భారతీయుల జీవనశైలిలో తులసి కూడా ఒక భాగమే. ఆయుర్వేద సుగుణాల పుట్ట తులసి. అందుకే తులసిని ‘క్వీన్ ఆఫ్ హెర్బ్స్’ అని కూడా అంటారు. దీనిలో ‘ఎ, సి’ విటమిన్లు, కాల్షియం, ఐరన్, క్లోరోఫిల్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇంతవరకు తులసి శారీరక ఆరోగ్యానికి మేలుచేసే ఔషధంగా మాత్రమే మనందరికీ తెలుసు. మునుపెన్నడూ ఎరుకలోలేని మరొక రహస్యం తులసిలో దాగుంది. అదేంటంటే..
మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచే అడాప్టోజెన్‌ను తులసి కలిగి ఉంటుందని మీకు తెలుసా! అంతేకాకుండా మెంటల్ హెల్త్‌కు ఉపకరిస్తుందని వివిధ అధ్యయనాలు పేర్కొన్నాయి. నమ్మబుద్ధి కావడం లేదా? ఈ కింది పరిశోధనలే అందుకు సాక్షాలు!!
మనరోజువారీ జీవనవిధానంలో రకరకాల ఒత్తిడులకు గురౌతుంటాము. శారీరకంగా, ఎమోషనల్‌గా, కెమికల్ ఇలా ఎన్నో. ది క్లినికల్ ఎఫికెసి అండ్ సేఫ్టీ ఆఫ్ తులసి ఇన్ హ్యూమన్స్ పేర విడుదలైన అధ్యయన నివేదిక ప్రకారం పర్యావరణం కారణంగా ఒత్తిడులకు గురైనప్పుడు తులసి సహనాన్ని పెంచడానికి సహాయపడుతుందని వెల్లడించింది. నిద్ర, మతిమరుపు, లైంగిక సంబంధిత సమస్యలకు కూడా దివ్యౌషధంగా పనిచేస్తుందని నివేదికలో తెల్పింది.
యాంటీడిప్రెషన్, యాంటీ యాంగ్జైటీ కారకాలు కూడా..
అంతేకాకుండా ది జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రకారం తులసిలో యాంటీడిప్రెషన్, యాంటీ యాంగ్జైటీ కారకాలు ఉంటాయని పేర్కొంది. ఒక అధ్యయనం ప్రకారం ప్రతి రోజూ 5 వందల మిల్లీ గ్రాముల తులసి ఆకుల రసాన్ని తాగినవారిలో యాంగ్జైటీ (వ్యాకులత), ఒత్తిడి గణనీయంగా తగ్గినట్టు తేలింది.
న్యూరో కాగ్నిటివ్ ప్రభావాలను..
పీర్-రివ్యూడ్ జర్నల్ 2017లో ప్రచురించిన ఎవిడెన్స్-బేస్డ్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం.. మానసిక స్థితిని మెరుగుపరిచే న్యూరో కాగ్నిటివ్ ప్రభావాలను తులసి చూపగలుగుతుంది.
తులసి టీ యోగా మాదిరి..
అంతేకాకుండా తులసి టీలో కెఫిన్ ఉండదు కాబట్టి ప్రతిరోజూ దీనిని తాగడం వల్ల యోగా మాదిరి శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచగలుగుతుందని కొన్ని అధ్యనాలు తేల్చాయి.
కార్టిసాల్ హార్మోన్ల నిర్వహణ
మన శరీరంలో ప్రతి ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య కార్టిసాల్ హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. అందువల్లనే మామూలుగా నిద్రలేవగలుగుతున్నాం. కార్టిసాల్ ను స్ట్రెస్ హార్మోన్ అనికూడా అంటారు. ఎప్పుడైతే అధిక ఒత్తిడికి గురౌతారో మీ శరీరంలో ఇది ముందుగానే విడుదలవుతుంది.
ఇది అధికమోతాదులో విడుదలైతే నిద్ర లేమి సమస్యలు తలెత్తుతాయి. తులసి మన శరీరంలో కార్టిసాల్ స్థాయిలను తగుమోతాదులో విడుదలయ్యేలా చేస్తుంది. తద్వారా మీరు రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు.
చదవండి: Home Remedies: వాంతికి వచ్చినట్లు ఉందా? వీటిని తిన్నారంటే వెంటనే..
Comments
Please login to add a commentAdd a comment