ఈ రోజులో చాలామందిని వేధిస్తున్న సమస్య నడుంనొప్పి (లాంబార్ స్పాండిలోసిస్). ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే లాంబార్ స్పాండిలోసిస్ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండానే వస్తోంది. యుక్త వయసులో ఉన్నవారు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం మారుతున్న జీవనశైలి. నడుంనొప్పే కదా అని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ సమస్య ఇంకా త్రీవమవుతుంది. అలాకాకుండా వ్యాధి తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది.
కారణం: శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం 33 వెన్నుపూసలతో నిర్మితమైన వెన్నుముక. వెన్నెముకలోని ప్రతి రెండు వెన్ను-ఎముకల మధ్య మృదులాస్థితో నిర్మితమైన ‘డిస్క్’లు మనం వంగినా, లేచినా ఈ డిస్క్‌లే తోడ్పడతాయి. అయితే అసంబద్ధ భంగిమలలో ఎక్కువసేపు కూర్చోవడం, ఒకేచోట ఎక్కువ సమయం కదలకుండా కూర్చొని విధులు నిర్వర్తించడం, వంగి ఉండి త్రీవమైన శారీరక శ్రమ చేయడం, తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్ తగినంత లేకపోవటం మొదలగు కారణాల వల్ల నడుము ప్రాంతంలో ఉండే డిస్క్‌లు అరిగిపోవటం, పక్కకు తప్పుకోవటం, ఆస్టియోఫైట్స్ (అనవసరమైన ఎముక పెరుగుదల) ఏర్పడటంవల్ల నడుం నొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది. దీనినే ‘లంబార్ స్పాండిలోసిస్’ అంటారు.
లక్షణాలు: నడుము నొప్పి తీవ్రంగా ఉండి, ఎటువైపు వంగినా, కూర్చున్నా, నడిచినా నొప్పి పెరుగుతుంది. డిస్క్‌లు పక్కకు జరిగినప్పుడు అక్కడి నుండి వెళ్లే నడుము మీదపడే ఒత్తిడి కారణంగా నొప్పి ఎడమ లేదా కుడి కాలికి వ్యాపించి బాధిస్తుంది. నొప్పితోపాటు ఒత్తిడి తీవ్రత ఎక్కువ ఉండే తిమ్మిర్లు కూడా వ్యాపిస్తుంటాయి.
హఠాత్తుగా వంగినా, బరువులు ఎత్తినా, ఒక్కసారిగా తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు.
జాగ్రత్తలు
నడుము నొప్పితో బాధపడేవారు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వీలైనంతగా విశ్రాంతి తీసుకోవాలి.
కుర్చీలో కూర్చొన్నప్పుడు, వాహనం నడిపేటప్పుడు నడుము నిటారుగా ఉండే విధంగా సరైన భంగిమలో కూర్చోవాలి.
బరువులు ఎక్కువగా ఎత్తకూడదు.
చదరంగా ఉండేలా బల్లమీదకాని, నేలమీదకాని పడుకోవాలి.
నడుమునొప్పి రాకుండా ఉండటానికి సరైన పౌష్టికారం తీసుకుంటూ నిత్యం వ్యాయామం చేయాలి. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గించుకోవటానికి ఆహార నియమాలు పాటించాలి.
చికిత్స: హోమియోపతి వైద్యవిధానంలో ‘లాంబార్ స్పాండిలోసిస్’కు ఉపసమనం కలిగించే మందులు చాలా ఉన్నాయి. అయితే ఈ విధానంలో కేవలం లక్షణాలు తగ్గించటం వల్ల కాకుండా, లక్షణాలకు గల కారణాలతోబాటు వ్యక్తి శారీరక, మానసిక తత్వాన్ని పూర్తిగా విశ్లేషించి వైద్యులు తగిన మందులు సూచిస్తుంటారు.
సాధారణంగా బ్రయోనియా, రూస్‌టాక్స్, రస్టాల్మ్, కోలోసింత్, హైపీరికం, మాగ్‌ఫాస్, ఆర్నికా మొదలగు మందులను నడుము నొప్పికి వాడుతుంటారు. అయితే వీటిని వాటి, వాటి లక్షణాలకనుగుణంగా వైద్యుల సూచన మేరకే వాడితేనే ఆయా వ్యాధులకి తగిన ఫలితం, ఉపశమనం లభిస్తాయి.
డాక్టర్ మురళి అంకిరెడ్డి,
ఎం.డి (హోమియో),
స్టార్ హోమియోపతి,
సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి,
విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ,
రాజమండ్రి, హనుమకొండ, కర్ణాటక
www.starhomeo.com
ph: 8977 33 66 77
నడుంనొప్పి(లాంబార్ స్పాండిలోసిస్)
Published Sun, Nov 17 2013 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM
Advertisement