చెమట పట్టడం మంచి సూచన. ఒంట్లో అధికంగా ఉన్న వేడిమిని తగ్గించేందుకు, ఒంటికి పడని వ్యర్థాలను బయటికి పంపేందుకు దేహ ధర్మానుసారం చెమట పడుతుంది. అయితే చెమట అధికంగా పడుతుంటే మాత్రం అది దేనికైనా సంకేతమా అని ఆలోచించాలి. సమస్యేమిటో తెలుసుకుని పరిష్కరించుకోవాలి. సాధారణంగా 8 కారణాల వల్ల ధారాపాతంగా చెమటలు పడుతుంటాయి.
ఒత్తిడి: ఆదుర్దా, ఆందోళన, మానసిక ఒత్తిడి వల్ల చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. చర్మంపై బ్యాక్టీరియా కూడా చెమటకు కలవడం వల్ల కొందరిలో చెమట వాసన కూడా వస్తుంది.
థైరాయిడ్ సమస్య (హైపోథైరాయిడిజం): గొంతు భాగంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. అది కనుక మితిమీరిన చురుకుదనంతో ఉంటేథైరాయిడ్ హార్మోన్ విపరీతంగా ఉత్పత్తి అవుతుంది. ఇలాంటప్పుడు చెమట ఎక్కువగా పడుతుంది.
లో బ్లడ్ షుగర్ (హైపో గ్లైసీమియా): రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పడిపోయే స్థితే హైపో గ్లైసీమియా. ఇలాంటప్పుడు బయటి ఉష్ణోగ్రతలతో నిమిత్తం లేకుండా చెమటలు పడతాయి.
హైపర్ హైడ్రోసిస్: శరీరంలో ఒక భాగం మీద మాత్రమే చెమట పడుతుంటే అది హైపర్ హైడ్రోసిస్. ఈ స్థితిలో స్వేద గ్రంధులు ఎక్కువగా ఉండే.. మెడ, అరిచేతులు, అరికాళ్లలో చెమట పడుతుంటుంది.
మందుల దుష్ప్రభావాలు: కొన్ని రకాల మందుల కారణంగా కూడా చెమట ఎక్కువగా పడుతుంది. ఉదా: యాంటీబయాటిక్స్, బీపీ మందులు, మానసిక రుగ్మతలకు వాడే మందుల వల్ల కొందరిలో చెమటలు పోయడం ఉంటుంది.
మెనోపాజ్: మెనోపాజ్ దశకు చేరుకుంటున్నప్పుడు, చేరుకున్న తర్వాత హార్మోన్‌ల ఉత్పత్తిలో హెచ్చు తగ్గుల కారణంగా చెమటలు పడుతుంటాయి.
ఇవికాక... స్థూలకాయం, కారణం తెలియని జ్వరం వల్ల కూడా చెమటలు ఎక్కువగా పోయడం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment