
ప్రతీకాత్మక చిత్రం
Tips To Get Relief From Muscle Pain In Telugu: చాలామందికి తరచూ పిక్కలు, తొడ కండరాలు, ఛాతీ మీది కండరాలు హఠాత్తుగా బిగుసుకుపోతుంటాయి. ఆ సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. ఈ సమస్యను ఇంగ్లిష్‌లో ‘మజిల్‌క్రాంప్స్’గా చెబుతారు. కంటినిండా నిద్ర లేకపోవడం, ఆహారంలో పోషకాలు తగ్గడం, దేహానికి అవసరమైనన్ని లవణాలు, ద్రవాలు తీసుకోకపోవడం, విపరీతమైన అలసట, కొన్ని మందులు వాడకం వంటి కారణాలతో మజిల్ క్రాంప్స్ రావచ్చు.
రక్తంలో ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, ఫాస్ఫేట్) పరిమాణం తగ్గిపోవడం కూడా క్రాంప్స్‌కు కారణాలే. సాధారణంగా నిద్రలో, ఒక్కోసారి మెలకువగా ఉన్నప్పుడు, శారీరకంగా శ్రమ చేస్తున్నప్పుడు ఇలా జరగవచ్చు.
ఇలా ఉపశమనం పొందవచ్చు!
కొద్ది మోతాదులో ఉప్పు వేసుకుని మజ్జిగ తాగడం ఈ సమస్యకు తక్షణ పరిష్కారం.
చక్కెర లేకుండా పండ్లరసాలు, ద్రవాహారాలు తీసుకోవడమూ మంచిదే.
అన్ని పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి.
కంటినిండా నిద్రతో ఈ సమస్యను నివారించవచ్చు.
చదవండి: Pumpkin Seeds Health Benefits: గుమ్మడి గింజలు: ఎవరు తినకూడదు? ఎవరు తినవచ్చు!
Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment