harmones
-
నెలసరి ముందు బాగా తలనొప్పా! పీఎంఎస్ అంటే ఏంటో తెలుసా?
నా వయసు 25 ఏళ్లు. ఇటీవల నాకు నెలసరి ముందు బాగా కడుపునొప్పి, తలనొప్పి వస్తున్నాయి. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాను. జాబ్‌లో కూడా ఏ పనిమీదా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నాకేమైనా సమస్య ఉందంటారా? – రాజీవ, బనగానపల్లిమీరు ఎదుర్కొంటున్న సమస్యను ‘ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్’ (పీఎంఎస్) అంటారు. ప్రతి వందమందిలో ఇద్దరికి మీలో ఉన్నంత తీవ్రంగా ఈ సమస్య ఉంటుంది. దీని లక్షణాలు దినచర్యను ప్రభావితం చేసేంతగా ఉంటాయి. చాలామందిలో నెలసరి మొదలవడానికి రెండువారాల ముందు నుంచి శారీరక, మానసిక మార్పులు కనిపిస్తాయి. బరువు పెరగడం, మానసికంగా బలహీనం కావడం, తలనొప్పి, చిరాకు, కోపం, నిద్రలేమి, నీరసం ఉంటాయి.పీఎంఎస్‌కి సరైన కారణం తెలియదు. హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుందనుకుంటాము. మీలో కలిగే మార్పులన్నీ కాగితంపై రాసుకోవాలి. దీనిని మెన్స్ట్రువల్ డైరీ అంటారు. ఇలా రెండు మూడు నెలలు మెన్స్ట్రువల్ డైరీ రాశాక, సమస్యకు కారణాలు కొంతవరకు తెలుస్తాయి.ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు– అంటే, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, నెలసరికి రెండు మూడు వారాల ముందు నుంచి టీ, కాఫీలు తగ్గించడం, జంక్‌ఫుడ్ మానేయడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, కొంతవరకు ఫలితం ఉంటుంది. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక స్థైర్యం పెరగడమే కాకుండా, పీఎంఎస్ లక్షణాల తీవ్రత తగ్గుతుంది.అలాగే, డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది. విటమిన్–డి, విటమిన్–ఇ లాంటి సప్లిమెంట్లు ఉపయోగపడతాయి. పైమార్పులు, సప్లిమెంట్లతో ఫలితం కనిపించకపోతే, డాక్టర్ల పర్యవేక్షణలో అవసరమైన మందులు తీసుకోవలసి ఉంటుంది. అత్యంత అరుదుగా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.డా. భావన కాసు, గైనకాలజిస్ట్ అండ్ అబ్‌స్టెట్రీషియన్, హైదారాబాద్ -
'16 ఏళ్లకే హార్మోన్ ఇంజెక్షన్స్.. నా గుండె పగిలిందన్న స్టార్ హీరోయిన్'
టాలీవుడ్లో దేశముదురు మూవీతో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ హన్సిక మోత్వానీ. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన ఇటీవలే 'మై నేమ్ ఈజ్ శృతి' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో బురుగు రమ్య ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్కిన్ మాఫియా కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ నవంబర్ 17న థియేటర్లలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో నటించింది. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన హన్సిక ఇటీవలే తన మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకుంది. తన భర్త సోహెల్ కతురియాలో వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. అయితే హన్సిక సినీ కెరీర్ కంటే ఎక్కువగా వ్యక్తిగతంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అయితే గతంలో హన్సిక 16 ఏళ్ల వయసులోనే హార్మోన్ల ఇంజెక్షన్లు తీసుకుందని పెద్దఎత్తున వార్తలొచ్చాయి. ఈ వివాదంలో ఇప్పటి వరకు ఏదో ఓ సందర్భంలో చర్చ జరుగుతూనే ఉంది. హన్సిక తల్లి మోనా మోత్వానీ వృత్తిరీత్యా స్కిన్ స్పెషలిస్ట్ కావడంతో హన్సిక మరింత యంగ్‌గా కనిపించేందుకు ఆమెకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చిందని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయంపై హన్సిక చాలాసార్లు వివరణ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హన్సిక మరోసారి ఈ వివాదంపై నోరు విప్పింది. అయితే హన్సికకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చానన్న వార్తలను ఆమె తల్లి మోనా మోత్వానీ కొట్టిపారేశారు. హన్సిక మాట్లాడుతూ.. 'ఇలాంటి వార్తలు మా అమ్మను బాధపెట్టినంతగా నన్ను బాధించలేదు. ఎందుకంటే ఈ వార్తలు పూర్తిగా తప్పు ప్రచారమే. నాపై వచ్చినవన్నీ రూమర్స్. దానికి మా అమ్మ చాలా బాధపడింది. అమ్మ పరిస్థితిని చూసి మేమే ఏడ్చాం. ఇలాంటివి వార్తలు మా కుటుంబ సభ్యులు ఎప్పుడు వినలేదు. ఇలాంటి పుకార్లు నా హృదయాన్ని విచ్ఛిన్నం చేశాయి. సోషల్ మీడియాలో ఎవరికైనా ఏదైనా చెప్పే స్వేచ్ఛ ఉంది. కానీ ఒకరి వ్యక్తిగత జీవితం ఎలా పడితే అలా రాయమని చెప్పలేదు కదా.' అని అన్నారు. కాగా.. డిసెంబర్ 2, 2022న ప్రియుడు సోహైల్ కతురియాను హన్సిక వివాహం చేసుకుంది. జైపూర్‌లోని జరిగిన వీరి పెళ్లికి కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. -
Health: టాబ్లెట్ల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్ చేయొచ్చా? వారికైతే సురక్షితం కాదు..
