Homeopathy treatment
-
అమూల్ డెయిరీకి అంతర్జాతీయ పురస్కారం
మూడు భారతీయ డెయిరీ సంస్థలకు అంతర్జాతీయ డెయిరీ ఫెడరేషన్ (ఐడిఎఫ్) ‘ఇన్నోవేషన్ ఇన్ సస్టయినబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ 2024’ ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. పాడి పశువులకు సోకే జబ్బులకు చేసే చికిత్సల్లో అల్లోపతి యాంటీబయాటిక్ ఔషధాలకు బదులుగా హోమియోపతి ఔషధాలను వాడి చక్కని ఫలితాలు సాధించినందుకు గాను ‘యానిమల్ కేర్’ విభాగంలో అమూల్ డెయిరీకి ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది.సుమారు 68 వేల పశువులకు సోకిన 26 రకాల సాధారణ వ్యాధులకు హోమియోపతి మందులతో చికిత్స చేయటం ద్వారా అమూల్ డెయిరీ సత్ఫలితాలు సాధించింది. ఇందుకోసం 2024 మే నాటికి 3.30 లక్షల (30 ఎం.ఎల్. సీసాలు) హోమియోపతి మందులను అమూల్ సొంతంగానే ఉత్పత్తి చేసి, 1.80 లక్షల సీసాలను పాడి సహకార సంఘాల రైతులకు పంపిణీ చేసింది. యాంటీబయాటిక్ ఔషధాల వాడకాన్ని తగ్గించటం ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగవుతోంది. పాల ఉత్పత్తులు వినియోగించే ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతోందని ఐడిఎఫ్ తెలిపింది. సంప్రదాయ ఆయుర్వేద (ఈవీఎం) చికిత్సా పద్ధతులతో పాటు హోమియో పశువైద్య పద్ధతులను కూడా అమూల్ ప్రాచుర్యంలోకి తేవటం హర్షదాయకం.పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్ పాడి, పశు పెంపకందారుల సహకార సంఘానికి ఆర్థిక, సామాజిక విభాగంలో పురస్కారం లభించింది. 4,500 మంది మహిళా రైతులు పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పాలు ఉత్పత్తి చేస్తున్నారు. అనేక పాల ఉత్పత్తులను, ఎ2 ఆవు నెయ్యిని తయారు చేస్తున్నారు. సేంద్రియ నాటు కోళ్ల పెంపకంతో పాటు సేంద్రియ పప్పుదినుసులను సైతం ఉత్పత్తి చేసి, ప్రాసెసింగ్ చేసి వినియోగదారులకు నేరుగా విక్రయిస్తూ మహిళా రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధిస్తున్నారు.చదవండి: 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదుఐడిఎఫ్ పురస్కారం అందుకున్న మరో సంస్థ ‘ఆశా మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ’. సౌర విద్యుత్తుతో నడిచే ఇన్స్టంట్ మిల్క్ చిల్లర్లను వినియోగించటం ద్వారా చిన్న, సన్నకారు పాడి రైతుల అభ్యున్నతికి వినూత్న రీతిలో దోహదపడటం ఈ ఎఫ్పిఓ ప్రత్యేకత. -
పశువ్యాధులకు హోమియోపతి చికిత్సతో ప్రయోజనం
