థెరాయిడ్ ఇటీవల చిన్నా, పెద్ద అందర్నీ వేధిస్తున్న సమస్య ఇది. దీని వల్ల ఎదురయ్యే సమస్యలు అంత ఇంత కాదు. విపరీతంగా బరువు పెరిగిపోయి నలుగురిలో తిరిగేందుకు ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా మహిళలకు ప్రెగ్నెన్సీ విషయంలో పలు సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే ఈ థెరాయిడ్ ఉన్నవారు అస్సలు అన్నమే తినకూడదంటున్నారు నిపుణులు. ఇదేంటి అన్నమే మనకు శక్తినిచ్చేది అలాంటి అన్నమే వద్దంటే ఎలా? అసలు థెరాయిడ్ ఉన్నవారు ఎందుకు అన్నం తికూడదు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా!.
కొందరూ అన్నాన్నే మూడు పూటలా తింటుంటారు. ఇందులో కార్భోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నందున మనల్ని శక్తివంతంగా ఉంచుతుంది. అలాగని ఇలా ఎక్కువగా తింటే మాత్రం అమాంతం బరువు పెరుగుతారు. నిజానికి డైటింగ్ చేసి బరువు తగ్గాలనుకునేవారే అన్నాన్ని తక్కువగా తీసుకుంటారు. అయితే థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా అన్నాన్ని ఎక్కువగా తీసుకోకూదట. ఒకవేళ అన్నం తినాలనుకున్నా వైట్‌రైస్ అస్సలు వద్దంటున్నారు నిపుణులు. దాని బదులు బ్రౌన్‌రైస్ తీసుకోమని సూచిస్తున్నారు.
బియ్యంలో గ్లూటెన్ ప్రోటీన్ ఉంటుంది. ఇది సమస్యను మరింత పెంచుతుంది. అందుకే థైరాయిడ్ రోగులు అన్నం తినకూడదని చెప్తుంటారు. గ్లూటెన్ మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది శరీరంలో ప్రతిరోధకాలను తగ్గించి, థైరాక్సిన్ హార్మోన్ సమస్యలను కూడా కలిగిస్తుంది. అందుకే అన్నాన్ని అతిగా తినకూడదని చెబుతున్నారు నిపుణులు. అదీగాక అన్నంలో ఉండే పిండి పదార్థం త్వరగా జీర్ణమవుతుంది. దీంతో మనకు చాలా త్వరగా ఆకలిగా అనిపిస్తుంది. ఇంకేముంది కడుపు నిండేదాక ఆబగా తింటుంటాం. కానీ ఇది బరువును అమాంతం పెంచుతుంది. ఈ కారణంగానే థైరాయిడ్ రోగులను అన్నం తినొద్దని అంటారు.
నిపుణులు ఏమంటున్నారంటే..
- థెరాయిడ్ రోగులు అన్నం ఇలా ఎక్కువగా తింటే థైరాయిడ్ తో పాటుగా టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
- బియ్యంలో ఉండే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం తదితర పరిమాణలు ఎక్కువుగా ఉంటాయి. అందుకే థైరాయిడ్ పేషెంట్లు అన్నం తినకూడదని చెబుతున్నారు.
- ఒకవేళ తినాలనుకున్నా బాగా నానబెట్టి వార్చి తినడం మంచిది. ఇలా చేస్తే గంజి రూపంలో బియ్యంలో ఉంటే కొన్ని విటమిన్లు వెళ్లిపోతాయి. కాస్త బెటర్‌గా ఉంటుంది. ఇక అలానే నానబెట్టి వండుకోవడానికే ప్రాముఖ్యత ఇవ్వండి. మరీ ముఖ్యంగా ఆర్గానిక్ రైస్‌కి ప్రిఫెరెన్స్ ఇవ్వండి. అదే సమయంలో తగు మోతాదులో తినేందుకు యత్నించండి. అంటే ఇక్కడ రైస్ క్వాంటిటీ తక్కువగానూ, కూర కంటెంట్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోమని చెబుతున్నారు.
అన్నాన్ని ఎలా వండి తినాలి?
అన్నం తినడం ఇష్టమైతే దీన్ని రకరకాల కూరగాయలతో మిక్స్ చేసి డైట్ లో చేర్చుకోవచ్చు. కానీ అన్నాన్ని చాలా తక్కువగా తినాలి. అన్నం తక్కువగా, కూరగాయలు ఎక్కువగా ఉండేట్టు చూసుకుంటే ఏ సమస్యా ఉండదు. అయితే మీ ఆహారంలో మార్పులు చేయడానికి ముందు ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించండి.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చింది. ఈ సూచనలు, సలహాలు పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడని సంప్రదించి పాటించటం మంచిది.
(చదవండి: రెడ్‌లైట్ థెరఫీతో షుగర్ తగ్గించొచ్చా? పరిశోధనలో షాకింగ్ విషయాలు)
Comments
Please login to add a commentAdd a comment