మెనోపాజ్ వల్ల హార్మోన్స్ తగ్గిపోతాయి కదా.. దాని ప్రభావం ఆరోగ్యం మీద పడకుండా ఉండడానికి మాత్రల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్ చేయవచ్చా? – సీహెచ్. వెంకటలక్ష్మి, సామర్లకోట మెనోపాజ్ తరువాత హార్మోన్స్ డెఫిషియెన్సీ వల్ల సైడ్ఎఫెక్ట్స్, ఇబ్బందులతో చాలామంది బాధపడుతుంటారు. వాటిని తగ్గించడానికి చాలామంది హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారిప్పుడు. అయితే దీనిని డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. అదికూడా వైద్య పరీక్షల అనంతరం. ఈ హెచ్ఆర్టీ అందరికీ సరిపడకపోవచ్చు. మెనోసాజ్ వచ్చిన కొన్ని నెలల తర్వాత ఈ హార్మోన్స్ థెరపీతో ముఖ్యంగా హాట్ ఫ్లషెస్, రాత్రిళ్లు చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్స్, వెజైనా పొడిబారిపోవడం వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. ఆస్టియోపొరాసిస్ అంటే ఎముకలు గుల్లబారడం వంటి సమస్యనూ నివారిస్తుందీ హెచ్ఆర్టీ. ఈ సింప్టమ్స్ అన్నీ మెనోసాజ్ వచ్చిన కొన్నినెలలకు కనపడతాయి. ట్రీట్మెంట్ మొదలుపెట్టాక కనీసం మూడు నెలలు అయితే కానీ దాని ప్రభావం కనిపించదు. వారికి హెచ్ఆర్టీ సురక్షితం కాదు ఒకవైళ ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే డోస్, ప్రిపరేషన్ మార్చేయవచ్చు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, అంతకుముందు బ్లడ్ క్లాట్స్ ఉన్నా, హై బీపీ, లివర్ ప్రాబ్లమ్ ఉన్నవారిలో హెచ్ఆర్టీ సురక్షితం కాదు. హెచ్ఆర్టీలో హార్మోన్స్‌ను సింగిల్ డోస్‌గా కానీ.. కంబైన్డ్ డోస్ టాబ్లెట్స్‌గా కానీ ఇస్తారు. ఇవి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్స్‌తో ఉంటాయి. స్కిన్ పాచెస్, జెల్స్, పెసరీస్ కూడా ఉంటాయి. హెచ్ఆర్టీకి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. జీవనశైలిలో మార్పులు అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, మసాలా ఆహారపదార్థాలు, టీ, కాఫీ, ఆల్కహాల్ వంటివాటికి దూరంగా ఉంటూ.. తాజా ఆకుకూరలు,బాదం పప్పు, అక్రోట్స్, సోయా బీన్స్ వంటివి తీసుకుంటూంటే మెనోపాజ్ సింప్టమ్స్ అంతగా బాధించవు.. తగ్గుతాయి కూడా. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Unwanted Hair: పై పెదవి మీద, చుబుకం కింద డార్క్ హెయిర్.. పీసీఓఎస్ వల్లేనా? పరిష్కారం? పిల్లల్లో రోజూ 80 – 100 వరకు తల వెంట్రుకలు రాలుతుంటే ఓసారి... -
మెదడులో కల్లోలం.. ఆ నాలుగు గంటలు ఎంతో కీలకం
లబ్బీపేట(విజయవాడ తూర్పు): శరీర అవయవాల పనితీరును నియంత్రించే మెదడు దెబ్బతినడం వల్ల కలిగే వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్. మెదడులో రక్తం సరఫరా సరిగ్గా జరగక పోవటం, రక్తనాళాలు చిట్లటం వంటి కారణాలతో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై పక్షవాతం బారిన పడతారు. ఈ వ్యాధి ఒకప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వారికే వచ్చేది. కానీ ప్రస్తుతం 30 నుంచి 45 ఏళ్ల లోపు యువత కూడా దీని బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జీవన విధానంలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాల వల్ల అనేక మంది పక్షవాతానికి గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 30 శాతం మంది యువతే.. ఒకప్పుడు వయస్సు 55, 60 ఏళ్ల వారిలో ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యేవారు. కానీ ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే వారిలో 25 నుంచి 30 శాతం మంది 45 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురు బ్రెయిన్ స్ట్రోక్‌తో వస్తుంటారు. వారి స్ట్రోక్ తీవ్రతను బట్టి జనరల్ మెడిసిన్, ఏఎంసీ, న్యూరాలజీ విభాగాల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో వస్తున్న వారిలో రక్తంలో గడ్డలు ఏర్పడి మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగక పోవడం వలన వచ్చే స్ట్రోక్(ఇస్కిమిక్) 80 శాతం మంది, రక్తనాళాలు చిట్లి (హెమరైజ్డ్) 20 శాతం మంది ఉంటున్నారు. ప్రధాన కారణాలివే.. - పెద్ద వయస్సు వారిలో రక్తపోటు, మధుమేహం స్ట్రోక్‌కు కారణంగా చెబుతున్నారు. - 45 ఏళ్లలోపు వారిలో హోమోసిస్టీన్, సిక్కుసెల్ అనే రక్తంలో జెనిటిక్ లోపాలు, వంశపారంపర్యంగా, హెరాయిన్ వంటి డ్రగ్స్, మద్యపానం, ధూమపానం, ప్రమాదాల్లో తలకు గాయాలైన వారిలో ఎక్కువగా స్ట్రోక్ వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. - వీరితో పాటు కదలిక లేని జీవన విధానం కారణంగా కొలె్రస్టాల్ స్థాయిలు పెరిగి స్ట్రోక్‌కు గురవుతున్నట్లు వెల్లడిస్తున్నారు. - ఆడవారిలో హార్మోనల్ ఇబ్బందులు, రక్తనాళాల్లో లోపాల కారణంగా కూడా స్ట్రోక్ రావచ్చంటున్నారు. గుండెలోపాలు ఉన్న వారిలోనూ బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువని వివరిస్తున్నారు. ఆ నాలుగు గంటలే కీలకం.. ఇప్పుడు బ్రెయిన్‌స్ట్రోక్‌కు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. లక్షణాలను గుర్తించి, నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే స్ట్రోక్‌తో వైకల్యం రాకుండా వైద్యులు కాపాడగలుగుతున్నారు. ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చిన వారికి త్రోంబలైసిస్ ఇంజెక్షన్‌ను ఇవ్వడం ద్వారా రక్తంలోని పూడికలు కరిగేలా చేస్తున్నారు. ముఖం, చేయి, కాలు ముఖ్యంగా శరీరం ఒకవైపున ఆకస్మిక తిమ్మిరి, బలహీనత ఏర్పడటం, ఆకస్మికంగా గందరగోళం ఏర్పడటం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, కంటి చూపు మందగించడం, తలతిరగడం, బ్యాలెన్స్ తప్పడం, ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి వంటికి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. -
టీనేజ్‌లో కాకుండా... యుక్తవయసు దాటాకా మొటిమలు వస్తున్నాయా?
కొత్తగా యుక్తవయసులోకి ప్రవేశించేటప్పుడు యువతీయువకుల్లో మొటిమలు రావడం చాలా సహజం. కానీ కొద్దిమంది మహిళల్లో ఇవి 25 నుంచి 35 ఏళ్ల వయసులోనూ కనిపిస్తుంటాయి. టీనేజీలోకి వచ్చే యువతుల్లో అప్పుడే స్రవిస్తున్న కొత్త హార్మోన్లు మొటిమలకు కారణం కాగా... యుక్తవయసు దాటినవారిలో కొంతమేర హార్మోన్ల ప్రభావంతోపాటు ప్రీ–మెనుస్ట్రువల్ సిండ్రోమ్ సమస్యల కారణంగా కూడా మొటిమలు రావచ్చు. అంతేగాక... లుక్స్ గురించి టీనేజీలో పట్టించుకున్నట్లుగా కాకుండా... కొంత స్వేచ్ఛ తీసుకుని ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్ వంటివి తినే ఆహారపు అలవాట్లు కూడా ఈ సమస్యకు ఒక కారణం కావచ్చు. మొటిమల వల్ల పెద్దవయసులో ఏర్పడే మచ్చలు టీనేజీ సమయంలో కంటే కాస్త ఎక్కువకాలం ముఖంపై ఉండిపోవచ్చు. అది కొద్దివారాలు మొదలుకొని... కొన్ని నెలల వరకూ ఉండిపోవచ్చు. వీటి బాధ నుంచి విముక్తం కావడం కోసం తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. చాలా తక్కువ తీవ్రతతో (మైల్డ్‌గా) ఉన్న మొటిమలకు పైపూతగా వాడే మందులు, శాల్సిలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్ వంటి క్లెన్సర్స్ వాడాల్సి ఉంటుంది. మొటిమలు ఇంకాస్త తీవ్రంగా వస్తున్నవారు రెటినాయిడ్స్ వంటి పూత మందులు వాడాలి. స్వేద రంధ్రాలు పూడుకుపోయి మొటిమలు వస్తునప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి. మరింత తీవ్రమైన మొటిమలకు రెటినాయిడ్స్‌తో పాటు కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. ఈ మందులతో ప్రయోజనం లేనప్పుడు నోటిద్వారా తీసుకునే ఓరల్ మెడిసిన్స్ డాక్టర్ సలహా మేరకు వాడాల్సిన అవసరం పడవచ్చు. మొటిమలతో పాటు హార్మోన్ అసమతౌల్యతలు ఉన్నప్పుడు కొన్ని హార్మోన్ సంబంధిత మందులు వాడాల్సి వస్తుంది. ఈ చికిత్సల తర్వాత మొటిమల తాలూకు మచ్చలు, గాట్లు పోవడానికి కెమికల్ పీల్స్, డర్మారోలర్, లేజర్ చికిత్సలు, మైక్రో నీడిలింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) వంటి చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉంటాయి. చదవండి: Vitamin A Deficiency: విటమిన్ ‘ఏ’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తిన్నారంటే! -
‘తులసి’ గురించి ఈ ఆసకక్తికర విషయాలు తెలుసా.. డిప్రెషన్‌తో పాటు..
భారతీయుల జీవనశైలిలో తులసి కూడా ఒక భాగమే. ఆయుర్వేద సుగుణాల పుట్ట తులసి. అందుకే తులసిని ‘క్వీన్ ఆఫ్ హెర్బ్స్’ అని కూడా అంటారు. దీనిలో ‘ఎ, సి’ విటమిన్లు, కాల్షియం, ఐరన్, క్లోరోఫిల్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇంతవరకు తులసి శారీరక ఆరోగ్యానికి మేలుచేసే ఔషధంగా మాత్రమే మనందరికీ తెలుసు. మునుపెన్నడూ ఎరుకలోలేని మరొక రహస్యం తులసిలో దాగుంది. అదేంటంటే.. మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచే అడాప్టోజెన్ను తులసి కలిగి ఉంటుందని మీకు తెలుసా! అంతేకాకుండా మెంటల్ హెల్త్‌కు ఉపకరిస్తుందని వివిధ అధ్యయనాలు పేర్కొన్నాయి. నమ్మబుద్ధి కావడం లేదా? ఈ కింది పరిశోధనలే అందుకు సాక్షాలు!! మనరోజువారీ జీవనవిధానంలో రకరకాల ఒత్తిడులకు గురౌతుంటాము. శారీరకంగా, ఎమోషనల్‌గా, కెమికల్ ఇలా ఎన్నో. ది క్లినికల్ ఎఫికెసి అండ్ సేఫ్టీ ఆఫ్ తులసి ఇన్ హ్యూమన్స్ పేర విడుదలైన అధ్యయన నివేదిక ప్రకారం పర్యావరణం కారణంగా ఒత్తిడులకు గురైనప్పుడు తులసి సహనాన్ని పెంచడానికి సహాయపడుతుందని వెల్లడించింది. నిద్ర, మతిమరుపు, లైంగిక సంబంధిత సమస్యలకు కూడా దివ్యౌషధంగా పనిచేస్తుందని నివేదికలో తెల్పింది. యాంటీడిప్రెషన్, యాంటీ యాంగ్జైటీ కారకాలు కూడా.. అంతేకాకుండా ది జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రకారం తులసిలో యాంటీడిప్రెషన్, యాంటీ యాంగ్జైటీ కారకాలు ఉంటాయని పేర్కొంది. ఒక అధ్యయనం ప్రకారం ప్రతి రోజూ 5 వందల మిల్లీ గ్రాముల తులసి ఆకుల రసాన్ని తాగినవారిలో యాంగ్జైటీ (వ్యాకులత), ఒత్తిడి గణనీయంగా తగ్గినట్టు తేలింది. న్యూరో కాగ్నిటివ్ ప్రభావాలను.. పీర్-రివ్యూడ్ జర్నల్ 2017లో ప్రచురించిన ఎవిడెన్స్-బేస్డ్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం.. మానసిక స్థితిని మెరుగుపరిచే న్యూరో కాగ్నిటివ్ ప్రభావాలను తులసి చూపగలుగుతుంది. తులసి టీ యోగా మాదిరి.. అంతేకాకుండా తులసి టీలో కెఫిన్ ఉండదు కాబట్టి ప్రతిరోజూ దీనిని తాగడం వల్ల యోగా మాదిరి శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచగలుగుతుందని కొన్ని అధ్యనాలు తేల్చాయి. కార్టిసాల్ హార్మోన్ల నిర్వహణ మన శరీరంలో ప్రతి ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య కార్టిసాల్ హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. అందువల్లనే మామూలుగా నిద్రలేవగలుగుతున్నాం. కార్టిసాల్ ను స్ట్రెస్ హార్మోన్ అనికూడా అంటారు. ఎప్పుడైతే అధిక ఒత్తిడికి గురౌతారో మీ శరీరంలో ఇది ముందుగానే విడుదలవుతుంది. ఇది అధికమోతాదులో విడుదలైతే నిద్ర లేమి సమస్యలు తలెత్తుతాయి. తులసి మన శరీరంలో కార్టిసాల్ స్థాయిలను తగుమోతాదులో విడుదలయ్యేలా చేస్తుంది. తద్వారా మీరు రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు. చదవండి: Home Remedies: వాంతికి వచ్చినట్లు ఉందా? వీటిని తిన్నారంటే వెంటనే.. -
మాతృత్వానికే ప్రమాదకారి పీసీఓడీ!
ఈ మధ్యకాలంలో టీనేజ్ అమ్మాయిల నుంచి వివాహిత స్త్రీల వరకు అందర్ని బాధిస్తున్న సమస్యల్లో ముఖ్యమైనది అండాశయంలో నీటి బుడగల సమస్య. వైద్య పరిభాషలో పీసీఓఎస్(పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్) లేదా పీసీఓడీ(పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్)గా పిలిచే ఈ సమస్యతో ప్రతి పదిమందిలో ఐదుగురు బాధపడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవాంఛిత రోమాలతో ఆరంభమై చివరకు మాతృత్వ మధురిమలు దక్కకుండా చేసే ఈ పీసీఓడీపై గ్రామీణ జనాభా ఎక్కువగా ఉండే మన భారత్‌లో అవగాహన చాలా తక్కువ. కేవలం పట్టణాల్లో ఉండే వారిలో కొందరికి మాత్రమే దీని గురించి కొంచెంకొంచెంగా తెలుసు. పీసీఓడీకి సంపూర్ణ చికిత్స అందుబాటులో లేనందున దీన్ని ఆరంభంలోనే గుర్తించి సరైన చర్యలు తీసుకోవడం ఉత్తమం. అసలు ఈ పీసీఓఎస్ అంటే ఏంటీ? ఎందుకు వస్తుంది? రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకొవాలి?... చూద్దాం.. సాధారణంగా ప్రతిస్త్రీలోనూ రుతుక్రమ సమయంలో అండాశయంలో అండం పరిపక్వత చెంది నెలనెలా విడుదల అవుతుంది. నెలసరి తర్వాత 11– 18 రోజుల మధ్యకాలంలో అండం విడుదల ప్రక్రియ జరుగుతుంది. ఇందుకు అవసరమయ్యే హార్మోన్ ఈస్ట్రోజన్. కానీ కొందరు స్త్రీలలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని మేల్ హార్మోన్లుగా పిలిచే ‘ఆండ్రోజన్స్’ అధికంగా విడుదలవుతాయి. ఇది క్రమంగా పీసీఓడీకి దారితీస్తుంది. పీసీఓడీతో బాధపడుతున్న వారిలో విడుదలయ్యే అండం పూర్తిగా ఎదగక, అది అండాశయంలో నీటి బుడగ రూపంలో ఉండిపోతుంది. ఒక్కోక్కరిలో హర్మోన్ల అసమతుల్యతను బట్టి నీటి బుడగలు(నీటి తిత్తులు) ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలోనూ ఉంటాయి. ఇప్పటివరకు ఈ సమస్య ఎందుకొస్తుందనేది, ఖచ్చితంగా తెలియదు. కానీ టెస్టొస్టిరాన్ వంటి పురుష హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల అండాశయంలో అండం విడుదల కాకపోవడం, విడుదలైనా పెరగకపోవడం జరుగుతుంది. అండాలు.. అండాశయాలు ప్రతి స్త్రీ శరీరంలో గర్భాశయానికి ఇరుపక్కలా రెండు అండాశయాలు ఉంటాయి. వీటిలో ద్రవంతో నిండిన చిన్న చిన్న సంచుల్లాంటి నిర్మాణాల్లో అండాలు తయారవుతాయి. ఈ సంచులనే వైద్య పరిభాషలో ఫాలిక్యూల్స్ అంటారు. ప్రతి నెలా ఒక పాలిక్యూల్ ఎదిగి పరిపక్వం చెందిన అండాన్ని విడుదల చేస్తుంది. ఇలా విడుదలైన అండం, వీర్య కణంతో కలిసినప్పుడు ఫలిదీకరణం చెంది, జైగోట్ ఏర్పడి తర్వాతి దశలో పిండంగా ఎదుగుతుంది. ఈ ప్రక్రియ జరగని పక్షంలో ఆరోగ్యవంతమైన స్త్రీలకు నెలసరి వస్తుంది. అయితే అండం ఏర్పడి, పూర్తి స్థాయిలో ఎదిగి విడుదలయ్యే ప్రక్రియ మొత్తం హార్మోన్ల నియంత్రణలో ఉంటుంది. ఫాలిక్యూల్ ఎదగడానికి, ఆరోగ్యవంతమైన అండం తయారవడానికి హార్మోన్ల పాత్ర కీలకం. మెదడులోని హైపోథలామస్ అనే భాగం ఈ హార్మోన్ల విడుదలను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నష్టాలేంటి... పీసీఓడీ ఉన్నవారిలో ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, టెస్టోస్టిరాన్, ఇన్సులిన్ వంటి హార్మోన్లు స్త్రీల ఇతరత్రా వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా ఊబకాయం, నెలసరి క్రమం తప్పడం, కొందరిలో నెలసరి రెండు లేదా మూడు నెలలకోసారి రావడం, రుతుక్రమ సమయంలో కొందరిలో అధికంగా రక్తస్రావం జరగడం, మరికొందరిలో సాధారణ స్రావానికంటే కూడా అతితక్కువగా రక్త స్రావం జరుగుతుంది.ఈ సమస్య ఉన్నవారిలో అండం సక్రమంగా విడుదల కాకపోవడం వల్ల సంతానం కలగడానికి ఇది పెద్ద ఆటకంగా మారుతుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ అధికంగా విడుదలవుతుంది. దీంతో యుక్తవయసులో ఉన్న వారికి మొటిమలు అధికంగా రావడం, జుట్టురాలిపోవడం, స్త్రీలలో అవాంచిత రోమాలు పెరిగి పురుష లక్షణాలు కనిపిస్తాయి. ఇన్సులిన్ హోర్మోన్ స్థాయి పెరుగుతుంది. దీంతో శరీరంలో ప్రతికూల వాతావరణంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీర్ఘకాలికంగా పీసీఓడీతో బాధపడుతున్న వారిలో టైప్–2 డయాబెటిస్ (మధుమేహం) వచ్చే అవకాశాలు ఎక్కువ. గర్భం ధరించినప్పుడు మధుమేహం రావడం, కొలెస్ట్రాల్ పెరగడం, రక్తపోటు వంటి ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఫలితంగా పీసీఓడీతో బాధపడేవారు ఆత్మవిశ్వాసం కోల్పోయి తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. దీనివల్ల ఇతర రకాల సమస్యలు పెరుగుతాయి. -
గుండెజబ్బులకు జన్యు కారణాలు ఎక్కువే!
గుండెజబ్బులకు జన్యుపరమైన కారణాలు ఉంటాయని చాలాకాలంగా తెలిసినప్పటికీ ఎంతమేరకు అన్న విషయంలో సందిగ్ధత ఉండేది. అమెరికా, జర్మనీ శాస్త్రవేత్తల తాజా పరిశోధన పుణ్యమా అని ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. గతంలో వేసిన అంచనాల కంటే చాలా ఎక్కువగా అంటే దాదాపు 30 శాతం గుండెజబ్బులకు జన్యువులే కారణమని వీరు తేల్చేవారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురితమైన తాజా వివరాల ప్రకారం.. గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడమనే కరోనరీ ఆర్టరీ జబ్బుపై శాస్త్రవేత్తలు అధ్యయనం జరిపారు. జన్యువులతో ఈ జబ్బుకు ఉన్న సంబంధాలపై గతంలోనే ఓ దశాబ్ద కాలం పాటు అధ్యయనం జరగ్గా పాతికశాతం జబ్బులు వారసత్వంగా వస్తున్నట్లు తేలింది. అయితే జన్యువులను నియంత్రించే నెట్‌వర్క్‌ల పాత్ర ఏమిటన్నది మాత్రం స్పష్టం కాలేదు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు గుండె కణజాలానికి సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించారు. దీన్నిబట్టి దాదాపు 28 నెట్వర్క్ వ్యవస్థలు కరోనరీ ఆర్టరీ వ్యాధిలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమైంది. వీటి ఆధారంగా గుండెజబ్బుల్లో దాదాపు 32 శాతం జన్యు లోపాలు, తేడాల కారణంగా వస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఈ కారణాలన్నీ తెలియడం వల్ల గుండె జబ్బులను తొందరగా గుర్తించేందుకు వీలేర్పడుతుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త లీ– మింగ్ తెలిపారు. -
ఇవి రోజూ తింటే పొడవు పెరుగుతారట!
సరైన ఎత్తు పెరగాలని అందరూ కోరుకుంటారు. టీనేజీ దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. వయసు దాటిపోయినప్పటికీ కొందరు ఎత్తు పెరిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది అన్నిసార్లూ సరైన ఫలితాన్నివ్వకపోవచ్చు. అందుకే ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల సరైన ఎత్తు పెరగవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఎత్తు పెరిగే అవకాశం ఉంది. ఇందుకు దోహదపడే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.. 1. ఎర్ర ముల్లంగి ఎర్రముల్లంగిని తరుచూ తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్లు అధికంగా ఉంటాయి. 2. బీన్స్ ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండిపద ర్థాలు బీన్స్‌లో పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు. 3. బెండకాయ ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో కురగాయ బెండకాయ. దీంట్లో విటవిన్లు, ఫైబర్, పిండిపదర్థాలు, నీరు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. 4. బచ్చలికూర ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి. సాధరణంగా దీనిని దక్షణ ఆసియాలో వాడుతారు. ఐరన్, కాల్షియం, ఫైబర్ బచ్చలిలో అధికంగా ఉంటుంది. 5. బఠాని బఠానిలు రోజు తీసుకోనడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్, ప్రోటిన్స్, మినరల్స్ దీంట్లో సమృద్ధిగా ఉంటాయి. 6. అరటిపండు బరువు పెరుగకుండా ఉండాలనుకుంటున్నవాళ్లు అరటిపళ్లకు చాలా దూరంగా ఉంటారు. నిజానికి అరటిలో చాలా సుగుణాలు ఉన్నాయి. దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగడంతో పాటు హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది. 7. సోయాబీన్ ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది. రోజు 50గ్రాముల తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్భోహైడ్రే ట్స్ అధిక స్థాయిలో ఉంటాయి. 8. పాలు రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎత్తు పెరుగవచ్చు.దీంట్లో విటమిన్ బీ12, డీ తో పాటు కాల్షియం ఉంటుంది. -
వివేకం: మీరు ఎలా భోంచేస్తున్నారు?
యోగాలో ఏమంటామంటే, మీరొక ముద్ద ఆహారాన్ని తీసుకుంటే, దాన్ని 24 సార్లు నమలాలని. మీ ఆహారం మీ నోటిలో ముందే జీర్ణమైపోతే, అది మీ వ్యవస్థలో ఎలాంటి మందకొడితనాన్ని సృష్టించదు. మీరు తిన్నదాన్ని ఇరవై నాలుగు సార్లు నమిలితే, ఆ ఆహారం గురించిన సమాచారంమీ శారీరక వ్యవస్థలో స్థాపితమవుతుంది. మనం ఎలా తింటున్నామన్నది కూడా మనం ఏం తింటున్నామన్నంత ముఖ్యమైన విషయమే. ఎంత తినాలి? కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మెదడు అత్యుత్తమంగా పని చేస్తుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు, ఘ్రెలిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుందనీ, అది కడుపునకు ఆకలిగా ఉందన్న సంగతిని మెదడుకు చేరవేస్తుందనీ పరిశోధకులు చెబుతున్నారు. మనం నేర్చుకోవడానికి, జ్ఞాపకశక్తికి, మనమున్న ప్రదేశ విశ్లేషణకి చెందిన పనులను, మన మెదడులో చక్కబెట్టే హిప్పోక్యాంపస్ అనే ప్రాంతాన్ని ఘ్రెలిన్ ఉత్తేజితం చేసి, దాని సామర్ధ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల మనం చురుగ్గా, ఏకాగ్రతతో ఉంటాం. అయితే మనం తినడం మానేయాలని కాదు. మనమెంత తింటున్నామన్న విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలన్న సంగతి ఇది చెబుతుంది. మీరు ముప్ఫై ఏళ్లలోపు వారైతే, రోజుకు మూడు పూటలా తినడం సరిపోతుంది. ముప్ఫై పైబడి ఉంటే, రెండు పూటలే ఉత్తమం. తిన్నది రెండున్నర గంటల్లో ఉదర కోశం నుంచి వెళ్లిపోయేలా, 12-18 గంటల్లో మీ శరీరాన్నే వదిలిపోయేలా ఉండే ఆహారం ఎరుకతో తీసుకోండి. ఎలా నమలాలి? భోజనంలో నమలడానికి చాలా ప్రాధాన్యత ఉంది. పిండి పదార్థం ఎక్కువగా ఉండే ఆహారాలు, లాలాజలం ద్వారానే 30 శాతం జీర్ణం అవుతాయి. భోజనం చేసేటప్పుడు నీరు తాగడం మంచిది కాదు. కావాలంటే భోజనానికి కొద్ది నిమిషాల ముందు కొద్దిగా నీరు తాగండి లేదా భోంచేసిన 30, 40 నిమిషాల తర్వాత తీసుకోవడం మంచిది. రాత్రివేళ రాగి పాత్రలో నీటిని ఉంచితే, అది క్రిములను నాశనం చేయడమే కాకుండా, ఆ నీటిని శక్తిమంతం చేస్తుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో జరిపిన పరీక్షల్లో రాగి పాత్రలు ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్లను వ్యాపింపజేసే బ్యాక్టీరియాని 97 శాతం నాశనం చేస్తాయని తేలింది. ఏ ఋతువులో ఏ ఆహారం తీసుకోవాలి? భారతదేశంలో, మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, వేసవి కాలంలో ఒకలా, వానాకాలంలో మరోలా, చలికాలంలో ఇంకోలా, ఆయా కాలాల్లో దొరికే, శరీరానికి సరిపడే కూరగాయలతో వండుతారు. ఉదాహరణకి చలికాలంలో, గోధుమ, నువ్వుల్లాంటి కొన్ని రకాల ఆహారాలు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. ఈ కాలంలో, వాతావరణం చల్లబడటం వల్ల చర్మం పగులుతుంది. అయితే పూర్వం ప్రజలు క్రీములు మొదలైనవాటిని వాడేవాళ్లు కాదు. అందరూ రోజూ నువ్వులని తీసుకునేవారు. అవి ఒంటిని వేడిగా, చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి. మీ శరీరంలో ఉష్ణం ఎక్కువగా ఉండటం వల్ల, మీ చర్మం పగలదు. అదే, ఎండాకాలంలో శరీరం వేడెక్కుతుంది. కాబట్టి శరీరాన్ని చల్లబరిచేవి (చల్లనివి కాదు) తీసుకునేవాళ్లు. ఉదాహరణకి జొన్నలు. సమతుల ఆహారం అంటే ఏమిటి? ఈ రోజున, డాక్టర్లు దాదాపు 8 కోట్ల మంది భారతీయులు మధుమేహ వ్యాధి వైపుగా వెళుతున్నారని చెబుతున్నారు. దీనికి గల ఒకానొక కారణం, చాలామంది భారతీయులు ఒక రకం ధాన్యంతోనే చేసిన ఆహారాన్ని తీసుకోవడం. సాంప్రదాయికంగా, ప్రజలు చాలా రకాల పప్పు దినుసులనీ, ధాన్యాలనీ తినేవారు. ఈ కాలంలో దక్షిణ భారతంలో ఆహారాన్ని చూస్తే, అన్నం, కొద్దిగా కూరగాయలతో చేసినదేదైనా ఉంటుంది. పూర్తిగా కార్బొహైడ్రేట్లు ఉండే ఇలాంటి ఆహారానికి మారడం గత 25, 30 ఏళ్లలో జరిగింది. దీన్నిప్పుడు వెనక్కి తిప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా కార్బొహైడ్రేట్లు ఉండి మిగతావి తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే, ఒక వ్యక్తి దీర్ఘ కాలిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఆహారంలో ఎక్కువ భాగం కేవలం అన్నమే ఉండకూడదు, మిగతావి కూడా ఉండాలి. అన్నమనేది మీ ఎంపిక మాత్రమే - అది తినాలా వద్దా అనే విషయాన్ని మీరు మీ ఆకలి స్థాయిని బట్టి నిర్ణయించుకోండి. ఇది ప్రజల మనస్సులో ఏర్పరచవలసిన ఒక మౌలికమైన భావన. -
నివారించవచ్చు... నిరోధించవచ్చు..!
మహిళలకు తాము కోరుకున్నప్పుడు గర్భం ధరించడం ఎంతగా ఆనందం కలిగించే అంశమో... తాము కోరుకోని సమయంలో గర్భధారణ జరగడం అంతగా బాధించే విషయం. అందుకే తాము వద్దనుకున్న సమయంలో గర్భధారణ జరగకుండా చూసుకునేందుకు మహిళలకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయిప్పుడు. అయితే ఎవో ఒకటి రెండు విధానాలు... ఎవరో కొందరికి మినహా... అవాంఛిత గర్భధారణను నివారించే మార్గాల గురించి అంతగా అవగాహన లేదు. ఆ అవగాహనను పెంచడం కోసం ఉపయోగపడేదే ఈ కథనం. గర్భధారణను నివారించేందుకు అందరికీ తెలిసిన మార్గాలు మహిళలు నోటిద్వారా వేసుకునే ఓరల్ పిల్స్, పురుషులు ఉపయోగించే కండోమ్స్. ఇవే కాకుండా మహిళలు మరెన్నో విధానాలను అనుసరించడం ద్వారా అవాంఛిత గర్భధారణను ఆపవచ్చు. అందులో కొన్ని పద్ధతులివి... నోటి ద్వారా తీసుకునే మాత్రలు: ఓరల్ పిల్స్‌గా పేర్కొనే ఇందులో ప్రధానంగా రెండు రకాలున్నాయి. అవి... కంబైన్డ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, ప్రోజెస్టిన్ పిల్స్. కంబైన్డ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ : వీటిలో రెండు హార్మోన్లు ఉంటాయి. అందులో ఒకటి ఈస్ట్రోజెన్, మరొకటి ప్రోజెస్టిన్. ఈ మాత్ర రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి మహిళలో అండం విడుదల కాకుండా చూడటం. మరోటి వీర్యం కదలికలకు అడ్డుకట్ట వేసి అది అండంతో కలవకుండా చేయడం. అయితే ఇవి కూడా పూర్తిగా రక్షణ కల్పించలేవు. ఎనిమిది శాతం మందిలో ఇవి ఉపయోగించినా గర్భం వచ్చే అవకాశాలుంటాయి. వీటితో ప్రయోజనాలతో పాటు కొన్ని ప్రతికూల అంశాలూ ఉన్నాయి. ఇవి మహిళల్లో ఒవేరియన్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్లతోబాటు రుతుక్రమం సమయంలో నొప్పిని, అధిక రక్తస్రావం జరగడాన్ని తగ్గిస్తాయి. అయితే ఇవి కొందరిలో తలనొప్పి, డిప్రెషన్‌ను కలిగించడాన్ని ఈ మాత్రల విషయంలో ప్రతికూల అంశాలుగా భావించవచ్చు. ప్రొజెస్టిన్ పిల్స్: దీన్ని రోజుకు ఒకటి చొప్పున వాడాల్సి ఉంటుంది. ఇందులో కేవలం ప్రోజెస్టిన్ అనే హార్మోన్ మాత్రమే ఉంటుంది. ఇది గర్భాశయ ముఖద్వారంలో ఉండే (సెర్వికల్) మ్యూకస్‌ను మందంగా అయ్యేలా చేస్తుంది. అంతేకాదు గర్భసంచి (యుటెరస్) లైనింగ్‌ను కూడా మందంగా మారుస్తుంది. తద్వారా వీర్యం... అండంతో కలవడాన్ని నిరోధిస్తుంది. ఒక్కోసారి అండం విడుదలను కూడా ఆపేస్తుంది. అయితే ఇవి వాడేవారిలోనూ ఒక్కోసారి అకస్మాత్తుగా గర్భం వచ్చే అవకాశం ఉంది. అయితే డాక్టర్ల సూచన మేరకు, వారు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ వాడినవారిలో ప్రతి 1000 మందికి కేవలం ముగ్గురికి మాత్రమే ఇలాంటి ప్రమాదం ఉంది. ఇందులోనూ కొన్ని అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. ఇందులో ఈస్ట్రోజెన్ ఉండదు కాబట్టి ఆ మేరకు ఆ హార్మోన్ వల్ల కలిగే దుష్ర్పభావాలనుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. కొత్తగా తల్లి అయిన వారు మళ్లీ వెంటనే గర్భధారణ కలగకుండా ఉండటానికి ఈ ‘ప్రోజెస్టిన్-ఓన్లీ’ పిల్స్ వాడవచ్చు. కంబైన్డ్ ఓరల్ పిల్స్ లాగే ఇవి కూడా హెచ్ఐవీ లేదా సెక్స్ ద్వారా సంక్రమించే ఇతర వ్యాధులనుంచి రక్షణ కల్పించలేవు. ఇవి వాడుతున్న కొందరిలో త్వరత్వరగా పీరియడ్స్ వచ్చే అవకాశాలున్నాయి. సర్వైకల్ క్యాప్ : దీన్ని మృదువైన రబ్బర్ వంటి పదార్థం (లాటెక్స్)తో తయారు చేస్తారు. ఎవరైనా డాక్టర్ గాని లేదా నైపుణ్యం ఉన్న నర్స్ గాని దీన్ని సరిగ్గా గర్భాశయ ముఖద్వారం వద్ద సరిగ్గా అమరేలా ఫిక్స్ చేస్తారు. ఈ క్యాప్‌పైన వీర్యాన్ని నాశనం చేసే పదార్థం (స్పెర్మిసైడ్) రాసి ఉంటుంది. ఇది సరిగ్గా గర్భసంచిలోకి వీర్యం వెళ్లని విధంగా గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) వద్ద ఫిక్స్ చేసి ఉండటంతో పాటు, దానిపై వీర్యనాశని ఉంటుంది కాబట్టి వీర్యాన్ని అండంతో కలవకుండా నిరోధిస్తుంది. కానీ ఇది వాడే వారిలో పదహారు శాతం మందిలో గర్భధారణ జరిగే అవకాశాలున్నాయి. అయితే దీన్ని సరిగ్గా అమర్చుకోవడం తెలిసి, సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ఈ ప్రమాదాన్ని తొమ్మిది శాతానికి తగ్గించవచ్చు. దీన్ని సెక్స్‌లో పాల్గొనడానికి ఒక గంట ముందుగా అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇది 48 గంటల పాటు గర్భధారణ నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే ఇది హెచ్ఐవీ లేదా సెక్స్ ద్వారా సంక్రమించే ఇతర వ్యాధులనుంచి రక్షణ కల్పించలేదు. కాబట్టి ఆ రక్షణ కూడా పొందాలంటే సర్వైకల్ క్యాప్‌తో పాటు పురుషుడు కండోమ్ ధరించడం మేలు. ఇక దీనిలో ప్రతికూల అంశాలేమిటంటే... దీన్ని అమర్చడానికి నిపుణుల సహాయం (క్లినికల్ అసిస్టెన్స్) కావాలి. ఒక్కోసారి సెక్స్‌కు ఇది అడ్డంకిగా కూడా పరిణమించవచ్చు. ఒక్కోసారి గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్)లో దీనివల్ల మంట (ఇన్ఫ్లమేషన్) కూడా వచ్చే అవకాశాలున్నాయి. కొందరిలో ఇది అలర్జీ కలిగించవచ్చు. వెజినల్ కాంట్రసెప్టివ్ ఫిల్మ్: ఇది రెండు అంగుళాల పొడవు, రెండంగుళాల వెడల్పు ఉండే పలుచటి ఫిల్మ్లాంటి పొర. దీనిపై నోనోగ్జైనాల్-9 అనే వీర్యకణాలను సంహరించే పదార్థం ఉంటుంది. దీన్ని మహిళల్లో గర్భాశయ ముఖద్వారం వద్ద అమర్చుతారు. అక్కడ ఉంచిన కొద్ది క్షణాల్లోనే ఇది కరిగిపోతుంది. అయితే ఈ మార్గాన్ని అనుసరించే వారిలో 29 శాతం మందిలో మొదటి ఏడాది 29 శాతం మందిలో గర్భధారణ జరిగిన దాఖలాలున్నాయి. దీన్ని చాలా సులభయంగా వాడుకోవచ్చు. ఇది మందుల షాపుల్లో తేలిగ్గా దొరుకుతుంది. సెక్స్ ద్వారా సంక్రమించే కొన్ని రకాల వ్యాధులనూ నివారిస్తుంది. అయితే హెచ్ఐవీనుంచి లేదా మరికొన్ని వైరస్‌లను గాని ఇది నిరోధించలేదు. ఇక నోనోగ్జైనాల్-9 అనే పదార్థాన్ని రాసి ఉన్న ఫిల్మ్‌ను వాడే కొందరిలో ఇది లోపల మంటగా ఉండే అవకాశాలూ ఉన్నాయి. దీన్ని సెక్స్‌లో పాల్గొనబోయే గంట ముందు ఉపయోగించాలి. సెక్స్‌లో పాల్గొనే ప్రతిసారీ కొత్త ఫిల్మ్‌ను వాడాలి. దీన్ని లోపల ఉంచుకున్న ప్రతిసారీ మహిళ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కాంట్రసెప్టివ్ ఫోమ్: అక్షరాలా చెప్పాలంటే ఇది ‘గర్భనిరోధక నురగ’. ఈ నురగ వంటి పదార్థాన్ని మహిళ తన యోనిమార్గం ద్వారా లోపలికి ప్రవేశపెట్టుకుంటుంది. ఈ నురగ... వీర్యకణాలను అండంతో కలవకుండా నిరోధించడం మాత్రమే కాకుండా, వీర్యకణాలను చంపేస్తుంది. అయితే ఒకసారి ప్రవేశపెట్టుకున్న నురగ ఒకసారి సెక్స్‌లో మాత్రమే గర్భధారణ నుంచి రక్షణ కల్పిస్తుంది. మరోసారి సెక్స్‌లో పాల్గొనేవారు మరోమారు ఫ్రెష్‌గా నురగను వాడటం మంచిది. దీన్ని సెక్స్‌కు 20 నిమిషాల ముందు వాడితే చాలు. ఇది చాలా ప్రభావపూర్వకమైనది, సురక్షితమైనది. దీన్ని వాడటం వల్ల సెక్స్ హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడదు. అయితే ఇది హెచ్ఐవీ లేదా సెక్స్ద్వారా సంక్రమించే ఇతర వ్యాధులనుంచి రక్షణ కల్పించలేదు. కొంతమందిలో ఈ నురగ మంటను కలిగించవచ్చు. లోపల ఏదో అవాంఛితమైన పదార్థం ఉన్న ఫీలింగ్‌తో అసౌకర్యం కూడా కలిగించవచ్చు. పైగా ఈ నురగ ఉన్న కంటెయినర్ కాస్త పెద్దదిగా ఉండి తీసుకెళ్లడంలో కాస్త ఇబ్బంది(ఎంబరాస్మెంట్)ని, అసౌకర్యాన్ని కలిగించచ్చు. కాంట్రసెప్టివ్ స్పాంజ్ : ఈ స్పాంజ్ కూడా మహిళలు ఉపయోగించే గర్భనిరోధక సాధనం. దీన్ని గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) దగ్గర అమర్చాలి. ఇది వీర్యకణాలకు అడ్డుకట్టగా నిలిచి గర్భం రాకుండా కాపాడుతుంది. ఇది అడ్డుకట్టగా నిలిచే సాధనం (వెజినల్ బ్యారియర్ మెథడ్) కాబట్టి కొద్దిమేర గనేరియా, క్లమీడియా, ట్రైకోమోనియాసిస్ వంటి వ్యాధులనుంచి కాపాడుతుంది. ఈ కాంట్రసెప్టివ్ అంత ఖరీదైనది కాదు. పైగా సెక్స్‌లో పాల్గొనడానికి ముందే తమ పురుష పార్ట్నర్కు తెలియకుండానే లోపల పెట్టుకోవచ్చు. కాంట్రసెప్టివ్ సపోజిటరీస్: ఇది కూడా అడ్డుకట్ట వేసే పద్ధతే (బ్యారియర్ మెథడ్). సపోజిటరీ అనేది యోని మార్గంలో ఉంచుకునే మాత్ర వంటిది అనుకోవచ్చు. ఈ పదార్థాలను సెక్స్‌కు ముందుగా మహిళ తమ యోనిమార్గంలో ప్రవేశపెట్టుకున్న కాసేపటికే ఇవి లోపల కరిగిపోతాయి. అయితే ఈ సపోజిటరీస్లో వీర్యకణాలను చంపేసే పదార్థాలు (స్పెర్మిసైడ్) ఉంటాయి. దాంతో వీర్యం లోపల ప్రవేశించగానే గర్భాశయవ ుుఖద్వారం (సర్విక్స్) దాటే లోపే ఆ వీర్యకణాలన్నీ చనిపోతాయి. అయితే సపోజిటరీస్ ద్వారా సెక్స్ ద్వారా సంక్రమించే హెచ్ఐవీ లేదా ఇతర వ్యాధుల నుంచి రక్షణ పొందడం సాధ్యం కాదు. పైగా ఒకే రోజు మాటిమాటికీ ఈ ప్రక్రియను అనుసరించడం కూడా మంచిది కాదు. ఎందుకంటే వీర్యకణాలను సంహరించే నోనోగ్జైనాల్-9 వంటి స్పెర్మిసైడ్ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల హెచ్ఐవీ లేదా సెక్స్ ద్వారా సంక్రమించే ఇతర వ్యాధుల వ్యాప్తికి అవకాశాలు పెరుగుతాయి. అందుకే మహిళలు ఈ మార్గాన్ని ఉపయోగించినప్పుడు, పురుషులూ సమాంతరంగా కండోమ్ వాడటం మంచిది. ఇవే గాక మహిళలు తమ గర్భాశయ ముఖద్వారం వద్ద ఉపయోగించడానికి వీలుగా డయాఫ్రమ్, ఫీమేల్ కండోమ్ (మహిళలు ఉపయోగించే వాటిని గతంలో రియాలిటీ కండోమ్స్ అని కూడా అనేవారు), షాట్ అని పిలుచుకునే ఇంజెక్షన్ ద్వారా ఇవ్వాల్సిన డెపో-ప్రొవేరా అనే ప్రోజెస్టరాన్లాంటి హార్మోన్ (ఇది మహిళల్లో అండం విడుదల కాకుండా ఆపుతుంది), ప్యాచ్, నువా రింగ్, తేలికపాటి సిలికాన్ కప్‌లా రూపొందించిన షీల్డ్ వంటి ఇతర మార్గాలున్నాయి. ఇక్కడ పేర్కొన్న ఈ గర్భనిరోధక సాధనాలన్నీ అవగాహన కోసమే. వాటిని ఉపయోగించాలని భావించే వారు తప్పనిసరిగా డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి. అప్పుడే వాటి ఉపయోగాలు, ప్రతికూలతలు తెలిసి, పూర్తి ప్రయోజనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. -నిర్వహణ: యాసీన్ కాంట్రసెప్టివ్ ఇంప్లాంట్స్ : ఇవి మహిళల శరీరంలో స్థానికంగా అనస్థీషియా (మత్తు) ఇచ్చి అమర్చే ఉపకరణాలు. వీటి నుంచి కొద్ది కొద్ది మోతాదుల్లో ప్రోజెస్టిరాన్ వంటి హార్మోన్లు విడుదలవుతూ మహిళల్లో గర్భధారణను నిలిపివేస్తుంటాయి. (ఇదే హార్మోన్ ప్రతి రుతుస్రావం తర్వాత రెండు వారాలకు విడుదలవుతుంది). అయితే ఇది అమర్చిన ప్రతి 1,000 మందిలోనూ ఐదుగురికి అకస్మాత్తుగా గర్భధారణ జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని అమర్చడానికి డాక్టర్ల సహాయం (క్లినికల్ అసిస్టెన్స్) అవసరం. ఇది అమర్చాక కనీసం మూడేళ్ల పాటు ఇది గర్భం రాకుండా సహాయపడుతుంది. కాబట్టి ప్రతిసారీ సెక్స్‌లో పాల్గొనే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అగత్యం తప్పిపోయి, సురక్షితంగా, నిర్భయంగా సెక్స్‌లో పాల్గొనడానికి వీలవుతుంది. అయితే వీటి వల్ల హెచ్ఐవీ లేదా సెక్స్ ద్వారా సంక్రమించే ఇతరత్రా వ్యాధలనుంచి రక్షణ పొందడం వీలు కాదు. ఇవి అమర్చుకున్న కొందరు మహిళల్లో రుతుక్రమం క్రమబద్ధంగా రాకుండా పోవచ్చు. కొందరిలో లావెక్కడం, జుట్టు రాలడం, తలనొప్పి రావడం వంటి దుష్ర్పభావాలు కూడా కనిపించవచ్చు. డాక్టర్ ప్రశాంతి రాజు సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
మానసిక సమస్యల వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్ రావచ్చు
థైరాయిడ్ గ్రంథిలో కొన్నిరకాల కారణాల వల్ల హైపో మరియు హైపర్ థైరాయిడిజమ్ వంటివి రావచ్చు. అంటే వారసత్వంగా కాని, ఏదైనా మానసిక ఒత్తిడి, ఆందోళనల వల్ల, థైరాయిడ్ గ్రంథిలో ఉండే హార్మోన్లు ఉత్పత్తి సరిగ్గా ఉండదు. అంటే T3, T4 హార్మోన్లు ఎక్కువ లేదా తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. ఒక్కొక్కసారి థైరాయిడ్ గ్రంథిలో చిన్నచిన్న కాయలలాంటివి ఏర్పడి, అవి క్యాన్సర్ స్థాయికి కూడా రావచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథిలో వచ్చిన లోపాల వల్ల, మానసిక మరియు శారీరక ఎదుగుదల మరియు సమస్యలు, అవయవాల యొక్క పనితీరు దెబ్బ తింటుంది. థైరాయిడ్ గ్రంథి అనేది శరీరంలో అతి పెద్దది. ఇది ముఖ్యంగా మెడ భాగంలో, థైరాయిడ్ కార్టిలేజ్ కింద ఉంటుంది. జీవప్రక్రియలు అన్నింటికీ ఇది అతి ముఖ్యమైన గ్రంథి. శరీరంలో ఉండే అతి ముఖ్యమైన అవయవాలను కూడా థైరాయిడ్ గ్రంథి కంట్రోల్లో ఉంచుతుంది. థైరాయిడ్ గ్రంథి ముఖ్యంగా 3 రకాలైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. 1. థైరాక్సిన్ (T3), 2) ట్రైబడో థైరోనిన్ (T4), 3) కాల్సిటోనిన్. ఈ కాల్సిటోనిన్ శరీరంలో సరైన మొత్తంలో క్యాల్షియమ్‌ను ఉత్పత్తి అయ్యేలా చూస్తుంది. హైపర్ థైరాయిడిజమ్ లక్షణాలు 1. కంగారు పడటం 2. చిరాకు 3. చెమట ఎక్కువ పట్టడం 4. గుండె దడ 5. చేతులు వణకడం 6. ఆందోళన 7. నిద్రలేమి 8. చర్మం పొడిబారడం 9.జుట్టు రాలడం 10. విరేచనాలు 11.బరువు తగ్గిపోవడం 12.వేడిని తట్టుకోలేకపోవటం 13. ఆకలి పెరగడం 14. యూరిన్ ఎక్కువసార్లు అవ్వటం 15. నెలసరులు సరిగ్గా రాకపోవటం 16. కంటి చుట్టూ ఉండే కండరాలు బలహీనపడటం. హైపో థైరాయిడిజమ్ లక్షణాలు: ఇక్కడ థైరాయిడ్ హార్మోన్లు తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. ఆడవాళ్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అతి బరువు, నెలసరి సమస్యల వల్ల చాలా త్వరితంగా పరిస్థితిని గుర్తించవచ్చు. లక్షణాలు: 1. అలసట; 2. ఆయాసం, మానసికంగా ఆత్మనూన్యతకు లోనవటం; 3. చలిని తట్టుకోలేకపోవటం; 4.మలబద్దకం; 5. జుట్టు, చర్మం పొడిబారటం; 6. ఏకాగ్రత తగ్గిపోవటం; 7. శరీరం అంతా నొప్పులు; 8. కాళ్లు వాచటం; 9. కంటి చుట్టూ వాపులు రావటం; 10. నెలసరులు సరిగ్గా రాకపోవటం అంటే అధిక రక్తస్రావం లేదా నెలసరులు పూర్తిగా రాకపోవటం; 11. బరువు అకారణంగా పెరగటం. పైన చెప్పిన ఈ లక్షణాలన్నీ థైరాయిడ్ గ్రంథిలో వచ్చే అసమతుల్యత వల్ల, శరీరంలో ప్రతి ప్రక్రియ కూడా భాగం అవటం వల్ల, ప్రతి అవయవంలో కూడా విభేదం వస్తుంది. అంతేకాకుండా ఆడవాళ్లలో నెలసరుల సమస్యలతో పాటు ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథిలో వచ్చిన లోపం వల్ల, మానసిక ఎదుగుదల, మానసిక లోపాలు కూడా ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా హైపర్ థైరాయిడిజమ్ వల్ల వచ్చే మానసిక సమస్యలు: ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఆందోళనల వల్ల హైపర్ థైరాయిడిజమ్ రావచ్చు. 1. ఎక్కువగా ఆందోళన పడటం; 3. ప్రతి చిన్న విషయానికి భయపడటం; 3. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్ అవుతుండటం; 4. శబ్దాలను భరించలేకపోవటం; 5. ఆత్మన్యూనతకు లోనవుతుండటం. ఈ థైరాయిడ్ గ్రంథి వల్ల వచ్చే మానసిక సమస్యలను చికిత్స లేకుండా విడిచిపెట్టేస్తే ‘థైరాయిడ్ క్రైసిస్’ లాంటివి రావచ్చు. అంటే మానసిక లక్షణాలు ఇంకా ఎక్కువ రావటం, జ్వరం లేదా తనలో తాను అదేపనిగా మాట్లాడుకోవటం వంటివి కనిపిస్తూంటాయి. హైపో థైరాయిడిజమ్ వల్ల వచ్చే మానసిక సమస్యలు: 1. మానసిక ఎదుగుదలలో లోపాలు; 2. ఆసక్తి తగ్గిపోవటం; 3. విషయాలు సరిగ్గా గుర్తుండక, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం; 4. ఆలోచనా శక్తి కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆత్మన్యూనత హైపోథైరాయిడిజమ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే శారీరకంగా కూడా అధిక బరువు వల్ల అందరిలాగా ప్రతి పనిలో పాల్గొనలేకపోవటం, ఏకాగ్రత, ఆలోచనా శక్తి తగ్గిపోవటం వల్ల, చదువులో వెనకబడతారు. దీనివల్ల నలుగురిలో కలవలేక వెనకబడతారు. ఏది ఏమైనా హైపో మరియు హైపర్ థైరాయిడిజమ్ వల్ల మానసికంగా పేషెంట్లు ఎక్కువగా బాధపడటం వల్ల, థైరాయిడ్ లెవెల్స్ మరీ ఎక్కువ లేదా తక్కువ అవటం జరుగుతుంది. కాబట్టి పాజిటివ్ హోమియోపతిలో ఈ మానసిక సమస్యలకు అనుగుణంగా, పేషెంట్ తత్త్వాన్ని బట్టి, మూలకారణాన్ని ఎనలైజ్ చేసుకుని ‘జెనిటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్’ అనే పద్ధతి ద్వారా మందులు ఇచ్చి పూర్తిస్థాయిలో పరిష్కారం చూపుతారు.