పాడి పశువులు రోగాల బారిన పడినప్పుడు రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ఖర్చుల కన్నా చికిత్స ఖర్చులు భారంగా మారుతుండటంతో పాడి రైతుల ఆదాయం తగ్గిపోతోంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం హోమియో చికిత్సా విధానం. ఇది తక్కువ ఖర్చుతో వెంటనే ఫలితాన్ని ఇచ్చేదే కాకుండా సహజమైన, మానవీయమైన, సమర్థవంతమైన చికిత్సా పద్ధతి కూడా అంటున్నారు పశువైద్యాధికారి డాక్టర్.జి.రాంబాబు. కడపలోని పశువ్యాది నిర్ధారణ ప్రయోగశాలలో సేవలందిస్తున్న ఆయన హోమియో పశువైద్యంలో తన అనుభవాలను ‘సాక్షి సాగుబడి’తో పంచుకున్నారు.. సహజ రోగ నిరోధక శక్తికి ప్రేరణ కలిగించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడమే హోమియో వైద్య విధానం లక్షణం. హోమియో విధానంలో వాడే ఔషధాలన్నీ కూడా సహజమైన మొక్కలు, లవణాలతో తయారు చేసినవే. ఈ వైద్య విధానానికి 200 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా యూరోపియన్, ఆసియా దేశాల్లో పశువ్యాధుల చికిత్సలో హోమియోపతి మందులు వాడుతున్నారు. మన దేశంలోనూ అక్కడక్కడా ఈ ప్రయత్నాలు జరుగుతుండటం ఆహ్వానించదగిన విషయం. పశువులకు హోమియో ప్రయోజనాలేమిటి? ►ఖర్చు తక్కువ. ఒక మందు ఖరీదు కేవలం రూ. 10 లోపే. అల్లోపతిలో ఈ ధరకు ఏ మందూ రాదు. ► సైడ్ ఎఫెక్ట్స్ /దుష్ప్రభావాలు ఉండవు. పరీక్షలు చేసి రోగ నిర్థారణ చేసే వరకు మందులు వాడకుండా ఉండాల్సిన పని లేదు. రోగ లక్షణాన్ని బట్టి చికిత్స చేస్తే చాలు. ► ఒకసారి పశువులకు, దూడలకు, ముఖ్యంగా శునకాలకు హోమియో (తీపి) మాత్రలు ఒకసారి ఇస్తే మళ్లీ అవే వచ్చి మందు అడుగుతాయి. ► హోమియో మందులు త్వరితగతిన పనిచేస్తాయి. ఇవి నెమ్మదిగా పనిచేస్తాయని చాలామంది అనుకుంటారు. అది అపోహ మాత్రమే. ► ఇతర వైద్య పద్ధతుల్లో మందుల మాదిరిగా భరించలేని వాసన ఈ మందులకు ఉండదు. ► డోసు కొద్దిగా ఎక్కువయినా ఇబ్బంది లేదు. అది మిగతా వైద్య పద్ధతుల్లో ఇది సాధ్యం కాదు. కాబట్టి, అవగాహన పెంచుకున్న రైతులు పశువులకు ఇంటి దగ్గరే ఈ వైద్యం చేసుకోవచ్చు. ► కొన్ని వ్యాధులకు అల్లోపతిలో లేని వైద్యం కూడా హామియోపతిలో ఉండటం విశేషం. ► ఈ మందుల వల్ల పర్యావరణం కలుషితం కాదు. హోమియో మందులతో పొదుగువాపు మాయం! రాథి ఆవు ఇది. రాజస్తాన్‌కు చెందిన జాతి. స్థానిక రైతు అక్కడి నుంచి కడప జిల్లాకు చూడి ఆవును తీసుకువచ్చారు. వారం తరువాత ఈనిన ఆవు కోడె దూడకు జన్మనిచ్చింది. పాలు ఇచ్చిన 5వ రోజు నుంచి రెండు చన్నుల నుంచి పాలతో పాటు రక్తం వచ్చింది. పశువైద్యునిగా పొదుగువాపును గుర్తించి యాంటి బయోటిక్ మందులతో చికిత్స ఇచ్చాను. 5 రోజులకు తగ్గింది. 7వ రోజు నుంచి మళ్లీ పొదుగువాపు వచ్చింది. ఆవు నుంచి తీసిన రక్తంతో కూడిన పాలను యాంటి బయోటిక్ సెన్సిటివిటి పరీక్షకు ప్రయోగశాలకు పంపించాం. పరీక్ష ఫలితాలు 3వ రోజున వస్తాయి. ఈ లోపు మళ్లీ కొత్త అల్లోపతి మందులు ఇవ్వడం కన్నా ఆయుర్వేద లేదా హామియో మందులు వాడుతుంటాం. ఈ ఆవుకు హోమియో మందులు వాడితే.. రెండు విధాలుగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. మొదటిది: పాల పరీక్ష ఫలితాల్లో మొత్తం 13 యాంటీ బయోటిక్ మందులకు నిరోధకత వచ్చింది. అంటే, ఆ ఆవుపై ఇక ఏ యాంటి బయోటిక్ మందూ పనిచేయదని అర్థం. రెండోది: ఈ లోగా హోమియో మందులు వాడటం వల్ల 3 రోజుల్లోనే ΄పొదుగువాపు తగ్గిపోయింది. అల్లోపతి మందులకు దాదాపుగా రూ. 2,200 ఖర్చు చేశాం. హోమియో మందుల ఖర్చు కేవలం రూ. 50 మాత్రమే. పొదుగువాపు తగ్గించడానికి ఫైటో లక్క, కొనియం, బెల్లడోన, ఫెర్రం ఫాస్ అనే హామియో మందులను వినియోగించాం. రెండు వారాలైనాతగ్గనిది.. హోమియోతో 2 రోజుల్లో తగ్గింది! ఒక హోటల్ యజమాని ఒంగోలు ఆవును కొన్నారు. మంచిదని హోటల్ దగ్గరే ఆవును కట్టేస్తున్నారు. గడ్డి తక్కువ వేస్తూ ఎక్కువ మొత్తంలో కూరగాయలు మేపేవారట. కొద్ది రోజులకే ఆవుకు సుస్తీ చేసింది. మేత తినటం దాదాపుగా ఆపేసింది. ఆకలి పెంచేందుకు పౌడర్లు, బీకాంప్లెక్స్ ఇంజక్షన్లు, లివర్ టానిక్‌లు, కసురు తాగించినా ఫలితం లేకపోవటంతో కడప పశువుల ఆసుపత్రికి తీసుకువచ్చారు. అల్లోపతి మందులతో దాదాపు 2 వారాల పాటు వైద్యం అందించినా, కొద్దిగా కూడా ఫలితం కనిపించ లేదు. ఆ దశలో నక్స్ వామిక, రుస్ టాక్స్ అనే హోమియో మందులు రెండు రోజులు ఇచ్చాం. 3వ రోజుకు సమస్య పూర్తిగా తగ్గిపోయింది. (పశువైద్యులు డాక్టర్ జి. రాంబాబును 94945 88885 నంబరులో సంప్రదించవచ్చు) -
గొంతు నొప్పి చాలా రోజుల నుంచి ఉందా? కారణాలు ఇవే
గొంతు నొప్పి ఉంటే చాలు, దానికి జలుబుకు ఆపాదించుకొని యాంటీబయాటిక్స్ మింగుతుంటారు. కొంతమందిగాని అది సరైన పద్ధతి కాదు. గొంతు నొప్పికి కారణాలు అనేక రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే.. 1. అంగిటి_ముల్లు (టాన్సిలైటిస్) జలుబుకు కారణమైన వైరస్ క్రిములు గొంతు నొప్పిని కూడా కలిగించే అవకాశం ఉంది. బయట వాతావరణం నుంచి ఇన్ఫెక్షన్లు శరీరంలోనికి ప్రవేశించేటప్పుడు గొంతు లోపల ఇరుపక్కలా ఉండే టాన్సిల్స్ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి. టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ను వైరస్ క్రిముల వల్లనే రావాలని లేదు; బ్యాక్టీరియా వాళ్ళ కూడా వస్తుంటాయి. అటువంటి సందర్భాలలో టాన్సిల్స్ మీద చీముతో కూడిన తెల్లని పొక్కులు కనిపిస్తాయి. తీవ్రస్థాయిలో జ్వరం వస్తుంది. ఒళ్లు నొప్పులు కూడా ఉంటాయి. దీనిని 'కాంచనార గుగ్గులు' వంటి గ్రంథులమీద పని చేసే మందులతో చికిత్స అందించాల్సి ఉంటుంది. అసలు టాన్సిల్స్ అనేవి లేకపోతే వాటికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రసక్తే ఉండదు. అనే భావనతో కొంతమంది టాన్సిలెక్టమీ కోసం డాక్టర్ మీద ఒత్తిడి తీసుకువస్తుంటారు కానీ ఇది సరైన భావన కాదు. టాన్సిల్ అడ్డుగా కనుక లేకపోతే ఇన్ఫెక్షన్ నేరుగా శరీరంలోకి ప్రవేశించి గుండె మొదలైన ముఖ్యమైన అవయవాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఆయుర్వేదంలో పరిష్కారాలు : 1. పటిలను (పావు చెంచా) వేడి నీళ్ళలో (కప్పు) వేసి గొంతుకు తగిలేలా పుక్కిట పట్టాలి. 2. త్రిఫలాచూర్ణం (చెంచాడు) నీళ్ళలో వేసి కషాయం కాచి పుక్కిట పట్టాలి. 3. వెల్లుల్లిని ముద్దుచేసి, రసం పిండి కొద్దిగా వేడి చేయాలి. దీనికి తేనె కలిపి కాటన్ బడ్ తో టాన్సిల్స్ పైన ప్రయోగించాలి. 4. పసుపు, మిరియాల చూర్ణాలను (చిటికెడు) వేడి పాలతో తీసుకోవాలి. ఔషధాలు: కాంచనార గుగ్గులు, లఘుమాలినీవసంత రసం, తాళీసాది చూర్ణం, త్రిభువన కీర్తిరసం, ఇరిమేదాది తైలం, చంద్రప్రభావటి, శుభ్రవటి, వాసాకంటకారిలేహ్యం, కఫకేతురసం, తుండికేరి రసం. గ్లాండ్యులర్_జ్వరం: ఎప్ స్టీన్ - బార్ వైరస్ వల్ల కలిగే గ్లాండ్యులర్ ఫీవర్ లో దీర్ఘకాలం పాటు టాన్సిల్స్ వాపు ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన కొత్తలో టాన్సిల్స్ నొప్పి మొదలై చాలా రోజుల పాటు ఏ మందులకూ లొంగకుండా అలాగే ఉండిపోతుంది. దీనితోపాటు ఎడతెగని ఒళ్లు నొప్పులు, నీరసం, అనుత్సాహం వంటి శారీరక లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనిని అశ్వగంధ, విష్ణుప్రియ వంటి 'ఇమ్యునో మాడ్యులేటింగ్' మూలికలతో చికిత్సించాల్సి ఉంటుంది. ఔషధాలు: అశ్వగంధాదిలేహ్యం, అమృతప్రాశఘృతం, చ్యవనప్రాశాలేహ్యం, కూష్మాండలేహ్యం, నారాసింహఘృతం, విదార్యాదిఘృతం, సుకుమారరసాయనం. గొంతులో ఆహారేతర పదార్ధం: కొంతమంది మాంసాహారం తినేటప్పుడు అలవాటుగా బొమికలను కూడా తింటుంటారు. ఒకవేళ వీటిని సరిగా నమలకుండా కనుక తిన్నట్లయితే అవి గొంతు లోపల గుచ్చుకొని గాయమై నొప్పిని కలిగించే అవకాశం ఉంది. అలాగే, కొన్ని సందర్భాల్లో బొమికల ముక్కలు, చేపలముళ్లు గొంతులో ఇరుక్కొని నొప్పిని కలిగించే అవకాశం ఉంది. వైద్య సహాయంతో వీటిని తొలగించాల్సి ఉంటుంది శ్వాసకోశ సంబంధ ఎలర్జీలు (ఈసినోఫీలియా): కొంతమందిలో ఏ ఇన్ఫెక్షనూ లేకపోయినప్పటికీ గొంతు నొప్పి వస్తుంటుంది. ఎలర్జీలు దీనికి ప్రధానమైన కారణం. సిగరెట్ పొగ, పాత పుస్తకాల వాసన, దుమ్ము, ధూళీ అవసరాలని మించి మాట్లాడటం వంటి కారణాల మూలంగా ఎలర్జీ ఏర్పడి గొంతు లోపలి మ్యూకస్ పొర ఇరిటేట్ అవుతుంది. తత్కారణంగా గొంతునొప్పి వస్తుంది. కారణాలను జాగ్రత్తగా తరచి చూసుకొని జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. ఔషధాలు: దశమూలారిష్టం, ఏలాది చూర్ణం, కర్పూరాది చూర్ణం, కస్తూర్యాది గుటిక, కస్తూరి మాత్రలు, మకరధ్వజ మాత్రలు, స్వచ్ఛంద భైరవ రసం, తాళీసాది చూర్ణం, బాహ్యప్రయోగాలి - చంద్రకళా లేపం, రాస్నాది చూర్ణం, కర్పూరాది తైలం. ఆమ్లపిత్తం (ఎసిడిటి /హార్ట్ బర్న్): అజీర్ణం, ఎసిడిటి, గ్యాస్ వంటి కారణాల వల్ల అమాశయంలో ఉండాల్సిన ఆమ్ల పదార్ధం అన్న నాళిక ద్వారా గొంతులోనికి ఎగదన్ని అక్కడ నొప్పినీ, మంటనూ కలిగించే అవకాశం ఉంది. దీనికి ఆయుర్వేద శాస్త్రం సూచించిన 'ఆమ్లపిత్త హర చికిత్సలు" చేయాల్సి ఉంటుంది. టీ, కాఫీ, సిగరెట్ల వంటి వాటిని మానేసి పాలు వంటి సాత్వికాహారాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. 1. ఆహారం కొద్దిమొత్తాలలో తినాలి. 2. కారం, పులుపు, మసాలాలు తగ్గించాలి. 3. ధూమపానం మద్యపానాలు పనికిరావు. 4. బరువు తగ్గాలి. 5. ఆహారం విషయంలో సమయపాలన పాటించాలి. ఆయుర్వేదంలో సలహాలు : 1. పిల్లిపీచర గడ్డలను పొడిచేసి, అరచెంచాడు మోతాదుగా పాలతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 2. ఉసిరికాయ పెచ్చులను పొడిచేసి అరచెంచాడు మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతో కలిపి తీసుకోవాలి. 3. అతి మధురం వేరును పొడిచేసి పావు చెంచాడు మోతాదుగా పాలతో కలిపి తీసుకోవాలి. 4. తిప్పసత్తును రేగు గింజంత మోతాదుగా చన్నీళ్లతో లేదా తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. ఔషధాలు: సంశమనీవటి, అవిపత్తికర చూర్ణం, ధాత్రీలోహం, కామధుఘరసం, శంఖ భస్మం, సూతశేఖర రసం, ప్రవాళ పంచామృతం, సుకుమార ఘృతం. కంటసుధరకవటి ఉపయోగాలు : గొంతు నొప్పి , జలుబు, దగ్గు, గొంతులో గరగర, గురక రావటం డా.నవీన్ నడిమింటి, హోమియో వైద్యులు -
నడుంనొప్పి: హోమియోపతి చికిత్స
(లాంబార్ స్పాండిలోసిస్) ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య నడుంనొప్పి(లాంబార్ స్పాండిలోసిస్). ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే లాంబార్ స్పాండిలోసిస్ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండానే వస్తోంది. యుక్త వయసులో ఉన్నవారు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం మారుతున్న జీవనశైలి. నడుమునొప్పే కదా అని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. అలా కాకుండా వ్యాధి తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది. కారణం: శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం 33 వెన్నుపూసలతో నిర్మితమైన వెన్నెముక, వెన్నెముకలోని ప్రతి రెండు వెన్ను - ఎముకల మధ్య మృదులాస్థితో నిర్మితమైన ‘డిస్క్’లు మనం వంగినా, లేచినా ఈ డిస్క్లే తోడ్పడుతాయి. అయితే అసంబద్ధ భంగిమలలో ఎక్కువసేపు కూర్చోవడం, ఒకేచోట ఎక్కువ సమయం కదలకుండా కూర్చొని విధులు నిర్వర్తించటం, వంగి ఉండి తీవ్రమైన శారీరక శ్రమ చేయడం, తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్ డి తగినంత లేకపోవడం మొ॥లగు కారణాల వల్ల నడుము ప్రాంతంలో ఉండే డిస్క్‌లు అరిగిపోవడం, ప్రక్కకు తప్పుకోవడం ఆస్టియోపైట్స్ (అనవసరమైన ఎముక పెరుగుదల) ఏర్పడడం వల్ల నడుము నొప్పి సమస్య ఉత్పన్నమగును. దీనినే ‘‘లాంబార్ స్పాండిలోసిస్’’ అంటారు. లక్షణాలు: నడుము నొప్పి తీవ్రముగా ఉండి, ఎటువైపు వంగినా, కూర్చున్నా, నడిచినా నొప్పి పెరుగును. డిస్క్‌లు ప్రక్కకు జరిగినప్పుడు అక్కడి నుండి వెళ్ళే నాడులపై పడే ఒత్తిడి కారణంగా నొప్పి ఎడమ లేదా కుడి కాలుకు వ్యాపిం చి బాధిస్తాయి. నొప్పితో పాటు ఒత్తిడి తీవ్రత ఎక్కువైతే తిమ్మిర్లు కూడా వ్యాపిస్తూంటాయి. హఠాత్తుగా వంగినా, బరువులు ఎైతినా ఒక్కసారిగా తీవ్రమైన నొప్పులతో బాధపడుతూంటారు. జాగ్రత్తలు: నడుము నొప్పితో బాధపడే వారు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి. కుర్చీలో కూర్చొన్నప్పుడు, వాహనం నడిపేటప్పుడు నడుము నిటారుగా ఉండే విధంగా సరైన భంగిమలో కూర్చోవాలి. బరువులు ఎక్కువగా ఎత్తకూడదు. బల్లమీద కాని, నేల మీద కాని పడుకోవాలి. నడుము నొప్పి రాకుండా ఉండటానికి సరైన పౌష్టికాహారం తీసుకుంటూ నిత్యం వ్యాయామం చేయాలి. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గించుకోవటానికి ఆహార నియమాలు పాటించాలి. చికిత్స: హోమియోపతి వైద్య విధానంలో ‘‘లాంబార్ స్పాండిలోసిస్’’కు పూర్తి ఉపశమనం కలిగించే మందులు ఉన్నాయి. అయితే ఈ విధానంలో కేవలం లక్షణాలు తగ్గించడం కాకుండా, లక్షణాలకు గల కారణాలు మరియు వ్యక్తి శారీరక, మానసిక తత్వాన్ని పూర్తిగా విశ్లేషించి వైద్యులు తగిన మందులు సూచిస్తుంటారు. సాధారణంగా బ్రయోనియా, రూటా, రస్టాక్స్, మాగ్‌ఫాస్, ఆర్నికా మొ॥మందులను నడుమునొప్పికి వాడుతుంటారు. అయితే వీటిని వాటి వాటి లక్షణాలకు అనుగుణంగా వైద్యుల సూచన మేరకే వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళి అంకిరెడ్డి (ఎం.డి హోమియో) స్టార్ హోమియోపతి. సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, నేరెడ్మెట్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, హన్మకొండ మరియు కర్నాటక అంతటా.. ఫోన్: 7416 102 102 www.starhomeo.com -
నడుంనొప్పి(లాంబార్ స్పాండిలోసిస్)
ఈ రోజులో చాలామందిని వేధిస్తున్న సమస్య నడుంనొప్పి (లాంబార్ స్పాండిలోసిస్). ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే లాంబార్ స్పాండిలోసిస్ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండానే వస్తోంది. యుక్త వయసులో ఉన్నవారు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం మారుతున్న జీవనశైలి. నడుంనొప్పే కదా అని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ సమస్య ఇంకా త్రీవమవుతుంది. అలాకాకుండా వ్యాధి తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది. కారణం: శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం 33 వెన్నుపూసలతో నిర్మితమైన వెన్నుముక. వెన్నెముకలోని ప్రతి రెండు వెన్ను-ఎముకల మధ్య మృదులాస్థితో నిర్మితమైన ‘డిస్క్’లు మనం వంగినా, లేచినా ఈ డిస్క్లే తోడ్పడతాయి. అయితే అసంబద్ధ భంగిమలలో ఎక్కువసేపు కూర్చోవడం, ఒకేచోట ఎక్కువ సమయం కదలకుండా కూర్చొని విధులు నిర్వర్తించడం, వంగి ఉండి త్రీవమైన శారీరక శ్రమ చేయడం, తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్ తగినంత లేకపోవటం మొదలగు కారణాల వల్ల నడుము ప్రాంతంలో ఉండే డిస్క్‌లు అరిగిపోవటం, పక్కకు తప్పుకోవటం, ఆస్టియోఫైట్స్ (అనవసరమైన ఎముక పెరుగుదల) ఏర్పడటంవల్ల నడుం నొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది. దీనినే ‘లంబార్ స్పాండిలోసిస్’ అంటారు. లక్షణాలు: నడుము నొప్పి తీవ్రంగా ఉండి, ఎటువైపు వంగినా, కూర్చున్నా, నడిచినా నొప్పి పెరుగుతుంది. డిస్క్‌లు పక్కకు జరిగినప్పుడు అక్కడి నుండి వెళ్లే నడుము మీదపడే ఒత్తిడి కారణంగా నొప్పి ఎడమ లేదా కుడి కాలికి వ్యాపించి బాధిస్తుంది. నొప్పితోపాటు ఒత్తిడి తీవ్రత ఎక్కువ ఉండే తిమ్మిర్లు కూడా వ్యాపిస్తుంటాయి. హఠాత్తుగా వంగినా, బరువులు ఎత్తినా, ఒక్కసారిగా తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. జాగ్రత్తలు నడుము నొప్పితో బాధపడేవారు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వీలైనంతగా విశ్రాంతి తీసుకోవాలి. కుర్చీలో కూర్చొన్నప్పుడు, వాహనం నడిపేటప్పుడు నడుము నిటారుగా ఉండే విధంగా సరైన భంగిమలో కూర్చోవాలి. బరువులు ఎక్కువగా ఎత్తకూడదు. చదరంగా ఉండేలా బల్లమీదకాని, నేలమీదకాని పడుకోవాలి. నడుమునొప్పి రాకుండా ఉండటానికి సరైన పౌష్టికారం తీసుకుంటూ నిత్యం వ్యాయామం చేయాలి. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గించుకోవటానికి ఆహార నియమాలు పాటించాలి. చికిత్స: హోమియోపతి వైద్యవిధానంలో ‘లాంబార్ స్పాండిలోసిస్’కు ఉపసమనం కలిగించే మందులు చాలా ఉన్నాయి. అయితే ఈ విధానంలో కేవలం లక్షణాలు తగ్గించటం వల్ల కాకుండా, లక్షణాలకు గల కారణాలతోబాటు వ్యక్తి శారీరక, మానసిక తత్వాన్ని పూర్తిగా విశ్లేషించి వైద్యులు తగిన మందులు సూచిస్తుంటారు. సాధారణంగా బ్రయోనియా, రూస్టాక్స్, రస్టాల్మ్, కోలోసింత్, హైపీరికం, మాగ్‌ఫాస్, ఆర్నికా మొదలగు మందులను నడుము నొప్పికి వాడుతుంటారు. అయితే వీటిని వాటి, వాటి లక్షణాలకనుగుణంగా వైద్యుల సూచన మేరకే వాడితేనే ఆయా వ్యాధులకి తగిన ఫలితం, ఉపశమనం లభిస్తాయి. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, హనుమకొండ, కర్ణాటక www.starhomeo.com ph: 8977 33 66 77