల్లో ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది. దీనినే కండరాలు పట్టెయ్యడం లేదా మజిల్ క్రాంప్స్ అంటారు. దీనికి కారణాలు, నివారణోపాయాలను తెలుసుకుందాం.మనం శారీరక శ్రమ చేసినప్పుడు చెమటతో పాటు ఉప్పు రూపంలో సోడియమ్ ను కూడా చాలా వరకూ కోల్పోతాం. సోడియమ్ తగ్గడం వల్ల శరీరంలోని కండరాలు...ముఖ్యంగా పిక్క, తొడ, భుజం కండరాలు పట్టేసినట్లుగా నొప్పికి గురవుతాయి. అందుకే చాలామందికి ఎండాకాలంలో తరచూ ఈ సమస్య ఎదురవుతుంది. వేసవికాలంలో ఆటగాళ్లు చాలామంది ఈ సమస్యకు గురవుతుంటారు. ఇంకా కొందరిలో విరేచనాలు, వాంతులు ఎక్కువగా అయినప్పుడు కూడా సోడియమ్‌ను కోల్పోతారు. అలాంటివారిలో కూడా ఒళ్లు నొప్పులు రావడం, నీరసపడి΄ోవడం జరుగుతుంది.కారణాలు...మహిళల్లో చాలామంది కుటుంబ సభ్యులకు తినిపించడంలోనే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ, తాము తినడానికి రెండో ్రపాధాన్యత ఇస్తుండటం వల్ల వారికి తగిన క్యాల్షియం, ఇతరపోషకాలూ సరిగా అందక ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఇంకా... థైరాయిడ్..మన శరీరంలోని థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గడం వల్ల వచ్చే వ్యాధిని హై΄ోథైరాయిడిజమ్ అంటారు. హై΄ోథైరాయిడ్ ఉన్నవారికి మజిల్ క్రాంప్స్ ఎక్కువగా వస్తుంది. ఇది ఏ వయస్సు వారికైనా రావచ్చు. పిల్లల్లో ఈ సమస్య ఉంటే ఎక్కువ దూరం పరుగెత్తలేరు. మహిళలకైతే రాత్రి సమయంలో పిక్కలు నొప్పిపెడుతుంటాయి. మగవారు కూడా ఎక్కువ దూరం నడవలేరు.శరీరం ద్రవాలు కోల్పోవడం..సాధారణంగా శరీరంలోని నీటిని కోల్పోవడం వల్ల కండరాలు అకస్మాత్తుగా బిగుసుకు΄ోతాయి. వాంతులు, విరేచనాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఎండలో ఎక్కువగా తిరగడం, శారీరక శ్రమ వల్ల కూడా ఇలా కావచ్చు. ఇంకా మానసిక ఒత్తిడి, ఆందోళన, పని ఒత్తిడి, టైట్ షెడ్యూల్స్, తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు మజిల్ క్రాంప్ సమస్య అధికంగా ఉంటుంది.నివారణ..వేసవిలో వచ్చే మజిల్ క్రాంప్స్ నివారణకు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం నుండి ద్రవాలను కోల్పోకుండా చూసుకోవాలి.ఒకవేళ ఎక్కువగా ద్రవాలను కోల్పోయే పరిస్థితి ఉంటే నిమ్మకాయ రసంలో ఉప్పు కలుపుకుని తాగడం లేదా కొబ్బరినీళ్లు తాగడం... ఈ రెండూ అందుబాటులో లేక΄ోతే కనీసం కాసిని మంచి నీరు తాగడం. తాజాపండ్లు తినడం మంచిది.క్యాల్షియమ్ లోపం వల్ల మజిల్ క్రాంప్స్ వస్తుంటే క్యాల్షియమ్ సప్లిమెంట్స్‌ను తీసుకోవాలి. దానికి మనం తినే ఆహారంలో పాలు, పాల ఉత్పాదనలు, ఆకుకూరలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.చలి కారణంగా వచ్చే మజిల్ క్రాంప్స్‌ను నివారించడానికి ఉన్ని దుస్తులు ధరించాలి. చలికి ఎక్కవగా గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.పొగతాగడం, మద్యం అలవాట్లను పూర్తిగా మానేయాలి.ఒత్తిడి వల్ల కూడా మజిల్ క్రాంప్స్ వస్తాయి. కాబట్టి ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి ∙హై΄ోథైరాయిడిజమ్ వల్ల వచ్చే మజిల్ క్రాంప్స్‌ను తగ్గించడానికి తగిన చికిత్స తీసుకోవాలి.ఇవి చదవండి: ప్రతిరోజూ ఓ అరగంట నడిచారో.. ఈ సమస్యలిక దూరమే! -
Health: సౌండ్ బాత్.. ప్రయోజనాలెన్నో! ఒత్తిడి మాయం.. మూడ్స్ మారతాయి! కానీ..
తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆహ్లాదకరమైన సంగీతం విని, దాన్ని తగ్గించుకోవడం చాలామందికి అలవాటే. ఇందుకోసం కొందరు లలితమైన సంగీతం ఆలకిస్తుంటారు. మరికొందరు బీట్ బాగా ఉండే హుషారు, ఊపు పాటలను వింటారు. ఈ భిన్న ఆసక్తులు ఉన్నవారికి ఒకరి సంగీతం మరొకరికి అంత ఇంపుగా అనిపించదు. కేవలం ఇలా సంగీత మాధ్యమంలోనే కాకుండా... కొన్ని నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలలో వెలువడే శబ్దాలతో ఒత్తిడి తగ్గించే ప్రక్రియే సౌండ్‌బాత్. ఇది కూడా ఒక ధ్యానం (మెడిటేషన్) లాంటి లేదా యోగాలాంటి ఫలితాలనిచ్చే ప్రక్రియ. కొన్ని రకాల శబ్దాలు ఓ క్రమపద్ధతిలో ఒకేలాంటి ఫ్రీక్వెన్సీ స్థాయుల్లో మంద్రంగా వెలువడుతూ... మన దేహాన్ని కండరాల ఒత్తిడి ఉన్నప్పుడు వాటిని రిలాక్స్ చేసేలా, మానసిక ఒత్తిడి నుంచి విముక్తం చేసేందుకు ఉపకరించే ఈ ప్రక్రియ ఒక యోగాలాంటిదని క్లివ్లాండ్ క్లినిక్‌లోని మేరిమైంట్ మెడికల్ సెంటర్, బ్రాడ్‌వ్యూ హైట్‌కు చెందిన ఇంటర్నల్ మెడిసిన్ వైద్య సహాయకురాలు కరేన్‌బాండ్ చెప్పారు. ఇలా ఒత్తిడి మాయం దీనికి ఆమె భారతీయ యోగా ప్రక్రియలో ఉచ్చరించే ‘ఓమ్’ శబ్దాలు, చైనా సంప్రదాయ వైద్యం (ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్–టీఎమ్సీ)లో ఉచ్చరించే ‘చి’ లాంటి శబ్దాలను (చైనీస్ అక్షరమైన దీని స్పెల్లింగ్ ఇంగ్లిష్‌లో ‘క్యూఐ’ కాగా దీన్ని (సీహెచ్ఐ గా ఉచ్చరిస్తారు) ఉదాహరణలుగా చూపుతున్నారు. అవి శరీరంలోని శక్తిప్రవాహాన్ని ఏర్పరచడం, క్రమబద్ధ పద్ధతిలో ప్రవహింపజేయడం ద్వారా ఒత్తిడిని తొలగించేందుకు సహాయపడతాయని పేర్కొంటున్నారు. అధ్యయనాల ఫలితంగానే ఇదెలా జరుగుతుందనేది చెబుతూ ‘‘ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి తన జీర్ణవ్యవస్థ క్రమబద్ధంగా లేకపోవడాన్ని కంప్లెయింట్‌గా చెబితే... వారిలో ఆ ప్రాంతాన్ని నయం చేసేలా ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో శబ్దాలు వినిపించడం జరుగుతుంది’’ అని తెలిపారు. శబ్దాలతో కలిగే వైద్య ప్రయోజనాలపై 2014 నుంచి అనేక అధ్యయనాలు జరుగుతున్నాయనీ, ఈ తరహా శబ్దచికిత్సలు చవకైనవి మాత్రమే గాక... సురక్షితమైనవని ఆమె తెలిపారు. చిన్న చిన్న సమస్యల్లోనే కాకుండా దీర్ఘకాలిక వెన్నునొప్పులు, క్యాన్సర్‌తో బాధపడేవారిలో కలిగే నొప్పుల ఉపశమనానికి కూడా ఈ శబ్ద చికిత్సలు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఇవే కాకుండా ఈ తరహా పరిశీలనలు జరుగుతున్నప్పుడు నిదర్శనాలు, ఫలితాల ఆధారంగా వాస్తవాలు తెలుసుకునే పరిశోధన జరుగుతోందని వెల్లడించారు. అనేక నిదర్శనాలు, ఫలితాలను పరిశీలించినప్పుడు సౌండ్ బాత్ తర్వాత తమ క్లయింట్లను ప్రశ్నించినప్పుడు... కొందరు ఒత్తిడి తగ్గిందనీ, మరికొందరు తమ కండరాలు వదులుగా, రిలాక్స్డ్గా మారాయనీ, నొప్పి తగ్గిందనీ, నిద్ర బాగా పట్టిందని, మూడ్స్ మెరుగుపడ్డాయని, తమ శరీరంలో చోటు చేసుకుంటున్న మార్పులు తమకు బాగా తెలిసినట్లుగా అనుభూతి కలిగిందనీ వివరించినట్లు కరేన్ బాండ్ తెలిపారు. సౌండ్ బాత్ కోసం ఏయే పరికరాలు ఉపయోగిస్తారంటే...? ►జేగంటలు (గాంగ్) ►జలతరంగిణిలో ఉపయోగించేలాంటి గిన్నెలు ►టిబెటన్ పాటల్లో ఉపయోగించేలాంటి గిన్నెలు ►ట్యూనింగ్ ఫోర్క్‌లు ►ఫెంగ్ షుయీ పద్ధతుల్లో ఇంట్లో వేలాడదీసినప్పుడు ఆహ్లాదకరంగా మోగుతుండే స్తూపాకారపు అలంకరణ వస్తువులు (చిమ్స్) ►కొన్ని చిరుమువ్వలు ►ఆహ్లాదకరమైన శబ్దాలను వెలువరించే చిరు గంటలను సౌండ్ బాతింగ్ కోసం ఉపయోగిస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా.. దీని ఫలితాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. చాలా తక్కువమందిలోనే అయినా కొందరిలో సౌండ్‌బాత్ తర్వాత కొందరు కాస్త అలసట ఫీలవుతారు. దీనికి భిన్నంగా మరికొందరు బాగా శక్తిపుంజుకున్నట్లు అనుభూతి చెందుతారు. అందుకే సౌండ్బాతింగ్ ప్రక్రియకు ముందు మంచి ఆహారం, తగినన్ని నీళ్లతో పాటు కంటినిండా నిద్ర అవసరమని సూచించారు. మానసిక (సైకియాట్రిక్) సమస్యలతో బాధపడేవారు సౌండ్ బాత్కు ముందు తమ డాక్టర్‌ను సంప్రదించాలని చెబుతున్నారు. చదవండి: నోటి నుంచి దుర్వాసన వస్తోందా? నీటిలో తౌడు వేసి.. తెల్లారి పరగడుపున వీటిని కలిపి తాగితే.. -
Health Tips: పిక్కలు, తొడ కండరాల నొప్పి... మజ్జిగలో ఉప్పు వేసుకుని తాగితే
Tips To Get Relief From Muscle Pain In Telugu: చాలామందికి తరచూ పిక్కలు, తొడ కండరాలు, ఛాతీ మీది కండరాలు హఠాత్తుగా బిగుసుకుపోతుంటాయి. ఆ సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. ఈ సమస్యను ఇంగ్లిష్‌లో ‘మజిల్క్రాంప్స్’గా చెబుతారు. కంటినిండా నిద్ర లేకపోవడం, ఆహారంలో పోషకాలు తగ్గడం, దేహానికి అవసరమైనన్ని లవణాలు, ద్రవాలు తీసుకోకపోవడం, విపరీతమైన అలసట, కొన్ని మందులు వాడకం వంటి కారణాలతో మజిల్ క్రాంప్స్ రావచ్చు. రక్తంలో ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, ఫాస్ఫేట్) పరిమాణం తగ్గిపోవడం కూడా క్రాంప్స్‌కు కారణాలే. సాధారణంగా నిద్రలో, ఒక్కోసారి మెలకువగా ఉన్నప్పుడు, శారీరకంగా శ్రమ చేస్తున్నప్పుడు ఇలా జరగవచ్చు. ఇలా ఉపశమనం పొందవచ్చు! కొద్ది మోతాదులో ఉప్పు వేసుకుని మజ్జిగ తాగడం ఈ సమస్యకు తక్షణ పరిష్కారం. చక్కెర లేకుండా పండ్లరసాలు, ద్రవాహారాలు తీసుకోవడమూ మంచిదే. అన్ని పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి. కంటినిండా నిద్రతో ఈ సమస్యను నివారించవచ్చు. చదవండి: Pumpkin Seeds Health Benefits: గుమ్మడి గింజలు: ఎవరు తినకూడదు? ఎవరు తినవచ్చు! Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే.. -
Vajrasana Benefits: మానసిక ఒత్తిడి, వెన్నునొప్పి, ఎసిడిటీ నివారణకు.. యోగా మంత్రమిదే!
యోగా భారతీయుల శాస్త్రబద్ధమైన జీవన విధానానికి ప్రతీక. జ్ఞాన, ధ్యాన, చైతన్యాలకు ఇదొక జీవమార్గం. వేదకాలం నుంచే మన దేశంలో వెలుగుచూసిన ఈ ప్రాచీన ప్రక్రియ నేడు విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. యోగా వాసిష్ఠం, యోగ యజ్ఞవల్క, మహాభాష్యం, కుండలిని యోగ.. ఇలా మన పూర్వికులు రచించిన ఎన్నో గ్రంథాలు యోగా ప్రాశస్త్యాన్ని తెలియజేస్తున్నాయి. సూర్యనమస్కారం, పద్మాసనం, త్రికోణాసనం, ప్రాణాయామం.. ఇలా సులువుగా వేయదగిన ఆసనాలను రోజువారీ జీవనవిధానంలో కనీసం అరగంటైనా చేస్తే మానసిక, శారీరక ఆరోగ్యం మీ సొంతమౌతుంది.సులభంగా చేయదగిన ఆసనాల్లో వజ్రాసనం కూడా ఒకటి. తిమ్మిర్ల నివారణ నుండి జీవక్రియను పెంచడం వరకు వజ్రాసనం ఎన్నో సమస్యలకు అద్భుతమైన పరిష్కారమార్గం. ఈ ఆసనాన్ని ప్రతి రోజూ 15 నిముషాలపాటు చేస్తే చేకూరే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదండోయ్!! ►మనసిక ఒత్తిడి నుంచి విడుదల ►జీర్ణక్రియ వృద్ధి ►ఎసిడిటీ నివారణ ►బరువు తగ్గడం ►రుతుస్రావ, కండరాలు, మూత్ర సమస్యలకు చికిత్స ►వెన్నునొప్పిని తగ్గిస్తుంది.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్దలిస్టే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్య జీవనానికి మూలసూత్రమని చెప్పొచ్చు. ఐతే కొంతమంది 5 నిముషాలు కూడా వజ్రాసన భంగిమలో కూర్చోలేకపోతారు. కాళ్లు తిమ్మిర్లు లేదా బెణకడం వంటివి అందుకు కారణాలుగా చెబుతారు. మామూలే అని వీటిని కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇటువంటివి మన జీవనశైలి మనుగడకు ముందస్తు సంకేతాలుగా పనిచేస్తాయి. ప్రముఖ యోగా నిపుణులు గ్రాండ్ మాస్టర్ అక్షర్ మాటల్లో.. నేలపై కూర్చోలేకపోవడం ప్రస్తుత జీవనవిధానం వల్ల నేలపై కూర్చునే అలవాటే చాలా మందికి లేదు. తినడానికి, రాయడానికి, చదవడానికి... ప్రతిపనికీ కుర్చీ-టేబుల్ వాడేస్తున్నారు. ఇలాంటివారు నేలపై వజ్రాసనం వేయడం కష్టం. మన జీవనశైలి, అలవాట్ల కారణంగా, నడుము దిగువ భాగంలో ముఖ్యంగా మోకాలి కీళ్లలో బలం లేకపోవడంవల్ల కఠినమైన నేలమీద మోకాళ్లపై ఒత్తిడి పెంచే భంగిమలో కూర్చోలేకపోతున్నారు. కీళ్ల సమస్యలు మోకాళ్ల, కీళ్ల సమస్యలతో బాధపడేవారికి కూడా నేలపై వజ్రాసనం వేయడం సమస్యగానే ఉంటుంది.చీలమండలంలో బిగుతుకు పోయిన కండరాల కారణంగా కూడా దీర్ఘకాలం పాటు వజ్రాసన భంగిమలో ఉండకుండా మిమ్మల్ని నివారిస్తాయి" అని గ్రాండ్ మాస్టర్ అక్షర్ చెప్పారు. అధికబరువు ఉబకాయం (ఒబేసిటీ) సమస్యతో బాధపడే వారు కూడా మోకాళ్లపై వేసే ఈ ఆసనాన్ని వేయలేరు. ఇలాంటివారికి నేలపై కూర్చోవడమే పెద్దసవాలుగా ఉంటుంది. వంగని బిరుసైన కండరాలు కూడా కారణమే బిరుసైన కండరాలు కలిగిన వారిలో రక్తస్రసరణ సక్రమంగా ఉండదు. అందువల్లనే కేవలం కొన్ని సెకన్లపాటు కూడా వజ్రాసనంలో కూర్చోలేరు. స్తబ్ధమైన జీవనశైలి కారణంగా కండరాల సంకోచవ్యాకోచాలు జరగకపోవడంతో ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. దిగువ శరీరం మొద్దబారడంవల్ల, మోకాలు, చీలమండ కీళ్ల బలహీనత వల్ల, మీ ప్రస్తుత జీవనశైలి అలవాట్ల వల్ల కూడా కావచ్చు. ఎక్కువ సమయం వజ్రాసనంలో ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి ►కాళ్లను సాగదీయడం చేయాలి. కేవలం ఉదయం మాత్రమే కాకుండా సాయంత్ర సమయంలో కూడా తప్పనిసరిగా సాగదీస్తూ ఉండాలి. ►నడవడం, సైకిల్ తొక్కడం, మెట్లు ఎక్కడం.. వంటి ఎక్సర్‌సైజ్‌లతో మీ కాళ్లను దృఢంగా మలచుకోండి. ►ఒకేసారి ఎక్కువ టైం వజ్రాసనం వేయకండి. 30 సెకన్లతో ప్రారంభించి 4, 5 సార్లు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత కొంచెం కొంచెంగా టైం పెంచుకుంటూ అలవాటు చేసుకోవాలి. ►మీ మోకాళ్లు లేదా కాళ్ల కింద దిండును సపోర్టుగా ఉంచి కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. వీటిని తరచూ ప్రాక్టీస్ చేయడం ద్వారా వజ్రాసనం వేయడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా వేయగలుగుతారని యోగా ఎక్స్పర్ట్ గ్రాండ్ మాస్టర్ అక్షర్ సూచించారు. చదవండి: బీట్ రూట్, పెరుగు, పాలకూర, దానిమ్మగింజలు ప్రతిరోజూ తిన్నారంటే..! -
Body Aches: ఒళ్లు నొప్పులా? తక్కువగా అంచనా వేయకండి..
అనేక వ్యాధుల్లో అత్యంత సాధారణ ప్రాథమిక లక్షణం ఒళ్లునొప్పులు. ఓ వయసు దాటాక అప్పుడప్పుడూ ఒళ్లునొప్పులు కనిపిస్తుంటాయి. అయితే అవి మామూలుగానే వచ్చే ఒళ్లునొప్పులా లేక ఏదైనా వ్యాధి కారణంగానా అని రోగనిర్ధారణ చేయడం డాక్టర్‌కు ఎప్పుడూ సవాలే. ఎందుకంటే... అది జ్వరంగానీ, జలుబుగానీ లేదా ఏదైనా వైరల్, బ్యాక్టీరియల్, ఇతరత్రా ఇన్ఫెక్షన్లన్నింటిలోనూ చాలా కామన్‌గా కనిపిస్తుంటాయి కాబట్టే ఆ ఇబ్బంది. అలాగే మనం సాధారణంగా వాడే కొలెస్ట్రాల్ మందులు మొదలుకొని అత్యంత తీవ్రమైన వ్యాధి వల్ల కూడా కావచ్చు. మామూలుగానైతే ఒళ్లునొప్పులు గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. అలాగని నిర్లక్ష్యమూ తగదని చెబుతూ... ఏయే సందర్భాల్లో అప్రమత్తంగా ఉండాలో అవగాహన కల్పించే కథనమిది. కండరాల నొప్పుల్లో చాలా రకాలుంటాయి. కండరాల నొప్పుల్ని మయాల్జియా అని, కీళ్ళనొప్పుల్ని ఆర్థ్రాల్జియా అని, కీళ్ళలో వాపు ఉంటే ఆర్థ్రరైటిస్ అని, మృదుకణజాలం (సాఫ్ట్ టిష్యూ)లో నొప్పులు/ఇన్ఫెక్షన్లు ఉంటే టెండనైటిస్ అని, నరాల్లో నొప్పులుంటే న్యూరాల్జియా అని, ఎముకల్లో నొప్పులుంటే బోన్ పెయిన్స్ అంటాం. నొప్పులకు చాలా కారణాలుంటాయి. ఇందులో కొన్ని... ►ఇన్ఫెక్షన్లు... ∙వైరల్ జ్వరాల్లో : సాధారణ ఫ్లూ (ఇన్ఫ్లుయెంజా), అప్పట్లో చికున్ గున్యా మొదలుకొని ఇటీవల చాలా ఎక్కువగా ప్రబలుతున్న డెంగీ వరకు. అలాగే హెపటైటిస్–బి, హెచ్ఐవీ వంటి ఇన్ఫెక్షన్లలో. ►ప్రోటోజోవన్ ఇన్ఫెక్షన్లు : మలేరియా, పిల్లి వల్ల వ్యాప్తిచెందే టాక్సోప్లాస్మోసిస్ వంటి ఏకకణజీవి ఇన్ఫెక్షన్లలో. ►బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు: టైఫాయిడ్, రికెట్సియల్ వంటి జ్వరాల్లో, బొరిలియా ప్రజాతికి చెందిన బ్యాక్టీరియాతో వచ్చే లైమ్ డిసీజ్ వంటి జబ్బుల్లో. ►ఇరతత్రా ఇన్ఫెక్షన్లు : ట్రైకినెల్లా స్పైరాలిస్, సిస్టిసెర్కోసిస్ (బద్దెపురుగు) వంటి సరిగ్గా ఉడికించని పోర్క్ ద్వారా వ్యాపించే పరాన్నజీవుల ఇన్ఫెక్షన్లలో. ఒకింత జాగ్రత్తగా ఉండాల్సిన కండిషన్లు... డెంగీ : ఇటీవల అనుమానించాల్సిన జబ్బు ఇది. డెంగీలో ఒళ్లునొప్పుల తీవ్రత చాలా ఎక్కువ. అందుకే దీన్ని ‘బోన్ బ్రేకింగ్ ఫీవర్’ అని కూడా అంటారు. ఇలాంటి నొప్పులతో పాటు విపరీతమైన నడుమునొప్పి ఉంటే దాన్ని ‘డెంగీ’గా అనుమానించాలి. ►ఫ్లూ. ఇతర జ్వరాలు: ఫ్లూ జ్వరం ఇన్ఫ్లుయెంజా వైరస్ల వల్ల వస్తుంది. ఇందులో ‘ఇన్ఫ్లుయెంజా ఎ’, ‘ఇన్ఫ్లుయెంజా బి’, ‘ఇన్ఫ్లుయెంజా సి’ అని మూడు రకాలున్నాయి. వీటన్నింటిలో తీవ్రమైన ఒళ్లునొప్పులతో పాటు దగ్గు, జలుబు, గొంతునొప్పి ఉంటాయి. చాలామందిలో అవి వాటంతట అవే తగ్గుతాయి. లక్షణాలనుంచి ఉపశమనం కోసం పారాసిటమాల్ తీసుకుంటే చాలు. చాలా అరుదుగా కొందరిలో నిమోనియా, శ్వాస అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించాలి. ►చికున్‌గున్యా: ఇదీ వైరల్ జ్వరమే అయినా ఇందులో మిగతా వైరల్ ఇన్ఫెక్షన్ల కంటే కీళ్లనొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. నొప్పుల కారణంగా రోగి నడవలేక పూర్తిగా ఒంగిపోతాడు. దీనికి ఉపశమనం కోసం పారాసిటమాల్ వాడి, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ►లెప్టోస్పైరోసిస్ : ఒళ్లునొప్పులతో మొదలయ్యే జ్వరమిది. ప్రస్తుత వర్షాకాలంలో మురుగునీటివల్ల, ఎలుకల ద్వారా వ్యాప్తిచెందే అవకాశాలెక్కువ. ఇందులోనూ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. కొద్దిమందిలో మాత్రం కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, మెదడు వంటి అనేక కీలక అవయవాలు ఒకేసారి దెబ్బతినే ప్రమాదం (మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్) జరిగి అది ప్రాణాంతకం కావచ్చు. లెప్టోస్పైరోసిస్‌ను ముందే తెలుసుకుంటే పెన్సిలిన్, టెట్రాసైక్లిన్ వంటి మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. ►క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్: ఈ జబ్బులో త్వరగా అలసిపోవడం, తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసట తగ్గకపోవడం, శక్తి లేనట్టు అనిపించడం ముఖ్యలక్షణాలు. ఆర్నెల్లకు పైగా ఇవే లక్షణాలు ఉండి, జ్ఞాపకశక్తి క్షీణించడం, నిద్రలేమి వంటివి కూడా ఉంటే, ఆ లక్షణాలన్నీ చూసి దీన్ని నిర్ధారణ చేస్తారు. ఈ జబ్బుకు సరైన కారణం తెలియదు. క్రానిక్ ఇన్ఫెక్సియస్ మోనోన్యూక్లియోసిస్ అనే వైరల్ ఇన్ఫెక్షన్ కూడా క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్‌కు కారణం కావచ్చని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ►మందులతో : కొన్ని జబ్బులకు మనం వాడే మందులతో కూడా ఒళ్లునొప్పులు రావచ్చు. ఇందులో కొలెస్టరాల్ తగ్గించడానికి సాధారణంగా వాడే స్టాటిన్స్ వంటివీ ఉంటాయి. ఇలాంటప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే మందులు మార్చడమో, మోతాదు తగ్గించడమో చేస్తారు. కొన్ని విషసర్పాలు కాటు వేసినప్పుడు కండరాల మీద కనిపించే దుష్ప్రభావం వల్ల కూడా కండరాల నొప్పులు వస్తాయి. అలాగే మనకు తెలియకుండా మన దేహంలోకి వెళ్లే విషాల వల్ల కూడా కండరాల నొప్పులు రావచ్చు. కీళ్లనొప్పులకు సంబంధించిన వ్యాధులతో నొప్పులు... కీళ్లనొప్పులతో వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో, జన్యుపరమైన లోపాల వల్ల ముక్కుకు ఇరువైపులా మచ్చలా కనిపించే సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్లో, పాలీమయాల్జియా రుమాటికా (అంటే గ్రీకు భాషలో అనేక కండరాల్లో నొప్పి అని అర్థం), పాలీమయోసైటిస్, జోగ్రెన్స్ సిండ్రోమ్ వంటి కీళ్లవ్యాధుల్లో ►నరాలు, కండరాలకు సంబంధించిన వ్యాధులు: – మయోపతి, మయస్థేనియా గ్రేవిస్, ఫైబ్రోమయాల్జియా వ్యాధుల్లో. ►ఎండోక్రైన్ వ్యాధులు : – హైపోథైరాయిడిజం, హైపర్‌పారాథైరాయిడిజం, హైపర్‌పారాథైరాయిడిజం వంటి వాటితోపాటు... ఆస్టియోమలేసియా, ఆస్టియోపోరోసిస్లలో. పారానియోప్లాస్టిక్ సిండ్రోమ్ వల్ల: శరీరంలో ఎక్కడ క్యాన్సర్ సోకినప్పటికీ... ఇతర కండరాలపై దాని ప్రభావం వల్ల వచ్చే కండిషన్ అయిన ‘పారానియోప్లాస్టిక్ సిండ్రోమ్’లో. ►మల్టిపుల్ మైలోమా: ప్లాస్మాకణాల క్యాన్సర్లలో ఇలా ఒకింత తీవ్రమైన కారణాల్లోనే కాకుండా... సాధారణంగా అంతగా అపాయం లేని సమస్యల్లోనూ ఒళ్లునొప్పులు కనిపిస్తాయి. అవి... ∙తీవ్రమైన అలసటతో వచ్చే క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్‌లో ►మందులు, విషపదార్థాలు: డీ–పెన్సిల్లెమైన్స్, క్లోరోక్విన్, స్టెరాయిడ్స్, జిడోవిడిన్ వంటి మందులతోపాటు కొలెస్ట్రాల్ తగ్గడానికి ఉపయోగించే మందుల వల్ల కూడా ఒళ్లునొప్పులు వస్తుంటాయి. ∙ఒక్కోసారి ఆల్కహాల్ మితిమీరి తీసుకున్న మర్నాడు కూడా. ►క్యాన్సర్ రోగుల్లో కీమో థెరపీ తీసుకుంటున్నప్పుడు కూడా ఒళ్ళు నొప్పులు బాధిస్తుంటాయి. చేయించాల్సిన పరీక్షలు: పైన మనం చెప్పుకున్నట్లుగా ఎన్నెన్నోరకాల సమస్యల వల్ల ఒళ్లునొప్పులు కనిపిస్తాయి. కాబట్టి ఏ కారణం వల్ల అవి వస్తున్నాయో కనుగొనడం ప్రధానం. అందుకే చేయించాల్సిన కొన్ని సాధారణ పరీక్షలివి... ►మూత్రపరీక్ష ►ఈఎస్ఆర్ ►హీమోగ్రామ్ ►కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు ►సీరమ్ ప్రోటీన్ ఎలక్ట్రోఫోరోసిస్ (ఎస్పీఈపీ ►స్కెలెటల్ సర్వే ►బోన్ స్కాన్ ►సీరమ్ క్యాల్షియమ్ ఫాస్ఫరస్ ►ఆల్కలైన్ ఫాస్ఫోటేజ్ పరీక్షలు ►25 హైడ్రాక్సీ వైటమిన్ డి లెవెల్స్ ►సీరమ్ పారాథోర్మోన్ లెవెల్స్ ►బోన్‌మ్యారో (ఎముక మూలగ) పరీక్ష ►యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ పరీక్ష ►రుమటాయిడ్ ఫ్యాక్టర్ ►హెచ్ఐవీ ►హెచ్‌బీఎస్‌ఏజీ ►హెచ్‌సీవీ పరీక్షలు ►మజిల్ బయాప్సీ ►ఈఎంజీ... ఒక్కోసారి అన్ని పరీక్షలు చేశాక కూడా రోగనిర్ధారణ జరగకపోవచ్చు. అలాంటివారిలో అందుకు కారణం యాంగై్జటీ, డిప్రెషన్ వంటి మానసిక వ్యాధులు కారణం కావచ్చు. అలాంటివారికి సైకియాట్రిస్ట్‌లతో తగిన మందులు, సలహాలతో మంచి ఫలితం ఉంటుంది. చాలా సందర్భాల్లో నిరపాయకరమైన కారణాల వల్లనే ఒళ్లునొప్పులు వస్తుంటాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం సాధారణంగా ఉపయోగించే నొప్పినివారణ పూత మందులు వాడితే చాలు. అయితే ఇవి ఉపయోగిస్తున్నప్పటికీ రెండుమూడు వారాల తర్వాత కూడా తగ్గకుండా ఒళ్లునొప్పులు కనిపిస్తూనే ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. - డాక్టర్ కె. శివ రాజు సీనియర్ ఫిజీషియన్ -
ఒత్తిడితో ఒళ్లునొప్పులు...
అదేపనిగా పన్నెండు గంటల కంటే ఎక్కువసేపు (ఒకే స్ట్రెచ్‌లో) పనిచేసేవారు తీవ్రమైన అలసట మొదలుకొని ఇంకా అనేక సమస్యలు వస్తాయి. ఇక కండరాల నొప్పులు, నడుమునొప్పితో పాటు చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర వృత్తిసంబంధ సమస్యలు సైతం రావచ్చు. వాటిని నివారించేందుకు ఈ సూచనలు పాటించడం మేలు... ⇔ పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. సిగరెట్ పొగలో కార్బన్‌మోనాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అది రక్తకణాల్లోని ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గించి, వెంటనే అలసిపోయేలా చేస్తుంది. ⇔ చాలాసేపు కూర్చొని పనిచేసేవారైతే, శరీరానికి కదలికలు ఉండేలా తప్పనిసరిగా వ్యాయామం చేయండి. అదేపనిగా కూర్చోవడం వల్ల కూడా అలసిపోతారు. ⇔ మీ వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా సమస్యలు, మీరు లక్ష్యాలను అధిగమించాల్సిన (టార్గెట్స్ రీచ్ కావాల్సిన) వృత్తిలో ఉంటే తీవ్రమైన అలసటకు లోను కావడం చాలా సాధారణం. ⇔ కంటి నిండా నిద్ర అవసరం. కనీసం రోజూ ఎనిమిదిగంటల పాటు నిద్రపోవాలి. ⇔ కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే, రోజూ రెండు కప్పులకు మించి వద్దు. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికివెళ్లే సమయంలో కాఫీ అస్సలు తాగవద్దు. ⇔ రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని అధిగమించండి. ⇔ భోజనవేళలను కచ్చితంగా పాటించండి. భోజనం ఎగొట్టి పనిచేయకండి. ఇలా చేస్తే రక్తంలో చక్కెరపాళ్లు తగ్గిపోయి త్వరగా, తేలిగ్గా అలసిపోతారు. ⇔ ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల మీరు డీ-హైడ్రేషన్‌కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేయగలుగుతారు. ⇔ ఈ సూచనలు పాటించాక కూడా మీరు ఇంకా ఒళ్లునొప్పులు, అలసటతోనూ, నడుంనొప్పి వంటి వాటితో బాధపడుతుంటే డాక్టర్‌ను సంప్రదించండి. -
కొత్త పరిశోధన
ఎండ సోకకుంటే కండరాల నొప్పులు.. ఎండ కన్నెరుగకుండా రోజుల తరబడి గడిపేస్తే కండరాల నొప్పులు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, కండరాల నొప్పులకు ఐరన్ లోపం కూడా కారణమేనని వారు చెబుతున్నారు. శరీరానికి కాస్త ఎండ తగలనిస్తే, ఎముకల పటిష్టతకు కావలసిన విటమిన్-డి తయారవుతుందని, తద్వారా వ్యాయామానంతరం కండరాల నొప్పులు రాకుండా ఉంటాయని వివరిస్తున్నారు. విటమిన్-డి లోపిస్తే ఎముకల పటుత్వం తగ్గి, కొద్దిపాటి శ్రమకే ఎముకలు, కండరాల్లో నొప్పులు మొదలవుతాయని, సూర్యరశ్మి సోకనివ్వడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చని లండన్‌కు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ డెయో ఫాముబోని చెబుతున్నారు. అలాగే, ఐరన్ లోపించిన మహిళలు కూడా తరచు ఒంటినొప్పులతో బాధపడుతుంటారని, తగిన పోషకాలతో కూడిన ఆహారం, కాసేపు ఎండలో గడపడం ద్వారా ఇలాంటి పరిస్థితిని అధిగమించవచ్చని ఆయన సూచిస్తున్నారు. గింజ ధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, పుట్టగొడుగులు, గుడ్లు, చేపలు వంటి వాటిలో విటమిన్-డి, ఐరన్.. రెండూ పుష్కలంగా ఉంటాయని, ఒంటినొప్పులతో బాధపడేవారు ఆహారంలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకుంటే చాలని డాక్టర్ ఫాముబోని వివరిస్తున్నారు. -
వ్యాయామం చేస్తున్నారా..? బీట్రూట్ రసం తాగండి...
కొత్త పరిశోధన క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నారా..? చాలా మంచి అలవాటు. వ్యాయామాన్ని క్రమం తప్పకుండా కొనసాగించండి. వ్యాయామం వల్ల కండరాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..? మరేమీ ఫర్వాలేదు. దీనికి ఓ చిన్న చిట్కా పాటిస్తే చాలు. వ్యాయామం ప్రారంభించడానికి ముందు గ్లాసుడు బీట్రూట్ రసం తాగండి. జోరుగా, హుషారుగా వ్యాయామాన్ని కొనసాగించగలరు. అంతేకాదు, ఎప్పటి కంటే కాసింత ఎక్కువసేపు వ్యాయామం కొనసాగించినా కండరాల నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు అని చెబుతున్నారు అమెరికన్ వైద్య నిపుణులు. తాజా బీట్రూట్ రసం కండరాలకు అదనంగా ఆక్సిజన్ సరఫరా చేస్తుందని, అందువల్ల ఎంత వ్యాయామం చేసినా కండరాల నొప్పులు బాధించవని వారు చెబుతున్నారు. అంతేకాదు, క్రమం తప్పకుండా రెండు వారాల పాటు రోజూ బీట్రూట్ రసం తీసుకుంటే, అధిక రక్తపోటు దాదాపు ఏడు శాతం మేరకు తగ్గుతుందని అంటున్నారు. తమ పరిశోధనల్లో తేలిన ఈ విషయాలను వారు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ’ తాజా సంచికలో ప్రచురించారు. -
చేతిస్పర్శతో ఒంటి చికిత్సకు.. ఫిజియోథెరపిస్ట్
ఆటలు ఆడుతున్నప్పుడు కాలు బెణుకుతుంది. నడుస్తున్నప్పుడు కింద పడితే కీళ్లు పట్టేస్తాయి. ఆ బాధ వర్ణనాతీతం. ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, మెడ నొప్పి, బ్యాక్ పెయిన్ వంటివి తరచుగా వేధిస్తుంటాయి. చేతిస్పర్శతోనే ఇలాంటి బాధల నుంచి ఉపశమనం కలిగించే వైద్యుడు.. ఫిజియోథెరపిస్ట్. ఈ తరహా వైద్యంపై గతంలో ప్రజల్లో అంతగా అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఒళ్లు నొప్పుల నుంచి విముక్తి కోసం సంబంధిత వైద్యులను ఆశ్రయించేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఫిజియోథెరపిస్ట్‌లకు అవకాశాలు మెరుగవుతున్నాయి. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంటే ఉద్యోగాలకు, ఉపాధి అవకాశాలకు ఢోకా లేకపోవడం యువతను ఆకర్షిస్తోంది. నిపుణులకు అవకాశాలు పుష్కలం: ఫిజియోథెరపీ/ఫిజికల్ థెరపీ గతంలో కాళ్ల నొప్పులు, మెడ నొప్పులు వంటి వాటికే పరిమితం. వైద్య రంగంలో ప్రస్తుతం ఫిజియోథెరపిస్ట్‌ల పరిధి విస్తరించింది. దాదాపు అన్ని విభాగాల్లో వీరి సేవలు అవసరమవుతున్నాయి. ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, గైనకాలజీ, స్పోర్ట్స్ మెడిసిన్ వంటి వాటిలో వీరి భాగస్వామ్యం తప్పనిసరిగా మారింది. ఈ వైద్యులు ఉష్ణం, వ్యాక్స్, ఎలక్ట్రిసిటీ వంటివి ఉపయోగించి ఎక్సర్సైజ్లు, థెరపీల ద్వారా రోగులకు స్వస్థత చేకూర్చాల్సి ఉంటుంది. తగిన వ్యాయామాలను సూచించాలి. ఫిజియోథెరపిస్ట్‌లకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, రిహాబిలిటేషన్ సెంటర్లు, స్పెషల్ స్కూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, స్పోర్ట్స్ అకాడమీలు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వేతర సంస్థల్లో కొలువులు ఉన్నాయి. తగిన అనుభవం, వనరులు అందుబాటులో ఉంటే సొంతంగా ఫిజియో థెరపీ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అనుకూలమైన పనివేళలు ఉండడం ఇందులోని సానుకూలాంశం. కావాల్సిన నైపుణ్యాలు: రోగులకు సేవ చేయాలన్న దృక్పథం ఫిజియోథెరపిస్ట్‌లకు ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. చికిత్స ఫలించేదాకా ఓపిక, సహనంతో పనిచేయగలగాలి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ రంగంలో ప్రారంభంలో తక్కువ వేతనాలున్నా అనుభవం పెరిగేకొద్దీ సంపాదన కూడా పెరుగుతుంది. ఎప్పటికప్పుడు పనితీరును తప్పనిసరిగా మెరుగుపర్చుకోవాలి. అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైన తర్వాత ఫిజియోథెరపీ/ఫిజికల్ థెరపీలో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులో చేరొచ్చు. తర్వాత పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సు కూడా పూర్తిచేస్తే కెరీర్ పరంగా మంచి అవకాశాలుంటాయి. వేతనాలు: ఫిజియోథెరపిస్ట్‌కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభంలో నెలకు రూ.25 వేల వేతనం అందుతుంది. చీఫ్ ఫిజియోథెరపిస్ట్ స్థాయికి చేరుకుంటే నెలకు రూ.75 వేలు పొందొచ్చు. ప్రైవేట్ రంగంలో ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వేతనం లభిస్తుంది. అనుభవాన్ని బట్టి వేతనంలో పెరుగుదల ఉంటుంది. సొంతంగా ఫిజియోథెరపీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటే పనితీరును బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఉస్మానియా మెడికల్ కాలేజీ-హైదరాబాద్ వెబ్సైట్: www.osmaniamedicalcollege.com నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్) వెబ్సైట్: www.nims.edu.in అపోలో కాలేజీ ఆఫ్ ఫిజియోథెరపీ-హైదరాబాద్ వెబ్సైట్: www.apollocollegedurg.com డెక్కన్ కాలేజీ ఆఫ్ మెడికల్ సెన్సైస్ వెబ్సైట్: http://deccancollegeofmedicalsciences.com పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండీకాప్డ్-న్యూఢిల్లీ వెబ్సైట్: www.iphnewdelhi.in పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వెబ్సైట్: http://pgimer.edu.in/ కాంపిటీటివ్ కౌన్సెలింగ్ కానిస్టేబుల్ పరీక్షలో లోహశాస్త్రం పాఠ్యాంశం ప్రాధాన్యతను తెలపండి? ఏయే అంశాలపై ప్రశ్నలు అడుగుతారు? - వి. కిరణ్ కుమార్, సికింద్రాబాద్ లోహశాస్త్రం అత్యంత ప్రాచీనమైంది. రుగ్వేదంలోనే దీని ప్రస్తావన ఉంది. ఢిల్లీలోని ఐరన్‌పిల్లర్ నేటికీ చెక్కు చెదరకుండా ఉండటం మన పూర్వీకుల లోహశాస్త్ర పనితీరుకు నిదర్శనం. బంగారం, ప్లాటినం తప్ప మిగిలిన లోహాలన్నీ ప్రకృతిలో సంయోగ స్థితిలోనే లభిస్తున్నాయి. అవి సల్ఫైడులు, ఆక్సైడులు, క్లోరైడులు, కార్బొనేటుల వంటి సమ్మేళన రూపాల్లో లభిస్తున్నాయి. వాటి నుంచి పరిశుద్ధ లోహం నిష్కర్షణ చేయడంలో అనేక దశలుంటాయి. దీనికి సంబంధించి వివిధ రూపాల్లో ప్రశ్నలడగవచ్చు. లోహాలకు సంబంధించిన ఖనిజాలపై కూడా ప్రశ్నలు అడుగుతారు. ఉదా: అల్యూమినియం ధాతువేది? జవాబు. బాక్సైట్. వివిధ దశల్లోని భర్జనం, భస్మీకరణం, ప్లవన క్రియ వంటి వాటిపై ప్రశ్నలు రావచ్చు. ఇక లోహక్షయాన్ని నిరోధించే గాల్వనైజేషన్ వంటి ప్రక్రియలపై ప్రశ్నలడగవచ్చు. 2013లో ఈ అంశంపైనే ప్రశ్న అడిగారు. సాధారణంగా జింక్, టిన్ వంటి లోహాల పూతలు పూస్తారు. జింక్ చర్యాశీలత ఎక్కువ కాబట్టి కొన్నిసార్లు జింక్ కంటే టిన్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ఇక మరొక ముఖ్యమైన అంశం లోహాల ఉపయోగాలు, మిశ్రమలోహాల సంఘటనం, వాటి ఉపయోగాలు. 2012 పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో స్టెయిన్లెస్ స్టీల్ సంఘటనంపై ప్రశ్న వచ్చింది. ఈ చాప్టర్ కోసం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పాత టెక్ట్స్‌బుక్ ఉపయుక్తంగా ఉంటుంది. ఇన్పుట్స్: డాక్టర్ బి. రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ పోటీ పరీక్షల్లో ‘భారత రాజ్యాంగ పరిషత్’ పాఠ్యాంశం నుంచి ఏయే అంశాలపై ప్రశ్నలు అడుగుతారు? ఎలా చదవాలి? - ఎన్. భాస్కర్ రెడ్డి, నాచారం రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం, సభ్యుల ఎన్నిక, వివిధ కమిటీలు - అధ్యక్షులు తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు స్వాతంత్య్రోద్యమ చరిత్రను అధ్యయనం చేయాలి. రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, రాజేంద్రప్రసాద్, అంబేద్కర్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మొదలైన ప్రముఖులకు సంబంధించి ముఖ్యమైన అంశాలు తెలిసి ఉండాలి. మన రాజ్యాంగ నిర్మాణంపై ప్రభావం చూపిన ఇతర దేశ రాజ్యాంగాలు, వాటి నుంచి గ్రహించిన అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. రిఫరెన్స పుస్తకాలు: 1. భారత రాజ్యాంగ అభివృద్ధి - ఎం.ఎ. తెలుగు అకాడమీ 2. భారత రాజ్యాంగం - తెలుగు అకాడమీ 3. భారత ప్రభుత్వం - రాజకీయాలు- తెలుగు అకాడమీ ఇన్పుట్స్: కె కాంతారెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ ఎడ్యూ న్యూస్: కెనడా స్టడీ పర్మిట్ దరఖాస్తులు 15 శాతం అధికం కెనడా.. నాణ్యమైన ఉన్నత విద్యనందిస్తూ భారత విద్యార్థిలోకం దృష్టిని ఆకర్షిస్తున్న దేశం. కెనడాకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. న్యూఢిల్లీలోని కెనడియన్ హైకమిషన్‌కు విద్యార్థులు చేసుకున్న స్టడీ పర్మిట్ దరఖాస్తుల్లో గతంలో కంటే 15 శాతం పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది హైకమిషన్ 14,000 స్టడీ పర్మిట్లను జారీ చేసింది. కెనడాకు వెళ్తున్న విద్యార్థులు ఎంచుకుంటున్న కోర్సుల విషయంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. లిబరల్ ఆర్ట్స్, కమ్యూని కేషన్స్, జర్నలిజం, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, సైకాలజీ, ఇంటర్నేషనల్ స్టడీస్, మ్యూజిక్, ఫిల్మ్ అండ్ డిజైన్ కోర్సులను ఎక్కువగా అభ్యసిస్తున్నారు. గతంలో సెన్సైస్, ఇంజనీరింగ్, బిజినెస్ స్టడీస్‌లో ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లేవారు. రిక్రూటర్లు ప్రస్తుతం క్రిటికల్ థింకింగ్, రైటింగ్, కమ్యూనికేషన్ వంటి స్కిల్స్‌కు పెద్దపీట వేస్తుండ డంతో వాటిని నేర్పించే లిబరల్ ఆర్ట్స్ కోర్సుపై యువత ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కెనడాలో యూనివర్సిటీ డిగ్రీలు సరళంగా ఉంటాయి. అంతేకాకుండా అక్కడ చదువుకుంటూనే పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకోవచ్చు. ప్రతిభా వంతులైన విద్యార్థులకు స్టైపెండ్స్, స్కాలర్షిప్స్ లభిస్తాయి. అమెరికాతో పోలిస్తే కెనడాలో ట్యూషన్ ఫీజులు చాలా తక్కువ. సెప్టెంబర్ 25 నుంచి సీమ్యాట్ దేశవ్యాప్తంగా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో 2015-16 విద్యా సంవత్సరానికి పీజీడీఎం, ఎంబీఏ, పీజీసీఎం, ఎగ్జిక్యూటివ్ పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశానికి కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్)-2014 పరీక్షను సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. ఈ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో జరగనుంది. వివరాలకు వెబ్సైట్: www.aicte-cmat.in జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీఎస్సీ(నర్సింగ్), కాలపరిమితి: నాలుగేళ్లు బీఎస్సీ(మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ) బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కాలపరిమితి: మూడేళ్లు అర్హతలు: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ ఉత్తీర్ణత. ఎంపిక: ప్రవేశ పరీక్ష/అకడమిక్ మెరిట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 23 చివరి తేది: అక్టోబర్ 9 వెబ్సైట్: http://ntruhs.ap.nic.in/ సీఎస్ఐఆర్- సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఎస్ఐఆర్- సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. సైంటిస్ట్ పోస్టుల సంఖ్య: 31 విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంఈ/ ఎంటెక్ లేదా ఫిజిక్స్/కెమిస్ట్రీ/ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్లో పీహెచ్డీ ఉండాలి. వయసు: 32 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష , ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 20 వెబ్సైట్: http://www.cbri.res.in/ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మేనేజర్ (ఫైనాన్స్): 1 అర్హతలు: సీఏతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. అకౌంటెంట్: 19 అర్హతలు: మొదటి శ్రేణితో బీకాం లేదా రెండో శ్రేణితో ఎంకాం ఉత్తీర్ణులై ఉండాలి. మూడేళ్ల అనుభవంతో పాటు ట్యాలీ సాఫ్ట్వేర్ పరిజ్ఞానం ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్: 143 అర్హతలు: 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 29 వెబ్సైట్: http://nielitchd.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కాలపరిమితి: ఏడాది అర్హతలు: ఏదైనా బ్యాచిలర్‌స డిగ్రీ ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక: జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 25 వెబ్సైట్: http://www.nird.org.in/ -
బాబుకు చిన్న వయసులోనే కండరాల నొప్పులు..!
మా బాబుకు ఏడేళ్లు. ఇటీవల తరచూ కాళ్లూ చేతుల్లో నొప్పులు అంటున్నాడు. కండరాల నొప్పులు కూడా ఉన్నట్లు వాడి మాటలను బట్టి తెలుస్తోంది. వాడికి ఇతరత్రా ఎలాంటి అనారోగ్యమూ కనిపించడం లేదు. డాక్టర్గారికి చూపిస్తే విటమిన్-డి లోపాల వల్లగాని లేదా ఎదుగుదల సమయంలో వచ్చే నొప్పులు కావచ్చని అంటున్నారు. అయితే ఇటీవల నాకు కూడా కాళ్లూ, చేతుల్లో నొప్పి వస్తే డాక్టర్‌కు చూపించాను. నాకు విటమిన్-డి లోపం ఉన్నట్లు చెప్పారు. దీన్నిబట్టి మా బాబుకు నిశ్చయంగా విటమిన్-డి లోపమేనంటారా? ఇది ఇతర సమస్యలకు దారితీయవచ్చా? దయచేసి వివరంగా సలహా చెప్పండి. - సునంద, హైదరాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ బాబుకు తీవ్రంగా ఎముకల నొప్పులతో పాటు కండరాల నొప్పులు కూడా ఉన్నట్లు చెప్పవచ్చు. ఇలాంటి లక్షణాలు అనేక కారణాల వల్ల కనిపించినప్పటికీ... ఇతర ఆరోగ్య సమస్యలు... అంటే... తరచూ జ్వరం, బరువులో మార్పులు, ఎదుగుదల సమస్యలు, కడుపుకు సంబంధించిన లేదా కాలేయానికి సంబంధించిన సమస్యలు, కీళ్లలో వాపులు, నడవడంలో తీవ్ర ఇబ్బందులు లేవు కాబట్టి మీ బాబు సమస్యను తీవ్రమైన ఇతర జబ్బులకు సూచనగా భావించలేం. మీ డాక్టర్‌గారు చెప్పినట్లుగా విటమిన్-డి లోపం ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు చాలా ఎక్కువగా చూస్తుంటాం. సాంప్రదాయికంగా ఇప్పటివరకూ బాగా చల్లగా ఉండి, సూర్యరశ్మి తక్కువగా ఉండే పాశ్చాత్య దేశాల్లోనే విటమిన్-డి లోపం ఎక్కువగా ఉంటుందనే అపోహ ఉండేది. అయితే ఇటీవల మన దేశంలాంటి ఉష్ణమండల (ట్రాపికల్) వాతావరణం ఉన్నచోట్ల కూడా విటమిన్-డి లోపాన్ని చాలా ఎక్కువగా చూస్తున్నాం. విటమిన్-డి అనేది అనేక ఆరోగ్య అంశాల నిర్వహణకు చాలా అవసరం. మన ఎముకల ఆరోగ్యానికి, పటిష్టతకు అది దోహదం చేస్తుంది. అలాగే మన దేహంలోని అనేక కీలక అవయవాల సమర్థమైన పనితీరుకు అది అవసరం. ఎండకు తగినంతగా ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల, మనం తీసుకునే ఆహారంలో విటమిన్-డి లోపం వల్ల, శాకాహార నియమాన్ని మరీ ఖచ్చితంగా పాటిస్తుండటం వల్ల, పాలతో అలర్జీ ఉండటం వల్ల విటమిన్-డి లోపం కనిపిస్తుంది. అలాగే కొందరిలో దీర్ఘకాలికంగా కాలేయ వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు ఉండటం, కొన్ని రకాల మందులు వాడుతుండటం జరుగుతుంటే ఈ లోపం కనిపించవచ్చు. ఇప్పుడు విటమిన్-డి లోపం అన్నది పిల్లల్లో, పెద్దల్లో కనిపించడం చాలా సాధారణమైంది. విటమిన్-డి లోపం ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చి స్పృహతప్పడం, కాళ్లూచేతులు వంకర్లు తిరగడం, కండరాల నొప్పులు, నడకలో నిదానం, రికెట్స్ కనిపించవచ్చు. దాంతోపాటు కొద్దిమందిలో వ్యాధినిరోధకశక్తి (ఇమ్యూనిటీ)లో లోపం రావడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్స్ బారిన పడటం, ఆస్తమా, మతిమరపు, డయాబెటిస్, మల్టిపుల్ స్క్లిరోసిస్, గుండెజబ్బుల బారినపడటం వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు లోనయ్యేందుకు విటమిన్-డి లోపం ఒక కారణమని తెలుస్తోంది. మీ అబ్బాయి విషయంలో విటమిన్-డి లోపంతో పాటు బహుశా క్యాల్షియం మెటబాలిజం లోపాల వల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తూ ఉండవచ్చు. అలాగే మీలోనూ విటమిన్-డి లోపం ఉన్నట్లు చెబుతున్నారు. కాబట్టి మీరు, మీ అబ్బాయి ఇద్దరూ విటమిన్-డి3తో పాటు క్యాల్షియమ్, ఫాస్ఫరస్ లోపాలు కనుగొనడానికి అవసరమైన వైద్యపరీక్షలతో పాటు థైరాయిడ్, పారాథైరాయిడ్ హార్మోన్ పరీక్షలు, సీబీపీ, సీపీకే పరీక్ష చేయించుకుంటే ఈ నొప్పులకు తగిన కారణాలపై పూర్తి స్థాయి సమాచారం తెలుస్తుంది. ఈ లోపం తొలగడానికి విటమిన్-డి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం కంటే... సూర్యుడికి తగినంత ఎక్స్పోజ్ కావడమే చాలా ముఖ్యం. ఇక ఆహారం విషయానికి వస్తే విటమిన్-డి ఎక్కువగా ఉండే పాలు, చేపలు, మాంసాహారం తీసుకోవాలి. దీంతో పాటు విటమిన్-డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మీ బాబు సమస్య తప్పక తగ్గుతుంది. అలాగే పైన పేర్కొన్న వాటితో పాటు క్యాల్షియం కూడా తగిన పాళ్లలో అందేలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ లోపం మరీ ఎక్కువగా ఉన్నట్లు తెలిస్తే విటమిన్-డి ఇంజెక్షన్లను తీసుకోవాల్సి ఉంటుంది. పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్