ప్రణయ్ కళ్లను దానం చేసిన తల్లిదండ్రులు | pranay parents donates his eye | Sakshi
Sakshi News home page

ప్రణయ్ కళ్లను దానం చేసిన తల్లిదండ్రులు

Published Tue, Mar 15 2016 12:40 PM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

pranay parents donates his eye

విజయవాడ: గొల్లపూడి ప్రమాదం ఘటనలో మృతిచెందిన ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థి మచ్చా ప్రణయ్ (సరూర్ నగర్) మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం విద్యార్థి ప్రణయ్ మృతదేహాన్ని అతడి తల్లిదండ్రులకు అధికారులు అప్పగించారు. కొడుకు చనిపోయాడన్న పుట్టెడు దు:ఖంలోనూ ప్రణయ్ కళ్లను ఆ తల్లిదండ్రులు స్వేచ్ఛ ఐ బ్యాంకుకు దానం చేశారు. గొల్లపూడి సమీపంలోని సురయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement