Waist pain
-
రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్.. బీసీసీఐ కీలక అప్డేట్
వెస్టిండీస్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. వెన్నునొప్పితో బాధపడిన రోహిత్ 11 పరుగుల వద్ద ఉన్నప్పుడు రిటైర్డ్‌హర్ట్‌గా క్రీజును వదిలాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ అల్జారీ జోసెఫ్ బౌలింగ్ చేయగా.. మొదటి బంతికి రోహిత్ శర్మ సిక్స్ బాదాడు. రెండో బంతి డాట్ కాగా.. మూడో బంతికి ఫోర్ బాదాడు. ఇక నాలుగో బంతి అనంతరం అసౌకర్యంగా కనిపించిన రోహిత్.. వెన్నునొప్పితో అల్లాడిపోయాడు. లెగ్ సైడ్ స్వీప్ షాట్ కొట్టడానికి ప్రయత్నించిన రోహిత్‌కు వీపు కండరాలు పట్టేశాయి. టీమిండియా ఫిజియో కమలేష్ జైన్ వచ్చి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది.దీంతో హిట్‌మ్యాన్ రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. కాగా రోహిత్ శర్మ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. 'టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రస్తుతం వెన్ను నొప్పి ఉంది. అతని పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. మిగతా టి20 మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడా అనేది ఇప్పుడే చెప్పలేం' అని ట్వీట్ చేసింది. కాగా మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. 'ప్రస్తుతానికి ఫర్వాలేదు. నాలుగో టీ20 మ్యాచుకు కొన్ని రోజుల సమయం ఉంది. అప్పటివరకు గాయం పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి' అని తెలిపాడు. ఒకవేళ నాలుగో టి20 వరకు రోహిత్‌కు గాయం తగ్గినా.. కీలకమైన ఆసియా కప్ ఉన్న నేపథ్యంలో బీసీసీఐ అతడికి విశ్రాంతిని ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ హిట్‌మ్యాన్ గాయం పెద్దది అయితే మాత్రం 3-5 వారాల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే రోహిత్ శర్మ ఆసియా కప్‌కు దూరం కానున్నాడు. చదవండి: IND Vs WI 3rd T20: సూర్యకుమార్ మెరుపులు.. మూడో టి20లో భారత్ ఘన విజయం India T20I Chasing Record: లక్ష్య ఛేదనలో టీమిండియా కొత్త రికార్డు.. -
నడుం నొప్పికి యోగా మందు!
మన చుట్టూ ఉన్న వారిలో కనీసం సగం మందికి నడుం నొప్పి సమస్య ఉండే ఉంటుంది. అటు ఇటూ కదల్లేనంత తీవ్రస్థాయిలో కొందరిని బాధిస్తూంటే.. మిగిలిన వారిలో నొప్పి తక్కువగా ఉండవచ్చు. అయితే వీరందరూ పెయిన్ కిల్లర్లను వాడటం కంటే యోగాను నమ్ముకోవడం మేలని అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ శాస్త్రవేత్తలు. యోగాతోపాటు కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీలను వాడటం వల్ల నొప్పిని గుర్తించే పరిస్థితి రాదని వీరు అంటున్నారు. కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తలను రెండు గుంపులుగా విడగొట్టి తాము ప్రయోగాలు నిర్వహించామని.. రోజూ రెండు గంటలపాటు మైండ్‌ఫుల్‌నెస్ బేస్డ్ స్ట్రెస్ రిడక్షన్ (ఎంబిఎస్‌ఆర్) అనే పద్ధతిలో భాగంగా యోగా ప్రాక్టీస్, కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) చేపట్టామని... 26 వారాల తరువాత రెండు వర్గాల్లోని 60 శాతం మంది తమ నడుం నొప్పి చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గినట్లు చెప్పారని శాస్త్రవేత్తలు తెలిపారు. 1979లో యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఎంబిఎస్‌ఆర్ పద్ధతిని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 ఆసుపత్రుల్లో ఉపయోగిస్తున్నారని, ఆన్లైన్ ద్వారా కూడా ఈ పద్ధతి అందుబాటులో ఉందని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. -
ఈ వయసులోనూ పూర్తి ఫిట్నెస్తో ఉండటం ఎలా?
లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ నా వయసు 57 ఏళ్లు. గతంలో చాలా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేవాడిని. వయసు పెరిగిన ఫీలింగ్ కూడా ఉండేది కాదు. అయితే ఇటీవల నా ఫిట్నెస్ తగ్గినట్లుగా అపినిస్తోంది. నాలో మునుపటి ఉత్సాహం, చురుకుదనం కనిపించడం లేదు. నేను ఇదివరకటి మాదిరిగానే ఫిట్నెస్ పొందాలంటే ఏం చేయాలి? – డి. వేణు, విజయవాడ వయసు పెరుగుతున్న సమయంలో ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ముందుగా మీరు చేయాల్సింది... మీకు డయాబెటిస్ లేదా హైబీపీ ఉంటే దాన్ని అదుపులో పెట్టుకోవడం. ఇలాంటి వారు తమ డయాబెటిస్ లేదా హైబీపీలకు సంబంధించిన మందులు వాడుతూ, మంచి ఆహారం తీసుకంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. మీరు ఏ వయసువారైనప్పటికీ మీ వయసుకు తగిన వ్యాయామం అవసరం. దానితో ఎప్పుడూ మంచి ప్రయోజనాలు పొందవచ్చు. వ్యాయమంతో గుండెజబ్బులు, మతిమరపు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, అధికరక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యలను నివారించుకోవచ్చు. ఎముకల సాంద్రత తగ్గడం కూడ నివారితమవుతుంది. దాంతో వయసు పైబడ్డవారు పడిపోయే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ పడిపోయినప్పుడు ఎముకల విరిగే అవకాశమూ తగ్గుతుంది. పైగా వ్యాయామం చేసేవారిలో ఎండార్ఫిన్ వంటి జీవరసాయనాలు ఎక్కువగా స్రవించి ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు అవి దిగులుగా ఉండటం, యాంగై్జటీ, డిప్రెషన్‌ను కూడా రాకుండా నివారిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. అయితే కాస్త వయసుపైబడ్డవారు వ్యాయామాన్ని ప్రారంభించే ముందుగా డాక్టర్ నుంచి తగిన సలహా పొందాలి. వారి వ్యక్తిగత రుగ్మతలకూ, జీవనశైలికి తగిన వ్యాయామ విధానాల గురించి డాక్టర్ నుంచి సూచనలు పొందాలి. ఉదాహరణకు డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు తాము తీసుకుంటున్న మందులు, ఆహారానికి తగినట్లుగా తమ వ్యాయామరీతులూ, వేళల గురించి డాక్టర్ నుంచి సలహా పొందడం అవసరం. పైగా వ్యాయామాన్ని కొత్తగా మొదలుపెట్టేవారు భారమైన పెద్దపెద్ద వ్యాయామాలను ఒకేసారి ప్రారంభించకూడదు. వ్యవధినీ, శరీరం మీద పడే భారాన్ని మెల్లమెల్లగా పెంచాలి. రోజులో రెండుసార్లు వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం వల్ల అయ్యే గాయాలను నివారించడానికి ఎక్సర్సైజ్కు ముందుగా వార్మింగ్ అప్, తర్వాత కూలింగ్ డౌన్ వ్యాయామాలు చేయడం మేలు. వ్యాయామం మనల్ని మరింత చురుగ్గా ఉండేలా చేయాలి. అంతేతప్ప నిస్సత్తువను పెంచకూడదు. వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పులు పెరిగినా, ఒంట్లో ఎక్కడైనా ఎర్రబారినా, శ్వాస అందకపోయినా, చెమటలు ఎక్కువగా పట్టినా, ఇతరత్రా ఇబ్బందులు ఎదురైనా వెంటనే వ్యాయామం ఆపేయాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్సనూ, సలహాలు, సూచనలను పొందాలి. ఎప్పుడూ తీవ్రమైన అలసట.. తగ్గేదెలా? ఇటీవల నేను ఎప్పుడు చూసినా బాగా నీరసంగా కనిపిస్తున్నాను. పనిలో త్వరత్వరగా అలసిపోతున్నాను. కొద్దిగా నడుము నొప్పి కూడా వస్తోంది. మాది ఎనిమిది గంటల షిఫ్ట్. నేను డబుల్ డ్యూటీలు చేస్తుంటాను. వరసగా రెండో షిఫ్ట్ కూడా పనిచేయడం వల్ల ఇలా జరుగుతోందా? నా సమస్య తీరే మార్గం సూచించండి. – ఎల్. రామ్‌కుమార్, విశాఖపట్నం మీలా డబుల్ షిఫ్ట్ పనిచేసేవారిలో తీవ్రమైన అలసట, బాగా ఒత్తిడికి లోనైనట్లు అనిపించడం చాలా సాధారణం. పన్నెండు గంటల కంటే ఎక్కువసేపు (ఒకే స్ట్రెచ్‌లో) పనిచేసేవారిలో మీలా వృత్తిపరమైన అలసట వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇలా పనిచేసేవారిలో తీవ్రమైన అలసటతో పాటు కండరాల నొప్పులు, నడుమునొప్పితో పాటు చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర వృత్తిసంబంధ సమస్యలూ రావచ్చు. మీలాంటి వారు అలసటతో పాటు, వృత్తిసంబంధమైన ఇతర సమస్యలను నివారించేందుకు ఈ సూచనలు పాటించండి. ∙పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. సిగరెట్ పొగలో కార్బన్‌మోనాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అది రక్తకణాల్లో ఆక్సిజన్‌ను మోసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గించి, వెంటనే అలసిపోయేలా చేస్తుంది. ∙చాలాసేపు కూర్చొని పనిచేసేవారైతే కొద్దికొద్దిసేపటి తర్వాత కాస్తంత కదులుతూ, కొంత నడుస్తూ ఉండండి. శరీరానికి కదలికలు ఉండేలా తప్పనిసరిగా వ్యాయామం చేయండి. అదేపనిగా కూర్చోవడం వల్ల కూడా అలసిపోతారు. ∙మీ ఉద్యోగంలో ఏదైనా సమస్యల ఉన్నా లేదంటే టార్గెట్స్ రీచ్ కావాల్సిన వృత్తిలో ఉన్నా అలసటకు లోనవుతారు. తీవ్రమైన ఒత్తిడికి గురికాకండి. మీ సమస్యలను ఇంటికి మోసుకెళ్లకండి. ∙మీరు పనిచేసే చోట కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే, రోజూ రెండు కప్పుల పరిమితికి మించి తాగకండి. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికివెళ్లే సమయంలో కాఫీ అస్సలు తాగవద్దు. ∙తగినంతగా నిద్రపొండి. కనీసం రోజూ ఎనిమిదిగంటల పాటు నిద్రపోవాలి. ∙ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ∙భోజనవేళలను కచ్చితంగా పాటించండి. భోజనం మానేసి పనిచేయకండి. ఇలా చేస్తే రక్తంలో చక్కెరపాళ్లు తగ్గిపోయి త్వరగా, తేలిగ్గా అలసిపోతారు. ∙ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల మీరు డీ–హైడ్రేషన్‌కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేయగలుగుతారు. ఈ సూచనలు పాటించాక కూడా మీరు ఇంకా అలసటతోనూ, నడుంనొప్పితో బాధపడుతుంటే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి. ఆరోగ్యకరంగా బరువు పెరిగిలావెక్కాలి... ఎలా? నా వయసు 23 ఏళ్లు. చాలామందిది ఒకలాంటి సమస్య అయితే నాది మరోరకం సమస్య. నేను చూడటానికి చాలా సన్నగా ఉంటాను. నా ఎత్తు ఐదడుగుల పది అంగుళాలు. బరువు కేవలం 47 కేజీలు మాత్రమే. గడకర్రలా కనిపిస్తున్నావంటూ చాలామంది నన్ను ఎగతాళి చేస్తుంటారు కూడా. నేను ఆరోగ్యకరంగా లావు పెరగడానికి సలహాలు ఇవ్వండి. ఏమైనా మందులున్నాకూడా సూచించండి. – ఎన్. ప్రసాద్, ఏలూరు కొందరు బరువు పెరగకపోవడానికి సాధారణ కారణాలు ఇవి... ∙జన్యుపరమైనవి ∙సరిగా తినకపోవడం ∙చాలా తీవ్రమైన శారీరక శ్రమ ఉన్న వృత్తిలో ఉండటం ∙అవి వ్యాయామం. ఈ సమస్యలే గాక ఇక ఆరోగ్యపరంగా కొందరికి ఆహారం తీసుకోవడం విషయంలో వైద్యపరమైన రుగ్మతలు (ఈటింగ్ డిజార్డర్స్) ఉండటంతో కూడా బరువు పెరగరు. మీ విషయంలో సమస్య ఏమిటో తెలుసుకోడానికి ముందుగా వైద్యుడిని కలవండి. డాక్టరు మిమ్మల్ని పరీక్షించి... ∙మీలో ఏదైనా జన్యుపరమైన సమస్య ఉందేమో తెలుసుకోడానికి తగిన పరీక్షలు చేయించి వాటిని నిర్ధారణ చేస్తారు (ఉదా: ౖహె పర్ థైరాయిడిజమ్) ∙మీరు తినే ఆçహారంలో పోషకాలు పాళ్లు ఎలా ఉన్నాయో అన్నదానితో పాటు మీ శారీరక శ్రమ తీరుతెన్నులను అడిగి తెలుసుకుంటారు. ∙ఆ తర్వాత ఆరోగ్యకరంగా బరువు పెరిగేందుకు మీరు తీసుకోవాల్సిన ఆహారం, చేయాల్సిన వ్యాయామాల గురించి వివకరిస్తారు. ఇందుకు కొన్ని సూచనలు: ∙మీరు ఇప్పుడు తీసుకుంటున్న పరిమాణం కంటే పెద్ద పరిమాణాల్లో కనీసం మూడుసార్లయినా ఆహారం తీసుకోండి. మధ్యలో చిన్న పరిమాణాల్లో మరో మూడుసార్లు తినండి. ఇలా రోజుకు ఆరుసార్లు తినండి ∙ ఆహారంలో ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి. అవి కండరాల పెరుగుదలకు దోహదపడతాయి. కేవలం ఆరోగ్యకరమైన ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి లేకపోతే మీరు అతిగా తీసుకునే ప్రోటీన్ మీ అంతర్గత అవయవాలపై ప్రభావం చూపుతుంది. (ముఖ్యంగా కిడ్నీలు). అందుకే హైప్రోటీన్ డైట్ వద్దు ∙మీ ఆహారంలో పండ్లు, పెరుగు, కస్టర్డ్, మిల్క్‌షేక్‌లు నిత్యం ఉండేలా చూసుకోండి ∙ఆరుసార్లు తినే ఆహారంలో అతిగా కొవ్వులు, పోషకాలు లేకుండా ఉండే జంక్‌ఫుడ్ లేకుండా జాగ్రత్త తీసుకోండి ∙ఇక నట్స్ ఎక్కువగా తీసుకోండి ∙వెన్న, ఆల్మండ్, వేరుశెనక్కాయలు, డ్రై ఫ్రూట్స్ మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి ∙మీరు వాడే నూనెకు బదులు ఆరోగ్యకరమైన ఆలివ్ ఆయిల్‌ను వాడండి ∙అతి వ్యాయామం కాకుండా పరిమితమైన వ్యాయామం తప్పక చేయండి. మీ వ్యాయామాలు ఎలా ఉండాలంటే అతిగా చేసి కొద్దిసేపట్లో ముగిసేలా కాకుండా, మెల్లగా చేస్తూ... చాలాసేపు కొనసాగేలా జాగ్రత్తపడండి. బరువు పెరగడానికి ఉపయోగపడతాయంటూ న్యూస్పేపర్లలో, టీవీల్లో కనిపించే ప్రకటనలలోని పౌడర్ల జోలికి వెళ్లకండి. పరిమితమైన కొవ్వులు శరీర జీవకార్యకలాపాలకు అవసరం. అంతమేరకు మాత్రమే కొవ్వులు పెరిగేలా ముందుగా మీరు ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇక మీరు బరువు పెరిగే క్రమం కూడా చాలా మెల్లగా జరగాలి. అంతే తప్ప అకస్మాత్తుగా కాదు. డాక్టర్ సుధీంద్ర ఊటూరి, లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్, సికింద్రాబాద్ -
బైక్ మీద.. కార్లో..కంప్యూటర్ ముందు.. కంఫర్టబుల్‌గా కూర్చోండి
లైఫ్‌స్టయిల్ కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. బైక్‌పై ఎక్కువగా తిరుగుతుంటాను. నాకు తీవ్రమైన నడుం నొప్పి వస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – జి. సుధాకర్, హైదరాబాద్ ఈ వయసులో నడుం నొప్పి అంత సాధారణం కాదు కాబట్టి బైక్ నడపడంలో మీరు అనుసరిస్తున్న కొన్ని అంశాల వల్ల ఈ నొప్పి వస్తుండవచ్చు. సాధారణంగా బైక్‌ల తయారీదారులు హ్యాండిల్‌బార్స్, ఫుట్‌రెస్ట్ వంటి అంశాల్లో కొన్ని ప్రమాణాలను పాటిస్తుంటారు. మీ బైక్ ఆ ప్రమాణాలకు అనుగుణంగా తయారైనదైతే మంచిదే. వాటిని అనుసరించడం వల్ల కొన్ని అవయవ సమస్యలు రావు. ఒకవేళ మీ బైక్‌లోని వివిధ అంశాలు సరైన ప్రమాణాలు లేకపోతే వాటివల్లనే మీకు నడుము నొప్పి వస్తోందని భావించాలి. మీరు మీ బైక్ విషయంలో ఈ కింద పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు పాటించండి.బైక్‌ల హ్యాండిల్స్ సాధారణంగా తగినంత విశాలంగా, రెండు చేతులు బాగా పట్టుకోవడానికి వీలైనంత నిడివితో ఉండాలి. పొట్టిగా ఉండే షార్ట్‌హ్యాండిల్స్ వల్ల ఒంటిపై భారం పడి శరీరభాగాల్లో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ.మనం కాళ్లు పెట్టుకునే ఫుట్‌రెస్ట్ మన శరీరానికి మరీ దూరంగా ఉండకూడదు. దీనివల్ల కాళ్లు సాగినట్లుగా అయిపోయి నడుముపై భారం ఎక్కువగా పడుతుంది. దాంతో నడుమునొప్పి రావచ్చు.బైక్‌పై కూర్చొనే సమయంలో వీపు భాగమంతా నిటారుగా ఉండి, మన వెన్ను ఒంగకుండా ఉండాలి. సాధారణ బైక్‌ల నిర్మాణం ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని స్పోర్ట్స్ బైక్‌లలో సీట్లు ఏటవాలుగా ఉండి, మనం కూర్చొనే భంగిమ వాలుగా ఉండేలా నిర్మితమై ఉంటాయి. దాంతో ముందుకు వాలినట్లుగా కూర్చోవాల్సి వస్తుంది. ఇలా వాలిపోయినట్లుగా కూర్చొనేలా రూపొందించిన ఫ్యాషన్ బైక్స్ వల్ల మన వెన్ను నిటారుగా నిలపలేకపోవడంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. బైక్‌లపై వెళ్లేవారు వీపుపై ఉండే బ్యాగ్స్ (బ్యాక్‌ప్యాక్స్) పెట్టుకొని వెళ్తుండటం సాధారణం. ఈ భారం నడుంపైనా భారం పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. ఇలాంటివారు ఆ బ్యాగ్ భారం వీపుపై కాకుండా సీట్‌పై పడేలా చూసుకోవాలి. మీ బైక్‌లో పైన పేర్కొన్న భాగాల అమరిక, మీరు కూర్చొనే భంగిమ ఎలా ఉందో పరీక్షించుకొని, లోపాలు ఉన్నట్లయితే సరిచేసుకోండి. మీ నొప్పి దూరం కావచ్చు. అప్పటికీ నడుం నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించండి. నేను ఇంతకుముందు బైక్ నడుపుతుండే వాణ్ణి. కొన్నాళ్ల తర్వాత తీవ్రమైన నడుము నొప్పి వచ్చింది. కారు ఉపయోగించమని డాక్టర్ సలహా ఇచ్చారు. నాకు ఉన్న సమస్య నేపథ్యంలో కారు డ్రైవింగ్‌లో సీటింగ్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు పాటించాలా? – పి. రవికుమార్, విశాఖపట్నం నడుమునొప్పికి టూవీలర్ డ్రైవింగ్ ఎలా కారణమవుతుందన్న అంశంపై చాలా అధ్యయనాలు ఉన్నాయి. అయితే కారు డ్రైవ్ చేసేవారిలోనూ నడుమునొప్పి వంటి సమస్యలు వస్తాయని ఒక స్వీడిష్ అధ్యయనం పేర్కొంటోంది. అందుకే కారు డ్రైవింగ్ సమయంలోనూ సీట్లో కూర్చునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి...∙మీ కాళ్ల పొడవుకు అనుగుణంగా సీట్‌ను మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి ∙ మీ ఎత్తునకు అనుగుణంగా సీట్ ఎత్తును అడ్జెస్ట్ చేసుకోవాలి ∙మీ సీట్‌ను నిటారుగా ఉంచేలా చూసుకోవాలి లేదా అది మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా సీట్ ఒంచాలి. ఆ సీట్ ఒంపు ఎంత అవసరం అని తెలియాలంటే ఒకటే కొండగుర్తు... ఆ ఒంపు మీ నడుము మీదగానీ మీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా ఉండాలి ∙ మీ నడుము దగ్గర ఉండే ఒంపు (లంబార్) భాగంలో ఒక కుషన్ ఉంచుకోవాలి. ఆ లంబార్ సపోర్ట్ వల్ల నడుమునొప్పి చాలావరకు తగ్గుతుంది ∙ మెడ మీద ఒత్తిడి పడని విధంగా మీ హెడ్రెస్ట్ ఉండాలి ∙ సీట్లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ మీ పొజిషన్ కాస్త మారుస్తూ ఉండాలి ∙ అదేపనిగా డ్రైవ్ చేయకుండా మధ్య మధ్య కాస్త బ్రేక్ తీసుకుంటూ ఉండండి ∙ ఇక డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మీకు అన్ని విధాలా మేలు చేస్తుందని గుర్తించండి. ఆఫీసులోకి వచ్చాక నేను నా కంప్యూటర్ ముందు కూర్చున్నాననంటే మళ్లీ సాయంత్రం వరకూ లేవను. అయితే అంతంతసేపు కూర్చొనే ఉండటం మంచిది కాదని ఫ్రెండ్స్ అంటున్నారు. వాళ్ల మాటలతో నాలో ఆందోళన పెరుగుతోంది. వారనేది వైద్యపరంగా కరక్టేనా? – మంజీర, గుంటూరు కూర్చొని పనిచేసే వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా కూర్చొనే ఉండటం చాలా ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని అనేక పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఇలా సుదీర్ఘకాలం పాటు కూర్చొనే ఉండటం అన్నది టైప్–2 డయాబెటిస్, ప్రాణాంతకమైన గుండెజబ్బులు, కొన్నిరకాల క్యాన్సర్లకూ కారణమవుతుంది. కూర్చునే వృత్తుల్లో ఉన్నా లేదా ప్రయాణాలు చేసే వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా సీట్లో చాలాసేపు కూర్చోవడం, లేదా టీవీని వదలకుండా చూస్తూ కూర్చోవడం, వృత్తిపరంగా బైక్‌మీద చాలాసేపు కూర్చొనే ప్రయాణం చేస్తూ ఉండటం వంటి అనేక అంశాలు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. పొగతాగడం వంటి దురలవాటు ఎంత దుష్ప్రభావం చూపుతుందో, ఇలా కూర్చొనే ఉండటం అన్న అంశం కూడా అంతకంటే ఎక్కువ దుష్ప్రభావమే చూపుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించిన వాస్తవం. ప్రతివారు రోజూ కనీసం 30 – 45 నిమిషాల పాటు వాకింగ్ చేయడం అవసరం. పిల్లలు ఎక్కువగా టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్‌లో నిమగ్నం కావడం అనే కారణాలతో అదేపనిగా కూర్చొనే ఉంటారు. ఇక పెద్దలు తమ ఆఫీసు పనుల్లో మునిగిపోయి కూర్చొనే ఉంటారు. కొన్ని సూచనలు ∙అదేపనిగా కూర్చోవడాన్ని బ్రేక్ చేయడం కోసం ఈ కింది సూచనలు పాటించాలి ∙మీ బెడ్రూమ్స్లో టీవీ / కంప్యూటర్ / ల్యాప్‌టాప్ లను ఉపయోగించకండి ∙మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒంటికి పనిచెప్పే ఏదో పనిని ఎంచుకోండి ∙పిల్లలకు మీరు ఇచ్చే బహుమతుల్లో పిల్లలకు శారీరక ఆరోగ్యం చేకూర్చే బంతులు / ఆటవస్తువుల వంటివి ఉండేలా చూసుకోండి ∙మీరు ఆఫీసుకు వచ్చే ముందర లోకల్ బస్సుల్లో, లోకల్ ట్రైన్స్‌లో ప్రయాణం చేసేవారైతే ఆ టైమ్‌లో కూర్చుని ప్రయాణం చేయకండి ∙ఎస్కలేటర్ వంటి సౌకర్యం ఉన్నా మెట్లెక్కండి ∙రోజూ కనీసం 30 నిమిషాలు నడవాలని నియమం పెట్టుకోండి ∙మీ వర్క్ ప్లేస్‌తో ఫోన్లో మాట్లాడేటప్పుడు అటూ ఇటూ నడుస్తూ మాట్లాడండి ∙మీ పనిలో కాసేపు కాఫీ లేదా టీ బ్రేక్ తీసుకోండి ∙మీకు దగ్గరి కొలీగ్స్‌తో మాట్లాడాల్సి వస్తే మొబైల్ / మెయిల్ ఉపయోగించకండి. వారి వద్దకే నేరుగా వెళ్లి మాట్లాడంyì ∙టీవీ చూడటం కంటే మంచి హాబీని పెంపొందించుకోండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి, లైఫ్‌స్టైల్ నిపుణులు, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
నడుమునొప్పిని నివారించే ఆహారం...
గుడ్‌ఫుడ్ వెన్ను ఆరోగ్యానికి తగినంత వ్యాయామంతో పాటు పోషకాహారం కూడా అవసరమే. ఆ ఆహారం ఎన్నో గాయాలను త్వరగా మాన్పి... వెన్నునొప్పులను నివారిస్తుంది. ఆ పోషకాలివి. కాల్షియమ్: ఆహారంలో కాల్షియమ్ పుష్కలంగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. పాలు, పెరుగు, వెన్నతో పాటు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, చేపలలో క్యాల్షియమ్ ఎక్కువ. విటమిన్ డి3 : మన ఒంట్లోకి వచ్చే క్యాల్షియమ్ ఎముకల్లోకి ఇంకేలా చేసి, వాటి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో విటమిన్–డి అద్భుతమైన భూమిక పోషిస్తుంది. స్వాభావికమైన ఎండతో పాటు చేపలు, కాలేయం, గుడ్డు వంటి ఆహారాల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. విటమిన్–సి : చిగురు ఎముకలో ఉండే కొలెజెన్ వంటివి ఏర్పరచడం లోనూ, ఎముకలు, కండరాలు, చర్మం, టెండన్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో విటమిన్–సిది ప్రధాన పాత్ర. నిమ్మజాతి పండ్లతో పాటు జామ, టొమాటో, కాప్పికమ్లలో ఇది ఎక్కువ. ఇక గాయాలను మాన్పడం: దెబ్బతిన్న భాగాల రిపేర్ కోసం మాంసం, పప్పు వంటి ప్రోటీన్లు తీసుకోవాలి. విటమిన్–బి12 : అన్ని రకాల చేపలు, మాంసంతో పాటు తాజా పండ్లు, ఆకుకూరలు, పౌల్ట్రీ ఉత్పాదనల్లో బిటమిన్–బి 12 పాళ్లు ఎక్కువ. -
నడుము అరుస్తోందా?!
నొప్పి ఒక అరుపు... శరీరం పెడుతున్న కేక. జాగ్రత్త.. జాగ్రత్త అని చేస్తున్న హెచ్చరిక. ‘లిమిట్ క్రాస్ అవొద్దు.. ప్రాబ్లం పెద్దదౌతుంది..చెప్పిన మాట విను... అది నీ మంచి కోసమే’ అని మైండ్.. బాడీకి ఇస్తున్న సిగ్నల్. నడుము నొప్పి ప్రాణం తీసేది కాదు... కానీ ప్రాణం తీసేంత నొప్పి. కొన్ని సూచనలు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. అక్కచెల్లెళ్లూ... మీరెంతో చురుగ్గా, చలాకీగా ఉంటారు. మహిళల్లో నడుమునొప్పి... నడుమునొప్పి చాలా సాధారణంగా కనిపించే సమస్య. కానీ మహిళల్లో ఇది మరింత ఎక్కువ. రోజంతా నిలబడి వంట చేసే సమయంలో నడుము ఒంచి ఉండటం నడుమునొప్పి ముప్పును పెంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా నడుమునొప్పి తీవ్రత విషయంలో పురుషులు, మహిళలల్లో తేడాలు ఉంటాయి. భారత్‌లో పురుషుల్లో 18 శాతం మంది నడుమునొప్పితో బాధపడుతుంటే మహిళల్లో అది 25 శాతం. పైగా మహిళల్లోని రుతుస్రావం నొప్పి వారి నడుమునొప్పిని మరింత ప్రభావితం చేస్తుంది. అంతేకాదు... వారిలో ప్రత్యేకంగా స్రవించే హార్మోన్లు సైతం నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంటాయి. పురుషుల్లో కంటే మహిళల్లో ఇన్ఫ్లమేషన్ (నొప్పి, వాపు, మంట)కు స్పందించడం కాస్తంత తీవ్రంగా ఉంటుంది. ఒకేలాంటి నొప్పి అయినా మగవారితో పోలిస్తే మహిళల్లో ఆ నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. హార్మోన్లు, జన్యువులు, మనస్తత్వం, నొప్పి తెలిసే వ్యవస్థ వంటివి పరిగణనలోకి తీసుకున్నప్పుడు మహిళల్లో నడుము నొప్పి తీవ్రత ఎక్కువే. అందుకే మహిళల్లో వివిధ కారణాల వల్ల కనిపించే నడుము నొప్పులు, వాటి పరిష్కారాలను చూద్దాం. నడుమునొప్పుల్లో కొన్ని... టెయిల్‌బోన్ పెయిన్ : సరిగ్గా మనం కూర్చొనే చోటికి కాస్త పైనా, నడుమునకు కాస్త కింద నొప్పి రావడాన్ని టెయిల్‌బోన్ పెయిన్‌గా చెప్పవచ్చు. అంటే సరిగ్గా వెన్ను చివరి ఎముక దగ్గర నొప్పి రావడం. దీన్ని ‘కాక్సిడైనియా’ అంటారు. ఇది పురుషుల్లో కంటే మహిళల్లో ఐదు రెట్లు ఎక్కువ. ఇక మహిళల్లో గర్భధారణ అనే అంశం కాక్సిడైనియా ముప్పును పెంచుతుంది. కంప్రెషర్ ఫ్రాక్చర్ : వెన్నెముకల్లో ఎముక విరిగినప్పుడు వచ్చే నొప్పి. వెన్నెముక అనేది వెన్నుపూసలు అనే చిన్న చిన్న ఎముకల సమాహారం. ఇందులో ఆస్టియోపోరోసిస్ ఎముక విరిగినప్పుడు తీవ్రమైన నడుమునొప్పి వస్తుంది. ఈ తరహా కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అయ్యేందుకు అవకాశం ఇరువురిలోనూ ఉన్నా... పురుషుల్లో కంటే మహిళల్లో రెండు రెట్లు ఎక్కువ. ఫైబ్రోమయాల్జియా : ఈ తరహా నొప్పి వెన్నులో కింది భాగంతో పాటు పైన కూడా కనిపించవచ్చు. మహిళల్లో యాంగై్జటీనే ఇందుకు దోహదం చేస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ : కీళ్ల అరుగుదలతో వచ్చే నొప్పి ఇది. రెండు ఎముకలు కలిసే చోట ఎముక అరిగినప్పుడు వచ్చే నొప్పి ఇది. అయితే మోకాలు, తుంటి భాగంలో లాగే నడుము ప్రాంతంలోని వెన్నులో ఎముకల అరుగుదలతో ఈ నొప్పి వస్తుంది. శాక్రో ఇలియాక్ జాయింట్ సమస్యలు : ఈ ఎముకలు వెన్నెముక చివరి భాగంలో ఉంటాయి. శాక్రమ్ అనే వెన్నెముక చిట్టచివరి ఎముక (టెయిల్‌బోన్)ను తుంటితో కలిపేలా ఈ ఎముకలు పిరుదులకు ఇరువైపులా కాస్త విస్తరించి ఉంటాయి. ఈ భాగంలో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు నడుము కింద భాగంతో పాటు కాళ్లలోకి సైతం నొప్పి పాకుతుంది. గర్భధారణ అనే అంశం ఈ నొప్పిని మరింత ప్రభావితం చేస్తుంది. పక్కతేడా : మహిళలు తమ రోజువారీ పనుల్లో భాగంగా బిందెల మోయడం, పిల్లలను చంకలో మోసేటప్పుడు నడుము ఒంపు భాగంలో ఒత్తిడి పడుతుంటుంది. చాలాసేపు అవసవ్య భంగిమలో ఉండటం కూడా నడుము నొప్పికి కారణం. ఇక నడుము వంచి ఇల్లు తుడిచే వాళ్లు నిటారుగా ఉండే లాంగ్ హ్యాండిల్ మాప్‌లను వాడటం మంచిది. అకస్మాత్తుగా అసహజ భంగిమల్లోకి వంగడం, పక్కకు తిరగడం, బరువులు ఎత్తే సమయంలో ముందుకు ఒంగడమూ నడుము నొప్పికి కారణం కావచ్చు. బరువును ఎత్తేటప్పుడు కూర్చొని నెమ్మదిగా ఎత్తడం మేలు. ఇక పనిచేసే చోట్ల మహిళల్లో కంప్యూటర్లోకి వంగి చూస్తుండటం వల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. అందుకే కంప్యూటర్ వంటివి చూస్తున్నప్పుడు నడుమును వీలైనంత నిటారుగా ఉంచాలి. చాలాసేపు నిలబడి ఉండే వాళ్లలో నడుము నొప్పి కొన్ని వృత్తుల్లో ఐదారు గంటల పాటు నిలబడాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్లలో నడుమునొప్పి రావడంతో పాటు కాళ్లలోని ఎముకలు, కండరాలు దెబ్బతిని ‘మస్క్యులో స్కెలెటల్ డిజార్డర్స్’ రావచ్చు. స్వల్పకాలిక సమస్యలైన కాళ్లలో తిమ్మిర్లు (క్రాంప్స్) వంటివి నడుమునొప్పితో పాటు వచ్చినప్పుడు పరిస్థితి దుర్భరమవుతుంది. అందుకే చాలాసేపు నిలబడే ఉండే వృత్తుల్లో ఉండేవారు తరచూ కాస్తంత బ్రేక్ తీసుకోవాలి. నిలబడి ఉన్నప్పుడు కూడా అదేపనిగా నిటారుగా ఉండకుండా తరచూ పోష్చర్‌లో కాస్తంత మార్పులు చేస్తూ ఉండాలి. వంట చేసేటప్పుడు మహిళలు వంట ప్లాట్‌ఫారమ్ దగ్గర చాలాసేపు నిలబడి ఉండాల్సి వస్తోంది. ఇలాంటి వారు తమ ఎత్తునకు అనుగుణంగా ప్లాట్‌ఫారమ్ అమర్చుకోవడం, తరచూ కూర్చోడానికి ఎల్తైన లాంగ్ స్టూల్‌ను వేసుకోవడం మంచిది. దాని కాళ్ల దగ్గర ఫుట్‌రెస్ట్ చేసుకోవడానికి అనుగుణంగా అడ్డుపట్టీలు ఉండటం నడుమునొప్పి నివారించడానికి దోహదపడుతుంది. డైవింగ్ సీట్... నడుము నొప్పి వాహనాన్ని నడపడానికీ, నడుమునొప్పికీ చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. వాహనాన్ని నడిపే కొందరిలో నడుము నొప్పి కనిపిస్తుంటుంది. ఆ నొప్పి నివారణకు సూచనలు : ∙ తొడలకు సీట్ సపోర్ట్ వీలైనంత ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే వాటి నిడివిలో అవి ఎక్కువ భాగం సీట్‌పై ఉండాలన్న మాట. ∙ బ్రేక్, క్లచ్ వంటి మీ కాళ్లు ఆనే భాగాలకు మరీ దూరంగా కూర్చోవద్దు. ∙కాళ్ల పొడవుకు అనుగుణంగా సీట్‌ను సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి ∙ఎత్తునకు అనుగుణంగా సీట్ ఎత్తును అడ్జెస్ట్ చేసుకోవాలి ∙సీట్‌ను నిటారుగా ఉంచేలా చూసుకోవాలి లేదా అది మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా సీట్ ఒంచాలి. ఆ సీట్ ఒంపు ఎంత అవసరం అని తెలియాలంటే ఒకటే కొండగుర్తు... ఆ ఒంపు నడుము మీదగానీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా ఉండాలి. ∙నడుము దగ్గర ఉండే ఒంపు (లంబార్) భాగంలో ఒక కుషన్ ఉంచుకోవాలి. ఆ లంబార్ సపోర్ట్ వల్ల నడుమునొప్పి చాలావరకు తగ్గుతుంది. ∙మెడ మీద ఒత్తిడి పడని విధంగా మీ హెడ్రెస్ట్ ఉండాలి. ∙సీట్లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ పొజిషన్ కాస్త మారుస్తూ ఉండాలి. ∙అదేపనిగా డ్రైవ్ చేయకుండా మధ్య మధ్య కాస్త బ్రేక్ తీసుకోవాలి. ∙ఇక డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మేలు. చికిత్స నడుమునొప్పితో బాధపడుతున్న మహిళలు ముందుగా అది ఏ నిర్దిష్టమైన కారణంతో వస్తున్నదో తెలుసుకోవాలి. ఇందుకోసం అనేక మార్గాలు ఉన్నాయి. వీటిల్లో అన్నింటికంటే ప్రధానమైనది... ఫిజియోథెరపిస్ట్ సహాయంతో అవసరమైన వ్యాయామాలు లేదా (ఇంటర్‌ఫెరెన్షియల్ థెరపీ) ఐఎఫ్‌టీ వంటి ప్రక్రియలతో చేసే చికిత్సలూ ఉపశమనాన్ని కలిగిస్తాయి. టెన్స్ అనే చికిత్స కూడా ఇలాంటిదే. ట్రాన్స్క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ అనే మాటలకు సంక్షిప్త రూపమే ఈ ‘టెన్స్’. ఈ చికిత్స ప్రక్రియలో ఎలక్ట్రోడ్ల సహాయంతో చిన్న చిన్న విద్యుత్ ప్రకంపనలను చర్మం కిందికి పంపుతారు. ఫలితంగా ఉపశమనం కలుగుతుంది. అయితే గర్భవతులు, మూర్ఛతో బాధపడే రోగులు, గుండెజబ్బులు ఉన్నవారు లేదా గుండె సమస్యను చక్కదిద్దడానికి పేస్‌మేకర్ అమర్చిన వాళ్లకు టెన్స్ చికిత్స సరికాదు. అందుకే ఇలాంటి చికిత్సలు పూర్తిగా వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే సాగాలి. ఇక పై మార్గాలన్నీ విఫలం అయినప్పుడు సమస్యను శాశ్వతంగా చక్కదిద్దడానికి ఎముకల వైద్య నిపుణులు లేదా న్యూరోసర్జన్లు లేదా స్పైన్ సర్జన్లు అవసరమైన శస్త్రచికిత్సను నిర్వహించి పరిస్థితిని చక్కబరుస్తారు. తక్షణ నొప్పి నివారణ కోసం : నొప్పిని తాత్కాలికంగా తగ్గించడం కోసం నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవి కేవలం తక్షణ నొప్పి నివారణ కోసమే పనికి వస్తాయి. శాశ్వత నివారణ కోసం నొప్పి నివారణ మందులను వాడకూడదు. నొప్పి నివారణ మందులను దీర్ఘకాలం వాడటం వల్ల జీర్ణవ్యవస్థతో పాటు మూత్రపిండాల వంటి కీలకమైన అవయవాలు దెబ్బతినవచ్చు. అందుకే రెండు వారాలకు మించి నొప్పి నివారణ మందులు తీసుకోవడం సరికాదు. దీనికి బదులు ఉపశమనం కోసం పైపూత మందులు (టాపికల్ మెడిసిన్స్) వాడటం మంచిది. అయితే ఇందుకోసం కొన్ని ఆయిల్స్‌తో మసాజ్ చేస్తుంటారు. తొలుత నొప్పిని ఉపశమింపజేసే నూనెలతో మసాజ్‌లు చేయడం మంచిదే. మసాజ్‌లో భాగంగా నిపుణులు రుద్దడం, నొక్కడం, కొన్ని నిర్దిష్టమైన చోట్ల ఒత్తిడి కల్పించడం... అంటే రోలింగ్, నీడింగ్, అప్లయింగ్ ప్రెషర్ వంటవి చేస్తారు. దాంతో నొప్పి ఉన్న భాగాల్లో రక్తప్రసరణ బాగా అయ్యేలా చేస్తారు. ఫలితంగా కండరాల్లో ఒత్తిడి తగ్గడం లేదా పట్టివేసిన కండరం వదులు కావడం వల్ల నొప్పి ఉపశమిస్తుంది. అయితే... ఇలా ఆరు వారాల కంటే ఎక్కువగా చేసినప్పటికీ నొప్పి కొనసాగుతూ ఉంటే పూర్తిస్థాయి చికిత్స కోసం డాక్టర్‌ను సంప్రదించాలి. అలాగే 20 ఏళ్ల లోపు వాళ్లలో నడుము నొప్పి కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. పడక కారణంగా వచ్చే నడుమునొప్పి... మీ పడక కారణంగా నడుమునొప్పి వస్తుందేమో కూడా చూసుకోవాలి. నిద్రలేవగానే అకస్మాత్తుగా నడుమునొప్పి వస్తే అది పక్కసరిగా లేని కారణంగా కావచ్చు. కనీసం 15 –30 నిమిషాల పాటు మెల్లగా స్ట్రెచ్ అవుతూ చేసే వ్యాయామాల తర్వాత కూడా నొప్పి తగ్గలేదంటే అది పక్క సరిగా లేకపోవడం వల్ల వచ్చిన నొప్పిగా అనుకోవచ్చు. ఏది మంచి పడక : మంచి పడక అనేది అందరికీ ఒకేలా ఉండదు. వారి వారి వ్యక్తిగత సౌకర్యాలకు అనుగుణంగా తమ పడకను ఏర్పాటు చేసుకుంటుంటారు. అయితే నడుము నొప్పి రాకుండా ఉండేందుకు పడక విషయంలో తీసుకోవాల్సిన కొన్ని సూచనలు ఇవి... ∙పడుకునే చోటు సమతలంగా ఉండాలి. అయితే కొందరు కఠినమైన తలం (సర్ఫేస్) మీద పడుకోవడం వల్ల నడుమునొప్పి తగ్గుతుందని అపోహ పడుతుంటారు. అది సరికాదు. పడక కూరుకుపోయేంత మెత్తగానూ ఉండకూడదు, పూర్తిగా చెక్కలాగా కఠినంగానూ ఉండకూడదు. మీ మ్యాట్రెస్ తగినంత మెత్తగా ఉంటూనే... సమతలంగానూ ఉండాలి. మీ మ్యాట్రెస్ చాలా కఠినంగా ఉంటే వెన్నులోని కొన్ని మృదువైన లిగమెంట్లు, కండరాలను మరీ గట్టిగా నొక్కేస్తుంది. అలాగే మరీ మృదువుగానూ, మీరు లోనికి కుంగిపోయేంత మెత్తగా ఉంటే మీ వెన్నెముకను అర్ధచంద్రాకారంలో ఒంగిపోయేలా చేసి నొప్పికి కారణమవుతుంది. వెన్నెముక ఆకృతి ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా మారి సపోర్ట్ ఇచ్చేలా మీ పరుపు ఉండాలి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి, లైఫ్‌స్టైల్ నిపుణులు, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
వెన్ను బ్యాలెన్స్ తప్పితే... సరి చేయవచ్చు!
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 64 ఏళ్లు. కొద్ది రోజులుగా నేను నడుమునొప్పితో పాటు కాళ్లలో నొప్పులు, తిమ్మిర్లతో బాధపడుతున్నాను. కాళ్లు మొద్దుబారడం, కూర్చున్నా నిల్చున్నా నడుమునొప్పి రావడం జరుగుతోంది. దీనికి కారణాలు, చికిత్స తెలపండి. – సుధాకర్‌రావు, తెనాలి మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు స్పాండిలోసిస్థెసిస్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. స్పాండిలోసిస్థెసిస్ వచ్చినప్పుడు వెన్నుపూసలు నరాల మీద ఒత్తిడి కలిగించి నడుము నొప్పితో పాటు కాళ్లలో నొప్పులు, తిమ్మిర్లు ప్రారంభమవుతాయి. దీనితో బాధపడుతున్నవారు నడిస్తే చాలు... కాళ్లలో నొప్పి రావడం మొదలవుతుంది. కాళ్లు బరువెక్కుతాయి. కొంచెం దూరం కూడా నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆగిపోతే నొప్పి తగ్గుతుంది. తిరిగి నడిస్తే మళ్లీ నొప్పి. దీన్నే వైద్య పరిభాషలో క్లాడికేషన్ అంటారు. ఈ దశలోనే ఆ ప్రాంతంలో నడుము సమతౌల్యం తప్పుతుంది. దీని తర్వాత నడుము మొత్తంగా ఒక పక్కకి గానీ ముందుకు గానీ ఒంగిపోతుంది. దీన్ని గ్లోబల్ లాస్ ఆఫ్ బ్యాలెన్స్ అంటారు. కొంచెం సేపు నిల్చున్నా, కొంచెం దూరం నడిచినా నడుము, పిరుదుల భాగం, తొడ ఎముక భాగాల్లో నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి క్రమంగా తీవ్రమై మంచం మీద నుంచి బాత్రూమ్ వరకు నడవలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటివారు వెంటనే డాక్టర్‌ను కలిసి వెన్ను బ్యాలెన్స్ తప్పుతున్న కండిషన్‌ను సరిచేయించుకోవచ్చు. లక్షణాలు కనిపించగానే చికిత్స చేయించుకోవడం ఎంతైనా అవసరం. ఈ తరహా సమస్యలను స్పైనల్ డికంప్రెషన్ అండ్ స్టెబిలైజేషన్ సర్జరీ అనే శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తారు. వెన్ను శస్త్రచికిత్సలు చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ బ్యాలెన్స్‌ను దృష్టిలో ఉంచుకోవాలి. బ్యాలెన్స్ సరిచేయకపోతే వెన్ను సమస్యలు పూర్తిగా తగ్గవు. బొటనవేలి నొప్పి తగ్గాలంటే..? లైఫ్ స్టైల్ కౌన్సెలింగ్ నేను స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటాను. ఈమధ్య నా బొటనవేలు చాలా నొప్పిగా ఉంటోంది. నొప్పి తగ్గడానికి ఏం చేయాలి? – వినయ్‌కుమార్, హైదరాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు బ్లాక్‌బెర్రీ థంబ్ లేదా గేమర్స్ థంబ్ అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. దీన్నే వైద్యపరిభాషలో డీ–క్వెర్‌వెయిన్ సిండ్రోమ్ అంటారు. మనం మన స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించే సమయంలో బొటనవేలిని మాటిమాటికీ ఉపయోగిస్తుంటాం. దాంతో బొటనవేలి వెనకభాగంలో ఉన్న టెండన్ ఇన్ఫ్లమేషన్కు గురై వాపు వస్తుంది. మళ్లీ అదేపనిగా దాన్ని ఉపయోగించడం వల్ల ఆ గాయం మానక మళ్లీ మళ్లీ గాయం తిరగబెడుతుంది. ఫలితంగా ఈ సమస్య వస్తుంది. ఇలాంటివాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు. అవి... టైపింగ్ లేదా టెక్ట్స్ మెటీరియల్ పంపడం కోసం ఒక బొటన వేలినే కాకుండా ఇతర వేళ్లను కూడా ఉపయోగిస్తూ బొటనవేలిపై పడే భారాన్ని తగ్గించడం.మణికట్టును రిలాక్స్‌గా ఉంచి వీలైనంత వరకు మణికట్టుపై భారం పడకుండా చూడటం. మీ స్మార్ట్‌ఫోన్‌ను ఒళ్లో పెట్టుకొని ఉండకుండా, కాస్త ఛాతీ భాగం వద్ద ఉండేలా చూసుకోవాలి. ఒళ్లో పెట్టుకోవడం వల్ల కంటి మీద, ఒంగి స్క్రీన్ చూస్తూ ఉండటంతో మెడ మీద భారం పడుతుంది. అదే ఫోన్‌ను ఛాతీ వద్ద పెట్టుకుంటే అన్నివిధాలా సౌకర్యంగా ఉంటుంది. ఫోన్‌ను శరీరానికి ఏదో ఒక వైపున ఉంచకుండా మధ్యన ఉంచడం వల్ల శరీరం అసహజ భంగిమలో ఒంగకుండా బ్యాలెన్స్‌తో ఉంటుంది.ఫోన్ ఉపయోగించే సమయాన్ని సాధ్యమైనంతగా తగ్గించడం. పొడవు వాక్యాలు కాకుండా అర్థమయ్యేరీతిలో షార్ట్‌కట్స్ వాడుతూ వేలి వాడకాన్ని తగ్గించడం. దీనివల్ల మీ బొటనవేలు, ఇతర వేళ్లు, మణికట్టుపై భారం తగ్గుతుంది. ‘ఐ యామ్ ఇన్ మీటింగ్’ లాంటి కొన్ని రెడీమేడ్ వాక్యాలు ఉంటాయి. వాటిని ఉపయోగిస్తే టైపింగ్ బాధ తగ్గడంతో పాటు, సమయం కూడా ఆదా అవుతుంది.అదేపనిగా ఫోన్ ఉపయోగించే వారు... ప్రతి 15 నిమిషాల్లో కనీసం 2–3 నిమిషాల పాటు మీ బొటనవేలికి విశ్రాంతినివ్వాలి. అప్పటికీ మీ సమస్య తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించండి. – సుధీంద్ర ఊటూరి, లైఫ్‌స్టైల్ నిపుణులు, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ పాపకు తల మీద ర్యాష్... పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు ఆరు నెలలు. తల మీద విపరీతమైన ర్యాష్‌తో పాటు ఇన్ఫెక్షన్ వచ్చింది. మా డాక్టర్గారికి చూపించాం. మొదట తగ్గిందిగానీ, కొన్నాళ్లకు మళ్లీ వచ్చింది. పాపకు తలలోని కొన్నిప్రాంతాల్లో జుట్టు సరిగా రావడం లేదు. మా పాప సమస్యకు పరిష్కారం చెప్పండి. ఇది భవిష్యత్తులో రాబోయే సమస్యలకు ఏదైనా సూచనా? – సుహాసిని, విజయవాడ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు మాడు (స్కాల్ప్) భాగంలో చర్మం మీద ర్యాష్ వచ్చినట్లుగా, కొద్దిగా సూపర్ యాడ్ ఇన్ఫెక్షన్ కూడా అయినట్లుగా అనిపిస్తోంది. ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. ఇది కాస్త దీర్ఘకాలికంగా కనిపించే సమస్యగా చెప్పవచ్చు. దీన్ని ప్రధానంగా నెలల పిల్లల్లో, యుక్తవయసుకు వచ్చిన పిల్లల్లో కూడా చూస్తుంటాం. ఈ సమస్య ఉన్న పిల్లలకు మాడు (స్కాల్ప్)పైన పొరల్లా ఊడటం, అలాగే కొన్నిసార్లు తలంతా అంటుకుపోయినట్లుగా ఉండటం, కొన్ని సందర్భాల్లో మాడుపై పొర ఊడుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఇది రావడానికి ఇదమిత్థంగా కారణం చెప్పలేకపోయినప్పటికీ... కొన్నిసార్లు ఎమ్.పర్ఫూరా అనే క్రిమి కారణం కావచ్చని కొంతవరకు చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల్లో... అందునా ముఖ్యంగా నెల నుంచి ఏడాది వయసు ఉండే పిల్లల్లో ఈ సమస్యను మరీ ఎక్కువగా చూస్తుంటాం. కొన్నిసార్లు ఈ ర్యాష్ ముఖం మీదకు, మెడ వెనక భాగానికి, చెవుల వరకు వ్యాపిస్తూ ఉండవచ్చు. ఇది వచ్చిన పిల్లల్లో పై లక్షణాలతో పాటు కొందరిలో నీళ్ల విరేచనాలు (డయేరియా) లేదా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తుంటే దాన్ని ఇమ్యూనో డెఫిషియెన్సీ డిసీజ్‌కు సూచికగా చెప్పవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతర కండిషన్స్... అంటే అటోపిక్ డర్మటైటిస్, సోరియాసిస్ వంటి స్కిన్ డిజార్డర్స్ కూడా ఇదేవిధంగా కనిపించవచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే ఈ సమస్య ఉన్నవారికి యాంటీసెబోరిక్ (సెలీనియం, సెల్సిలిక్ యాసిడ్, టార్) షాంపూలతో క్రమం తప్పకుండా తలస్నానం చేయిస్తుండటం, తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఉన్న కీమ్స్ తలకు పట్టించడం, ఇమ్యూనోమాడ్యులేటర్స్ వంటి మందుల వల్ల తప్పనిసరిగా వీళ్లకు నయమవుతుంది. అలాగే ఈ సమస్య ఉన్న భాగాన్ని తడిబట్టతో తరచూ అద్దుతూ ఉండటం చాలా ముఖ్యం. ఇదేమీ భవిష్యత్తు వ్యాధులకు సూచన కాదు. మీరు ఒకసారి మీ పిల్లల డాక్టర్‌ను లేదా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. ఈ సమస్య తప్పక తగ్గిపోతుంది. – డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
నడుం నొప్పికి ఆపరేషనా?
న్యూరో కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. నాకు ఇద్దరు పిల్లలు. ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్లడానికీ, అక్కడ్నుంచి రావడానికి అంటూ దాదాపు 50 కి.మీ. పైనే బైక్ మీద తిరుగుతుంటాను. ఇటీవల తీవ్రంగా నడుము నొప్పి బాధిస్తోంది. దీంతో ఆర్థోపెడిక్ డాక్టర్‌ను సంప్రదించారు. ఆయన ఏకంగా నడుముకు శస్త్రచికిత్స చేయాలన్నారు. కేవలం నడుము నొప్పి అంటే సర్జరీ అంటున్నారేమిటి? నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - రజనీ, తార్నాక (హైదరాబాద్) ఈమధ్య కాలంలో చాలా మందిని ఈ సమస్య పట్టి పీడిస్తోంది. వివిధ రకాల ఒత్తిడి, జీవన విధానంలో మార్పులు, అధిక బరువులెత్తడం చాలాసేపు ఒకే భంగిమలో ఉండటం, ముందుకు ఒంగి పనిచేయడం, రోజూ చాలా దూరం బైక్‌పై ప్రయాణం చేయడం వంటి కారణాలతో వెన్నెముక మీద ఒత్తిడి ఏర్పడి ఈ సమస్య తలెత్తుతోంది. మీరు ఇటు ఇంట్లో పని చేసుకుంటూ ఆపై ఆఫీసుకు బండి మీద వెళ్లి అక్కడ కూడా శ్రమపడుతున్నారు. అంటే మీరు శారీరక ఒత్తిడికి అధికంగా లోనవుతున్నట్లు అర్థమతువోతంది. మీరు వెన్నుపూసకు ఎక్స్‌రే తీయించారా? ఆ పరీక్ష ఫలితాలను చూసి డాక్టర్ మీకు సర్జరీ చేయించమని సలహా ఇచ్చినట్లయితే మీరు ‘స్పాండిలోలిస్తెసిస్’ అనే సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నట్లు నిర్ధారణ చేయవచ్చు. ఈ సమస్యతో బాధపడుతున్నవారిలో కొంతమందికి మందులతోనే నయమైతే, మరికొందరికి నడు కింది భాగంలో బెల్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అవసరాన్ని బట్టి వైద్యులు వాకింగ్, యోగా లాంటి వ్యాయామాలు సూచిస్తారు. అప్పటికీ తగ్గకపోతే శస్త్రచికిత్స నిర్వహించి, వెన్నుపూస లోపల జారిపోయిన ఎముకను సాధారణ స్థితికి తీసుకువచ్చి స్క్రూస్, రాడ్స్ బిగించి, నరాలు ఒత్తిడికి గురికాకుండా చేస్తారు. ఈ విషయంలో మీరు ఆందోళనపడాల్సిందేమీ లేదు. వెన్నుకు ఆపరేషన్ చేసే విధానాలలో సురక్షితమైన శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వెన్నెముక సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని, మిగతా భాగాలు దెబ్బతినకుండా మినిమల్లీ ఇన్వేసివ్ విధానంలో తక్కువ కోతతో ఆపరేషన్ నిర్వహించగలుగుతారు. ఈ విధానంలో వెన్నుపాముకి ఒక అంగుళం లేదా అంతకన్నా తక్కువ పరిమాణంలో ఒక చిన్న రంధ్రం పెడతారు. దీన్నే కీ-హోల్ అంటారు. శరీరంపై చిన్న కోత మాత్రమే ఉంటుంది కాబట్టి గాయం త్వరగా మానిపోతుంది. శస్త్రచికిత్స నిర్వహించిన రోజున లేదా మర్నాడు రోగిని ఇంటికి పంపించేస్తారు. కాబట్టి మీ ఉద్యోగానికి కూడా ఎక్కువ రోజులు సెలవు పెట్టుకోనవసరం లేదు. - డాక్టర్ ఆనంద్ బాలసుబ్రహ్మణ్యం సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
మంచి పోషకాహారంతోనే క్యాన్సర్‌కు చెక్!
హోమియో కౌన్సెలింగ్ నా వయస్సు 34 ఏళ్లు. నేను టీచర్‌గా పనిచేస్తున్నాను. నాకు మూడేళ్ల క్రితం కిడ్నీలో రాళ్ల సమస్యకి శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడు కొంత కాలం నుండి మళ్లీ విపరీతమైన నడుం నొప్పితో పాటు మూత్రంలో మంటగా ఉంటుందని డాక్టరు గారిని సంప్రదిస్తే మళ్లీ కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయని చెప్పారు. అసలు ఇవి ఎందుకు ఏర్పడుతున్నాయి. నా ఈ సమస్యకి పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? - సత్యనారాయణ, అమలాపురం మీరు ఆందోళన చెందకండి. మీ ఈ సమస్యకి హోమియో చికిత్స ద్వారా పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో కిడ్నీలో రాళ్లు అతి సాధారణ సమస్యగా మారుతోంది. మన శరీరంలో మూత్ర పిండాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి రక్తాన్ని వడపోసి చెడు పదార్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపించి శరీరంలోని లవణాల సమతుల్యతను కాపాడతాయి. మూత్రంలో అధికంగా ఉండే లవణాలు స్ఫటిక రూపాన్ని దాల్చి ఘనస్థితికి చేరినప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మూత్ర వ్యవస్థలో భాగం అయిన మూత్రపిండాలు, మూత్రకోశంలో ఎక్కడైనా రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. వీటన్నిటినీ వాడుక భాషలో కిడ్నీలో రాళ్లు అని అంటుంటాం. కారణాలు: చాలామందిలో కిడ్నీలో రాళ్లు అనగానే పాలకూర, టొమాటో తినడం ద్వారా ఏర్పడతాయనే అపోహ ఉంటుంది కానీ ఇవి ప్రేరేపకాలు మాత్రమే. అధిక మోతాదులో ఆక్సలేట్స్, కాల్షియం, యూరిక్ యాసిడ్, సిస్టీన్ వంటి కరగని పదార్థాలు మూత్రం ద్వారా విసర్జించటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మూత్రకోశం ఇన్ఫెక్షన్లు, మూత్ర మార్గంలో అడ్డంకులు ఏర్పడటం, హైపర్ పారాథైరాయిడిజం, హైపర్ కాల్సేమియా, చిన్న ప్రేగు ఆపరేషన్లు, రేనల్ ట్యూబులార్ అసిడోసిన్, ఆస్ప్రిన్, ఆంటాసిడ్స్, విటమిన్-సి వంటి కొన్ని మందుల వల్ల, కాల్షియం సప్లిమెంట్లు వల్ల, ఎక్కువ సేపు ఒకే చోట కూర్చొని పనిచేయడం, శరీరంలోని విటమిన్-ఎ శాతం తగ్గడం, అధిక మోతాదులో సోడియం (ఉప్పు) తీసుకోవడం, మంచి నీరు రోజుకి 1.5 లీటర్ల కంటే తక్కువ మోతాదులో సేవించటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతాయి. తగిన వైద్యచికిత్స తీసుకుంటే, హోమియో ద్వారా వీటిని మళ్లీ రాకుండా చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 44 ఏళ్లు. నాకు కుడిపైపు తుంటి భాగంలో నొప్పి వస్తోంది. గత ఆర్నెల్లుగా ఈ నొప్పి ఉంటోంది. దాంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. మా దగ్గర ఎముకల నిపుణుడిని సంప్రదిస్తే ఇది తుంటి ఎముక చివరలో ఉండే బంతి లాంటి భాగం దెబ్బతిన్నదనీ, అది ఒక రకం ఆర్థరైటిస్ అనీ చెప్పారు. నాకు హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరమని అన్నారు. కానీ నేను పనిచేసే చోట ఉన్న ఉన్న మిత్రులు మాత్రం అది పనివల్ల వస్తోందనీ, సర్జరీ అవసరం లేదనీ అంటున్నారు. నేను చాలా మెల్లిగా మాత్రమే నడవగలుగుతున్నాను. వేగంగా పనులు చేసుకోలేకపోతున్నాను. ఇది నన్ను చాలా ఆందోళన పరుస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - సుధాకర్, కోదాడ మీ ఫ్రెండ్స్ చెప్పినట్లే చాలామందిలో తుంటి ఎముక మార్పిడి (టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ) అనే శస్త్రచికిత్స మీద చాలా రకాల సందేహాలు ఉన్నాయి. అవి కేవలం అపోహలు మాత్రమే. ఒకవేళ మీ ఆర్థోపెడిక్ సర్జన్ అదే సమస్య అని నిర్ధారణగా చెబితే, మరో నిపుణుడి నుంచి రెండో అభిప్రాయం (సెకండ్ ఒపీనియన్) తీసుకోవడంలో తప్పులేదు. అయితే తుంటి ఎముక మార్పిడి మీద ప్రజల్లో ఉన్న దురభిప్రాయాలు సరికాదు. అది గత 30 ఏళ్లుగా సురక్షితంగా చేస్తున్న ప్రక్రియ. నిపుణులైన డాక్టర్లు దాన్ని చేయడం వల్ల ఎలాంటి దుష్ర్పభావాలూ రావు. పైగా అది చేశాక ఆటలాడవద్దు అని ముందుజాగ్రత్తగా డాక్టర్లు చెప్పినా, పాశ్చాత్య దేశాల్లో చాలామంది సోర్ట్స్ వంటివి ఆడుతూనే ఉంటారు. టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీతో దుష్ర్పభావాలు (కాంప్లికేషన్లు) కనిపించే అవకాశం కేవలం ఒక శాతం మాత్రమే. కాబట్టి మీరు సర్జరీ గురించి అపోహలు పెట్టుకోవద్దు. కాకపోతే నిపుణులను సంప్రదించి, రెండో అభిప్రాయం మాత్రం తీసుకోండి. నా వయసు 68 ఏళ్లు. నాకు గత రెండేళ్లుగా మోకాళ్లలో నొప్పి ఉంది. ఇటీవల ఇది చాలా ఎక్కువైంది. ఇప్పుడు నడవడం కూడా కష్టమవుతోంది. తగిన సలహా ఇవ్వండి. - సుజాత, తిరుపతి మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ సమస్య తీవ్రమవుతూ పోతుంది. ముందుగా మీరు మీ దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి ఎక్స్-రే తీయించుకోండి. ఈ సమస్యకు తొలిదశలో నొప్పి నివారణ మందులు, కాండ్రోప్రొటెక్టివ్ డ్రగ్స్ అనే మందులు వాడతారు. ఫిజియోథెరపీ వ్యాయామాలూ సూచిస్తాం. అప్పటికీ నొప్పి తగ్గకపోతే మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ) అవసరమవుతుంది. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్ హైదరాబాద్ క్యాన్సర్ హెల్త్ కౌన్సెలింగ్ మా బాబు వయసు తొమ్మిదేళ్లు. గత కొంతకాలంగా బ్లడ్‌క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. కీమోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. అయితే... వాడు సరిగ్గా తినడం లేదు. ఎంత బతిమాలినా మెతుకు ముట్టడం లేదు. ఒకవైపు ట్రీట్మెంట్ ఇస్తుండటం మరోవైపు సరిగా తినకపోవడంతో వాడు చాలా నీరసంగా తయారవుతున్నాడు. వాడికి నయమవుతుందా... వాడూ అందరు పిల్లల్లా ఎదగగలుగుతాడా అని మాకు చాలా బెంగగా ఉంది. దయచేసి మా సమస్యకు సరైన పరిష్కారం చూపండి. - మాలతి, హైదరాబాద్ క్యాన్సర్‌తో బాధపడుతున్నవారు మంచి పోషకాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. క్యాన్సర్ వ్యాధికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నప్పటికీ సరైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోకపోతే అది వృథానే అవుతుంది. క్యాన్సర్ నిర్మూలనకు పోషకాహారం చాలా ముఖ్యపాత్రను పోషిస్తుంది. సంపూర్ణ పోషకాహారం లేకపోయినా క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. మీ బాబుకి కీమోథెరపీ చికిత్స అందిస్తున్నారు కాబట్టి కొన్ని తాత్కాలికమైన సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయి. దీనివల్ల నోరు ఎండిపోయినట్టు అయి, నాలుకకు రుచిలేకపోవడం, వాంతులు, డయేరియాలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే... బాబుకు పోషకాహారం అందించడం చాలా అవసరం. ఇందుకు మీరు ఒక డైట్‌చార్ట్ తయారు చేసుకోవాలి. బాబుకు ఏది ఇష్టంగా అనిపిస్తే అది వండిపెడుతుండాలి. అది తినకూడదు... ఇది తినకూడదు అని చెప్పకుండా అతడికి ఏది ఇష్టంగా తింటుంటాడో అది పెడుతూనే మరోపక్క సంపూర్ణ పోషకాహారంపై దృష్టిపెట్టాలి. ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉండే ఆహారాన్ని ఎక్కువస్థాయిలో బాబుకు అందించాలి. ఒక్కసారే ఎక్కువగా పెట్టకుండా కొంచెం ఎక్కువసార్లు తినేలా చూడండి. అలాగే మధ్యమధ్యన ఫ్లూయిడ్స్, స్పోర్ట్స్ డ్రింక్స్ లాంటివి ఇవ్వండి. డల్‌గా కాకుండా యాక్టివ్ ఎప్పుడుంటాడో గమనించి ఆ సమయాల్లో కాస్త ఎక్కువగా తినిపించండి. చల్లనివి, సాల్టీవీ, స్పైసీగా ఉండేవి, ఫ్లేవర్స్‌తో కూడుకున్న ఆహారం ఈ సమయల్లో నోటికి బాగుంటుంది. కొవ్వు, స్వీట్స్ జోలికి వెళ్లకండి. అందరూ కలిసి అతడితో భోంచేయండి. మీరు ఎలాంటి భయాందోళనలు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండండి. డాక్టర్ భరత్ వాస్వానీ సీనియర్ హెమటో ఆకాంలజిస్ట్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ -
నడుంనొప్పి ఆయుర్వేద చికిత్స
నేటి జీవన విధానంలో ఆహార లోపాలు, అస్తవ్యస్తమైన దినచర్యలు, స్వప్న విపర్యం.. అంటే రాత్రివేళ నిద్ర పోకపోవడం, పగటిపూట నిద్రపోవడం వంటి అలవాట్లు శరీర వ్యవస్థను బాగా దెబ్బతీస్తున్నాయి. ఆందోళన, మానసిక ఒత్తిడి కూడా అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. వీటిలో అతి ముఖ్యమైనది నడుంనొప్పి. ఈ రోజుల్లో 40 ఏళ్లకే నడుంనొప్పి వస్తోంది. ఆయుర్వేద శాస్త్రం నడుంనొప్పికి ‘గృధ్రసీవాతం’గా నామకరణంచేసింది. తొంభైశాతం మంది తమ జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి నడుంనొప్పి బారినపడతారని కొన్ని అధ్యయనాల్లో స్పష్టమయింది. కారణాలు: ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవటం, స్థూలకాయం, ఎక్కువ గంటలు విపరీతంగా శ్రమించడం, అతిగా బరువులు మోయడం, ద్విచక్ర వాహనం మీద ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రుగ్మతలు, వంశపారంపర్య వ్యాధులు.. ఈ కారణాల వల్ల వాత ప్రకోపం ఏర్పడి, ముందుగా పిరుదులపై భాగాన స్తబ్థతను, నొప్పిని కలిగించి ఆ తరువాత నడుంభాగం, ప్రత్యేకించి ఎల్-4, ఎల్-5 వెన్నుపూసల మధ్య ఉండే సయాటికా నరం మీద ఒత్తిడి పడటం వల్ల నడుంనొప్పి వస్తుంది. డిస్కులో వచ్చేమార్పులు: వెన్నుపూసల మధ్య ఉంటే డిస్కుల్లో కొన్ని మార్పులు జరిగినప్పుడు డిస్కుల మీద ఒత్తిడి పెరుగుతుంది. వాపు రావడం, డిస్కుకి రక్తప్రసరణ సరిగా లేకపోవడం, డిస్కు అరిగిపోవడం వంటి సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది లక్షణాలు: నడుంనొప్పి, వాపు, కాస్త శ్రమించినా సూదులతో గుచ్చినట్లుగా నొప్పి తీవ్రం కావడం, కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు ఉంటాయి. సకాలంలో చికిత్స అందకపోతే స్పర్శజ్ఞానం కోల్పోతారు. సమస్య తీవ్రమైతే మలమూత్రాల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. ఆయుర్వేద చికిత్స: నడుంనొప్పి సమస్యకు ఆయుర్వేద శాస్త్రం సూచించిన సమగ్రమైన చికిత్సాపద్ధతుల్లో నిదాన పరివర్జనము, శమన చికిత్స, శోధన చికిత్స అని మూడు ప్రధానమైనవి ఉన్నాయి. శమన చికిత్సలు: వ్యాధి తాలూకు దోషాలను శమింపచేయటానికి తెచ్చే ఔషధాలు, ఇందులో రోగ బలాన్ని బట్టి, రోగి బలాన్ని బట్టి చూర్ణాలు, గటికలు, కషాయాలు, లేహ్యాలు, తైలాలు వంటి ఔషధాలు రోగికి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ శమన చికిత్స వల్ల ఒక్కోసారి ప్రకోపించిన దోషాలు మళ్ళీ తిరగబడవచ్చు. అందుకే వ్యాధి తీవ్రతను బట్టి శమన చికిత్సలతోపాటు కొందరికి పంచకర్మ (శోధన చికిత్స) కూడా అవసరం. కటివస్తి: ఇది ఆయుర్వేదంలోని ఒక విశిష్ఠ ప్రక్రియ. అరిగిపోయిన మృదులాస్థి (కార్టిలేజ్)కి రక్తప్రసరణ పెంచి నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఈ ప్రక్రియ ఎంతగానే ఉపయోగపడుతుంది. ఇదే క్రమంలో సర్వాంగధార చికిత్స కూడా వీరికి బాగా ఉపయోగపడుతుంది. వస్తికర్మ: ఆయుర్వేద శాస్త్రంలో వస్తికర్మ చికిత్స అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ వస్తికర్మ చిన్న పేగులు, పెద్దపేగులలోని ఎంటరిక్ నర్వస్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతుంది. తద్వారా నాడీకణాలలో ఏర్పడిన లోపాలను సరిచేసి బలం చేకూర్చవచ్చు. జాగ్రత్తలు: అవసరమైన పోషకాహారం తీసుకుంటూ వైద్యులు సూచించిన విధానాలను అనుసరించడం ముఖ్యం. ఔషధ చికిత్సల తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తే నడుంనొప్పి సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. డా.మనోహర్ ఎం.డి(ఆయుర్వేద) స్టార్ ఆయుర్వేద -
నడుంనొప్పి(లాంబార్ స్పాండిలోసిస్)
ఈ రోజులో చాలామందిని వేధిస్తున్న సమస్య నడుంనొప్పి (లాంబార్ స్పాండిలోసిస్). ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే లాంబార్ స్పాండిలోసిస్ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండానే వస్తోంది. యుక్త వయసులో ఉన్నవారు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం మారుతున్న జీవనశైలి. నడుంనొప్పే కదా అని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ సమస్య ఇంకా త్రీవమవుతుంది. అలాకాకుండా వ్యాధి తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది. కారణం: శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం 33 వెన్నుపూసలతో నిర్మితమైన వెన్నుముక. వెన్నెముకలోని ప్రతి రెండు వెన్ను-ఎముకల మధ్య మృదులాస్థితో నిర్మితమైన ‘డిస్క్’లు మనం వంగినా, లేచినా ఈ డిస్క్లే తోడ్పడతాయి. అయితే అసంబద్ధ భంగిమలలో ఎక్కువసేపు కూర్చోవడం, ఒకేచోట ఎక్కువ సమయం కదలకుండా కూర్చొని విధులు నిర్వర్తించడం, వంగి ఉండి త్రీవమైన శారీరక శ్రమ చేయడం, తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్ తగినంత లేకపోవటం మొదలగు కారణాల వల్ల నడుము ప్రాంతంలో ఉండే డిస్క్‌లు అరిగిపోవటం, పక్కకు తప్పుకోవటం, ఆస్టియోఫైట్స్ (అనవసరమైన ఎముక పెరుగుదల) ఏర్పడటంవల్ల నడుం నొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది. దీనినే ‘లంబార్ స్పాండిలోసిస్’ అంటారు. లక్షణాలు: నడుము నొప్పి తీవ్రంగా ఉండి, ఎటువైపు వంగినా, కూర్చున్నా, నడిచినా నొప్పి పెరుగుతుంది. డిస్క్‌లు పక్కకు జరిగినప్పుడు అక్కడి నుండి వెళ్లే నడుము మీదపడే ఒత్తిడి కారణంగా నొప్పి ఎడమ లేదా కుడి కాలికి వ్యాపించి బాధిస్తుంది. నొప్పితోపాటు ఒత్తిడి తీవ్రత ఎక్కువ ఉండే తిమ్మిర్లు కూడా వ్యాపిస్తుంటాయి. హఠాత్తుగా వంగినా, బరువులు ఎత్తినా, ఒక్కసారిగా తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. జాగ్రత్తలు నడుము నొప్పితో బాధపడేవారు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వీలైనంతగా విశ్రాంతి తీసుకోవాలి. కుర్చీలో కూర్చొన్నప్పుడు, వాహనం నడిపేటప్పుడు నడుము నిటారుగా ఉండే విధంగా సరైన భంగిమలో కూర్చోవాలి. బరువులు ఎక్కువగా ఎత్తకూడదు. చదరంగా ఉండేలా బల్లమీదకాని, నేలమీదకాని పడుకోవాలి. నడుమునొప్పి రాకుండా ఉండటానికి సరైన పౌష్టికారం తీసుకుంటూ నిత్యం వ్యాయామం చేయాలి. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గించుకోవటానికి ఆహార నియమాలు పాటించాలి. చికిత్స: హోమియోపతి వైద్యవిధానంలో ‘లాంబార్ స్పాండిలోసిస్’కు ఉపసమనం కలిగించే మందులు చాలా ఉన్నాయి. అయితే ఈ విధానంలో కేవలం లక్షణాలు తగ్గించటం వల్ల కాకుండా, లక్షణాలకు గల కారణాలతోబాటు వ్యక్తి శారీరక, మానసిక తత్వాన్ని పూర్తిగా విశ్లేషించి వైద్యులు తగిన మందులు సూచిస్తుంటారు. సాధారణంగా బ్రయోనియా, రూస్టాక్స్, రస్టాల్మ్, కోలోసింత్, హైపీరికం, మాగ్‌ఫాస్, ఆర్నికా మొదలగు మందులను నడుము నొప్పికి వాడుతుంటారు. అయితే వీటిని వాటి, వాటి లక్షణాలకనుగుణంగా వైద్యుల సూచన మేరకే వాడితేనే ఆయా వ్యాధులకి తగిన ఫలితం, ఉపశమనం లభిస్తాయి. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, హనుమకొండ, కర్ణాటక www.starhomeo.com ph: 8977 33 66 77 -
నడుమునొప్పి -ఆయుర్వేద చికిత్స
ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని జీవనం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధంగా ఉంటోంది. పెరిగిపోతున్న పని ఒత్తిడి, పోషకాహారం సరిగా తీసుకోకపోవడం వలన, ఈరోజుల్లో 40 ఏళ్లకే నడుము నొప్పి వస్తోంది. ముఖ్యంగా ఆహార లోపాలు, అస్తవ్యస్తమైన దినచర్యలు, స్వప్న విపర్యం అంటే రాత్రివేళ నిద్రపోకపోవటం, పగటిపూట నిద్రించడం వంటి అలవాట్లు శరీర వ్యవస్థను బాగా దెబ్బ తీస్తున్నాయి. అలాగే ఆందోళన, మానసిక ఒత్తిడి వంటి కారణాలు కూడా అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. వీటిలో అతిముఖ్యమైనది నడుము నొప్పి (కటిశూల). ఆయుర్వేద శాస్త్రం నడుము నొప్పికి గుద్రసీవాతంగా నామకరణం చేసింది. నూటికి 90 శాతం మంది తమ జీవితకాలంలో ఎపుడో ఒక్కసారి నడుము నొప్పి బారిన పడతారని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. కారణాలు: ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవటం, స్థూలకాయం, విశ్రాంతి అనేది లేకుండా ఎక్కువ గంటలు విపరీతంగా శ్రమించడం, అతిగా బరువులు మోయటం, ద్విచక్రవాహనం మీద ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రుగ్మతలు, వంశపారంపర్యం వ్యాధులు ఇవి అన్ని నడుమునొప్పికి కారణమవుతుంటాయి. ఈ కారణాల వల్ల ముఖ్యంగా వాత ప్రకోపం జరుగుతుంది. ఫలితంగా ముందు పిరుదులకు పైభాగాన స్థబ్దతను, నొప్పిని కలిగించి, ఆ తరువాత నడుముభాగం, తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాల్లోకి వ్యాపిస్తుంది. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువ అవుతుంది. నడుము భాగంలో ప్రత్యేకించి ఎల్-4, ఎల్-5 వెన్నుపూసల మధ్య ఉండే సయాటికా నరం మీద ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పి వస్తుంది. నడుము నొప్పికి ఆయుర్వేద చికిత్స నడుము నొప్పి అనే సమస్యకు ఆయుర్వేద శాస్త్రంలో సమగ్రమైన చికిత్సా పద్ధతులున్నాయి. అందులో నిదాన పరివర్జనం, శమన చికిత్స, శోధన చికిత్స అనే మూడు ప్రధానమైనవి. నిదాన పరివర్జనము: నిదాన పరివర్జనము అనగా వ్యాధికి కారణమైన విషయాలను పాటించకపోవడం. ఉదా: విరుద్ధ ఆహార - విహారసేవన. (రాత్రి మేల్కొనడం, పగలు నిద్రించడం మొదలైనవి) శమన చికిత్స: వ్యాధి దోషాలను శమింపచేయటానికి తెచ్చే ఔషధాలు, ఇందులో రోగ తీవ్రతను బట్టి, రోగి బలాన్ని బట్టి చూర్ణాలు, గుటికలు, కషాయాలు, లేహ్యాలు, తైలాలు ఇత్యాది ఔషధాలు రోగికి ఇవ్వబడతాయి. కానీ, ఈ శమనచికిత్స వలన ప్రకోపించిన దోషాలు మళ్లీ తిరగబడవచ్చు. అందుకే వ్యాధి తీత్రవను బట్టి శమన చికిత్సలతోపాటు, కొందరికి పంచకర్మ (శోధన చికిత్స) కూడా అవసరం. తద్వారా ప్రకోపించిన దోషాలను (వాత, పిత్త, కఫ) సమంగా చేసి శరీర శుద్ధిని, అగ్నిబలాన్ని పెంపొందించవచ్చును. ఆయుర్వేదంలో స్నేహకర్మ ద్వారా వెన్నుపూసల మధ్య, స్నిగ్ధత్వాన్ని పెంపొందించి కీళ్ల కదలికను సులభతరం చేసే అవకాశం ఏర్పడుతుంది. స్వేదకర్మ ద్వారా బిగుసుకుపోయిన కీళ్ళను వదులుగా, మృదువుగా మారేలా చేయవచ్చు. కటివస్తి: ఈ విధానం ఆయుర్వేదంలోని ఒక విశిష్ట ప్రక్రియ. అరిగిపోయిన మృదులాస్థికి (కార్టిలేజ్) రక్తప్రసరణను పెంచి నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే క్రమంలో సర్వాంగధార చికిత్స కూడా వీరికి బాగా ఉపయోగపడుతుంది. వస్తికర్మ: ఆయుర్వేద శాస్త్రంలో వస్తికర్మ అనే చికిత్స అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వస్తికర్మ ముఖ్యంగా చిన్నప్రేవులు, పెద్దప్రేవులలోని ఎంటరిక్ నర్వస్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతుంది. తద్వారా నాడీకణాలలో ఏర్పడిన లోపాలను సరిచేసి బలం చేకూర్చవచ్చు. అలాగే ప్రకోపించిన వాతాన్ని కూడా సహజస్థితికి తీసుకునిరావచ్చును. జాగ్రత్తలు: అవసరమైన పోషకాహారం తీసుకుంటూ, వ్యాధి తిరిగి రాకుండా వైద్యులు సూచించిన విధానాలను అనుసరించడం చాలా అవసరం. ఔషధ చికిత్సల తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తే నడుము నొప్పి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది. డిస్క్‌లో వచ్చే మార్పులు వెన్నుపూసల మధ్య ఉండే డిస్కుల్లో కొన్ని మార్పులు జరిగినప్పుడు, డిస్క్‌ల మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో వాపు రావటం, డిస్క్కి రక్త ప్రసరణ సరిగా లేకపోవటం, డిస్కు అరిగిపోవడం వంటి అనేక సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్కులో వాపు వస్తే అందులోంచి చిక్కని ద్రవం బయటికి వచ్చి మేరుదండం నుంచి వచ్చే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల వెన్ను నొప్పి వస్తుంది. లక్షణాలు నడుములో నొప్పి, వాపు, ఏ కాస్త శ్రమించినా నొప్పి తీవ్రం కావటం, సూదులతో గుచ్చినట్లుగా నొప్పి, కాళ్లల్లో తిమ్మిర్లు, మంటలు ఉంటాయి. సకాలంలో చికిత్స అందకపోతే స్పర్శజ్ఞానం కోల్పోతారు. సమస్య తీవ్రమైతే కొందరు మలమూత్రాల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్‌లో మలబద్దకం, జీర్ణాశయ సమస్యలు వస్తాయి. వెన్ను సంబంధిత సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి రాకుండా పోతుంది. డాక్టర్ మనోహర్ ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హనుమకొండ, రాజమండ్రి, కర్ణాటక. ph: 8977 33 66 88 www.starayurveda.com -
నడుమునొప్పి -ఆయుర్వేద చికిత్స
ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని జీవనం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధంగా ఉంటోంది. పెరిగిపోతున్న పని ఒత్తిడి, పోషకాహారం సరిగా తీసుకోకపోవడం వలన, ఈరోజుల్లో 40 ఏళ్లకే నడుము నొప్పి వస్తోంది. ముఖ్యంగా ఆహార లోపాలు, అస్తవ్యస్తమైన దినచర్యలు, స్వప్న విపర్యం అంటే రాత్రివేళ నిద్రపోకపోవటం, పగటిపూట నిద్రించడం వంటి అలవాట్లు శరీర వ్యవస్థను బాగా దెబ్బ తీస్తున్నాయి. అలాగే ఆందోళన, మానసిక ఒత్తిడి వంటి కారణాలు కూడా అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. వీటిలో అతిముఖ్యమైనది నడుము నొప్పి (కటిశూల). ఆయుర్వేద శాస్త్రం నడుము నొప్పికి గుద్రసీవాతంగా నామకరణం చేసింది. నూటికి 90 శాతం మంది తమ జీవితకాలంలో ఎపుడో ఒక్కసారి నడుము నొప్పి బారిన పడతారని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. కారణాలు: ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవటం, స్థూలకాయం, విశ్రాంతి అనేది లేకుండా ఎక్కువ గంటలు విపరీతంగా శ్రమించడం, అతిగా బరువులు మోయటం, ద్విచక్రవాహనం మీద ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రుగ్మతలు, వంశపారంపర్యం వ్యాధులు ఇవి అన్ని నడుమునొప్పికి కారణమవుతుంటాయి. ఈ కారణాల వల్ల ముఖ్యంగా వాత ప్రకోపం జరుగుతుంది. ఫలితంగా ముందు పిరుదులకు పైభాగాన స్థబ్దతను, నొప్పిని కలిగించి, ఆ తరువాత నడుముభాగం, తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాల్లోకి వ్యాపిస్తుంది. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువ అవుతుంది. నడుము భాగంలో ప్రత్యేకించి ఎల్-4, ఎల్-5 వెన్నుపూసల మధ్య ఉండే సయాటికా నరం మీద ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పి వస్తుంది. నడుము నొప్పికి ఆయుర్వేద చికిత్స నడుము నొప్పి అనే సమస్యకు ఆయుర్వేద శాస్త్రంలో సమగ్రమైన చికిత్సా పద్ధతులున్నాయి. అందులో నిదాన పరివర్జనం, శమన చికిత్స, శోధన చికిత్స అనే మూడు ప్రధానమైనవి. నిదాన పరివర్జనము: నిదాన పరివర్జనము అనగా వ్యాధికి కారణమైన విషయాలను పాటించకపోవడం. ఉదా: విరుద్ధ ఆహార - విహారసేవన. (రాత్రి మేల్కొనుట, పగలు నిద్రించుట మొదలైనవి) శమన చికిత్స: వ్యాధి దోషాలను శమింపచేయటానికి తెచ్చే ఔషధాలు, ఇందులో రోగ తీవ్రతను బట్టి, రోగి బలాన్ని బట్టి చూర్ణాలు, గుటికలు, కషాయాలు, లేహ్యాలు, తైలాలు ఇత్యాది ఔషధాలు రోగికి ఇవ్వబడతాయి. కానీ, ఈ శమనచికిత్స వలన ప్రకోపించిన దోషాలు మళ్లీ తిరగబడవచ్చు. అందుకే వ్యాధి తీత్రవను బట్టి శమన చికిత్సలతోపాటు, కొందరికి పంచకర్మ (శోధన చికిత్స) కూడా అవసరం. తద్వారా ప్రకోపించిన దోషాలను (వాత, పిత్త, కఫ) సమంగా చేసి శరీర శుద్ధిని, అగ్నిబలాన్ని పెంపొందించవచ్చును. ఆయుర్వేదాన్ని స్నేహకర్మ ద్వారా వెన్నుపూసల మధ్య, స్నిగ్ధత్వాన్ని పెంపొందించి కీళ్ల కదలికను సులభతరం చేసే అవకాశం ఏర్పడుతుంది. స్వేదకర్మ ద్వారా బిగుసుకుపోయిన కీళ్ళను వదులుగా, మృదువుగా మారేలా చేయవచ్చు. కటివస్తి: ఈ విధానం ఆయుర్వేదంలోని ఒక విశిష్ట ప్రక్రియ. అరిగిపోయిన మృదులాస్థికి (కార్టిలేజ్) రక్తప్రసరణను పెంచి నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే క్రమంలో సర్వాంగధార చికిత్స కూడా వీరికి బాగా ఉపయోగపడుతుంది. వస్తికర్మ: ఆయుర్వేద శాస్త్రంలో వస్తికర్మ అనే చికిత్స అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వస్తికర్మ ముఖ్యంగా చిన్నప్రేవులు, పెద్దప్రేవులలోని ఎంటరిక్ వర్వస్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతుంది. తద్వారా నాడీకణాలలో ఏర్పడిన లోపాలను సరిచేసి బలం చేకూర్చవచ్చు. అలాగే పక్వాశయలో వాతస్థానం కాబట్టి ప్రకోపించిన వాతాన్ని కూడా సహజస్థితికి తీసుకునిరావచ్చును. జాగ్రత్తలు: అవసరమైన పోషకాహారం తీసుకుంటూ, వ్యాధి తిరిగి రాకుండా వైద్యులు సూచించిన విధానాలను అనుసరించడం చాలా అవసరం. ఔషధ చికిత్సల తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తే నడుము నొప్పి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది. డిస్క్‌లో వచ్చే మార్పులు వెన్నుపూసల మధ్య ఉండే డిస్కుల్లో కొన్ని మార్పులు జరిగినప్పుడు, డిస్క్‌ల మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో వాపు రావటం, డిస్క్కి రక్త ప్రసరణ సరిగా లేకపోవటం, డిస్కు అరిగిపోవడం వంటి అనేక సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్కులో వాపు వస్తే అందులోంచి చిక్కని ద్రవం బయటికి వచ్చి మేరుదండం నుంచి వచ్చే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల వెన్ను నొప్పి వస్తుంది. లక్షణాలు నడుములో నొప్పి, వాపు, ఏ కాస్త శ్రమించినా నొప్పి తీవ్రం కావటం, సూదులతో గుచ్చినట్లుగా నొప్పి, కాళ్లల్లో తిమ్మిర్లు, మంటలు ఉంటాయి. సకాలంలో చికిత్స అందకపోతే స్పర్శజ్ఞానం కోల్పోతారు. సమస్య తీవ్రమైతే కొందరు మలమూత్రాల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్‌లో మలబద్దకం, జీర్ణాశయ సమస్యలు వస్తాయి. వెన్ను సంబంధిత సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి రాకుండా పోతుంది. -
బాధించే నడుమునొప్పి
నడుమునొప్పి గురించి విననివారు, దీనిబారిన పడనివారు ఉండరు. ముఖ్యంగా 2/3 మంది 20 సంవత్సరాలు దాటినవారిలో చూస్తాం. ముఖ్యంగా మహిళలలో ఈ నొప్పితో ఎక్కువగా బాధపడతారు. వారి జీవన విధానం, ప్రెగ్నెన్సీ, డెలివరీ, ఇంటి పనులు తీవ్రతను పెంచుతారు. డాక్టరు దగ్గరికి వెళ్ళేవారిలో ప్రతి ఇద్దరు ముగ్గురిలో ఈ బాధ బారిన పడేవారు ఒకరు తప్ప ఉంటారు. పనిచేయలేకపోవటం, విశ్రాంతి దీనికి అవసరం అవటంవలన వారు సెలవు దీనివలన తీసుకుంటారు. అధికంగా పని దినాలు దీనివలనే వృధా అవుతుంటాయి. నడుమునొప్పి వ్యాధి కాదు. వ్యాధి యొక్క లక్షణములు మాత్రమే. ఇది చాలా వ్యాధులలో సర్వ సాధారణంగా కనబడుతుంది. చిన్న జ్వరం నుండి బాధించే ప్యాసెట్ సైనొవ్యయల్ సిస్ట్ (Facet Synovial Cyst) నడుమునొప్పికి కారణాలు అనేకం. శరీరశ్రమ, పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు కూడా కారణం అవుతాయి. మనం దీనిని మూడు విధాలుగా విభజించవచ్చును. సిస్టమ్ డిసీస్ Systemic Disease, స్ట్రెస్, టెన్షన్ వలన లేదా Nurological problem న్యూరోలాజికల్ ప్రాబ్లమ్ వలన. సామాన్యంగా పది మంది నొప్పులతో బాధపడేవారిలో, ఆరుగురు నడుమునొప్పి బాధ ఉన్నవారే. సన్నని నొప్పి, ఆగకుండా కలిగే నొప్పి, ఉప్పెన మాదిరిగా వచ్చే నొప్పి, కూర్చుంటే కలిగే నొప్పి, టూ వీలర్ నడిపితే కలిగే నొప్పి, గృహిణిలకు పనివలన కలిగే నొప్పి, పెద్దవారికి టీవీ చూస్తే నొప్పి, స్కూలు పిల్లలకు బ్యాగులు మోసి (బుక్స్) నొప్పి, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూర్చునే నొప్పి, వ్యాపారులకు, ఉద్యోగులకు, రాజకీయనాయకులకు, రైతులకు పొలాలో నొప్పి, నాట్యకళాకారులకు నాట్యంలో నొప్పి, వృద్ధులకు పడుకుంటే నొప్పి, అందరినీ బాధించే నొప్పి నడుమునొప్పి. వివిధ కారణాలు: స్వల్పకాలిక నొిప్పి: కొన్ని రోజులు, కొన్ని వారాలు ఉండే నొప్పి ముఖ్యంగా గాయాలు, వెన్నుపూసవాపు, కండరాల శ్రమ, ఆటలలో గాయాలు, అలసటతో పనిచేయడం, బరువులు ఎత్తుట... ఇటువంటి సమయాలలో నొప్పి ఆకస్మాత్తుగా తీవ్రం గా పొడిచినట్లుగా ఉంటుంది. కదలికలలో నిర్బంధం, ఫ్రీగా తిరగలేరు, కండరాలు పట్టివేసినట్లుండటం, నిటారుగా నిలబడలేరు, చక్కగాపడుకోలేరు. దీర్ఘకాలిక నొప్పి : మూడు నెలల కంటే ఎక్కువైనచో కారణాలు వేరుగా ఉంటాయి. వివిధ రకాలుగా ఈ నొప్పి వివిధ భాగాలలో ఉంటుంది. వెన్నుపూసలో మార్పుల వలన వచ్చే నొప్పులు. డిస్క్ (వెన్నుపూస) సమస్యలు డిస్క్ హెర్వియేషన్ డిస్క్‌బల్జ్ (వాపు) డిస్క్ ప్రొలాప్స్ (ప్రక్కకు జరుగుట) నర్వ్ కంప్రెషన్ కెనాల్ నారోయింగ్ డిస్క్ లైసిస్ డిస్క్ ట్రోమ డిస్క్ ఫ్యాక్టర్స్ డిస్క్ సిండ్రోమ్స్ స్పైనల్ టీబీ ఆస్టియో పొరోసిస్ డిస్క్ వాపు, ఆర్ట్రైటిస్ డిస్క్ (వెన్నుపూస) వాపు, పక్కకు జరుగుట వంటివాటికి కలిగే బాధలు: వెన్నుపూసల మధ్యన ఉండే జిగురుపదార్థం తగ్గి పక్కకు జరుగుతుంది. అపుడు నడుమునొప్పి పిరుదుల నుండి కాళ్ళ వరకు, మెడనొప్పి, భుజములు, చేతులు, తిమ్మిరి, మొద్దు బారిపోవుట, కండరాల పట్టు తగ్గుట, వణుకుట చూస్తాం. రోగ నిర్ధారణ: ఎక్స్-రే ఎమ్ఆర్ఐ సీటీ స్కాన్ వాడదగిన హోమియో మందులు రస్టాక్స్: కండరాల, కీళ్ళ నొప్పులు, కదలికలలో నిర్బంధం (స్టిఫ్నెస్) చల్ల గాలి, తేమ వలన వచ్చేనొప్పి, నడుమునొప్పి, కీళ్ళ నొప్పులు. తార్నికం: గాయాలు, బెణుకుట వలన కలిగే నొప్పి,జ్వరం, కీళ్ళ నొప్పులు, వాపు, నడకతో పెరిగే నొప్పులు. సిమిసిపూగ: స్త్రీల సంబంధ నొప్పులు, మెన్సెస్ టైమ్‌లో పెరిగే నొప్పులు, వాతావరణ మార్పుల వలన కలిగే నొప్పులు కాస్టకమ్: కండరాల పటుత్వం, నిర్బంధం, కీళ్ళవాపు, కండరాల క్షీణత, ఎక్కువ చలి వేడి పడదు, నడకతో పెరిగే నొప్పి. అకొటైట్: ఉప్పెనలాంటి నొప్పులు, భయం, ఆందోళన విపరీతమైన నొప్పి, ప్రాణభయం, నరాలసంబంధ నొప్పులు. బెల్లడొనా: కీళ్ళ వాపు, కండరాల నొప్పి, తీవ్రంగా, సడెన్‌గా వచ్చే నొప్పి, జ్వరం, కండరాలు పట్టి వేయుట, స్పాజెర్స్. హోమియో చికిత్స హోమియో వైద్యం ద్వారా కండరాల, కీళ్ళ, నరముల సంబంధ వ్యాధులకు స్టార్ హోమియోపతిలో నవీన చికిత్స కనుగొనబడినది. నూతన పరిశోధన ఫలితాలను అనుసరించి శారీరక, మానసిక విశ్లేషణ కారణం రోగ లక్షణములను, మూలకారణములు వీటిని బట్టి హోమియో మందులు సూచింపబడును. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109 -
రోడ్డెక్కితే నడ్డి విరిగినట్టే..
సాక్షి, హైదరాబాద్: నగరంలో ‘వెన్ను’కు దన్నులేకుండాపోతోంది. వెన్నుపూసకు పెద్ద ఆపదొచ్చింది. క్షణమైనా నిలబడనీయదు. కాసేపు నడవనివ్వదు. ఇక ప్రయాణమంటే గగనమే. పగలంతా తిరిగొస్తే రాత్రి ఒక పట్టాన నిద్ర పట్టదు. పడుకుని లేస్తే కలుక్కు.. కూర్చోవాలంటే నరకం. ఇదేదో అరవై ఏళ్లు నిండిన వారి వ్యధ కాదు.. నిండా ముప్ఫై కూడా పూర్తికాని యువత వెత. నడుము నొప్పి అని చెప్పుకోలేక.. తిరగనూ లేక ఎలాగో నెట్టుకొస్తున్న పరిస్థితి. కొనితెచ్చుకున్న జబ్బు కాదు. వెన్ను కలుక్కుమందంటే లక్షలకు లక్షలు వదుల్చుకోవాల్సిందే. జీవనశైలి, విధి నిర్వహణలోని తీరుతెన్నులు ఈ పరిస్థితికి ఒక కారణమైతే నగర రోడ్లు మరో ముఖ్య కారణం. రోడెక్కితే చాలు నడ్డి విరుగుతోందన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి ఉంది. నగరంలో నడుమునొప్పి బాధితులు పెరుగుతున్నారు. ఏటా దాదాపు 3 లక్షల కేసులు కొత్తగా నమోదవుతున్నాయని జంటనగరాల ఆర్థోపెడిక్ అండ్ స్పైనల్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రాథమికంగా అంచనా వేసింది. గతుకుల రోడ్లే వెన్ను విరుస్తున్నాయి.. నగరంలో దాదాపు 25 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏటా రెండున్నర లక్షలమంది వెన్ను నొప్పికి గురవుతుండగా, వారిలో ద్విచక్ర వాహన దారులే 80 శాతం మంది ఉన్నారు. మిగతా వారిలో ఐటీ, ప్రభుత్వోద్యోగులు, ప్రమాద బాధితులు, జన్యుపర లోపాలతో బాధపడుతున్న వారు ఉన్నట్టు తేలింది. ద్విచక్ర వాహనచోదకులు ప్రస్తుతం నగర రోడ్లలో రోజూ 20 కిలోమీటర్లు పైగా ప్రయాణిస్తే చాలు రెండేళ్లలో వెన్నునొప్పికి గురయ్యే ప్రమాదమున్నట్టు వైద్యులు గుర్తించారు. గతుకుల రోడ్లలో ఒక్కసారి పడితే చాలు వెన్ను తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా ఎక్కువ మంది వెన్నునొప్పికి గురవుతున్నారు. మూడువేల గోతులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 6వేల కిలోమీటర్ల మేర రోడ్లున్నాయి. ఇందులో ప్రతి వర్షాకాలంలోనూ ఇవి దెబ్బతింటున్నాయి. ఏటా ప్రధాన రహదారులపై 3 వేలకుపైగా గోతులు ఏర్పడుతున్నాయి. ఒక్కో వాహనచోదకుడు రోజూ సరాసరిన 15 కి.మీ. మేర గోతుల రోడ్లపైనే ప్రయాణిస్తున్నారు. ఈ రోడ్లపై ప్రయాణంతో ఆటో, బస్సు డ్రైవర్లూ ఎక్కువగా వెన్నునొప్పికి గురవుతున్నట్టు తేలింది. వెన్నునొప్పికి ఎలా గురవుతున్నారంటే.. ప్రతి ఒక్కరిలో వెన్నుపూస కీలకం. వెన్నుకు సంబంధించి మెడ భాగంలోని సీ4-సీ5, సీ5-సి6 భాగాలు, నడుము చివర భాగంలో ఉన్న ఎల్4-ఎల్5, ఎల్5-ఎస్1 భాగాలు అత్యంత కీలకమైనవి. గతుకుల రోడ్లలో వాహనాలు ఒక్కసారిగా కుదుపునకు గురవటం వల్ల ముఖ్యంగా ఎల్5-ఎస్1 భాగాలు దెబ్బతింటున్నాయి. దీనివల్ల నడుమునొప్పి రావడం, తర్వాత ఒక కాలు, ఒక చెయ్యి జాలుగా నొప్పి వస్తుంది.. ఈ ప్రభావం మెడ భాగంలో ఉన్న సీ4-సీ5 భాగంలోనూ పడుతోంది. పదేపదే ఆయా భాగాలపై ఒత్తిడి కారణంగా అవి ఎక్కువ అరుగుదలకు గురవుతున్నట్టు వైద్యుల అంచనా. ఏటా 10 వేలకు పైగా సర్జరీలు నగరంలో నడుమునొప్పి శస్త్రచికిత్సలు పెద్దసంఖ్యలో జరుగుతున్నాయి. 2002-2007 మధ్య జంటనగరాల్లో 5 వేల శస్త్రచికిత్సలు జరగ్గా, 2011-12 మధ్య ఒకే ఏడాదిలో సుమారు 10వేల శస్త్రచికిత్సలు జరిగినట్లు వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. మరికొన్ని ముఖ్యమైన అంశాలు పరిశీలిస్తే... గంటకు 40 మంది నడుమునొప్పి బాధితులు నమోదవుతున్నారు 2005 తర్వాత సర్జరీల సంఖ్య 50 శాతంపైనే పెరిగాయి బ్యాక్‌పెయిన్ శస్త్రచికిత్సలకు ఏటా కనీసం రూ.130 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారు జిల్లాలతో పోలిస్తే శస్త్రచికిత్సలు జంటనగరాల్లో 80 శాతం ఎక్కువ జంటనగరాల్లో ఆర్థోపెడిక్, స్పైనల్ సర్జన్లు 200 మందిపైనే ఉన్నా 30 మంది మాత్రమే ఎక్కువగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. చెన్నై, బెంగళూరు, త్రివేండ్రం, కొచ్చిన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఎక్కువమంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు తప్పనిసరి పరిస్థితుల్లోనే సర్జరీ జంట నగరాల్లో వెన్నునొప్పి బాధితులు పెరుగుతున్నారు. గతుకుల రోడ్లు దీనికి ప్రధాన కారణం. సాఫ్ట్వేర్ రంగం నుంచి కూడా ఈ బాధితులు ఉన్నారు. ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చోవడం, గతుకుల కారణంగా వెన్నుపై ఒత్తిడి పెరిగి ఆపై నొప్పిరావడం తొలిదశ. రెండో దశలో ఒత్తిడి ఉన్న భాగాల అరుగుదల మొదలవుతుంది. కొద్ది రోజులకు డిస్కులు జారిపోవడం జరుగుతుంది. దీంతో నడుమునొప్పితో పాటు ఒక కాలు, ఒక చేయికి నొప్పి రావడం మొదలవుతుంది. 90 శాతం మందికి మందులు, ఫిజియోథెరపీతోనే నయమయ్యేలా చూస్తాం. తప్పనిసరైతేనే సర్జరీకి వెళతాం. సర్జరీ అనంతరం జీవనశైలి మార్చుకోవాలి. గతుకుల రోడ్లలో ప్రయాణించరాదు. చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుండాలి. - డాక్టర్ నరేష్‌బాబు, వెన్నుపూస వైద్య నిపుణులు, మెడిసిటీ ఆస్పత్రి (జంటనగరాల ఆర్థోపెడిక్, స్పైనల్ వైద్యుల అసోసియేషన్ సభ్యులు)