Homoeo care
-
సిస్టిమిక్ ల్యూపస్ ఎరిథెమాటసస్ (SLE)
SLE వలన శరీరంలోని అనేక అవయవాలు వ్యాధికి గురి అవుతాయి. ఇది గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కీళ్ళు, చర్మం, రక్తనాళాలు, నాడీవ్యవస్థను పీడిస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. మన రోగనిరోధక వ్యవస్థలోని తెల్ల రక్తకణాలు మన సొంత కణాలపై దాడి చేయడం వలన వచ్చే వ్యాధులను ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. ఇది 15 నుండి 35 సంవత్సరాల లోపు స్త్రీలలో అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జబ్బు యొక్క దిశను ఊహించటం కష్టం. ఇది కొద్దిరోజులు తీవ్రంగానూ (Flare up), కొద్ది రోజులు వ్యాధి లక్షణాలు తక్కువ అవటం జరుగుతుంది. (Remissions) లక్షణాలు ఈ వ్యాధికి గురయ్యే అవయవాన్ని బట్టి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. చర్మము: ముఖచర్మంపై దద్దుర్లు రావటం, చెంప మరియు ముక్కు పైన సీతాకోకచిలుక ఆకారంలో దద్దుర్లు రావటం చూస్తాము. దీనినే butterfly Rash అంటాము. డిస్కాయిడ్ లూపస్ (Discoid lupus) : ఈ రకం SLE లో చర్మం ఎర్రబడటం, పొలుసులు రాలటం, చర్మంలోని లో పొరలలో నుంచి దళసరి పగుళ్ళు, రక్తస్రావంతో కూడిన పొలుసులు రాలటం, చర్మంపై నల్లటి మచ్చలు అవటం వంటివి జరుగుతాయి. మూత్రపిండాలు: ఎక్కువ శాతం SLE రోగులలో మూత్రపిండాలు ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉంటుంది. దీనినే Lupus Nephritis అంటారు. మూత్రంలో రక్తకణాలు, ప్రొటీన్లు కోల్పోతాయి. శరీరమంతా వాపులు వస్తాయి, బరువు పెరుగుతుంది. SLE దీర్ఘకాలంలో మూత్రపిండాలను పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. ఒక్కోసారి Dialysis గానీ మూత్రపిండ మార్పిడి గానీ చేయవలసిన అవసరం ఉండవచ్చు. అందువలన వ్యాధి తీవ్రమయ్యే కంటే ముందుజాగ్రత్త పడటం మంచిది. గుండె: SLE రోగులలో గుండెకు సంబంధించిన సమస్యలతో మరణించే వారి సంఖ్య అధికం. ముఖ్యంగా పెరికార్డైటిస్, మయోకార్డైటిస్ మరియు ఎండోకార్డైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివలన ఆయాసం, జ్వరము, నీరసం మొదలగు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. SLE వలన గుండెలోని రక్తనాళాలలో కొవ్వు పదార్థాలు వేగంగా, అధికంగా పేరుకుపోవడం వలన గుండెనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు రావటం. SLE సాధారణంగా అనేక కీళ్ళను, ముఖ్యంగా చిన్న కీళ్ళను ప్రభావితం చేస్తాయి. రక్తహీనత, తెల్లరక్తకణాలు తగ్గటం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గటం జరుగుతుంది. దీనివల్ల తరచు ఇన్ఫెక్షన్లకు గురికావటం, అధిక రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తులలో నిమ్ము చేరటం. దీర్ఘకాలంలో SLE వలస Diffuse Interstitial Lung Disease బారినపడే అవకాశం ఉంటుంది. నాడీవ్యవస్థ SLE వ్యాధి బారినపడితే మానసిక అశాంతి, పక్షవాతం, మూర్ఛవ్యాధి, తలనొప్పి మొదలగు లక్షణాలు వస్తాయి. గర్భిణీలలో SLE వలన పిండ మరణం, గర్భస్రావం అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. వ్యాధి నిర్థారణ పరీక్షలు CBP, ESR, CUE, రుమటాయిడ్ ఫ్యాక్టర్ C రియాక్టర్ ప్రొటీన్ (C-RP) యాంటీ న్యూక్లియర్ యాంటీ బాడీ (ANA) యాంటీ SM యాంటీ బాడీస్ (Anti SM- - Antibodies) యాంటీ ds DNA, ఇతర పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చును. సాధారణంగా ఈ వ్యాధికి అనేక చికిత్స పద్ధతులు ఉన్నప్పటికీ ఏ పద్ధతిలోనూ సంపూర్ణంగా నయం చేసే అవకాశం లేదు. కేవలం హోమియోపతి వైద్యవిధానంలో మాత్రమే మందుల వల్ల ఎటువంటి అసౌకర్యం, దుష్ఫలితాలు లేని చికిత్స చేయవచ్చు. హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానం, అధునాతనమైన నిపుణులచే SLE ని అదుపులో ఉంచడమే కాకుండా ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు. కారణాలు శాస్త్రీయపరంగా SLE వ్యాధికి గల కారణాలు మనకు అందుబాటులో లేవు. కానీ, జన్యుపరమైన, పర్యావరణ కారణాలు మరియు మానసిక ఒత్తిడి వలన ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుస్తోంది. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. -
సర్వైకల్ స్పాండిలోసిస్... సులభ వైద్యం
సర్వైకల్ స్పాండిలోసిస్ ఇటీవల చాలా ఎక్కువగా కనిపిస్తున్న సమస్య. ఇది ప్రధానంగా వృత్తిపరమైన రుగ్మత (ఆక్యుపేషనల్ హజార్డ్). ఇటీవల ఈ సమస్య తరచూ ద్విచక్రవాహనాలు నడిపేవారిలో, కదలకుండా కంప్యూటర్ ముందుగాని, డెస్క్‌లో గాని ఎక్కువగా కూర్చుని ఉండేవారిలో ఈ డిస్క్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ పెద్దగా లేని వారిలో కూడా ఈ సమస్యలు చాలా తరచుగా గమనించవచ్చు. ఈ తరహా సమస్యలు అందరిలో కనిపిస్తున్నా స్త్రీలతో పోలిస్తే ఇవి పురుషుల్లోనే ఎక్కువ. వయసు పెరుగుతున్న కొద్దీ వెన్నుపూసలలో మార్పులు రావడం అన్నది చాలా సాధారణంగా జరిగే స్వాభావిక మార్పు. అయితే ఈ మార్పుల కారణంగా డిస్క్‌ల మధ్యన ఉండే నరాల మీద ఒత్తిడి పెరుగుగుతుంది. దాంతో ఒకవేళ ఇలాంటి మార్పులు మెడ దగ్గర ఉండే వెన్నెముకల మధ్య సంభవించినప్పుడు మెడ పట్టేసినట్లు ఉండటం, తలనొప్పి, కళ్లు తిరగడం, భజాలు, చేతుల నొప్పి, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. నరాల మీద ఒత్తిడి వల్ల తలతిరగడం, నడకలో తేడా వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. కారణాలు: ఎముకలు, ఎముకల చివరన ఉండే కార్టిలేజ్ అరిగిపోవడంతో ఎముకలు ఎగుడుదిగుడుగా మారతాయి. దాంతో వాటి మధ్యన ఉండే నరాలపై ఒత్తిడి పడటం, అవి నలగడం జరుగుతుంది. ఫలితంగా మెడ వెనకభాగంలో నొప్పి, మెడ తిప్పలేకపోవడం, చేతులు లాగినట్లుగా ఉండటం, మెడ నుంచి చేతుల చివరి భాగం వరకు నొప్పి, తిమ్మిర్లు పాకినట్లుగా రావడం, పైకి చూస్తే కళ్లు తిరగడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. తూలినట్లుగా నడవటం, కొన్ని సందర్భాల్లో మల, మూత్రాలపై నియంత్రణ కోల్పోవడం జరగవచ్చు. చేయకూడని పనులు: పరుగెత్తడం, ఎక్కువసేపు టీవీ చూడటం, కంప్యూటర్‌పై అదేపనిగా పనిచేయడం, కుట్టుపని, ఎంబ్రాయిడరీ, నిటారుగా కూర్చోవడం, డ్రైవింగ్ వంటి పనులు చేయకూడదు. నివారణ: మెడ కండరాలకు బలం చేకూర్చే వ్యాయామాలు చేయాలి. వృత్తిపరంగా డెస్క్ ముందు కూర్చునేవారు సరైన భంగిమల్లో కూర్చోవాలి. మానసికమైన ఒత్తిడులు తగ్గించుకోవాలి. కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు ప్రతి పది నిమిషాలకు ఒకమారు లేచి నడవటం, కాస్త రిలాక్స్ కావడం మంచిది. చికిత్స: హోమియోలో కాల్కేరియా గ్రూపు మందులైన కాల్కేరియా ఫాస్, కాల్కేరియా ఫ్లోర్, బ్రయోనియా, స్పైజిలియా, హైపరికం, జెల్సీమినియం, రుస్టాక్స్, యాసిడ్‌ఫాస్ వంటి మందులను వాడటంవల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మానసిక, శారీరక స్వభావాలను, లక్షణాలను బట్టి వీటిని నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
స్పాండిలైటిస్‌కు హోమియోపతితో సంపూర్ణ నివారణ
నేటి మానవ జీవన విధానానికి ఎక్కువ దూరం ప్రయాణించి ఉద్యోగాలు చేయడం, రోజులో 2-4 గంటలు సమయం ప్రయాణానానికి కేటాయించడం, ఆఫీసులో ఎక్కువ సమయం కంప్యూటర్ మీద పనిచేయడం వలన వెన్నెముకపై అధిక ఒత్తిడి వలన స్పాండిలైటిస్‌కు దారి తీయడం సహజం. స్పాండిలైటిస్: వెన్నుపూసల మధ్య జరిగే ఇన్ఫ్లమేషన్ స్పాండిలైటిస్ అంటారు. స్పాండిలైటిస్, స్పాండిలోసిస్ మధ్య భిన్న వ్యత్యాసం ఉన్నది. స్పాండిలైటిస్ అనేది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఇది ఎక్కువగా 20-40 ఏళ్ళ వయస్సు ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. స్పైనల్ జాయింట్ల మధ్య ఇన్ఫ్లమేషన్ వల్ల ఇది వస్తుంది. స్పాండిలోసిస్ అంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్. ఇది ఎక్కువగా 40 ఏళ్ళు పైబడిన వారిలో కనిపిస్తుంది. వెన్నెముకలో ఉండే మృదులాస్థి, దాని చుట్టూ ఉండే కణజాలం డీ జనరేటివ్ మార్పులకు గురి కావడం వలన ఇది వస్తుంది. ఇందులో రెండు పూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదల వలన అధిక ఒత్తిడికి గురి అయినప్పుడు డిస్క్ వాచటం, డిస్క్ బయటికి పొడుచుకొని రావడం వలన వెన్నెముకల మధ్యలో ఉండే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. స్పాండిలైటిస్ గాని, స్పాండిలోసిస్ గాని వెన్నెముకలో ఏ భాగంలోనైనా జరిగే అవకాశం ఉంటుంది. కాని ముఖ్యంగా మెడ దగ్గర (Lovical spondilitis) వెన్నెముక - లుంబార్ స్పాండిలైటిస్ అంటారు. కారణాలు: వెన్నెముకకు దెబ్బలు తగలటం అధిక బరువును ఒక్కసారిగా ఎత్తడం సరి అయిన డ్రైవింగ్ పద్ధ్దతులను పాటించకుండా ఎక్కువగా డ్రైవింగ్ చేయడం వలన వెన్నుపూసల మధ్య ఒత్తిడి అధికమై ఈ సమస్య వస్తుంది వయస్సు పెరిగే కొద్ది వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదల వలన కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వలన కూడా ఇది వస్తుంది. (ఆంకిలైజింగ్ స్పాండిలైటిస్) క్షయవ్యాధి వెన్నెముకకు పాకడం వలన ఇది వస్తుంది. (Potts disease) ప్రస్తుత పరిస్థితులలో ఎక్కువగా కంప్యూటర్‌మీద పనిచేయడం వలన చిన్న వయస్సువారు కూడా స్పాండిలైటిస్ బారిన పడుతున్నారు. లుంబార్ స్పాండిలైటిస్ లక్షణాలు నడుమునొప్పి, కాలి నొప్పి, నడుము నుంచి క్రింది కాలివేళ్ళ వరకు లాగడం, పిరుదుల్లో నొప్పి, మంటగా ఉండడం, తొడదగ్గర తిమ్మిరిగా ఉండడం. కారణాలు: సియాటికా అనే నరం నడుము నుండి కాలివేళ్ళ వరకు ప్రయాణిస్తుంది. ఈ నరం L4-L5 ఒత్తిడికి గురి కావడం వలన ఈ నొప్పి వస్తూ ఉంటుంది. ఇది లుంబార్ స్పాండిలైటిస్‌లో సర్వసాధారణంగా కనిపించే లక్షణం. కొన్ని సందర్భాలలో దీనివలన పేషెంట్ నడవడం కూడా చాలా కష్టం అవుతంది. కొంతకాలం పూర్తిగా బెడ్‌రెస్ట్ తీసుకునే పరిస్థితి వస్తుంది. రకాలు సర్వైకల్ స్పాండిలోసిస్ లుంబార్ స్పాండిలోసిస్ ఆంకిలైజింగ్ స్పాండిలోసిస్ పాట్స్ డిసీజ్ సర్వైకల్ స్పాండిలైటిస్ లక్షణాలు: వెన్నెముకలో వచ్చే ఒత్తిడిని బట్టి లక్షణాలు ఉంటాయి. మెడ దగ్గర నొప్పి రావడం, వెనుక భాగంలో అరల కదలికలో నొప్పి ఎక్కువ కావడం, మెడ, ఛాతి, భుజాలు, ఛాతి మొత్తంలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. మంట, మొద్దు బారినట్లుగా ఉండడం, తిమ్మిరిగా ఉండటం జరుగుతుంది. ఈ తిమ్మిరి ఛాతీ నుంచి వీపు వరకు ఉంటుంది. కొన్నిసార్లు తల తిరగడం, వాంతులు కావడం, కళ్ళు మసకబారడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆంకిలైజింగ్ స్పాండిలైటిస్ ఇది జీవనక్రియల్లో జరిగే మార్పుల వలన వచ్చే ఆటో ఇమ్యూనో డిసీజ్. దీనిలో ముఖ్యంగా వెన్నెముక, దానిచుట్టూ కణజాలం మృదుత్వాన్ని కోల్పోయి వెన్నెముక కదలికలు అన్నీ ఆగిపోయి గట్టిగా కర్రలా తయారవుతుంది. దీనిని ‘బాంబూ’ అంటారు. జన్యుపరమైన కారణాల వలన ఇది ఎక్కువగా సంభవిస్తుంది. ఇది ఎక్కువగా వెన్నెముక, తుంటి ఎముకలు శాక్రో ఇలియాక్ జాయింట్స్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. అన్నీ మృదుత్వాన్ని కోల్పోయి గట్టిపడి పోతాయి. దానిమూలంగా వెన్నెముకలో సాధారణ కదలికలు నిలచిపోతాయి. ఇది ఎక్కువగా 15-40 ఏళ్ళు వయసు ఉన్న వారిలో కనిపిస్తుంది. దీనిని హెచ్ఎల్బీ-27 అనే పరీక్ష ద్వారా నిర్థారించవచ్చును. లక్షణాలు: వెన్నెముక గట్టిపడి కదలికలను తగ్గించడం వెన్నునొప్పి వెన్నెముక బయటకు పొడుచుకొని రావడం జ్వరం నీరసం, బరువు తగ్గడం. నిర్థారణ పరీక్షలు : ఎక్స్-రే స్పైన్ ఎమ్ఆర్ఐ ఆఫ్ స్పైన్ సీబీపీ, ఈఎస్ఆర్ హెచ్‌సీబీ-27 హోమియో చికిత్స హోమియో వైద్య విధానం ద్వారా కేవలం రోగ లక్షణాలైన నొప్పి, తిమ్మిరి, మంటలు తగ్గించడమే కాకుండా జబ్బు యొక్క మూలాలనుండి పూర్తిగా మరియు శాశ్వతంగా తగ్గించటం. హోమియోకేర్‌లో గ్రూప్ ఆఫ్ డాక్టర్లు స్పాండిలైటిస్ మీద ప్రత్యేకమైన అధ్యయనం చేసి జెనెటిక్ కాన్సిట్యూషన్ సిమ్యూలిమ్ ట్రీట్మెంట్ విధానం ద్వారా దీనిని సంపూర్ణంగా నయం చేయవచ్చని నిర్థారించారు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. -
పీసీఓడీకి హోమియోపతిలో నివారణోపాయాలు
చాలామంది స్త్రీలలో సాధారణ ఆహార అలవాట్లు పాటిస్తున్నప్పటికీ అధిక బరువు, వెంట్రుకలు రాలిపోవడం, మొటిమలు, ముఖం మీద మగవారిలా వెంట్రుకలు రావడం, నెలసరి సరిగ్గా ఉన్నప్పటికీ సంతానలేమితో బాధపడుతూ ఉంటారు. దానికి కారణం అయిన పీసీఓడీ గురించి చర్చిద్దాం. పీసీఓడీ అనగా ఇమ్మెచ్యూర్ ఫాలికల్ (అండం) గర్భాశయానికి రెండువైపులా ఉన్న అండాశయాలపై నీటిబుడగల వలె ఉండటాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (P.C.O.D) అంటారు. సాధారణ ఋతుచక్రం ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11-14 రోజుల మధ్య రెండు అండాశయాలలో ఒక అండాశయం నుండి విడుదల అవుతుంది. ఈ విధంగా ప్రతినెలా ఎడమ లేదా కుడివైపు ఉన్న అండాశయం నుండి ఒక అండం విడుదలవుతుంది. ఫలదీకరణకు సిద్ధంగా ఉంటుంది. కాని ఎవరిలో అయితే ఈ పీసీఓడీ ఉంటుందో వారి అండాశయం నుండి అండం విడుదల కాకుండా అపరిపక్వత అండాలు నీటి బుడగల వలె అండాశయపు గోడల మీద ఉండిపోతాయి. ఇది చూడడానికి ముత్యాల వలె అండాశయ గోడల మీద కనిపిస్తాయి. రెండు వైపులా ఉంటే బై ఆట్రల్ పీసీఓడీ అంటారు. కారణాలు F.S.H, L.H, ఈస్ట్రోజెన్, టెస్టోస్టిరాన్ హార్మోన్ల సమతుల్య లోపం వలన ఈ సమస్య వస్తుంది. సరైన జీవనశైలి లేకపోవడం అంటే, ఎక్కువ ఒత్తిడికి లోనవడం, తక్కువ శారీరక వ్యాయామం వల్ల, పిండిపదార్థాలు, కొవ్వుపదార్థాలు అతిగా తినడం మూలంగా ఇది ఎక్కువగా కనిపిస్తుంది. జన్యుపరమైన కారణాలు కూడా పీసీఓడీకి ఒక ముఖ్య కారణం. పనిచేసే హార్మోన్ల చక్రంలో మార్పులు, అధిక ఒత్తిడి, సరియైన వ్యాయామం లేకపోవడం, సరియైన ఆహారనియమాలు పాటించకపోవడం, అధికకొవ్వు, కార్బోహైడ్రేట్ పదార్థాలు తినడం వలన ఇది సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు నెలసరి సరిగా రాకపోవడం నెలసరి సరిగా వచ్చినా కూడా అండాశయం నుండి అండం విడుదల కాకపోవడం, (అనోవ్యులేటరీ సైకిల్) మెనరీజియా - నెలసరిలో 4-5 రోజులు కావలసిన రక్తస్రావం ఎక్కువ మోతాదులో ఎక్కువకాలం కొనసాగడం మెట్రీజియా-నెలసరి ఆగి ఆగి రావడం, రెండు ఋతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం డిస్మనేరియా-నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పి రావడం అమెనోరియం- నెలసరి రాకపోవడం బరువు పెరగటం ముఖం, వీపు, శరీరంపైన మొటిమలు రావడం. ముఖం, ఛాతీ పైన మగవారిలోలా వెంట్రుకలు రావడం (హర్సుటిజమ్) టెస్టోస్టిరాన్ హార్మోన్ మోతాదు పెరగటం వలన ఈ లక్షణాలు కనిపిస్తాయి సాధారణంగా తలపైన జుట్టు రాలడం కాంప్లికేషన్స్ ఇన్ఫెర్టిలిటీ ఒబేసిటీ Dm type II నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ తీసుకోవలసిన జాగ్రత్తలు జీవనవిధానంలో మార్పు చేసుకొని ఒత్తిడిని తగ్గించుకోవడం సరియైన వ్యాయామం చేయడం వలన హార్మోన్ల సమతుల్యతను కాపాడటం అధిక కొవ్వు, కార్బోహైడ్రేట్ పదార్థాలను తగ్గించి, సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఈ సమస్య బారిన పడకుండా ఉండవచ్చు. హోమియో కేర్ ఇంటర్నేషనల్నందు... రోగి శరీర తత్త్వాన్ని బట్టి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియం విధానం ద్వారా, హార్మోన్ వ్యవస్థలోని అసమతౌల్యాన్ని సరిచేయటం ద్వారా ఎటువంటి దుష్ర్పభావాలు లేకుండా శాశ్వతంగా పీసీఓడీ సమస్యను దూరం చేయవచ్చు. ఈ చికిత్స విధానం ద్వారా హోమియోకేర్‌లో 94 శాతం మంది పీసీఓడీ పేషెంట్లలో మెరుగైన ఫలితాలు సాధించాం. ఇది ముఖ్యంగా యుక్తవయస్సులో ఉన్న ఆడవారిలో ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇది ప్రతి పది మందిలో ముగ్గురు యుక్తవయస్సులో ఉన్న అమ్మాయిలకు కనిపిస్తోంది. పీసీఓడీ అనేది పెళ్ళి అయి పిల్లలు ఉన్నవారిలో కూడా సాధారణంగా కనిపిస్తుంది. అంటే మధ్య వయస్సులో ఉన్నవారిలో ఇది కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చేసిన పరిశోధనల వలన తెలిసిన విషయం ఏమిటంటే పీసీఓడీకి ఇతర వైద్యవిధానాలలో ఇచ్చే ట్రీట్మెంట్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, హార్మోన్ ట్రీట్మెంట్, యాంటీ డయాబెటిక్ మందులతో పాలినియా 60 - 70 శాతం హోమియోకేర్ వైద్య విధానంలో మెరుగైన ఫలితాలు వచ్చాయని నిరూపించబడింది. చికిత్స హార్మోన్ అసమతుల్యం వలన వచ్చే ఇలాంటి జబ్బులను హోమియోపతి మందుల ద్వారా పూర్తిగా నయం చేయవచ్చును. సరైన కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ చేయడం వలన, ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్‌లు లేకుండా దీనిని పూర్తిగా నయం చేయడమే కాకుండా ఎలాంటి కాంప్లికేషన్లు ఉన్నా వాటిని తప్పక తగ్గించవచ్చు. యుక్తవయస్సులోనే దీనికి సరియైన ట్రీట్మెంట్ చేయించుకోవడం వలన ఇన్ఫెర్టిలిటీ, ఒటేసిటీ లాంటి కాంప్లికేషన్ల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. -
హోమియోలో మైగ్రేన్‌కు మంచి చికిత్స...
మెదడు చుట్టూ ఉండే రక్తనాళాల్లో అకస్మాత్తుగా రక్తం ప్రవహించడంతో అవి ఒక్కసారిగా వ్యాకోచిస్తాయి. ఫలితంగా అక్కడి నరాలపై ఒత్తిడి పడుతుంది. దాంతో నరాల నుంచి కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. రక్తనాళాలు వ్యాకోచించినకొద్దీ నొప్పి అధికమవుతుంది. ఈ సమస్యనే మైగ్రేన్ అంటారు. ఈ సమస్య తీవ్రస్థాయికి చేరినప్పుడు నరాల వ్యవస్థ దెబ్బతినడం వల్ల మెదడులో సమస్య ఉన్న భాగం నుంచి వచ్చే నరాల పనితీరు ప్రభావితమై శరీరంలోని కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. దాంతోపాటు మైగ్రేన్ ఉన్నవారికి కళ్లు తిరగడం, తలతిరగడం, వస్తువులు రెండుగా కనిపించడం వంటి లక్షణాలూ ఉంటాయి. హెమీప్లీజిక్, రెటినల్, ఆక్యులార్ మైగ్రేన్లలో శరీరం పక్షవాతం వచ్చినట్లుగా ఉండటం, చూపు ఒకవైపు సరిగ్గా కనిపించకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కారణాలు : మానసిక ఒత్తిడి నిద్రలేమి ఉపవాసం హార్మోన్ల సమస్యలు అధిక వెలుతురు వాసనలు మత్తుపదార్థాలు, పొగాకు వాడకం, పొగతాగడం కాఫీ వంటి పానీయాలు మహిళలలో రుతుక్రమం ముందర ఈస్ట్రోజెన్ హార్మోన్లు ఎక్కువగా ఉండటం వల్ల పై లక్షణాలు కనిపించవచ్చు. ఈ కారణాలు సాధారణంగా తలనొప్పి వచ్చే తత్వం ఉన్నవారికి సమస్య మరింత అధికమయ్యేలా చేస్తాయి. లక్షణాలు : తలనొప్పి అధికంగా, వేగంగా కొట్టుకుంటున్నట్లు, తలను ముక్కలు చేస్తున్నట్లుగా, ఒకవైపు లేదా రెండువైపులా ఉండవచ్చు నొప్పి సాధారణంగా నుదురు, కళ్లచుట్టూ, తల వెనక భాగంలో రావచ్చు తలనొప్పి ఒక పక్క నుంచి మరో పక్కకు మారవచ్చు రోజువారీ పనులు చేస్తుంటే నొప్పి ఎక్కువ కావచ్చు వికారం, వాంతులు, విరేచనాలు, ముఖం పాలిపోవడం, కాళ్లు, చేతులు చల్లబడటం, వెలుతురు చూసి తట్టుకోలేకపోవడం, శబ్దం వినలేకపోవడం * నిద్రలేమి, చికాకు, నీరసం, ఉత్సాహం లేకపోవడం, ఆవలింతలు, కొందరిలో తీపి ఇంకా కారపు పదార్థాలను ఎక్కువగా ఇష్టపడటం మైగ్రేన్ సమస్య ఉన్నవారిలో తలనొప్పికి ముందు కొన్ని లక్షణాలను గమనించవచ్చు. దీనినే మైగ్రేన్ ఆరా అంటారు. ఈ ఆరా లక్షణాలు... కళ్ల ముందు మెరుపులు, ప్రకాశవంతమైన జ్యోతులు కనిపించడం వంటివి. ఈ మెరుపులు ముందర మధ్యలో మొదలై... చివరలకు వెళ్లినట్లుగా కనిపిస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు : =ఎక్కువ శబ్దం లేని, వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవాలి =తగినంత నిద్రపోవాలి = మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లు మానుకోవాలి =తలనొప్పి ఎక్కువగా ఉన్న సమయంలో కొవ్వు పదార్థాలు, మాంసం, పప్పుదినుసులు ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. సాధ్యమైనంత వరకు అల్పాహారాన్ని తీసుకోవాలి = తగినంత నీరు తాగాలి = జీవనశైలిలో మార్పులు చేసుకుని రోజూ వ్యాయామం చేయాలి = మానసిక ఒత్తిడిని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. ఒత్తిడి కలిగించే అంశాలకు దూరంగా ఉండాలి. హోమియో చికిత్స : ఈ సమస్యకు హోమియోలో వాడదగిన మందులు సాంగ్వినేరియా, బ్రయోనియా, నేట్రమ్మూర్, పల్సటిల్లా, నక్స్‌వామికా, సెపియా, లాకెసిస్, స్పైజీలియా వంటివి. వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకుని పై మందులను వాడాల్సి ఉంటుంది. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
కీళ్ళవ్యాధులు (Arthritis) శాశ్వత విముక్తి
కీళ్ళు శరీర కదలికలకు ఉపయోగపడతాయి. కీళ్ళవ్యాధులు చాలా రకాలు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి ఆస్టియో ఆర్థరైటిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్: కీళ్ళలో అరుగుదల మూలంగా వచ్చే వ్యాధిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది ఎక్కువగా మోకాలి కీళ్ళలో కనిపిస్తుంది. కారణాలు: అధికబరువు, నలైభైఏళ్ళు దాటినవారు, వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం ఉంది. కీళ్ళపై దెబ్బ తగలడం, కీళ్ళను ఎక్కువగా ఉపయోగించడం, మెటబాలిక్ సంబంధించిన వ్యాధులు కలవారిలో (హీమోక్రోమటాసిస్, విల్సన్వ్యాధి), రుమటాయిడ్ ఆర్థరైటిస్ కలవారిలో, డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: కీళ్ళలో నొప్పి... కదలికల వలన ఎక్కువగా ఉండటం, స్టిఫ్నెస్ కలిగి ఉండటం, కీళ్ళలో కదలికలు జరిగినప్పుడు శబ్దాలు (Crepitus) రావడం జరుగుతాయి. జాగ్రత్తలు: క్యాల్షియం కలిగి ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం, విటమిన్ - డి కోసం ఉదయం సూర్యరశ్మిలో కాసేపు గడపడం, బరువుతగ్గడం, సరియైన వ్యాయామం చేయడం, ఎక్కువ బాధగా ఉంటే విశ్రాంతి తీసుకోవడం అవసరం. రుమటాయిడ్ ఆర్థరైటిస్: వ్యాధినిరోధకశక్తి (Immune Energy) తిరగబడటం వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి చిన్నకీళ్ళ నుంచి పెద్దకీళ్ళ వరకు ముఖ్యంగా చేతివేళ్ళు, మణికట్టు, మోకాలు, కాళ్ళవేళ్ళలో ఉంటుంది. నడివయస్సులో ఉన్నవారికి, స్త్రీలకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. లక్షణాలు: కీళ్ళలో వాపు, నొప్పి, ఉదయం స్టిఫ్నెస్ ఉండటం, ఈ వ్యాధి శరీరానికి ఇరుపక్కల ఒకే రకమైన కీళ్ళలో ఒకేసారి రావడం (Symmetrical arthritis) జరుగుతుంది. ఇతర అవయవాలైన కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, రక్తం, నరాలు, చర్మం మీద ప్రభావం ఉంటుంది. యూరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండి క్రిస్టల్ డిపాజిట్ అవడం వలన గౌట్ (Gout) అనే కీళ్ళవ్యాధి వస్తుంది. ఇది చిన్న కీళ్ళలో ముఖ్యంగా కాలివేళ్లు, బొటనవేళ్ళ వాపు, నొప్పి, ఎర్రగా మారడం జరుగుతుంది. సోరియాసిన్ అనే చర్మవ్యాధి వలన కూడా చిన్నవేళ్ళలో వాపు, నొప్పి రావడం జరుగుతుంది. దీనిని సొరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. కీళ్ళు ఇన్ఫెక్షన్కు గురి అవడం వలన కూడా కీళ్ళలో నొప్పి రావడం జరుగుతుంది. దీని సెప్టిక్ ఆర్థరైటిస్ అంటారు. (SLE) (సిస్టిమిక్టాపస్ ఎరిటిమెటస్) అనే వ్యాధి వలన కూడా కీళ్ళలో నొప్పి, వాపు వస్తుంది. దీనిలో వ్యాధినిరోధకశక్తి తిరగబెడుతుంది. పరీక్షలు: X-ray, RA, Factor, DBP, ESR, ASO tile, CRP, ANA, సీరమ్ యూరిక్ ఆసిడ్ వంటి రక్తపరీక్షలు చేయాల్సి ఉంటుంది. హోమియో వైద్యంలో రోగి యొక్క మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని సారూప్య ఔషధం వాడటం వలన కీళ్ళవ్యాధి నుండి శాశ్వత విముక్తి పొందవచ్చును. హోమియోకేర్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కీళ్ళవ్యాధి నుండి శాశ్వత విముక్తి పొందవచ్చును. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. -
హోమియోకేర్ చెంత థైరాయిడ్ నుంచి నిశ్చింత
ఆధునిక జీవితంలో ప్రతి 20 మందిలో ఒక వ్యక్తికి థైరాయిడ్ సమస్య రాగలదు. థైరాయిడ్ గ్రంథి నుండి విడుదలైన హార్మోనులు రక్త ప్రవాహంలో కలిసి శారీరక పెరుగుదలకు, జీవక్రియలు జరగడానికి తోడ్పడతాయి. థైరాయిడ్ గ్రంథిలో వచ్చే మార్పుల వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్, అందువల్ల జీవక్రియలన్నీ నెమ్మదిస్తాయి. ప్రస్తుత జీవన పరిస్థితులలో మానసిక ఒత్తిళ్ళ వల్ల, ఆహార సమతుల్యం/ శారీరక శ్రమ లోపించడం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశం ఎక్కువ. అప్పుడే పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు ఏ వయసువారికైనా ఈ సమస్య రావచ్చు. అయితే వయసును అనుసరించి కారణాలు మారవచ్చు. శిశువులలో... థైరాయిడ్‌గ్రంథి నిర్మాణంలో ఏదైనా లోపం ఉన్నపుడు సాధారణంగా ఈ సమస్య కనిపిస్తుంది. దీన్ని కంజెనిటల్ హైపోథైరాయిడిజం అంటారు. పెద్దవారిలో హషిమోటో థైరాయిడిటైటిస్, ఈ హైపోథైరాయిడిజం సమస్య రావడానికి ఒక సాధారణ కారణం. రకాల: థైరాయిడ్ సమస్యలు 2 రకాలు 1.హైపోథైరాయిడిజం: జీవక్రియలు సజావుగా జరగడానికి సరిపడా థైరాక్సిన్ హార్మోన్‌ను థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేయకపోవడాన్ని హైపో థైరాయిడిజం అంటారు. ఫలితంగా అలసట, చర్మం పొడిబారడం, అధిక బరువు, స్త్రీలలో నెలసరి సమస్యలు, మగత, మలబద్దకం చలికి తట్టుకోలేకపోవడం, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు, చిరాకు, మతిమరుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2.హైపర్ థైరాయిడిజం: థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేయడం వలన ఈ సమస్య వస్తుంది. గుండెదడ, చేతులు, కాళ్ళు వణకడం, నిద్రలేమి, ఆందోళన, బరువు తగ్గిపోవడం, వేడిని తట్టుకోలేకపోవడం, ఆకలి పెరగడం, నెలసరి సమస్యలు, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ హార్మోన్లు అధికంగా స్రవించడం వల్ల థైరోటాక్సికోసిస్ వస్తుంది. ఈ వ్యాధి చాలా నెమ్మదిగా ప్రారంభమవుతుంది. కంటి కండరాలు వాచి, కంటి గుడ్లు ముందుకు వచ్చినట్లు కనిపిస్తే దీన్ని Grave's disease అంటారు. కొంతమందికి థైరాయిడ్‌గ్రంథి పెద్దదై మెడభాగంలో వాపు వస్తుంది. దీన్ని గాయిటర్ అంటారు. పరీక్షలు: థైరాయిడ్ సమస్య ఉందా లేదా అని తెలుసుకోవడానికి టి3, టి4, టిఎస్హెచ్ హార్మోన్ల లెవల్స్‌ను రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పై లెవల్స్‌లో ఉండే హెచ్చుతగ్గులను బట్టి వ్యాధిని నిర్థారిస్తారు. రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందేమో నిర్థారించడానికి థైరాయిడ్ యాంటీ టాడిస్ (యాంటీ టిపిఓ బాడిస్) పరీక్షలు అవసరమవుతాయి. మెడ లోపలి భాగంలో సీతాకోక చిలుక ఆకృతిలో ఉండే థైరాయిడ్‌గ్రంథి అత్యంత కీలకమైన విధులను నిర్వహిస్తుంటుంది. థైరాయిడ్ వ్యాధిగ్రస్తుల్లో కొందరికి కనుగుడ్లు బయటకు పొడుచుకు వచ్చినట్లుగా ఉంటాయి. మరికొందరిలో గాయిటర్ సమస్య వస్తుంది. హోమియో వైద్యం హోమియో కేర్ వైద్యవిధానంలో రోగి శారీరక, మానసిక పరిస్థితి ఆకలి, నిద్ర, ఆందోళనలు తదితర అంశాలలో పాటు వంశపారంపర్యత, ఆరోగ్యచరిత్ర వంటివి పరిగణనలోకి తీసుకొని మళ్ళీ వచ్చే అవకాశం లేకుండా థైరాయిడ్ సమస్యకు వైద్య చికిత్స ఇవ్వబడుతుంది. ప్రపంచంలో మొదటిది కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ద్వారా హోమియోకేర్ థైరాయిడ్ సమస్యలకు అత్యధిక శాతం రోగులకు పూర్తిగా తగ్గించడం జరుగుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.