నడుంనొప్పి: హోమియోపతి చికిత్స | Back pain from relief with treatment of Lombardi Spandilosis | Sakshi
Sakshi News home page

నడుంనొప్పి: హోమియోపతి చికిత్స

Published Wed, Dec 3 2014 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

నడుంనొప్పి: హోమియోపతి చికిత్స

నడుంనొప్పి: హోమియోపతి చికిత్స

(లాంబార్ స్పాండిలోసిస్) ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య నడుంనొప్పి(లాంబార్ స్పాండిలోసిస్). ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే లాంబార్ స్పాండిలోసిస్ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండానే వస్తోంది. యుక్త వయసులో ఉన్నవారు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం మారుతున్న జీవనశైలి. నడుమునొప్పే కదా అని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. అలా కాకుండా వ్యాధి తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది.
 
 కారణం: శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం 33 వెన్నుపూసలతో నిర్మితమైన వెన్నెముక, వెన్నెముకలోని ప్రతి రెండు వెన్ను - ఎముకల మధ్య మృదులాస్థితో నిర్మితమైన ‘డిస్క్’లు మనం వంగినా, లేచినా ఈ డిస్క్‌లే తోడ్పడుతాయి. అయితే అసంబద్ధ భంగిమలలో ఎక్కువసేపు కూర్చోవడం, ఒకేచోట ఎక్కువ సమయం కదలకుండా కూర్చొని విధులు నిర్వర్తించటం, వంగి ఉండి తీవ్రమైన శారీరక శ్రమ చేయడం, తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్ డి తగినంత లేకపోవడం మొ॥లగు కారణాల వల్ల నడుము ప్రాంతంలో ఉండే డిస్క్‌లు అరిగిపోవడం, ప్రక్కకు తప్పుకోవడం ఆస్టియోపైట్స్ (అనవసరమైన ఎముక పెరుగుదల) ఏర్పడడం వల్ల నడుము నొప్పి సమస్య ఉత్పన్నమగును. దీనినే ‘‘లాంబార్ స్పాండిలోసిస్’’ అంటారు.
 లక్షణాలు: నడుము నొప్పి తీవ్రముగా ఉండి, ఎటువైపు వంగినా, కూర్చున్నా, నడిచినా నొప్పి పెరుగును. డిస్క్‌లు ప్రక్కకు జరిగినప్పుడు అక్కడి నుండి వెళ్ళే నాడులపై పడే ఒత్తిడి కారణంగా నొప్పి ఎడమ లేదా కుడి కాలుకు వ్యాపిం చి బాధిస్తాయి. నొప్పితో పాటు ఒత్తిడి తీవ్రత ఎక్కువైతే తిమ్మిర్లు కూడా వ్యాపిస్తూంటాయి.
 
  హఠాత్తుగా వంగినా, బరువులు ఎైతినా ఒక్కసారిగా తీవ్రమైన నొప్పులతో బాధపడుతూంటారు.
 జాగ్రత్తలు: నడుము నొప్పితో బాధపడే వారు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి.
  కుర్చీలో కూర్చొన్నప్పుడు, వాహనం నడిపేటప్పుడు నడుము నిటారుగా ఉండే విధంగా సరైన భంగిమలో కూర్చోవాలి.
  బరువులు ఎక్కువగా ఎత్తకూడదు.
  బల్లమీద కాని, నేల మీద కాని పడుకోవాలి.
  నడుము నొప్పి రాకుండా ఉండటానికి సరైన పౌష్టికాహారం తీసుకుంటూ నిత్యం వ్యాయామం చేయాలి. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గించుకోవటానికి ఆహార నియమాలు పాటించాలి.
 చికిత్స: హోమియోపతి వైద్య విధానంలో ‘‘లాంబార్ స్పాండిలోసిస్’’కు పూర్తి ఉపశమనం కలిగించే మందులు ఉన్నాయి. అయితే ఈ విధానంలో కేవలం లక్షణాలు తగ్గించడం కాకుండా, లక్షణాలకు గల కారణాలు మరియు వ్యక్తి శారీరక, మానసిక తత్వాన్ని పూర్తిగా విశ్లేషించి వైద్యులు తగిన మందులు సూచిస్తుంటారు. సాధారణంగా బ్రయోనియా, రూటా, రస్టాక్స్, మాగ్‌ఫాస్, ఆర్నికా మొ॥మందులను నడుమునొప్పికి వాడుతుంటారు. అయితే వీటిని వాటి వాటి లక్షణాలకు అనుగుణంగా వైద్యుల సూచన మేరకే వాడాల్సి ఉంటుంది.
 
 డాక్టర్ మురళి అంకిరెడ్డి (ఎం.డి హోమియో) స్టార్ హోమియోపతి. సికింద్రాబాద్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, నేరెడ్‌మెట్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, హన్మకొండ మరియు
 కర్నాటక అంతటా.. ఫోన్: 7416 102 102 www.starhomeo.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement