swetting
-
చెమట ఎక్కువగా పడుతుంటే ?
చెమట పట్టడం మంచి సూచన. ఒంట్లో అధికంగా ఉన్న వేడిమిని తగ్గించేందుకు, ఒంటికి పడని వ్యర్థాలను బయటికి పంపేందుకు దేహ ధర్మానుసారం చెమట పడుతుంది. అయితే చెమట అధికంగా పడుతుంటే మాత్రం అది దేనికైనా సంకేతమా అని ఆలోచించాలి. సమస్యేమిటో తెలుసుకుని పరిష్కరించుకోవాలి. సాధారణంగా 8 కారణాల వల్ల ధారాపాతంగా చెమటలు పడుతుంటాయి. ఒత్తిడి: ఆదుర్దా, ఆందోళన, మానసిక ఒత్తిడి వల్ల చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. చర్మంపై బ్యాక్టీరియా కూడా చెమటకు కలవడం వల్ల కొందరిలో చెమట వాసన కూడా వస్తుంది. థైరాయిడ్ సమస్య (హైపోథైరాయిడిజం): గొంతు భాగంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. అది కనుక మితిమీరిన చురుకుదనంతో ఉంటేథైరాయిడ్ హార్మోన్ విపరీతంగా ఉత్పత్తి అవుతుంది. ఇలాంటప్పుడు చెమట ఎక్కువగా పడుతుంది. లో బ్లడ్ షుగర్ (హైపో గ్లైసీమియా): రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పడిపోయే స్థితే హైపో గ్లైసీమియా. ఇలాంటప్పుడు బయటి ఉష్ణోగ్రతలతో నిమిత్తం లేకుండా చెమటలు పడతాయి. హైపర్ హైడ్రోసిస్: శరీరంలో ఒక భాగం మీద మాత్రమే చెమట పడుతుంటే అది హైపర్ హైడ్రోసిస్. ఈ స్థితిలో స్వేద గ్రంధులు ఎక్కువగా ఉండే.. మెడ, అరిచేతులు, అరికాళ్లలో చెమట పడుతుంటుంది. మందుల దుష్ప్రభావాలు: కొన్ని రకాల మందుల కారణంగా కూడా చెమట ఎక్కువగా పడుతుంది. ఉదా: యాంటీబయాటిక్స్, బీపీ మందులు, మానసిక రుగ్మతలకు వాడే మందుల వల్ల కొందరిలో చెమటలు పోయడం ఉంటుంది. మెనోపాజ్: మెనోపాజ్ దశకు చేరుకుంటున్నప్పుడు, చేరుకున్న తర్వాత హార్మోన్ల ఉత్పత్తిలో హెచ్చు తగ్గుల కారణంగా చెమటలు పడుతుంటాయి. ఇవికాక... స్థూలకాయం, కారణం తెలియని జ్వరం వల్ల కూడా చెమటలు ఎక్కువగా పోయడం జరుగుతుంది. -
చెమట చిందించే రోబో
టోక్యో: పుష్ అప్స్, పుల్ అప్స్ వంటి కఠిన వ్యాయామాలతో పాటు స్వేదాన్ని చిందించే సరికొత్త హ్యూమనాయిడ్ రోబోను జపాన్లోని యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి ‘కెంగొరో’గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. కృత్రిమ స్వేద వ్యవస్థతో పాటు మానవ కండరాలను పోలిన అస్థిపంజరాన్ని రోబోలో అమర్చారు. క్రీడాకారుల కండరాల పనితీరును విశ్లేషిం చేందుకుగాను దీనిని రూపొందిం చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కృత్రిమ స్వేద వ్యవస్థలో తాము కీలకమైన ముందడుగు వేశామని, దీని ద్వారా రోబోలోని అధిక వేడిని తగ్గించవచ్చని వెల్లడించారు. 2001 నుంచి ఈ బృందం రోబోలపై పరిశోధనలు జరుపుతోందని సైన్స్ రోబోటిక్స్ అనే జర్నల్ ప్రచురించింది. -
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వెయ్యిమంది ఉక్కిరిబిక్కిరి
న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులకు చుక్కలు కనపించాయి. ఎయిర్ పోర్ట్ లోని ఎయిర్ కండిషన్ వ్యవస్థ పనిచేయడం ఆగిపోవడంతో ప్రయాణికులంతా చెమటలో తడిసిముద్దయ్యారు. ఎయిర్ పోర్టుకు సమీపంలోని ఢిల్లీ మెట్రో టెర్మినల్ కు సంబంధించి ఓ సొరంగ నిర్మాణం పనులు చేపడుతుండగా విమానాశ్రయంలోని ఎయిర్ కండిషన్ వ్యవస్థ చెడిపోయింది. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం 3.30గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) అధికారులు చెప్పారు. సొరంగ పనులు చేపడుతుండగా ఎయిర్ కూలింగ్ సిస్టం కోసం ఏర్పాటుచేసిన నీటి సరఫరా పైపు పగిలిపోయిందని తెలిపారు. దీనివల్ల ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కూలింగ్ వ్యవస్థ ఆగిపోయిందని చెప్పారు. దాదాపు 1000మంది చెమటతో ఉక్కిరిబిక్కిరయ్యారని అధికారులు చెప్పారు. ఉక్కపోత కారణంగా ఏర్పడిన దప్పిక సమస్యను తీర్చేందుకు వాటర్ బాటిల్స్ కూడా పంపిణీ చేసినట్లు తెలిపారు.