నడుమునొప్పిని నివారించే ఆహారం... | Food to prevent waist | Sakshi
Sakshi News home page

నడుమునొప్పిని నివారించే ఆహారం...

Published Wed, Aug 2 2017 11:59 PM | Last Updated on Sun, Sep 17 2017 5:05 PM

నడుమునొప్పిని నివారించే ఆహారం...

నడుమునొప్పిని నివారించే ఆహారం...

గుడ్‌ఫుడ్‌

వెన్ను ఆరోగ్యానికి తగినంత వ్యాయామంతో పాటు పోషకాహారం కూడా అవసరమే. ఆ ఆహారం ఎన్నో గాయాలను త్వరగా మాన్పి... వెన్నునొప్పులను నివారిస్తుంది. ఆ పోషకాలివి.

కాల్షియమ్‌: ఆహారంలో కాల్షియమ్‌ పుష్కలంగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. పాలు, పెరుగు, వెన్నతో పాటు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, చేపలలో క్యాల్షియమ్‌ ఎక్కువ.

విటమిన్‌ డి3 : మన ఒంట్లోకి వచ్చే క్యాల్షియమ్‌ ఎముకల్లోకి ఇంకేలా చేసి, వాటి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో విటమిన్‌–డి అద్భుతమైన భూమిక పోషిస్తుంది. స్వాభావికమైన ఎండతో పాటు చేపలు, కాలేయం, గుడ్డు వంటి ఆహారాల్లో విటమిన్‌ డి పుష్కలంగా ఉంటుంది.

విటమిన్‌–సి : చిగురు ఎముకలో ఉండే కొలెజెన్‌ వంటివి ఏర్పరచడం లోనూ, ఎముకలు, కండరాలు, చర్మం, టెండన్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో విటమిన్‌–సిది ప్రధాన పాత్ర. నిమ్మజాతి పండ్లతో పాటు జామ, టొమాటో, కాప్పికమ్‌లలో ఇది ఎక్కువ.

ఇక గాయాలను మాన్పడం: దెబ్బతిన్న భాగాల రిపేర్‌ కోసం మాంసం, పప్పు వంటి ప్రోటీన్లు తీసుకోవాలి.
విటమిన్‌–బి12 : అన్ని రకాల చేపలు, మాంసంతో పాటు తాజా పండ్లు, ఆకుకూరలు, పౌల్ట్రీ ఉత్పాదనల్లో బిటమిన్‌–బి 12 పాళ్లు ఎక్కువ.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement