మన నేర్చుకున్న విద్య మనకే ఉపయోగపడితే ఆశ్చర్యం ఆనందరం రెండూ వస్తాయి. ఎన్ని విద్యలైనా.. కూటి కొరకే అంటారు. మరీ మనం నేర్చుకున్న విద్య మనకు ఉపయోగపడటం ఏమిటీ? మన అభ్యున్నతి కోసమే కదా ఇంత కష్టపడి చదువుకునేది అంటారా? నిజమే గానీ మనం నేర్చుకున్న విద్య ఆపదలో ఉన్నప్పుడూ లేదా ప్రాణాంతక వ్యాధుల బారిన పడినప్పుడూ ఉపయోగపడితే మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతుంది. అలాంటి అద్భుత ఘటనే ఓ స్టూడెంట్ విషయంలో చోటు చేసుకుంది. ఏం చేశాడంటే..?
యూఎస్‌లో న్యూజెర్సీకి చెందిన 27 ఏళ్ల వైద్య విద్యార్థి సల్లీ రోహన్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. స్టడీలో భాగంతో ఓ రోజు థెరాయిడ్‌ను ఎలా అల్ట్రాసౌండ్ ద్వారా గుర్తించాలో భోదిస్తున్నారు ప్రోఫెసర్లు. థెరాయిడ్ గురించి బోధిస్తుండగా తనకు కూడా ఉందన్న అనుమానం సల్లీలో వచ్చింది . అనుహ్యంగా ఒక్కో విద్యార్థికి టెస్ట్ చేస్తూ.. సల్లీకు కూడా చేయగా థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లు వెల్లడైంది. వెంటనే ఆయన డాక్టర్‌ని సంప్రదించమని ఆమెకు సలహ ఇచ్చారు. దీంతో ఆమె వైద్యులను సంప్రదించి వివిధ వైద్య పరీక్షలు చేయగా రిపోర్ట్‌లో పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్‌లో ఉందని తేలింది.
అయితే సల్లీ థైరాయిడ్ సమస్యను సూచించే ఎలాంటి లక్షణాలను గానీ సమస్యలను గానీ ఫేస్ చెయ్యలేదు. ఇది నాలుగు ప్రాథమిక రకాల థైరాయిడ్ క్యాన్సర్‌లలో అత్యంత ప్రబలమైనది. అల్ట్రాసౌండ్ గురించి క్లాస్ జరగకపోతే గనుక తన వ్యాధిని కనుగొనకపోవచ్చని చెబుతోంది. సల్లీకి వచ్చిన థైరాయిడ్ క్యాన్సర్ శోషరస కణువుల వరకు విస్తరించి ఉన్నట్లు తేలింది. వెంటేనే ఆమె ఆరోగ్య ఖర్చులు కవరయ్యేలా భీమా చేయించుకుని ట్రీట్‌మెంట్ తీసుకోవడవం ప్రారంభించింది.
ముందుగా థైరాయిడ్ ప్రభావిత శోషరస కణువులను తొలగించే శస్త్ర చికిత్స చేయాలి తర్వాత రేడియో అయోడిన్ అనే ఒక రకమైన రేడియేషన్ థెరపీని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. కళాశాలలో ఆ క్లాస్ జరగడం ఆ స్టూడెంట్ వరం అయ్యింది. లేదంటే లాస్ట్ స్టేజ్ వరకు ఆ క్యాన్సర్‌ని గుర్తించి ఉండేవారు కాదు. పైగా ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సి ఉండేది. మనం నేర్చకుంది ప్రాణాంతక సమస్యల నుంచి అనూహ్యంగా బయటపడేలా చేస్తే అంతకుమించిన ఆనందం మరోకటి లేదు కదా!.
(చదవండి: ముక్కు క్యాన్సర్ అంటే..? దీని కారణంగా ఓ మహిళ మొత్తం ముక్కునే..)
Comments
Please login to add a commentAdd a comment