భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రతి ఏటా సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినమైన సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్రను గౌరవించడం, విద్యా రంగంలో వారి సేవలను అభినందించడం కోసం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
ఉపాధ్యాయులు వృత్తిపరమైన ఉద్యోగం మాత్రమే చేయరని, వారు చిన్నారులను చక్కని భావిపౌరులుగా తీర్చిదిద్దుతారని ఈరోజు గుర్తుచేస్తుంది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 1994లో ప్రారంభమైంది. ఉపాధ్యాయ విద్య- వారి కార్యాలయంలో ప్రమాణాలపై రూపొందించిన సిఫార్సులను యునెస్కోతో పాటు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ) ఆమోదించినందుకు గుర్తుగా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఉపాధ్యాయుల హక్కులు, వారి పని పరిస్థితులు, వారి వృత్తిపరమైన బాధ్యతలను ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం గుర్తు చేస్తుంది.
ప్రతి సంవత్సరం యునెస్కోతో పాటు విద్యా రంగానికి సంబంధించిన సంస్థలు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం కోసం ఒక ప్రత్యేక థీమ్‌ను ఎంచుకుంటాయి. 2024 థీమ్ ‘ఉపాధ్యాయుల గొంతుకకు విలువనివ్వడం: విద్య కోసం నూతన సామాజిక ఒప్పందం వైపు పయనం’. ఉపాధ్యాయుల సమస్యలు, వాటి పరిష్కారాలపై దృష్టి పెట్టేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక థీమ్‌ను ఎంచుకుంటారు. అలాగే ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి, విద్యా నాణ్యత మెరుగుదల, నూతన విద్యా విధానాలపై చర్చిస్తారు.
ఇది కూడా చదవండి: ఇంటి భోజనం.. భారం!
Comments
Please login to add a commentAdd a comment