వ్యక్తిగతం : అవి మొటిమల్లాంటివే!
హలో డాక్టర్! నాకు ఈమధ్యే పెళ్లయింది. వయసు 29 ఏళ్లు. బరువు 105 కిలోలు. తొడల్లో, పొట్టలో కొవ్వు ఎక్కువగా ఉంది. నాకు మొదటినుంచీ పురుషాంగం చిన్నదిగానే ఉంది. నా లైంగిక జీవితం ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. కోరికలు మాత్రం బాగానే ఉన్నాయి. సలహా ఇవ్వగలరు.
- ఎల్.వి., హైదరాబాద్
యుక్తవయసులో థైరాయిడ్, ఎల్‌హెచ్, ఎఫ్‌ఎస్‌హెచ్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్స్‌లోపం ఉంటే గనక జననేంద్రియాల ఎదుగుదల సరిగ్గావుండదు. మెదడులో కొన్ని హార్మోన్ల ఉత్పత్తి తగ్గడం వల్ల కూడా శరీర సమతౌల్యత తగ్గుతుంది. దానివల్ల కొన్ని శరీర భాగాల్లో కొవ్వు విపరీతంగా పెరుగుతుంది. ఇలాంటివాళ్లలో కొందరికి మధుమేహం కూడా ఉండవచ్చు. అందువల్ల మీరు యాండ్రాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్... ఇద్దరినీ కలిసి, హార్మోన్ పరీక్షలు చేయించుకోండి. దానికి అనుగుణంగా చికిత్స చేయించుకోండి.
నా వయుసు పాతికేళ్లు. రెండు మూడేళ్లుగా వృషణాలపై చిన్న చిన్న కాయుల్లాంటివి వస్తున్నారుు. వాటి పరిమాణం శనగ గింజంత ఉంది. నొక్కితే గట్టిగా ఉన్నారుు కానీ నొప్పీ, బాధా మాత్రం లేవు. ఇలాంటివి ఎందుకు వస్తాయి? వీటికి చికిత్స ఏమైనా చేయించుకోవాలా?
- ఆర్.జె.ఎల్., విజయవాడ
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ వృషణాల మీద వచ్చిన కాయలు సెబేషియుస్ సిస్ట్స్ కావొచ్చు. వృషణాలపై ఉన్న చర్మం మీద ఇవి వస్తారుు. వీటిని వుుఖం మీది మొటిమలతో పోల్చవచ్చు. కొన్నిసార్లు వాటంతటవే మానిపోతాయి. పగలకుండా పెద్దవవుతున్న వాటిని మాత్రం చిన్న సర్జరీ ద్వారా తొలగించుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి వీటిలో సెకండరీ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ రావడానికీ, వ్యకిగత పరిశుభ్రత పాటించకపోవడానికీ సంబంధం ఏమీలేదు. కానీ ఇలాంటి సందర్భాల్లో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్లు రాకుండా నివారించవచ్చు.
నేను వివాహితుణ్ని. నాకు 34 ఏళ్లు. కొన్నాళ్లుగా నిద్రలో అంగస్తంభన బాగుంటోందిగానీ, శృంగారంలో అంత పటుత్వం ఉండటం లేదు. పొగతాగే అలవాటు ఉంది. గుండెదడగా ఉంటోంది. వీటన్నింటికీ సంబంధం ఉందా? నా సమస్యకు తగిన సలహా ఇవ్వగలరు.
- ఆర్.ఎస్., గుంటూరు
సాధారణంగా ఈ వయసులో నిద్రలో కలిగే అంగస్తంభనలు మామూలుగానే ఉంటాయి. ఇది అంగంలో రక్తప్రసరణ సవ్యంగానే ఉందనడానికి సూచన. మీరన్నట్టుగా గుండెదడకూ, శృంగారానికీ సంబంధం లేదు. కాకపోతే ధూమపానం, మద్యపానం అలవాట్లూ, వీటికితోడు కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినేవాళ్లలో గుండెజబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. అందువల్ల మీరు కార్డియాలజిస్టును కలవండి. ఎకో, టీఎంటీ వంటి పరీక్షలు ఆయన చేస్తారు. ముందు గుండెదడ మీ సమస్య గనక దాన్ని తీర్చుకోండి. మీకు నిజంగానే తగినంతగా అంగస్తంభనలు కలగకపోతుంటేమాత్రం సామర్థ్యం పెరగడానికి కొన్ని మందులు వాడవచ్చు. అయితే వాటిని కార్డియాలజిస్టు క్లియరెన్స్ తర్వాతే యూరాలజిస్టు ఇవ్వాల్సివుంటుంది. కాబట్టి అలా చికిత్స చేయించుకోండి.
నాకు 28 ఏళ్లు. కొంతకాలంగా మొలలనుంచి రక్తం వస్తోంది. దీనివల్ల శృంగార సామర్థ్యం తగ్గినట్టనిపిస్తోంది. నాకు పరిష్కారం చూపండి.
- జె.ఎస్., బెంగళూరు
దీర్ఘకాలికంగా మొలల సమస్యతో బాధపడేవారికి ఎక్కువగా రక్తస్రావం జరగడం వల్ల రక్తహీనత రావచ్చు. అది ఒక్కోసారి లైంగిక జీవితంపై ప్రభావం చూపవచ్చు. అయితే, రక్తహీనత బాగా తీవ్రమై, అంటే, హిమోగ్లోబిన్ పాళ్లు 10 ఎంజీ/డెసిలీటర్ కంటే తగ్గినప్పుడే ఈ సవుస్య వచ్చేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి మీరు వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్టును సంప్రదించి, చికిత్స చేయించుకోండి. ఆ పై అవసరాన్ని బట్టి, యూరాలజిస్టును కలవండి.
డా. వి.చంద్రమోహన్,
యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
ప్రీతి యూరాలజీ -
కిడ్నీ హాస్పిటల్,
కెపిహెచ్‌బి, హైదరాబాద్
మీ సందేహాలను పంపవలసిన చిరునామా: వ్యక్తిగతం, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. vyaktigatam.sakshi@gmail.com