fruit juice
-
ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు కీలక సూచన.. ఇకపై..
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI).. అన్ని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు తమ ఉత్పత్తుల మీద '100% ఫ్రూట్ జ్యూస్' అనే లేబుల్స్, అడ్వర్టైజ్మెంట్లను తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 1లోపు ఇప్పటికే ఉన్న అన్ని ప్రీ-ప్రింటెడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లను ఎగ్జాస్ట్ చేయమని కూడా సూచించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.జ్యూస్ కవర్ మీద 100 శాతం నేచురల్.. తక్కువ చక్కెర కంటెంట్ అని రాసి ఉంటుంది. కానీ ఇలాంటి వాటిలో వంద శాతం ఫ్రూట్ జ్యూస్ ఉండదు. తప్పుడు సమాచారంతో కంపెనీలు ప్రజలను మోసం చేస్తున్నారు. ఫ్రెష్ జ్యూస్ చేసుకోవడం కష్టమని.. చాలామంది రెడిమేడ్ జ్యూస్‌లను కొనుగోలు చేస్తూ.. ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఈ కారణంగానే కంపెనీలన్నీ తమ ఉత్పత్తుల మీద లేబుల్స్, అడ్వర్టైజ్మెంట్లను తొలగించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది.ఎఫ్ఎస్ఎస్ఏఐ కొత్త రూల్స్ ప్రకారం.. కిలో జ్యూస్‌లో 15 గ్రాముల కంటే ఎక్కువ చక్కర ఉంటె స్వీట్ జ్యూస్ అని లేబుల్ వేయాలి. తాజా పండ్ల రసం కాకూండా.. ప్రాసెస్ చేసిన జ్యూస్ ఆరోగ్యానికి చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. బరువు పెరగడం, గుండె జబ్బులు వంటి వివిధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తెలుస్తోంది. -
రోజు గ్లాసు బీట్రూట్ – దానిమ్మ జ్యూస్ తాగారంటే..
కావలసినవి బీట్రూట్ – మీడియం సైజువి రెండు, దానిమ్మ – రెండు, పుదీనా ఆకులు – పది, తేనె – రెండు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం – అరచెక్క. తయారీ విధానం ►బీట్రూట్ను తొక్కతీసి ముక్కలుగా తరగాలి ►దానిమ్మ గింజలను ఒలుచుకోవాలి ►బ్లెండర్లో బీట్రూట్ ముక్కలు, దానిమ్మ గింజలు, పుదీనా ఆకులు వేసి గ్రైండ్ చేయాలి ►గ్రైండ్ అయిన మిశ్రమాన్ని వడపోసి జ్యూస్‌ను గ్లాసులో పోయాలి ► దీనిలో తేనె, నిమ్మరసం కలిపి సర్వ్ చేసుకోవాలి. దానిమ్మ-బీట్రూట్ జ్యూస్ ఉపయోగాలు ►వేసవిలో దాహం తీర్చే డ్రింకేగాక, మంచి డీటాక్స్ డ్రింక్‌గా ఈ జ్యూస్ పనిచేస్తుంది. ► బీట్రూట్ రోగనిరోధక వ్యస్థను మరింత దృఢంగా మారుస్తుంది. ►దానిమ్మ గింజలు, బీట్ రూట్‌ను కలిపి తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది ►ఈ జ్యూస్‌లో ఉన్న పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ రక్తపీడనాన్ని నియంత్రణలో ఉంచుతాయి. ►బీట్రూట్లో.. ఐరన్, క్యాల్షియం, జింక్, సోడియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, బీ 6, సి, ఫోలేట్,, నియాసిన్‌లు..æ, దానిమ్మ గింజల్లోని.. విటమిన్ బి, సి, కె, పొటాషియం, పీచుపదార్థాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. ►రోజుకొక గ్లాసు తాగడం వల్ల చర్మానికి, జుట్టుకు పోషణ అందుతుంది. -
Health Tips: పిక్కలు, తొడ కండరాల నొప్పి... మజ్జిగలో ఉప్పు వేసుకుని తాగితే
Tips To Get Relief From Muscle Pain In Telugu: చాలామందికి తరచూ పిక్కలు, తొడ కండరాలు, ఛాతీ మీది కండరాలు హఠాత్తుగా బిగుసుకుపోతుంటాయి. ఆ సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. ఈ సమస్యను ఇంగ్లిష్‌లో ‘మజిల్క్రాంప్స్’గా చెబుతారు. కంటినిండా నిద్ర లేకపోవడం, ఆహారంలో పోషకాలు తగ్గడం, దేహానికి అవసరమైనన్ని లవణాలు, ద్రవాలు తీసుకోకపోవడం, విపరీతమైన అలసట, కొన్ని మందులు వాడకం వంటి కారణాలతో మజిల్ క్రాంప్స్ రావచ్చు. రక్తంలో ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, ఫాస్ఫేట్) పరిమాణం తగ్గిపోవడం కూడా క్రాంప్స్‌కు కారణాలే. సాధారణంగా నిద్రలో, ఒక్కోసారి మెలకువగా ఉన్నప్పుడు, శారీరకంగా శ్రమ చేస్తున్నప్పుడు ఇలా జరగవచ్చు. ఇలా ఉపశమనం పొందవచ్చు! కొద్ది మోతాదులో ఉప్పు వేసుకుని మజ్జిగ తాగడం ఈ సమస్యకు తక్షణ పరిష్కారం. చక్కెర లేకుండా పండ్లరసాలు, ద్రవాహారాలు తీసుకోవడమూ మంచిదే. అన్ని పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి. కంటినిండా నిద్రతో ఈ సమస్యను నివారించవచ్చు. చదవండి: Pumpkin Seeds Health Benefits: గుమ్మడి గింజలు: ఎవరు తినకూడదు? ఎవరు తినవచ్చు! Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే.. -
80 ఏళ్ల బామ్మః జ్యూస్ స్టాల్
అమృత్సర్: పంజాబ్‌లోని అమృత్సర్ నగరంలో పండ్ల రసం దుకాణం నిర్వహిస్తున్న 80 ఏళ్ల వృద్ధురాలి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్న సదరు బామ్మను చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. తమ వంతు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. ఏడాది క్రితం ఢిల్లీలోని ‘బాబా కా దాబా’ వృద్ధ దంపతుల కష్టాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్ ఇటీవల అమృత్సర్ బామ్మ ఉదంతాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. 30 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను కొద్ది రోజుల్లోనే 90 లక్షల మందికి పైగా నెటిజన్లు తిలకించారు. అమృత్‌సర్‌లోని ఉప్పల్ న్యూరో ఆసుపత్రి సమీపంలో రాణి దా బాగ్ వద్ద ఆమె స్వయంగా జ్యూస్ స్టాల్ నడిపిస్తున్నారు. 80 ఏళ్ల బామ్మ బత్తాయి రసం తయారు చేసి, విక్రయిస్తున్న దృశ్యం జనం మనసులను కదలిస్తోంది. ఆమెపై సానుభూతి వెల్లువెత్తుతోంది. ఆవేదన పంచుకుంటామని, ఆర్థిక సాయం అందిస్తామని చాలామంది బామ్మ బ్యాంకు ఖాతా వివరాల కోసం ఆరా తీస్తున్నారు. బామ్మ దుకాణంలో పండ్ల రసం తాగి, ఆమెకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలంటూ అమృత్సర్ ప్రజలకు సోషల్ మీడియాలో పిలుపునిస్తున్నారు. జీవనోపాధి కోసం జ్యూస్ స్టాల్ నడిపిస్తున్న బామ్మకు హ్యాట్సాప్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదే అసలైన ఆత్మనిర్భర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నేటితరం యువత ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని కొనియాడుతున్నారు. వృద్ధుల కోసం కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని ఓ నెటిజన్ అభ్యర్థించాడు. -
డ్రాగన్ ప్రూట్ కన్నా అధిక పోషక విలువలు..
నిలువెల్లా ముళ్లుండే మొక్క బ్రహ్మజెముడు.. మెట్ట/ తీర ప్రాంతీయులకు తెలిసిన మొక్కే. బ్రహ్మజెముడు పండ్లు తినదగినవే అని కూడా తెలిసినా.. వీటికీ వాణిజ్యపరమైన విలువ ఉందని డా. చెన్నకేశవరెడ్డి పరిశోధనలు రుజువు చేశాయి. ఒకసారి నాటితే చాలు. తీవ్ర కరువొచ్చినా, తుపాన్లు వచ్చినా తట్టుకొని బతికి పండ్లను అందించే మొక్కలివి అంటున్నారాయన. వైఎస్సార్ జిల్లా కడప సమీపంలోని ఆలంఖాన్ పల్లెలోని వ్యవసాయ కుటుంబంలో పుట్టిన చెన్నకేశవ రెడ్డి తిరుపతిలోని ఎస్వీయూ క్యాంపస్‌లో ఆహార శుద్ధి సాంకేతికత విభాగంలో ఎమ్మెస్సీ చదివారు. ఆ తర్వాత అక్కడే పీహెచ్డీ కోర్సులో చేరి బ్రహ్మజెముడు (ఒసన్షియా ఫైకస్ ఇండికా) పండ్లతో వివిధ ఆహారోత్పత్తుల తయారీపై అసిస్టెంట్ ప్రొఫెసర్ కేవీ సుచరిత పర్యవేక్షణలో పరిశోధనలు చేశారు. బ్రహ్మజెముడు పండ్ల గుజ్జుతో ప్రూట్ బార్ (తాండ్ర), బ్రహ్మజెముడు పండ్ల స్క్వాష్ (నీటిలో కలుపుకొని తాగడానికి వీలయ్యే గుజ్జు)లను ఫుడ్ సేఫ్టీ అథారిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా తయారు చేయటంపై విశేష పరిశోధనలు చేసి సఫలీకృతమయ్యారు. 2012లోనే వీటి తయారీ పద్ధతిపై పేటెంట్ల కోసం దరఖాస్తు చేశారు. ప్రూట్ బార్ (తాండ్ర) తయారీ పద్ధతిపై పేటెంట్ ఇటీవలే మంజూరైంది. స్క్వాష్‌పై పేటెంట్ రావాల్సి ఉంది. ఈ రెంటితోపాటు.. అత్యంత నాణ్యమైన ఇసుక ఉత్పత్తిపైన, ఆరోగ్యానికి హానికరం కాని హెర్బల్ ఆల్కహాల్ తయారీ పద్ధతిపైన కూడా పరిశోధనలు పూర్తిచేసి, పేటెంట్ల కోసం దరఖాస్తు చేశారు. పులివెందులలోని కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏడేళ్లు పార్ట్‌టైమ్ టీచర్‌గా పనిచేసిన చెన్నకేశవరెడ్డి 2017లో పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్మెంట్ (కేంద్ర వాణిజ్య శాఖకు అనుబంధ సంస్థ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. బ్రహ్మజెముడు పండు ఎరుపు, గులాబి రంగులో ఉంటాయి. వాటితో జామ్స్, స్వాకష్, ఐస్‌క్రీమ్స్, జ్యూస్, జెల్లీలు తయారు చేసుకోవచ్చు. పండు గింజల నుంచి నూనె కూడా తీయవచ్చు. ఈ మొక్కలో ఎలాంటి హానికర పదార్థాలు లేవని అమెరికన్ పుడ్ అడ్మినిస్ట్రేషన్ ధృవీకరించింది. వీటిని అమెరికన్లు అల్పాహారంగా తీసుకుంటారు. బ్రహ్మజెముడు పండు ఉత్పత్తులను ఆహార శుద్ధి పరిశ్రమల్లో ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు. ఈ పండులో పోషక విలువతో పాటు ఔషధ గుణాలు ఉన్నాయని, కాలేయ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధి నివారణకు ఇవి దోహదపతాయన్నారు. కార్బొహైడ్రేడ్లు, విటమిన్లు, పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. ఇందులోని ఔషధ గుణాలు స్థూలకాయం, మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తాయి. అంగోలా, మెక్సికో, మొరాకో, సిసిలీ, పొర్చుగల్ దేశాల్లో ఈ మొక్కలను సాగు చేస్తున్నారు. మెక్సికోలో జన్యుపరంగా అభివృద్ధి చేసి ముళ్లు లేని బ్రహ్మజెముడు వంగడాన్ని రూపొందించి సాగు చేస్తున్నారు. సౌదీ అరేబియాలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో అనేక ఆహార పదార్థాలు రూపొందించి అందిస్తున్నారు. బీట్రూట్ అందించే పోషక విలువలను ఇది అందిస్తుంది. కరువు ప్రాంతమైన రాయలసీమలో పంట సాగు, లాభాల ఆర్జన అత్యంత కష్టతరం. ఇలాంటి నేలల్లో బ్రహ్మజెముడు లాంటి పంటల సాగు ద్వారా ఎలాంటి పెట్టుబడీ లేకుండా ఆదాయం పొందవచ్చన్నది డా. చెన్నకేశవరెడ్డి మాట. – బూచుపల్లి హరిమల్లికార్జున రెడ్డి, ఎస్వీయూ క్యాంపస్, తిరుపతి ఎకరానికి 2 వేల ఆకులు నాటాలి! బ్రహ్మజెముడు.. భూసారం లేని, ఇసుక నేలల్లో, అటవీ భూముల్లో తనంతట తానే పెరిగే కరువు నేలల మొక్క. ఎరువులు, పురుగుమందుల అవసరం లేదు. 2X2 మీటర్ల దూరంలో బోదెలపై నాటుకోవాలి. ఎకరానికి 2 వేల ఆకులు నాటాలి. మూడు ఆకులతో కూడిన కాండాన్ని కత్తిరించి.. కింది ఆకు నేలలోకి వెళ్లేలా నాటాలి. ఒక్కసారి నాటితే.. ఎన్నో ఏళ్లపాటు రైతుకు ఆదాయాన్నిచ్చే పంట బ్రహ్మజెముడు. తీవ్ర కరువొచ్చినా.. వరద వెల్లువైనా తట్టుకొని నిలబడగలగడం.. స్థిరంగా ఏడాదికోసారి పండ్ల దిగుబడినివ్వటం దీని విశిష్టత. ప్రత్యేకించి నీటి తడులు అవసరం లేదు. వర్షం పడినప్పుడు నీటిని పీల్చుకొని బ్రహ్మజెముడు మొక్క తన ఆకుల్లోనే నీటిని నిల్వ ఉంచుకుంటుంది. ఏ మొక్క ఆకుల్లోనైనా సూక్ష్మ పత్ర రంధ్రాలుంటాయి. ఈ పత్ర రంధ్రాల ద్వారా ఏ మొక్కయినా నీటి తేమను వాతావరణంలోకి వదులుతూ ఉంటుంది. అందుకే ఆ మొక్కలు బతకడానికి నీటి అవసరం ఉంటుంది. బ్రహ్మజెముడు అలా కాదు. పత్రరంధ్రాలు మూసుకుపోయి ఉంటాయి. కాబట్టి నీటి అవసరం కూడా ఈ మొక్కకు తక్కువగానే ఉంటుందని చెన్నకేశవరెడ్డి తెలిపారు. డ్రాగన్ ప్రూట్ కన్న అధిక పోషక విలువలు కల్గిన బ్రహ్మజెముడు పంటకు ఎలాంటి ఖర్చూ లేదన్నారు. చిన్న రైతులకు ఉపయోగకరం వాణిజ్య పంటల సాగుకు పెట్టుబడి అధికంగా పెట్టాలి. తగినంత నీటి వసతి కావాలి. ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయాలి. అయితే, బ్రహ్మజెముడు పంట సాగుకు ఇవేమీ అక్కర్లేదు. బంజరు లేదా ఎడారి భూముల్లోనూ బ్రహ్మజెముడును సాగు చేయొచ్చు. విత్తనాలు కూడా అవసరం లేదు. మొక్క (ఆకులు) భాగాలు తీసి పక్కన పాతితే ఈ చెట్లు పెరుగుతాయి. ప్రతి ఏటా మే–జూన్ నెలల్లో పండ్లు కోతకు వస్తాయి. ఒకసారి నాటితే దశాబ్దాల పాటు దిగుబడినిస్తాయి. వీటిని మెక్సికో తరహాలో జన్యుపరంగా అభివృద్ధి చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఎటువంటి పంటలకూ పనికిరాని బంజరు భూముల్లో వీటిని నాటాలి. ప్రతి ఏటా మంచి ఆదాయం వస్తుంది. చిన్న రైతులకు ఉపయోగకరం. – డాక్టర్ సంగటి చెన్నకేశవరెడ్డి (99856 63785), అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్మెంట్, బెంగళూరు -
పైకి కనిపించేదంతా నిజం కాదు!
నిల్వ ఉంచి మురగబెట్టిన మాంసంతో వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటళ్ల బండారం బట్టబయలైంది. హోటల్లోని ఫ్రిజ్‌ల్లో గుట్టగుట్టలుగా మాంసాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఇప్పుడేమో కుళ్లిపోయిన పండ్లు, నిల్వ ఉంచిన పనికిరాని వాటితో జ్యూస్ చేసి ప్రజలతో కాలకూట విషాన్ని తాగించేస్తున్నారు. ఇది చూసిన అధికారులు నివ్వెరపోయారు. ‘మీ ఇంట్లో ఇటువంటివి తింటారా? తాగుతారా?’ అంటూ నిర్వాహకులను నిలదీశారు. అక్రమ సంపాదన కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి, నెల్లూరు: కార్పొరేషన్ కమిషనర్ మూర్తి నేతృత్వంలో ఫుడ్ కంట్రోల్ అధికారులు, నగరపాలక సంస్థ హెల్త్ అధికారులు సోమవారం నెల్లూరు నగరంలో పలు జ్యూస్ షాపులు, హోటళ్లలో తనిఖీలు చేశారు. కుళ్లిపోయిన మామిడికాయలు, మందులు పెట్టి మాగపెట్టిన పండ్లు, నిల్వ ఉంచిన జ్యూస్‌లను అధికారులు గుర్తించి విస్తుపోయారు. నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్సీ సెంటర్లోని లీలామమల్ పక్కనున్న సిమ్లా జ్యూస్ సెంటర్లో తనిఖీలు నిర్వహించి చెడిపోయిన పండ్లను కనుగొన్నారు. ఇటువంటివి వాటితో జ్యూస్ చేసి ప్రజలకు విక్రయించి వారి ఆరోగ్యాలతో చెలగాటం ఆడడం ఏమిటని కమిషనర్ మూర్తి నిర్వాహకులను నిలదీశారు. అక్రమ సంపాదన కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతారా అని ప్రశ్నించారు. ఇలా మరోసారి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా నిల్వఉంచిన మాంసం, పండ్లు, జ్యూస్‌లు విక్రయాలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ఫుడ్ కంట్రోల్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ సిమ్లా జ్యూస్, వీఆర్సీ సెంటర్లోని వైఎస్సార్ జ్యూస్ షాపుల్లో తనిఖీలు చేయగా అనేక విషయాలు వెలుగు చూశాయన్నారు. కనీసం పరిశుభ్రత పాటించడం లేదన్నారు. ఇలాంటి చోట తయారైన ఆహార పదార్థాలు, జ్యూస్‌లు తీసుకోవడం ద్వారా తెలియని అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. మొత్తంగా 100 కేజీల చెడిపోయిన పండ్లు, 50 లీటర్ల జ్యూస్‌ను పారవేడయం జరిగిందన్నారు. నిల్వ ఉంచిన మాంసం గుర్తింపు కార్పొరేషన్ హెల్త్ అధికారి వెంకటరమణ మాట్లాడుతూ వీఆర్సీ సెంటర్లోని మయూరి హోటల్లో తనిఖీలు చేయడంతో అక్కడ నిల్వ ఉంచిన మాంసం ఉందన్నారు. అలాగే పక్కనే ఉన్న వెంకటరమణ హోటల్లో కూడా తనిఖీలు చేశామన్నారు. తేదీ లేని వివిధ రకాల ఆహార పదార్థాలున్నట్లుగా గుర్తించామన్నారు. వీటితో పాటు వహాబ్‌పేటలోని మాంసం దుకాణాల్లో తనిఖీలు చేయగా 100 కేజీల నిల్వ ఉంచిన మాంసంను గుర్తించడం జరిగిందన్నారు. వీటిని స్వాధీనం చేసుకుని పారవేయడం జరిగిందన్నారు. మొత్తంగా ఒక్క రోజులో రూ.70 వేల ఫైన్ వేయడం జరిగిందన్నారు. నిత్యం ఈ దాడులు జరుగుతుంటాయన్నారు. ప్రజలకు అనారోగ్యం కలిగించే వాటిని విక్రయస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
అవి తెగ లాగించేస్తున్నారా...అయితే జాగ్రత్త!
ఆరోగ్యంగా ఉండాలని ఎక్కువ పళ్లు తీసుకోవడం మనకందరికీ తెలిసిందే.. బాడీలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికంటూ ఎక్కువగా, పండ్లు, పళ్లరసాల పైనే ఆధారపడే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అయితే పండ్లను, జ్యూస్ లను, కార్న్ సిరప్, దీనితోపాటు ఎక్కువ తేనెను సేవించడం వల్ల బరువు తగ్గడం మాట అటుంచి బరువు ఇంకా బాగా పెరుగుతారని ఓ ఆశ్చర్యకరమైన పరిశీలనలో తేలింది. అంతేకాదు నరాల వ్యాధికి గురికాడం, లివర్ పాడైపోవడం లాంటి ప్రమాదమూ సంభవించే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. శరీర మెటబాలిజం, నరాల పనితీరుపై రెండురకాల సుగర్ ప్రభావాలపై ఆడ ఎలుకమీద అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం కోసం, ఆడ ఎలుకలలో గ్లూకోజ్ (శరీరంలో కార్బొహైడ్రేట్స్ విచ్ఛిత్తి తర్వాత సహజంగా కనిపించే చక్కెర రూపం) ఫ్రక్టోజ్ (పండ్లు మరియు పండ్ల రసాల్లోఉండే చక్కెర ) సాధారణ ఆహారానికి బదులుగా ద్రవరూపంలో ఎనిమిది వారాల పాటు అందించారు. గ్లూకోజ్ తినిపించిన ఎలుకల్లో కంటే ఫ్రక్టోజ్ ఇచ్చిన ఎలుకల్లో మొత్తం కేలరీల శాతం ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. వీటిలో అధిక ట్రైగ్లిజరైడ్స్, కారణంగా కాలేయం బరువు పెరగడంతో , కాలేయంలో కొవ్వును కరిగించే శక్తి క్షీణించడం, రక్తపోటును ప్రభావితం చేసే బృహద్ధమని పనితీరు మందగించడాన్ని గుర్తించినట్టు తెలిపారు. ఫలితంగా అధిక బరువుతోపాటు, గుండె వ్యాధి, మధుమేహం లాంటి ఇతర ప్రమాదకారక దీర్ఘ వ్యాధుల్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు తేల్చారు. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కారణంగా శరీర బరువులో మార్పులు ఉన్నప్పటికీ కేవలం ఫ్రక్టోజ్ గ్రూపు లో మాత్రమే ఎక్కువ బరువు పెరిగిందని తెలిపారు. హార్ట్ అండ్ సర్క్యులేటరీ ఫిజియాలజీ సమర్పించిన ఈ పరిశోధనా పేపర్ ను అమెరికన్ జర్నల్ ప్రచురించింది. అయితే దీర్ఘకాల ఆరోగ్యంపై ప్రభావం చూపేవాటిల్లో తీపి పదార్థాల మూలంగా శరీరంలో చేరే కాలరీస్ మాత్రమే కాదని గుర్తించాలన్నారు. -
సమ్మర్లో కూల్... కూల్...!
- త్రిష * అబ్బో వేసవి వస్తోందంటే చాలు.... చాలా భయమేస్తుంది. ఇక షూటింగ్స్‌లో మేకప్ వేసుకుని ఎండలో నటించడమంటే నరకం అనుభవించినట్లే. అందుకే ఎంత బిజీగా ఉన్నా, చర్మానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను. * రోజూ ఉదయాన్నే లేచి గ్రీన్ టీ కచ్చితంగా తాగుతాను. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా చర్మానికి కెమికల్ క్రీమ్స్ లాంటివి మాత్రం అస్సలు రాయను. అలోవెరా జెల్ మాత్రం వాడతాను. * ఎక్కువగా పళ్లు, కూరగాయలు తింటూ ఉంటాను. అలాగే నా డైలీ రొటీన్లో కమలా ఫలాలు కంపల్సరీ. వాటి వల్ల సీ-విటమిన్ శరీరంలో చేరుతుంది. * ఇక ఫ్రూట్ జ్యూస్‌లు బాగా తాగుతాను. ఇక ఏ సీజన్ అయినా వర్కవుట్స్ మాత్రం మిస్ కాను. రోజూ ఉదయాన్నే యోగా చేస్తాను. దీనివల్ల ఎండలో కొంత తిరిగినా, తట్టుకోగలుగుతాం. ఈ వేసవిలో ఎక్కువగా తినను. ఉదయాన్నే లేచాక మాత్రం హెవీగా బ్రేక్‌ఫాస్ట్ చేయను. * అసలే స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. ఇక వేసవిలో వీలు దొరికినప్పుడల్లా స్విమ్మింగ్ చేస్తూనే ఉంటాను. -
ఇతడు ఆలోచించాడు... రోబో చేయి పాటించింది..!
ఇతడికి పండ్ల రసం తాగాలనిపించింది. అలా అనుకోగానే రోబోటిక్ చేయి చకచకా కదిలింది. పండ్ల రసాన్ని సిద్ధం చేసింది! ఆ తర్వాత నోటికీ అందించింది! అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో గతేడాది మార్చి 28న జరిగిన సీన్ ఇది. కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, కెక్ మెడిసిన్ యూనివర్సిటీ, తదితర సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ‘కృత్రిమ నాడీ పరికరం’ ద్వారా ఇది సాధ్యమైంది. ఇతడి మెదడులో ఆలోచనలను చదివే చిప్(కృత్రిమ నాడీ పరికరం)ను అమర్చారు. మెదడులోని ఆలోచనలను ఆ చిప్ విశ్లేషించి, రోబో చేయికి సంకేతాలు పంపింది. దీంతో ఆ సంకేతాలకు అనుగుణంగా రోబో చేయి పనిచేసింది. ఈ టెక్నాలజీ పరిశోధన ఫలితాలను గురువారం శాస్త్రవేత్తలు ప్రకటించారు. అవయవాలు కోల్పోయినవారికి, పక్షవాతానికి గురైనవారికి ఈ టెక్నాలజీ వరప్రసాదం కానుందని వారు చెబుతున్నారు. అయితే, ఎరిక్ జి. సోర్టో అనే ఇతడే కృత్రిమ నాడీ పరికరాన్ని ఉపయోగించిన తొలి వ్యక్తి కావడం మరో విశేషం. -
పండ్ల రసం తాగి.. ఇద్దరు చిన్నారుల మృతి!