
సమ్మర్‌లో కూల్... కూల్...!
- త్రిష
* అబ్బో వేసవి వస్తోందంటే చాలు.... చాలా భయమేస్తుంది. ఇక షూటింగ్స్‌లో మేకప్ వేసుకుని ఎండలో నటించడమంటే నరకం అనుభవించినట్లే. అందుకే ఎంత బిజీగా ఉన్నా, చర్మానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను.
* రోజూ ఉదయాన్నే లేచి గ్రీన్ టీ కచ్చితంగా తాగుతాను. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా చర్మానికి కెమికల్ క్రీమ్స్ లాంటివి మాత్రం అస్సలు రాయను. అలోవెరా జెల్ మాత్రం వాడతాను.
* ఎక్కువగా పళ్లు, కూరగాయలు తింటూ ఉంటాను. అలాగే నా డైలీ రొటీన్‌లో కమలా ఫలాలు కంపల్సరీ. వాటి వల్ల సీ-విటమిన్ శరీరంలో చేరుతుంది.
* ఇక ఫ్రూట్ జ్యూస్‌లు బాగా తాగుతాను. ఇక ఏ సీజన్ అయినా వర్కవుట్స్ మాత్రం మిస్ కాను. రోజూ ఉదయాన్నే యోగా చేస్తాను. దీనివల్ల ఎండలో కొంత తిరిగినా, తట్టుకోగలుగుతాం. ఈ వేసవిలో ఎక్కువగా తినను. ఉదయాన్నే లేచాక మాత్రం హెవీగా బ్రేక్‌ఫాస్ట్ చేయను.
* అసలే స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. ఇక వేసవిలో వీలు దొరికినప్పుడల్లా స్విమ్మింగ్ చేస్తూనే ఉంటాను.