వెస్టిండీస్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. వెన్నునొప్పితో బాధపడిన రోహిత్ 11 పరుగుల వద్ద ఉన్నప్పుడు రిటైర్డ్‌హర్ట్‌గా క్రీజును వదిలాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ అల్జారీ జోసెఫ్ బౌలింగ్ చేయగా.. మొదటి బంతికి రోహిత్ శర్మ సిక్స్ బాదాడు. రెండో బంతి డాట్ కాగా.. మూడో బంతికి ఫోర్ బాదాడు. ఇక నాలుగో బంతి అనంతరం అసౌకర్యంగా కనిపించిన రోహిత్.. వెన్నునొప్పితో అల్లాడిపోయాడు. లెగ్ సైడ్ స్వీప్ షాట్ కొట్టడానికి ప్రయత్నించిన రోహిత్‌కు వీపు కండరాలు పట్టేశాయి.
టీమిండియా ఫిజియో కమలేష్ జైన్ వచ్చి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది.దీంతో హిట్‌మ్యాన్ రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. కాగా రోహిత్ శర్మ గాయంపై బీసీసీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. 'టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రస్తుతం వెన్ను నొప్పి ఉంది. అతని పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. మిగతా టి20 మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడా అనేది ఇప్పుడే చెప్పలేం' అని ట్వీట్ చేసింది.
కాగా మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. 'ప్రస్తుతానికి ఫర్వాలేదు. నాలుగో టీ20 మ్యాచుకు కొన్ని రోజుల సమయం ఉంది. అప్పటివరకు గాయం పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి' అని తెలిపాడు. ఒకవేళ నాలుగో టి20 వరకు రోహిత్కు గాయం తగ్గినా.. కీలకమైన ఆసియా కప్ ఉన్న నేపథ్యంలో బీసీసీఐ అతడికి విశ్రాంతిని ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ హిట్‌మ్యాన్ గాయం పెద్దది అయితే మాత్రం 3-5 వారాల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే రోహిత్ శర్మ ఆసియా కప్‌కు దూరం కానున్నాడు.
చదవండి: IND Vs WI 3rd T20: సూర్యకుమార్ మెరుపులు.. మూడో టి20లో భారత్ ఘన విజయం
India T20I Chasing Record: లక్ష్య ఛేదనలో టీమిండియా కొత్త రికార్డు..
Comments
Please login to add a commentAdd a comment