ఆధునికకాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. అయితే తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయిల కంటే అబ్బాయిల్లోనే టైప్ 1 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని యూకే లోని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్‌కి చెందిన పరిశోధనా బృందం వెల్లడించింది. చిన్నపిల్లలకు టైప్-1 డయాబెటిస్ (T1D) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది.
తాజా అధ్యయనం ప్రకారం అమ్మాయిల్లో 10 ఏళ్ల తర్వాత టైప్ 1 మధుమేహం రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. కానీ అబ్బాయిల్లో మాత్రం ఈ ముప్పు స్థిరంగా ఉంటుందని పరిశోధన వెల్లడించింది. సెక్స్ హార్మోన్లు పాత్ర పోషిస్తాయని పరిశోధన తెలిపింది. పురుషుల్లోని ఆటోఆంటిబాడీల అభివృద్ధితో దీనికి సంబంధం ఉండవచ్చని సూచించింది. రోగనిరోధక వ్యవస్థ, దీనికి సంబంధించిన ప్రోటీన్‌లైన్ ఆటోఆంటిబాడీ ఎక్కువున్న అబ్బాయిల్లో ప్రమాదం ఉందని అధ్యయనం చూపించింది. వీరు మెజారిటీ ఆటో ఇమ్యూన్ వ్యాధుల మాదిరిగా కాకుండా ఈ తరహా మధుమేహానికి ప్రభావితమవుతారని వెల్లడించింది.
ఈ అధ్యయనంలో కంప్యూటర్, స్టాటిస్టికల్ మోడలింగ్ డేటా సాయంతో పరిశోధకులు టీఐడీ ఉన్న వ్యక్తుల 235,765 మంది బంధువులను పరిశీలించారు. ఇందులో మగవారిలో అధిక ఆటోయాంటిబాడీ స్థాయిలు ఉన్నట్లు కనుగొన్నారు (అమ్మాయిల్లో: 5.0శాతం, పురుషుల్లో: 5.4శాతం). అలాగే మగవారు మల్టిపుల్ యాంటిబాడీ ప్రతిరోధకాలకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉన్నందున వీరిలో ఐదేళ్ల ముందే ఈ టీఐడీ వచ్చే అవకాశం ఉంది. పదేళ్ల వయస్సులో వచ్చే ప్రమాదంలో మార్పు టీనేజ్-సంబంధిత హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నఅధ్యయన బృందం మరింత పరిశోధన కోసం పిలుపునిచ్చింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 9-13 వరకు జరిగే స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో యూరోపియన్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ఈ ఫలితాలను ప్రెజెంట్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment