కూర్చోవడానికీ ఇబ్బందిగా ఉంది! | Best Homeopathic Medicines for Piles | Sakshi
Sakshi News home page

కూర్చోవడానికీ ఇబ్బందిగా ఉంది!

Published Wed, Jan 18 2017 12:11 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

కూర్చోవడానికీ ఇబ్బందిగా ఉంది!

కూర్చోవడానికీ ఇబ్బందిగా ఉంది!

హోమియో కౌన్సెలింగ్‌
నా వయసు 47 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి మలద్వారం వద్ద బుడిపెలా బయటకు వస్తోంది. మల విసర్జన సమయంలో రక్తం పడుతోంది. అప్పుడప్పుడు సూదితో గుచ్చినట్లు నొప్పి వస్తోంది ఉంది. కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది. డాక్టర్‌ పైల్స్‌ అని చెప్పారు. హోమియోతో నయమవుతుందని తెలిసింది. తగిన సలహా ఇవ్వండి. – ఈశ్వర్‌కుమార్, జగ్గయ్యపేట

ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తున్న సమస్యలలో ఇది ఒకటి.  మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే రక్తనాళాలు (సిరలు) ఉబ్బి, మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి, ఇబ్బంది పెడతాయి. తీవ్రతను బట్టి వీటిని నాలుగు దశలుగా వర్గీకరించవచ్చు.

మొలల దశలు: గ్రేడ్‌–1 దశలో మొలలు పైకి కనిపించవు. నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది.
గ్రేడ్‌–2లో రక్తం పడవచ్చు, పడకపోవచ్చు కానీ మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి.
వాటంతట అవే లోపలకు వెళ్లిపోతుంటాయి.
గ్రేడ్‌–3లో మల విసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి.
కానీ మల విసర్జన తర్వాత తర్వాత వాటంతట అవి లోపలికి పోకుండా వేలితో నెడితే లోనికి వెళ్తాయి.
గ్రేడ్‌–4 దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు.

కారణాలు: ∙మలబద్ధకం ∙మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండరబంధనం సాగిపోతుంది.
తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి
సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం ∙స్థూలకాయం (ఒబేసిటీ)
చాలాసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువ
మలబద్ధకమేగాక అతిగా విరేచనాలు కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు
మంచి పోషకాహారం తీసుకోకపోవడం ∙నీళ్ళు తక్కువగా తాగడం
ఎక్కువగా ప్రయాణాలు చేయడం lఅధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం
మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ.

లక్షణాలు: నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లు నొప్పి
మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం.
నివారణ: మలబద్ధకం లేకుండా చూసుకోవాలి
సమయానికి భోజనం చేయాలి
ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువుండేలా చూసుకోవాలి.
కొబ్బరినీళ్లు, నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.
మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తగ్గించాలి.
మెత్తటి పరుపుపై కూర్చోవాలి. హోమియోలో రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఇచ్చే మందులిచ్చి వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement