మానసిక సమస్యల వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్ రావచ్చు | thyroid Problem may be due to psychological problems | Sakshi
Sakshi News home page

మానసిక సమస్యల వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్ రావచ్చు

Published Fri, Aug 23 2013 12:26 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM

మానసిక సమస్యల వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్ రావచ్చు

మానసిక సమస్యల వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్ రావచ్చు

 థైరాయిడ్ గ్రంథిలో కొన్నిరకాల కారణాల వల్ల హైపో మరియు హైపర్ థైరాయిడిజమ్ వంటివి రావచ్చు. అంటే వారసత్వంగా కాని, ఏదైనా మానసిక ఒత్తిడి, ఆందోళనల వల్ల, థైరాయిడ్ గ్రంథిలో ఉండే హార్మోన్లు ఉత్పత్తి సరిగ్గా ఉండదు. అంటే T3,  T4 హార్మోన్లు ఎక్కువ లేదా తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. ఒక్కొక్కసారి థైరాయిడ్ గ్రంథిలో చిన్నచిన్న కాయలలాంటివి ఏర్పడి, అవి క్యాన్సర్ స్థాయికి కూడా రావచ్చు. ముఖ్యంగా  థైరాయిడ్ గ్రంథిలో వచ్చిన లోపాల వల్ల, మానసిక మరియు శారీరక ఎదుగుదల మరియు సమస్యలు, అవయవాల యొక్క పనితీరు దెబ్బ తింటుంది.
 థైరాయిడ్ గ్రంథి అనేది శరీరంలో అతి పెద్దది. ఇది ముఖ్యంగా మెడ భాగంలో, థైరాయిడ్ కార్టిలేజ్ కింద ఉంటుంది. జీవప్రక్రియలు అన్నింటికీ ఇది అతి ముఖ్యమైన గ్రంథి. శరీరంలో ఉండే అతి ముఖ్యమైన అవయవాలను కూడా థైరాయిడ్ గ్రంథి కంట్రోల్‌లో ఉంచుతుంది.
 థైరాయిడ్ గ్రంథి ముఖ్యంగా 3 రకాలైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. 1. థైరాక్సిన్ (T3), 2) ట్రైబడో థైరోనిన్ (T4), 3) కాల్సిటోనిన్. ఈ కాల్సిటోనిన్ శరీరంలో సరైన మొత్తంలో క్యాల్షియమ్‌ను ఉత్పత్తి అయ్యేలా చూస్తుంది.
 హైపర్ థైరాయిడిజమ్ లక్షణాలు
 1. కంగారు పడటం 2. చిరాకు 3. చెమట ఎక్కువ పట్టడం 4. గుండె దడ 5. చేతులు వణకడం 6. ఆందోళన 7. నిద్రలేమి 8. చర్మం పొడిబారడం 9.జుట్టు రాలడం 10. విరేచనాలు 11.బరువు తగ్గిపోవడం 12.వేడిని తట్టుకోలేకపోవటం 13. ఆకలి పెరగడం 14. యూరిన్ ఎక్కువసార్లు అవ్వటం 15. నెలసరులు సరిగ్గా రాకపోవటం 16. కంటి చుట్టూ ఉండే కండరాలు బలహీనపడటం.
 
 హైపో థైరాయిడిజమ్ లక్షణాలు:
 ఇక్కడ థైరాయిడ్ హార్మోన్లు తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. ఆడవాళ్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అతి బరువు, నెలసరి సమస్యల వల్ల చాలా త్వరితంగా పరిస్థితిని గుర్తించవచ్చు.
 
 లక్షణాలు:
 1. అలసట; 2. ఆయాసం, మానసికంగా ఆత్మనూన్యతకు లోనవటం; 3. చలిని తట్టుకోలేకపోవటం; 4.మలబద్దకం; 5. జుట్టు, చర్మం పొడిబారటం; 6. ఏకాగ్రత తగ్గిపోవటం; 7. శరీరం అంతా నొప్పులు; 8. కాళ్లు వాచటం; 9. కంటి చుట్టూ వాపులు రావటం; 10. నెలసరులు సరిగ్గా రాకపోవటం అంటే అధిక రక్తస్రావం లేదా నెలసరులు పూర్తిగా రాకపోవటం; 11. బరువు అకారణంగా పెరగటం.
 పైన చెప్పిన ఈ లక్షణాలన్నీ థైరాయిడ్ గ్రంథిలో వచ్చే అసమతుల్యత వల్ల, శరీరంలో ప్రతి ప్రక్రియ కూడా భాగం అవటం వల్ల, ప్రతి అవయవంలో కూడా విభేదం వస్తుంది. అంతేకాకుండా ఆడవాళ్లలో నెలసరుల సమస్యలతో పాటు ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథిలో వచ్చిన లోపం వల్ల, మానసిక ఎదుగుదల, మానసిక లోపాలు కూడా ఎక్కువగా గమనిస్తూ ఉంటాము.
 
 ముఖ్యంగా హైపర్ థైరాయిడిజమ్ వల్ల వచ్చే మానసిక సమస్యలు:
 ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఆందోళనల వల్ల హైపర్ థైరాయిడిజమ్ రావచ్చు.
 1. ఎక్కువగా ఆందోళన పడటం; 3. ప్రతి చిన్న విషయానికి భయపడటం; 3. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్ అవుతుండటం; 4. శబ్దాలను భరించలేకపోవటం; 5. ఆత్మన్యూనతకు లోనవుతుండటం.
 ఈ థైరాయిడ్ గ్రంథి వల్ల వచ్చే మానసిక సమస్యలను చికిత్స లేకుండా విడిచిపెట్టేస్తే ‘థైరాయిడ్ క్రైసిస్’ లాంటివి రావచ్చు. అంటే మానసిక లక్షణాలు ఇంకా ఎక్కువ రావటం, జ్వరం లేదా తనలో తాను అదేపనిగా మాట్లాడుకోవటం వంటివి కనిపిస్తూంటాయి.
 హైపో థైరాయిడిజమ్ వల్ల వచ్చే మానసిక సమస్యలు:
 1. మానసిక ఎదుగుదలలో లోపాలు; 2. ఆసక్తి తగ్గిపోవటం; 3. విషయాలు సరిగ్గా గుర్తుండక, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం; 4. ఆలోచనా శక్తి కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆత్మన్యూనత హైపోథైరాయిడిజమ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే శారీరకంగా కూడా అధిక బరువు వల్ల అందరిలాగా ప్రతి పనిలో పాల్గొనలేకపోవటం, ఏకాగ్రత, ఆలోచనా శక్తి తగ్గిపోవటం వల్ల, చదువులో వెనకబడతారు. దీనివల్ల నలుగురిలో కలవలేక వెనకబడతారు.
 ఏది ఏమైనా హైపో మరియు హైపర్ థైరాయిడిజమ్ వల్ల మానసికంగా పేషెంట్లు ఎక్కువగా బాధపడటం వల్ల, థైరాయిడ్ లెవెల్స్ మరీ ఎక్కువ లేదా తక్కువ అవటం జరుగుతుంది. కాబట్టి పాజిటివ్ హోమియోపతిలో ఈ మానసిక సమస్యలకు అనుగుణంగా, పేషెంట్ తత్త్వాన్ని బట్టి, మూలకారణాన్ని ఎనలైజ్ చేసుకుని ‘జెనిటిక్ కాన్‌స్టిట్యూషనల్ సిమిలియమ్’ అనే పద్ధతి ద్వారా మందులు ఇచ్చి పూర్తిస్థాయిలో పరిష్కారం చూపుతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement