#World thyroid day 2024: మే 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. థైరాయిడ్ వ్యాధి, ఆరోగ్యం చూపే ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు ఈరోజు.
ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం 2024: థీమ్
నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCDలు), థైరాయిడ్ సమస్యలు ప్రపంచ ఆరోగ్య ఆందోళనలో గణనీయమై పాత్ర పోషిస్తున్నాయనే వాస్తవాన్ని తెలియ జేయడం.
ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం 2024: చరిత్ర
1965లో యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్ స్థాపన, ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం మొదలైంది. ఆ తరువాత థైరాయిడ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ (TFI) 2007లో మే 25వ తేదీని ప్రపంచ థైరాయిడ్ దినోత్సవంగా ప్రకటించింది.
థైరాయిడ్ వ్యాధి
మెడ దిగువన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే చిన్న గ్రంథి పేరే థైరాయిడ్. ఇది ముఖ్యమైన రెండు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అవి థైరాక్సిన్ (టి 4), ట్రైయోడోథైరోనిన్ (టి 3). ఈ రెండు హార్మోన్లు హార్మోన్లు జీవక్రియ, పెరుగుదల, అభివృద్ధి, పునరుత్పత్ తిసమస్య సహా అనేక సమస్యలకు దారితీస్తుంది.
ఆ గ్రంథి ఈ హార్మోన్లను తగినంతగా లేదా అధిక మొత్తంలో ఉత్పత్తి చేసినప్పుడు థైరాయిడ్ రుగ్మతలు తలెత్తుతాయి. హార్మోన్ల ఉత్పత్తి తగ్గితే హైపోథైరాయిడిజం అని, అధికమైతే హైపర్ థైరాయిడిజం అని రెండు రకాలుగా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.
హైపోథైరాయిడిజం: అలసట, బరువు పెరగడం , నిరాశ వంటి లక్షణాలుంటాయి.
హైపర్ థైరాయిడిజం: బరువు తగ్గడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన వంటి లక్షణాలు.
థైరాయిడ్ కేన్సర్: థైరాయిడ్ గ్రంధిలో ప్రాణాంతక పెరుగుదల కేన్సర్‌కు దారతీయవచ్చు.
గోయిటర్: తరచుగా మెడలో వాపుగా కనిపిస్తుంది, హైపో- లేదా హైపర్ థైరాయిడిజంలోనే ఇది కనిపిస్తుంది.
థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయాలంటే
చక్కటి జీవన శైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా అసవరం.
శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అందేలా చూసుకోవాలి.
వ్యాయామం చాలా అవసరం. ఎలాంటి వ్యాధులు దాడి చేయకుండా ఉండాలంటే క్రమం తప్పని వ్యాయామం ముఖ్యం. వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, డ్యాన్స్,యోగా ఇలా ఏదో ఒక వ్యాయామాన్ని కనీసం అరగంటలు పాటు చేయాలి. తద్వారా హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం రెండింటినీ అదుపులో ఉంచుకోవచ్చు
థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి మద్దతిచ్చే ఆహారంపై శ్రద్ధపెట్టాలి. ముఖ్యంగా సెలీనియం కీలకమైంది.బ్రెజిల్ నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, సీఫుడ్,గుడ్లు, తృణధాన్యాలలో సెలీనియం పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఒత్తిడికి దూరంగా ఉండాలి, రోజులకు కనీసం ఎనిమిది గంటల కూడా చాలా అససరం.
ఒక్కసారి థైరాయిడ్ ఉంది అని తెలిస్తే వైద్య సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. ఎలాంటి అపోహలను, అవాస్తవాలను నమ్మకుండా నిపుణుల సలహాలను పాటించాలి.
Comments
Please login to add a commentAdd a comment