పీసీఓడీకి హోమియోపతిలో నివారణోపాయాలు | Homeo treatment for PCOD | Sakshi
Sakshi News home page

పీసీఓడీకి హోమియోపతిలో నివారణోపాయాలు

Published Sat, Oct 12 2013 12:39 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM

Homeo treatment for PCOD

చాలామంది స్త్రీలలో సాధారణ ఆహార అలవాట్లు పాటిస్తున్నప్పటికీ అధిక బరువు, వెంట్రుకలు రాలిపోవడం, మొటిమలు, ముఖం మీద మగవారిలా వెంట్రుకలు రావడం, నెలసరి సరిగ్గా ఉన్నప్పటికీ సంతానలేమితో బాధపడుతూ ఉంటారు. దానికి కారణం అయిన పీసీఓడీ గురించి చర్చిద్దాం.
 
 పీసీఓడీ అనగా ఇమ్మెచ్యూర్ ఫాలికల్ (అండం) గర్భాశయానికి రెండువైపులా ఉన్న అండాశయాలపై నీటిబుడగల వలె ఉండటాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (P.C.O.D) అంటారు.
 
 సాధారణ ఋతుచక్రం ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11-14 రోజుల మధ్య రెండు అండాశయాలలో ఒక అండాశయం నుండి విడుదల అవుతుంది. ఈ విధంగా ప్రతినెలా ఎడమ లేదా కుడివైపు ఉన్న అండాశయం నుండి ఒక అండం విడుదలవుతుంది. ఫలదీకరణకు సిద్ధంగా ఉంటుంది. కాని ఎవరిలో అయితే ఈ పీసీఓడీ ఉంటుందో వారి అండాశయం నుండి అండం విడుదల కాకుండా అపరిపక్వత అండాలు నీటి బుడగల వలె అండాశయపు గోడల మీద ఉండిపోతాయి. ఇది చూడడానికి ముత్యాల వలె అండాశయ గోడల మీద కనిపిస్తాయి. రెండు వైపులా ఉంటే బై ఆట్రల్ పీసీఓడీ అంటారు.
 
 కారణాలు
 F.S.H, L.H, ఈస్ట్రోజెన్, టెస్టోస్టిరాన్ హార్మోన్‌ల సమతుల్య లోపం వలన ఈ సమస్య వస్తుంది.
     
 సరైన జీవనశైలి లేకపోవడం అంటే, ఎక్కువ ఒత్తిడికి లోనవడం, తక్కువ శారీరక వ్యాయామం వల్ల, పిండిపదార్థాలు, కొవ్వుపదార్థాలు  అతిగా తినడం మూలంగా ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
     
 జన్యుపరమైన కారణాలు కూడా పీసీఓడీకి ఒక ముఖ్య కారణం.
     
 పనిచేసే హార్మోన్‌ల చక్రంలో మార్పులు, అధిక ఒత్తిడి, సరియైన వ్యాయామం లేకపోవడం, సరియైన ఆహారనియమాలు పాటించకపోవడం, అధికకొవ్వు,  కార్బోహైడ్రేట్ పదార్థాలు తినడం వలన ఇది సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
 
 లక్షణాలు
 నెలసరి సరిగా రాకపోవడం  
 
 నెలసరి సరిగా వచ్చినా కూడా అండాశయం నుండి అండం విడుదల కాకపోవడం, (అనోవ్యులేటరీ సైకిల్)  
 
 మెనరీజియా - నెలసరిలో 4-5 రోజులు కావలసిన రక్తస్రావం ఎక్కువ మోతాదులో ఎక్కువకాలం కొనసాగడం  
 
 మెట్రీజియా-నెలసరి ఆగి ఆగి రావడం, రెండు ఋతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం  
 
 డిస్మనేరియా-నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పి రావడం  
 
 అమెనోరియం- నెలసరి రాకపోవడం  
 
 బరువు పెరగటం
 
 ముఖం, వీపు, శరీరంపైన మొటిమలు రావడం. ముఖం, ఛాతీ పైన మగవారిలోలా వెంట్రుకలు రావడం (హర్సుటిజమ్) టెస్టోస్టిరాన్ హార్మోన్ మోతాదు పెరగటం వలన ఈ లక్షణాలు కనిపిస్తాయి  
 
 సాధారణంగా తలపైన జుట్టు రాలడం
  కాంప్లికేషన్స్
 ఇన్‌ఫెర్టిలిటీ  
 ఒబేసిటీ  
 Dm type II నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్
 
 తీసుకోవలసిన జాగ్రత్తలు

 జీవనవిధానంలో మార్పు చేసుకొని ఒత్తిడిని తగ్గించుకోవడం  సరియైన వ్యాయామం చేయడం వలన హార్మోన్ల సమతుల్యతను కాపాడటం  అధిక కొవ్వు, కార్బోహైడ్రేట్ పదార్థాలను తగ్గించి, సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఈ సమస్య బారిన పడకుండా ఉండవచ్చు.
 
 హోమియో కేర్ ఇంటర్‌నేషనల్‌నందు...
 రోగి శరీర తత్త్వాన్ని బట్టి జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ సిమిలియం విధానం ద్వారా, హార్మోన్ వ్యవస్థలోని అసమతౌల్యాన్ని సరిచేయటం ద్వారా ఎటువంటి దుష్ర్పభావాలు లేకుండా శాశ్వతంగా పీసీఓడీ సమస్యను దూరం చేయవచ్చు. ఈ చికిత్స విధానం ద్వారా హోమియోకేర్‌లో 94 శాతం మంది పీసీఓడీ పేషెంట్లలో మెరుగైన ఫలితాలు సాధించాం.
 
 ఇది ముఖ్యంగా యుక్తవయస్సులో ఉన్న ఆడవారిలో ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇది ప్రతి పది మందిలో ముగ్గురు యుక్తవయస్సులో ఉన్న అమ్మాయిలకు కనిపిస్తోంది.


 పీసీఓడీ అనేది పెళ్ళి అయి పిల్లలు ఉన్నవారిలో కూడా సాధారణంగా కనిపిస్తుంది. అంటే మధ్య వయస్సులో ఉన్నవారిలో ఇది కనిపిస్తుంది.
 
 ఈ మధ్యకాలంలో చేసిన పరిశోధనల వలన తెలిసిన విషయం ఏమిటంటే పీసీఓడీకి ఇతర వైద్యవిధానాలలో ఇచ్చే ట్రీట్‌మెంట్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, హార్మోన్ ట్రీట్‌మెంట్, యాంటీ డయాబెటిక్ మందులతో పాలినియా 60 - 70 శాతం హోమియోకేర్ వైద్య విధానంలో మెరుగైన ఫలితాలు వచ్చాయని నిరూపించబడింది.
 
 చికిత్స

 హార్మోన్ అసమతుల్యం వలన వచ్చే ఇలాంటి జబ్బులను హోమియోపతి మందుల ద్వారా  పూర్తిగా నయం చేయవచ్చును. సరైన కాన్‌స్టిట్యూషన్ ట్రీట్‌మెంట్ చేయడం వలన, ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్‌లు లేకుండా దీనిని పూర్తిగా నయం చేయడమే కాకుండా ఎలాంటి కాంప్లికేషన్‌లు ఉన్నా వాటిని తప్పక తగ్గించవచ్చు. యుక్తవయస్సులోనే దీనికి సరియైన ట్రీట్‌మెంట్ చేయించుకోవడం వలన ఇన్‌ఫెర్టిలిటీ, ఒటేసిటీ లాంటి కాంప్లికేషన్‌ల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
 
 డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్

 సి.ఎం.డి.,
 హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
 ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 9550001188/99
 టోల్ ఫ్రీ: 1800 102 2202
 బ్రాంచ్‌లు:  హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement