టైప్-1 డయాబెటిస్‌కు చికిత్స ఉందా? | Type -1 diabetes is there treatment? | Sakshi
Sakshi News home page

టైప్-1 డయాబెటిస్‌కు చికిత్స ఉందా?

Published Thu, Sep 29 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

టైప్-1 డయాబెటిస్‌కు చికిత్స ఉందా?

టైప్-1 డయాబెటిస్‌కు చికిత్స ఉందా?

హోమియో కౌన్సెలింగ్
టైప్-1 డయాబెటిస్ అంటే ఏమిటి? మా పిల్లవాడికి టైప్-1 డయాబెటిస్ అన్నారు. దీని గురించి వివరించి, మావాడు పాటించాల్సిన ఆహార నియమాలు వివరించండి.
- నరేంద్రకుమార్, విజయవాడ
 

పిల్లల్లో సాధారణంగా 15 ఏళ్ల లోపు వారిలో వచ్చే చక్కెర వ్యాధిని టైప్-1 డయాబెటిస్ అంటారు. టైప్-1 డయాబెటిస్ అంటే ఇందులో క్లోమగ్రంథి అస్సలు పనిచేయదు. అంటే క్లోమగ్రంథి తయారు చేయాల్సిన ఇన్సులిన్ శరీరంలో అస్సలు ఉండదు.
 
లక్షణాలు: టైప్-1 డయాబెటిస్ హఠాత్తుగా వస్తుంది. రక్తంలో గ్లూకోజు ఆర్నెల్ల నుంచి పన్నెండు నెలల్లోపు 100-500 పెరగవచ్చు. ఆకలి, దాహం వేయడం, మూత్రవిసర్జనకు ఎక్కువసార్లు వెళ్తుంటారు. రోగనిరోధకశక్తి తగ్గడంతో తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. ఎదుగుదల తగ్గుతుంది.
 చిన్నపిల్లల్లో డయాబెటిస్ ఉంటే పాటించాల్సిన ఆహార

నియమాలు: పిల్లల్లో ఎలాంటి ఆహార నియమాలు వద్దు 15-25 మధ్య వయసువారు లావుగా ఉంటేనే బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే జంక్‌ఫుడ్ తగ్గించుకోవాలి. ఇన్సులిన్ నిరోధకత రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ను పెంచుతుంది కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే ఆహారంలో పిండిపదార్థాలు తగ్గించుకోవాలి 5-15 ఏళ్ల వయసువారికి ఎలాంటి ఆహారనియమాలు పెట్టకూడదు. వారి ఎదుగుదల కోసం వాళ్ల బరువుకు తగినట్లు ఎన్ని క్యాలరీలు అవసరమవుతాయో డైటీషియన్‌ను సంప్రదించి వారు చెప్పినట్లు పాటించాలి. త్వరగా జీర్ణమయ్యే పిండి పదార్థాలను వాడాలి.

మార్కెట్‌లో దొరికే పిజ్జా, బర్గర్, ఐస్‌క్రీమ్స్, నూడుల్స్, బిస్కెట్లు వాడకూడదు.పిల్లల ఎదుగుదలకు ఆహారం ఎంతోముఖ్యం. కాబట్టి తల్లిదండ్రులు ఆహారం విషయంలో ఆంక్షలు విధించడం, ఆహారాన్ని తగ్గించి, వ్యాయామాలను పెంచడం చేస్తే అసలే పిల్లల్లో తక్కువగా ఉండే రోగనిరోధకశక్తి మరింత తగ్గుతుంది. దీనికితోడు క్షయవ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.
 
చికిత్స: హోమియోలో టైప్-1కు అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది. ఇన్సులిన్‌తోపాటు హోమియో మందులు ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మీరు మీ బాబుకు హోమియో చికిత్స ఇప్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
 - డాక్టర్ టి.కిరణ్ కుమార్
డైరక్టర్,పాజిటివ్ హోమియోపతి,విజయవాడ, వైజాగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement