
సాక్షి, హైదరాబాద్: ఎంపీ రఘురామకృష్ణరాజుకు ప్రజా సంఘాల ఆందోళనల సెగ తగిలింది. ఆయన భీమవరానికి రావడానికి చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలంటూ ఆదివారం రాత్రి ఏపీలోని పలు ప్రాంతాల్లోని రైల్వేస్టేషన్ల వద్ద ప్రజా సంఘాల నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
చదవండి: మంత్రి బుగ్గన వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా?
‘రఘురామకృష్ణరాజు గో బ్యాక్.. గో బ్యాక్’ అంటూ విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్ల వద్ద పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. దీంతో హైదరాబాద్‌లోని లింగంపల్లి నుంచి ఆదివారం రాత్రి రైల్లో భీమవరం బయలుదేరిన రఘురామ.. ప్రజా సంఘాల నిరసనల నేపథ్యంలో మధ్యలో బేగంపేటలో రైలు దిగి వెనక్కి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment