International Women’s Day 2024: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. అంతర్జాతీయంగా మహిళలు తమ హక్కులను గుర్తించి మహిళా సమానత్వం, సాధికారత,సామాజిక మార్పుపై అవగాహన తోపాటు వీటి సాధనకోసం ఉద్యమించాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకునే రోజు. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలు,పలు సామాజిక సంస్థలు వివిధ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి, వారిని గౌరవించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటా, బైటా మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళల పునరుత్పత్తి హక్కులు, మహిళలపై లైంగిక దోపిడీ లాంటి అనేక ఇతర సమస్యలు చర్చకు వస్తాయి.
2024 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ఏమిటి?
లింగ సమానత్వం, సమాజంలో మహిళల పాత్ర, మహిళలపై వేధింపులు, మహిళలకు సమాన హక్కులు వంటి వాటిపై అవగాహన కల్పించడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించడంలోని ఉద్దేశం. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ప్రత్యేక థీమ్‌తో జరుపుకుంటారు. 2024 ఏడాదికి సంబంధించి ‘ ఇన్‌స్పైర్ ఇన్‌క్లూజన్’ అని ధీమ్‌తో ఇంటర్నేషనల్ విమెన్స్ డేని నిర్వహిస్తున్నారు.
మార్చి 8నే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు?
1908లో న్యూయార్క్ నగర వీధ్లుల్లో తమ హక్కుల సాధన కోసం వేలాది మంది మహిళా కార్మికులు నిర్వహించిన వీరోచిత పోరాటానికి గుర్తుగా మార్చి8న అంతర్జతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించారు. సుమారు 15 వేల మంది మహిళలు మహిళాహక్కుల ఉద్యమ నేత క్లారా జెట్కిన్ నేతృత్వంలో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో పాటు మహిళలు ఓటు వేయాలనే డిమాండ్‌ను కూడా ఇందులో చేర్చారు.
కఠినమైన పని పరిస్థితులు, ఎక్కువ పని గంటలు, తక్కువ వేతనాలకు వ్యతిరేకంగా ఈ నిరసన సాగింది. ఆ మహిళల జ్ఞాపకార్థం 1909 ఫిబ్రవరి 28న అమెరిఆలో తొలిసారిగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. 1909లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది.
1917లో మొదటి ప్రపంచ యుద్ధంలో, రష్యా మహిళలు శాంతి ఉద్యమం చేపట్టారు. దీంతో రష్యా 'చక్రవర్తి నికోలస్' తన పదవికి రాజీనామా చేశాడు. మహిళలకు ఓటు హక్కు కూడా లభించింది. ఈనేపథ్యంలోనే యూరోప్ మహిళలు మార్చి 8న శాంతి కార్యకర్తలకు మద్దతుగా ర్యాలీలు చేపట్టారు. ఈ ఉద్యమాల ఫలితానే 1975లో ఐక్యరాజ్యసమితి మార్చి 8ని 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం'గా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment